21 Jan 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹21, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹

శుభ శనివారం, Saturday, స్థిర వాసరే

🍀. మౌని అమావాస్య, Mauni Amavas Good Wishes 🍀

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : మౌని అమావాస్య, Mauni Amavas 🌻

🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 5 🍀


9. నమస్తే రుద్రపుత్రాయ గణనాథాయ తే నమః |
నమస్తే వీరవీరాయ మహావీరాయ తే నమః

10. నమోఽస్త్వనంతవీర్యాయ మహాఘోరాయ తే నమః |
నమస్తే ఘోరఘోరాయ విశ్వఘోరాయ తే నమః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : కార్యనిర్వాహణ పద్ధతి - ఒకే పనిని కర్మయోగి నిత్యమూ సమధికోత్సాహంతో నిర్వర్తించ గలిగి వుండాలి. అంతేకాదు, ఒక్క నిమిషం వ్యవధిలోనే, దాని స్వరూప స్వభావాలను విస్తరింప జేయ్యడానికి, అవసరమైతే దానికి బదులు వేరొక పని చేపట్టడానికి కూడా అతడు తయారుగా వుండాలి.🍀

🌹. మౌని అమావాస్య విశిష్టత : ఆధ్యాత్మిక పరంగా మౌని అమావాస్య చాలా గొప్పది. మౌని అంటే మౌనంగా ఉండటమని అర్థం. అమావాస్యలో అమా అంటే చీకటి అని.. వాస్య అంటే కామం అని అర్థాలున్నట్లు పురాణాల్లో ప్రస్తావించబడింది. ఈ అమావాస్యకు మరో అర్థం ఏంటంటే.. పగలు మౌనంగా ఉండి చీకటిని, కామాన్ని తొలగించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, చంద్ర గ్రహం మనుషుల మనసులను నియంత్రించే అవకాశం ఉంటుంది. అందుకే మౌని అమావాస్య రోజున మనకు చంద్రుడు దర్శనమివ్వడు. అంతేకాదు ఈరోజున మాట్లాడే మాటల వల్ల, తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల వల్ల శుభ ఫలితాలు రావని చాలా మంది నమ్ముతారు. 🌹

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, హేమంత ఋతువు,

దక్షిణాయణం, పౌష్య మాసం

తిథి: అమావాశ్య 26:23:48

వరకు తదుపరి శుక్ల పాడ్యమి

నక్షత్రం: పూర్వాషాఢ 09:41:44

వరకు తదుపరి ఉత్తరాషాఢ

యోగం: హర్షణ 14:35:33 వరకు

తదుపరి వజ్ర

కరణం: చతుష్పద 16:20:26 వరకు

వర్జ్యం: 16:37:20 - 18:00:36

దుర్ముహూర్తం: 08:19:34 - 09:04:36

రాహు కాలం: 09:38:22 - 11:02:49

గుళిక కాలం: 06:49:30 - 08:13:56

యమ గండం: 13:51:41 - 15:16:08

అభిజిత్ ముహూర్తం: 12:05 - 12:49

అమృత కాలం: 05:29:00 - 06:53:00

మరియు 24:56:56 - 26:20:12

సూర్యోదయం: 06:49:30

సూర్యాస్తమయం: 18:05:00

చంద్రోదయం: 06:16:25

చంద్రాస్తమయం: 17:33:39

సూర్య సంచార రాశి: మకరం

చంద్ర సంచార రాశి: ధనుస్సు

యోగాలు: మతంగ యోగం - అశ్వ లాభం

09:41:44 వరకు తదుపరి రాక్షస యోగం

- మిత్ర కలహం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹



No comments:

Post a Comment