🌹 10 JANUARY 2025 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹

🍀 🌹 10 JANUARY 2025 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹. వైకుంఠ (మోక్షద - ముక్కోటి) ఏకాదశి శుభాకాంక్షలు, Vaikuntta (Mokshada - Mukkoti ) Ekadashi Good Wishes to All 🌹
2) 🌹. వైకుంఠ ఏకాదశి - మోక్షద, ముక్కోటి ఏకాదశి విశిష్టత 🌹
🍀 వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం ద్వారా దైవ దర్శనం వల్ల సకల పాపాలు నశించి, మోక్షం లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి ముక్తి దాయకం. 🍀
https://youtu.be/dCqx2AAVgiU
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 583 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 583 - 3 🌹 
🌻 583. 'ఆత్మవిద్యా’ - 3 / 583. 'Atma Vidya' - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వైకుంఠ (మోక్షద - ముక్కోటి) ఏకాదశి శుభాకాంక్షలు, Vaikuntta (Mokshada - Mukkoti ) Ekadashi Good Wishes to All 🌹*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🍀. వైకుంఠ ఏకాదశి - మోక్షద, ముక్కోటి ఏకాదశి విశిష్టత 🍀*

*మన సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీనినే ముక్కోటి ఏకాదశి అని అంటారు. మూడు + కోటి = ముక్కోటి. ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ఎదురుగా ఉన్న ద్వారాన్ని మూసేసి, ఉత్తర ద్వారాన్ని తెరిచి , ఆ ద్వారం నుండి స్వామి దర్శనాన్ని చేయిస్తారు. ఈ ఉత్తర ద్వారాన్నే వైకుంఠ ద్వారమని అంటారు.* 

*మనకి మొత్తం 26 ఏకాదశులు ఉంటాయి. ఒక సంవత్సరంలో వచ్చేవి 24, వీటికి తోడు అధికమాసంలో వచ్చేవి రెండు. వీటి అన్నిటిలో వైకుంఠ‌ ఏకాదశి చాలా ప్రత్యేకం. మార్గశీర్ష శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అనీ, ముక్కోటి దేవతలు తిరిగే‌ తిథి కనుక ముక్కోటి ఏకాదశి అని, పరమైకాదశి‌ అని, సాక్షాత్తూ విష్ణు స్వరూపం కనుక కృష్ణ‌ ఏకాదశి అనీ కూడా అంటారు. నారాయణుడు పాలసముద్రంలో కార్తీకమాసం శుక్లపక్ష ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. లేచాక మార్గశిర శుక్ల ఏకాదశి వరకు లోక పోషణ కొరకు సంచారం చేస్తాడు‌ ఆ సమయంలో ఆయనని ఆరాధించి, ఉపాసన చేసిన వాళ్ళని రక్షించడం కోసం వైకుంఠం విడిచి, ఒక రూపం ధరించి వైకుంఠానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి 7 ద్వారాలు తెరుచుకుని బయటకు వస్తాడు. అలా లోక రక్షణ కొరకు బయటకు వచ్చే తిథి కనుకే వైకుంఠ ఏకాదశి అని అంటారు.*

*వైకుంఠ ఏకాదశి యొక్క మూలం పద్మ పురాణం యొక్క పురాణంలో ప్రస్తావించ బడింది . ఒకప్పుడు మురాసురుడు అనే అసురుడు ఉండేవాడు. అతను బ్రహ్మ నుండి పొందిన వరం కారణంగా దేవతలకు పీడకలగా తయారయ్యాడు . వారు ఆ అసురునితో పోరాడటానికి విష్ణువు సహాయం కోరారు, కానీ అతనిని ఓడించ లేకపోయాడు. అప్పుడు శ్రీ మహావిష్టువు బదరీకాశ్రమ పరిసరాల్లోని సింహవతి అనే గుహకు ప్రయాణించాడు. మురాసురుడు అతనిని వెంబడించాడు. అక్కడ, విష్ణువు తన దైవిక శక్తితో సృష్టించబడిన యోగమాయ అనే దేవతను పిలిచాడు , ఆమె ఆ అసురుడిని చంపుతుంది. సంతోషించిన విష్ణువు, ఆ దేవతకు 'ఏకాదశి' అనే నామకరణం చేసి, ఆమె భూలోక ప్రజలందరి పాపాలను పోగొట్టగలదని ప్రకటించాడు. వైష్ణవ సంప్రదాయంలో, ఏకాదశి సందర్భంగా ఉపవాసం పాటించి ఈ దేవతను పూజించిన వారందరూ వైకుంఠాన్ని పొందుతారని విశ్వసిస్తారు. ఆ విధంగా ధనుర్మాస శుక్ల పక్ష ఏకాదశి అయిన మొదటి ఏకాదశి వచ్చింది.*

*🌺 వైకుంఠ ఏకాదశి తాత్త్విక సందేశం 🌺*

*విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. నిహితం గుహాయాం విభ్రాజతే. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు (కళ్లు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్లు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం. ఈ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీ వ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.* 

*మరొక పురాణం ప్రకారం, విష్ణువు తన కోసం తపస్సును చేసిన ఇద్దరు అసురుల (రాక్షసులు) కోసం వరంగా తన నివాస ద్వారమైన వైకుంఠ ద్వారం తెరిచాడు. వైకుంఠ ద్వారం అని పిలువబడే ద్వారం నుండి బయటకు వస్తున్న విష్ణుమూర్తిని చూసిన వారు కూడా ఆయనతో పాటు వైకుంఠానికి చేరుకుంటారు. ఈ విధంగా వైష్ణవులు ( విష్ణు భక్తులు ) ఈ రోజున వైకుంఠానికి ద్వారం తెరవబడిందని నమ్ముతారు. అందువల్ల మార్గశీర్ష శుక్ల పక్ష ఏకాదశిని 'మోక్షద ఏకాదశి' అంటారు.* 

*కృత్యోత్సవం తథా భూతం ఏకాదశ్యాం విశేషతః విశంతి మోక్షం తస్మాత్ స మోక్షత్సవ ఇతీర్యతే ॥*

*ముక్కోటి ఏకాదశి వేకువజామున ఉత్తరద్వారం నుండి శ్రీ మహావిష్ణు దర్శనం చేసుకొన్నవారికి మోక్షం తప్పక లభిస్తుంది. కనుక ఈ దర్శనాన్ని మోక్షోత్సవం అంటారు. ఏడాదిలో 26 ఏకాదశుల్లో ఉపవాసం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసంతో లభిస్తుందని చెబుతారు.*

*శైవ శాఖ వారు ఈ రోజును త్రికోటి ఏకాదశిగా పాటిస్తారు. ఈ మతశాఖా పరమైన ఆచారాన్ని అనుసరించేవారు హిందూ దేవతలలోని దేవతలందరూ, ఈ రోజును శివునికి నమస్కరించే తేదీగా భావిస్తారు.*

*తిరుమల గర్భగుడికి వైకుంఠ ద్వారం అనే ప్రత్యేక ప్రవేశం ఉంది . ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే తెరవ బడుతుంది. ఈ ప్రత్యేక రోజున ఈ 'వైకుంఠ ద్వారం' గుండా వెళ్ళే ఎవరైనా వైకుంఠాన్ని పొందుతారని నమ్ముతారు.*

విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి స్వామి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ ప్రదక్షిణనే ముక్కోటి ప్రదక్షిణ అని అంటారు. ఈ రోజున వైకుంఠ ద్వారం ద్వారా దైవ దర్శనంవల్ల సకల పాపాలు నశించి, మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . వైకుంఠ ఏకాదశి - మోక్షద, ముక్కోటి ఏకాదశి విశిష్టత 🌹*
*🍀 వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం ద్వారా దైవ దర్శనం వల్ల సకల పాపాలు నశించి, మోక్షం లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి ముక్తి దాయకం. 🍀*
*ప్రసాద్‌ భరధ్వాజ.*
https://youtu.be/dCqx2AAVgiU

*కృత్యోత్సవం తథా భూతం ఏకాదశ్యాం విశేషతః విశంతి మోక్షం తస్మాత్ స మోక్షత్సవ ఇతీర్యతే ॥*
*ముక్కోటి ఏకాదశి వేకువజామున ఉత్తరద్వారం నుండి శ్రీ మహావిష్ణు దర్శనం చేసుకొన్నవారికి మోక్షం తప్పక లభిస్తుంది. ఈ దర్శనాన్ని మోక్షోత్సవం అంటారు. ఈ వీడియోలో ఇటువంటి వైకుంఠ ఏకాదశి విశిష్టతను, చేయవలసిన విధులను గురించి తెలియజేయడం జరిగింది.* 

*మార్గశీర్ష శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అనీ, ముక్కోటి దేవతలు తిరిగే‌ తిథి కనుక ముక్కోటి ఏకాదశి అని, పరమైకాదశి‌ అని, సాక్షాత్తూ విష్ణు స్వరూపం కనుక కృష్ణ‌ ఏకాదశి అనీ కూడా అంటారు. ముక్కోటి ఏకాదశిని ..హరి ఏకాదశి...మోక్ష ఏకాదశి....సౌఖ్య ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. ఏకాదశీ వ్రతాన్ని నిష్ఠగా ఆచరించిన వారు జ్ఞానవంతులవుతారు. ఏకాదశి సందర్భంగా ఉపవాసం పాటించి ఈ దేవతను పూజించిన వారందరూ వైకుంఠాన్ని పొందుతారని విశ్వసిస్తారు.*
*సబ్‌స్క్రయిబ్ చైతన్య విజ్ఞానం ChaitanyaVijnaanam ఛానల్‌. లైక్ చేయండి, షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ*
*Join Chaitanya Vijnaanam చైతన్య విజ్ఞానం Group*
https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 583 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 583 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 583. 'ఆత్మవిద్యా’ - 3 🌻*

*తనయందు జరుగు స్పందనము, ప్రతి నిత్యము కలుగు ఎఱుక- ఈ రెంటి మూలమేమి? అని భావించుట ప్రారంభమగును. తాను మూలముగ తన యందు, తన ద్వారా చాల వ్యాపారము (activity) జరుగుచుండును. తనకు మూలమేమి? తా నెచ్చట నుండి మేల్కాంచు చున్నాడు? ఏమి ఆధారముగ ప్రాణస్పందన జరుగు చున్నది? తన స్పందనలో స్పందించు తత్త్వమేమి? తన ఎఱుకలోని ఎఱుక యేది? ఇట్టి శోధనలో లోపలికి జీవుని గొనిపోవును. తన మూలమునకు తనను చేర్చును. అప్పుడు తానెఱుగునది అపరిమితమగు వెలుగు. అది కన్నులకు గోచరింపని వెలుగు వెలుగు చీకట్లకు కూడ వెలుగు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 583 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 583. 'Atma Vidya' - 3 🌻*

*The responses occurring within oneself and the awareness experienced daily—what is the root of these? This contemplation marks the beginning of the inquiry. As the origin, the self operates within and facilitates numerous activities. What is the source of this self? From where does it awaken? Upon what foundation does the life force function? What is the essence that manifests in one’s responses? What is the ultimate awareness within consciousness? This investigation gradually leads the seeker inward, guiding them towards their true source. Reaching this source, one realizes that the essence of their awareness is an infinite light—immeasurable, unseen to the eyes, and illuminating even darkness.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad