శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 553 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 553 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 553 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 553 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।
కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀

🌻 553. ‘అగ్రగణ్యా’ - 1 🌻


మొదటగా లెక్కింపదగినది శ్రీదేవి అని అర్థము. అవ్యక్తము వ్యక్తమైనపుడు సృష్టికథ ప్రారంభమగును. ప్రప్రథమ ముగ అవ్యక్తమునుండి వెలువడునది సంకల్పము. ఆ సంకల్పమే వెలుగై ఆ వెలుగు నుండే సమస్తము పుట్టును. ఉదాహరణకు నిద్రయందున్న మనము లేచిన వెనుక ఎరుక కలుగును. నిద్ర లేపిన దెవరు? నిద్రలో మనమున్నామని కూడ మనకి తెలియదు. లేనట్లుగ వుందుము. లేనట్లుండిన స్థితి నుండి మనకు తెలియని సంకల్పమేదో మనలను మేల్కొలిపిన వెనుక మన మున్నామని ఎరుక కలుగును. ఇట్లు లేనట్లుగ వున్న స్థితి నుండి వున్నట్లుగ వుండు స్థితికి సృష్టిని, జీవులను కొనివచ్చునది శ్రీమాతయే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 553 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 113. Agraganya chintyarupa kalikalmashanashini
katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻

🌻 553. 'Agraganya' - 1 🌻


Foremost to be counted is Sridevi. When the unmanifest becomes manifest, the story of creation begins. Will is what emerges from the unmanifest first. That will is the light and everything is born from that light. For example, when we wake up after sleep, we are realised. Who woke up up? We do not even know that we are asleep. We pretend as if we are not asleep. From a state of non-existence, when a will that we do not know about awakens us, we feel our existence. It is Sri Mata who can bring the creation and living beings from the state of non-existence to the state of being.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment