🌹 15, JANUARY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

🍀🌹 15, JANUARY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 15, JANUARY 2023 MONDAY సోమవారం, ఇందు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
*🍀 మకర సంక్రాంతి, పొంగలి శుభాకాంక్షలు అందరికి, Pongal, Makar Sankranti Good Wishes to All 🍀*
*ప్రసాద్ భరద్వాజ*
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 487 / Bhagavad-Gita - 487 🌹
🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -18 / Chapter 12 - Devotional Service - 18 🌴
🌹. శ్రీ శివ మహా పురాణము - 842 / Sri Siva Maha Purana - 842 🌹
🌻. దేవదేవ స్తుతి - 2 / Prayer to the lord of gods - 2 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 100 / Osho Daily Meditations  - 100 🌹
🍀 100. తక్కువ శక్తి / 100. LOW ENERGY 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 524 - 528 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 524 - 528 - 3 🌹 
🌻 521 to 528 నామ వివరణము - 3 / 521 to 528 Names Explanation - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 15, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*🍀 మకర సంక్రాంతి, పొంగలి శుభాకాంక్షలు అందరికి, Pongal, Makar Sankranti Good Wishes to All 🍀*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మకర సంక్రాంతి, పొంగలి, Pongal, Makar Sankranti 🌻*

*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 120 🍀*

120. గుహః కాంతో నిజః సర్గః పవిత్రం సర్వపావనః |
శృంగీ శృంగప్రియో బభ్రూ రాజరాజో నిరామయః

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : అధిమనఃప్రవృత్తి : మహస్సు నందలి అవిభాజ్య తేజస్సును అంది పుచ్చుకొన్నప్పుడు అధి మనస్సు దానిని నానాప్రకారములుగా విభజిస్తూ వున్నది మనోభూమికలో చేతన మరింత సంకోచం పొందుతుంది కనుక, ఈ విభాగములలో ఏ ఒక్కదానినో మాత్రమే ముఖ్యసత్యంగా భావించి తక్కిన వాటిని ఆముఖ్యములుగా పరిగణించడాని కవకాశమున్నది. 'హిరణ్మయేనపాత్రేణ సత్యన్య ఆపిహితం ముఖం' 'ఋతేన ఋతం అపిహితం' అనెడి శ్రుతు లలో సూచితమైనది ఈ అధిమనః ప్రవృత్తియే యని చెప్పవచ్చు. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
హేమంత ఋతువు, ఉత్తరాయణం,
పుష్య మాసము
తిథి: శుక్ల పంచమి 26:18:13
వరకు తదుపరి శుక్ల షష్టి
నక్షత్రం: శతభిషం 08:07:31
వరకు తదుపరి పూర్వాభద్రపద
యోగం: వరియాన 23:10:28
వరకు తదుపరి పరిఘ
కరణం: బవ 15:38:52 వరకు
వర్జ్యం: 14:00:04 - 15:28:20
దుర్ముహూర్తం: 12:47:39 - 13:32:27
మరియు 15:02:03 - 15:46:51
రాహు కాలం: 08:13:15 - 09:37:15
గుళిక కాలం: 13:49:15 - 15:13:15
యమ గండం: 11:01:15 - 12:25:15
అభిజిత్ ముహూర్తం: 12:03 - 12:47
అమృత కాలం: 01:35:48 - 03:02:44
మరియు 22:49:40 - 24:17:56
సూర్యోదయం: 06:49:14
సూర్యాస్తమయం: 18:01:15
చంద్రోదయం: 10:01:13
చంద్రాస్తమయం: 22:07:20
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: అమృత యోగం - కార్య సిధ్ది 
08:07:31 వరకు తదుపరి ముసల
యోగం - దుఃఖం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🍀 మకర సంక్రాంతి, పొంగలి శుభాకాంక్షలు అందరికి, Pongal, Makar Sankranti Good Wishes to All 🍀*
*ప్రసాద్ భరద్వాజ*

*🌹🍀. మకర సంక్రాంతి 🍀🌹*

*సంక్రాంతి లక్ష్మి ఒంటరిగా రాదు. వణికించే చలిని, కురిసే మంచును తరిమికొట్టే మంటల కిరీటంతో మందు భోగిని, వెనుక కనుమను వెంటేసుకుని చెలికత్తెల మధ్య రాజకుమారిలా వస్తుంది.. సంక్రాంతి కాంతి నిచ్చే పండుగ. అందాల పండుగ. ఆనందాల పండుగ. పతంగుల పండుగ. ముగ్గుల పండుగ. గొబ్బెమ్మల పండుగ. హరిదాసుల పండుగ. గంగిరెద్దుల పండుగ. పాటల పండుగ. జానపదాల పండుగ. జనపదాల పండుగ. సర్వశుభాలను కలిగించే పర్వదినం.*

*హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల సందడి ఇవన్నీ సంక్రాంతి పండుగనాళ్ళలో కనిపిస్తుంటాయి. భోగి, మకర సంక్రాంతి, కనుము అనే మూడు రోజుల పెద్దపండుగగా సంక్రాంతిని జరుపుకుంటారు. ప్రళయస్థితిలో భూమండలం సముద్రంలో మునిగి వుండేది. ఆదివరాహ రూపంలో శ్రీమహావిష్ణువు భూమిని మకర సంక్రాంతి రోజునే భూమిని ఉద్దరించాడన్నది పురాణ కథనం.*
 
*వామనావతారంలో విష్ణువు బలిచక్రవర్తి శిరస్సుపై కాలుపెట్టి పాతాళానికి తొక్కింది కూడా సంక్రాంతి రోజునే. మహాభారత యుద్ధంలో కురువృద్ధుడు భీష్ముడు అవసాన దశలో అంపశయ్యపై వుండి ఉత్తరాయణ పుణ్యకాలం వరకూ వేచివుండి అశువులు విడిచాడు. పుణ్యగతులు మకర సంక్రమణం రోజున సంప్రాప్తిస్తాయని, ఈ నెలలో వైకుంఠ ద్వారాలు తెరిచి వుంటాయని పెద్దలంటారు. ఇలా ఎన్నో విశేషాలు, పుణ్యఫలాలు మూటగట్టుకున్న పండుగ కనుకే ఇది పెద్దల పండగ అయ్యింది. పెద్ద పండుగగా మారింది. సంక్రాంతి రోజున సూర్యారాధనతోపాటు పూజలు, తర్పణాలు, దానాలు లాంటివి చేస్తుంటారు.*
 
*సంక్రాంతి నాడు పాలు పొంగించి, దానితో పరమాన్నం చేస్తారు. ఇదే కాదు- అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సకినాలు, పాలతాలికలు, సేమియా పాయసం, పులిహోర, గారెలు వంటి వంటకాలు తయారుచేస్తారు. ఇళ్ల ముందు తీర్చే ముగ్గుల ముచ్చట్ల విషయానికి వస్తే అలికిన వాకిళ్లు నిర్మలాకాశంతో సమానం.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 487 / Bhagavad-Gita - 487 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -18 🌴*

*18. సమ: శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయో: |*
*శీతోష్ణసుఖదు:ఖేషు సమ: సఙ్గవివర్జిత: ||*

*🌷. తాత్పర్యం : శత్రుమిత్రుల యెడ సమభావము కలిగిన వాడును, మానావమానము లందు, శీతోష్ణములందు, సుఖదుఃఖములందు, నిందాస్తుతులందు సమబుద్ధి కలిగినవాడును...*

*🌷. భాష్యము : భక్తుడు సమస్త దుష్టసంగము నుండి సదా దూరుడై యుండును. ఒకప్పుడు పొగడుట, మరియొకప్పుడు నిందించుట యనునది మానవసంఘపు నైజము. కాని భక్తుడు అట్టి కృత్రిమములైన మానావమానములకు, సుఖదుఃఖములకు సదా అతీతుడై యుండును. అతడు గొప్ప సహనవంతుడై యుండును.*

*“హరావభక్తస్య కుతో మహద్గుణ: - అనగా భక్తుడు కానివానికి శుభ లక్షణము లుండజాలవు.” కనుక భక్తునిగా గుర్తింప బడగోరువాడు శుభలక్షణములను వృద్ధిపరచుకొనవలెను. కాని వాస్తవమునకు ఈ గుణములను పొందుటకు భక్తుడు బాహ్యముగా యత్నింపనవసరము లేదు. కృష్ణభక్తిభావన యందు మరియు భక్తియుతసేవ యందు నిమగ్నత ఆ గుణములను వృద్ధిచేసికొనుటకు అప్రయత్నముగా అతనికి సహాయభూతమగును.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 487 🌹
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 12 - Devotional Service - 18 🌴*

*18. samaḥ śatrau ca mitre ca tathā mānāpamānayoḥ*
*śītoṣṇa-sukha-duḥkheṣu samaḥ saṅga-vivarjitaḥ*

*🌷 Translation : One who is equal to friends and enemies, who is equipoised in honor and dishonor, heat and cold, happiness and distress, fame and infamy...*

*🌹 Purport : A devotee is always free from all bad association. Sometimes one is praised and sometimes one is defamed; that is the nature of human society. But a devotee is always transcendental to artificial fame and infamy, distress or happiness. He is very patient. He does not speak of anything but the topics about Kṛṣṇa; therefore he is called silent. Silent does not mean that one should not speak; silent means that one should not speak nonsense. One should speak only of essentials, and the most essential speech for the devotee is to speak for the sake of the Supreme Lord.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 842 / Sri Siva Maha Purana - 842 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 30 🌴*

*🌻. దేవదేవ స్తుతి - 2 🌻*

*విష్ణువు పూర్వము నందు వలె ఆ నందిని చక్కగా స్తుతించి నమస్కరించి ఆతని అనుమతిని పొంది ఆనందముతో మెల్లగా లోపలకు ప్రవేశించెను (10). అచటకు వెళ్లి అచట గొప్ప శోభ గలది, ఎత్తైనది, ప్రకాశించే దేహములు గల గణములతో చుట్టు వారబడి యున్నది, చక్కగా అలంకరింపబడినది అగు ఆ శంభుని సభను గాంచెను (11). మహేశ్వరుని రూపముగల ఆ గణములు పది భుజములతో, అయిదు ముఖములతో, మూడు కన్నులతో నల్లని కంఠములతో ప్రకాశించిరి. వారు దివ్యకాంతులతో ఒప్పారుచుండిరి (12). వారు మంచి రత్నములు పొదిగిన ఆభరణములను రుద్రాక్షలను అలంకరించుకొని భస్మను ధరించి యుండిరి. చతురస్రాకారముతో మనోహరముగా నున్న ఆ సభ నూతన చంద్రమండలము వలె శోభిల్లెను (13). మణులు, వజ్రములు పొదిగిన హారములతో ఆ సభ శోభిల్లెను. విలువ కట్టలేని రత్నములు పొదిగియున్న ఆ సభ పద్మపత్రములతో శోభిల్లుచుండెను (14).*

*మాణిక్యముల తోరణములు కలిగినది, రంగురంగుల కాంతులను విరజిమ్మునది, పద్మరాగ ఇంద్రనీల మణులతో అద్భుతముగా శంకరుని ఇచ్ఛకు అనురూపముగా నిర్మింపబడినది (15), స్యమంతకమణులు పొదిగినవి. బంగరు త్రాళ్లతో కట్టబడినవి, సుందరమగు చందననిర్మితమైన లతాపల్లవాదులతో శోభిల్లునవియగు వందమెట్లు కలిగినది (16), ఇంద్రనీల మణులు స్తంభములతో చుట్టువారబడి మిక్కిలి మనోహరముగా నున్నది, అంతటా చక్కగా అలంకరింప బడినది, పరిమళ భరితమగు వాయువుచే నిండి యున్నది (17), వేయి యోజనముల వెడల్పు గలది, అనేక మంది కింకరులతో నిండియున్నది అగు సభలో జగన్మాతతో గూడి యున్న శంకరుని దేవదేవుడగు విష్ణువు గాంచెను (18).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 842 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 30 🌴*

*🌻 Prayer to the lord of gods - 2 🌻*

10. After bowing to and eulogising Nandin as Brahmā did before, Viṣṇu was permitted by Nandin and he entered joyously.

11. Going in, they saw the grand assembly chamber of Śiva, highly decorated and thronged by his attendants with lustrous bodies.

12. The attendants had similar forms with lord Śiva. They had ten arms, five faces, three eyes and blue necks. They had auspicious lustre and were brilliant.

13. They were bedecked in ornaments set with gems, They wore Rudrākṣas. They had smeared themselves with the ashes. The chamber was square in shape and beautiful like the lunar sphere.

14. Gems, necklaces, diamonds, etc. increased its brilliance. Valuable precious stones were used to stud them. It was brightened by lotus petals.

15. Māṇikya, Padmarāga and other valuable gems were used in the same. It was very wonderful. It was laid according to the desire of Śiva.

16. It had hundreds of steps leading to it, each made of Syamantaka stone; knotted golden threads joined them. Beautiful sprouts of sandal beautified it.

17. Columns of sapphire supported it. It was richly decorated. The wind wafted fragrance everywhere.

18. The chamber was a thousand Yojanas wide. Many servants were in attendance. Viṣṇu the lord of gods saw Śiva seated along with Pārvatī.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 100 / Osho Daily Meditations  - 100 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 100. తక్కువ శక్తి 🍀*

*🕉 తక్కువ శక్తి కలిగి ఉంటే తప్పు అని అనుకోకండి. అధిక శక్తిని కలిగి ఉండటం గురించి ప్రత్యేకంగా ఏమీ లేదు. 🕉*

*మీరు అధిక శక్తిని విధ్వంసక శక్తిగా ఉపయోగించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధిక శక్తి గల వ్యక్తులు శతాబ్దాలుగా చేస్తున్నది అదే. ప్రపంచం ఎప్పుడూ తక్కువ శక్తి ఉన్నవారితో బాధపడలేదు. నిజానికి, వారు అత్యంత అమాయక ప్రజలు. వారు హిట్లర్ లేదా స్టాలిన్ లేదా ముస్సోలినీ కాలేరు. వారు ప్రపంచ యుద్ధాలను సృష్టించలేరు. వారు ప్రపంచాన్ని జయించటానికి ప్రయత్నించరు. వారు ప్రతిష్ఠాత్మకమైనవారు కారు. వారు పోరాడలేరు రాజకీయ నాయకులు కాలేరు.*

*తక్కువ శక్తి ఉదాసీనతగా మారితేనే తప్పు. ఇది సానుకూలంగా ఉంటే, దానిలో తప్పు లేదు. అధిక శక్తి గల అరుపులకు మరియు తక్కువ శక్తి గల గుసగుసలకు మధ్య వ్యత్యాసం వంటిది. అరవడం మూర్ఖత్వం మరియు గుసగుసలు మాత్రమే సరైనవి అయిన సందర్భాలు ఉన్నాయి. అరవడానికి అనువుగా ఉన్నవారు కొందరు, గుసగుసలాడేవారు మరికొంత మంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 100 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 100. LOW ENERGY 🍀*

*🕉  Don't think that anything is wrong with having low energy. There is also nothing especially right about having high energy.  🕉*

*You can use high energy as a destructive force. That's what high energy people all over the world have been doing all through the centuries. The world has never suffered from low-energy people. In fact, they have been the most innocent people. They cannot become a Hitler or a Stalin or a Mussolini. They cannot create world wars. They don't try to conquer the world. They are not ambitious. They cannot fight or become politicians.*

*Low energy is wrong only if it becomes indifference. If it remains positive, nothing is wrong with it. The difference is like the difference between shouting, which is high energy, and whispering, which is low energy. There are moments when shouting is foolish and only whispering is right.  There are a few people who are attuned to shouting and a few who are attuned to whispering.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 521 - 528 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 521 - 528 - 3  🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥ 
*108. మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా ।*
*హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ ॥ 108 ॥ 🍀*

*🌻 521 to 528 నామ వివరణము - 3 🌻*

*ఘనమునకు కూడ ఆరు ముఖములు కలవు. ఆరు ముఖములు సంవత్సర మందలి ఆరు ఋతువులతో పెద్దలు సమన్వయింతురు. తత్కారణముగ సంవత్సర చక్రమును గాయత్రి స్వరూపముగ దర్శించు సంప్రదాయ మేర్పడినది.  ఆరు ఋతువుల యందు పన్నెండు పూర్ణిమలు, పన్నెండు అమావాస్యలు కలవు. ఈ ఇరువది నాలుగు పర్వదినములు గాయత్రి మాత ఇరువది నాలుగు తత్త్వములుగ సంవత్సరమున దర్శించి కీర్తించుట ఋషుల సంప్రదాయము. గోళము వ్యక్తరూపమే ఘన మనియూ, ఘనము సృష్టి సమగ్ర రూపమనియూ, అట్టి ఘనము శ్రీమాత చైతన్యమనియూ తెలియవలెను.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 521 - 528 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 aagynachakrabja nilaya shuklavarna shadanana ॥ 107 ॥*
*108. Majasansdha hansavati mukhyashakti samanvita*
*haridranai karasika hakinirupa dharini  ॥ 108 ॥ 🌻*

*🌻 521 to 528 Names Explanation - 3 🌻*

*The gross world also has six faces. The elders coordinate the six faces with the six seasons of the year. Thus the tradition of seeing the cycle of a year as the form of Gayatri. There are twelve full moons and twelve new moons in the six seasons. It is the tradition of sages to visualise and glorify these twenty four days of the year as the twenty four tattvas of Mata Gayatri. It should be known that the sphere is the gross manifestation of the integral form of creation, and this gross form is the consciousness of Shrimata.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3

DAILY WISDOM - 197 : 15. It is not Easy for Us to Love God Wholly / నిత్య ప్రజ్ఞా సందేశములు - 197 : 15. దేవుణ్ణి పూర్తిగా ప్రేమించడం మనకు అంత . . .



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 197 / DAILY WISDOM - 197 🌹

🍀 📖 మహాభారతం మరియు భగవద్గీత యొక్క ఆధ్యాత్మిక అంశాలు 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 15. దేవుణ్ణి పూర్తిగా ప్రేమించడం మనకు అంత సులభం కాదు. 🌻


నిర్ణయం దేవుడే తీసుకుంటాడు - మనిషి నిర్ణయం తీసుకోలేడు.చివరికి ఏ నిర్ణయం తీసుకోవాలో శ్రీ కృష్ణుడు ఈ మార్గంలో ముందున్నాడు. విశ్వం ఒక వస్తువుగా, సూక్ష్మ రూపంలో అయినా ఉంచబడుతుందా లేదా పూర్తిగా రద్దు చేయబడుతుందా? ఇది పూర్తిగా గ్రహించబడుతుందా? మరియు మనం మొత్తం పదార్థ అస్తిత్వం యొక్క మరణశయ్యను చూడాలా లేదా కొంచెం దిగి, ఈ విపరీత స్థాయి ఆకాంక్షలకు తక్కువగా ఉన్న అంశాలతో ఒక ఒప్పందానికి రావాల్సిన అవసరం ఉందా? యుధిష్ఠిరుడు అల్లాడుతున్నాడు మరియు ఒక నిర్ధారణకు రాలేకపోయాడు; మరియు మనం కూడా అలానే అల్లాడుతున్నాము.

మనం భగవంతుడిని పూర్తిగా ప్రేమించడం అంత సులభం కాదు, ఎందుకంటే ఇది భగవంతుని ఉనికిలో ప్రపంచం మొత్తాన్ని కరిగించవలసిన అవసరాన్ని అంగీకరించడం అని అర్థం, మరియు ఎవరూ ఈ పరీక్షకు సులభంగా సిద్ధంగా ఉండరు. “కృష్ణుడు నా రక్షకుడు మరియు నా స్నేహితుడు, తత్వవేత్త మరియు మార్గదర్శి అనేది నిజం, కానీ దుర్యోధనుడు నా బావ మరియు నా బంధువు - నేను అతనిని ఎలా దెబ్బతీస్తాను? భీష్ముడు నా పితామహుడు, ద్రోణుడు నా గురువు. యుద్ధరంగంలో నాకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపించే వీరి సిరల ద్వారా నా స్వంత రక్తం ప్రవహిస్తోంది. కాబట్టి ఆత్మ ఆడే ద్వందత్వపు అట ఇది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 197 🌹

🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 15. It is not Easy for Us to Love God Wholly 🌻

The decision is taken by God Himself—man cannot take the decision. And Sri Krishna took up the lead in this path of what decision is to be taken finally. Is the universe as an object to be retained, even in a subtle form, or is it to be abolished altogether? Is it to be absorbed totally? And do we have to see to the deathbed of the entire objective existence, or is it necessary to strike a lesser note and come to an agreement with factors which are far below this level of extreme expectation? Yudhishthira was wavering, and could not come to a conclusion; and we too are wavering.

It is not easy for us to love God wholly, because that would mean the acceptance of the necessity to dissolve the whole world itself in the existence of God, and one would not easily be prepared for this ordeal. “It is true that Krishna is my saviour and my friend, philosopher and guide, but Duryodhana is my brother-in-law and my cousin—how can I deal a blow to him? Bhishma is my grandsire and Drona is my Guru. My own blood flows through the veins of these that seem to be harnessed against me in the arena of battle.” So there is a double game that the spirit plays.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 886 / Vishnu Sahasranama Contemplation - 886


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 886 / Vishnu Sahasranama Contemplation - 886🌹

🌻 886. అనన్తః, अनन्तः, Anantaḥ 🌻

ఓం అనన్తాయ నమః | ॐ अनन्ताय नमः | OM Anantāya namaḥ

నిత్యత్వాత్ సర్వగతత్వాదనన్త ఇతి కథ్యతే ।
దేశకాలాపరిచ్ఛిన్నో విష్ణుర్వా శేషరూపధృత్ ॥

నిత్యుడును, సర్వగతుడును, దేశకాల కృతమగు పరిచ్ఛేదము అనగా పరిమితి లేనివాడగుటచే శ్రీ విష్ణువునకు అనంతుడని నామము. అనంతుడు అనగా అంతము లేనివాడు. ఆదిశేషుడనియైనను చెప్పవచ్చును.

659. అనన్తః, अनन्तः, Anantaḥ


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 886 🌹

🌻 886. Anantaḥ 🌻

OM Anantāya namaḥ


नित्यत्वात् सर्वगतत्वादनन्त इति कथ्यते ।
देशकालापरिच्छिन्नो विष्णुर्वा शेषरूपधृत् ॥

Nityatvāt sarvagatatvādananta iti kathyate,
Deśakālāparicchinno viṣṇurvā śeṣarūpadhr‌t.


Since He is eternal, omnipresent and not limited by constraints like time and space - Lord Viṣṇu is called Anantaḥ the limitless. Or since also He is of the form of Ādiśeṣa, the name Anantaḥ.


659. అనన్తః, अनन्तः, Anantaḥ


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka

अनन्तो हुतभुग् भोक्ता सुखदो नैकजोऽग्रजः ।
अनिर्विण्णस्सदामर्षी लोकाधिष्ठानमद्भुतः ॥ ९५ ॥

అనన్తో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।
అనిర్విణ్ణస్సదామర్షీ లోకాధిష్ఠానమద్భుతః ॥ 95 ॥

Ananto hutabhug bhoktā sukhado naikajo’grajaḥ,
Anirviṇṇassadāmarṣī lokādhiṣṭhānamadbhutaḥ ॥ 95 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹




కపిల గీత - 294 / Kapila Gita - 294


🌹. కపిల గీత - 294 / Kapila Gita - 294 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 7. మానవజన్మను పొందే జీవుని గతిని వర్ణించుట - 25 🌴

25.పరచ్ఛందం నవిదుషా పుష్యమాణో జనేన సః|
అనభిప్రేత మాసన్నః ప్రత్యాఖ్యాతు మనీశ్వరః॥


తాత్పర్యము : ఆ శిశువు యొక్క అభిప్రాయమును ఏ మాత్రము తెలియని వ్యక్తుల ద్వారా ఆ శిశువు పోషించ బడును.ఇట్టి పరిస్థితిలో తనకు ఇష్టము కాని దానిని అనుభవింప వలసి వచ్చును. అప్పుడు దానిని కాదని త్రోసిపుచ్చే సామర్థ్యము కూడా ఆ జీవికి (తనకు) ఉండదు.

వ్యాఖ్య : తల్లి పొత్తికడుపులో, పిల్లల పోషణ ప్రకృతి యొక్క స్వంత ఏర్పాటు ద్వారా నిర్వహించ బడుతుంది. పొత్తికడుపు లోపల వాతావరణం అస్సలు ఆహ్లాదకరంగా ఉండదు, కానీ పిల్లల అహార విషయానికొస్తే, అది ప్రకృతి నియమాల ప్రకారం సరిగ్గా జరుగుతుంది. కానీ పొత్తికడుపు నుండి బయటకు రాగానే పిల్లవాడు భిన్నమైన వాతావరణంలోకి పడిపోతాడు. అతను ఒకదాన్ని తినాలను కుంటాడు, కానీ అతని అసలు కోరిక ఎవరికీ తెలియదు కాబట్టి అతనికి మరొకటి ఇవ్వబడుతుంది. అతనికి ఇచ్చిన దాని అవాంఛనీయతను అతను తిరస్కరించ లేడు. కొన్నిసార్లు బిడ్డ తల్లి రొమ్ము కోసం ఏడుస్తుంది, కానీ నర్సు తన కడుపులో నొప్పి కారణంగా ఏడుస్తున్నదని భావించి, ఆమె అతనికి చేదు మందు ఇస్తుంది. పిల్లవాడు దానిని కోరుకోడు, కానీ అలాగని అతను దానిని తిరస్కరించలేడు. ఈ విధంగా చాలా సార్లు అతను చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉంచబడతాడు కనుక అది ఎంతో బాధగా ఉంటుంది.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 294 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 7. Lord Kapila's Instructions on the Movements of the Living Entities - 25 🌴

25. para-cchandaṁ na viduṣā puṣyamāṇo janena saḥ
anabhipretam āpannaḥ pratyākhyātum anīśvaraḥ

MEANING : After coming out of the abdomen, the child is given to the care of persons who are unable to understand what he wants, and thus he is nursed by such persons. Unable to refuse whatever is given to him, he falls into undesirable circumstances.

PURPORT : Within the abdomen of the mother, the nourishment of the child was being carried on by nature's own arrangement. The atmosphere within the abdomen was not at all pleasing, but as far as the child's feeding was concerned, it was being properly done by the laws of nature. But upon coming out of the abdomen the child falls into a different atmosphere. He wants to eat one thing, but something else is given to him because no one knows his actual demand, and he cannot refuse the undesirables given to him. Sometimes the child cries for the mother's breast, but because the nurse thinks that it is due to pain within his stomach that he is crying, she supplies him some bitter medicine. The child does not want it, but he cannot refuse it. He is put in very awkward circumstances, and the suffering continues.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


14 Jan 2024 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 14, జనవరి, JANUARY 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ ఆదివారం, Sunday, భాను వాసరే

🍀. భోగి శుభాకాంక్షలు అందరికి, Lohiri Good Wishes to all 🍀

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : భోగి Lohiri 🌻

🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 74 🍀


74. అనిర్దేశ్యవపుః శ్రీమాన్ విపాప్మా బహుమంగలః |
స్వఃస్థితః సురథః స్వర్ణో మోక్షదో బలికేతనః

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : అధీమనస్సు - చేతనా విశ్వపు పరార్థ, అపరార్ధముల నడిమిగీతపై నున్నది అధిమనస్సు. పరార్ధములోని మహస్సుకూ అపరార్ధములోని మనస్సుకూ మద్యస్థానం దీనిది. మహస్సు నుండి తేజస్సు నందిపుచ్చుకొని యిది దానిపైన ఆధార పడివున్నా, దాని పూర్ణ తేజస్సును మాత్రం మనకు మరుగుపరచి దాని కవరోధమై ఉంటున్నది. 🍀

🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

హేమంత ఋతువు, దక్షిణాయణం,

పుష్య మాసము

తిథి: శుక్ల తదియ 08:01:44

వరకు తదుపరి శుక్ల చవితి

నక్షత్రం: ధనిష్ట 10:23:30

వరకు తదుపరి శతభిషం

యోగం: వ్యతీపాత 26:39:48

వరకు తదుపరి వరియాన

కరణం: గార 08:00:44 వరకు

వర్జ్యం: 16:54:12 - 18:21:08

దుర్ముహూర్తం: 16:31:06 - 17:15:52

రాహు కాలం: 16:36:42 - 18:00:39

గుళిక కాలం: 15:12:46 - 16:36:42

యమ గండం: 12:24:53 - 13:48:49

అభిజిత్ ముహూర్తం: 12:02 - 12:46

అమృత కాలం: 01:02:42 - 02:28:54

మరియు 25:35:48 - 27:02:44

సూర్యోదయం: 06:49:08

సూర్యాస్తమయం: 18:00:39

చంద్రోదయం: 09:18:08

చంద్రాస్తమయం: 21:07:36

సూర్య సంచార రాశి: ధనుస్సు

చంద్ర సంచార రాశి: కుంభం

యోగాలు: మతంగ యోగం - అశ్వ

లాభం 10:23:30 వరకు తదుపరి

రాక్షస యోగం - మిత్ర కలహం

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹


భోగి పండుగ శుభాకాంక్షలు, Good Wishes on Bhogi/Lohiri Festival


🌹🍀. భోగి పండుగ శుభాకాంక్షలు అందరికి, Lohiri Festival Good Wishes to all 🍀🌹

ప్రసాద్ భరద్వాజ

🌻 భోగి అంటే ఏమిటి ? | ఈ భోగి పండుగ ఎలా వచ్చింది ? | భోగి మంట , భోగిపళ్ళ వెనుక దాగిన రహస్యాలు ఏమిటి ? 🌻

పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం.

దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు, దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మన అందరికి తెలిసింది. మరైతే ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణం మరియు "శాస్త్రీయ కారణాలు" తెలుసుకుందాం..

"భుగ్" అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం.

పూర్వం ఈ దినమే శ్రీ రంగనధాస్వామి లో గోదాదేవి లీనమై భొగాన్ని పొందిందని దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాద.. శ్రీ మహా విష్ణువు వామన అవతారం లో బలి చక్రవర్తిని పాతాళం లోకి తొక్కిన పురాణ గాద మనందరికీ తెలిసిందే అయితే తరువాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశిర్వదించమని వరమివ్వడం జరిగిందట. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రొజు ఇదే. శాపవశంగా పరమేశ్వరుని వాహనమయిన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రొజు ఇదే అనేవి కూడా పురాణాల గాద.

సాదారణంగా అందరు చెప్పేది, ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలం లో అనేక వ్యాదులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పిడిస్తాయి. వాటికి ఔషదంగా ఇది పని చేస్తుంది. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రవి, మామిడి, మేడి మొదలైన ఔషద చెట్ల బెరడ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యని వేస్తారు. అగ్ని హోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశి ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువు (oxygen) ను విడుదల చేస్తుంది. ఈ ఔషద మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరం లోని 72,000 నడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషదం ఇవ్వవచ్చు, అదే అందరికి వస్తే అందరికి ఔషదం సమకూర్చడం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చెయించుకొలేని పేదలు కూడా ఉండవచ్చు. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరు కలిసి భోగి మంటల్లో పాల్గొనే సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరడం ప్రజల మద్యన దూరాలను తగ్గిస్తుంది, ఐక్యమత్యాని పెంచుతుంది. ఇది ఒకరకంగా అగ్ని దేవుడికి ఆరాధనా, మరోరకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా.

కాని మనం ఫాషన్, సృజనాత్మకత పేరుతో రబ్బరు టైర్లను పెట్రోలు పోసి తగల బెట్టి, దాని విష వాయువులను పిలుస్తూ, కాలుష్యాన్ని చేస్తూ మన ఆరోగ్యాన్ని తగలేసుకుంటున్నాం. పర్యావరణాన్ని నాశనం చేస్తునం. ఉన్న రోగాలే కాక కొత్త రోగాలని తెచ్చుకుంటున్నాం. ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులని కాల్చండి అని వింటుంటాం. పనికి రాణి వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కావు.

ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచుకోవాలి. మన భారతదేశం లో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కాని భారతదేశాని ఆక్రమించుకోలేమనుకున్న బ్రిటిషు దండుగులు, భోగి మంటల్లో పాత సామాన్లు తగల బెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్నఅతి ప్రాచిన తాళపత్ర గ్రంధాలను భోగి మంటల్లో వేసి కల్పించేసారు. నిజానికి భోగి మంటల్లో కచాల్సింది పాత వస్తువులని కాదు , మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి.

🌹🌹🌹🌹🌹