🌹 24, JULY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

🍀🌹 24, JULY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 24, JULY 2023 MONDAY సోమవారం, ఇందు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 210 / Kapila Gita - 210🌹 
🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 20 / 5. Form of Bhakti - Glory of Time - 20 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 802 / Vishnu Sahasranama Contemplation - 802 🌹 
🌻802. సర్వవాగీశ్వరేశ్వరః, सर्ववागीश्वरेश्वरः, Sarvavāgīśvareśvaraḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 763 / Sri Siva Maha Purana - 763 🌹
🌻. దేవాసుర యుధ్ధము - 4 / The battle of the gods - 4 🌻
5) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 017 / Osho Daily Meditations - 017 🌹 
🍀17. అజ్ఞానం / 17.  IGNORANCE 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 466 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 466 - 1 🌹 
🌻 466. ‘సూక్ష్మరూపిణి’ - 1 / 466. 'Sukshmarupini' - 1🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 24, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 40 🍀*

*81. సిద్ధార్థకారీ సిద్ధార్థశ్ఛందోవ్యాకరణోత్తరః |*
*సింహనాదః సింహదంష్ట్రః సింహగః సింహవాహనః*
*82. ప్రభావాత్మా జగత్కాలస్థాలో లోకహితస్తరుః |*
*సారంగో నవచక్రాంగః కేతుమాలీ సభావనః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : తోటి మానవుల యెడ ప్రేమ, సానుభూతి - తోటి మానవుల యెడ ప్రేమ, సానుభూతి లేకుండా వుండడం ఈశ్వర సాన్నిహిత్యానికి అవసరమని సాధకుడు తలపోయరాదు. ఈశ్వరసాన్ని హిత్య సమైక్య భావాల ద్వారా అతడు పొందగల దివ్యజ్ఞానానుభూతిలో ఇతరులతోడి సాన్నిహిత్య, సమైక్య భావాలు సైతం అంతర్భూతములే. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల షష్టి 13:44:00 వరకు
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: హస్త 22:13:11 వరకు
తదుపరి చిత్ర
యోగం: శివ 14:52:06 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: తైతిల 13:40:00 వరకు
వర్జ్యం: 05:02:45 - 06:48:25
మరియు 30:50:00 - 32:33:24
దుర్ముహూర్తం: 12:48:29 - 13:40:27
మరియు 15:24:24 - 16:16:22
రాహు కాలం: 07:30:09 - 09:07:36
గుళిక కాలం: 13:59:57 - 15:37:24
యమ గండం: 10:45:03 - 12:22:30
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 15:36:45 - 17:22:25
సూర్యోదయం: 05:52:43
సూర్యాస్తమయం: 18:52:17
చంద్రోదయం: 10:59:39
చంద్రాస్తమయం: 23:06:59
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: వజ్ర యోగం - ఫల
ప్రాప్తి 22:13:11 వరకు తదుపరి
ముద్గర యోగం - కలహం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 210 / Kapila Gita - 210 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 20 🌴*

*20. యథా వాతరథో ఘ్రాణమావృంక్తే గంధ ఆశయాత్|*
*ఏవం యోగరతం చేతః ఆత్మానమవికారి యత్॥*

*తాత్పర్యము : పుష్పముల పరిమళము వాయువు ద్వారా ఘ్రాణేంద్రియమునకు చేరినట్లు, భక్తియోగ తత్పరుడైన పురుషుని చిత్తము రాగద్వేషాది వికార శూన్యమై పరమాత్మను చేరును.*

*వ్యాఖ్య : భక్తి యోగమంటే ఏమిటి, ఏది ఉత్తమ భక్తి యోగం, అది ఎలా కలుగుతుంది, అది కలిగిన వాడు ఏమి పొనుతాడు అనేది ఈ పై ఇరవై శ్లోకాలలో చెప్పాడు.సంసారములో ఉండి ఆశా పాశాలకు కట్టుబడిన వాడు ఇంత మురికిలో ఉండి కూడా ఇవన్నీ పొందగలరా? ఇన్ని బంధాలు ఉన్నప్పుడు, అడ్డంకులు ఉన్నప్పుడు, ఇంత మురికి మన చుట్టూ ఉన్నప్పుడు, ఇవి కాదని మనం భగవంతుని చేరగలమా? మన ప్రయత్నముతో చేయగలమా? కొన్ని మన ప్రయత్నం లేకుండా అవుతాయి. ఉదా: వాయును ఆవేశించి పుష్పము యొక్క సుగంధము మన నాసికను చేరి శుభ్రపరుస్తుంది.దానికి మనం చేయాల్సింది మన ఘ్రాణం ఆ పూల తోట దగ్గరలో ఉండాలి. అలాగే మన చిత్తం యోగాన్ని ఆశ్రయించి ఆ మార్గములో ఉంటే ప్రయత్నం లేకుండానే చేరుతుంది. మన మనసు పరమాత్మను చేరినట్లు ధ్యానం చేస్తున్నట్లు ఎలా తెలుస్తుంది. అలాంటి వాడు ఎలా ఉంటాడు? పరమ కోపిష్టీ ఆరాధన చేస్తున్నాడు, పరమ సాత్వికుడూ ఆరాధన చేస్తున్నాడు. వీరిలో ఎవరు ఎవరని ఎలా గుర్తించాలి?*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 210 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 5. Form of Bhakti - Glory of Time - 20 🌴*

*20. yathā vāta-ratho ghrāṇam āvṛṅkte gandha āśayāt*
*evaṁ yoga-rataṁ ceta ātmānam avikāri yat*

*MEANING : As the chariot of air carries an aroma from its source and immediately catches the sense of smell, similarly, one who constantly engages in devotional service, in Kṛṣṇa consciousness, can catch the Supreme Soul, who is equally present everywhere.*

*PURPORT : As a breeze carrying a pleasant fragrance from a garden of flowers at once captures the organ of smell, so one's consciousness, saturated with devotion, can at once capture the transcendental existence of the Supreme Personality of Godhead, who, in His Paramātmā feature, is present everywhere, even in the heart of every living being. It is stated in Bhagavad-gītā that the Supreme Personality of Godhead is kṣetra jña, present within this body, but He is also simultaneously present in every other body. Since the individual soul is present only in a particular body, he is altered when another individual soul does not cooperate with him. The Supersoul, however, is equally present everywhere. Individual souls may disagree, but the Supersoul, being equally present in every body, is called unchanging, or avikāri. The individual soul, when fully saturated with Kṛṣṇa consciousness, can understand the presence of the Supersoul. It is confirmed in Bhagavad-gītā that (bhaktyā mām abhijānāti (BG 18.55)) a person saturated with devotional service in full Kṛṣṇa consciousness can understand the Supreme Personality of Godhead, either as Supersoul or as the Supreme Person.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 802 / Vishnu Sahasranama Contemplation - 802🌹*

*🌻802. సర్వవాగీశ్వరేశ్వరః, सर्ववागीश्वरेश्वरः, Sarvavāgīśvareśvaraḥ🌻*

*ఓం సర్వవాగీశ్వరాయ నమః | ॐ सर्ववागीश्वराय नमः | OM Sarvavāgīśvarāya namaḥ*

*సర్వేషాం వాగీశ్వరాణాం బ్రహ్మాదీనామపీశ్వరః ।*
*సర్వ వాగీశ్వరేశ్వర ఇతి సఙ్కీర్త్యతే హరిః ॥*

*వాగ్విషయమున అత్యంత సమర్థులును, వాక్ అను ఐశ్వర్యము కలవారగు బ్రహ్మాదులకును ఆ విషయమునను అన్ని విషయములందును ఈశ్వరుడు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 802🌹*

*🌻802. Sarvavāgīśvareśvaraḥ🌻*

*OM Sarvavāgīśvarāya namaḥ*

सर्वेषां वागीश्वराणां ब्रह्मादीनामपीश्वरः ।
सर्व वागीश्वरेश्वर इति सङ्कीर्त्यते हरिः ॥

*Sarveṣāṃ vāgīśvarāṇāṃ brahmādīnāmapīśvaraḥ,*
*Sarva vāgīśvareśvara iti saṅkīrtyate hariḥ.*

*He is the Lord of even all the Lords of speech like* Brahma and others; hence He is Sarvavāgīśvareśvaraḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुवर्णबिंदुरक्षोभ्यस्सर्ववागीश्वरेश्वरः ।महाह्रदो महागर्तो महाभूतो महानिधिः ॥ ८६ ॥
సువర్ణబిందురక్షోభ్యస్సర్వవాగీశ్వరేశ్వరః ।మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥
Suvarṇabiṃdurakṣobhyassarvavāgīśvareśvaraḥ,Mahāhrado mahāgarto mahābhūto mahānidhiḥ ॥ 86 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 763 / Sri Siva Maha Purana - 763🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 16 🌴*
*🌻. దేవాసుర యుధ్ధము - 4 🌻*

*విష్ణువు ఇట్లు పలికెను - జలంధరాసురునకు నా పరాక్రమమును చూపించెను. దేవతలు కొనయాడుచుండగా శీఘ్రముగా యుద్ధము కొరకు వెళ్లగలను (27). కాని రుద్రుని అంశ##చే జన్మించిన వాడగుట వలన, బ్రహ్మ యొక్క వచనము వలన, మరియు నీ అనురాగము వలన జలంధరుడు నాచే వధింపబడడు (28).*

*సనత్కుమారుడిట్లనెను- విష్ణువు ఇట్లు పలికి శంఖమును, చక్రమును, గదను, కత్తిని చేతబట్టి గరుడునిపై నెక్కి ఇంద్రాది దేవతలతో గూడి యుద్దమునుచేయుట కొరకు శీఘ్రమే వెళ్ళెను (29). విష్ణువు యొక్క తేజస్సుచే కాంతిని పొందిన దేవతలతో గూడి సింహనాదమును చేస్తూ, విష్ణవు జలంధరాసురుడు ఉన్న స్థలమును శీఘ్రముగా చేరుకొనెను (30). అపుడు గరుడుని రెక్కల గాలిచే పీడించబడిన రాక్షసులు ఆకాశమునందలి మేఘములు తుఫానుయందు వలె గిరగిర తిరుగుచుండిరి (31). అపుడు జలంధరుడు రెక్కల సుడిగాలిచే రాక్షసులు పీడింపబడుటను గాలిచే ఎగురవేయబడుటను గాంచి కోపించిన వాడై శీఘ్రమే విష్ణువుపై దాడి చేసెను (32). విష్ణువు యొక్క తేజస్సుచే ఉత్సాహితులైన దేవతలు మహాబలమును పొంది అదే సమయమలో యుద్ధమును చేయనారంభించిరి (33). యుద్ధమునకు సన్నద్ధమై విచ్చేసిన దేవసైన్యమును గాంచి జలంధరుడు మహాబలశాలురగు రాక్షసులను యుద్ధమునకు ఆజ్ఞాపించెను (34).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 763🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 16 🌴*

*🌻 The battle of the gods - 4 🌻*

Viṣṇu said:—
27-28. Since I have been eulogised by the gods I shall go to the battle ground immediately. I can only show my valour to the Asura Jalandhara. He cannot be slain by me because he is a part of Śiva. Moreover Brahmā has said so. Further, you love him too.”

Sanatkumāra said:—
29. Having said this and seating himself on Garuḍa with the conch, discus, mace and the sword held in his hands, Viṣṇu hastened to the fight along with Indra and other gods.

30. Roaring like a lion and accompanied by the gods who blazed with Viṣṇu’s splendour, he reached the place where Jalandhara was waiting.

31. Then the Daityas afflicted by the gusts of wind set in motion by the wings in the speedy flight of the younger brother of Aruṇa (i.e Garuḍa)[5] were blown here and there like the clouds in the sky tossed about in a stormy whirlwind.[6]

32. Then on seeing the Asuras afflicted by the gusts of wind, Jalandhara rushed against Viṣṇu shouting out cries of bravery angrily.

33. In the meantime the delighted gods equipped with a vast army began to fight with their strength increased by the brilliance of Viṣṇu.

34. Seeing the army of the gods present there ready to fight Jalandhara commanded the invincible Asuras thus.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 17 / Osho Daily Meditations  - 17 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀17. అజ్ఞానం 🍀*

*🕉. నేను అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగించి నప్పుడు, నేను దానిని ఎటువంటి ప్రతికూల అర్థంలో ఉపయోగించను-- జ్ఞానం లేకపోవడం అని నా ఉద్దేశ్యం కాదు. నా ఉద్దేశ్యం చాలా ప్రాథమికమైనది; చాలా ప్రస్తుతం, చాలా సానుకూలమైనది. మనం ఎలా ఉన్నాం. అస్తిత్వం యొక్క స్వభావమే నిగూఢంగా ఉండిపోతుంది, అందుకే అది చాలా అందంగా ఉంటుంది. 🕉*

*జ్ఞానమంతా నిరుపయోగం. అలాంటి జ్ఞానం నిరుపయోగం. మరియు ఏ జ్ఞానమయినా మనకు తెలిసిన భ్రమను మాత్రమే సృష్టిస్తుంది. కానీ మనకు తెలియదు. మీరు మీ జీవితమంతా ఎవరితోనైనా జీవించవచ్చు మరియు మీకు ఆ వ్యక్తి గురించి తెలుసు మరియు మీకు తెలియదు అని అనుకోవచ్చు. మీరు ఒక బిడ్డకు జన్మనివ్వవచ్చు మరియు ఆ బిడ్డ మీకు తెలుసు అని మీరు అనుకోవచ్చు మరియు మీకు తెలియదు. మనకు తెలుసు అని మనం అనుకున్నది చాలా భ్రమ. ఎవరైనా 'నీరు అంటే ఏమిటి?' అని మిమ్మల్ని అడిగితే, 'H20' అని చెప్పండి. మీరు కేవలం ఒక ఆట ఆడుతున్నారు. నీరు అంటే ఏమిటి, లేదా 'H' అంటే ఏమిటి లేదా '0' అనేది తెలియదు. మీరు కేవలం లేబుల్ చేస్తున్నారు. రహస్యం పూర్తి కాలేదు-రహస్యం వాయిదా వేయబడింది మరియు చివరికి, అంతులేని అజ్ఞానం ఇప్పటికీ ఉంది.*

*ప్రారంభంలో నీరు అంటే ఏమిటో మనకు తెలియదు; ఇప్పుడు మనకు ఎలక్ట్రాన్ అంటే ఏమిటో తెలియదు, కాబట్టి మనకు ఎటువంటి జ్ఞానం రాలేదు. మనము వస్తువులను పేరు పెట్టడం, వర్గీకరించడం వంటి ఆట ఆడాము, కానీ జీవితం ఒక రహస్యంగా మిగిలిపోయింది. అజ్ఞానం చాలా లోతైనది మరియు అంతిమమైనది, దానిని నాశనం చేయలేము. మరియు మీరు దానిని అర్థం చేసుకున్న తర్వాత, మీరు దానిలో విశ్రాంతి తీసుకోవచ్చు. ఇది చాలా అందంగా ఉంది, ఇది చాలా విశ్రాంతిగా ఉంది ... ఎందుకంటే అప్పుడు వెళ్ళడానికి ఎక్కడా లేదు. తెలుసుకోవలసినది ఏమీ లేదు, ఎందుకంటే ఏమీ తెలియదు. అజ్ఞానమే పరమావధి. ఇది విపరీతమైనది మరియు విశాలమైనది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 17 🌹*
📚. Prasad Bharadwaj

*🍀17.  IGNORANCE 🍀*

*🕉  When I use the word ignorance, I don't use it in any negative sense-- I don't mean absence if knowledge. I mean something very fundamental; very present, very positive. It is how we are. It is the very nature of existence to remain mysterious, and that's why it is so beautiful.  🕉*

*All knowledge is superfluous. Knowledge as such is superfluous. And all knowledge only creates an illusion that we know. But we don't know. You can live someone your whole life and think that you know the person-and you don't know. You can give birth to a child and you can think you know the child-and you don't know. Whatever we think we know is very illusory. Somebody asks, "What is water?" and you say, "H20." You are simply playing a game. It is not known what water is, or what "H" is or "0." You are just labeling.  The mystery is not finished-the mystery is only postponed, and at the end, there is still trem endous ignorance.*

*In the beginning we did not know what the water was; now we don't know what the electron is, so we have not come to any knowledge. We have played a game of naming things, categorizing, but life remains a mystery. Ignorance is so profound and so ultimate that it cannot be destroyed. And once you understand it, you can rest in it. It is so beautiful, it is so relaxing ... because then there is nowhere to go. There is nothing to be known, because nothing can be known. Ignorance is ultimate. It is tremendous and vast.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 466 - 1  / Sri Lalitha Chaitanya Vijnanam  - 466  - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।*
*కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀*

*🌻 466. ‘సూక్ష్మరూపిణి’ - 1 / 466. 'Sukshmarupini' - 1🌻* 

*సూక్ష్మ రూపము గలది శ్రీమాత అని అర్థము. 'సూక్ష్మ'మనగా చిన్నది అని ఒక అర్థము. కన్నులకు కనపడనిది, జ్ఞానము కలవారికే కనబడునది అని మరియొక అర్థము. అజ్ఞానులకు తెలియుటకు వీలు కాని రూపము కలది అని కూడ అర్థము. సూక్ష్మము కంటే సూక్ష్మమైనటువంటిది శ్రీమాత అణువులోని పరమాణువని కూడ చెప్పబడును. శ్రీమాత విశ్వరూపధారిణి అయిననూ అణురూపమున కూడ యుండునని, అణువులలో అణువై పరమాణువై కూడ యుండునని, అతిచిన్నదైన రూపముకూడ ఆమెదే అని శ్రీమాత భక్తులు గ్రహించవలెను. చీమ, దోమ, ఈగ, పురుగు ఇత్యాది రూపములు కూడ శ్రీమాత రూపములే. అట్లే కనబడు రూపములు, కనపడని రూపములుకూడ శ్రీమాత రూపములే. ఆమె విశ్వరూపిణి, సూక్ష్మరూపిణి.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 466 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika*
*Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻*

*🌻 466. 'Sukshmarupini' - 1 🌻*

*It means Srimata has a subtle form. 'Sukshma' means small. Another meaning is that which is not visible to the eyes, is visible only to the wise. It also means that there is a form that cannot be known to the ignorant. The subtler than subtle is also Sri Mata said to be the atom in the atom. Devotees of Sri Mata should realize that Sri Mata, who is the embodiment of the universe, also exists in atomic form, that there are atoms in atoms, and that even the smallest form is Her. The forms of ant, mosquito, fly and worm are also the forms of Sri Mata. Similarly, the visible forms and the invisible forms are also the forms of Sri Mata. She is universal and microscopic.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

Siva Sutras - 116 : 2-07. Mātrkā chakra sambodhah - 19 / శివ సూత్రములు - 116 : 2-07. మాతృక చక్ర సంబోధః - 19


🌹. శివ సూత్రములు - 116 / Siva Sutras - 116 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

2వ భాగం - శక్తోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 2-07. మాతృక చక్ర సంబోధః - 19 🌻

🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴


ఉన్మేశ దశలో శుద్ధవిద్య అంచెలంచెలుగా పెరగడం కారణంగా ఉష్మాన్ బహిర్గతం అవుతుంది. శుద్ధవిద్య అనేది ఆచార వ్యవహారాలలో మునిగిపోవడం కంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించడానికి బాధ్యత వహిస్తుంది. రెండవ భాగం ఈశ్వర, ఇది వ్యక్తి సాధించిన ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంగా పని చేసేలా చేస్తుంది. శుద్ధవిద్య యొక్క మూడవ భాగం సదాశివ, ఇందులో జ్ఞానం మరియు చర్య రెండూ సమాన నిష్పత్తిలో ఉంటాయి. చివరిది మొత్తం సృష్టిలో అత్యంత ముఖ్యమైన భాగం, శక్తి. శక్తి సాక్షాత్కారానికి నాందిగా వ్యక్తమవుతుంది. ఇది శివుని సాక్షాత్కారానికి ముందు దశ. శివ అనేది శుద్ధ విశదీకరణ, ఇది కాంతికి కారణం.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 116 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 2 - Śāktopāya.

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 2-07. Mātrkā chakra sambodhah - 19 🌻

🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization. 🌴


In the stage of unmeṣa the resultant ūṣman unfold because of the successive stages of suddhavidyā. Suddhavidyā consists of suddhavidyā, which is responsible for acquiring spiritual knowledge than indulging in rituals. The second component is Īsvara, which makes a person to act on the basis of spiritual knowledge attained. The third component of suddhavidyā is Sadāśiva, wherein both knowledge and action are in equal proportion. The last one is the most significant part of the whole creation, Śaktī. Śaktī manifests as a prelude to Realisation. This is the penultimate stage of realising Śiva. Śiva is pure elucidation, which is the cause of Light.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 380


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 380 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. వ్యక్తి అస్తిత్వానికి తల వంచాలి. తనని తను సమర్పించుకోవాలి. నీలోని పువ్వుల్ని, అంటే నువ్వు సృష్టించిన వాటిని అస్తిత్వానికి సమర్పించాలి. చిన్ని కాంతిని అనంత కాంతికి అదనంగా అందించాను అన్న సంతృప్తి కావాలి. 🍀


నా సంపూర్ణ ప్రయత్నం మిమ్మల్ని మరింత ఉత్సవ గుణంతో వుంచడు. మరింత ఆనందంగా వుండేలా చెయ్యడం, అనంతం మీకిచ్చిన బహుమానం పట్ల అవనతంగా వుండడం. కృతజ్ఞత నించీ గానం పుడుతుంది. పాటలు పల్లవిస్తాయి. అప్పుడు వ్యక్తి అస్తిత్వానికి తల వంచాలి. తనని తను సమర్పించుకోవాలి. నీలోని పువ్వుల్ని, అంటే నీ పాటల్ని, నువ్వు సృష్టించిన వాటిని అస్తిత్వానికి సమర్పించాలి.

వ్యక్తికి నేను ప్రపంచానికి చెందిన అందంలో ఆత్యల్పభాగాన్ని సృష్టించాను. అస్తిత్వానికి సంబంధించి దయా కెరటాన్ని అందుకున్నాను. చిన్ని కాంతిని అనంత కాంతికి అదనంగా అందించాను అన్న సంతృప్తి కావాలి. సృజనాత్మకత మతం, సృజన ప్రార్థన, సృజన ధ్యాన గుణం నించే వస్తుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


DAILY WISDOM - 114 : 23. What is Sexual Beauty? / నిత్య ప్రజ్ఞా సందేశములు - 114 : 23. లైంగిక సౌందర్యం అంటే ఏమిటి?



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 114 / DAILY WISDOM - 114 🌹

🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 23. లైంగిక సౌందర్యం అంటే ఏమిటి? 🌻


స్త్రీలలో పురుషులకి, పురుషులలో స్త్రీలకి కనిపించే ఆ సౌందర్యం అనేది ఈ ద్వైలింగ ప్రకృతి ముందు మనుగడలో ఉన్న ఏకలింగ ప్రకృతి యొక్క సంపూర్ణత్వం యొక్క అభివ్యక్తిగా చెప్పవచ్చు. ఆ సంపూర్ణత యొక్క ఆకర్షణే ఈ లింగాల మధ్య సౌందర్యంగా ప్రకటితం అవుతుంది. మరి అలాంటప్పుడు లైంగిక సౌందర్యం అంటే ఏమిటి? అలాంటిది అంటూ ఒకటి ఉందా? ఉంది మరియు లేదు.

ఉన్నట్లు మనకు కనిపిస్తుంది కాబట్టి ఉంది. కానీ మనకు కనిపించేది నిజానికి సౌందర్యం కాదు. మనం దానిని సౌందర్యం అని అనుకుంటాం. కనిపించే లింగాల అందం అనేది వ్యక్తిత్వం యొక్క భౌతిక జీవులలో జరిగే కంపనసారూప్యత యొక్క పరిణామం. ఇది వ్యతిరేక లింగానికి ఆకర్షణగా పరిణమిస్తుంది. ఎందుకంటే ఇది వ్యతిరేక లింగంలో కేవలం తనలాంటి వ్యక్తిని మాత్రమే కాకుండా ఒక నిగూఢమైన అర్థం వ్యక్తి యొక్క శరీరంలోకి చదవబడుతుంది, ఈ అర్థం వ్యక్తి కంటే అందం యొక్క అవగాహనకు కారణం.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 114 🌹

🍀 📖 The Ascent of the Spirit 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 23. What is Sexual Beauty? 🌻

The beauty that the sexes feel between each other is the glamour projected by this super-individual urge in the form of the sexes so that it may be safely said that sexual beauty which is visible to the male in the female and to the female in the male is the form of that lost identity of unisexuality which preceded the subsequent manifestation of bisexual individuals. Then, what is sexual beauty? Does it really exist? Yes, it does, and it does not.

It exists because it is seen; it does not exist because what is seen is not beauty but something else which is mistaken for what is known as beauty. The beauty of the sexes that is visible is the consequence of a similarity of vibration that takes place in the vital and physical organisms of the personality which gets pulled magnetically towards the opposite sex, since it sees in the opposite sex not merely a person like oneself but a strange meaning which is read into the body of the person, this meaning being the cause for the perception of beauty more than the person as such.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ మదగ్ని మహాపురాణము - 249 / Agni Maha Purana - 249


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 249 / Agni Maha Purana - 249 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 74

🌻. శివ పూజా విధి వర్ణనము - 5 🌻


'హుంఫట్‌' అను మంత్రముచే ప్రాకారమును భావన చేసి, ఆత్మరక్ష ఏర్పరచుకొనవలెను. దీని బైట, వెలుపల, క్రింద, మీద, భావన ద్వార శక్తి జాలమును విస్తరింపచేయవలెను. పిమ్మట మహాముద్రాప్రదర్శనముచేసి, పూరకప్రాణాయామముతో హృదయకమలమునందున్న శివుని ధ్యానించి, ఆనందామృతమయ మకరందముతో, (నిండిన) భావమయపుష్పము లతో శివునకు పాదములనుండి శిరస్సు వరకును అంగపూజ చేయవలెను. శివమంత్రములతో నాభికుండమునందున్న శివ స్వరూపాగ్నిని తృప్తుని చేయవలెను. ఆ శివానలమే లలాటమున బిందురూపములో నున్నది; దాని విగ్రహము మంగలమయము (అని) భావన చేయవలెను. స్వర్ణపాత్రము గాని, రజతపాత్రము గాని, తామ్రపాత్రము గాని అర్ఘ్యము నిమిత్తమై గ్రహించి దానిని అస్త్రబీజము (ఫట్‌) ఉచ్చరించుచు కడగవలెను.

బిందు రూపశివునినుండి అమృతము ఆవిర్భవించుచున్నట్లు భావనచేసి హృదయమంత్రము (నమః) ఉచ్చరించుచు, దానితో కలిసిన జలాక్షతాదులతో ఆ పాత్రను నింపవలెను. దానికి షడింగ పూజ చేసి, దేవతామూలమంత్రముచే అభిమంత్రించవలెను. అస్త్రమంత్రము (ఫట్‌) చే దాని రక్ష చేసి, కవచబీజ (హుమ్‌) ముచే దానిని కప్పవలెను. ఈ విధముగ అష్టాంగార్ఘ్యము ఏర్పరచి, ధేనుముద్రచే దానికి అమృతీకరణముచేసి, ఆ జలమును అన్ని వైపులను చల్లవలెను. తన శిరస్సుపై కూడ చల్లుకొనవలెను. పూజాసామగ్రిమీద కూడ అస్త్రబీజము నుచ్చరించుచు చల్లవలెను. హృదయబీజముతో అభిమంత్రించి, 'హుమ్‌' బీజముచే (లేదామత్స్యముద్రచే) దానిని ఆచ్ఛాందిచవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 249 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 74

🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 5 🌻


31. Having protected the enclosure with the weapon and the outer place with its mantra the mahāmudrā consisting of the energy should be shown below and above that.

32-33. One should worship Śiva in the lotus in the heart from head to foot with the retention of breath and with the flowers of one’s own feeling. One should then offer the clarified butter of ambrosia to the fire of Śiva in the sacred pit of the navel with the mantras of Śiva. One should contemplate the white figure of the form of bindu on the forehead.

34. One of the vessels among the golden pitchers, should be purified by water of nectar got from the speck and by unbroken rice.

35. Having filled the vessel with the six constituents and after having worshipped it, it should be consecrated. After having protected it with the mantra hā one should cover it with the armour.

36. After having made ready the water of offering, one should sprinkle the eight constituents (with water) by (showing) the dhenumudrā (a particular form of intertwining the fingers representing the cow). One should then sprinkle one’s own self on the head with the particles of that water.

37. One should sprinkle water of the weapon on the materials of worship kept there. One should then encircle them with the armour of piṇḍa with the hṛt (mantra).

38-39. After having shown the amṛtā mudrā (formation with fingers denoting non-decay) and putting flower on its seat and a mark on the forehead consecrated by the principal mantra (of the god) a bold man should remain perfectly silent at the time of bathing, worship of the god, (offering) oblation unto fire, eating, practising yoga and repetition of necessary (mantras).


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీమద్భగవద్గీత - 402: 10వ అధ్., శ్లో 30 / Bhagavad-Gita - 402: Chap. 10, Ver. 30

 

🌹. శ్రీమద్భగవద్గీత - 402 / Bhagavad-Gita - 402 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 30 🌴

30. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాల: కలయతామహమ్ |
మృగాణాం చ మృగేన్ర్ద్రోహం వైనతేయశ్చ పక్షిణామ్ ||

🌷. తాత్పర్యం : నేను దైత్యులలో భక్త ప్రహ్లాదుడను, అణుచువారిలో కాలమును, మృగములలో సింహమును, పక్షలలో గరుత్మంతుడను అయి యున్నాను.

🌻. భాష్యము : అక్కాచెల్లెండ్రయిన దితి మరియు అదితులలో అదితి తనయులు అదిత్యులుగా, దితి తనయులు దైత్యులుగా పిలువబడిరి. వారిలో ఆదిత్యులు భగవానుని భక్తులు కాగా, దైత్యులు నాస్తికులైరి. ప్రహ్లాదుడు అట్టి దైత్యవంశమున జన్మించినప్పటికి చిన్ననాటి నుండియు గొప్పభక్తుడై యుండెను. తన భక్తితత్పరత మరియు దైవీస్వభావము కారణముగా అతడు శ్రీకృష్ణుని ప్రతినిధిగా గుర్తింపబడినాడు. దమన మొనర్చునవి లేక అణుచునవి మొదలగు అంశములు పలు ఉన్నప్పటికిని కాలము మాత్రము భౌతికవిశ్వమునందలి సమస్తమును అణుచునదై యున్నది. కనుక అది శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. మృగములలో సింహము అతి భయంకరము మరియు శక్తివంతమైనది. అదే విధముగా లక్షలాది పక్షిజాతులలో విష్ణువాహనమైన గరుడుడు అత్యంత ఘనుడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 402 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 30 🌴

30. prahlādaś cāsmi daityānāṁ kālaḥ kalayatām aham
mṛgāṇāṁ ca mṛgendro ’haṁ vainateyaś ca pakṣiṇām

🌷 Translation : Among the Daitya demons I am the devoted Prahlāda, among subduers I am time, among beasts I am the lion, and among birds I am Garuḍa.


🌹 Purport :

Diti and Aditi are two sisters. The sons of Aditi are called Ādityas, and the sons of Diti are called Daityas. All the Ādityas are devotees of the Lord, and all the Daityas are atheistic. Although Prahlāda was born in the family of the Daityas, he was a great devotee from his childhood. Because of his devotional service and godly nature, he is considered to be a representative of Kṛṣṇa. There are many subduing principles, but time wears down all things in the material universe and so represents Kṛṣṇa. Of the many animals, the lion is the most powerful and ferocious, and of the million varieties of birds, Garuḍa, the bearer of Lord Viṣṇu, is the greatest.

🌹 🌹 🌹 🌹 🌹


23 Jul 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 23, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹

శుభ ఆదివారం, Sunday, భాను వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాస స్కంద షష్టి, Masik Skanda Sashti 🌻

🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 17 🍀

31. భాస్కరః సురకార్యజ్ఞః సర్వజ్ఞస్తీక్ష్ణదీధితిః |
సురజ్యేష్ఠః సురపతిర్బహుజ్ఞో వచసాం పతిః

32. తేజోనిధిర్బృహత్తేజా బృహత్కీర్తిర్బృహస్పతిః |
అహిమానూర్జితో ధీమానాముక్తః కీర్తివర్ధనః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : కుటుంబము నెడ ఆసక్తత - కుటుంబము మొదలైన వానియెడ ఆసక్తత సామాన్యంగా సాధకుడు ఆరాధించే ఈశ్వరునకు అడ్డుగాగాని పోటీగాగాని తయారుకావడం కద్దు. అట్టి సందర్భంలో సాధకుడు దానిని తప్పక విడిచిపుచ్చ వలసే వుంటుంది. అయితే, ఇదంతా క్రమంగా సాధించవచ్చును. ఉన్న సంబంధాలను విడగొట్టుకోడం కొందరికి అవసరమైనా అందరికీ ఆది వర్తించ నక్కరలేదు.🍀

🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

శ్రావణ మాసం

తిథి: శుక్ల పంచమి 11:46:34 వరకు

తదుపరి శుక్ల షష్టి

నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 19:47:44

వరకు తదుపరి హస్త

యోగం: పరిఘ 14:16:55 వరకు

తదుపరి శివ

కరణం: బాలవ 11:43:33 వరకు

వర్జ్యం: 01:02:06 - 02:49:14

మరియు 29:02:06 - 30:47:50

దుర్ముహూర్తం: 17:08:33 - 18:00:34

రాహు కాలం: 17:15:03 - 18:52:35

గుళిక కాలం: 15:37:32 - 17:15:03

యమ గండం: 12:22:29 - 14:00:00

అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48

అమృత కాలం: 11:44:54 - 13:32:02

సూర్యోదయం: 05:52:24

సూర్యాస్తమయం: 18:52:35

చంద్రోదయం: 10:12:20

చంద్రాస్తమయం: 22:34:10

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: కన్య

యోగాలు: మిత్ర యోగం - మిత్ర

లాభం 19:47:44 వరకు తదుపరి

మానస యోగం - కార్య లాభం

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹