🌹 18, OCTOBER 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 18, OCTOBER 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 18, OCTOBER 2023 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 4. కూష్మాండ - లలితా త్రిపుర సుందరి దేవి / Worship Maa Kushmanda - Lalitha Tripur Sundari on the 4th day of Navaratri 🌹
2) 🌹 కపిల గీత - 251 / Kapila Gita - 251 🌹 
🌴 6. దేహ గేహముల యందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి - 16 / 6. Description by Lord Kapila of Adverse Fruitive Activities - 16 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 843 / Vishnu Sahasranama Contemplation - 843 🌹 
🌻843. స్వధృతః, स्वधृतः, Svadhr‌taḥ🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 156 / DAILY WISDOM - 156 🌹 
🌻 4. అనేక భాగాలు కలిపినా మానవుణ్ణి చేయలేము. / 4. Many Parts Put Together do not Make a Human Being 🌻
5) 🌹. శివ సూత్రములు - 158 / Siva Sutras - 158 🌹 
🌻 3-7. మోహజయాత్‌ అనంతభోగత్‌ సహజవిద్యాజయాః - 2 / 3-7. mohajayād anantābhogāt sahajavidyājayah   - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 18, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : కూష్మాండ - లలితా త్రిపుర సుందరి దేవి పూజ, తులా సంక్రాంతి, kooshmanda - Lalitha Tripura Sundari Pooja, Tula Sankranti 🌻*

*🌷. కూష్మాండ దేవి ప్రార్ధనా శ్లోకము :*
*సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।*
*దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ॥*

*🌷. శ్రీ లలితా ఆవిర్భావ స్తోత్రము :*
*విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైకనాయకి |*
*లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ *
*ఆనందరూపిణి పరే జగదానందదాయిని |*
*లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ *

*🌷. అలంకారము - నైవేద్యం : శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి - కుంకుమ రంగు, దద్దోజనం, క్షీరాన్నం*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఈశ్వర స్పర్శకు మాత్రమే ఒదగనేర్చుకో - ప్రతి క్రియ లేక ఒదిగి వుండే లక్షణం మనస్సు కలవడడం మంచిదే, కాని, ఆ ఒదిగి వుండడం సత్యమునకు ఈశ్వరశక్తి స్పర్శకు మాత్రం అయినప్పుడే అది శ్రేయోదాయక మవుతుంది. అవర ప్రకృతి ప్రేరణలకు నీవు ఒదగ నారంభించే యెడల, ఇక నీకు పురోగతి ఉండదు. యోగ మార్గం నుండి నిన్ను భ్రష్టుని చేయగల అహిత శక్తుల పాలిట నీవు పడిపోతావు. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీయుజ మాసం
తిథి: శుక్ల చవితి 25:13:36 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: అనూరాధ 21:01:28
వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: ఆయుష్మాన్ 08:19:06
వరకు తదుపరి సౌభాగ్య
కరణం: వణిజ 13:20:21 వరకు
వర్జ్యం: 00:36:50 - 02:14:46
మరియు 26:37:42 - 28:13:54
దుర్ముహూర్తం: 11:37:45 - 12:24:36
రాహు కాలం: 12:01:11 - 13:29:03
గుళిక కాలం: 10:33:19 - 12:01:11
యమ గండం: 07:37:35 - 09:05:27
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:24
అమృత కాలం: 10:24:26 - 12:02:22
సూర్యోదయం: 06:09:43
సూర్యాస్తమయం: 17:52:39
చంద్రోదయం: 09:10:29
చంద్రాస్తమయం: 20:26:43
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: సౌమ్య యోగం - సర్వసౌఖ్యం
21:01:28 వరకు తదుపరి ధ్వాoక్ష 
యోగం - ధన నాశనం, కార్య హాని
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻    

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 4. కూష్మాండ - లలితా త్రిపుర సుందరి దేవి / Worship Maa Kushmanda - Lalitha Tripur Sundari on the 4th day of Navaratri 🌹*
*📚 . ప్రసాద్ భరద్వాజ*

*🌷. కూష్మాండ దేవి ప్రార్ధనా శ్లోకము :*
*సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।*
*దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ॥*

*🌷. శ్రీ లలితా ఆవిర్భావ స్తోత్రము :*
*విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైకనాయకి |*
*లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ *
*ఆనందరూపిణి పరే జగదానందదాయిని |*
*లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ *

*🌷. అలంకారము - నైవేద్యం : శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి - కుంకుమ రంగు, దద్దోజనం, క్షీరాన్నం*

*🌷. మహిమ :*
*జ్ఞానరూపిణి,సరస్వతీశక్తిగా స్తుతించబడే కూష్మాండ రూపంతో అలరారే దేవీమాత అభయముద్రలను ధరించి భక్తులను కాపాడుతుంది. నమ్మిన భక్తులకు బహురూపాలుగా కనిపించి రక్షిస్తుంది. ఆయుష్యును, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. సంసారమనే జగత్తు యొక్క అందాన్ని ఉదరాన ధరించే మాయారూపిణి .. ఈమె .*

*దుర్గామాత నాలుగవ స్వరూప నామము ‘కూష్మాండ’. దరహాసముతో అంటే అవలీలగా బ్రహ్మాండమును సృజించుతుంది కాబట్టి ఈ దేవి ‘కూష్మాండ’ అనే పేరుతో విఖ్యాతి చెందింది.*

*🌻. సాధన :*
*ఈ జగత్తు సృష్టి జరుగక ముందు అంతటా గాఢాంధకారమే అలముకొని ఉండేది. అప్పుడు ఈ దేవి తన దరహాసమాత్రంతో ఈ బ్రహ్మాండాలను సృజించింది. కాబట్టి ఈ స్వరూపమే ఈ సృష్టికి ఆదిశక్తి. ఈ సృష్టిరచనకు పూర్వము బ్రహ్మాండమునకు అస్తిత్వమే లేదు.*

*ఈమె సూర్యమండలాంతర్వర్తిని. సూర్య మండలంలో నివసింపగల శక్తిసామర్థ్యములు ఈమెకే గలవు. ఈమె శరీరకాంతిచ్ఛటలు సూర్యకిరణ ప్రభలలాగా దేదీవ్యమానముగా వెలుగొందుతూ ఉంటాయి. ఈమె తేజస్సు నిరుపమానము. దానికి అదే సాటి. ఇతర దేవతాస్వరూపాలేవీ ఈమె తేజః ప్రభావములతో తులతూగలేవు. ఈమె తేజోమండల ప్రభావమే దశదిశలూ వెలుగొందుతూ ఉంటుంది. బ్రహ్మాండములోని అన్ని వస్తువులలో, ప్రాణులలో ఉన్న తేజస్సు కూష్మాండ ఛాయయే.*

*ఈ స్వరూపము ఎనిమిది భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. అందువల్లనే ఈమె ‘అష్టభుజాదేవి’ అనే పేరుతో కూడా వాసిగాంచింది. ఈమె ఏడు చేతులలో వరుసగా కండలమూ, ధనుస్సూ, బాణమూ, కమలమూ, అమృతకలశమూ, చక్ర గదలు తేజరిల్లుతూ ఉంటాయి. ఎనిమిదవ చేతిలో సర్వ సిద్ధులనూ, నిధులనూ ప్రసాదించే జపమాల ఉంటుంది. సింహవాహన. సంస్కృతంలో ‘కూష్మాండము’ అంటే గుమ్మడికాయ. కూష్మాండబలి ఈమెకు అత్యంత ప్రీతికరము. ఇందువల్ల కూడా ఈమెను ‘కూష్మాండ’ అని పిలుస్తారు.*

*నవరాత్రి ఉత్సవాలలో నాల్గవరోజు కూష్మాండాదేవీ స్వరూపమే దుర్గామాత భక్తుల పూజలను అందుకొంటుంది. ఈనాడు సాధకుని మనస్సు అనాహత చక్రంలో స్థిరమవుతుంది. కాబట్టి ఈ రోజు ఉపాసకుడు పవిత్రమైన, నిశ్చలమైన మనస్సుతో కూష్మాండాదేవి స్వరూపాన్నే ధ్యానిస్తూ పూజలు చేయాలి. భక్తులు ఈ స్వరూపాన్ని చక్కగా ఉపాసించడంవల్ల పరితృప్తయై ఈమె వారి రోగాలనూ, శోకాలనూ రూపుమాపుతుంది. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములూ, ఆరోగ్యభాగ్యములు వృద్ధి చెందుతాయి. సేవకుల కొద్దిపాటి భక్తికే ఈ దేవి ప్రసన్నురాలవుతుంది. మానవుడు నిర్మల హృదయంతో ఈమెను శరణుజొచ్చిన వెంటనే అతి సులభముగా పరమ పదము ప్రాప్తిస్తుంది.*

*శాస్త్రాలలో, పురాణాలలో పేర్కొనబడిన రీతిలో విధివిధానమును అనుసరించి మనము దుర్గాదేవిని ఉపాసిస్తూ అనవరతము భక్తి మార్గంలో అగ్రేసరులమై ఉండాలి. ఈ తల్లి భక్తిసేవా మార్గంలో కొద్దిపాటిగానైనా పురోగమించగలిగిన సాధకునికి ఆమె కృపానుభవము అవశ్యము కలిగి తీరుతుంది. దాని ఫలితంగా దుఃఖరూప సంసారమంతా భక్తునికి సుఖదాయకమూ, సుగమమూ అవుతుంది. మనిషి సహజంగా భవసాగరాన్ని తరించడనికి ఈ తల్లియొక్క ఉపాసన అతి సులభమైన, శ్రేయస్కరమైన మార్గం. మనిషి ఆదివ్యాధులనుండీ సర్వదా విముక్తుడవటానికీ, సుఖసమృద్ధిని పొందటానికీ, ఉన్నతిని పొందటానికీ కూష్మాండా దేవిని ఉపాసించటమనేది రాజమార్గం వంటిది. కాబట్టి లౌకిక, పారలౌకిక ఉన్నతిని కాంక్షించేవారు ఈ దేవీస్వరూపంయొక్క ఉపాసనలో సర్వదా తత్పరులై ఉండాలి.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Worship Maa Kushmanda on the 4th day of Navaratri 🌹*

*Maa Kushmanda, the fourth Avatar of Goddess Durga, is worhipped on the 4th day of Navratri. Her name means the cosmic egg' and she is considered the creator of the universe. As per the Hindu mythology, Lord Vishnu was able to start creating the universe when Maa Kushmanda smiled like a flower which blossomed with a bud. She created the world from nothing, at the time when there was eternal darkness al around. This Swarup of Maa Durga is the source of all. Since she created the universe, she is called Adiswarup and Adishakti.*

*She has eights hands in which she holds Kamandul,bow, arrow, a jar of nectar (Amrit),discus, mace and a lotus, and in one hand she holds a rosary which blesses her devotees with the Ashtasiddhis and Navniddhis. She is also known as Ashtabhuja.She has a radiant face and golden body complexion. Maa resides in the core of the Sun and thus controls the Surya Lok.*

*Maa Kushmanda represents Anahata Chakra in spiritual practice. The divine blessings of Maa Kushmanda helps you improve your health and wealth. She removes all the hurdles and troubles from your life and enables you to get rid of all sorts sorrows in life. Maa brings light into darkness and establishes harmony in your life.*

*🍀. Spiritual Significance :*

*As Kushmanda among the nine durgas , as Mahalakshmi in Shrimad Devi Bhagawatam and as Kamakhya in tantras , Devi is regarded as the very source of everything . She is regarded as universal mother simply because everything that exists is born out of her . She is the womb / source from which Shiva ( time ) , Vishnu ( space ) and Bramha ( matter ) are also born , she is the Mother of all gods.*

*Kushmanda means from whose ushma / self energy , the Bramhanda ( universe ) is born . She is the mother Goddess to everything that is animate and inanimate . Creations have born out of her and goes back to her . She is the beginning and she is the end of cosmos .*

*Devi is consciousness and bliss incarnate as Saguna which is worshiped as Kamakhya , Mahalakshmi , Lalita , Kalika and other Vidya forms of her , and also she is formless , unknown or unseen as Nirguna parabramha . In form and as formless both ways she exists . When she's in a form she becomes the mother and creates life and universes , when she becomes formless she devours everything back within herself .*

*Goddess is regarded as the supreme Godhead in Hindu spirituality , almost every scripture speaks in volumes of her being the very source of universe . She is the Hiraṇyagarbha from which all life is born . In medieval times when their was a rise of male deity centric traditions in Hinduism such as shaivism and Vaishnavism , their was an attempt to hide the ancient perceived science of sages and gurus who mentioned the primordial womb or Devi as the supreme source of existence .*

*Today in this modern world , truth can't be hided in the name of ignorance such as gender bias . The true essence and science of Sanatana Dharma must unfold.*

*Mantra And Other Facts :*
*Maa Kushmanda Dhyan: Sura Sampoorna Kalasham Rudhira Plutameva Cha Dadhanaa Hastapadmabhyam Kushmanda Shubhadasthu Me.*
*Maa Kushmanda Mantra: Om Devi Kushmandaye Namah. (Chant it 108 times).*
*Colour of the fourth day: Red.*
*Prasad of the fourth day: Malpua and Doodh Paak
Governing Planet: It is believed that Goddess Kushmanda provides direction and energy to the Sun. Hence God Sun is governed by Goddess Kushmanda.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 251 / Kapila Gita - 251 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 6. దేహ గేహముల యందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి - 16 🌴*

*16. వాయునోత్క్రమతోత్తారః కఫసంరుద్ధ నాడికః|*
*కాసశ్వాసకృతాయాసః కంఠే ఘురఘురాయతే॥*

*తాత్పర్యము : మృత్యువు ఆసన్నమైనప్పుడు కంఠమున కఫము అడ్డుపడుట వలన ఊపిరాడక గ్రుడ్లు తేలవేయును. గొంతులో గుఱక మొదలగును. దగ్గు అధికమై ఆయాసము ఎక్కువగును. నాడీ స్పందనలో ఎగుడుదిగుడులు ఏర్పడును.*

వ్యాఖ్య :  

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 251 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 6. Description by Lord Kapila of Adverse Fruitive Activities - 16 🌴*

*16. vāyunotkramatottāraḥ kapha-saṁruddha-nāḍikaḥ*
*kāsa-śvāsa-kṛtāyāsaḥ kaṇṭhe ghura-ghurāyate*

*MEANING : In that diseased condition, one's eyes bulge due to the pressure of air from within, and his glands become congested with mucus. He has difficulty breathing, and upon exhaling and inhaling he produces a sound like ghura-ghura, a rattling within the throat.*

PURPORT :  

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 843 / Vishnu Sahasranama Contemplation - 843🌹*

*🌻843. స్వధృతః, स्वधृतः, Svadhr‌taḥ🌻*

*ఓం స్వధృతాయ నమః | ॐ स्वधृताय नमः | OM Svadhr‌tāya namaḥ*

యద్యేవమయం భగవాన్ పరమాత్మాసనాతనః ।
కేన ధార్యత ఇత్యాశఙ్క్యాహ ద్వైపాయనో మునిః ॥
స్వేనైవాత్మనా ధార్యత ఇతి స్వధృత ఉచ్యతే ।
కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి స్వే మహిమ్నీతి వేదతః ॥

*తానెవ్వరిచేతను ధరించబడనివాడైనట్లయిన మరి పరమాత్ముడెవ్వరి చేత ధరించబడును? - అని ఆశంక చేసికొని అందులకు సమాధానముగా 'స్వధృతః' అను నామమును చెప్పుచున్నారు.*

'స భగవః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి; స్వే మహిమ్ని' (ఛాందోగ్యోపనిషత్ 7.24.1) 

*'హే భగవన్! ఆ పరమాత్ముడు దేనియందు నిలుపబడియున్నాడు అని నారదుడు అడిగిన ప్రశ్నకు తన మహిమయందే నిలుపబడియున్నాడు అని సనత్కుమారులు చెప్పిరి' అను శ్రుతి వచనము ఇట ప్రమాణము.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 843🌹*

*🌻843. Svadhr‌taḥ🌻*

*OM Svadhr‌tāya namaḥ*

यद्येवमयं भगवान् परमात्मासनातनः ।
केन धार्यत इत्याशङ्क्याह द्वैपायनो मुनिः ॥
स्वेनैवात्मना धार्यत इति स्वधृत उच्यते ।
कस्मिन् प्रतिष्ठित इति स्वे महिम्नीति वेदतः ॥

Yadyevamayaṃ bhagavān paramātmāsanātanaḥ,
Kena dhāryata ityāśaṅkyāha dvaipāyano muniḥ.
Svenaivātmanā dhāryata iti svadhr‌ta ucyate,
Kasmin pratiṣṭhita iti sve mahimnīti vedataḥ.

*By way of removing the doubt as to by whom then He is supported - it is said: He is supported by His own glory so Svadhr‌taḥ.*

'स भगवः कस्मिन् प्रतिष्ठित इति; स्वे महिम्नि / Sa bhagavaḥ kasmin pratiṣṭhita iti; sve mahimni' (छान्दोग्योपनिषत् / Chāndogyopaniṣat 7.24.1) - 

*In response to the inquiry of Nārada as to where does the Lord abide, Sanatkumāras replied "In His own eminence."'*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।
अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥
అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥
Aṇurbr‌hatkr‌śaḥ sthūlo guṇabhr‌nnirguṇo mahān,
Adhr‌taḥ svadhr‌tassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥

Continues....
🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 156 / DAILY WISDOM - 156 🌹*
*🍀 📖 జ్ఞానం యొక్క కాంతి పుస్తకం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 4. అనేక భాగాలు కలిపినా మానవుణ్ణి చేయలేము. 🌻*

*మానవుడు కేవలం శిరస్సు, అవయవాలు కాదు, అన్ని అవయవాలు కలిసిన మొత్తం కూడా కాదు. మనం కేవలం భౌతిక భాగాలు మాత్రమే కాదు; మనం ఈ కలయికల కంటే కూడా చాలా ఎక్కువ. మానవుడు తన భాగాల యొక్క ఒక మొత్తం కాదు, ప్రాణమున్న జీవి. అలాగే, మనం వేసే చివరి అడుగు మాత్రమే యోగం కాదు, మనం వేసే ప్రతి అడుగు కూడా యోగంలో భాగమే. యోగం తనలో ఉన్న దశల యొక్క ఒక మొత్తం కాదు. కానీ వాటి కలయిక వల్ల వచ్చే ఒక ప్రాణ శక్తి. అనేక భాగాలు కలిసి మనిషిని తయారు చేయవు. యోగం యొక్క అనేక దశలు కలిసి యోగం అవవు. కానీ, అవి ప్రారంభంలో చాలా అవసరం.*

*అందుకే, “దీని అవసరం ఎక్కడ ఉంది?” అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. అవసరం, ప్రయోజనం మరియు లక్ష్యం ప్రతి చర్య వెనుక ఉండే ప్రోత్సాహకాలు. ఒక చర్యను ప్రేరేపించాల్సిన అవసరం ఎప్పుడూ ఉంటుంది. కానీ, జీవితంలో మనకు ఎదురయ్యే అనేక అనుభవాలలో, మనకు ఏదో లోటు ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ లోపం కారణంగా, జీవితంలో తరచుగా అసంతృప్తి ఉంటుంది. మనం రోజూ తినే భోజనంతో సంతృప్తి చెందము; కేవలం ఆహారంతో మనల్ని మనం పోషించుకోడం కంటే మరేదో ఉందని మనము భావిస్తాము.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 156 🌹*
*🍀 📖 In the Light of Wisdom 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 4. Many Parts Put Together do not Make a Human Being 🌻*

*A human being is not merely the head, nor the limbs, nor even the totality of all the limbs. We are not merely a total of the physical parts; we are something more than these combinations. A human being is not merely a mathematical total, but a vital total. Likewise, not merely the last step that we take, but every step that we take is included in yoga. It is not the mathematical total of these steps that constitutes yoga, but something vital that is present in the combination of the parts. Many parts put together do not make a human being. The many stages of yoga put together do not make yoga, though they are all essential in the beginning.*

*Therefore, I will try to answer the question “Where is the need for it?” The need, the purpose and the goal are the incentives behind every action. There needs to be a necessity to motivate an action. Yet in many experiences that we have in life, we feel that we are lacking something. Due to this lack, there is often a dissatisfaction in life. We are not satisfied with the daily eating of our meals; we feel that there is something more than merely sustaining ourselves with food.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 158 / Siva Sutras - 158 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*3వ భాగం - ఆణవోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 3-7. మోహజయాత్‌ అనంతభోగత్‌ సహజవిద్యాజయాః - 2 🌻

*🌴. మాయ పైన విజయంతో, నిస్సందేహంగా ఒకరు శివుని యొక్క అత్యున్నత స్థితిలోకి ప్రవేశిస్తారు మరియు స్వీయ సహజమైన సత్య జ్ఞానాన్ని (సహజ విద్యను) పొందుతారు. 🌴*

*మాయచే బంధించబడి ఉన్నందున, సాధకుడు తనలోని స్వాభావిక జ్ఞానం యొక్క పూర్తి సామర్థ్యాన్ని గ్రహించలేడు. ఆపేక్షకుడు మాయ యొక్క ప్రభావాన్ని దాటి వెళ్ళగలిగినప్పుడు, అతను తన నిజమైన జ్ఞానం అనంతం యొక్క విస్తరణ తప్ప మరొకటి కాదని అర్థం చేసుకోగలుగుతాడు. ఈ సూత్రంలో మోహ అంటే విభిన్న తరగతుల జ్ఞానం, ముద్రలుగా ఇప్పటికీ మనస్సులో మిగిలి ఉన్నాయి అని అర్ధం. అనుభవం వల్ల ముద్రలు కలుగుతాయి. ఒక వ్యక్తి తన శారీరక స్పృహలను వేరు చేయగలిగినప్పుడు, అనుభవం వల్ల కలిగే ముద్రలు క్రమంగా తగ్గుతాయి మరియు చివరికి ఎటువంటి ముద్రలూ నిలచి వుండవు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 158 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
*Part 3 - āṇavopāya*
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 3-7. mohajayād anantābhogāt sahajavidyājayah   - 2 🌻*

*🌴. With unquestionable conquest of māya, one enters the supreme state of Shiva and gains true knowledge (sahaja vidya) which is natural to the self. 🌴*

*The aspirant is not able to realize the full potential of his inherent knowledge, as he is bound by māyā. When the aspirant is able to go past the influence of māyā, he is able to understand that his true knowledge is nothing but the expansion of the Infinite. Moha is this aphorism means any strains of differentiated knowledge still remaining in the mind as impressions. Impressions are caused by experience. When one is able to isolate his bodily consciousnesses, impressions caused by experience gradually get reduced and ultimately leaving no impressions at all.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

Worship Maa Chandraghanta - Mata Annapurna Devi on the third day of Navratri


🌹 Worship Maa Chandraghanta - Mata Annapurna Devi on the third day of Navratri 🌹

Maa Chandraghanta is the third manifestation of Devi Durga and is worshipped on the 3rd of Navratri. Since she has a Chandra or half moon, in the shape of a Ghanta (bell), on her forehead, she is addressed as Chandraghanta. A symbol of peace, serenity and prosperity, Maa Chandraghanta has three eyes and ten hands holding ten types of swords, weapons and arrows. She establishes justice and gives Her devotees the courage and strength to fight challenges.

Her appearance may be of a source of power which is always busy killing and suppressing the bad and wicked. However, for her devotees, Maa is serene, gentle and peaceful. By worshipping Maa Chrandraghanta, you will open the doors to great respect, fame and glory. Maa also helps you attain spiritual enlightenment. Her idol, which symbolises both beauty and bravery, gives you the strength the keep the negative energy away and repels all the troubles from your life.

You need to follow simple rituals to worship Goddess Chandraghanta. You should first worship all the Gods, Goddesses and Planets in the Kalash and then offer prayer to Lord Ganesha and Kartikeya and Goddess Saraswati, Lakshmi, Vijaya, Jaya - the family members of Goddess Durga. The pooja should be concluded by worshipping Goddess Chandraghanta followed by a heartfelt prayer to Lord Shiva and Lord Brahma.


The Mantra And Other Facts About Maa Chandraghanta:

Maa Chandraghanta Dhyan: Pindaj Pravara Roodha Chand Kopaastra Kairyuta Prasaadam Tanute Mahyam Chandra Ghanteti Vishruta.



Maa Chandraghanta Mantra for the third day of Navratri: 
Om Cham Cham Cham Chandraghantaye Hrum. (Chant 108 times).


Colour of the third day: White.


Prasad of the third day: Revdi i.e. mixture of white sesame seeds and jaggery.


Governing Planet: It is believed that the planet Shukra is governed by Goddess Chandraghanta.


Performing Shukra Grah Shanti Puja proves to be highly beneficial for the native on this day and helps to strengthen weak Venus in the birth chart. It helps you to attain health, wealth, and prosperity.

🌹 🌹 🌹🌹 🌹




దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 3. చంద్రఘంట - అన్నపూర్ణ దేవి / Worship Maa Chandraghanta - Mata Annapurna Devi on the third day of Navratri


🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 3. చంద్రఘంట - అన్నపూర్ణ దేవి / Worship Maa Chandraghanta - Mata Annapurna Devi on the third day of Navratri 🌹

📚 . ప్రసాద్ భరద్వాజ


🌷. 3. చంద్రఘంట ప్రార్ధనా శ్లోకము :

పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥



🌻. శ్రీ అన్నపూర్ణా దేవి స్తోత్రం :

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిలదోషపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ |
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||


🌷. అలంకారము - నివేదనం : అన్నపూర్ణ దేవి - పసుపు రంగు, క్షీరాన్నం, దద్దోజనం, గారెలు


🌷. మహిమ :

దుర్గామాత మూడవ నామమైన చంద్రఘంటా స్వరూపం మిక్కిలి శాంతిప్రదము, కల్యాణకారకము. తన శిరస్సుపై అర్ధచంద్రుడు ఘంటాకృతిగా వుండడం వల్ల ఈ నామం ఏర్పడింది. ఈమెని ఆరాధిస్తే సింహపరాక్రమముతో నిర్భయంగా ఉంటారు. జపమాల,ఘంట, బాణం, పదునైన ఖడ్గం, శ్వేత పద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనుస్సు, కమలం, గద ధరించి మహాలావణ్య శోభతో ప్రకాశిస్తుంది.


🌷. చరిత్ర :

దుర్గామాతయొక్క మూడవ శక్తి నామము ‘చంద్రఘంట’. నవరాత్రి ఉత్సవాలలో మూడవరోజున ఈమె విగ్రహానికే పూజాపురస్కారాలు జరుగుతాయి. ఈ స్వరూపము మిక్కిలి శాంతిప్రదము, కల్యాణ కారకము. ఈమె తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘాంటాకృతిలో ఉండటంవల్ల ఈమెకు ‘చంద్రఘంట’ అనే పేరు స్థిరపడింది. ఈమె శరీరకాంతి బంగారువన్నెలో మిలమిలలాడుతుటుంది. తన పది చేతులలో – ఖడ్గము మొదలయిన శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించి ఉంటుంది. సర్వదా సమరసన్నాహయై యుద్ధముద్రలో ఉండే దివ్య మంగళ స్వరూపం. ఈమె గంటనుండి వెలువడే భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులైన దుష్టులు గడగడలాడిపోతారు.

నవరాత్రి దుర్గాపూజలలో మూడవ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది. ఆ రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది. చంద్రఘంటాదేవి కృపవలన ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం కలుగుతుందని చెబుతారు. దివ్య సుగంధ అనుభవము కూడా సిద్ధిస్తుంది. అలాగే వివిధాలైన దివ్యధ్వనులు కూడా వినిపిస్తాయి. ఈ దివ్యానుభవ అనుభూతికొరకు, సాధకుడు సావధానుడై ఉండాలి.

ఈ మాత కృపవలన సాధకుని సమస్త పాపాలూ, బాధలూ తొలగిపోతాయి. ఈమె ఆరాధన సద్యః ఫలదాయకము. ఈమె నిరంతరమూ యుద్దసన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రముగా నివారిస్తుంది. ఈ సింహవాహనను ఉపాసించేవారు సింహసదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉంటారు. ఈమె ఘాంటానాదము సంతతము భక్తులను భూతప్రేతాది బాధలనుండి కాపాడుతూ ఉంటుంది. ఈమెను సేవించినంతనే శరణాగతుల రక్షణకై అభయఘంట ధ్వనిస్తూ ఉంటుంది.

ఈ దేవీ స్వరూపము దుష్టులను అణచివేయటంలో, హతమార్చుటంలో అను క్షణమూ సన్నద్ధురాలై ఉండునదే; అయినప్పటికీ భక్తులకూ, ఉపాసకులకూ ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగానూ, ప్రశాంతముగానూ కనబడుతూ ఉంటుంది. ఈమెను ఆరాధించడంవల్ల సాధకులలో వీరత్వ నిర్భయత్వములతోపాటు సౌమ్యతా, వినమ్రతలు పెంపొందుతుంటాయి. వారి నేత్రాలలోని కాంతులు, ముఖవర్చస్సు, శరీర శోభలు ఇనుమడిస్తూ, సద్గుణములు వృద్ధిచెందుతుంటాయి. వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్యమాధుర్యము రాశిగా ఏర్పడుతుంది. చంద్రఘంటాదేవిని భజించేవారు, ఉపాసించేవారు ఎక్కడికి వెళ్ళినా వారిని దర్శించిన వారందరూ సుఖశాంతులను పొందుతారు. ఇలాంటి ఉత్తమ సాధకుల శరీరాలనుండి దివ్యమూ, ప్రకాశవంతమూ అయిన తేజస్సు బహిర్గతము అవుతూ ఉంటుంది. ఈ దివ్య ప్రక్రియ సామాన్యులదృష్టికి గోచరించదు. కానీ ఉత్తమ సాధకులూ, వారి అనుయాయులు మాత్రము వీటిని గ్రహించి, అనుభూతిని పొందగలరు.

మనము త్రికరణశుద్ధిగా విధ్యుక్తకర్మలను ఆచరిస్తూ, పవిత్రమైన అంతఃకరణ కలిగి చంద్రఘాంటాదేవిని శరణుజొచ్చి, ఆమెను ఉపాసించడానికీ, ఆరాధించడానికీ తత్పరులమై ఉండాలి. అలాంటి ఉపాసన ప్రభావము వల్ల, మనము సమస్త సాంసారిక కష్టములనుండి విముక్తులమై, సహజంగానే పరమపద ప్రాప్తికి అర్హులమవుతాము. నిరంతరమూ ఈ దేవి పవిత్రమూర్తిని ధ్యానిస్తూ మనము సాధనలో అగ్రగణ్యులమవ్వటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దేవి ధ్యానము మనకు ఇహపర లోకాలలో పరమ కల్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపజేస్తుంది.

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 - 9 / Sri Lalitha Chaitanya Vijnanam - 490 - 494 - 9


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 - 9 / Sri Lalitha Chaitanya Vijnanam - 490 - 494 - 9 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।
దంష్ట్రోజ్జ్వలా, అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀

🍀 101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।
మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀

🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 9 🌻


లోపల వెలుపల అను భేదము దాటినవారే నిజమగు వీరులు. తాను యితరులు అను భేదము దాటినవారు వీరులు. వీరు మెలకువ, స్వప్నము, నిద్ర అను మూడు స్థితులే గాక, నాలుగవ స్థితి యగు తురీయ స్థితిని తెలిసినవారు. ఇట్టి వారిచే శ్రీమాత సృష్టి నిర్వహణము చేయుచు నుండును. వారికి వరములొసగి శక్తివంతులను జేసి కృతకృత్యులను చేయును. దివ్యాకర్షణ గల వాచక శక్తి గలవారిని కూడ వీరులందురు. వారు చేయు దివ్యబోధన ద్వారా జీవులుద్ధరింప బడుచుందురు. వారు బ్రహ్మ రసామృతమును పానము చేయుచు యితరులకు పంచి పెట్టుకొందురు. ఇట్టి వారిని కూడ శ్రీమాత అనుగ్రహించు చుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 485 to 494 - 9 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻100. Anahatabjanilaya shyamabha vadanadvaya
danshtrojvalakshamaladi dhara rudhira sansdhita॥ 100 ॥ 🌻

🌻101. Kalaratryadishaktyao-ghavruta snigdhao-dana priya
mahavirendra varada rakinyanba svarupini ॥ 101 ॥ 🌻

🌻 Description of Nos. 485 to 494 Names - 9 🌻


The real heroes are those who transcend the distinction between inside and outside. Those who transcend the distinction of self and others are heroes. They are aware of not only the three states of waking, dream and sleep, but also the fourth state of Turiya. Srimata manages the Creation through these people. She bestows boons on them and makes them powerful and accomplished. Those with divine attraction of oratory skills are also heroes. They uplift beings through divine teaching. They drink Brahma Rasamrita and distribute it to others. Srimata bestows her grace on such people too.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



Osho Daily Meditations - 56. SETTLING DOWN / ఓషో రోజువారీ ధ్యానాలు - 56. స్థిర పడండి



🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 56 / Osho Daily Meditations - 56 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 56. స్థిర పడండి 🍀

🕉. పనులు సజావుగా సాగితే ప్రేమికులు భయపడతారు. బహుశా ప్రేమ కనుమరుగై పోతోందని వారు భావించడం ప్రారంభిస్తారు. 🕉


ప్రేమ స్థిరపడినప్పుడు అంతా సాఫీగా మారుతుంది. అప్పుడు ప్రేమ మరింత స్నేహంగా మారుతుంది- దాని అందం వేరు. స్నేహం అనేది ప్రేమ యొక్క సారం, సారాంశం. కాబట్టి స్థిరపడండి! చింతించకండి, లేకపోతే ఎదో ఒక రోజు మీరు ఇబ్బందులను సృష్టించడం ప్రారంభిస్తారు. మనస్సు ఎల్లప్పుడూ ఇబ్బందిని సృష్టించాలని కోరుకుంటుంది, తన ప్రాధాన్యత చూపుకోవడం కోసం; ఇబ్బంది లేనప్పుడు, అది అప్రధానంగా మారుతుంది.

మనసు కూడా పోలీస్ విభాగం లాంటిది. నగరం ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉంటే, వారికి బాధగా ఉంటుంది: దోపిడీ లేదు, అల్లర్లు లేవు, హత్యలు లేవు - ఏమీ లేదు! అవి దేనికీ అవసరం లేదు. అంతా నిశ్శబ్దంగా మరియు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనస్సుకు భయం ఉంటుంది, ఎందుకంటే మీరు నిజంగా స్థిరపడితే, మనస్సు ఇక ఉండదు. ఇది గుర్తుంచుకోండి. మనస్సు వెళ్ళి పోవాలి, ఎందుకంటే అది లక్ష్యం కాదు. మనసును దాటి వెళ్లడమే లక్ష్యం. కాబట్టి నిశ్శబ్దంగా ఉండటానికి ఒకరికొకరు సహాయం చేసుకోండి మరియు విషయాలు సజావుగా సాగనివ్వండి. మరొకరు భయాందోళనకు గురైతే, సహాయం చేయడానికి ప్రయత్నించండి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 56 🌹

📚. Prasad Bharadwaj

🍀 56. SETTLING DOWN 🍀

🕉 Lovers become afraid when things go smoothly. They start feeling that perhaps love is disappearing. 🕉


When love settles, everything becomes smooth. Then love becomes more like friendship-and that has a beauty of its own. Friendship is the very cream, the very essence, of love. So settle! And don't be worried, otherwise sooner or later you will start creating trouble. The mind always wants to create trouble, because then it remains important; when there is no trouble, it becomes unimportant.

The mind is just like the police department. If the city is calm and quiet, they feel bad: no robbery, no riot, no murders--nothing! They are not needed for anything. When everything is silent and peaceful, the mind has a fear, because if you really settle, the mind will be no more. Just remember this. The mind has to go, because it is not the goal. The goal is to go beyond the mind. So help each other to be silent, and keep things going smoothly. If the other starts to get panicky, try to help.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



శ్రీమద్భగవద్గీత - 443: 11వ అధ్., శ్లో 29 / Bhagavad-Gita - 443: Chap. 11, Ver. 29

 

🌹. శ్రీమద్భగవద్గీత - 443 / Bhagavad-Gita - 443 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 29 🌴

29. నభ:స్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ |
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాన్తరాత్మా ధృతిం న విన్దామి శమం చ విష్ణో ||


🌷. తాత్పర్యం : చావు కోసం మిడతలు మిక్కిలి వేగంగా మండుతున్న అగ్నిలో ప్రవేశించినట్లే నశించడం కోసం మహావేగంగా నీ నోళ్ళలో ఈ ప్రజలంతా ప్రవేశిస్తున్నారు.

🌷. భాష్యము : యుద్ధ రంగంలో ఏంతో మంది ఉత్తమ రాజులు మరియు యోధులు ఉన్నారు. వారందరూ అది తమ కర్తవ్యముగా పరిగణించి యుద్ధంలో పోరాడారు మరియు యుద్ధరంగంలో తమ ప్రాణములను విడిచి పెట్టారు. అర్జునుడు వారిని నదులు తమకుతామే వచ్చి సముద్రములో కలిసిపోవటంతో పోల్చుతున్నాడు. ఇంకా చాలామంది ఇతరులు స్వార్థం కోసం మరియు దురాశతో యుద్ధ రంగానికి వచ్చారు. అర్జునుడు వారిని, అమాయకత్వంతో ఎర చూపబడి, అగ్నిలో పడి కాలిపోయే పురుగులతో పోల్చుతున్నాడు. ఈ రెంటిలో కూడా, ఆసన్నమైన మృత్యువు వైపు, వారు వడివడిగా పరుగులు పెడుతున్నారు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 443 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 29 🌴

29. yathā pradīptaṁ jvalanaṁpataṅgā viśanti nāśāya samṛddha-vegāḥ
tathaiva nāśāya viśanti lokās tavāpi vaktrāṇi samṛddha-vegāḥ


🌷 Translation : I see all people rushing full speed into Your mouths, as moths dash to destruction in a blazing fire.

🌹 Purport : There were many noble kings and warriors in the war, who fought as their duty and laid down their lives on the battlefield. Arjun compares them to river waves willingly merging into the ocean. There were also many others, who fought out of greed and self-interest. Arjun compares them with moths being lured ignorantly into the incinerating fire. But in both cases, they are marching rapidly toward their imminent death.

🌹 🌹 🌹 🌹 🌹



17 Oct 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 17, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్రఘంట - అన్నపూర్ణ దేవి పూజ, ChandraGhanta - Annapurna Devi Pooja. 🌻


🌷. 3. చంద్రఘంట ప్రార్ధనా శ్లోకము :

పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥


🌷. శ్రీ అన్నపూర్ణా దేవి స్తోత్రం :

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిలదోషపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ |
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||


🌷. అలంకారము - నివేదనం :

అన్నపూర్ణ దేవి - లేత రంగు, కొబ్బరి అన్నం


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : మనస్సు శాంతం కావాలి - మనస్సులో స్థిరమైన శాంతినీ, నిశ్చల నీరవతనూ నెలకొల్పుకోడం సాధనలో చేయవలసిన మొట్టమొదటి పని. లేని యెడల నీ కొకవేళ అనుభవాలు కలిగినా ఏదీ స్థిరంగా వుండదు. శాంతమనస్సు నందే సత్య చేతనను ప్రతిష్ఠించడం సాధ్యమవుతుంది. 🍀


🌷🌷🌷🌷🌷




విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

శరద్‌ ఋతువు, దక్షిణాయణం,

ఆశ్వీజ మాసం

తిథి: శుక్ల తదియ 25:27:43 వరకు

తదుపరి శుక్ల చవితి

నక్షత్రం: విశాఖ 20:32:04 వరకు

తదుపరి అనూరాధ

యోగం: ప్రీతి 09:22:55 వరకు

తదుపరి ఆయుష్మాన్

కరణం: తైతిల 13:20:49 వరకు

వర్జ్యం: 01:25:04 - 03:04:48

మరియు 24:36:50 - 26:14:46

దుర్ముహూర్తం: 08:30:13 - 09:17:08

రాహు కాలం: 14:57:20 - 16:25:19

గుళిక కాలం: 12:01:22 - 13:29:21

యమ గండం: 09:05:25 - 10:33:23

అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:24

అమృత కాలం: 11:23:28 - 13:03:12

సూర్యోదయం: 06:09:27

సూర్యాస్తమయం: 17:53:18

చంద్రోదయం: 08:12:53

చంద్రాస్తమయం: 19:39:04

సూర్య సంచార రాశి: కన్య

చంద్ర సంచార రాశి: తుల

యోగాలు: శ్రీవత్స యోగం - ధన లాభం,

సర్వ సౌఖ్యం 20:32:04 వరకు తదుపరి

వజ్ర యోగం - ఫల ప్రాప్తి

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹