శ్రీ లక్ష్మినరసింహా గోవింద గోవింద Lakshmi Narasimha Swamy (a devotional YT Short)



https://youtube.com/shorts/KyPgLGI3Ddg

🌹 శ్రీ లక్ష్మినరసింహా గోవింద గోవింద Lakshmi narasimha swamy 🌹

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹


Facebook Group: https://www.facebook.com/groups/chaitanyavijnanam




భాను సప్తమి - 08-02-2026 ఆదివారం శుభాకాంక్షలు అందరికి Greetings on Bhanu Saptami





🌹 భాను సప్తమి - 08-02-2026 ఆదివారం శుభాకాంక్షలు అందరికి 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Happy Bhanu Saptami - Sunday, 08-02-2026. Best wishes to all! 🌹
Prasad Bharadwaj


ఆదివారం రోజు సప్తమి తిధి రావడం వలన దీనిని భాను సప్తమి అంటారు. ఇది చాలా గొప్ప యోగం. సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. వాటిలో ప్రధానంగా చూస్తే...

మొదట సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం, రెండవది ఆదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు, ఈ రోజు కేవలం తలస్నానం మాత్రమే చేయాలి. మూడవది ఒంటికి, తలకు నూనె పెట్టుకోరాదు. నాల్గవది ఉల్లి, వెల్లుల్లి, మద్యము, మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఐదవది బ్రహ్మచర్యం పాటించాలి.

నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు. ఆయన అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు. సుర్యారాధనతో విద్యా, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అవివాహితులకు వివాహమవుతుంది. సంతానం కలుగుతుంది. మనఃశ్శాంతి లభిస్తుంది. సూర్యారాధనతో లభించనిది అంటూ ఏదీ ఉండదు.

ఈ భానుసప్తమి అనేది సూర్యునికి సంబంధించిన ఒక పర్వదినము లాంటిది, గొప్ప యోగము. ఈ రోజు చేసే స్నానం, దానము, జపము, హోమము లక్ష రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్ర వచనం. ఈ రోజున ఆవుపాలతో చేసిన పరమాన్నము శ్రీ సూర్య భగవానునికి నివేదన చేస్తారు.

సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి స్నానోదకాలు చేయక, ఆహార నియమాలు పాటించని వారికి అనారోగ్యం చేసి రోగాలు వస్తాయని, దరిద్రం పడుతుందని శాస్త్రవచనం. ఈ విషయాన్ని పరమశివుడే సూర్యాష్టకంలో చెబుతారు.


ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే

సప్త జన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా

స్త్రీ తైల మధు మాంసాని యే త్యజన్తి రవేర్ధినే

న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం సగచ్ఛతి


భావం - తినకూడని పదార్ధాలు, మద్యము, మాంసము మొదలైనవి తినేవాడు ఏడు జన్మల పాటు రోగాలతో బాధపడతారు. ఆజన్మాంతం దరిద్రం ఉంటుంది. స్త్రీ సమాగమము, తైలం రాసుకొనుట, మద్య మాంసాలను ఆదివారం విడిచిపెట్టినవానికి శోకం, వ్యాధి, దారిద్ర్యం ఉండదు. వారు సరాసరి సూర్యలోకానికి వెళతారు.

ఈ నియమాలు ఒక్క భానుసప్తమికే పరిమితం కాదు. ప్రతి ఆదివారం విధిగా పాటించమని పరమశివుడు సూర్యాష్టకంలో చెప్పారు. కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోమని దుర్వినియోగం చేయవద్దని సూచన.

ఈ రోజు సూర్యుని అనుగ్రహం కోసం సూర్యాష్టకం, ఆదిత్య హృదయం, సూర్య ద్వాదశ నామాలు పఠించడం శ్రేష్ఠం. సూర్యనమస్కారాలు చేయడం వలన ఎన్నో శుభఫలితాలను, ఇష్ట కామ్యసిద్ధిని ఇస్తాయి.

శ్రీ రామచంద్రుడంతటి వాడు రావణున్ని యుద్దంలో జయించడానికి సూర్యదేవుని ప్రార్ధించాడు. ఇది అందరికీ తెలిసినదే.

ప్రతి రోజు ఎవరైతే సూర్యోదయ సమయంలో సూర్యనమస్కారాలు చేస్తారో వారికి అన్నింటా విజయం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.


సర్వదేవాత్మకుడు ఆదిత్యుడు

ప్రాతఃకాలాన్నే స్నానం చేసి, శుచిగా సూర్యుని నమస్కరిస్తే చాలు- పాప నిర్మూలనం జరిగి, పవిత్రులమ వుతామని మహాభారతంలో శ్రీకృష్ణుడు బోధించాడు.

సూర్యోదయ సమయంలోని రోగహరణ శక్తే ఉష సూర్యకిరణాల వలన కలిగే వికసనశక్తి చేతనే సర్వ జగతి చేతనత్వం పొందుతోంది. ఆ శక్తినే 'పద్మిని' అన్నారు. ప్రతిబింబశక్తిని 'ఛాయ'గా చెప్పారు.


వీరే సూర్యుని భార్యలు.

సౌమ్యత, తీక్షత, ప్రశాంతం, ప్రచండం.... అన్నీ సూర్యునిలోనే మనం చూడవచ్చు. ఘోరం, అఘోరం.... ఈ రెండింటితోనూ ప్రపంచాన్ని ప్రభావితం చేసే వాడీ తడే కనుక రుద్రుడనీ, శివుడనీ, దిక్కులకు పతి అనీ వేదం పేర్కొంది.

సూర్యుని నుంచే దిక్కులు ఏర్పడుతున్నాయి. సూర్యో దయ దిశను తూర్పుగా తెలుసుకున్నాకనే, మిగిలిన దిశలను నిర్ణయిస్తున్నాం. కనుక 'దిశాంచ పతయే నమః' అని శ్రుతిమంత్రం వినుతించింది. ఆ కిరణాలే ఆయనకు సహస్రకరాలు.

ఇవ్వడం, లాలించడం, పాలించడం, కర్మచేయడం చేతుల లక్షణం. సూర్యకిరణాలు ఈ నాలుగు పనులతో విశ్వానికి హితాన్నీ, రమ్యతనీ అందిస్తాయి. కనుక 'హిరణ్యబాహువు' అని కీర్తించారు. ఈ కిరణాలను ప్రపంచమంతా పరచి వాటి ద్వారా సకల చరాచరాలకు ప్రాణశక్తిని అందిస్తున్న వ్యాపకత్వం చేత ఈయననే 'విష్ణువు' అన్నారు.

కిరణాలకున్న గమనలక్షణం బట్టి 'గరుత్మంతుడ'ని పేర్కొన్నారు. కిరణాలనధిష్ఠించిన ఆదిత్యుడు గరుడ వాహనారూఢుడు.

సూర్యుని చైతన్యశక్తే జగతికి ఐశ్వర్యాలను ప్రసాదిస్తోంది. అందుకే లక్ష్మిగా, పరాశక్తిగా జగదంబగా సౌరశక్తిని ఆరాధిస్తున్నాం. (భాను మండల మధ్యస్థా.... లలితా సహస్రనామాల్లోని ఒక నామం.) సూర్యకిరణాలు తీక్షణంగా ఉన్నా, సౌమ్యంగా ఉన్నా పరిణామంలో మనకు మంగళ కరాలు. మంగళమే ఆయన స్వభావం. అందుకే 'శివుడు' (మంగళమయుడు) అని ఆయనను నుతించారు (ఆదిత్యంచ శివం విద్యాతే... శాస్త్రోక్తి).

ప్రాణశక్తి ప్రదానంతో సృష్టిని నిర్వహిస్తాడు- కనుక బ్రహ్మ, స్థితి, పోషణ కలిగించే శ్రీహరి. 'వారం' అంటే సర్వజీవసమూహం. వారికి శక్తినిచ్చే ఆశ్రయ శక్తి (ఆయనం) ఈతడే కనుక సూర్యనారాయణుడు.

'ఇంద దీప్తౌ' 'ఇది ఐశ్వర్యే'_ - అనే సంస్కృత ధాతువుల ననుసరించి ప్రకాశ, ఐశ్వర్య లక్షణాలచేత సూర్యుని 'ఇంద్రుడు' అన్నారు.

కిరణాల్లోని జిడ్డుశక్తి 'మిత్ర', పోషణశక్తి 'పూష', ఆర్ద్రత 'వరుణ'. ఇలా సర్వదేవతలు సౌరశక్తి విశేషాలే. అందుకే వేదం ఏకం సత్ విప్రాః బహుధా వదన్తి అనే మంత్రాన్ని సూర్యపరంగానే చెప్పింది.


ఒకే సూర్యశక్తి పలు విధాలుగా జగతిని అనుగ్రహిస్తోంది.

సూర్యుడు జడ ప్రకృతి కాదు, పూర్ణచైతన్యం. సకల జగన్నిర్వహణ చేసే పరబ్రహ్మ చైతన్యం సూర్యుని ద్వారా మనల్ని అనుగ్రహిస్తున్నది. కనుక సర్వ దేవమయుడు ఆదిత్యుడు. సర్వదేవతాత్మకుడైన సూర్యుని ప్రకాశ దాహక శక్తినే యజ్ఞాగ్నిగా రగిల్చి, సర్వదేవతలను ఆరాధించే యజ్ఞసంస్కృతి మనది.

అఖండ తేజః స్వరూపుడైన ఆదిత్యుని మాఘ మాసం నుంచి మనం మరింత కాంతులతో గ్రహించనున్నాం.

ఉత్తరాయణ పుణ్యవేళ, దైవీయమైన సూర్యకాంతులు మన ప్రాంతాలకు సముజ్జ్వలంగా లభిస్తాయి.

ఈ కాంతిగమన పరిణామాన్నే 'రథం మారడం'గా చెప్పి, సప్త సంఖ్యా ప్రధానత చేత 'సప్తమి' తిథిని 'రథసప్తమి'గా సూర్యారాధనకు వినియోగిం చడం మన సంప్రదాయం. వారాలలో తొలి దినమైన ఆదివారం, తిథుల్లో సప్తమి - సూర్యారాధనకు ప్రశస్తం.

సూర్యనమస్కారం, ఆరాధన వైజ్ఞానికంగా, ఆధ్యాత్మికంగా కూడా సాఫల్యమైన భవ్య సంస్కృతి.

ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః........


కిరణాల్లోని జిడ్డుశక్తి 'మిత్ర', పోషణశక్తి 'పూష', ఆర్ద్రత 'వరుణ'. ఇలా సర్వదేవతలు సౌరశక్తి విశేషాలే. అందుకే వేదం ఏకం సత్ విప్రాః బహుధా వదన్తి అనే మంత్రాన్ని సూర్యపరంగానే చెప్పింది.

ఒకే సూర్యశక్తి పలు విధాలుగా జగతిని అనుగ్రహిస్తోంది.

సూర్యుడు జడ ప్రకృతి కాదు, పూర్ణచైతన్యం. సకల జగన్నిర్వహణ చేసే పరబ్రహ్మ చైతన్యం సూర్యుని ద్వారా మనల్ని అనుగ్రహిస్తున్నది. కనుక సర్వ దేవమయుడు ఆదిత్యుడు. సర్వదేవతాత్మకుడైన సూర్యుని ప్రకాశ దాహక శక్తినే యజ్ఞాగ్నిగా రగిల్చి, సర్వదేవతలను ఆరాధించే యజ్ఞసంస్కృతి మనది.

అఖండ తేజః స్వరూపుడైన ఆదిత్యుని మాఘ మాసం నుంచి మనం మరింత కాంతులతో గ్రహించనున్నాం.

ఉత్తరాయణ పుణ్యవేళ, దైవీయమైన సూర్యకాంతులు మన ప్రాంతాలకు సముజ్జ్వలంగా లభిస్తాయి.

ఈ కాంతిగమన పరిణామాన్నే 'రథం మారడం'గా చెప్పి, సప్త సంఖ్యా ప్రధానత చేత 'సప్తమి' తిథిని 'రథసప్తమి'గా సూర్యారాధనకు వినియోగిం చడం మన సంప్రదాయం. వారాలలో తొలి దినమైన ఆదివారం, తిథుల్లో సప్తమి - సూర్యారాధనకు ప్రశస్తం.

సూర్యనమస్కారం, ఆరాధన వైజ్ఞానికంగా, ఆధ్యాత్మికంగా కూడా సాఫల్యమైన భవ్య సంస్కృతి.


ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః........


🌻 సూర్య ద్వాదశ నామాలు 🌻


1. ఓం మిత్రాయనమః

2. ఓం రవయేనమః

3. ఓం సూర్యాయనమః

4. ఓం భానువేనమః

5. ఓం ఖగాయనమః

6. ఓం పూష్ణేనమః

7. ఓం హిరణ్య గర్భాయనమః

8.ఓం మరీచయేనమః

9.ఓం ఆదిత్యా యనమః

10. ఓం సవిత్రేనమః

11. ఓం అర్కాయనమః

12. ఓం భాస్కరాయనమః


🙏ఈ ద్వాదశ నామాలు కూడా స్మరించుకుంటే సూర్యనారాయణుడు ఆశీర్వాదం లభిస్తుంది.

🌹 🌹 🌹 🌹 🌹

సూర్యుడి ఏక రధం, 7 గుర్రాలు, కాలచక్రం విశేషాలు, కార్యాలు - The Sun God Chariot significance



https://youtube.com/shorts/MdpfejkTGyY


🌹 సూర్యుడి ఏక రధం, 7 గుర్రాలు, కాలచక్రం విశేషాలు, కార్యాలు -
The Sun God Chariot significance
🌹

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹

Facebook: https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2064642197655584/



ఆత్మ రక్షా నమః పాప శిక్షా నమో విశ్వకర్తా నమో విశ్వభర్తా SuryaDeva, Sun God - The Soul Protecter (a devotional YT Short)


https://youtube.com/shorts/FpYdyNg9HW4


🌹 ఆత్మ రక్షా నమః పాప శిక్షా నమో విశ్వకర్తా నమో విశ్వభర్తా
SuryaDeva, Sun God - The Soul Protecter 🌹


ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹


నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు Mahashivaratri Brahmotsavams begin today in Srisailam


Facebook: https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2064630677656736/

🌹 నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Mahashivaratri Brahmotsavams begin today in Srisailam 🌹
Prasad Bharadwaj



శ్రీశైలంలో ఆదివారం నుంచి 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవ క్రతువులు ప్రారంభమవుతాయి.

సాయంత్రం ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం తరఫున స్వామి అమ్మవార్లకు పట్టువ్రస్తాలను సమర్పిస్తారు.

ప్రతిరోజు భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లకు వాహనసేవలు నిర్వహిస్తారు. 15న మహా శివరాత్రి రోజున ప్రబోత్సవం, నందివాహన సేవ, రాత్రి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, కల్యాణోత్సవం చేస్తారు. 16న స్వామి అమ్మవార్లకు రథోత్సవం, తెప్పోత్సవం, 17న పూర్ణాహుతి, ధ్వజావరోహణం, 18న అశ్వ వాహనసేవ, శయనోత్సవం, ఏకాంత సేవను నిర్వహిస్తారు.

🌹🌹🌹🌹🌹

ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు... Now get Tirumala darshan tickets on WhatsApp...




🌹 ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే! 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Now get Tirumala darshan tickets on WhatsApp.. Here's the booking process! 🌹
Prasad Bharadwaj



తిరుమల దర్శనం టికెట్లు ఇక సులభంగా పొందే వెసులుబాటు కలిగింది. ఇప్పటి వరకు టీటీడీ ఆన్ లైన్.. ఆఫ్ లైన్ విధానంలో టికెట్లు పొందే విధానం అందుబాటులో ఉంది. ఇక నుండి ఆ సేవలు వాట్సప్ లో అందుబాటులోకి తెచ్చింది టిటిడి.

బుకింగ్ విధానం

భక్తుల కోసం ఇంగ్లీష్, తెలుగు భాషల్లో మన మిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా దేవాలయాలకు సంబంధించిన సేవలు అందుబాటులోకి తెచ్చారు. సేవలను సులువుగా పొందడానికి '95523 00009' అనే వాట్సాప్ నెంబర్​ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్​లోని అన్ని ప్రముఖ దేవాలయాలకు సంబంధించిన దర్శనాలు, సేవలు పొందొచ్చు. ముందుగా మీ మొబైల్​లో '9552300009' అనే నంబర్ సేవ్ చేసుకొని 'Hi' అని మెస్సేజ్ చేయాలి. అప్పుడు సేవలు ఎంచుకోండి) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే 'దేవాలయ బుకింగ్ సేవలుఅనే ఆప్షన్ కనిపిస్తుంది.

అనంతరం శ్రీశైలం, కాణిపాకం, అన్నవరం, విజయవాడ (Vijayawada), శ్రీకాళ హస్తి ఇలా ఏపీలోని ప్రముఖ టెంపుల్స్ నేమ్స్ డిస్​ప్లే అవుతాయి. అప్పుడు మీరు ఏ దేవాలయం వెళ్లాలనుకుంటున్నారో ఆ టెంపుల్​ ను సెలెక్ట్ చేసి నిర్ధారించి ఆప్షన్ ​పై క్లిక్ చేయాలి. దర్శనం సేవకు సంబంధించి భక్తుడి పూర్తి వివరాలు ఇవ్వటం ద్వారా దర్శనం సేవా టికెట్లు పొందవచ్చు.

🌹 🌹 🌹 🌹 🌹