నిర్మల ధ్యానాలు - ఓషో - 205
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 205 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనసుకి అంతం పలకడమంటే ధ్యానానికి జన్మనివ్వడం. ఎప్పుడు ధ్యానం ఆరంభమవుతుందో అద్భుతాలు మొదలవుతాయి. జ్ఞానం అస్తిత్వాన్ని రూపాంతం చెందించలేదు. అస్తిత్వాన్ని రూపాంతరం చెందించాలనుకున్న వ్యక్తి దాన్ని దాటి వెళ్ళాలి.🍀
సమాచార సేకరణని పక్కన పెట్టు. దానికి పులుస్టాఫ్ పెట్టు. కారణం అది చిలుక పలుకులు పలికిస్తుంది. ఆ చిలుకల్ని పండితులంటారు. ఆ పలుకులు ఎవర్నీ ప్రేమపూరితం చేయవు. ఆ సమాచారాన్ని పక్కన పెట్టు. అంటే మనసుని మాయం చెయ్యి అని అర్థం. మనసుకి అంతం పలకడమంటే ధ్యానానికి జన్మనివ్వడం.
ఎప్పుడు ధ్యానం ఆరంభమవుతుందో అద్భుతాలు మొదలవుతాయి. జీవితం పెద్ద పెద్ద అంగలు వేస్తూ కదుల్తుంది. వ్యక్తి తన చుట్టూ వున్న అద్భుతాల పట్ల స్పృహలోకి వస్తాడు. కానీ మనం ముడుచుకున్నాం. మన జ్ఞానం వల్ల మనం అంధులయ్యాం. వ్యక్తి పసిపాపలాగా అమాయకుడు కావాలి. ఒకసారి అమాయకుడయితే పరిశుభ్రమైన, స్వచ్ఛమైన అద్దంలా మారుతాడు. అపుడు వ్యక్తి సత్యాన్ని ప్రతిఫలిస్తాడు. సత్యాన్ని గ్రహించడమంటే సత్యంగా మారడం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
05 Jul 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment