శ్రీమద్భగవద్గీత - 402: 10వ అధ్., శ్లో 30 / Bhagavad-Gita - 402: Chap. 10, Ver. 30

 

🌹. శ్రీమద్భగవద్గీత - 402 / Bhagavad-Gita - 402 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 30 🌴

30. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాల: కలయతామహమ్ |
మృగాణాం చ మృగేన్ర్ద్రోహం వైనతేయశ్చ పక్షిణామ్ ||

🌷. తాత్పర్యం : నేను దైత్యులలో భక్త ప్రహ్లాదుడను, అణుచువారిలో కాలమును, మృగములలో సింహమును, పక్షలలో గరుత్మంతుడను అయి యున్నాను.

🌻. భాష్యము : అక్కాచెల్లెండ్రయిన దితి మరియు అదితులలో అదితి తనయులు అదిత్యులుగా, దితి తనయులు దైత్యులుగా పిలువబడిరి. వారిలో ఆదిత్యులు భగవానుని భక్తులు కాగా, దైత్యులు నాస్తికులైరి. ప్రహ్లాదుడు అట్టి దైత్యవంశమున జన్మించినప్పటికి చిన్ననాటి నుండియు గొప్పభక్తుడై యుండెను. తన భక్తితత్పరత మరియు దైవీస్వభావము కారణముగా అతడు శ్రీకృష్ణుని ప్రతినిధిగా గుర్తింపబడినాడు. దమన మొనర్చునవి లేక అణుచునవి మొదలగు అంశములు పలు ఉన్నప్పటికిని కాలము మాత్రము భౌతికవిశ్వమునందలి సమస్తమును అణుచునదై యున్నది. కనుక అది శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. మృగములలో సింహము అతి భయంకరము మరియు శక్తివంతమైనది. అదే విధముగా లక్షలాది పక్షిజాతులలో విష్ణువాహనమైన గరుడుడు అత్యంత ఘనుడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 402 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 30 🌴

30. prahlādaś cāsmi daityānāṁ kālaḥ kalayatām aham
mṛgāṇāṁ ca mṛgendro ’haṁ vainateyaś ca pakṣiṇām

🌷 Translation : Among the Daitya demons I am the devoted Prahlāda, among subduers I am time, among beasts I am the lion, and among birds I am Garuḍa.


🌹 Purport :

Diti and Aditi are two sisters. The sons of Aditi are called Ādityas, and the sons of Diti are called Daityas. All the Ādityas are devotees of the Lord, and all the Daityas are atheistic. Although Prahlāda was born in the family of the Daityas, he was a great devotee from his childhood. Because of his devotional service and godly nature, he is considered to be a representative of Kṛṣṇa. There are many subduing principles, but time wears down all things in the material universe and so represents Kṛṣṇa. Of the many animals, the lion is the most powerful and ferocious, and of the million varieties of birds, Garuḍa, the bearer of Lord Viṣṇu, is the greatest.

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment