🌹 08, AUGUST 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 08, AUGUST 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀
1) 🌹08, AUGUST 2023 TUESDAY మంగళవారం, భౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 410 / Bhagavad-Gita - 410 🌹
 🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 38 / Chapter 10 - Vibhuti Yoga - 38 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 256 / Agni Maha Purana - 256 🌹 
🌻. శివ పూజాంగ హోమ విధి - 1 / Mode of installation of the fire (agni-sthāpana) - 1 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 122 / DAILY WISDOM - 122 🌹 
 🌻 1. అనంతం యొక్క రాజ్యం / 1. The Realm of the Infinite 🌻
5) 🌹. శివ సూత్రములు - 124 / Siva Sutras - 124 🌹 
🌻 2-09. జ్ఞానం అన్నం - 1 / 2-09.  Jñānam annam  - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 08, అగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : కాలాష్టమి, Kalashtami 🌻*

*🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 15 🍀*

*30. నిరంజనో నిర్వికల్పో గుణాతీతో భయంకరః |*
*హనుమాంశ్చ దురారాధ్యస్తపఃసాధ్యో మహేశ్వరః*
*31. జానకీఘనశోకోత్థతాపహర్తా పరాశరః |*
*వాఙ్మయః సదసద్రూపః కారణం ప్రకృతేః పరః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : సాధన ప్రధానమైన సంబంధాలు కావాలి - యోగ సాధనకు దిగిన పిమ్మట సాధకునకు యితర మానవుల తోడి సంబంధాలలో మార్పు రావడం అవసరం. రక్తసంబంధాదుల ప్రాధాన్యం అంత కంతకు తగ్గిపోవాలి. దానికి బదులుగా సాధన ప్రధానమైన సంబంధాలు అంతకంతకు పెంపొందాలి. అందరినీ ఒకే ప్రయాణంలో వున్న ఆత్మలుగా, ఒకే జగన్మాత సంతానంగా అతడు చూడ నేర్చుకోవాలి. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ అష్టమి 27:53:21 వరకు
తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: భరణి 25:34:12 వరకు
తదుపరి కృత్తిక
యోగం: దండ 16:41:43 వరకు 
తదుపరి వృధ్ధి
కరణం: బాలవ 16:03:43 వరకు
వర్జ్యం: 10:59:24 - 12:36:28
దుర్ముహూర్తం: 08:30:58 - 09:22:14
రాహు కాలం: 15:33:54 - 17:10:02
గుళిక కాలం: 12:21:39 - 13:57:47
యమ గండం: 09:09:25 - 10:45:32
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:46
అమృత కాలం: 20:41:48 - 22:18:52
సూర్యోదయం: 05:57:10
సూర్యాస్తమయం: 18:46:09
చంద్రోదయం: 23:50:48
చంద్రాస్తమయం: 12:14:32
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: ముసల యోగం - దుఃఖం
25:34:12 వరకు తదుపరి గద యోగం
- కార్య హాని , చెడు
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 410 / Bhagavad-Gita - 410 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 30 🌴*

*38. దణ్డో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ |*
*మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ ||*

*🌷. తాత్పర్యం : నేను చట్టవిరుద్ధతను అణుచువానిలో శిక్షను, జయమును కోరువారిలో నీతిని, రహస్యములలో మౌనమును, జ్ఞానవంతులలో జ్ఞానమును అయి యున్నాను.*

*🌷. భాష్యము : దుష్కృతులైన వారిని శిక్షించు విధానములు దండనసాధనములలో ముఖ్యమైనవి. కనుక దుష్కృతులు శిక్షింపబడినప్పుడు ఆ శిక్షను గూర్చువాడు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. ఏదేని ఒక రంగమునందు జయమును పొంద యత్నించువారిలో మిక్కిలి విజయవంతమైన అంశము నీతి. శ్రవణము, చింతనము, ధ్యానాది గుహ్యమగు కర్మలలో మౌనమైనది. ఏలయన మౌనము ద్వారా మనుజడు త్వరితముగా పురోగతిని సాధింపగలడు. జ్ఞానవంతుడైనవాడు భగవానుని ఉన్నత, గౌణప్రకృతులైన ఆత్మ మరియు భౌతికపదార్థముల నడుమ అంతరమును విశ్లేషించగలిగియుండును. అట్టి జ్ఞానము స్వయముగా శ్రీకృష్ణుడే.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 410 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 10 - Vibhuti Yoga - 38 🌴*

*38. daṇḍo damayatām asmi nītir asmi jigīṣatām*
*maunaṁ caivāsmi guhyānāṁ jñānaṁ jñānavatām aham*

*🌷 Translation : Among all means of suppressing lawlessness I am punishment, and of those who seek victory I am morality. Of secret things I am silence, and of the wise I am the wisdom.*

*🌹 Purport : There are many suppressing agents, of which the most important are those that cut down miscreants. When miscreants are punished, the agency of chastisement represents Kṛṣṇa. Among those who are trying to be victorious in some field of activity, the most victorious element is morality. Among the confidential activities of hearing, thinking and meditating, silence is most important because by silence one can make progress very quickly. The wise man is he who can discriminate between matter and spirit, between God’s superior and inferior natures. Such knowledge is Kṛṣṇa Himself.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 256 / Agni Maha Purana - 256 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 75*

*🌻. శివ పూజాంగ హోమ విధి - 1 / Mode of installation of the fire (agni-sthāpana) - 1 🌻*

*మహేశ్వరుడు పలికెను : పూజానంతరము, ఉపాసకుడు శరీరమును వస్త్రాదులతో ఆచ్ఛాదించుకొని, అర్ఘ్య పాత్రను చేత ధరించి, అగ్నిశాలలోనికి వెళ్ళి దివ్యదృష్టిచే యజ్ఞమున కావశ్యకములగు సమస్త ఉపకరణములను సమకూర్చు కొనవలెను. ఉత్తరాభి ముఖుడై అగ్ని కుండమును చూచి కుశలతో దానిని ప్రోక్షించి మార్జనము చేయవలెను. తాడనము (మార్జనము) అస్త్రమంత్రముతో (ఫట్‌) చేయవలెను. అభ్యుక్షణము కవచ మంత్రముతో (హుం) చేయవలెను. కవచమంత్రముచే (హుం) దానికి అభిషేకము, శరమంత్రముచే (ఫట్‌) భూకుట్టనము చేయవలెను. సంమార్జనము, ఉప లేపనము, కలాత్మ కరూపకల్పన త్రిసూత్రీపరిధానము, అర్చనము ఇవన్నియు కవచమంత్రముతోడనే చేయవలెను. కుండమునకు ఉత్తరమున మూడు రేఖలు గీయవలెను. ఒక రేఖ పూర్వాభిముఖమై క్రిందికి వచ్చు నట్లు గీయవలెను. రేఖలు కుశతో గాని, త్రిశూలముతో గాని గాయవలెను. లేదా ఆ రేఖ లన్నింటిని క్రిందుమీదుగా నున్నట్లు కూడ చేయవచ్చును.*

*అస్త్ర మంత్రము (ఫట్‌) నుచ్చరించి వజ్రీకరణము చేసి, 'నమః' ఉచ్చరించి కుశలచే చతుష్పథన్యాసము చేయవలెను. కవచమంత్రము (హుమ్‌)తో అక్షపాత్రను, హృదయమంత్ర (నమః) విష్టరమును స్థాపించవలెను. ''వాగీశ్వర్యైనమః'' ''ఈశాయ నమః'' అను మంత్రము లుచ్చరించి వాగీశ్వరిని, ఈశుని ఆవాహన చేసి పూజించవలెను. పిమ్మట మంచి స్థానమునుండి అగ్నిని, శుద్ధమైన పాత్రలో నుంచి తీసికొని వచ్చి, దాని నుండి, ''క్రవ్యాదమగ్నిం ప్రహిణోమి దూరమ్‌'' ఇత్యాది మంత్రము పఠించుచు క్రవ్యాదాంశమైన అగ్నికణమును తొలగించవలెను. పిమ్మట నిరీక్షణాదులచే శోధిత మగుఔదర్య-ఐన్దవ-భౌత-అగ్నిత్రయమును ఏకము చేసి ''ఓం హూం వహ్నిచైతన్యాయ నమః'' అను మంత్ర ముచ్చరించి అగ్ని బీజముతో (రం) స్థాపించవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 256 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 75*
*🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 1 🌻*

The God said:
1. (The worshipper) should enter another room unseen with the vessel containing water for offering in his hand and should look to the arrangements of the materials essential in the performance of a sacrifice, as it were, with a divine eyesight.

2. He should look at the sacrificial pit with his face turned. towards the north. The sprinkling and beating the water with the kuśa should be done by (repeating) the mantra of the weapon and the consecration should be done with the mantra of the armour.

3. The digging out (a piece of earth), filling and levelling with the sword should be done with (the mantra of) the armour and bathing and division into parts (should be done) with the mantra of the arrow.

4. The (rites of) cleansing, anointing, fixing the crescent. form, investiture of the sacred thread and worship (should be done) always by the mantra of the armour.

5. Three lines should be drawn in the north and one below them (should be drawn) so as to face the east. Whatever defects, in them may be made good by touching them with the kuśa and the astramantra of Śiva.

6. A quadrilateral figure should be. drawn with the kuśa by the mantras of vajrīkaraṇa (establishing.firmly) and hṛd. The vessel for the rosaries should be laid with (the mantra of) the armour. The seat should be laid with the hṛd mantra.

7-8. The Goddess of speech along with the God should be invoked therein and worshipped. The consecrated fire brought from a holy place and placed in a pure receptacle, after leaving aside its parts presided over by the demons and purified by the divine look etc., the three fires audārya, aindava and bhauta should be made into one.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 122 / DAILY WISDOM - 122 🌹*
*🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 1. అనంతం యొక్క రాజ్యం / 1. The Realm of the Infinite 🌻*

*ప్రపంచం యొక్క స్వభావం యొక్క విశ్లేషణ తన కంటే ఉన్నత వాస్తవికతపై ఆధారపడటాన్ని వెల్లడిస్తుంది. తనకంటే ఉన్నతమైన దానివైపు తన గమనాన్ని కలిగి ఉంటుంది. ఒక వ్యక్తికి జీవితంలో ఎదురయ్యే నిమ్న అనుభవాల పట్ల అసంతృప్తి అనేది ఉన్నత స్థాయి వాస్తవికతను అంగీకరించడమే. ప్రతి కోరిక, ఆశయం, అద్భుతం, ఆశ్చర్యం లేదా రహస్యం, 'తనకు మించిన' ప్రతి భావం అది సూచించే పరిమితుల వెలుపల ఉన్న ఉనికిని సూచిస్తుంది.*

*‘ఒకటి కోరుకోబడింది’ అంటే కోరుకున్నది ఉనికిలో ఉందని అర్థం. మనం దయనీయంగా ఉన్నామంటే సంతోషం ఉందని అర్థం. అసంపూర్ణత యొక్క స్పృహ పరిపూర్ణత యొక్క అవకాశాన్ని సూచిస్తుంది. తనను తాను పరిమితంగా గుర్తించుకోవడమంటే ఒక్కసారిగా అనంతంలో అడుగు పెట్టడమే. పరిమితత్వం తెలిసినప్పుడు, ఆ తెలుసుకున్న వ్యక్తి దానిని అధిగమించగలగటం యొక్క అవకాశం దానిలో సూచించబడుతుంది. అనంతానికి విరుద్ధంగా తప్ప పరిమితానికి ప్రాముఖ్యత లేదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 122 🌹*
*🍀 📖 The Philosophy of Life 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 1. The Realm of the Infinite 🌻*

*An analysis of the nature of the world discloses its dependence on a reality higher than its own. It is subject to a teleological direction of its movements towards an end beyond itself. Dissatisfaction with the superficial experiences which one has in life is a tacit admission of a higher standard of reality. Every want, every wish and ambition, every type of wonder, surprise or mystery, every sense of a ‘beyond oneself’ suggests the existence of something outside the limitations which it indicates.*

*‘Something is wanting’ means that what is wanted exists. That we are miserable shows that there is an ideal of happiness. The consciousness of imperfection implies the possibility of perfection. To recognise the finitude of oneself is to step at once into the realm of the infinite. When finitude is known, the fact of the contingency of the knower’s transcending it is implied in it. The finite has no significance except in contradistinction to the infinite.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 124 / Siva Sutras - 124 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-09. జ్ఞానం అన్నం - 1 / 2-09.  Jñānam annam  - 1 🌻*

*🌴. ఆత్మశుద్ధి కొరకు చేసే యఙ్యములో, మెలకువ, స్వప్న మరియు గాఢనిద్ర స్థితులలో మనస్సు మరియు ఇంద్రియాల కార్యకలాపాల నుండి ఉద్భవించి అజ్ఞానం, భ్రాంతి మరియు బంధనాలను కలిగించే అపవిత్ర జ్ఞానాన్ని హవిస్సుగా సమర్పించాలి.  🌴 *

*శివ సూత్రం I.2 జ్ఞానం బంధః అని చెప్పబడింది, ఇక్కడ జ్ఞానం అంటే ఇంద్రియ అవయవాల ద్వారా పొందిన జ్ఞానం, అనుభవం ద్వారా పొందిన జ్ఞానం అని వివరించ బడింది. ఈ జ్ఞానం అత్యున్నత జ్ఞానానికి భిన్నమైనది. అత్యున్నత జ్ఞానం ఉన్నత మనస్సు యొక్క అనుభవం. అది ఇంద్రియ అనుభవం ద్వారా ఉద్భవించదు. ఉన్నత మనస్సు ద్వారా గ్రహించబడిన, పెంపొందించబడిన మరియు వ్యక్తీకరించబడిన జ్ఞానం బంధం వంటి తాత్కాలిక విషయాలతో కలుషితం కాకుండా ఉంటుంది. ఇక్కడ స్వచ్ఛమైన చైతన్యం సంస్కరింపబడుతుంది. ఇది మునుపటి సూత్రంలో ప్రస్తావించ బడింది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 124 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-09.  Jñānam annam  - 1 🌻*

*🌴. In the sacrifice of self-purification, impure knowledge which arises from the activities of the mind and senses in the wakeful, dream and deep sleep states and which causes ignorance, delusion and bondage should be offered as food in the sacrifice of self-purification  🌴*

*Śiva sūtra I.2 said Jñānam bandhaḥ, which was explained as Knowledge here means the knowledge derived through sensory organs, the knowledge acquired through experience. This knowledge is different from supreme knowledge. Supreme knowledge is the experience of the mind and not derived through sensory experience. Knowledge conceived, nurtured and manifested by the mind remains uncontaminated with temporal matters such as bondage. This is where pure consciousness is consecrated that is referred in the previous sūtra.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 468 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 468 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 468 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 468 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా ।
సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥ 🍀

🌻 468. 'వామదేవీ' - 2 / 468. 'Vamadevi' - 2 🌻

జీవులకు కర్మానుభవము, కర్మఫలము ఇచ్చునది వామదేవియే. కర్మానుభవము లేనిచో జీవులకు పరిణామము లేదు. పరిణామము లేనిచో పరిపూర్ణత లేదు. జీవులు పరిపూర్ణులైననే గాని పరితృప్తులు కాలేరు. అందులకే వారికి కర్మానుభవము అవసరము. కర్మానుభవమున కర్మఫలముల ననుభవించుచు క్రమముగ జీవులు నిష్కామ కర్మమునకు ఉద్యుక్తు లగుదురు. అపుడు వారి జీవితములు యజ్ఞార్థము లగును. యజ్ఞార్థ జీవమున పరిపూర్ణులై పరితృప్తు లగుదురు. ఈ సమస్త కార్యమును నిర్వర్తించునది వామదేవి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 468 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 97. Vajreshvari vamadevi vayovasdha vivarjita
sideshvari sidhavidya sidhamata yashasvini ॥ 97 ॥ 🌻

🌻 468. 'Vamadevi' - 2 🌻


Vamadevi is the one who gives Karmanubhava and Karmaphala to living beings. Without Karmanubhava there is no evolution for living beings. Without evolution there is no perfection. Beings cannot be satisfied until they are perfect. For that they need experience. In Karmanubhava, experiencing the fruits of Karma, living beings are attracted to Nishkama Karma. Then their lives will be a sacrifice. They are perfected and satisfied in the life of sacrifice. Vamadevi is the one who performs all this work.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


Osho Daily Meditations - 24. AUTHORITY / ఓషో రోజువారీ ధ్యానాలు - 24. అధికారం




🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 24 / Osho Daily Meditations - 24 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 24. అధికారం / 24. AUTHORITY 🍀

🕉. ఏది ఒప్పు ఏది తప్పు అని ఎవరినీ ఎప్పుడూ అడగకండి. జీవితం అనేది తెలుసుకోవడానికి ఒక ప్రయోగం. 🕉


ప్రతి వ్యక్తి స్పృహతో, అప్రమత్తంగా మరియు జాగరూకతతో ఉండాలి మరియు జీవితంలో ప్రయోగాలు చేయాలి మరియు అతనికి ఏది మంచిదో కనుగొనాలి. ఏది మీకు శాంతిని ఇస్తుందో, ఏది మీకు ఆనందాన్ని కలిగిస్తుందో, ఏది మీకు ప్రశాంతతను ఇస్తుందో, ఏది మిమ్మల్ని ఉనికికి మరియు దాని అపారమైన సామరస్యానికి దగ్గరగా తీసుకువస్తుందో అది మంచిది. మరియు మీలో ఏది సంఘర్షణ, దుఃఖం, బాధను సృష్టిస్తుందో అది తప్పు. మీ కోసం ఎవరూ నిర్ణయించలేరు, ఎందుకంటే ప్రతి వ్యక్తికి తన స్వంత ప్రపంచం, అతని స్వంత సున్నితత్వం ఉంటుంది. మనం ప్రత్యేకం. కాబట్టి సూత్రాలు పని చేయవు. ప్రపంచమంతా ఇందుకు నిదర్శనం. ఏది ఒప్పు ఏది తప్పు అని ఎవరినీ ఎప్పుడూ అడగవద్దు. ఏది ఒప్పో ఏది తప్పు అని తెలుసుకోవడానికి జీవితం ఒక ప్రయోగం.

కొన్నిసార్లు మీరు తప్పు చేయవచ్చు, కానీ అది మీకు అనుభవాన్ని ఇస్తుంది, దానివల్ల ఏది నివారించాలో మీకు తెలుస్తుంది. కొన్నిసార్లు మీరు ఏదైనా మంచి చేయవచ్చు, మరియు మీరు చాలా ప్రయోజనం పొందవచ్చు. ప్రతిఫలం స్వర్గం మరియు నరకంలో ఈ జీవితానికి మించినది కాదు. అవి ఇక్కడ మరియు ఇప్పుడు ఉన్నాయి. ప్రతి చర్య దాని ఫలితాన్ని వెంటనే తెస్తుంది. అప్రమత్తంగా ఉండండి మరియు చూడండి. పరిపక్వత గల వ్యక్తులు అంటే ఏది సరైనది, ఏది తప్పు, ఏది మంచి, ఏది చెడు అని స్వయంగా గమనించి, కనిపెట్టిన వారు. మరియు దానిని తాము కనుగొనడం ద్వారా, వారు విపరీతమైన అధికారం కలిగి ఉంటారు. ప్రపంచం మొత్తం ఇంకేదైనా చెప్పవచ్చు కానీ అది వారికి తేడా లేదు. వారికి వారి స్వంత అనుభవం ఉంది ఇక అది సరిపోతుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 24 🌹

📚. Prasad Bharadwaj

🍀 24. AUTHORITY 🍀

🕉 Never ask anybody what is right and what is wrong. Life is an experiment to find out. 🕉


Each individual has to be conscious, alert, and watchful, and experiment with life and find out what is good for him. Whatever gives you peace, whatever makes you blissful, whatever gives you serenity, whatever brings you closer to existence and its immense harmony is good. And whatever creates conflict, misery, pain in you is wrong. Nobody else can decide it for you, because every individual has' his own world, his own sensitivity. We are unique. So formulas are not going to work. The whole world is a proof of this. Never ask anybody what is right and what is wrong. Life is an experiment to find out what is right, what is wrong.

Sometimes you may do what is wrong, but that will give you the experience of it, that will make you aware of what has to be avoided. Sometimes you may do something good, and you will be immensely benefited. The rewards are not beyond this life, in heaven and hell. They are here and now. Each action brings its result immediately. Just be alert and watch. Mature people are those who have watched and found for themselves what is right, what is wrong, what is good, what is bad. And by finding it for themselves, they have a tremendous authority. The whole world may say something else, and it makes no difference to them. They have their own experience to go by, and that is enough.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ మహా పురాణము - 770 / Sri Siva Maha Purana - 770


🌹 . శ్రీ శివ మహా పురాణము - 770 / Sri Siva Maha Purana - 770🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 17 🌴

🌻. విష్ణు జలంధర యుద్ధము - 6 🌻


సనత్కుమారుడిట్లు పలికెను- ఆ మహారాక్షసుని ఈ మాటను విని దేవదేవుడు, పాపహారియగు విష్ణుభగవానుడు భేదముతో నిండిన మనస్సు గలవాడై 'అటులనే యగుగాక!' అని పలికెను (42). తరువాత విష్ణువు దేవగణములందరితో, మరియు లక్ష్మీదేవితో గూడి జలంధరమను నగరమునకు వచ్చి నివసించెను (43). అపుడు ఆ జలంధరాసురుడు తన సోదరియగు లక్ష్మితో మరియు విష్ణువుతో గూడి తన ఇంటికి చేరి ఆనందముతో నిండిన మనస్సు గలవాడై నివసించెను (44). అపుడు జలంధరుడు దేవతల అధికారపదవులలో రాక్షసులను నియమించి ఆనందముతో భూమండలమునకు మరలి వచ్చెను (45). సముద్రతనయుడగు జలంధరుడగు దేవగంధర్వ సిద్ధుల వద్ద గల శ్రేష్ఠవస్తువుల నన్నిటినీ స్వాధీనమొనర్చు కొనెను (46). బలవంతుడగు జలంధరుడు పాతాళభవనమునందు మిక్కిలి బలశాలియగు నిశుంభుని స్థాపించి, శేషుడు మొదలగు వారిని భూమండలమునకు తీసుకువచ్చెను (47).

ఆతడు దేవ గంధర్వ సిద్ధ సమూహములను, నాగరాక్షసమనుష్యులను తన నగరములో పౌరులుగా చేసుకొని ముల్లోకములను శాసించెను (48). జలంధరుడు ఈ తీరున దేవతలను తన వశము చేసుకొని, ప్రజలను స్వంతబిడ్డలను వలె రక్షించి, ధర్మబద్ధముగా రాజ్యము నేలెను (49). ఆతడు ధర్మముతో రాజ్యము నేలుచుండగా, రాజ్యములో వ్యాధిగ్రస్తులుగాని, దుఃఖితులు గాని, క్రుంగి కృశించినవారు గాని, దీనులు గాని ఒక్కడైననూ కానరాలేదు (50).

శ్రీ శివమహాపురాణములో రుద్ర సంహితయందు యుద్ధఖండలో విష్ణు జలంధర యుద్ధ వర్ణనమనే పదునేడవ అధ్యాయము ముగిసినది (17).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 770🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 17 🌴

🌻 The fight between Viṣṇu and Jalandhara - 6 🌻



Sanatkumāra said:—

42. On hearing these words of the great Asura, lord Viṣṇu, the lord of gods, said distressingly—“So be it.”

43. Then Viṣṇu came to the city called Jalandhara[1] along with his followers, the gods and Lakṣmī.

44. Then the Asura Jalandhara returned to his abode and stayed very delightedly in the company of his sister and Viṣṇu.

45. Thereafter Jalandhara appointed Asuras in the authoritative posts of the gods. Joyously he returned to the Earth.

46. The son of the ocean confiscated whatever gem or jewel the gods, Gandharvas or Siddhas had hoarded.

47. After appointing the powerful Asura, Niśumbha, in the nether-worlds, the powerful ruler of the Asuras brought Śeṣa and others to the Earth.

48. Making gods, Gandharvas, Siddhas, Serpents, Rākṣasas and human beings, the denizens of his capital, he ruled over the three worlds.

49. After making the gods thus subservient to himself, Jalandhara protected them all virtuously, like his own sons.

50. When he was ruling the kingdom virtuously, none in his realm was sick or miserable or lean and emaciated or indigent.


Continues....

🌹🌹🌹🌹🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 809 / Vishnu Sahasranama Contemplation - 809


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 809 / Vishnu Sahasranama Contemplation - 809🌹

🌻809. కున్దః, कुन्दः, Kundaḥ🌻

ఓం కున్దాయ నమః | ॐ कुन्दाय नमः | OM Kundāya namaḥ


కున్దాభ సున్దరాఙ్గత్వాత్ స్వచ్ఛస్ఫటిక నిర్మలః ।
కున్ద ఇత్యుచ్యతే విష్ణుః సద్య పాపవిమోచన ॥

కుం పృథ్వీం కశ్యపాయాదాదితి వా కున్ద ఉచ్యతే ।
కుం పృథ్వీం ద్యతి ఖణ్డయతీతి వా కున్ద ఉచ్యతే ॥

అథవాఽత్ర కుశబ్దేన లక్ష్యన్తే పృథివీశ్వరాః ।
తాన్ భార్గవో వ్యచ్ఛిదిత్యచ్యుతః కున్ద ఉచ్యతే ॥

మొల్లపూవును పోలినవాడు; మొల్ల పుష్పము (అడవి మల్లె) వలె సుందరమగు శరీరము కలవాడు; కుంద పుష్పము వలె స్వచ్ఛుడగువాడు.

లేదా పరశురామావతారమున భూమిని కశ్యపునకు ఇచ్చినవాడు. భృగు వంశజుడగు పరశురాముడు క్షత్రియులందరను పలు పర్యాయములు చంపినందున కలిగిన పాపమునుండి విశుద్ధి నందుటకై అశ్వమేధముతో యజించెను. మహాదక్షిణాయుక్తమగు ఆ మహాయజ్ఞమునందు ఆతడు ప్రీతియుక్తుడగుచు భూమిని మరీచి ప్రజాపతి పుత్రుడైన కశ్యపునకు దక్షిణగా ఇచ్చెను అను హరి వంశ వచనము ఇట ప్రమాణము.

లేదా 'భూమి' అను అర్థమును ఇచ్చు 'కు' అను పదమునకు లక్షణావృత్తిచే భూమిపతులు అను అర్థమును చెప్పికొన వలయును. అట్టి భూమి పతులను పరశురామావతారమున ఖండిచెను కనుక కుందః. ఈ విషయమున విష్ణు ధర్మోత్తరమునందు 'ఏ భార్గవోత్తముడు అనేక పర్యాయములు భూమిని క్షత్రియ రహితనుగా చేసెనో, ఎవడు కార్తవీర్యార్జునుని వేయి భుజములు అను అరణ్యమును ఛేదించెనో అట్టి హరి నాకు శుభవృద్ధిని కలిగించువాడుగా అగును గాక' అని చెప్పబడినది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 809🌹

🌻809. Kundaḥ🌻

OM Kundāya namaḥ


कुन्दाभ सुन्दराङ्गत्वात् स्वच्छस्फटिक निर्मलः ।
कुन्द इत्युच्यते विष्णुः सद्य पापविमोचन ॥

कुं पृथ्वीं कश्यपायादादिति वा कुन्द उच्यते ।
कुं पृथ्वीं द्यति खण्डयतीति वा कुन्द उच्यते ॥

अथवाऽत्र कुशब्देन लक्ष्यन्ते पृथिवीश्वराः ।
तान् भार्गवो व्यच्छिदित्यच्युतः कुन्द उच्यते ॥


Kundābha sundarāṅgatvāt svacchasphaṭika nirmalaḥ,
Kunda ityucyate viṣṇuḥ sadya pāpavimocana.

Kuṃ pr‌thvīṃ kaśyapāyādāditi vā kunda ucyate,
Kuṃ pr‌thvīṃ dyati khaṇḍayatīti vā kunda ucyate.

Athavā’tra kuśabdena lakṣyante pr‌thivīśvarāḥ,
Tān bhārgavo vyacchidityacyutaḥ kunda ucyate.


He who has handsome limbs like a kunda flower (jessamine). Being spotlessly white as a crystal, He is Kundaḥ.

He gave ku i.e., earth to Kāśyapa. The Harivaṃśa says - 'Bhr‌gu's son Paraśurāma performed Aśvamedha sacrifice to absolve himself of the sin of killing the Kṣatriya kings many times. In that sacrifice, he gladly made a great gift of earth to Kāśyapa.'

He who brings the earth under subjection. Or As the Viṣṇu dharmottara purāṇahas it: 'May that chief of the Bhārgava's who rid the earth of kṣatriyas and also cut off the forest of hands of Kārtavīrya increase my prosperity.'


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः ।
अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥

Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ,
Amr‌tāṃśo’mr‌tavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


కపిల గీత - 217 / Kapila Gita - 217


🌹. కపిల గీత - 217 / Kapila Gita - 217 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 27 🌴

27. అథ మాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయమ్
అర్హయేద్దానమానాభ్యాం మైత్ర్యాభిన్నేన చక్షుషా॥


తాత్పర్యము : ప్రాణులు వేర్వేరు రూపములు కలిగి యున్నను అన్నింటిలో భగవంతుడు అంతరాత్మగా విలసిల్లుచున్నాడు. కావున, సాదకుడు సకల ప్రాణులను అభేద భావముతో అనగా సమదృష్టితో చూడవలెను. తనకంటె అధికులను గౌరవింప వలెను. దీనులను దానాదులతో ఆదరింపవలెను. సమానుల యెడ మైత్రిని నెరపవలెను. అట్లు చేయుట భగవంతుని పూజించుటయే యగును.

వ్యాఖ్య : పరమాత్మ ఒక జీవి యొక్క హృదయంలో నివసిస్తున్నందున, వ్యక్తి ఆత్మ అతనితో సమానంగా మారిందని తప్పుగా అర్థం చేసుకోకూడదు. పరమాత్మ మరియు వ్యక్తిగత ఆత్మ యొక్క సమానత్వం వ్యక్తిత్వం లేని వ్యక్తి ద్వారా తప్పుగా భావించబడింది. భగవంతుని పరమాత్మతో సంబంధం ఉన్న వ్యక్తి ఆత్మను గుర్తించాలని ఇక్కడ స్పష్టంగా పేర్కొనబడింది. జీవిని సమానంగా చూడడమంటే, భగవంతుని సర్వోన్నత వ్యక్తిత్వంతో సమానంగా భావించడం కాదు. కనికరం మరియు స్నేహం ఒకరిని భగవంతుని యొక్క ఉన్నతమైన స్థానానికి తప్పుడుగా పెంచవలసిన అవసరం లేదు. అదే సమయంలో, పంది వంటి జంతువు యొక్క హృదయంలో ఉన్న పరమాత్మ మరియు పండిత బ్రాహ్మణుడి హృదయంలో ఉన్న పరమాత్మ వేర్వేరు అని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. అన్ని జీవులలో ఉన్న పరమాత్మ పరమాత్మ పరమాత్మ ఒక్కడే. తన సర్వశక్తి ద్వారా, అతను ఎక్కడైనా జీవించగలడు మరియు అతను తన వైకుంఠ పరిస్థితిని ప్రతిచోటా సృష్టించగలడు. అది అతని అనూహ్యమైన శక్తి. కాబట్టి, నారాయణుడు పంది హృదయంలో నివసిస్తున్నప్పుడు, అతను పంది-నారాయణుడు కాలేడు. అతను ఎల్లప్పుడూ నారాయణుడు మరియు పంది శరీరం అది ద్వారా ప్రభావితం కాదు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 217 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 5. Form of Bhakti - Glory of Time - 27 🌴

27. atha māṁ sarva-bhūteṣu bhūtātmānaṁ kṛtālayam
arhayed dāna-mānābhyāṁ maitryābhinnena cakṣuṣā


MEANING : Therefore, through charitable gifts and attention, as well as through friendly behavior and by viewing all to be alike, one should propitiate Me, who abide in all creatures as their very Self.

PURPORT : It should not be misunderstood that because the Supersoul is dwelling within the heart of a living entity, the individual soul has become equal to Him. The equality of the Supersoul and the individual soul is misconceived by the impersonalist. Here it is distinctly mentioned that the individual soul should be recognized in relationship with the Supreme Personality of Godhead. Treating a living entity equally does not mean treating him as one would treat the Supreme Personality of Godhead. Compassion and friendliness do not necessitate falsely elevating someone to the exalted position of the Supreme Personality of Godhead. We should not, at the same time, misunderstand that the Supersoul situated in the heart of an animal like a hog and the Supersoul situated in the heart of a learned brāhmaṇa are different. The Supersoul in all living entities is the same Supreme Personality of Godhead. By His omnipotency, He can live anywhere, and He can create His Vaikuṇṭha situation everywhere. That is His inconceivable potency. Therefore, when Nārāyaṇa is living in the heart of a hog, He does not become a hog-Nārāyaṇa. He is always Nārāyaṇa and is unaffected by the body of the hog.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


07 Aug 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 07, ఆగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻

🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 42 🍀

85. ధృతిమాన్ మతిమాన్ దక్షః సత్కృతశ్చ యుగాధిపః |
గోపాలిర్గోపతిర్గ్రామో గోచర్మవసనో హరిః

86. హిరణ్యబాహుశ్చ తథా గుహాపాలః ప్రవేశినామ్ |
ప్రకృష్టారిర్మహాహర్షో జితకామో జితేంద్రియః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : ప్రేమానురాగాలకు ఆలంబనం - సకల జీవనాన్నీ, నకల చేతననూ ఈశ్వరుని యందు ప్రతిష్ఠించుకోడమే యోగసాధన లక్ష్యం. కాన, మన ప్రేమానురాగాలకు కూడా ఈశ్వరుడే ఆలంబనం కావాలి. ఈశ్వరునితో మన ఆత్మచేతన ఏకత్వం భజించడమే దానికి పునాదిగా ఏర్పడాలి, ఇతరమునెల్ల వీడి కేవలం ఈశ్వరు నాశ్రయించడమే దానికి రాచబాట. 🍀

🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

శ్రావణ మాసం

తిథి: కృష్ణ సప్తమి 28:15:20 వరకు

తదుపరి కృష్ణ అష్టమి

నక్షత్రం: అశ్విని 25:18:46 వరకు

తదుపరి భరణి

యోగం: శూల 18:16:11 వరకు

తదుపరి దండ

కరణం: విష్టి 16:48:13 వరకు

వర్జ్యం: 21:21:30 - 22:55:42

దుర్ముహూర్తం: 12:47:27 - 13:38:46

మరియు 15:21:24 - 16:12:43

రాహు కాలం: 07:33:07 - 09:09:20

గుళిక కాలం: 13:58:00 - 15:34:14

యమ గండం: 10:45:34 - 12:21:47

అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:46

అమృత కాలం: 18:13:06 - 19:47:18

సూర్యోదయం: 05:56:53

సూర్యాస్తమయం: 18:46:40

చంద్రోదయం: 23:09:19

చంద్రాస్తమయం: 11:18:12

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: మేషం

యోగాలు: రాక్షస యోగం - మిత్ర

కలహం 25:18:46 వరకు తదుపరి

చర యోగం - దుర్వార్త శ్రవణం

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹