మైత్రేయ మహర్షి బోధనలు - 144


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 144 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 108. దేవ దానవులు -1🌻


మానవులకు దైవమిచ్చిన వరము సంకల్ప బలము, బుద్ధి. సంకల్ప బలము మహిమ మానవులకు పూర్ణముగ తెలియదు. తెలిసిన సరిసమానమగు బుద్ధి బలము లేనప్పుడు రాక్షసులగుచున్నారు. సంకల్ప బలమునకు బుద్ధి బలము తోడై నిలచినచో మానవుని పురోగతి త్వరిత గతిని సాగగలదు. సంకల్పబలము కుమారుని వంటిది. బుద్ధిబలము గణపతి వంటిది. గ్రహ పరముగ సంకల్ప బలము కుజగ్రహము నుండి, బుద్ది బలము బృహస్పతి నుండి, మానవులకు లభించు చుండును.

పై కారణముగనే తెలిసిన వారైన హిందువులు శివతనయుని పార్వతీ తనయుని ప్రార్థింతురు. పూర్వకాలమున సంకల్పము కలిగిన మానవులు పర్వతములను సైతము అట్టి బలముచే కదిలించుట, స్థలమార్పు చేయుట వంటివి గావించినారు. అది ప్రస్తుతము మహాత్మ్యముగ కనపడ వచ్చును. అది మహాత్మ్యము కాదు, మాగ్నటిజమ్ అయస్కాంతశక్తి.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


05 Jul 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 205


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 205 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనసుకి అంతం పలకడమంటే ధ్యానానికి జన్మనివ్వడం. ఎప్పుడు ధ్యానం ఆరంభమవుతుందో అద్భుతాలు మొదలవుతాయి. జ్ఞానం అస్తిత్వాన్ని రూపాంతం చెందించలేదు. అస్తిత్వాన్ని రూపాంతరం చెందించాలనుకున్న వ్యక్తి దాన్ని దాటి వెళ్ళాలి.🍀


సమాచార సేకరణని పక్కన పెట్టు. దానికి పులుస్టాఫ్ పెట్టు. కారణం అది చిలుక పలుకులు పలికిస్తుంది. ఆ చిలుకల్ని పండితులంటారు. ఆ పలుకులు ఎవర్నీ ప్రేమపూరితం చేయవు. ఆ సమాచారాన్ని పక్కన పెట్టు. అంటే మనసుని మాయం చెయ్యి అని అర్థం. మనసుకి అంతం పలకడమంటే ధ్యానానికి జన్మనివ్వడం.

ఎప్పుడు ధ్యానం ఆరంభమవుతుందో అద్భుతాలు మొదలవుతాయి. జీవితం పెద్ద పెద్ద అంగలు వేస్తూ కదుల్తుంది. వ్యక్తి తన చుట్టూ వున్న అద్భుతాల పట్ల స్పృహలోకి వస్తాడు. కానీ మనం ముడుచుకున్నాం. మన జ్ఞానం వల్ల మనం అంధులయ్యాం. వ్యక్తి పసిపాపలాగా అమాయకుడు కావాలి. ఒకసారి అమాయకుడయితే పరిశుభ్రమైన, స్వచ్ఛమైన అద్దంలా మారుతాడు. అపుడు వ్యక్తి సత్యాన్ని ప్రతిఫలిస్తాడు. సత్యాన్ని గ్రహించడమంటే సత్యంగా మారడం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


05 Jul 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 305 - 31. ఒకరి ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం / DAILY WISDOM - 305 - 31. Recovering One's Spiritual Health


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 305 / DAILY WISDOM - 305 🌹

🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 31. ఒకరి ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం 🌻


యోగాభ్యాసం అద్భుతమైనది, ఎందుకంటే అది శాస్త్ర వివరణలకు మూలమైన మనస్సు యొక్క ఆత్మహత్యలా కనిపిస్తుంది. ఇది కేవలం అనుభావిక విషయమైన మనస్సు యొక్క ఆత్మహత్య. ఆ మనస్సు మరణిస్తే తన స్వయమే మరణించినట్లుగా భావిస్తారు. ఇక్కడ, వ్యక్తి రూపంలో ప్రతిబింబించే వ్యవహారిక వాస్తవికత దాని అసలు మూలమైన విశ్వా నుభూతి లోకి తిరిగి వస్తుంది - ఇదే అనుభావిక పార్శ్వం మరణించడం అంటే.

ఇదే నిజం. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు అనారోగ్యం నశిస్తుంది. ఇది అనారోగ్యం యొక్క ఆత్మహత్య. ఆరోగ్యం బాగుపడాలంటే వ్యాధి నాశనమవుతుంది. కానీ ఆరోగ్యం విలువైనది కాబట్టి అది ఆత్మహత్య అని చెప్పలేము. వ్యాధి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పగలమా? కానీ, ఒక కోణంలో ఇది నిజమే. అయితే ఇది జీవి యొక్క అసలు స్థితి యొక్క పునరుద్ధరణ. దీనినే ఆరోగ్యం అంటారు. విశ్వవ్యాపకత్వం మరియు అంతరానుభూతి కలిగి ఉండే ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పునరుద్ధరించటమే యోగం యొక్క ముఖ్య ఉద్దేశం.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 305 🌹

🍀 📖 from The Study and Practice of Yoga 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 31. Recovering One's Spiritual Health 🌻


The yoga practice is terrific in the sense that when we deal with the so-called subject of knowledge which is the mind, we find that we are killing ourselves, as it were. It is like a suicide committed by the so-called empirical subject. And the worst thing that one can conceive of is suicide—death of one's own self. Here, the return of the reflected reality in the form of the individual to its original source—an absorption of the objective character of knowledge into its universal subjectivity—is the so-called death of its empirical existence.

Well, it is true. When we become healthy, sickness is destroyed. It is a suicide of illness. There is a destruction of disease when we are to recover health. But it is worthwhile; we cannot say it is suicide. Can we say that the disease is committing suicide? Well, it is so, in one sense. But yet it is a recovery of the original status of the organism—that is called health. Thus is the necessity by the practice of yoga to recover one's spiritual health, which is universality of nature and pure subjectivity of existence.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


05 Jul 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 626 / Vishnu Sahasranama Contemplation - 626


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 626 / Vishnu Sahasranama Contemplation - 626🌹

🌻626. అనీశః, अनीशः, Anīśaḥ🌻

ఓం అనీశాయ నమః | ॐ अनीशाय नमः | OM Anīśāya namaḥ


న విద్యతే హరేరీశ ఇత్యేషోఽనీశ ఈర్యతే ।
న తస్యేశే కశ్చనేతి శ్రుతిశీర్షసమీరణాత్ ॥

ఈతనికి ఈతని పైన తన ప్రభుత్వమును చూపగల ఈశుడు ఎవ్వరును లేరు గనుక ఆ హరి అనీశుడు.


:: పోతన భాగవతము ద్వితీయ స్కంధము ::

చ. తలకొని యమ్మహాత్మకుఁడు దాల్చిన యయ్యవతారకర్మముల్‍
వెలయఁగ నస్మదాదులము వేయి విధంబుల సన్నుతింతు, మ
య్యలఘు ననంతునిం జిదచిదాత్మకు నాద్యు ననీశు నీశ్వరుం
దెలియఁగ నేర్తుమే తవిలి? దివ్య చరిత్రున కేను మ్రొక్కెదన్‍. (109)

ఆ మహాత్ముడు జగర్దక్షణకు పూనుకొని ఆయా అవతారములలో చేసిన పనులు మా బోంట్లం వేయి విధాల వినుతిస్తూ వుంటాము. మహామహుడూ, తుదిలేనివాడూ, చిదచిత్స్వరూపుడూ, మొదటివాడూ, తనకు ప్రభువు అన్నవాడు లేనివాడూ, తానే ప్రభువైనవాడూ అయిన ఆ దేవుని ఎంత ప్రయత్నించినా మనము తెలుసుకోగలమా? దివ్యశీలుడైన ఆ దేవదేవునకు నేను నమస్కరిస్తాను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 626🌹

🌻626. Anīśaḥ🌻

OM Anīśāya namaḥ


न विद्यते हरेरीश इत्येषोऽनीश ईर्यते ।
न तस्येशे कश्चनेति श्रुतिशीर्षसमीरणात् ॥

Na vidyate harerīśa ityeṣo’nīśa īryate,
Na tasyeśe kaścaneti śrutiśīrṣasamīraṇāt.

Since Lord Hari has no Lord superior to Him, He is called Anīśaḥ.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥

ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥

Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


05 Jul 2022

05 Jul 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹05, July 2022 పంచాగము - Panchagam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ



🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻


🍀. హనుమ భుజంగ స్తోత్రం - 9 🍀

15. నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యం

నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం

నమస్తే సదా రామభక్తాయ తుభ్యం

నమస్తే కృతామర్త్యకార్యాయ తుభ్యం


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : మన జీవితాలలో అశాంతికి మనమే కారకులము. మన ఆలోచనలలోని ఆర్ధము లేని కోరికలే మనల్ని తీవ్ర అశాంతికి గురి చేస్తున్నాయని గ్రహించండి. - మాస్టర్‌ ఆర్‌.కె.🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, ఆషాడ మాసం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: శుక్ల షష్టి 19:29:51 వరకు

తదుపరి శుక్ల-సప్తమి

నక్షత్రం: పూర్వ ఫల్గుణి 10:31:51

వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి

యోగం: వ్యతీపాత 12:15:02

వరకు తదుపరి వరియాన

కరణం: కౌలవ 07:04:20 వరకు

వర్జ్యం: 18:05:12 - 19:46:08

దుర్ముహూర్తం: 08:24:09 - 09:16:42

రాహు కాలం: 15:37:39 - 17:16:11

గుళిక కాలం: 12:20:36 - 13:59:08

యమ గండం: 09:03:34 - 10:42:05

అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:46

అమృత కాలం: 03:38:44 - 05:21:48

మరియు 28:10:48 - 29:51:44

సూర్యోదయం: 05:46:30

సూర్యాస్తమయం: 18:54:42

వైదిక సూర్యోదయం: 05:50:21

వైదిక సూర్యాస్తమయం: 18:50:51

చంద్రోదయం: 10:48:02

చంద్రాస్తమయం: 23:24:29

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: సింహం

ధూమ్ర యోగం - కార్య భంగం,

సొమ్ము నష్టం 10:31:51 వరకు

తదుపరి ధాత్రి యోగం - కార్య జయం


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹


05 - JULY - 2022 TUESDAY MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 05, జూలై 2022 మంగళవారం, భౌమ వాసరే Sunday 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 227 / Bhagavad-Gita - 227 - 5- 23 కర్మ యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 626 / Vishnu Sahasranama Contemplation - 626🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 305 / DAILY WISDOM - 305🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 205 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 144 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹05, July 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. హనుమ భుజంగ స్తోత్రం - 9 🍀*

*15. నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యం*
*నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం*
*నమస్తే సదా రామభక్తాయ తుభ్యం*
*నమస్తే కృతామర్త్యకార్యాయ తుభ్యం*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మన జీవితాలలో అశాంతికి మనమే కారకులము. మన ఆలోచనలలోని ఆర్ధము లేని కోరికలే మనల్ని తీవ్ర అశాంతికి గురి చేస్తున్నాయని గ్రహించండి. - మాస్టర్‌ ఆర్‌.కె.🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, ఆషాడ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల షష్టి 19:29:51 వరకు
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 10:31:51
వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: వ్యతీపాత 12:15:02
వరకు తదుపరి వరియాన
కరణం: కౌలవ 07:04:20 వరకు
వర్జ్యం: 18:05:12 - 19:46:08
దుర్ముహూర్తం: 08:24:09 - 09:16:42
రాహు కాలం: 15:37:39 - 17:16:11
గుళిక కాలం: 12:20:36 - 13:59:08
యమ గండం: 09:03:34 - 10:42:05
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:46
అమృత కాలం: 03:38:44 - 05:21:48
మరియు 28:10:48 - 29:51:44
సూర్యోదయం: 05:46:30
సూర్యాస్తమయం: 18:54:42
వైదిక సూర్యోదయం: 05:50:21
వైదిక సూర్యాస్తమయం: 18:50:51
చంద్రోదయం: 10:48:02
చంద్రాస్తమయం: 23:24:29
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: సింహం
ధూమ్ర యోగం - కార్య భంగం, 
సొమ్ము నష్టం 10:31:51 వరకు 
తదుపరి ధాత్రి యోగం - కార్య జయం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 227 / Bhagavad-Gita - 227 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 23 🌴*

*23. శక్నోతీహైవ య: సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్ |*
*కామక్రోధోద్భవం వేగం స యుక్త: స సుఖీ నర: ||*

🌷. తాత్పర్యం :
*దేహమును విడుచుటకు పూర్వమే ఇంద్రియముల కోరికలను అదుపు చేయగలిగిన వాడు, కామక్రోధ వేగమును అణచగలిగిన వాడు దివ్యస్థితి యందున్నట్టివాడై ఈ జగము నందు సుఖవంతుడగును.*

🌷. భాష్యము :
*ఆత్మానుభవమార్గమున స్థిరమైన పురోభివృద్దిని గోరువాడు ఇంద్రియ వేగమును అణుచుటకు యత్నింపవలెను. వాచవేగము, క్రోధవేగము, మనోవేగము, ఉదరవేగము, ఉపస్థవేగము, జిహ్వావేగము అను పలు ఇంద్రియవేగములు కలవు. ఈ వివిదేంద్రియ వేగములను మరియు మనస్సును అదుపు చేయగలిగినవాడు గోస్వామి లేదా స్వామి యని పిలువబడును. అట్టి గోస్వాములు నిష్ఠగా నియమజీవనము పాటించుచు, సర్వవిధములైన ఇంద్రియవేగముల నుండి దూరులై యుందురు.*

*కోరికలను సంతృప్తి నొందనప్పడు అవి క్రోధమును కలిగించును. తత్కారణముగా మనస్సు, కన్నులు, హృదయము ఉద్విగ్నమగును. కనుకనే ఈ భౌతికదేహమును విడుచుటకు పూర్వమే ప్రతియొక్కరు ఆ ఇంద్రియ, మనోవేగములను నియమించుటను అభ్యసించవలెను. అట్లు చేయగలిగినవాడు ఆత్మానుభవమును పొందినవాడని భావింపబడును. అట్టి ఆత్మానుభవస్థితి యందు అతడు పూర్ణానందము ననుభవించును. కనుక కోరిక, క్రోధములను తీవ్రముగా అణుచుటకు యత్నించుటయే ఆధ్యాత్మికజ్ఞాన సంపన్నున విధ్యుక్తధర్మమై యున్నది.*
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 227 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 5 - Karma Yoga - 23 🌴*

*23. śaknotīhaiva yaḥ soḍhuṁ prāk śarīra-vimokṣaṇāt*
*kāma-krodhodbhavaṁ vegaṁ sa yuktaḥ sa sukhī naraḥ*

🌷 Translation : 
*Before giving up this present body, if one is able to tolerate the urges of the material senses and check the force of desire and anger, he is well situated and is happy in this world.*

🌹 Purport :
*If one wants to make steady progress on the path of self-realization, he must try to control the forces of the material senses. There are the forces of talk, forces of anger, forces of mind, forces of the stomach, forces of the genitals, and forces of the tongue. One who is able to control the forces of all these different senses, and the mind, is called gosvāmī, or svāmī. Such gosvāmīs live strictly controlled lives and forgo altogether the forces of the senses.*

*Material desires, when unsatiated, generate anger, and thus the mind, eyes and chest become agitated. Therefore, one must practice to control them before one gives up this material body. One who can do this is understood to be self-realized and is thus happy in the state of self-realization. It is the duty of the transcendentalist to try strenuously to control desire and anger.*
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://www.tumblr.com/blog/bhagavadgitawisdom
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 626 / Vishnu Sahasranama Contemplation - 626🌹*

*🌻626. అనీశః, अनीशः, Anīśaḥ🌻*

*ఓం అనీశాయ నమః | ॐ अनीशाय नमः | OM Anīśāya namaḥ*

న విద్యతే హరేరీశ ఇత్యేషోఽనీశ ఈర్యతే ।
న తస్యేశే కశ్చనేతి శ్రుతిశీర్షసమీరణాత్ ॥

ఈతనికి ఈతని పైన తన ప్రభుత్వమును చూపగల ఈశుడు ఎవ్వరును లేరు గనుక ఆ హరి అనీశుడు.

:: పోతన భాగవతము ద్వితీయ స్కంధము ::
చ. తలకొని యమ్మహాత్మకుఁడు దాల్చిన యయ్యవతారకర్మముల్‍
     వెలయఁగ నస్మదాదులము వేయి విధంబుల సన్నుతింతు, మ
     య్యలఘు ననంతునిం జిదచిదాత్మకు నాద్యు ననీశు నీశ్వరుం
     దెలియఁగ నేర్తుమే తవిలి? దివ్య చరిత్రున కేను మ్రొక్కెదన్‍. (109)

ఆ మహాత్ముడు జగర్దక్షణకు పూనుకొని ఆయా అవతారములలో చేసిన పనులు మా బోంట్లం వేయి విధాల వినుతిస్తూ వుంటాము. మహామహుడూ, తుదిలేనివాడూ, చిదచిత్స్వరూపుడూ, మొదటివాడూ, తనకు ప్రభువు అన్నవాడు లేనివాడూ, తానే ప్రభువైనవాడూ అయిన ఆ దేవుని ఎంత ప్రయత్నించినా మనము తెలుసుకోగలమా? దివ్యశీలుడైన ఆ దేవదేవునకు నేను నమస్కరిస్తాను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 626🌹*

*🌻626. Anīśaḥ🌻*

*OM Anīśāya namaḥ*

न विद्यते हरेरीश इत्येषोऽनीश ईर्यते ।
न तस्येशे कश्चनेति श्रुतिशीर्षसमीरणात् ॥

Na vidyate harerīśa ityeṣo’nīśa īryate,
Na tasyeśe kaścaneti śrutiśīrṣasamīraṇāt.

Since Lord Hari has no Lord superior to Him, He is called Anīśaḥ.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka

उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥

ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥

Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 305 / DAILY WISDOM - 305 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 31. ఒకరి ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం 🌻*

*యోగాభ్యాసం అద్భుతమైనది, ఎందుకంటే అది శాస్త్ర వివరణలకు మూలమైన మనస్సు యొక్క ఆత్మహత్యలా కనిపిస్తుంది. ఇది కేవలం అనుభావిక విషయమైన మనస్సు యొక్క ఆత్మహత్య. ఆ మనస్సు మరణిస్తే తన స్వయమే మరణించినట్లుగా భావిస్తారు. ఇక్కడ, వ్యక్తి రూపంలో ప్రతిబింబించే వ్యవహారిక వాస్తవికత దాని అసలు మూలమైన విశ్వా నుభూతి లోకి తిరిగి వస్తుంది - ఇదే అనుభావిక పార్శ్వం మరణించడం అంటే.*

*ఇదే నిజం. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు అనారోగ్యం నశిస్తుంది. ఇది అనారోగ్యం యొక్క ఆత్మహత్య. ఆరోగ్యం బాగుపడాలంటే వ్యాధి నాశనమవుతుంది. కానీ ఆరోగ్యం విలువైనది కాబట్టి అది ఆత్మహత్య అని చెప్పలేము. వ్యాధి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పగలమా? కానీ, ఒక కోణంలో ఇది నిజమే. అయితే ఇది జీవి యొక్క అసలు స్థితి యొక్క పునరుద్ధరణ. దీనినే ఆరోగ్యం అంటారు. విశ్వవ్యాపకత్వం మరియు అంతరానుభూతి కలిగి ఉండే ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పునరుద్ధరించటమే యోగం యొక్క ముఖ్య ఉద్దేశం.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 305 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 31. Recovering One's Spiritual Health 🌻*

*The yoga practice is terrific in the sense that when we deal with the so-called subject of knowledge which is the mind, we find that we are killing ourselves, as it were. It is like a suicide committed by the so-called empirical subject. And the worst thing that one can conceive of is suicide—death of one's own self. Here, the return of the reflected reality in the form of the individual to its original source—an absorption of the objective character of knowledge into its universal subjectivity—is the so-called death of its empirical existence.*

*Well, it is true. When we become healthy, sickness is destroyed. It is a suicide of illness. There is a destruction of disease when we are to recover health. But it is worthwhile; we cannot say it is suicide. Can we say that the disease is committing suicide? Well, it is so, in one sense. But yet it is a recovery of the original status of the organism—that is called health. Thus is the necessity by the practice of yoga to recover one's spiritual health, which is universality of nature and pure subjectivity of existence.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 205 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మనసుకి అంతం పలకడమంటే ధ్యానానికి జన్మనివ్వడం. ఎప్పుడు ధ్యానం ఆరంభమవుతుందో అద్భుతాలు మొదలవుతాయి. జ్ఞానం అస్తిత్వాన్ని రూపాంతం చెందించలేదు. అస్తిత్వాన్ని రూపాంతరం చెందించాలనుకున్న వ్యక్తి దాన్ని దాటి వెళ్ళాలి.🍀*

*సమాచార సేకరణని పక్కన పెట్టు. దానికి పులుస్టాఫ్ పెట్టు. కారణం అది చిలుక పలుకులు పలికిస్తుంది. ఆ చిలుకల్ని పండితులంటారు. ఆ పలుకులు ఎవర్నీ ప్రేమపూరితం చేయవు. ఆ సమాచారాన్ని పక్కన పెట్టు. అంటే మనసుని మాయం చెయ్యి అని అర్థం. మనసుకి అంతం పలకడమంటే ధ్యానానికి జన్మనివ్వడం.*

*ఎప్పుడు ధ్యానం ఆరంభమవుతుందో అద్భుతాలు మొదలవుతాయి. జీవితం పెద్ద పెద్ద అంగలు వేస్తూ కదుల్తుంది. వ్యక్తి తన చుట్టూ వున్న అద్భుతాల పట్ల స్పృహలోకి వస్తాడు. కానీ మనం ముడుచుకున్నాం. మన జ్ఞానం వల్ల మనం అంధులయ్యాం. వ్యక్తి పసిపాపలాగా అమాయకుడు కావాలి. ఒకసారి అమాయకుడయితే పరిశుభ్రమైన, స్వచ్ఛమైన అద్దంలా మారుతాడు. అపుడు వ్యక్తి సత్యాన్ని ప్రతిఫలిస్తాడు. సత్యాన్ని గ్రహించడమంటే సత్యంగా మారడం.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 144 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 108. దేవ దానవులు -1🌻*

*మానవులకు దైవమిచ్చిన వరము సంకల్ప బలము, బుద్ధి. సంకల్ప బలము మహిమ మానవులకు పూర్ణముగ తెలియదు. తెలిసిన సరిసమానమగు బుద్ధి బలము లేనప్పుడు రాక్షసులగుచున్నారు. సంకల్ప బలమునకు బుద్ధి బలము తోడై నిలచినచో మానవుని పురోగతి త్వరిత గతిని సాగగలదు. సంకల్పబలము కుమారుని వంటిది. బుద్ధిబలము గణపతి వంటిది. గ్రహ పరముగ సంకల్ప బలము కుజగ్రహము నుండి, బుద్ది బలము బృహస్పతి నుండి, మానవులకు లభించు చుండును.*

*పై కారణముగనే తెలిసిన వారైన హిందువులు శివతనయుని పార్వతీ తనయుని ప్రార్థింతురు. పూర్వకాలమున సంకల్పము కలిగిన మానవులు పర్వతములను సైతము అట్టి బలముచే కదిలించుట, స్థలమార్పు చేయుట వంటివి గావించినారు. అది ప్రస్తుతము మహాత్మ్యముగ కనపడ వచ్చును. అది మహాత్మ్యము కాదు, మాగ్నటిజమ్ అయస్కాంతశక్తి.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #ChaitanyaVijnanam #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹