Showing posts with label Love. Show all posts
Showing posts with label Love. Show all posts

75. సంపూర్ణ నిశ్శబ్దం - శాశ్వతత్వం పట్ల ప్రేమ 75. Absolute Silence - Love for Eternity


🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 75 🌹

🍀 75. సంపూర్ణ నిశ్శబ్దం - శాశ్వతత్వం పట్ల ప్రేమ 🍀

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀




🌹 Teachings of the Consciousness - 75 🌹

🍀 75. Absolute Silence - Love for Eternity 🍀

Prasad Bharadwaja

🌹🍀🌹🍀🌹🍀



Love is prayer, higher understanding. Not a desire, not a fall from consciousness / ప్రేమ అంటే ప్రార్థన, ఉన్నతమైన అవగాహన. కోరిక కాదు, స్పృహ నుండి పతనం కాదు


🌹 ప్రేమ అంటే ప్రార్థన, ఉన్నతమైన అవగాహన. కోరిక కాదు, స్పృహ నుండి పతనం కాదు. 🌹

✍️. ప్రసాద్‌ భరధ్వాజ


ఒక వ్యక్తి కోరిక ప్రభావంలో ఉన్నప్పుడు, ఆ ప్రభావం సమ్మోహనంగా ఉంటుంది. ప్రతి కోరిక మిమ్మల్ని సమ్మోహన చేస్తుంది. మిమ్మల్ని అంధుడిని చేస్తుంది, అందుకే అంటాం.. మీరు ప్రమేలో పడిపోయారు అని. అవును. మనకు తెలిసిన ప్రేమ ఖచ్చితంగా పతనం -- స్పృహ నుండి పతనం, అవగాహన నుండి పతనం. మీరు భూమిపై ప్రాకడం ప్రారంభిస్తారు; మీరు ఇకపై మీ స్పహలో ఉండరు, మీరు మీ తెలివితేటలను కోల్పోతారు, మీరు తెలివితక్కువ వారు అవుతారు. మీరు కోరిక మరియు కామంతో నిండిన కొద్దీ, మీరు మరింత మూర్ఖులు.

కొంతమంది ఇలా అంటారు, ''నేను మొదటి చూపులోనే ప్రేమను నమ్ముతాను ఎందుకంటే అది సమయాన్ని ఆదా చేస్తుంది.'' మీరు ఎప్పుడు పడిపోతారో అని వేచి ఉండండం ఎందుకు? మొదటి చూపులోనే పతనం అన్నమాట. దానివల్ల కనీసం సమయం ఆదా అవుతుంది. మనం మామూలు ప్రేమ గురించి ఇక్కడ మాట్లాడు కుంటున్నాం. ఇది కోరిక, ఇది సాధ్యమైనంత తక్కువ శక్తి ఉన్న దృగ్విషయం. మీరు దాదాపు సమ్మోహన స్థితిలో ఉన్నారు. స్త్రీని ప్రేమిస్తున్న పురుషుడు, లేదా పురుషునితో ప్రేమలో ఉన్న స్త్రీ ఇకపై స్పష్టంగా చూడలేరు. మనస్సు మబ్బుగా మారుతుంది, కోరిక చాలా పొగను సృష్టిస్తుంది, మీరు స్పష్టంగా చూడలేనంత ధూళిని లేపుతుంది. ఇకపై మీరు చూసేది మీ స్వంత దృశ్యమే కానీ వాస్తవం కాదు.

ఒక వ్యక్తి ఎవరితోనైనా నిజంగా ప్రేమలో ఉన్నప్పుడు (పడినప్పుడు కాదు) - మరింత ఉన్నతంగా మారతాడు. ఇక్కడ ప్రేమ అంటే బుద్ధుల, శ్రీరాముడి, శ్రీకృష్ణుడి ప్రేమ.అవతారుల ప్రేమ. వారి ప్రేమ పూర్తిగా భిన్నమైనది. వారు ప్రార్థన గురించి మాట్లాడుతున్నారు, వారు కరుణ గురించి మాట్లాడుతున్నారు, వారు తమ ఉనికి యొక్క కోరిక లేని వ్యక్తీకరణ గురించి మాట్లాడుతున్నారు. తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఈ విధమైన ప్రేమ మన చైతన్యాన్ని మరింత అభివృద్ధి పరుస్తుంది. సాధకులు సాధ్యం చేసుకోవలసిన ప్రేమ ఇది.

🌹🌹🌹🌹🌹




🌹 Love is prayer, higher understanding. Not a desire, not a fall from consciousness. 🌹

✍️ Prasad Bharadwaj


Desire has a mesmerising effect on people. Every yearning hypnotises you. It causes blindness, which is why we use terms like "falling in love." That is significant. The love you know is unquestionably a fall—a fall from consciousness, a fall from comprehension. You begin crawling on the ground; you lose your senses, intelligence, and become foolish. The more passion and lust you have, the stupider you are.

Few people says "I believe in love at first sight because it saves time." Why wait when you're about to fall? Fall at first sight. At the very least, you save time. We are talking about our routine love. Lust is the lowest-energy phenomenon. You're almost hypnotised. A man in love with a woman, or a woman in love with a man, loses their ability to see properly. The mind becomes muddled; desire produces so much smoke and dust that you cannot see clearly. Everything you perceive is your own projection only, not reality.

When a person is truly in love with someone (not when they fall) - becomes more exalted. Love here means the love of Buddhas, love of Sri Rama and Sri Krishna's love. The Love of Avatara's. Their love is very different. They are discussing prayer, compassion, and the desireless expression of their essence. They are sharing their happiness. This kind of love develops our consciousness further. This is the kind of love that seekers should make possible.

🌹🌹🌹🌹🌹


మీలో చైతన్యం తెచ్చుకోవడమే సరైన మార్గం / The right way is to bring consciousness to yourself


🌹 మీలో చైతన్యం తెచ్చుకోవడమే సరైన మార్గం 🌹

✍️. ప్రసాద్‌ భరధ్వాజ


మొత్తం ప్రపంచంలోని స్పృహ లేని ప్రతి ఒక్కరూ బిచ్చగాళ్లు. అందరూ కొంత ప్రేమను, కొంత శ్రద్ధను, కొంత సానుభూతిని లాక్కోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు - ఎందుకంటే ప్రేమ అనేది ఎంతో అవసరమైన పోషణ. ప్రేమ లేకుండా, మీరు జీవించ లేరు; శరీరానికి ఆహారం ఎంత అవసరమో, ఆత్మకు ప్రేమ కూడా అంతే అవసరం. ప్రతి ఒక్కరూ ప్రేమ లేకుండా బాధ పడుతున్నారు, ఎందుకంటే ప్రేమ లేకపోతే మీ ఆత్మలు నిస్తేజం అయిపోతాయి. కానీ దాని కోసం మనం చేస్తున్నది సరైనది కాదు. మీలోకి దివ్య చైతన్యం తెచ్చుకోవడమే సరైన మార్గం.

ఉన్నత చైతన్యం నుండి వివిధ స్పృహలు అనేక కోణాలలో వస్తూ ఉంటాయి. వీటిలో ప్రేమ అనేది చాలా ముఖ్యమైన పరిణాత్మక కోణం. దీని ద్వారా మొత్తం ఉనికి నుండి ప్రేమను ఎలా పొందాలి అనే బంగారు తాళం చెవిని మీరు కనుగొంటారు.

దీని రహస్యం ఏమిటంటే, మీ వద్ద ఉన్నదంతా ఇవ్వడం, పంచుకోవడం. మీరు తనతో భాగస్వామ్యులుగా మారారని విశ్వం తెలుసుకున్న తర్వాత, విశ్వంలోని అన్ని మూల వనరులు మీకు అందుబాటులోకి వస్తాయి. అవి ఎప్పటికీ తరగనివి.




🌹 The right way is to bring consciousness to yourself. 🌹

Everybody in this whole world of unconsciousness is a beggar, trying in every possible way to snatch some love, some attention, some sympathy -- because love is a necessary nourishment. Without love, you cannot live; just as food is necessary for the body, love is necessary for the soul. And everybody is suffering without love, because without love your souls become Inactive. But what we are doing is not right. The right way is to bring consciousness to yourself.

From higher consciousness there will be many revolutions in many dimensions. Love will be one of the most important dimensions, and you will find the golden key of how to get love from the whole existence.

The secret is: whatever you have, give it, share it. Once the universe knows that you have become a sharer, then all the sources of the universe become available to you. They are inexhaustible.

🌹🌹🌹🌹🌹


సుదీర్ఘ ప్రయాణం / Long Journey

🌹 సుదీర్ఘ ప్రయాణం / Long Journey 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


దేవుడు అత్యంత సన్నిహితుడు మరియు ఆయన నిశ్శబ్దాన్ని ఛేదించి రోజులోని ప్రతి క్షణంలో ఆయనను మీ జీవితంలోకి తీసుకురావడం మీ ఇష్టం. దేవుడు అంటే ప్రేమ. ప్రేమ ద్వారా అతనిని కనుగొనడం సులభమైన మార్గం. మీరు మీ హృదయాన్ని తెరిచి ఉంచి, ప్రేమను ప్రవహింపజేస్తే, దేవుని ప్రేమ మిమ్మల్ని దైవిక శక్తితో నింపుతుంది మరియు మార్గంలో మీకు సహాయం చేస్తుంది. అన్ని అడ్డంకులను అధిగమించడానికి మీకు మార్గనిర్దేశం చేస్తుంది. ఇది సుదీర్ఘ ప్రయాణం. కానీ మీరు దానిని దైవంతో పంచుకున్న తర్వాత అది చిన్నదిగా మరియు సులభంగా మారుతుంది. అతనికి మార్గం తెలుసు, మరియు అంతిమ విముక్తికి మిమ్మల్ని చివరి వరకు నడిపిస్తాడు.




🌹 Long Journey 🌹

God is that friend and it is upto you to break the silence and bring Him into your life at every moment of the day. God is love. and that is the easiest way to find Him through love. if you keep your heart open and let love flow, Gods love will fill you with divine energy and help you along the path, guiding you to overcome all the obstacles. it is a long journey. but it becomes shorter and easier once you share it with the Lord. He knows the path, and will guide you all the way to the very end, to ultimate liberation.

🌹🌹🌹🌹🌹