🌹 15 DECEMBER 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹

🍀 🌹 15 DECEMBER 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹🍀 
1) 🌹శ్రీ దత్తాత్రేయ అష్టచక్రబీజ స్తోత్రం - ఆత్మ సాక్షాత్కారం మరియు మోక్షం వైపు దారి చూపించే స్తోత్రరాజం. 🌹*
2) 🌹. శ్రీ దత్తాత్రేయ జయంతి, శ్రీ అన్నపూర్ణ జయంతి శుభాకాంక్షలు అందరికి, Sri Dattatreya Jayanti, Sri Annapurna Jayanti Good Wishes to All 🌹
3) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 580 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 580 - 2 🌹 
🌻 580. 'మహనీయా' - 2 / 580. 'Mahaniya' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹శ్రీ దత్తాత్రేయ అష్టచక్రబీజ స్తోత్రం - ఆత్మ సాక్షాత్కారం మరియు మోక్షం వైపు దారి చూపించే స్తోత్రరాజం. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ.*

*🍀. శ్రీ దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు అందరికి. Sri Dattatreya Jayanti Good Wishes to All 🍀*

*శ్రీ దత్తాత్రేయ అష్టచక్రబీజ స్తోత్రం అనేది ఆది గురువైన శ్రీ దత్తాత్రేయుని దివ్యత్వాన్ని తెలియజేసే స్తోత్రం. శ్రీ ఆది శంకరాచార్యుల వారిచే అందించబడిన ఈ స్తోత్రం ద్వారా భక్తులు దత్తాత్రేయ గురుదేవుల పవిత్ర గుణాలను స్మరించి, ఆయన ఆశీర్వాదాలను, మార్గదర్శకత్వాన్ని కోరుతూ తమ భక్తిని వ్యక్తపరుస్తారు. ఇది దత్తాత్రేయుడి దైవ గుణాలను ప్రశంసిస్తూ, ఆయనను చేరుకోవడానికి మార్గం చూపే ఆత్మజ్ఞాన స్తోత్రం. ఇది మన శరీరాలకు ఆధారభూతంగా వున్న ఆంతరిక శక్తి కేంద్రాల గురించి వివరిస్తుంది. కుండలినీ జాగృతికి చేయవలసిన సాధనలను కూడా ఈ స్తోత్రం అందిస్తుంది.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ దత్తాత్రేయ జయంతి, శ్రీ అన్నపూర్ణ జయంతి శుభాకాంక్షలు అందరికి, Sri Dattatreya Jayanti, Sri Annapurna Jayanti Good Wishes to All 🌹*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻. శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతి విశిష్టత / Specialty of Sri Dattatreya Swami's Jayanti 🌻*

*🍀. శ్రీ దత్తాత్రేయుడు జ్ఞానయోగనిధి, విశ్వగురువు, సిద్ధసేవితుడు. ‘శ్రీదత్తా’ అని స్మరించినంతనే మన మనస్సులోని కోర్కెలు తీర్చునని శ్రుతి తెలుపుచున్నది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ సత్యానందమయము, ధర్మమయమూ తరింపజేయుటయే దత్తమూర్తి అవతారము. దత్తాత్రేయుడు వేదజ్ఞానము నధిగమించిన జ్ఞానసాగరుడు.🍀*

*🌼. దత్తాత్రేయస్వామి షోడశ అవతారాల రూపాలలో కనిపించి వివిధ భక్తులను అనుగ్రహించాడు. ఆయా రూపాలు వేర్వేరు పేర్లతో ప్రసిద్ధి చెందాయి. ఆ అవతారాలు : 🌼* 

*1. శ్రీ యోగిరాజు (ప్రథమ అవతారము)*
*2. శ్రీ అత్రివరడుడు (ద్వితీయ అవతారము)*
*3. దిగంబరావధూత శ్రీ దత్తాత్రేయుడు (తృతీయ అవతారము)*
*4. శ్రీ కాలాగ్నిశమనుడు (చతుర్ధ అవతారము)*
*5. శ్రీ యోగిజనవల్లభుడు (పంచమ అవతారము)*
*6. శ్రీ లీలా విశ్వంబరుడు (షష్టమ అవతారము)*
*7. శ్రీ సిద్ధరాజు (సప్తమ అవతారము)*
*8. శ్రీ జ్ఞానసాగరుడు (అష్టమ అవతారము)*
*9. శ్రీ విశ్వంభరావధూత (నవమ అవతారము)*
*10. శ్రీ మయాముక్తావధూత (దశమ అవతారం)*
*11. శ్రీ ఆదిగురువు (ఏకాదశ అవతారం)*
*12. శ్రీ సంస్కరహీన శివ స్వరూప దత్తాత్రేయుడు (ద్వాదశ అవతారం)*
*13. శ్రీ దేవదేవుడు (త్రయోదశ అవతారం)*
*14. శ్రీ దిగంబరుడు (చతుర్దశ అవతారం)*
*15. శ్రీ దత్తావధూత (పంచదశ అవతారం)*
*16. శ్రీ శ్యామకమలలోచనుడు (షోడశ అవతారం)*

*🌿 ఆధిభౌతికము, ఆధిదైవికము, ఆధ్యాత్మికము అనే త్రివిధాలయిన తాపాలను తన తపో మహిమతో తొలగించుకొన్న మహనీయుడు అత్రి మహర్షి. అత్రి పుత్రుడు కనుక ‘ఆత్రేయుడు’ అని కూడా పిలువబడినాడు. దత్తుడు గోమతీ నదీ తీరమున సత్యజ్ఞాన సముపార్జనకై తపస్సు చేసి సకల విద్యలలో ఆరితేరి జ్ఞానమును సంపాదించి సత్యజ్ఞాని అయ్యాడు. దత్తాత్రేయుడికి ఆరు చేతులు మూడు తలలు నడిమి శిరస్సు విష్ణువుది. కుడిది శివుడిది ఎడమది బ్రహ్మ శిరం. కుడి భాగము సద్గురు స్వరూపము, ఎడమభాగము పరబ్రహ్మస్వరూపము మధ్యభాగాన గురుమూర్తిగా అజ్ఞానమును తొలగించి శ్రీదత్తుడు లోకముల రక్షణ చేయును. మూడు ముఖములతో, ఆరు భుజములతో నాల్గు కుక్కలతో, ఆవుతో కనిపిస్తాడు. నాల్గు కుక్కలు నాల్గు వేదములు, ఆవు మనస్సే మాయాశక్తి, మూడు ముఖములు త్రిమూర్తులు. సృష్టి, స్థితి, లయములు. త్రిశూలము ఆచారము, చక్రము అవిద్యా నాశకము, శంఖము నాదము సమస్త నిధి, డమరు సర్వవేదములు దీని నుంచి పాదుర్భవించినవి. కమండలము సకల బాధలను దూరం చేసి శుభాలను చేకూర్చుటకు ప్రతీక. 🌿*

*🌼 సంసార బంధములను తెంచుకొని తమ భక్తులను తనే ఎంచుకుని పరమ పదం వైపుకు నడిపించిన గురుదేవులు దత్తాత్రేయుల వారు పుట్టిన రోజు మార్గశీర్షమాసంలో పూర్ణిమనాడు వస్తుంది. మృగశిరా నక్షత్రం వృషభరాశికి చెందినది. పౌర్ణమి అనేది చంద్రునికి సంబంధించిన అన్ని కళలతో నిండిన తిథి. వృషభరాశి చంద్రునికి స్వస్థానం కాబట్టి సంపూర్ణమైన చంద్రుని శక్తి ఉండే రోజు మార్గశీర్ష పూర్ణిమ నాడు దత్తాత్రేయ జయంతి జరుపుకుంటున్నారు. పౌర్ణమినాడు దత్తుని పాలతో అభిషేకించి మనస్సులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయమును చేకూర్చుతాడు. కనుక అట్టి దత్తుని జయంతి రోజు ఆరాధించి ధన్యులమవుదాం! 🌼*

*🌻. ఘోరమైన కష్టాలను తొలగించే మహా మహిమాన్వితమైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఘోర కష్టోద్ధారణ స్త్రోత్రం. 🌻

*🌷. ఈ పంచ శ్లోకాలను భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు, బాధలు ఉన్నా, అవన్నీ పూర్తిగా తొలగిపోయి, సుఖ సంతోషాలు చేకూరుతాయి. పరిపూర్ణ భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పఠించండి.🌷*

*1. శ్రీ పాద శ్రీ వల్లభ త్వం సదైవ శ్రీ దత్తా స్మాన్ పాహి దేవాధిదేవ|,*
*భవగ్రహ క్లేశ హరిన్ సుకీర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే .*

*2. త్వం నో మాతా త్వం నో పితాప్తో ధి పస్త్వం త్రాతాయోగ క్షేమకృత్ సద్గురు స్త్వమ్*
*త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే .*

*3.పాపం తాపం వ్యాధిదీం చ దైన్యమ్ భీతిం క్లేశం త్వం హ రాశు త్వ దైన్యమ్|*
*త్రాతారం నో వీక్ష ఇషాస్త జూర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే .*

*4. నాన్య స్త్రాతా న పీడాన్ న భర్తా త్వత్తో దేవ త్వం శరణ్యో శోకహర్తా|*
*కుర్వత్రేయ అనుగ్రహం పూర్ణరతే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే .*

*5. ధర్మే ప్రీతీం సన్మతం దేవభక్తిమ్ సత్స్ జ్ఞప్తి దేహి భుక్తిమ్ చ ముక్తిం |*
*భవ శక్తీమ్ చ అఖిలానంద మూర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే .*

*శలోక పంచక మతద్యో లోక మంగళ |వర్ధనం ప్రపటేన్యతో భక్త్యా స శ్రీ దత్తాత్రేయ ప్రియో భవేత్.*

*🙏 ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా🙏*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలతో శ్రీ దత్తాత్రేయుని జీవితాన్ని, మహత్వాన్ని తెలియజేసి సర్వ కోరికలను తీర్చే "శ్రీ దత్తాత్రేయ చాలీసా". 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

సర్వమంత్ర స్వరూపాయ సర్వయంత్ర స్వరూపాయ
సర్వతంత్ర స్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ
యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర
బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ
✍️త్రినాధమూర్తి జరజాపు
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 580 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 580 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 117. మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా ।*
*మహనీయా, దయామూర్తీ, ర్మహాసామ్రాజ్యశాలినీ ॥ 117 ॥ 🍀*

*🌻 580. 'మహనీయా' - 2 🌻*

*మహనీయులను పదమును సామాన్యముగ నుచ్చరించరాదు. పొగడ్తలకు “మహనీయులు” అని వాడుట ఆచారమైనది. శ్రీమాతయే 'మహనీయా'. ఆమె భక్తులగు ఋషులు, సనక సనందనాదులు మహనీయులు. అట్లే శ్రీమాతకు సర్వ సమర్పణము చేసి శ్రీమాత మహనీయత్వమునకు దర్పణముగ నిలచినవారే మహనీయులు, అరకొర శక్తి, యుక్తి, జ్ఞానము కలవారిని మహనీయులని పొగడుట అసత్యమే అగును. అసత్య భాషణము వర్ణనీయము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 580 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 117. Mahakailasa nilaya mrunala mrududorlata*
*mahaniya dayamurti rmahasamrajya shalini ॥117 ॥ 🌻*

*🌻 580. 'Mahaniya' - 2 🌻*

*The word "Mahanīya" is not to be uttered casually, as it is traditionally used to honor those who are truly deserving of praise. Sri Mata herself is the ultimate "Mahanīya." The sages and seers devoted to her, such as Sanaka and Sanandana, are also considered "Mahanīyas." Similarly, those who dedicate themselves entirely to Sri Mata and reflect her divine greatness become true "Mahanīyas." It would be untruthful and inappropriate to bestow the title "Mahanīya" upon individuals who lack the requisite power, wisdom, and virtue. False glorification and exaggerated speech are neither truthful nor laudable.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/FkxpuODbEy62n58Xnsq3eO 
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad
https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. Chaitanya Vijnaanam YouTube FB Telegram groups 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
Like, Subscribe and Share 👀
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

🌹 14 DECEMBER 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹

🍀 🌹 14 DECEMBER 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹🍀 
1) 🌹దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలతో శ్రీ దత్తాత్రేయుని జీవితాన్ని, మహత్వాన్ని తెలియజేసి సర్వ కోరికలను తీర్చే "శ్రీ దత్తాత్రేయ చాలీసా". 🌹
2) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 580 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 580 - 1 🌹 
🌻 580. 'మహనీయా' - 1 / 580. 'Mahaniya' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలతో శ్రీ దత్తాత్రేయుని జీవితాన్ని, మహత్వాన్ని తెలియజేసి సర్వ కోరికలను తీర్చే "శ్రీ దత్తాత్రేయ చాలీసా". 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

సర్వమంత్ర స్వరూపాయ సర్వయంత్ర స్వరూపాయ
సర్వతంత్ర స్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ
యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర
బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ
✍️త్రినాధమూర్తి జరజాపు
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 580 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 580 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 117. మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా ।*
*మహనీయా, దయామూర్తీ, ర్మహాసామ్రాజ్యశాలినీ ॥ 117 ॥ 🍀*

*🌻 580. 'మహనీయా' - 1 🌻*

*మహనీయమైనది శ్రీమాత అని అర్థము. అత్యంత వైభవోపేతము, అత్యంత ప్రశంసనీయము, అత్యంత కాంతివంతము, అత్యంత కీర్తివంతము, అత్యంత బలోపేతము, శక్తి వంతము, పుష్కలము, ఆనందదాయకము, స్ఫూర్తిమంతము, త్యాగ నీయము అగుటచే సమస్త లోకముల నుండి పూజలందుకొను దేవి కావున 'మహనీయా' అని శ్రీమాతను హయగ్రీవుడు కీర్తించుచున్నాడు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 580 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 117. Mahakailasa nilaya mrunala mrududorlata*
*mahaniya dayamurti rmahasamrajya shalini ॥117 ॥ 🌻*

*🌻 580. 'Mahaniya' - 1 🌻*

*The term "Mahanīyam" signifies something or someone that is supremely venerable and glorious. Sri Mata (Divine Mother) is described as the epitome of grandeur, praiseworthiness, radiance, fame, strength, power, abundance, joy, inspiration, and sacrifice. Being such a divine embodiment, she receives reverence from all the worlds, and thus, Hayagriva extols her as 'Mahanīya.'*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹Evolution is Spirallic process and not a cyclic process. 🌹*
*Prasad Bharadwaj*

*There are many people who believe that everything is predetermined. To some extent, yes, but if everything is predetermined, there is no evolution, then we are just making circular rounds! But evolution is a process where we move in a circular fashion and with each cycle we move upward. It is a spirallic process and not a cyclic process. In a cyclic process we are just moving like the rodent around the mill. But in the process of evolution, each time we take to a cycle we are moving upward, getting liberated, reaching towards the Spirit and in the process of involution we are moving downward, reaching towards the matter. Evolution depends on time and it move according to the need of time. Time is Flexible.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/FkxpuODbEy62n58Xnsq3eO 
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad
https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. Chaitanya Vijnaanam YouTube FB Telegram groups 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
Like, Subscribe and Share 👀
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj