శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 553 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 553 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 553 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 553 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।
కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀

🌻 553. ‘అగ్రగణ్యా’ - 1 🌻


మొదటగా లెక్కింపదగినది శ్రీదేవి అని అర్థము. అవ్యక్తము వ్యక్తమైనపుడు సృష్టికథ ప్రారంభమగును. ప్రప్రథమ ముగ అవ్యక్తమునుండి వెలువడునది సంకల్పము. ఆ సంకల్పమే వెలుగై ఆ వెలుగు నుండే సమస్తము పుట్టును. ఉదాహరణకు నిద్రయందున్న మనము లేచిన వెనుక ఎరుక కలుగును. నిద్ర లేపిన దెవరు? నిద్రలో మనమున్నామని కూడ మనకి తెలియదు. లేనట్లుగ వుందుము. లేనట్లుండిన స్థితి నుండి మనకు తెలియని సంకల్పమేదో మనలను మేల్కొలిపిన వెనుక మన మున్నామని ఎరుక కలుగును. ఇట్లు లేనట్లుగ వున్న స్థితి నుండి వున్నట్లుగ వుండు స్థితికి సృష్టిని, జీవులను కొనివచ్చునది శ్రీమాతయే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 553 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 113. Agraganya chintyarupa kalikalmashanashini
katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻

🌻 553. 'Agraganya' - 1 🌻


Foremost to be counted is Sridevi. When the unmanifest becomes manifest, the story of creation begins. Will is what emerges from the unmanifest first. That will is the light and everything is born from that light. For example, when we wake up after sleep, we are realised. Who woke up up? We do not even know that we are asleep. We pretend as if we are not asleep. From a state of non-existence, when a will that we do not know about awakens us, we feel our existence. It is Sri Mata who can bring the creation and living beings from the state of non-existence to the state of being.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


సిద్దేశ్వరయానం - 116 Siddeshwarayanam - 116

🌹 సిద్దేశ్వరయానం - 116 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 12 🏵


నేను కుర్తాళ పీఠాధిపతినైన తరువాత సహజ పరిణామంగా సిద్ధేశ్వరీపీఠం కూడా జప, ధ్యాన, హోమ కేంద్రంగా మారిపోయింది. అక్కడ ప్రత్యేకంగా యజ్ఞశాల అంతకుముందే అనేక కుండాలతో నిర్మించబడి ఉండటం వల్ల ఒకే సమయంలో వివిధ సాధకులు తమ మంత్రములతో హోమాలు చేసుకోవటానికి ఏర్పాట్లు చేయబడినవి. జపపురశ్చరణలు చేసిన అనేకులు ఇప్పుడు దశాంశ హోమాలు చేసుకోవటానికి కుర్తాళానికి వస్తున్నారు. ఇప్పుడు వసతి గృహంలోని గదులన్నీ నిండిపోతున్నవి. నిరంతర హోమధూమములతో ఆకాశం మేఘావృతమైనదా అనిపిస్తున్నది. వైదిక సంప్రదాయములో వేదమంత్ర సాధనచేయటానికి ఉపనయనమైన వ్యక్తులు మాత్రమే అర్హులు. కానీ తంత్రోక్తమైన మంత్రములు చేయటానికి అందరికీ అర్హత ఉన్నది. స్త్రీలు, పురుషులు అన్ని కులముల వారు అన్ని జాతుల వారు అర్హులే.

మేరుతంత్రము, శారదాతిలకతంత్రము, మంత్రమహోదధి, శాక్త ప్రమోదము మొదలైన ప్రామాణిక గ్రంథాలు వేదాధికారము లేనివారు కూడా హోమములు చేసే ప్రక్రియ తెలియచేసినవి. ఆ గ్రంథముల నుండి వాటిని తీసి ఆ ప్రక్రియను ముద్రింప చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చాను. కుర్తాళంలోను, గుంటూరులోను మా పీఠానికి సంబంధించిన అనేక ఆలయాలలోను హోమములు ఇప్పుడు నిరంతరాయముగా సాగుతున్నవి.

కాళీదేవి అవతరణ వల్ల గుంటూరులోని స్వయం సిద్ధకాళీపీఠం సిద్ధిస్థానమైతే, మహనీయుడైన మౌనస్వామి ప్రభావం వల్ల కుర్తాళం సిద్ధకేంద్రం అయింది. అద్భుతశక్తి సంపన్నమైన నాడీగణపతి ఆలయము, ప్రధాన పీఠదేవత అయిన సిద్ధేశ్వరీ మందిరము, మౌనస్వామి సమాధి మందిరము దివ్యశక్తి కేంద్రములై సాధకులకు చాలా వేగంగా మంత్రసిద్ధిని కలిగిస్తూ దివ్యానుభవాలను ప్రసాదిస్తున్నవి. అలానే పాతాళ ప్రత్యంగిరా భద్రకాళి మందిరంలో సమర్పిస్తున్న కూష్మాండాది బలుల వల్ల, చేస్తున్న పూజా నైవేద్యముల వల్ల, సాధకుల జపసమర్పణల వల్ల, మంగళవార రాహుకాల పూజల వల్ల, అమావాస్య హోమముల వల్ల ఆకర్షించబడి ఒక తీవ్రదేవత అక్కడకు చేరింది. భక్తులకు కామితములు ప్రసాదిస్తున్నది. అందువలన అక్కడి కార్యక్రమాలలో పాల్గొనే ప్రజల సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతున్నది.

తమిళదేశంలో ప్రత్యంగిరా దేవత చండమార్తాండ స్ఫూర్తితో ఇవాళ ప్రకాశిస్తున్నది. రాజకీయరంగంలోని ప్రముఖులు కొందరు ప్రత్యంగిరాయజ్ఞాలవల్ల ఎన్నికలలో గెలిచి అధికారములోకి వచ్చారని ప్రజలలో వ్యాపించటంతో ఆ దేవతా మందిరాలు చాలా ఎక్కువగా నిర్మించబడినవి. అందుకే మా పూర్వస్వామి కుర్తాళపీఠంలో పాతాళ ప్రత్యంగిరా లయాన్ని నిర్మించారు. నేను పీఠాధిపతినయిన తరువాత విశాఖపట్టణంలో గుంటూరులో హైదరాబాదులో ప్రత్యంగిర ఆలయాలు నిర్మించి ఎంతటి కష్టాలనయినా పోగొట్టటం జరుగుతున్నది.

నలభై యేండ్ల నుండి అధర్వణవేదంలోని ప్రత్యంగిరా ఋక్కులు పారాయణ చేయటం నా దినచర్యలో భాగం. ప్రత్యంగిరా భద్రకాళీ హోమములు నేను చాలా ఇష్టంతో చేసిన క్రతువులు. కుర్తాళ పీఠానికి వచ్చిన తరువాత మౌనస్వామి అనుగ్రహం వల్ల ప్రజోపకార విషయంలో నాకు శ్రమ చాలా తగ్గింది. ఇంతకు ముందు ఎవరికయినా ఇబ్బంది తొలగించవలసి వస్తే అవసరమయిన మంత్ర ప్రయోగం జప, హోమ, ప్రక్రియలతో చేయవలసి వచ్చేది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఆశ్చర్యకర పరిణామాలను ఋజువు చేసినవి.

విశాఖపట్టణంలో ఓపెన్ హార్టు సర్జరీ కోసం ఒక భద్రమహిళ ఆపరేషన్ థియేటరులోకి తీసుకొని పోబడుతున్న సమయంలో ఆమె యందు అభిమానం కల ఇద్దర ప్రముఖులు మా లలితాపీఠానికి వచ్చి ఆపరేషను విజయవంతంగా జరిగేటట్లు ఆశీర్వదించమని అభ్యర్థించారు. నేను మౌనస్వామిని స్మరించి మంత్రాక్షతలు ఇచ్చాను. వాటిని తీసుకువెళ్ళి ఆమె శిరస్సున ఉంచారు. థియేటరులోకి తీసుకొని వెళ్ళినతరువాత శస్త్ర చికిత్స చేసే ముందు జాగ్రత్త కోసం ఫైనల్ చెకప్చేస్తే వ్యాధి లక్షణాలు కనపడలేదు. ఆపరేషన్ అవసరం లేదని నిర్ణయించి డాక్టర్లు ఆశ్చర్యంతో ఆమెను వెనక్కి పంపించారు. ఇటువంటి సంఘటనలు మరికొన్ని కూడా జరిగి మౌనస్వామి యొక్క ప్రభావాన్ని అడుగడుగునా తెలియచేసినవి. నేను ఎక్కింది విక్రమార్క సింహాసనం అనిగ్రహించాను.

ధ్యానయోగులనేకులు నాలో వివిధ దేవతలు ఉండటాన్ని చూచారు. కొందరు కాళిని, కొందరు రాధను కొందరు భద్రను, కొందరు హనుమంతుని చూస్తే, మరికొందరు మౌనస్వామిని చూడగలిగారు. పాదపూజ జరిగినప్పుడల్లా మౌనస్వామి అష్టోత్తర శతనామావళిని పఠించినపుడు ఆయన అవతరించటాన్ని చాలా మంది దార్శనికులు చూడగలిగారు.

( సశేషం )

🌹🌹🌹🌹🌹

శ్రీమద్భగవద్గీత - 559: 15వ అధ్., శ్లో 08 / Bhagavad-Gita - 559: Chap. 15, Ver. 08

 

🌹. శ్రీమద్భగవద్గీత - 559 / Bhagavad-Gita - 559 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 08 🌴

08. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర: |
గృహీత్వైతాని సంయాతి వాయుర్గన్ధానివాశయాత్ ||


🌷. తాత్పర్యం : వాయువు గంధము మోసుకొనిపోవునట్లే, జీవుడు ఈ భౌతికజగమున తన వివిధ భావములను ఒక దేహము నుండి వేరొక దేహమునకు గొనిపోవుచుండును. ఈ విధముగా అతడు ఒక దేహమును గ్రహించి, తిరిగి వేరొక దేహమును పొందుటకై దానిని విడుచుచుండును.

🌷. భాష్యము : తన దేహమునకు “ఈశ్వరుడు” (నియామకుడు) అని జీవుడిచ్చట వర్ణింపబడినాడు. తలచినచో అతడు ఉన్నతజన్మకు సంబంధించిన దేహమును పొందవచ్చును లేదా నీచదేహములందు ప్రవేశింపవచ్చును. ఈ విషయమున అతనికి సూక్ష్మమైన స్వాతంత్ర్యము కలదు. అనగా దేహమందలి మార్పు దేహియైన అతని పైననే ఆధారపడియున్నది. అతడు రూపొందించుకొనిన చైతన్యము మరణసమయమున అతనిని వేరొక విధమైన దేహమునకు గొనిపోవును. అతడు తన చైతన్యము మరణసమయమున అతనిని వేరొక విధమైన దేహమునకు గొనిపోవును. అతడు తన చైతన్యమును శునక, మార్జాలముల వంటి జంతువుల చైతన్యముతో సమానము కావించుకొనినచో అట్టి శునక, మార్జాల దేహమునే తప్పక పొందవలసివచ్చును. దేవతా లక్షణములందు అతని చైతన్యము లగ్నమైనచో మరణానంతరము దేవతాశరీరమును పొందును.

ఒకవేళ కృష్ణభక్తిరసభావితుడైనచో ఆధ్యాత్మిక జగము నందలి కృష్ణలోకమును చేరి కృష్ణుని సాహచార్యమును పొందును. కావున దేహము నశించిన పిమ్మట సర్వము ముగిసిపోవునని పలుకుట మిథ్యావాదమే యగును. ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పుచెందు జీవుని వర్తమానదేహము మరియు దాని యందలి కర్మలు భావిజన్మకు నాంది కాగలవు. కర్మననుసరించే జీవుడు దేహమును పొందును. ఆ విధముగా లభించిన దేహమును జీవుడు తిరిగి సుక్ష్మశరీరమే తరువాతి జన్మలోని దేహమును తయారు చేయుచున్నదని ఇచ్చట పేర్కొనబడినది. ఒక దేహమును విడిచి వేరొక దేహమును పొందుట మరియు దేహమందున్నప్పుడు వివిధక్లేశములకు గురియగుట యనెడి ఈ విధానమే “కర్షతి” (జీవనసంఘర్షణము) యని పిలువబడును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 559 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 15 - Purushothama Yoga - 08 🌴

08. śarīraṁ yad avāpnoti yac cāpy utkrāmatīśvaraḥ
gṛhītvaitāni saṁyāti vāyur gandhān ivāśayāt

🌷 Translation : The living entity in the material world carries his different conceptions of life from one body to another, as the air carries aromas. Thus he takes one kind of body and again quits it to take another.

🌹 Purport : Here the living entity is described as īśvara, the controller of his own body. If he likes, he can change his body to a higher grade, and if he likes he can move to a lower class. Minute independence is there. The change his body undergoes depends upon him. At the time of death, the consciousness he has created will carry him on to the next type of body. If he has made his consciousness like that of a cat or dog, he is sure to change to a cat’s or dog’s body. And if he has fixed his consciousness on godly qualities, he will change into the form of a demigod. And if he is in Kṛṣṇa consciousness, he will be transferred to Kṛṣṇaloka in the spiritual world and will associate with Kṛṣṇa. It is a false claim that after the annihilation of this body everything is finished.

The individual soul is transmigrating from one body to another, and his present body and present activities are the background of his next body. One gets a different body according to karma, and he has to quit this body in due course. It is stated here that the subtle body, which carries the conception of the next body, develops another body in the next life. This process of transmigrating from one body to another and struggling while in the body is called karṣati, or struggle for existence.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 03, AUGUST 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹

🍀🌹 03, AUGUST 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 559 / Bhagavad-Gita - 559 🌹
🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 08 / Chapter 15 - Purushothama Yoga - 08 🌴
3) 🌹 సిద్దేశ్వరయానం - 116 🌹
 🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 12 🏵 
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 553 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 553 - 1 🌹 
🌻 553. ‘అగ్రగణ్యా’ - 1 / 553. 'Agraganya' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 559 / Bhagavad-Gita - 559 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 08 🌴*

*08. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర: |*
*గృహీత్వైతాని సంయాతి వాయుర్గన్ధానివాశయాత్ ||*

*🌷. తాత్పర్యం : వాయువు గంధము మోసుకొనిపోవునట్లే, జీవుడు ఈ భౌతికజగమున తన వివిధ భావములను ఒక దేహము నుండి వేరొక దేహమునకు గొనిపోవుచుండును. ఈ విధముగా అతడు ఒక దేహమును గ్రహించి, తిరిగి వేరొక దేహమును పొందుటకై దానిని విడుచుచుండును.*

*🌷. భాష్యము : తన దేహమునకు “ఈశ్వరుడు” (నియామకుడు) అని జీవుడిచ్చట వర్ణింపబడినాడు. తలచినచో అతడు ఉన్నతజన్మకు సంబంధించిన దేహమును పొందవచ్చును లేదా నీచదేహములందు ప్రవేశింపవచ్చును. ఈ విషయమున అతనికి సూక్ష్మమైన స్వాతంత్ర్యము కలదు. అనగా దేహమందలి మార్పు దేహియైన అతని పైననే ఆధారపడియున్నది. అతడు రూపొందించుకొనిన చైతన్యము మరణసమయమున అతనిని వేరొక విధమైన దేహమునకు గొనిపోవును. అతడు తన చైతన్యము మరణసమయమున అతనిని వేరొక విధమైన దేహమునకు గొనిపోవును. అతడు తన చైతన్యమును శునక, మార్జాలముల వంటి జంతువుల చైతన్యముతో సమానము కావించుకొనినచో అట్టి శునక, మార్జాల దేహమునే తప్పక పొందవలసివచ్చును. దేవతా లక్షణములందు అతని చైతన్యము లగ్నమైనచో మరణానంతరము దేవతాశరీరమును పొందును.*

*ఒకవేళ కృష్ణభక్తిరసభావితుడైనచో ఆధ్యాత్మిక జగము నందలి కృష్ణలోకమును చేరి కృష్ణుని సాహచార్యమును పొందును. కావున దేహము నశించిన పిమ్మట సర్వము ముగిసిపోవునని పలుకుట మిథ్యావాదమే యగును. ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పుచెందు జీవుని వర్తమానదేహము మరియు దాని యందలి కర్మలు భావిజన్మకు నాంది కాగలవు. కర్మననుసరించే జీవుడు దేహమును పొందును. ఆ విధముగా లభించిన దేహమును జీవుడు తిరిగి సుక్ష్మశరీరమే తరువాతి జన్మలోని దేహమును తయారు చేయుచున్నదని ఇచ్చట పేర్కొనబడినది. ఒక దేహమును విడిచి వేరొక దేహమును పొందుట మరియు దేహమందున్నప్పుడు వివిధక్లేశములకు గురియగుట యనెడి ఈ విధానమే “కర్షతి” (జీవనసంఘర్షణము) యని పిలువబడును.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 559 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 15 - Purushothama Yoga - 08 🌴*

*08. śarīraṁ yad avāpnoti yac cāpy utkrāmatīśvaraḥ*
*gṛhītvaitāni saṁyāti vāyur gandhān ivāśayāt*

*🌷 Translation : The living entity in the material world carries his different conceptions of life from one body to another, as the air carries aromas. Thus he takes one kind of body and again quits it to take another.*

*🌹 Purport : Here the living entity is described as īśvara, the controller of his own body. If he likes, he can change his body to a higher grade, and if he likes he can move to a lower class. Minute independence is there. The change his body undergoes depends upon him. At the time of death, the consciousness he has created will carry him on to the next type of body. If he has made his consciousness like that of a cat or dog, he is sure to change to a cat’s or dog’s body. And if he has fixed his consciousness on godly qualities, he will change into the form of a demigod. And if he is in Kṛṣṇa consciousness, he will be transferred to Kṛṣṇaloka in the spiritual world and will associate with Kṛṣṇa. It is a false claim that after the annihilation of this body everything is finished.*

*The individual soul is transmigrating from one body to another, and his present body and present activities are the background of his next body. One gets a different body according to karma, and he has to quit this body in due course. It is stated here that the subtle body, which carries the conception of the next body, develops another body in the next life. This process of transmigrating from one body to another and struggling while in the body is called karṣati, or struggle for existence.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 సిద్దేశ్వరయానం - 116 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*

*🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 12 🏵*

*నేను కుర్తాళ పీఠాధిపతినైన తరువాత సహజ పరిణామంగా సిద్ధేశ్వరీపీఠం కూడా జప, ధ్యాన, హోమ కేంద్రంగా మారిపోయింది. అక్కడ ప్రత్యేకంగా యజ్ఞశాల అంతకుముందే అనేక కుండాలతో నిర్మించబడి ఉండటం వల్ల ఒకే సమయంలో వివిధ సాధకులు తమ మంత్రములతో హోమాలు చేసుకోవటానికి ఏర్పాట్లు చేయబడినవి. జపపురశ్చరణలు చేసిన అనేకులు ఇప్పుడు దశాంశ హోమాలు చేసుకోవటానికి కుర్తాళానికి వస్తున్నారు. ఇప్పుడు వసతి గృహంలోని గదులన్నీ నిండిపోతున్నవి. నిరంతర హోమధూమములతో ఆకాశం మేఘావృతమైనదా అనిపిస్తున్నది. వైదిక సంప్రదాయములో వేదమంత్ర సాధనచేయటానికి ఉపనయనమైన వ్యక్తులు మాత్రమే అర్హులు. కానీ తంత్రోక్తమైన మంత్రములు చేయటానికి అందరికీ అర్హత ఉన్నది. స్త్రీలు, పురుషులు అన్ని కులముల వారు అన్ని జాతుల వారు అర్హులే.* 

*మేరుతంత్రము, శారదాతిలకతంత్రము, మంత్రమహోదధి, శాక్త ప్రమోదము మొదలైన ప్రామాణిక గ్రంథాలు వేదాధికారము లేనివారు కూడా హోమములు చేసే ప్రక్రియ తెలియచేసినవి. ఆ గ్రంథముల నుండి వాటిని తీసి ఆ ప్రక్రియను ముద్రింప చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చాను. కుర్తాళంలోను, గుంటూరులోను మా పీఠానికి సంబంధించిన అనేక ఆలయాలలోను హోమములు ఇప్పుడు నిరంతరాయముగా సాగుతున్నవి. *

*కాళీదేవి అవతరణ వల్ల గుంటూరులోని స్వయం సిద్ధకాళీపీఠం సిద్ధిస్థానమైతే, మహనీయుడైన మౌనస్వామి ప్రభావం వల్ల కుర్తాళం సిద్ధకేంద్రం అయింది. అద్భుతశక్తి సంపన్నమైన నాడీగణపతి ఆలయము, ప్రధాన పీఠదేవత అయిన సిద్ధేశ్వరీ మందిరము, మౌనస్వామి సమాధి మందిరము దివ్యశక్తి కేంద్రములై సాధకులకు చాలా వేగంగా మంత్రసిద్ధిని కలిగిస్తూ దివ్యానుభవాలను ప్రసాదిస్తున్నవి. అలానే పాతాళ ప్రత్యంగిరా భద్రకాళి మందిరంలో సమర్పిస్తున్న కూష్మాండాది బలుల వల్ల, చేస్తున్న పూజా నైవేద్యముల వల్ల, సాధకుల జపసమర్పణల వల్ల, మంగళవార రాహుకాల పూజల వల్ల, అమావాస్య హోమముల వల్ల ఆకర్షించబడి ఒక తీవ్రదేవత అక్కడకు చేరింది. భక్తులకు కామితములు ప్రసాదిస్తున్నది. అందువలన అక్కడి కార్యక్రమాలలో పాల్గొనే ప్రజల సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతున్నది.* 

*తమిళదేశంలో ప్రత్యంగిరా దేవత చండమార్తాండ స్ఫూర్తితో ఇవాళ ప్రకాశిస్తున్నది. రాజకీయరంగంలోని ప్రముఖులు కొందరు ప్రత్యంగిరాయజ్ఞాలవల్ల ఎన్నికలలో గెలిచి అధికారములోకి వచ్చారని ప్రజలలో వ్యాపించటంతో ఆ దేవతా మందిరాలు చాలా ఎక్కువగా నిర్మించబడినవి. అందుకే మా పూర్వస్వామి కుర్తాళపీఠంలో పాతాళ ప్రత్యంగిరా లయాన్ని నిర్మించారు. నేను పీఠాధిపతినయిన తరువాత విశాఖపట్టణంలో గుంటూరులో హైదరాబాదులో ప్రత్యంగిర ఆలయాలు నిర్మించి ఎంతటి కష్టాలనయినా పోగొట్టటం జరుగుతున్నది.*

*నలభై యేండ్ల నుండి అధర్వణవేదంలోని ప్రత్యంగిరా ఋక్కులు పారాయణ చేయటం నా దినచర్యలో భాగం. ప్రత్యంగిరా భద్రకాళీ హోమములు నేను చాలా ఇష్టంతో చేసిన క్రతువులు. కుర్తాళ పీఠానికి వచ్చిన తరువాత మౌనస్వామి అనుగ్రహం వల్ల ప్రజోపకార విషయంలో నాకు శ్రమ చాలా తగ్గింది. ఇంతకు ముందు ఎవరికయినా ఇబ్బంది తొలగించవలసి వస్తే అవసరమయిన మంత్ర ప్రయోగం జప, హోమ, ప్రక్రియలతో చేయవలసి వచ్చేది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఆశ్చర్యకర పరిణామాలను ఋజువు చేసినవి.*

*విశాఖపట్టణంలో ఓపెన్ హార్టు సర్జరీ కోసం ఒక భద్రమహిళ ఆపరేషన్ థియేటరులోకి తీసుకొని పోబడుతున్న సమయంలో ఆమె యందు అభిమానం కల ఇద్దర ప్రముఖులు మా లలితాపీఠానికి వచ్చి ఆపరేషను విజయవంతంగా జరిగేటట్లు ఆశీర్వదించమని అభ్యర్థించారు. నేను మౌనస్వామిని స్మరించి మంత్రాక్షతలు ఇచ్చాను. వాటిని తీసుకువెళ్ళి ఆమె శిరస్సున ఉంచారు. థియేటరులోకి తీసుకొని వెళ్ళినతరువాత శస్త్ర చికిత్స చేసే ముందు జాగ్రత్త కోసం ఫైనల్ చెకప్చేస్తే వ్యాధి లక్షణాలు కనపడలేదు. ఆపరేషన్ అవసరం లేదని నిర్ణయించి డాక్టర్లు ఆశ్చర్యంతో ఆమెను వెనక్కి పంపించారు. ఇటువంటి సంఘటనలు మరికొన్ని కూడా జరిగి మౌనస్వామి యొక్క ప్రభావాన్ని అడుగడుగునా తెలియచేసినవి. నేను ఎక్కింది విక్రమార్క సింహాసనం అనిగ్రహించాను.*

*ధ్యానయోగులనేకులు నాలో వివిధ దేవతలు ఉండటాన్ని చూచారు. కొందరు కాళిని, కొందరు రాధను కొందరు భద్రను, కొందరు హనుమంతుని చూస్తే, మరికొందరు మౌనస్వామిని చూడగలిగారు. పాదపూజ జరిగినప్పుడల్లా మౌనస్వామి అష్టోత్తర శతనామావళిని పఠించినపుడు ఆయన అవతరించటాన్ని చాలా మంది దార్శనికులు చూడగలిగారు.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 553 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 553 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।*
*కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀*

*🌻 553. ‘అగ్రగణ్యా’ - 1 🌻*

*మొదటగా లెక్కింపదగినది శ్రీదేవి అని అర్థము. అవ్యక్తము వ్యక్తమైనపుడు సృష్టికథ ప్రారంభమగును. ప్రప్రథమ ముగ అవ్యక్తమునుండి వెలువడునది సంకల్పము. ఆ సంకల్పమే వెలుగై ఆ వెలుగు నుండే సమస్తము పుట్టును. ఉదాహరణకు నిద్రయందున్న మనము లేచిన వెనుక ఎరుక కలుగును. నిద్ర లేపిన దెవరు? నిద్రలో మనమున్నామని కూడ మనకి తెలియదు. లేనట్లుగ వుందుము. లేనట్లుండిన స్థితి నుండి మనకు తెలియని సంకల్పమేదో మనలను మేల్కొలిపిన వెనుక మన మున్నామని ఎరుక కలుగును. ఇట్లు లేనట్లుగ వున్న స్థితి నుండి వున్నట్లుగ వుండు స్థితికి సృష్టిని, జీవులను కొనివచ్చునది శ్రీమాతయే.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 553 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 113. Agraganya chintyarupa kalikalmashanashini*
*katyayani kalahantri kamalaksha nishevita  ॥113 ॥ 🌻*

*🌻 553. 'Agraganya' - 1 🌻*

*Foremost to be counted is Sridevi. When the unmanifest becomes manifest, the story of creation begins. Will is what emerges from the unmanifest first. That will is the light and everything is born from that light. For example, when we wake up after sleep, we are realised. Who woke up up? We do not even know that we are asleep. We pretend as if we are not asleep. From a state of non-existence, when a will that we do not know about awakens us, we feel our existence. It is Sri Mata who can bring the creation and living beings from the state of non-existence to the state of being.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

🌹 02, AUGUST 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹

🍀🌹 02, AUGUST 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹🍀
1) 🌹 చైతన్యము యొక్క వివిధ వ్యక్త రూపములే మనం 🌹
2) 🌹 We are Various Manifestations of Consciousness 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 958 / Vishnu Sahasranama Contemplation - 958 🌹
🌻 958. పణః, पणः, Paṇaḥ 🌻
4) 🌹 సిద్దేశ్వరయానం - 115🌹
🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 11 🏵
5) 🌹. శివ సూత్రములు - 272 / Siva Sutras - 272 🌹
🌻 3 - 45. భూయః స్యాత్ ప్రతిమిలానం - 2 / 3 - 45. bhūyah syāt pratimīlanam - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 చైతన్యము యొక్క వివిధ వ్యక్త రూపములే మనం 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*చైతన్యం మరియు స్పృహ యొక్క లోతైన అర్థాన్ని, దాని విభిన్న రూపాలను తెలుసుకోండి. స్పృహ మనలను విశ్వానికి ఎలా కలుపుతుందో, స్వీయ అవగాహన ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎలా దారితీస్తుందో అర్థం చేసుకోండి. బాహ్య ప్రపంచం మరియు మన అంతర్గత ఆత్మ మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం ద్వారా ఈ స్వీయ జ్ఞాన ప్రయాణాన్ని ప్రారంభించండి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 We are Various Manifestations of Consciousness 🌹*
*Prasad Bharadwaj*

*Learn the deeper meaning of consciousness and consciousness and its different forms. Understand how self-awareness connects us to the universe and how self-awareness leads to spiritual growth. Begin the journey of self-knowledge by discerning the difference between the outer world and our inner self.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 958 / Vishnu Sahasranama Contemplation - 958 🌹*

*🌻 958. పణః, पणः, Paṇaḥ 🌻*

*ఓం పణాయ నమః | ॐ पणाय नमः | OM Paṇāya namaḥ*

ప్రణతిర్వ్యవహారార్థస్తం కుర్వన్ పణ ఉచ్యతే ।
పుణ్యాని సర్వకర్మాణి పణం సఙ్గృహ్య యచ్ఛతి ॥
తత్ఫలమధికారిభ్య ఇతి లక్షణయా హరిః ।
పణ ఇత్యుచ్యతే సద్భిర్విద్వద్భిః శ్రుతిపారగైః ॥

*'పణ' ధాతువునకు 'వ్యవహారము', 'వ్యవహరించుట' అను అర్థములు కలవు. పరమాత్ముడు వ్యవహరించు చున్నాడు.*

*'సర్వాణి రూపాణి విచిత్య ధీరో - నామాని* *కృత్వాఽభివదన్ యదాస్తే' (తైత్తిరీయ ఆరణ్యకము 3.12) *

*- 'విచారణశీలుడగు పరమ పురుషుడు దృశ్య ప్రపంచము నందలి సకల రూపములను విచారణ చేసి, వానికి నామములను అనగా ఆయా అర్థములను చెప్పదగు శబ్దములను ఏర్పరచి వానితో లోకమున వ్యవహరించుచు ఉన్నాడు - అనునది ఏది కలదో!' అను శ్రుతి ఇందు ప్రమాణము.*

*పుణ్య కర్మములను అన్నిటిని పణముగా అనగా వెలగా తీసికొని వారి వారి అధికారమునకు తగిన ఫలములను ప్రదానము చేయును అను అర్థమున లక్షణావృత్తిచే పరమాత్ముని 'పణః' అనవచ్చును.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 958🌹*

*🌻958. Paṇaḥ🌻*

*OM Paṇāya namaḥ*

प्रणतिर्व्यवहारार्थस्तं कुर्वन् पण उच्यते ।
पुण्यानि सर्वकर्माणि पणं सङ्गृह्य यच्छति ॥
तत्फलमधिकारिभ्य इति लक्षणया हरिः ।
पण इत्युच्यते सद्भिर्विद्वद्भिः श्रुतिपारगैः ॥

Praṇatirvyavahārārthastaṃ kurvan paṇa ucyate,
Puṇyāni sarvakarmāṇi paṇaṃ saṅgr‌hya yacchati.
Tatphalamadhikāribhya iti lakṣaṇayā hariḥ,
Paṇa ityucyate sadbhirvidvadbhiḥ śrutipāragaiḥ.

*Paṇati is used in the sense of worldly dealings. He does them; He causes the worldly activities to take place - so Paṇaḥ*

vide the śruti 'Sarvāṇi rūpāṇi vicitya dhīro - nāmāni kr‌tvā’bhivadan yadāste' (Taittirīya āraṇyaka 3.12) -

*'He, the wise One remains creating the various forms and giving names to them.'*

*All meritorious activities are paṇam. He who collectively confers the fruits to their adhikāris or the ones who are entitled - is, by a figure of speech, called Paṇaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥
ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥
Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 115 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
                     
*🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 11 🏵*

*చిన్నవయసులో మొదట పురుష దేవతా మంత్రాలే సాధన చేశాను. శివపంచాక్షరి, గణపతి, హనుమాన్, కార్తవీర్యార్జున, నాగరాజ మంత్రాలను లక్షలకు లక్షలు జపములు, హోమములు చేశాను. వాటి వల్ల మంచి అనుభవాలు పొందాను. గణపతి ముని ప్రభావం నా మీద పడి శాక్తేయ మార్గంలోకి సాధన మళ్ళింది. ఛిన్నమస్త వజ్రవైరోచనీ మంత్రసాధన ప్రారంభించి ఆ దేవత వల్ల ఎన్నో కష్టాలను ఎదుర్కో గలిగాను. బలవంతులతో విరోధములు, సంవత్సరాల తరబడి కోర్టు వివాదాలు విపరీత విపత్కర పరిస్థితులు చెప్పలేనన్ని ఇబ్బందులు అన్నింటిలోను జయాన్ని ప్రసాదించింది- ఈ మహాశక్తి. మహామాంత్రికుడైన అద్దంకి కృష్ణమూర్తి నేను ఛిన్నమస్త హోమం చేస్తూంటే తాను కూడా కలసి పాల్గొని అగ్నిగుండంలో ఆమె నిల్చోటాన్ని గమనించి ఇంత భీషణ దేవతను నేను ఎన్నడూ చూడలేదు. ఈ మహత్తర శక్తి మీకు అండగా ఉండటం వల్ల మిమ్ము ఎవరూ ఏమీ చేయలేరు" అని చేతులెత్తి నమస్కరించాడు.*

*శివపంచాక్షరి చేస్తున్న కాలంలో శివుని గూర్చి వెయ్యి పద్యాలతో 'శివసాహస్రి' రచించినట్లే ఈ దేవతను గూర్చి కూడా 'ఐంద్రీ సాహస్రి' అన్న పేరుతో వెయ్యిపద్యాల స్తుతి కావ్యాన్ని రచించాను. ఇది ఇలా జరుగుతూ ఉండగానే రాధికాప్రసాద్ మహరాజ్ గారితో పరిచయం కావటం రాధాసాధనలోకి ప్రవేశించటం తటస్థించింది. దానికి సంబంధించిన విశేషాలను ఇంతకుముందే కొంత ప్రస్తావించాను. రాధా, వైరోచనీ మంత్రాలను రెంటినీ సంపుటి చేసికూడా కొన్ని పురశ్చరణలు చేశాను.*

*ఇలా కొన్ని సంత్సరాలు గడచిన తరువాత కాళీ దేవి జీవితంలోకి ప్రవేశించింది. నాలోని అంతఃశక్తిని బహిర్ముఖం చేసి కొత్త మలుపును తిప్పింది. ఆమె విగ్రహం రూపంగా అంతరిక్షం నుండి అవతరించటంతో లౌకికంగా అలౌకికంగా, చిత్ర విచిత్ర విన్యాసాలు ప్రారంభమయినవి. హృదయ ప్రేమమందిరంలో రాధాదేవి రసభావాను భవాలను కలిగిస్తూంటే వైరోచనీ, కాళీదేవతలు, నా విజయ విక్రమ విహారాలకు సిద్ధసాధనలకు హేతువులైనారు. ఆధి వ్యాధిపీడితుల బాధ నివారించటానికి, దుష్ట గ్రహ నివారణకు వివిధములైన సమస్యలతో వచ్చిన జనులకు వాటిని పరిష్కరించటానికి నానుండి మంత్రోపదేశం పొంది సాధన చేస్తున్న వారు ముందుకు వెళ్ళటానికి ఈ దేవతలు ఎంతో సహాయం చేశారు.*

*ఆ మార్గంలో అనేక ధ్యానసమావేశాలు మొదలైనవి. ముఖ్యంగా రాత్రివేళలలో సుదీర్ఘ కాలం కాళీమందిరంలో ధ్యానం చేయటం దివ్యానుభవాలు పొందటం సాధకులకు అలవాటు అయింది. నెలల తరబడి సాగే హోమములలో లక్షల కొలది ఆహుతులు పడుతూ దేవతా ప్రీతిని వేగంగా తీసుకొస్తున్నవి. అత్యంత శక్తిమంతమైన ఈ హోమసాధనకు అధిక ప్రాధాన్య మిచ్చి దాని వల్ల అనూహ్యమైన అద్భుత ఫలితాలను సాధించటం జరిగింది.*

*ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక రోజు రాత్రి పూర్ణిమా హోమం జరుగుతున్నది. యజ్ఞం చూడటానికి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ రక్షకభట శాఖ సర్వాధికారి వచ్చాడు. “సమయానికి వచ్చారు, పట్టుబట్ట కట్టుకొని ఆహుతులు వేసి హోమంలో పాల్గొనండి" అన్నాను. ఆయన అలానే చేశాడు. హోమకుండంలో కొత్త దేవత వచ్చి నిల్చొన్నాడు. అప్పుడు ఆయనతో అన్నాను. నీరు హోమం చేసి ఏ దేవతను ఆవాహన చేసినా ఆదేవత హోమకుండంలో అవకరిస్తుంది. నేను వేసిన ఆహుతి ఎన్నడూ వ్యర్థం కాలేదు. కానీ మీరు ఇప్పుడు ఆహుతులు వేస్తుంటే మీ ఇష్టదేవత వచ్చినిల్చున్నది. అకృతి ఇది, పేరు ఇది. "ఆయన దిగ్భ్రాంతితో "ఈ రహస్యం ఎవరికీ తెలియదు. నేను చిన్నప్పుడు ఆ స్వామిగుడిలో ఆడుకొన్నాను. పాడుకొన్నాను. పెరిగి పెద్దవాడనై ఐ.పి.యస్.లో చేరి ఈ జిల్లాలో పోలీసు సూపరింటెండెంటుగా పనిచేశాను. ప్రమోషన్లు వచ్చి ఇప్పుడు డి.జి.పి. అయినాను. అయితే నా ఇష్టదేవతా రహస్యం ఎవరికీ తెలియదు మీరు ఎలా చెప్పారు !" అన్నాడు. "ఇందులో ఏమున్నది ! ఇదేమీ జ్యోతిష్యం కాదు, సాముద్రికం కాదు. కంటికి కనిపిస్తే చెప్పేది. జప హోమ ధ్యానముల వల్ల దివ్య చక్షువు వికసిస్తుంది. దానివల్ల ఇటువంటివి తెలుసుకోవటం సాధ్యమవుతుంది. మీరూ సాధన చేయండి. మీరు కూడా ఆ స్థితిని పొందవచ్చు" అన్నాను. ఇప్పుడు అతడా సాధనలో ఉన్నాడు.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 272 / Siva Sutras - 272 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*3వ భాగం - ఆణవోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 3 - 45. భూయః స్యాత్ ప్రతిమిలానం - 2 🌻*

*🌴. చైతన్యం యొక్క ప్రకాశం వల్ల పరిమిత జీవి కరిగి పోవడంతో, స్వచ్ఛమైన స్వయం తిరిగి దాని అసలైన స్వచ్ఛమైన స్థితికి తిరిగి వస్తుంది. 🌴*

*విశ్వం తనను తాను నిలబెట్టుకునే వ్యవస్థ పూర్తిగా స్వయంచాలితం. మనకు తెలిసిన సాధారణ స్వయంచాలిత వ్యవస్థలు కంప్యూటర్లు వంటివి. కానీ ఈ కంప్యూటర్లకు సంబంధించిన చిప్‌లు మానవ నిర్మితమైనవి. కంప్యూటర్లు స్వయంచాలక వ్యవస్థలను స్వాధీనం చేసుకునేలా అవసరమైన భాగాలను సమీకరించకపోతే, కంప్యూటర్లు స్వయంగా పనిచేయవు. కంప్యూటర్ల సమర్థవంతమైన పనితీరులో మనుషులు ఆధారంగా ఉన్నారు. అదే విధంగా, విశ్వం యొక్క స్వయంచాలక వ్యవస్థకు, భగవంతుడు అధారంగా ఉన్నాడు. కంప్యూటర్ వాడేవాడికి ఆ కంప్యూటర్ తయారు చేసిన వ్యక్తి ఎవరో తెలియదు. అదే విధంగా, విశ్వాన్ని సృష్టించడం వెనుక ఉన్న ఆ దివ్యశక్తి గురించి మనకు తెలియదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 272 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
*Part 3 - āṇavopāya*
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 3 - 45. bhūyah syāt pratimīlanam - 2 🌻*

*🌴. With the illumination of the consciousness and dissolution of the beingness, the pure-self reverts to its original, pure state again. 🌴*

*The system on which the universe sustains itself is totally automated. The typical automated systems that we are aware are computers. But the chips for these computers are manmade. Computers cannot function by themselves, unless necessary parts are assembled to make the computers take over automated systems. For effective functioning of computers, men are behind. In the same way, for the automated system of the universe, the Lord is behind. The one who uses a computer does not know the person who made that computer. Similarly, we are not aware of That Person, who is behind the making of the universe.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj