శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 468 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 468 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 468 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 468 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా ।
సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥ 🍀
🌻 468. 'వామదేవీ' - 2 / 468. 'Vamadevi' - 2 🌻
జీవులకు కర్మానుభవము, కర్మఫలము ఇచ్చునది వామదేవియే. కర్మానుభవము లేనిచో జీవులకు పరిణామము లేదు. పరిణామము లేనిచో పరిపూర్ణత లేదు. జీవులు పరిపూర్ణులైననే గాని పరితృప్తులు కాలేరు. అందులకే వారికి కర్మానుభవము అవసరము. కర్మానుభవమున కర్మఫలముల ననుభవించుచు క్రమముగ జీవులు నిష్కామ కర్మమునకు ఉద్యుక్తు లగుదురు. అపుడు వారి జీవితములు యజ్ఞార్థము లగును. యజ్ఞార్థ జీవమున పరిపూర్ణులై పరితృప్తు లగుదురు. ఈ సమస్త కార్యమును నిర్వర్తించునది వామదేవి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 468 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 97. Vajreshvari vamadevi vayovasdha vivarjita
sideshvari sidhavidya sidhamata yashasvini ॥ 97 ॥ 🌻
🌻 468. 'Vamadevi' - 2 🌻
Vamadevi is the one who gives Karmanubhava and Karmaphala to living beings. Without Karmanubhava there is no evolution for living beings. Without evolution there is no perfection. Beings cannot be satisfied until they are perfect. For that they need experience. In Karmanubhava, experiencing the fruits of Karma, living beings are attracted to Nishkama Karma. Then their lives will be a sacrifice. They are perfected and satisfied in the life of sacrifice. Vamadevi is the one who performs all this work.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment