నిర్మల ధ్యానాలు - ఓషో - 291


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 291 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనం అస్తిత్వంలో భాగాలం. సముద్రంలో అలలం. మనమెప్పుడూ వేరన్న భావనతో వుంటాం. వేరు అన్న భావన అహం. ఒకసారి ఈ విషయం అర్థం చేసుకుంటే ఆందోళన మాయమవుతుంది. 🍀


మనం ఉనికికి వేరుగా లేము. కానీ మనం వేరన్న భావనతో వుంటాం. వేరు అన్న భావన అహం. అది కేవలం ఒక అభిప్రాయమే. అది నరకాన్ని సృష్టిస్తుంది. అప్పుడు మనం వుంటామా అన్నదాన్ని గురించి భయపడతాం. భవిష్యత్తు గురించి, మరణాన్ని గురించి భయపడతాం. ఒక రోజు మనం చనిపోక తప్పదు కదా అని భయపడతాం. అదంతా అహం వల్ల జరిగేది. మనం అనంతంలో భాగాలమని గుర్తించం. అక్కడ జనన మరణాల ప్రసక్తి లేదు. మనమెప్పుడూ ఇక్కడే వున్నాం. అనంతంలో భాగాలుగా వున్నాం.

అది సముద్రంలో పైకి లేచిన అల లాంటిది. అది పైకి లేవక ముందు కూడా సముద్రంలో వుంది. సముద్ర గర్భంలోకి వెళ్ళినపుడు కూడా అది వుంది. జననం, మరణం అన్నవి రెండూ తప్పుడు అభిప్రాయాలు. అల ఒకసారి కనిపిస్తుంది, ఒకసారి కనిపించదు. అది ఎప్పుడూ సముద్రంలో భాగంగా వుంటుంది. మనం కూడా అస్తిత్వంలో భాగాలం. మనం సముద్రంలో అలలం. ఒకసారి ఈ విషయం అర్థం చేసుకుంటే ఆందోళన మాయమవుతుంది. ఇది మన ఇల్లు, దీంట్లో మనం భాగాలం. మనం ఎక్కడో వెళ్ళాల్సిన పన్లేదు. వేరే దారి లేదు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment