🍀 22, JANUARY 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀

🌹🍀 22, JANUARY 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 22, JANUARY 2023 SUNDAY,ఆదివారం, భాను వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 122 / Kapila Gita - 122 🌹 🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 06 / 3. Salvation due to wisdom of Nature and Jeeva - 06 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 714 / Vishnu Sahasranama Contemplation - 71 🌹 🌻714. దృప్తః, दृप्तः, Dr‌ptaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 675 / Sri Siva Maha Purana - 675 🌹 🌻. గణేశ వివాహోపక్రమము - 4 / Gaṇapati’s marriage - 4 🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 296 / Osho Daily Meditations - 296 🌹 🍀 296. సాంకేతికత / TECHNIQUE 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 426 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 426 - 1 🌹 🌻 426. 'పంచకోశాంతర స్థితా' - 1 / Panchakoshantarah Stitha' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹22, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*🍀. గుప్త నవరాత్రులు శుభాకాంక్షలు, Gupta Navratri Good Wishes 🍀*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : గుప్త నవరాత్రులు ప్రారంభం, Gupta Navratri Begins🌻*

*🍀. సూర్య మండల స్త్రోత్రం - 5 🍀*

5. యన్మండలం గూఢమతి ప్రబోధం | 
ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ |
యత్సర్వ పాపక్షయకారణం చ | 
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : కర్మాచరణలో మూడు దశలు - ఆత్మ సంసిద్ధికి పిమ్మట కర్మాచరణలో మూడు దశలున్నాయి. మొదటి దశలో కర్మ నిన్ను బహిర్ముఖుని చేయుటే గాక, అథఃస్థితికి తెస్తుంది, కర్మానంతరం ఆ సంసిద్ధిని నీవు తిరిగి సాధించుకోవాలి.🍀* 

🌷🌷🌷🌷🌷

శుభకృత్, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మాఘ మాసం
తిథి: శుక్ల పాడ్యమి 22:28:24 వరకు
తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: శ్రవణ 27:21:49 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: వజ్ర 10:05:06 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: కింస్తుఘ్న 12:25:50 వరకు
వర్జ్యం: 09:58:30 - 11:21:54
మరియు 30:52:00 - 32:16:24
దుర్ముహూర్తం: 16:35:26 - 17:20:31
రాహు కాలం: 16:41:05 - 18:05:36
గుళిక కాలం: 15:16:33 - 16:41:04
యమ గండం: 12:27:32 - 13:52:02
అభిజిత్ ముహూర్తం: 12:05 - 12:49
అమృత కాలం: 18:18:54 - 19:42:18
సూర్యోదయం: 06:49:28
సూర్యాస్తమయం: 18:05:36
చంద్రోదయం: 07:17:27
చంద్రాస్తమయం: 18:43:34
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: ముసల యోగం - దుఃఖం
07:52:59 వరకు తదుపరి గద యోగం
- కార్య హాని , చెడు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 122 / Kapila Gita - 122🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 06 🌴*

*06. యమాదిభిర్యోగ పథైరభ్యసన్ శ్రద్ధయాన్వితః|*
*మయి భావేన సత్యేన మత్కథా శ్రవణేన॥*

*యమనియమాది యోగసాధనలను అభ్యాసము చేయుచు, శ్రద్ధా పూర్వకముగా చిత్తమును క్రమక్రమముగా ఏకాగ్రమొనర్చి చిత్తమును అచ్చముగ నా యందే నిలుపవలెను. భగవంతునియొక్క అద్భుతలీలలకు సంబంధించిన కథలనే ప్రేమతో వినుచుండవలెను.*

*దీనికి శ్రద్ధ కావాలి. బుద్ధీ, మనసు , అహంకారమునూ, చిత్తమునూ, ఈ నాలిగింటిని ఒకే దారిలో నడుపుట శ్రద్ధ. యమ నియమాదులతో, మెల్లిగా అభ్యాసము చేయాలి. నీ చెవులు నా కథలు వినేట్టు చేయి. అలా వింటూ ఉంటే, మనసు నా యందు తగలుకుంటుంది. ప్రకృతికి కేటాయించే సమయాన్ని పరమాత్మకి కేటాయించ బడుతుంది. ఆ సమయం మెల్లిగా త్రికరణ శుద్ధిగా, కపటము లేకుండా పెంచుకుంటూ వెళ్ళు. అలా చేస్తూ వెళ్ళగా, నా మీద భక్తి కలుగుతుంది.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 122 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 06 🌴*

*06. yamādibhir yoga-pathair abhyasañ śraddhayānvitaḥ*
*mayi bhāvena satyena mat-kathā-śravaṇena ca*

*One has to become faithful by practicing the controlling process of the yoga system and must elevate himself to the platform of unalloyed devotional service by chanting and hearing about Me.*

*Yoga is practiced in eight different stages: yama, niyama, āsana, prāṇāyāma, pratyāhāra, dhāraṇā, dhyāna and samādhi. Yama and niyama mean practicing the controlling process by following strict regulations, and āsana refers to the sitting postures. These help raise one to the standard of faithfulness in devotional service. The practice of yoga by physical exercise is not the ultimate goal; the real end is to concentrate and to control the mind and train oneself to be situated in faithful devotional service. Bhāvena, or bhāva, is a very important factor in the practice of yoga or in any spiritual process.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 714 / Vishnu Sahasranama Contemplation - 714🌹*

*🌻714. దృప్తః, दृप्तः, Dr‌ptaḥ🌻*

*ఓం దృప్తాయ నమః | ॐ दृप्ताय नमः | OM Dr‌ptāya namaḥ*

*స్వాత్మామృత రసాస్వాదాన్నిత్య ప్రముదితో హరిః ।*
*దృప్త ఇత్యుచ్యతే సద్భిర్వేద విద్యా విశారదైః ॥*

*తన స్వరూపము అను అమృత రసమును సదా పానము చేయుటచే ఎల్లప్పుడును మిక్కిలిగా ఆనందముతో మదించి నుండు వాడు కావున దృప్తః.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 714🌹*

*🌻714. Dr‌ptaḥ🌻*

*OM Dr‌ptāya namaḥ*

स्वात्मामृत रसास्वादान्नित्य प्रमुदितो हरिः ।
दृप्त इत्युच्यते सद्भिर्वेद विद्या विशारदैः ॥

*Svātmāmr‌ta rasāsvādānnitya pramudito hariḥ,*
*Dr‌pta ityucyate sadbhirveda vidyā viśāradaiḥ.*

*By delighting in the nectar of His own ātma, He is always immensely blissful in a state of pride; hence He is Dr‌ptaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः ।दर्पहा दर्पदोऽदृप्तो दुर्धरोऽथापराजितः ॥ ७६ ॥
భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।దర్పహా దర్పదోఽదృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥
Bhūtāvāso vāsudevaḥ sarvāsunilayo’nalaḥ,Darpahā darpado’dr‌pto durdharo’thāparājitaḥ ॥ 76 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 675 / Sri Siva Maha Purana - 675 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 19 🌴*
*🌻. గణేశ వివాహోపక్రమము - 4 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

గొప్ప లీలను ప్రదర్శిస్తూ లోకపు పోకడను అనుకరించే ఆ తల్లి దండ్రులు అపుడాతని ఆ మాటను విని ఆతనితో నిట్లనిరి (35).

తల్లి దండ్రులిట్లు పలికిరి -

ఓ పుత్రా! చాల పెద్దది, ఏడు ద్వీపములు గలది, సముద్రముల వరకు వ్యాపించి యున్నది, దాటశక్యము కాని పెద్ద ఆటంకములతో గూడినది అగు పృథివిని నీవు ఎప్పుడు చుట్టివచ్చితివి? (35)

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీ! పార్వతీ పరమేశ్వరుల ఈ మాటను విని, వారిపుత్రుడు, మహాబుద్ధి శాలియగు గణశుడు ఇట్లు పలికెను (36).

గణేశుడిట్లు పలికెను -

పార్వతీ పరమేశ్వరులగు మిమ్ములను పూజించిన నేను సముద్రము వరకు వ్యాపించియున్న భూమిని చుట్టి వచ్చినట్లే యగునని నా బుద్ధికి తోచుచున్నది (37). ధర్మమునకు నిదానములగు వేదశాస్త్రములలో ఇటులనే చెప్పబడియున్నది. అది సత్యమా? కాదా? (38).ఎవడైతే తల్లిదండ్రులను పూజించి ప్రదక్షిణము చేయునో వాడు భూమిని ప్రదక్షిణము చేసిన ఫలమును పొందుట నిశ్చయము (39). ఎవడైతే తల్లిదండ్రులను ఇంటిలో విడిచి పెట్టి తీర్థయాత్రలకు వెళ్లునో, వాడు తల్లి దండ్రులను హింసించిన వానికి కలిగే పాపమును పొందునని చెప్పుబడెను (40).

పుత్రునకు తల్లిదండ్రుల పాదపద్మములే గొప్ప తీర్థము. మరియొక తీర్థమును పొందవలెనన్నచో దూరప్రయాణము చేయవలసి యుండును (41). ఇది దగ్గరలో నున్న, తేలికగా లభించే, ధర్మమునకు సాధనమైన తీర్థము. పుత్రునకు తల్లిదండ్రులు, స్త్రీకి భర్త, ఇంటిలో లభ్యమయ్యే మంగళకరమగు తీర్థముల (42). వేదశాస్త్రములు నిరంతరముగా ఇట్లు చెప్పుచున్నవి. మీరిద్దరు ఆ వచనములను అసత్యము చేయవలయును గాబోలు! (43) అట్టి స్థితిలో మీ ఈ రూపము అసత్యమగును. అపుడు వేదము కూడా అసత్యమగును. ఈ విషయములో సందేహము లేదు (44).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 675🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 19 🌴*

*🌻 Gaṇapati’s marriage - 4 🌻*

Brahmā said:—
34. On hearing his words, the sportively inclined parents, following the worldly conventions spoke to him thus—

The parents said:—
35. “O son, when was the great earth circumambulated by you, the earth consisting of seven continents[1] extending to the oceans and consisting of vast jungles?

Brahmā said:—
36. O sage, on hearing the words of Pārvatī and Śiva, Gaṇeśa, the storehouse of great intellect spoke thus.

Gaṇeśa said:—
37. By worshipping you, Pārvatī and Śiva, I have intelligently circumambulated the earth extending to the oceans.

38. Is it not the verdict of the Vedas or the Śāstras or any other sacred code? Is it true or otherwise?

39. “He who worships his parents and circumambulates them, will certainly derive the fruit and merit of circumambulating the earth.

40. He who leaves his parents at home and goes on a pilgrimage incurs the sin of their murder.

41. The holy centre of a son consists of the lotus-like feet of his parents. The other holy centres can be reached only after going a long distance.

42. This holy centre is near at hand, easily accessible and a means of virtue. For a son and wife, the auspicious holy centre is in the house itself.”

43. These things are mentioned frequently in the Śāstras and the Vedas. Now, are they going to be falsified by you?

44. If so, your very forms will come false. Even the Vedas will become false. There is no doubt about it.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 296 / Osho Daily Meditations - 296 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 296. సాంకేతికత 🍀*

*🕉. ప్రేమ పని చేస్తుంది; సాంకేతికత కేవలం ఒక సాకు మాత్రమే. వైద్యుడుతో పని జరుగుతుంది, చికిత్స వల్ల కాదు. 🕉*

*కొన్నిసార్లు చికిత్సకుడు అయిన వ్యక్తితో ఏదో జరగడం ప్రారంభం అవుతుంది. ఇది చికిత్స కాదు, ఇది మనిషి యొక్క వ్యక్తిత్వం - అతని అద్భుతమైన ధైర్యం, అతని అద్భుతమైన కరుణ. అతను సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు; అతను అవతలి వ్యక్తిని చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ మన తార్కిక మనస్సులు తప్పనిసరిగా సహాయపడేది వైద్య చర్యలు మాత్రమే అని చెబుతాయి. అది యుగయుగాలుగా చెప్పబడే అబద్ధం. సహాయం చేసేది మతమనే వ్యవస్థ కాదు. సహాయం చేసేది బౌద్ధం కాదు, బుద్ధుడు. ఇరవై ఐదు వందల సంవత్సరాలుగా మనుషులకు సహాయం చేసింది బౌద్ధ మతమే అని అనుకుంటూనే ఉన్నారు, కానీ అది బుద్ధుడే. బుద్ధుడు వేరే ఏదైనా మాట్లాడి ఉంటే, అది కూడా సహాయకారిగా ఉండేది. అతను చెప్పిన దానికి విరుద్ధంగా మాట్లాడినప్పటికీ, అది కూడా సహాయం చేస్తుంది.*

*ఆ మనిషి యొక్క జీవశక్తి, అతని కరుణ మరియు అతని ప్రేమ మరియు అతని అవగాహన సహాయపడింది. కానీ మన మనస్సులు తక్షణమే సాంకేతికతలను, ఉపరితలాన్ని పట్టుకుంటాయి. అప్పుడు ఉపరితలం ముఖ్యమైనది అయిపోతుంది మరియు మనకు అవసరమైన వాటితో సంబంధాన్ని కోల్పోతాము. సమస్యలు అలాగే ఉంటాయి. ముఖ్యమైనవి బోధించ బడవు, అవసరం లేనివి మాత్రమే బోధించ బడతాయి. కాబట్టి మీరు వైద్యుడిని బోధించ లేరు - మీరు చికిత్సా విధానాన్ని మాత్రమే బోధించ గలరు. వైద్యుడు కదిలినప్పుడు ఒక జీవ చికిత్స జరుగుతుంది. అది బోధించడానికి మార్గం లేదు! కానీ సమాజం ఏదో ఒకదాని గురించి ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటుంది, కాబట్టి అది బోధించడం ప్రారంభిస్తుంది మరియు అనవసరమైన వాటిని మాత్రమే బోధించవచ్చు. కాబట్టి అన్ని బోధనలు గురువుకు వ్యతిరేకంగా ఉంటాయి. ఎందుకంటే గురువు అవసరమైన వాటిని తెస్తాడు మరియు బోధన అనవసరమైన వాటిని బోధిస్తుంది.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations - 296 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 296. TECHNIQUE 🍀*

*🕉. Love is what works; the technique is just an excuse. The therapist works, not the therapy. 🕉*

*Sometimes with a man like Fritz Perls, the founder of Gestalt therapy, something starts happening. It is not Gestalt, it is the personality of the man-his tremendous courage, his tremendous compassion. He tries to help; he tries to reach the other person. But our logical minds say that it must be the Gestalt therapy that is helping; and that has been the fallacy through the ages. It is not Christianity that helps, it was Christ. It is not Buddhism, but Buddha. For twenty-five hundred years people have been thinking that it was Buddhism that helped people, but it was Buddha. If Buddha had been saying something different, that too would have been of help. Even if he had said just the opposite of whatever he said, then too it would have helped.*

*It was the life force of that man, his compassion and his love and his understanding that helped. But our minds immediately catch hold of the techniques, of the superficial. Then the superficial becomes important, and we lose contact with the essential. And there are problems: The essential cannot be taught, only-the non-essential can be taught. So you cannot teach Fritz Perls--you can only teach Gestalt. A Fritz Perls happens when he happens; there is no way to teach that! But society wants to be certain about something, so it starts teaching, and only the nonessential can be taught. So all teaching goes against the teacher, because the teacher brings the essential, and the teaching teaches the nonessential.*
  
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 426 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 426 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।*
*నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥ 🍀*

*🌻 426. 'పంచకోశాంతర స్థితా' - 1🌻* 

*పంచకోశముల యందు వసించునది శ్రీమాత అని అర్థము. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములుగ పంచకోశము లున్నవి. ఈ పంచకోశములును పంచభూతములతో నిర్మించబడినవి. ఇందు పంచతత్త్వములతో శ్రీమాత వసించి యున్నది. ఆకాశ గుణము, వాయు గుణము, అగ్ని తేజము, నీటి గుణము, పృథివీ గుణములు శ్రీమాత అస్థిత్వ కారణముగనే యేర్పడు చున్నవి.*

*పృథివికి గంధము, నీటికి రుచి, అగ్నికి తేజస్సు, వాయువునకు స్పర్శ, ఆకాశమునకు శబ్దము అను గుణములు యున్నవి. వీని యందు శ్రీమాతను దర్శించుట వలన పంచభూతములు, పంచ కోశముల ద్వారా ఆనందము కలిగించగలవు. ఈ కోశములు అపరిశుద్ధముగ నున్నచో ఆనంద ముండదు. పరిశుద్ధముగ నున్నప్పుడు ఒక దానిని మించి మరియొకటి ఆనందమిచ్చును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 426 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sdhita*
*Nisima mahima nitya-yaovana madashalini ॥ 91 ॥ 🌻*

*🌻 426. 'Panchakoshantarah Stitha' - 1🌻*

*It means Srimata who resides in Panchakoshams. Panchakosha consists of Annamaya, Pranamaya, Manomaya, Vijnanamaya and Anandamaya koshams. These panchakoshams are made up of panchabhutas. Sri Mata is residing here with Panchatattvam. Akasha Guna, Vayu Guna, Agni Teja, Water Guna and Earthly Guna are the causes of existence of Sri Mata.*

*Earth has sent, water has taste, fire has radiance, air has touch, sky has sound. Darshan of Sri Mata can bring happiness through panchabhutas and pancha koshams. If these koshams are impure, there is no happiness. When there is purity, one thing surpasses the other in giving Happiness.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

Siva Sutras - 028 - 8.Jñānaṁ jāgrat, 9. Svapno vikalpāḥ, 10. Aviveko māyāsauṣuptam - 3 / శివ సూత్రములు - 028 - 8. జ్ఞానం జాగృత, 9. స్వప్నో వికల్పం, 10. అవివేకో మాయా సుషుప్తం - 3



🌹. శివ సూత్రములు - 028 / Siva Sutras - 028 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

1- శాంభవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 8. జ్ఞానం జాగృత 🌻 🌻 9. స్వప్నో వికల్పం 🌻 🌻 10. అవివేకో మాయా సుషుప్తం - 3🌻

🌴. జాగృత - స్పృహ, జ్ఞానం : స్వప్నం - ఊహ, కలలు : సుషుప్తి - అజ్ఞానం, మాయ. 🌴


మొదటి దశలో, మనస్సు ఇంద్రియ ప్రేరణలకు ప్రతిస్పందిస్తుంది (8వ అపోరిజం). ఈ కాలంలో మనస్సు చాలా చురుకుగా ఉంటుంది, ఎందుకంటే ఒక వ్యక్తి చురుకుగా లేదా అప్రమత్తమైన స్థితిలో ఉన్నప్పుడు అది పొందే అనేక ఇంద్రియ ఉద్దీపనలపై చర్య తీసుకోవాలి కాబట్టి. ఈ స్థితిలో, మనస్సు మరియు ఇంద్రియాలు పరస్పరం ఆధారపడి ఉంటాయి. ఇంద్రియాలు మరియు మనస్సుల మధ్య సమాచార ప్రసారం అద్భుతమైన వేగంతో జరుగుతుంది.

ఇంద్రియ గ్రహణాలు మనస్సులో శాశ్వత ముద్రలను వదిలివేస్తాయి, ఇవి స్పృహ యొక్క రెండవ దశ, స్వప్న స్థితిలో, 9వ అపోరిజం ద్వారా తెలియజేయబడినట్లుగా, కలలుగా వ్యక్తమయ్యే ఆలోచనలు అని పిలవబడతాయి. స్పృహ యొక్క మూడవ స్థితి ఒక విధమైన భ్రాంతి, గాఢమైన నిద్ర దశలో ఒక వ్యక్తి తన స్వభావాన్ని సైతం మరచిపోతాడు. అతని ఇంద్రియాలు మరియు మనస్సు రెండూ పూర్తిగా విశ్రాంతి పొందుతాయి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Siva Sutras - 028 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 1 - Sāmbhavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 8.Jñānaṁ jāgrat 🌻 🌻9. Svapno vikalpāḥ 🌻 🌻 10. Aviveko māyāsauṣuptam - 3 🌻

🌴. Knowledge is Jagrat: Fancy is Svapna. Ignorance, Maya, is Susupti 🌴


During the first stage, the mind responds to the sensory inputs (8th aphorism). Mind is extremely active during this period as it has to act on multitude of sensory stimulations it receives when a person is in active or alert cognitive state. During this state, mind and senses are interdependent. Communication between senses and mind happens in tremendous swiftness.

The sensory perceptions leave lasting impressions in the mind known as thoughts that manifest as dreams in the second stage of consciousness, the dream state, as conveyed through 9th aphorism. The third state of consciousness is a sort of delusion, as during the stage of deep sleep one forgets his own inherent nature. Both his senses and mind are completely rested.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

నిర్మల ధ్యానాలు - ఓషో - 291


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 291 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనం అస్తిత్వంలో భాగాలం. సముద్రంలో అలలం. మనమెప్పుడూ వేరన్న భావనతో వుంటాం. వేరు అన్న భావన అహం. ఒకసారి ఈ విషయం అర్థం చేసుకుంటే ఆందోళన మాయమవుతుంది. 🍀


మనం ఉనికికి వేరుగా లేము. కానీ మనం వేరన్న భావనతో వుంటాం. వేరు అన్న భావన అహం. అది కేవలం ఒక అభిప్రాయమే. అది నరకాన్ని సృష్టిస్తుంది. అప్పుడు మనం వుంటామా అన్నదాన్ని గురించి భయపడతాం. భవిష్యత్తు గురించి, మరణాన్ని గురించి భయపడతాం. ఒక రోజు మనం చనిపోక తప్పదు కదా అని భయపడతాం. అదంతా అహం వల్ల జరిగేది. మనం అనంతంలో భాగాలమని గుర్తించం. అక్కడ జనన మరణాల ప్రసక్తి లేదు. మనమెప్పుడూ ఇక్కడే వున్నాం. అనంతంలో భాగాలుగా వున్నాం.

అది సముద్రంలో పైకి లేచిన అల లాంటిది. అది పైకి లేవక ముందు కూడా సముద్రంలో వుంది. సముద్ర గర్భంలోకి వెళ్ళినపుడు కూడా అది వుంది. జననం, మరణం అన్నవి రెండూ తప్పుడు అభిప్రాయాలు. అల ఒకసారి కనిపిస్తుంది, ఒకసారి కనిపించదు. అది ఎప్పుడూ సముద్రంలో భాగంగా వుంటుంది. మనం కూడా అస్తిత్వంలో భాగాలం. మనం సముద్రంలో అలలం. ఒకసారి ఈ విషయం అర్థం చేసుకుంటే ఆందోళన మాయమవుతుంది. ఇది మన ఇల్లు, దీంట్లో మనం భాగాలం. మనం ఎక్కడో వెళ్ళాల్సిన పన్లేదు. వేరే దారి లేదు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

DAILY WISDOM - 26 - 26. Positive Bliss is . . . / నిత్య ప్రజ్ఞా సందేశములు - 26 - 26. సానుకూలమైన ఆనందం . . .


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 26 / DAILY WISDOM - 26 🌹

🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 26. సానుకూలమైన ఆనందం స్వయంలోనే దొరుకుతుంది 🌻


అన్ని చర్యలు స్వయం కోసమే జరుగుతాయి, బాహ్య వ్యక్తులు మరియు వస్తువుల కోసం కాదు. ఆ వస్తువులో ఆనందం ఉండడం వల్ల ఆనందించే వ్యక్తికి ఆనందాన్ని కలిగించడం కాదు, అహంలో ఉత్పన్నమయ్యే ఒక వస్తువు పట్ల కోరిక ఆ వస్తువు యొక్క పరిచయం వల్ల కలిగే తీరిన కోరిక యొక్క సంతృప్తి వల్ల. తృప్తి అనేది మనస్సు తాత్కాలికంగా స్వయం వైపు మళ్లడం వలన కలుగుతుంది. కాబట్టి ప్రపంచం లోని ఆనందం అంతా పరొక్షమైనది.

అంటే, అనుకూలమైనవి పొందడం వల్ల ఆనందం రావట్లేదు. కానీ, ప్రతికూలమైనవి నివారించడం వల్ల ఆనందం పొందుతున్నాము. ఈ ప్రత్యక్ష ఆనందం కేవలం స్వయంలో మాత్రమే అనుభవించగలరు. మన నిత్య జీవిత పోరాటం అంతా కూడా, అనంతం నుంచి విడువడిన తర్వాత స్వయం లో వచ్చే శూన్య భావాన్ని నింపే ఒక విఫల ప్రయత్నం మాత్రమే. జీవిత కారాగారంలో సంకెళ్లతో బంధించబడిన స్వయం యొక్క దుఃఖం, విశ్వం యొక్క అద్వైత స్వభావం యొక్క జ్ఞానం ద్వారా విమోచించ బడుతుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 26 🌹

🍀 📖 The Realisation of the Absolute 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 26. Positive Bliss is Found Only in the Self 🌻


All actions are done for the sake of the Self, not for external persons and things. It is not the existence of joy in the object as such that brings pleasure to the individual enjoying it, but the cooling of the fire of craving that is brought about by its contact with a particular object which is specially demanded by that special mode of desire generated in the ego-consciousness. The satiation is caused by a temporary turning back of the mind to the Self.

The whole of the happiness of the world is, thus, purely negative, an avoiding of the unpleasant, and not the acquirement of any real, positive joy. This positive bliss is found only in the Self, the root of existence. The bustle of life’s activity is a struggle to respond to the cry of the anxious ego which has lost itself in the wilderness of its separation from the Eternal Principle. The grieving self bound by fetters in the prison of life is ransomed by the knowledge of the non-dual nature of Existence.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ మదగ్ని మహాపురాణము - 161 / Agni Maha Purana - 161


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 161 / Agni Maha Purana - 161 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 50

🌻. దేవీ ప్రతిమా లక్షణములు - 1 🌻


హయగ్రీవుడు చెప్పెను: చండీదేవికి ఇరువది బుజములుండును. కుడిచేతులలో శూల-ఖడ్గ-శక్తి-చక్ర-పాశ-ఖేట-ఆయుధ, అభయ-డమరు శక్తులను, ఎడమచేతులలో నాగపాశ-ఖేటక-కుఠార-అంకుశ-పాశ-ఘంటా-ఆయుధ-గదా-దర్పణ-ముద్గరములను ధరించియుండును. చండీదేవిప్రతిమకు వదిభుజములుకూడ ఉండవచ్చును. ఆమె పాదములక్రింద తలఖిండించిన మహిషముండును. ఆ తలతెగి వేరుగా ఉండవలెను. దాని కంఠమునుండి శూలము హస్తమునందుగల పురుషుడు శస్త్రమునుఎత్తి మిక్కిలికోపముతో ముఖమునుండి రక్తము కక్కుచుండును. వాని కంఠమునందు మాల, వెండ్రుకలు, ఎఱ్ఱగానుండును, దేవీవాహనమైన సింహము దాని రక్తము నాస్వాదించు చుండును. ఆ మహిషాసురుని కంఠమున పాశమొకటి గట్టిగా బిగించియుండును. దేవి కుడికాలు సింహముపైనను, ఎడమకాలు క్రిందనున్న మహిషాసురుని పైనను ఉండును.

ఈ చండీదేవికి మూడు నేత్రములుండును. ఈమె అనేక శస్త్రములను ధరించి శత్రువులను మర్దించునది. తొమ్మిది పద్మముల రూపమున నున్న పీఠముపై దుర్గాప్రతిమపై ఈమెను పూజింపవలెను. మొదటి కమలము తొమ్మిది దళములందును, మధ్యననున్న కర్ణికయందును ఇంద్రాది దిక్పాలులను, నవతత్త్వాత్మి కలగు శక్తులతో దుర్గాదేవిని పూజింపవలెను. దుర్గాదేవి ప్రతిమకు పదునెనిమిది భుజములుండును. కుడువైపున నున్న హస్తములలో ముండ-ఖేటక-దర్పణ-తర్జనీ-ధనుష్‌-ధ్వజ-డమరు, చర్మ-పాశములను, వామభాగమున నున్న హస్తములలో శక్తి-ముద్దర-శూల-వజ్ర-ఖడ్గ-కుంకుశ-భాణ-చక్ర-శలాకలను ధరించి యుండును.

పదునారు భుజముల దుర్గాప్రతిమకు కూడ డమరువు, తర్జని తప్ప ఈ ఆయుధములే ఉండును. రుద్రచండ, ప్రచండ, చండోగ్ర, చండనాయిక, చండ, చండవతి, చండరూప, అతిచండిక అనువారు ఎనమండుగురు దుర్గలు. ఈ దుర్గలను తూర్పు మొదలు ఎనిమిది దిక్కులందును స్థాపించి పూజింపవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana - 161 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 50

🌻Characteristics of an image of the Goddess - 1 🌻


The Lord said:

1-5. (The image of) Caṇḍī may have twenty hands and may hold the spear, sword, dart, disc, noose, club, ḍamaru (a small drum) and spike in the left hands and also (show) protective posture (and) the snake as the noose, club, axe, goad, bow, bell, banner, mace, mirror, and iron mace in the (right) hands.. Or (the figure of) Caṇḍī is made to have ten hands, with the buffalo placed below with its head fully severed and the demon as issuing forth from (its) neck with rage and brandishing his weapon, holding spike in the hand, vomitting blood, his hairs. (stained) with blood and blood dripping out from the eyes. (forming) a garland (on the chest), being devoured by the lion and well-bound by the noose in the neck. (The goddess is represented as) resting her right foot on the lion and the left foot on. the demon underneath.

6-12. This form of Caṇḍikā, the destroyer of enemies. (is made as) having three eyes and endowed with weapons. (This) Durgā is to be worshipped with the nine elements in order in a diagram of nine lotuses from her own form at the beginning, centre and the eastern and other (directions). (The image should be made as) possessing eighteen arms (carrying) a human head, club, mirror, tarjanī (a kind of weapon), bow, banner and. a little drum in the right hand and the noose, spear, mace, trident, thunderbolt, sword, goad and dart in the left hand. The others (Rudracaṇḍā and other goddesses) should be endowed with the same weapons in their sixteen hands except the little drum and tarjanī (a kind of weapon).


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీమద్భగవద్గీత - 314: 08వ అధ్., శ్లో 04 / Bhagavad-Gita - 314: Chap. 08, Ver. 04

 

🌹. శ్రీమద్భగవద్గీత - 314 / Bhagavad-Gita - 314 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 04 🌴

04. అధిభూతం క్షరో భావ: పురుశ్చాధిదైవతం |
అధియజ్ఞో అహమేవాత్ర దేహే దేహభృతాం వర ||

🌷. తాత్పర్యం :

ఓ దేహధారులలో శ్రేష్టుడా ! నిరంతరము పరిణామశీలమైన భౌతికప్రకృతి అధిభూతమన బడును (భౌతికజగత్తు). సూర్యచంద్రుల వంటి సర్వదేవతలను కూడియుండెడి విశ్వరూపమే అధిదైవతమనబడును. దేహదారుల హృదయములలో పరమాత్మ రూపమున నిలిచియుండెడి దేవదేవుడైన నేనే అధియజ్ఞడును (యజ్ఞప్రభువును).

🌷. భాష్యము :

భౌతికప్రకృతి నిరంతర పరిణామశీలమై యుండును. పుట్టుట, పెరుగుట, కొంతకాలము నిలిచియుండుట, ఇతరదేహములను ఉత్పత్తి చేయుట, శిథిలమగుట, చివరికి నశించుట యను ఆరువిధములైన మార్పులకు భౌతికదేహములు లోనగుచుండును. అట్టి ఈ భౌతికప్రకృతియే “అధిభూతము” అనబడును. ఇది ఒక నిర్దిష్టమైన సమయమున సృష్టించబడి వేరొక నిర్దిష్ట సమయమున నశింపజేయబడును. సమస్తదేవతలను మరియు సమస్తలోకములను తన యందు కలిగియున్న శ్రీకృష్ణభగవానుని విశ్వరూపమే “అధిదైవతము” అనబడును.

దేహమునందు ఆత్మతోపాటుగా శ్రీకృష్ణుని సంపూర్ణ ప్రాతినిధ్యమైన పరమాత్మయు నిలిచియుండును. ఈ శ్లోకమునందు “ఏవ” అను పదము మిగుల ప్రధానమైనది. ఏలయన దాని ద్వారా శ్రీకృష్ణుడు తన కన్నను పరమాత్ము భిన్నుడు కాడని నొక్కి చెప్పుచున్నాడు. ఆత్మ చెంతనే నిలిచియుండెడి ఆ పరమాత్మయే జీవి కర్మలకు సాక్షిగా నుండి అతని వివిధస్వభావములకు కారణమై యున్నాడు. అనగా జీవుడు స్వతంత్రముగా వర్తించుటకు అవకాశమొసగుచు అతని కర్మలను పరమాత్ముడు సాక్షిగా గమనించుచుండును.

శ్రీకృష్ణభగవానుని వివిధరూపముల ఇట్టి సర్వకార్యములు దివ్యసేవలో నియుక్తడైన కృష్ణభక్తిభావనాయుతునికి అప్రయత్నముగా విదితము కాగలవు. “అధిదైవతము” అని పిలువబడు భగవానుని విశ్వరూపము ఆ దేవదేవుని పరమాత్మరూపమున ఎరుగలేని ఆరంభదశలో నున్న సాధకునిచే ద్యానింపబడుచుండును. కనుకనే అధోలోకములు పాదములుగా, సూర్యచంద్రులు నేత్రములుగా, శిరము ఊర్థ్వలోకములుగా పరిగిణింపబడు “విరాట్పురుషుని” (విశ్వరూపమును) ధ్యానము చేయుమని ఆరంభకునికి ఉపదేశించ బడుచుండును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 314 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 04 🌴

04. adhibhūtaṁ kṣaro bhāvaḥ puruṣaś cādhidaivatam
adhiyajño ’ham evātra dehe deha-bhṛtāṁ vara


🌷 Translation :

O best of the embodied beings, the physical nature, which is constantly changing, is called adhibhūta [the material manifestation]. The universal form of the Lord, which includes all the demigods, like those of the sun and moon, is called adhidaiva. And I, the Supreme Lord, represented as the Supersoul in the heart of every embodied being, am called adhiyajña [the Lord of sacrifice].

🌹 Purport :

The physical nature is constantly changing. Material bodies generally pass through six stages: they are born, they grow, they remain for some duration, they produce some by-products, they dwindle, and then they vanish. This physical nature is called adhibhūta. It is created at a certain point and will be annihilated at a certain point. The conception of the universal form of the Supreme Lord, which includes all the demigods and their different planets, is called adhidaivata.

And present in the body along with the individual soul is the Supersoul, a plenary representation of Lord Kṛṣṇa. The Supersoul is called the Paramātmā or adhiyajña and is situated in the heart. The word eva is particularly important in the context of this verse because by this word the Lord stresses that the Paramātmā is not different from Him.

The Supersoul, the Supreme Personality of Godhead, seated beside the individual soul, is the witness of the individual soul’s activities and is the source of the soul’s various types of consciousness. The Supersoul gives the individual soul an opportunity to act freely and witnesses his activities. The functions of all these different manifestations of the Supreme Lord automatically become clarified for the pure Kṛṣṇa conscious devotee engaged in transcendental service to the Lord. The gigantic universal form of the Lord called adhidaivata is contemplated by the neophyte who cannot approach the Supreme Lord in His manifestation as Supersoul.

🌹 🌹 🌹 🌹 🌹


21 Jan 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹21, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹

శుభ శనివారం, Saturday, స్థిర వాసరే

🍀. మౌని అమావాస్య, Mauni Amavas Good Wishes 🍀

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : మౌని అమావాస్య, Mauni Amavas 🌻

🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 5 🍀


9. నమస్తే రుద్రపుత్రాయ గణనాథాయ తే నమః |
నమస్తే వీరవీరాయ మహావీరాయ తే నమః

10. నమోఽస్త్వనంతవీర్యాయ మహాఘోరాయ తే నమః |
నమస్తే ఘోరఘోరాయ విశ్వఘోరాయ తే నమః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : కార్యనిర్వాహణ పద్ధతి - ఒకే పనిని కర్మయోగి నిత్యమూ సమధికోత్సాహంతో నిర్వర్తించ గలిగి వుండాలి. అంతేకాదు, ఒక్క నిమిషం వ్యవధిలోనే, దాని స్వరూప స్వభావాలను విస్తరింప జేయ్యడానికి, అవసరమైతే దానికి బదులు వేరొక పని చేపట్టడానికి కూడా అతడు తయారుగా వుండాలి.🍀

🌹. మౌని అమావాస్య విశిష్టత : ఆధ్యాత్మిక పరంగా మౌని అమావాస్య చాలా గొప్పది. మౌని అంటే మౌనంగా ఉండటమని అర్థం. అమావాస్యలో అమా అంటే చీకటి అని.. వాస్య అంటే కామం అని అర్థాలున్నట్లు పురాణాల్లో ప్రస్తావించబడింది. ఈ అమావాస్యకు మరో అర్థం ఏంటంటే.. పగలు మౌనంగా ఉండి చీకటిని, కామాన్ని తొలగించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, చంద్ర గ్రహం మనుషుల మనసులను నియంత్రించే అవకాశం ఉంటుంది. అందుకే మౌని అమావాస్య రోజున మనకు చంద్రుడు దర్శనమివ్వడు. అంతేకాదు ఈరోజున మాట్లాడే మాటల వల్ల, తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల వల్ల శుభ ఫలితాలు రావని చాలా మంది నమ్ముతారు. 🌹

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, హేమంత ఋతువు,

దక్షిణాయణం, పౌష్య మాసం

తిథి: అమావాశ్య 26:23:48

వరకు తదుపరి శుక్ల పాడ్యమి

నక్షత్రం: పూర్వాషాఢ 09:41:44

వరకు తదుపరి ఉత్తరాషాఢ

యోగం: హర్షణ 14:35:33 వరకు

తదుపరి వజ్ర

కరణం: చతుష్పద 16:20:26 వరకు

వర్జ్యం: 16:37:20 - 18:00:36

దుర్ముహూర్తం: 08:19:34 - 09:04:36

రాహు కాలం: 09:38:22 - 11:02:49

గుళిక కాలం: 06:49:30 - 08:13:56

యమ గండం: 13:51:41 - 15:16:08

అభిజిత్ ముహూర్తం: 12:05 - 12:49

అమృత కాలం: 05:29:00 - 06:53:00

మరియు 24:56:56 - 26:20:12

సూర్యోదయం: 06:49:30

సూర్యాస్తమయం: 18:05:00

చంద్రోదయం: 06:16:25

చంద్రాస్తమయం: 17:33:39

సూర్య సంచార రాశి: మకరం

చంద్ర సంచార రాశి: ధనుస్సు

యోగాలు: మతంగ యోగం - అశ్వ లాభం

09:41:44 వరకు తదుపరి రాక్షస యోగం

- మిత్ర కలహం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹