విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 626 / Vishnu Sahasranama Contemplation - 626


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 626 / Vishnu Sahasranama Contemplation - 626🌹

🌻626. అనీశః, अनीशः, Anīśaḥ🌻

ఓం అనీశాయ నమః | ॐ अनीशाय नमः | OM Anīśāya namaḥ


న విద్యతే హరేరీశ ఇత్యేషోఽనీశ ఈర్యతే ।
న తస్యేశే కశ్చనేతి శ్రుతిశీర్షసమీరణాత్ ॥

ఈతనికి ఈతని పైన తన ప్రభుత్వమును చూపగల ఈశుడు ఎవ్వరును లేరు గనుక ఆ హరి అనీశుడు.


:: పోతన భాగవతము ద్వితీయ స్కంధము ::

చ. తలకొని యమ్మహాత్మకుఁడు దాల్చిన యయ్యవతారకర్మముల్‍
వెలయఁగ నస్మదాదులము వేయి విధంబుల సన్నుతింతు, మ
య్యలఘు ననంతునిం జిదచిదాత్మకు నాద్యు ననీశు నీశ్వరుం
దెలియఁగ నేర్తుమే తవిలి? దివ్య చరిత్రున కేను మ్రొక్కెదన్‍. (109)

ఆ మహాత్ముడు జగర్దక్షణకు పూనుకొని ఆయా అవతారములలో చేసిన పనులు మా బోంట్లం వేయి విధాల వినుతిస్తూ వుంటాము. మహామహుడూ, తుదిలేనివాడూ, చిదచిత్స్వరూపుడూ, మొదటివాడూ, తనకు ప్రభువు అన్నవాడు లేనివాడూ, తానే ప్రభువైనవాడూ అయిన ఆ దేవుని ఎంత ప్రయత్నించినా మనము తెలుసుకోగలమా? దివ్యశీలుడైన ఆ దేవదేవునకు నేను నమస్కరిస్తాను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 626🌹

🌻626. Anīśaḥ🌻

OM Anīśāya namaḥ


न विद्यते हरेरीश इत्येषोऽनीश ईर्यते ।
न तस्येशे कश्चनेति श्रुतिशीर्षसमीरणात् ॥

Na vidyate harerīśa ityeṣo’nīśa īryate,
Na tasyeśe kaścaneti śrutiśīrṣasamīraṇāt.

Since Lord Hari has no Lord superior to Him, He is called Anīśaḥ.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥

ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥

Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


05 Jul 2022

No comments:

Post a Comment