భగవద్దర్శిని - అవతార్ మెహర్ (Bhagavaddarśini - Avatār Meher)


𝕸𝖊𝖘𝖘𝖆𝖌𝖊𝖘 𝖋𝖗𝖔𝖒 1  𝖙𝖔   9   ....
𝕮𝖔𝖒𝖎𝖓𝖌 𝕾𝖔𝖔𝖓 . . .

 

Ṁ̷̨̧͚͎̞͔̋̒͑̉͜ë̶̛̥͓́̈̅s̴̱̯͇͙̰̭̼̑͛͂ś̶͎̯̌ͅà̴̟͛̄̀͘g̵̳̤̘̫̻̗̭̔́̐́̚ë̵̙̜͎͠s̴̢̪͚̭̃̓̉̑̔̃͛ ̸̢̨̨͕̹̘͈̦͔̖̂̌f̷̨̖̭̻̐̀̊̌̎́̂͝ŗ̷̨̰̩͗͌́ǫ̷̍͆̌̉̆̾́̇͝m̸̡̻̣̱͍͉̗̻̏́̀̕ ̵͎̰̼̮́̂̄ͅ1̴̡̡͉̻͙̲̪̉͜͠ ̶̯̔͋͋̽̂̾ ̶̛̠̯̞͗̓̈͒̇͜t̸̮͔̣̼̦͑͗̃̆͘͘͝ö̵̱̪͔̘̣͉̻̑̑̀̓̀̐͐͘̚ ̷̡͕͉̣̝͉̭̪̳̏̔̉̑̆̂̈͊̚͝ͅ ̷̡̨̛̪̭͕̟̔̄ ̶͉͈͉͋9̴̱͐͛͗̿͌͆̂͋͠ ̶̢̙̖̣̩̰̠̥̜͆͘͠ ̵̨̲͇̄̀͊̆ ̵̛̗̩̻̟̞̀͑̏͑̌̈́͝.̷͚̮͔̗̈́̕.̵̡͇̯͋̄̐̿͝.̶̢̛̩̟͚̯̜͖͕̀̄̌̍̍̓ͅͅ.̶̛͕̭̘̍̈́̿͌̃

̵̧̣͉̫̩͎̽̈͗͑́̈́͒̐͠C̶̙̪̳͋͐̑̉̈͑͐͋o̶̧̰̝͈̬̼̺̲̩̍̂̈́̍̀̍̕͜͝m̵̪̝̝̓i̷̡͚̝̬͛̽͝n̸̡͚̻̙̼̜̤̭̚ͅg̴͈̅͆̽ ̵̤̘̱̺͙̦̻̇̾̂͘S̴͎͉̮̳̟͆̒͒͒ö̷̪́̄̎̉̃̽͐͋͑o̶̡̘͇̻̦͕͊̈́ň̶̛̝̮̖̭͈͉̏̚͠ ̴͇͚̺̙͓́̀͌.̷͔̯̱̪̫̈́̓̆̄ ̵͓͎͎̳̠͗͛̒̆̎̇.̴͚̻̆̀̾̑̿̌̐ ̷̧̨̩̜̙̟̗͔͙̊̍̉̓͘.̵̡̛̮̿͊̿̿̋̀͒




------------------------------------ x ------------------------------------

. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 10 
. శ్రీ బాలగోపాల్
. ప్రసాద్ భరద్వాజ 

. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 10 

27. వేర్వేరు మతములు పరమాత్ముని ఇట్లు పిలుతురు.
సూఫీలు. --అల్లాహ్
జొరాస్ట్రియనులు. --అహూరామజ్దా
వేదాంతులు. --పరమాత్మా
క్రైస్తవులు. --పరమపిత,పరలోకతండ్రి
దార్శనికులు. --అధ్యాత్మా
28. పరమాత్మ స్థితి: కేవలము, అపరిమితము అనంతము అయిన అద్వైత స్థితి.
29. పరాత్పర స్థితికిని పరమాత్మ స్థితికిని మూలస్థితి లో భేదము లేదు.
30. అవ్యక్తమైన పరాత్పర స్థితిలో అంతర్నిహితమైయున్న ఆదిప్రేరణము భంగము కాగా, పరాత్పరుడు--పరమాత్మ--యను
మరియొక అనంతస్థితిని పొందెను.

11.Aug.2020

------------------------------------ x ------------------------------------

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 11 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 11 🌻

31.పరాత్పరునియొక్క అనంతవ్యక్తస్థితియే పరమాత్మ స్థితి.

32.భగవంతుని మొదటి స్థితియైన పరాత్పరస్థితి లో అంతర్నిహితమైయున్న అనంత 'ఆదిప్రేరణము'తనను తాను తెలిసికొనుటకు"నేను ఎవడును?"అని పరమాత్మ స్థితి లో తరంగములవలె చెల్లించెను.

33.పరాత్పరస్థితిలో అంతర్నిహితమై యున్నదంతయు పరమాత్మ స్థితిలోనే వ్యక్తమగుటకు ఆస్కారము కలిగినది.

34."నేను ఎవడను?"అను ఆదిప్రేరణము పరాత్పరస్థితిలో ఎన్నడు అనుభవము కాలేదు. పరమాత్మస్థితిలోనే "నేను భగవంతుడను"అని అనుభవమును పొందెను.

35. "నేను ఎవడను " అనెడి ఆదిప్రేరణము తరంగచలితమైన తక్షణమే, ఓకేసారి అంతర్నిహితమైయున్న అనంత చైతన్య స్థితియు, అనంత చైతన్య రాహిత్య స్థితియు, పరమాత్మా స్థితిలో అభివ్యక్తమయ్యెను.
🌹 🌹 🌹 🌹 🌹


12.Aug.2020

------------------------------------ x ------------------------------------

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 12 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 12 🌻

36.భగవంతుడు తన స్వీయ అనంతచైతన్య రాహిత్య స్థితియును, అనంతచైతన్యస్థితియును; తన రెండవ స్థితి ద్వారా మొదటి స్థితి లో యాదృచ్ఛికముగా పొందెను.

ఉపమానము :---

ఒక స్త్రీ తనకు గర్భధారణమైనదని భావించినప్పటినుండియు, తల్లి గర్భములో శిశువు పెరుగనారంభించును. 

కాలక్రమములో శిశువుయొక్క అవయవములన్నియు పెరుగుచుండును. అన్నింటితోపాటు 'నేత్రములు' కూడా పూర్తిగా తయారై వాటికి చూచెడి శక్యత ఏర్పడును.
శిశువు ఉదయించిన తరువాత కండ్లు తెరచినచో చూడగల్గును. కండ్లు మూసినచో చూడలేక పోవును.

అట్లే, ఏకకాలమందే అనంత చైతన్యమందు ఎఱుక లేనిస్థితి, ఎఱుకయున్న స్థితి ఒకేసారి యాదృచ్ఛికముగా పరమాత్మస్థితి లో వ్యక్తమయ్యెను.

37. భగవంతుని రెండవ స్థితియైన పరమాత్మలో ABC అను మూడు అంతర స్థితులున్నవి.

38. పరమాత్మ యొక్క (A) స్థితిలో అనంత చైతన్య రాహిత్య స్థితి, పరాత్పరస్థితిలోను పరమాత్మస్థితిలోనూ కూడా ఆనందంగా ఎరుక లేకనే శాశ్వతంగా నిలిచియున్నది.

భగవంతుడు = అనంత అస్థిత్వము + అనంత జ్ఞానము+అనంత ఆనందము౼అనంత చైతన్యము

= సత్ + చిత్ + ఆనంద (మైనస్) ఆజ్ఞాత చైతన్యము.

= సచ్చిదానందము (మైనస్) అజ్ఞాత చైతన్యము.
🌹 🌹 🌹 🌹 🌹

13.Aug.2020

------------------------------------ x ------------------------------------

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 13 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 13 🌻

39. పరమాత్మ యొక్క (B) స్థితిలో అనంత చైతన్యము, పరాత్పర స్థితిలోను పరమాత్మ స్థితిలోనుకూడా అనంతముగా ఎఱుకతో శాశ్వతముగా నిలిచియున్నది.

40. A = భగవంతుడు తన స్వీయ అనంత స్వభావత్రయమైన అనంత జ్ఞాన-శక్తి-ఆనందములను ఎరుకతో అనుభవించుటయు లేదు, పరులకై వినియోగించుటయు లేదు.

41. A == భగవంతునికి అనంతముగా ఎరుకలేని స్థితి.ఇది నిర్గుణ నిరాకారమును కాదు,సగుణ సాకారమును కాదు.ఇందు సృష్టియు, చైతన్యమును అంతర్నిహితములై యున్నవి.

42. ఆత్మ స్వీయ చైతన్యమును సంపాదించుటకు గాను, 
1.పరిణామ క్రమము
2. పునరావృత్తి క్రమము
3. ఆధ్యాత్మిక మార్గము
అనునవి ఆవశ్యకమై యున్నవి.

43.ఆత్మలన్నియు ఆ పరమాత్మలో ఉండెను,
ఆత్మలన్నియు ఆ పరమాత్మలో ఉన్నవి,
ఆత్మలన్నియు ఆ పరమాత్మలో ఉండును.

🌹 🌹 🌹 🌹 🌹

14.Aug.2020

------------------------------------ x ------------------------------------

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 14 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 14 🌻

44. ఆత్మలన్నియు ఒకటే.అన్ని ఆత్మలు ఒకటే.

45. ఆత్మలన్నియు అనంతమైనవి, శాశ్వతమైనవి, అవికారమైనవి.

46. పరమాత్మను హద్దులే లేనట్టి ఒక అనంతమైన మహా సాగరముతో పోల్చుకొనినచో, ఆత్మను ఒక బిందు లవలేశముతో పోల్చవచ్చును.

47. హద్దులు లేని అనంత పరమాత్మ అనెడు మహాసాగరము నుండి, బిందు ప్రమాణమైన ఆత్మ; సరిహద్దులే లేని పరమాత్మ సాగరమునుండి ఎట్లు బయట పడగలదు? ఎట్లు వేరు కాగలదు? బయట పడలేదు. వేరు కాలేదు కనుక. 
🌹 🌹 🌹 🌹 🌹

15.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 15 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 15 🌻

48. ఆత్మ,పరమాత్మలోనే ఉన్నది అనుట తొలిసత్యము. ఇంక, అసలు ఆత్మయే--పరమాత్మ అన్నది మలిసత్యము.

49. సాగరజలము నుండి ఒక బిందు లవలేశమును వెలికితీయక పూర్వము, అది సాగరములో కలిసియేయున్నది. బయటికి తీయబడినప్పుడే బిందు రూప మేర్పడుచున్నది.అనగా సాగరమే ఒక అనంతమైన నీటి బిందువు అని చెప్పవచ్చును.

50. వెలికి తీసిన బిందు లవలేశమును, అనంతసాగరముతో పోల్చినప్పుడు, బిందువునకు పరమాణు ప్రమాణముగల పరిమితి యేర్పడుచున్నది. బిందువు సాగరములో నున్నప్పుడు పరమాణు ప్రమాణమైన బిందువునకు కూడా అనంతత్వమే యేర్పడుచున్నది. కనుక

ఆత్మయే పరమాత్మ.

పరమాత్మయే ఆత్మ.

51.ఇప్పుడు మనము తనయందు స్పృహ లేని ఒక (అచేతనావస్థయందున్న) ఆత్మను గూర్చి యోచించుదుము.

52. ఆదిలో, ఆత్మకు సంస్కారములు లేవు.చైతన్యము లేదు.
🌹 🌹 🌹 🌹 🌹

16.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 1̼6̼  🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 16 🌻

53.సంస్కారములు, చైతన్యములేని ఆత్మయొక్క అనంతమైన నిశ్చల ప్రశాంత స్థితిలో, తానెవరో తెలిసికొనవలె ననెడి ఆదిప్రేరణమ ప్రతిధ్వనించునట్లు ఘోషించెను.

54.ఈ ఆదిప్రేరణము పరమాత్మలోనే అంతర్నిహితమైయుండెను.

55.అనంతసాగరుడైన పరమాత్ముడు ప్రథమ ప్రేరణమును పొందెను.

56. ఈ ప్రథమ ప్రేరణము, అనంతము యొక్క ప్రేరణయే ఇది ప్రారంభములో పరమాణు ప్రమాణములో ఉండెను.

57. అనంతములో --- శాంతము, అనంతము రెండునూ ఇమిడియె ఉన్నవి.

భగవల్లీల  (లేక) భగవద్విలాసము.

58. సర్వం(పరాత్పరస్థితి) లో అంతర్నిహితమైయున్న పరిమిత అభావము అనంతమైన సృష్టిగా అభివ్యక్తమగుటకు మూలకారణము 'సర్వకారణమత్వమే'

🌹 🌹 🌹 🌹 🌹

------------------------------------ x ------------------------------------

 

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 17 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 17 🌻

59. "నేను ఎవడను?" అని భగవంతుడు పలికిని మూలశబ్దమునే సర్వకారణత్వము అందురు.

నేను ఎవడను? - కారణం

సృష్టి - కార్యము.

60.భగవంతుని ఆది విలాసమే ఆతని తొలిపలుకు.
61. "నేనేవడను ?" అన్నదే భగవంతుని తొలిపలుకు.
62. ఆది విలాసము అభావమును సృష్టించెను.
63. "నేను ఎవడను ?" అన్నదే - భగవంతుని ఆదిమూలమైన అంతర్నిహిత ప్రథమ సంస్కారము
64. ఆదిమూలమైన ప్రథమసంస్కారమే అంతర్నిహితమైయున్న ఈ మిథ్యాజగత్తును సృష్టించినది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

18.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹.   ★彡    భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 18   彡★   🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 18 🌻

65. ఆదిప్రేరణముయొక్క ప్రతిధ్వనిఘోషలచే అప్పటికప్పుడు వైవిధ్యమనెడి బీజము నాటబడి అగోచర స్థితిలో అంకురించి ద్వైత రూపములో తొలిసారిగా వ్యక్తమయ్యెను

66. ఆదిప్రేరణలయొక్క ప్రతిధ్వని ఘోషలతోపాటు, పరమాణు ప్రమాణమైన స్థూలసంస్కారము ఆవిర్భవించి ఆత్మను, పరమాత్మను భిన్నమైన దానిగను ప్రత్యేకమైనదానిగను, పరమాణు ప్రమాణములో స్థూలమైనదిగను, అత్యంత పరిమితమైనదిగను చేసినది.

67. ఆది ప్రేరణముయొక్క, మిక్కిలి స్థూలమైన తొలి సంస్కారము కారణముననే,అనంత పరమాత్మ తొలిసారిగా అనుభవమును పొందెను.

68. ఆనంతాత్మయొక్క యీ తొలి అనుభవము, సంస్కారములు లేనట్టి, ఎరుకలేనట్టి అనంత పరమాత్మతోగల తాదాత్మ్యతలను ప్రతికూలముగా అనుభవమును పొందెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

19.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 19 🌹
✍️. శ్రీ బాలగోపాల్
. ప్రసాద్ భరద్వాజ 

🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 19 🌻

69. ఈ ప్రతికూల అనుభవము, ఆనంతాత్మయొక్క శాశ్వత, అఖండ నిశ్చల ప్రశాంతతలో మార్పును కలిగించినది.

అప్పుడే ఆనంతాత్మయొక్క అఖండ నిశ్చలత్వములో ఒక పరమాద్భుతమైన వ్యాఘాతము(ఆదురు) సంభవించినది, ఆ తాకిడి ఎరుకలేకున్న పరమాత్మయొక్క చైతన్యరాహిత్య (A) స్థితిలో తొలి చైతన్యమును పుట్టించినవాడు. 

70. చైతన్యము లేని ఆత్మకు ప్రథమ ప్రేరణయొక్క ప్రథమ సంస్కారమే ప్రథమ చైతన్యమును కలుగజేసినది.

71. అత్యంత పరిమితమైన ఆది విలాసము, భగవంతునిలో చలించి, చైతన్యమందు ఎరుకలేని భగవంతునికి పరమాణు ప్రమాణమైన తొలి ఎరుక ను కలుగజేసినది.

72. చైతన్యము, మానవునిచే సంస్కారములను అనుభవింప జేయును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


------------------------------------ x ------------------------------------


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 20 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 20 🌻

73. పరాత్పర స్థితియొక్క అనంతత్వము, భగవంతుని పూర్తిగా సర్వస్వతంత్రుని చేసినది. అందుచేత సర్వస్వతంత్రుడైయున్న భగవంతుడు తన అనంత (లీల) విలాసమును సాధన పూర్వకముగా అనుభవించి ఆనందించుట సహజమే.

74. లీలను సాధన చేయుటయే స్వతంత్ర స్వభావమునకు చిహ్నము. ఎందుచేతననగా ఈ విలాసమే స్వతంత్ర స్వభావమునకు రంగును (సంస్కారమును) పూసినది.

75. సర్వమ్‌లో, అభావముగా అంతర్నిహితమైయున్నదంతయు,ఆవిర్భవించుటకుగల కారణమునకు ఆనంతమైన ఆదివిలాసమునదే బాధ్యత.

76. విలాసము అనగా విలాసమే గనుక, యీ భగవద్విలాసము యొక్క స్వభావమును బట్టి, అది ఎందుకు వచ్చినది ? ఎక్కడ వచ్చినది ? ఎప్పుడు వచ్చినది ? అని అనుకొనుటకు ఎక్కడను ఆస్కారము లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


21.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 21 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 21 🌻

77. పరమాత్ముడే అనంత సర్వం. 

78. అనంత సర్వమ్, అనంత అపార సాగరము వంటిది, అయినప్పుడు... సాగరమందలి ప్రతి బిందువు అత్యంత పరిమిత సర్వమ్ అగుచున్నది.

79. సర్వమ్ అయిన భగవంతునిలో, ఈ భగవల్లీల చలించిన తక్షణమే 'ఓం'కార బిందువు అత్యంత, పరిమిత సర్వమ్ గా వ్యక్తమయ్యెను.

80. అనంత సర్వమ్ లో, అనంత ఆభావము అంతర్నిహితమయున్నది. అనంత అభావములో భగవల్లీల చలించగా ఓం కార బిందువు ద్వారా, ఆభావము సృష్టిరూపములో ఆవిర్భవించెను.

"ఓమ్"

(లేక)

సృష్టిబిందువు.

81. అనంత పరమాత్మలో, పరమాణు ప్రమాణంలో అంతర్నిహితమైయున్న ఆదిప్రేరణము యొక్క పరమాణు ప్రమాణమైన ఆవిష్కారబిందువే 'ఓం' బిందువు.

82. ఓం బిందువు ద్వారా అభివ్యక్తమైన పరమాత్మ యొక్క ప్రతిబింబము (సృష్టి) క్రమక్రమముగా కన్పించి, వ్యాపించుచు పెరిగిపోయెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


------------------------------------ x ------------------------------------


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 22 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. భగవంతుని రెండవ పాత్ర. - పరమాత్ముడు - 13 🌻

83. సర్వమ్(భగవంతుడు వున్నాడు అనుస్థితి)లో అంతర్నిహితమై యున్న ఆభావమునుండి, దివ్య అంతశ్చైతన్యము మాత్రమే ఓం బిందువు ద్వారా తప్పనిసరిగా బహిర్గతమైనది.

84. భగవంతుని దివ్యసుషుప్తినుండి భగవంతుని అంతఃచైతన్యము, సృష్టిబిందువు (ఓం) ద్వారా పైకిలేచునప్పుడు దివ్య సుషుప్తికి భంగము వాటిల్లు భగవంతుని మూలనాదమైన (బ్రహ్మనాదం) ఓంకార ధ్వనితోపాటు - దేశము (ప్రదేశము) కాలము, భౌతికవిశ్వము దానికి, సంబంధించిన వస్తుజాలము ( పరిమిత అహం, మనస్సు, ప్రాణము) వివిధములైన వ్యష్టి రూపములు బహిర్గతమగునట్లు చేసినది.

85. భగవంతుడు తన దివ్య సుషుప్తినుండి (పరాత్పర స్థితి) దివ్యజాగృతికి (అహం బ్రహ్మాస్మి స్థితి) మేల్కొనవలెనన్నచో తన దివ్యస్వప్నస్థితియైన మాయాసృష్టిని దాటి రావలయును.

86 . అభావముగా అంతర్నిహితమైయున్న సృష్టి, పరమాణు ప్రమాణమైన బిందువు ద్వారా, అభివ్యక్తమైనది. ఈ బిందువునే "ఓమ్" బిందువనియు, సృష్టి బిందువనియు అందురు.   ఈ బిందువు కూడా పరాత్పరస్థితిలో అంతర్నిహితమై యున్నది

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


23.Aug.2020

------------------------------------ x ------------------------------------



🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 23 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. భగవంతుని మూడవ పాత్ర : 

సృష్టికర్త (త్రిమూర్తిత్వము) - 1 🌻

87. భగవంతుని మూడవ స్థితిలో, భగవంతుడు సృష్టి - స్థితి - లయము, అనెడు ప్రధాన ధర్మములను నిర్వహించు త్రిమూర్తుల పాత్రలను వహించెను. అవి :

సృష్టికర్త : బ్రహ్మ, ఆఫిరీద్గార్, స్థితికి : విష్ణువు, పరవదిగార్, లయకారకుడు : శివుడు, ఫనాకార్.

88. భగవంతుని మూడవస్థితిలోనున్న ప్రధాన ధర్మములైన సృష్టి - స్థితి - లయములు భగవంతుని మొదటి స్థితియైన పరాత్పర స్థితిలో అంతర్నిహితములై యుండెను.

89. అభావము ముందుగా సృష్టి రూపములో అభివ్యక్తమైనప్పుడు, అభావముయొక్క ప్రథమస్వరూపము భగవంతునిలో చైతన్యపు తొలిజాడను కనుగొన్నది. 

అటుపైని సృష్టియొక్క ప్రథమ సంస్కారము వ్యక్తమైనది. ఈ ప్రథమ సంస్కారమే చైతన్య పరిణామముతో పాటు సంస్కారములను ఉత్పత్తి చేసినది .

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

24.Aug.2020

------------------------------------ x ------------------------------------



🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 24 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని మూడవ పాత్ర : 

సృష్టికర్త (త్రిమూర్తిత్వము) - 2 🌻

90. సృష్టియొక్క పరిమిత సంస్కార అనుభవమే, భగవంతుని దివ్యస్వప్నముగా ఆరంభమాయెను.

91.ఆదిమూలమైన అనంతలీల "కారణము"గా, భగవంతునిలో పరమాణు ప్రమాణమైన చైతన్యము వ్యక్తమైనది. ఆ చైతన్యము, సృష్టి రూపమున అభివ్యక్తమైన అంతర్నిహిత అభావముయొక్క పరిమిత సంస్కారమును, అంతశ్చైతన్యము ద్వారా సగమెరుకలో భగవంతునిచే అనుభవింపచేసినది. 

92.అభావము యొక్క ఆవిష్కారమే ఆభాసయైన సృష్టి. 

93.పరమాత్మస్థితిలో అభావమై యున్నవన్నియు,అనంత ఆదిప్రేరణముచే ముందుకు సత్వరపరచగా (త్రోయగా) అవి, పరమాత్ముని(A) స్థితిలో నుండి సృష్టిరూపమున ఆవిష్కారమొందెను.

Notes :
అభాసము = లేక, ఉన్నట్లు కనిపించునది
(Nothingness or False everything)
అభావము = వుంది, లేనట్లు కనుపించునది (NOTHING)
సృష్టి = కల్పనా ; కల్పించినది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

25.Aug.2020

------------------------------------ x ------------------------------------



🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 25 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని మూడవ పాత్ర : 

సృష్టికర్త (త్రిమూర్తిత్వము) - 3 🌻

94. (a) కాబట్టి, తొలిసారిగా భగవంతుని అనంత చైతన్యరాహిత్య స్థితి (A). జీవితమును సృజించుటలో సృష్టికర్త ధర్మమును పొందెను.

(సృష్టించుతాయను భగవదంశయే బ్రహ్మ)

(b) సృష్టికర్త ధర్మమును చేపట్టగనే, ఆ సృష్టించిన జీవితమును పోషించుటలో (పరిరక్షించుటలో) స్థితికారుని

ధర్మమును పొందెను.

(పోషించుట యను భగవదంశయే విష్ణువు)

(c) సృష్టించిన జీవితమును పోషించుటలోనే తప్పనిసరిగా లయమును కూడా స్థాపించుచున్నాడు.

(నశింపచేయుటయను భగవదంశయే మహేశ్వరుడు).

95.భగవంతుని అనంత స్వభావత్రయమైన--అనంతశక్తి--ఙ్ఞాన -- ఆనందములచే, పరిమితమైయున్న అభావము వ్యక్తమైనప్పుడు సృష్టిరూపమున వ్యాపించెను.

ప్రశ్న --సృష్టి యేల నిజముకాదు?

96. ఆభావము నుండి పుట్టిన ఈ అనంతసృష్టి, భగవంతుని ప్రతి బింబము, భగవంతుడు అనంతుడు గనుక అతని ప్రతి బింబము సృష్టి కూడా అనంతమే, ఐనను ప్రతి బింబము నిజము కాదు. కాబట్టి సృష్టి కూడా నిజము కాదు. వట్టి భ్రమ.
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

26.Aug.2020

------------------------------------ x ------------------------------------





🌹.  భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 26  🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. భగవంతుని మూడవ పాత్ర :  సృష్టికర్త (త్రిమూర్తిత్వము) - 4 🌻

97. ఆభావము యొక్క ఆవిష్కామైన సృష్టి, మిథ్య ద్వారా ఉన్నట్లు కనిపించుచున్నది.

98.అభావము యొక్క అసంఖ్యాక రూపముల వ్యక్తీకరణమే సృష్టి.

99. అనంత సర్వమ్, అయిన భగవంతునిలో, విలాసము (చిద్విలాసము) తరంగములవలె చలించుటకు పూర్వము, సర్వములో అంతర్నిహితమైయున్న అభావమున్నూ, అభావమునుండి ఆవిర్భవించిన సృష్టి యున్నూ ఒకేసారి బయటికి పొడుచుకురాగా , పరాత్పరస్థితిలో అభావముగా అంతర్నిహితమైయున్న చైతన్యము.

క్రమక్రమముగా భగవంతుని చైతన్యము గా ఆవిర్భవించి, సర్వమ్ నుండి పుట్టిన సృష్టికి తానే కర్తననెడి అనుభవమును భగవంతునికి కలుగజేసినది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్ 

27 Aug 2020

------------------------------------ x ------------------------------------




🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 27 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. భగవంతుని మూడవ పాత్ర : 

సృష్టికర్త (త్రిమూర్తిత్వము) - 5 🌻

100.భగవంతుడు సృష్టికర్తగా అభావమునుండి ఆవిర్భవించిన సృష్టిని భగవత్సర్వముగా మిధ్యానుభూతి నొందుచున్నాడు.

101.పరాత్పరస్థితి యందున్న భగవంతుడు తనయొక్క,తనస్వీయ సత్యముయొక్క,అనంత సచ్చిదానంద స్థితియొక్క పూర్ణచైతన్యమును పొందుటకుగాను యీ మిధ్యానుభూతిలో చిక్కుకొనుట అవసరము.

102.సంస్కారముల ద్వారా సృష్టి చైతన్యము సేకరించబడినది.

103.సృష్టి -- స్థితి -- లయములు నిరంతరముగా ఏకరూపతగా జరుగుచునే యుండును.

ఉదాహరణము :--

మానవ శరీరమును భగవంతునిగా పోల్చుకొందము.

(a) కండ్లు మూసికొని నిద్రించుచున్న మానవుడు :-- పరమాత్మలో A స్థితి యనుకొనుడు

(b) కండ్లు తెరవగానే, ------- సృష్టి యనుకొనుడు.

(c) తెరిచినకండ్లతో అట్లే చూచుచుండుట --- స్థితి యనుకొనుడు.

(d) మరల కండ్లు మూసుకొనినచో--- లయము అనుకొనుడు.

------------------------------------ x ------------------------------------


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 28 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. భగవంతుని మూడవ పాత్ర : సృష్టికర్త (త్రిమూర్తిత్వము) - 6 🌻

104. బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులు ప్రధాన దేవదూతలు.వీరు పరిమిత జీవితమును హెచ్చు ప్రమాణములో సృష్టించుట యందును, దానిని పోషించుటయందును, పోషించిన దానిని లయమొనర్చుటయందును గల భగవంతుని ప్రధాన దివ్య ధర్మములను వ్యక్తపరచుటలో ఈ ప్రధాన దేవదూతలు మధ్యవర్తులుగా నుందురు.

105. భగవంతుని అపరిమిత జ్ఞానమును పరిమిత ప్రమాణములో నివేదించుటలో కూడా మధ్యవర్తులుగానుందురు. 

106.ప్రధాన దేవదూతలు సత్వములు. వారెల్లప్పుడు భోగములనుభవింతురే కాని బాధలను పొందరు.

107. అనంతమైన భగవల్లీల 'కారణము'గా దివ్య సుషుప్తి యైన మూల స్థితికి భంగము కలిగి, దాని ఫలితముగా సృష్టి కార్యరూపం దాల్చినది. ఇవియే కార్యకారణ ధర్మములు.

108. భగవంతునికి సృష్టి-స్థితి-లయము అనెడు ప్రధాన ధర్మములను ప్రసాదించుటలో భగవంతుని ఆది విలాసమే బాధ్యత కలదై యున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్ 

29 Aug 2020

------------------------------------ x ------------------------------------


🌹.  భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 29  🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. భగవంతుని శరీరి : నాల్గవ పాత్ర (రూపధారణము) - 1 🌻

109. అనంత ఆదిప్రేరణముయొక్క సంచలనముచే అనంత సాగరమందలి ప్రతి బిందువు తనను తాను తెలిసికొనుటకు ప్రేరేపింపబడెను.

110. పరాత్పర స్థితియందున్న భగవంతుడు, తొలిగా తన సత్య స్థితియొక్క జ్ఞానమును సంపాదించుట కంటె, సంస్కార భూయిష్ఠుడై అజ్ఞానమునే సంపాదించుచున్నాడు.

111. ప్రారంభములో పరమాత్మ యొక్క A స్థితిలో ఆత్మకు చైతన్యము, సంస్కారములు లేవు.

112. ప్రారంభములో, ఆత్మకు దేహత్రయమందు గాని తనయందు గాని స్పృహ లేదు. అందుచేత ఆయా దేహములకు సంబంధించిన లోకానుభవమును లేదు. పరమాత్మానుభవము అంతకన్నలేదు. 

113. ఆత్మ, శాశ్వతముగా పరమాత్మలో నుండి, పరమాత్మతో నుండి స్పృహ లేని స్థితి యందున్నను, పరమాత్మ యొక్క అనంత శక్తులగు జ్ఞాన-శక్తి ఆనందములను పొందెడి హక్కు గలదై యున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹 

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

30.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹.  భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 30  🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. భగవంతుని శరీరి : నాల్గవ పాత్ర (రూపధారణము) - 2 🌻

114. ఒకేసారి సంస్కారములు లేని ఆత్మకు, ప్రథమముగా సంస్కారమును, చైతన్యమే లేని ఆత్మకు ప్రథమముగా చైతన్యమును కలిగినవి. ఇట్లు కలిగిన ప్రథమ సంస్కారము పరమాణు ప్రమాణమైన స్థూల సంస్కారము.

115. అనంత శాశ్వత (A) పరమాత్మ పొందిన చైతన్యము అత్యంత పరిమితమైన స్థూల సంస్కారము మూలముగా పొందిన అత్యంత పరిమిత స్థూల చైతన్యమేగాని అది ... ... తన అనంత స్థితియొక్క చైతన్యమునుగాదు, లేక (B) స్థితిలోని అనంతపరమాత్మయైన తన స్వీయ చైతన్యమును గాదు.

116. అవిభాజ్యమైన ఆత్మయొక్క తొలి చైతన్యము, తొలి రూపము ద్వారా తొలి సంస్కార అనుభవమును పొందుచూ, ఆత్మలో ఒక మనోప్రవృత్తిని సృష్టించుచున్నది. అదియేమనగా - పరమాణు ప్రమాణములో పరిమితము, స్థూలము అయిన తొలిరూపముతోడనే తన శాశ్వత అనంత పరమాత్మతో సాహచర్యము చేసి, తాదాత్మ్యము చెందునట్టి ప్రవృత్తిని సృష్టించుచున్నది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

31.Aug.2020

------------------------------------ x ------------------------------------



🌹.  భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 31  🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. భగవంతుని శరీరి : నాల్గవ పాత్ర (రూపధారణము) - 3 🌻

117. ఇంతకు పూర్వము ఎట్టి అనుభవములేని ఆత్మ, తొలిసారిగా అనుభవమును పొందెను. కానీ సంస్కారములు లేని, స్పృహ లేని అనంత పరమాత్మయొక్క (A) స్థితితో తాదాత్మ్యతను చెందుటలో పూర్తిగా వ్యతిరేక అనుభవమునే పొందెను. 

118. ఈ వ్యతిరేక అనుభవము వలన అనంతాత్మయొక్క శాశ్వత అఖండ నిశ్చల స్థితిలో మార్పు సంభవించెను. 

119. ప్రథమ సంస్కారము, ప్రథమ చైతన్యము, ప్రథమ అనుభవము ఓకే నిష్పత్తి లో నుండెను

120. ఆత్మ, సంస్కారములందే స్పృహ కలిగియున్నచో, విధిగా యీ సంస్కారములను అనుభవించవలసినదే. 

121. ఆత్మయొక్క చైతన్యము, సంస్కార అనుభవమును పొందుటకే రూపములను తీసుకొనుచున్నవి.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

01 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹.  భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 32  🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. భగవంతుని శరీరము : నాల్గవ పాత్ర (రూపధారణము) - 4 🌻

122. రూపము లేనిదే అనుభవము రాదు.

123. సమస్త అనుభవములకు సంస్కారములే కారణము.

124. భగవంతుడు రూపముతో తాదాత్మ్యత చెందుటకు సంస్కారములే కారణము.

125. రూపముల ద్వారా ప్రపంచానుభావమును పొందుచున్నది చైతన్యమే గాని ఆత్మకాదు.రూపముతో సహచరించి, ఆరూపమే తానని తాదాత్మ్యత చెందుచున్నది కూడా చైతన్యమే.

126. ఓం,బిందువు ద్వారా ఆవిర్భవించిన భగవంతుని అనంత దివ్య అంతశ్చైతన్యము (Gods Infinite and Divine sub consciousness) దివ్యస్వప్న(సృష్టి) స్థితిలో వేగము ప్రారంభమై పరిణామమందుచు ముందుకు సాగినది.
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

02 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 33 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని శరీరము : నాల్గవ పాత్ర (రూపధారణము) - 5 🌻

127. భగవంతుని అనంతదివ్యశూన్య స్థితి నుండి,భగవంతుని అనంత దివ్య అంతశ్చైతన్యము,సృష్టి బిందువు ద్వారా అనంతముగా బహిర్గతమైనప్పుడు దాని గమనవేగము ననుసరించి సమస్త సృష్టియు,ప్రమాణములో,ఆకృతిలో, రూపములో,రంగులో, క్రమక్రమంగా బయటకి చొచ్చుకొని వచ్చినది.

'గ్యాస్'వంటి వాయు రూపములు.

128. ఈ తొలి రూపము,స్థూలమని కూడా భావించుటకు, ఊహించుటకు శక్యము గానంత స్థూల రూపము. దీనికి ఆకృతి లేదు. సారములేదు పదార్థంలేదు, రూపము లేదు.

(a)ఇచ్చట "గ్యాస్"వంటి రూపములు 7 కలవు.అందు మొదటి మూడును అనంతముగా నిరపేక్షమైన సాంద్రత గలవి

(b) తరువాత మూడును నిరపేక్షమైన సాంద్రత గలవి. అవి సగము గ్యాస్, సగము పదార్ధముగా (భూతము) నున్నవి.

(c) ఏడవది ఎలక్ట్రాన్ వంటివి అని చెప్పవచ్చును ఈ యేడును గ్యాస్ మాదిరి రూపము లైప్పటికీ పోలికలో వైజ్ఞానికులుపయోగించు హైడ్రోజన్, నైట్రోజన్ వంటి వాయు రూపములు మాత్రమే కావు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

03 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹.  భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 34  🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 1 🌻

ఆవశ్యక అస్థిత్వము : -

129) భౌతిక సంబంధమైనవి అన్నింటితో కూడి యున్నది. పంచ ఆవిష్కరణ మూలలో‌, నిది అయిడవిది . ఈ యైదును పరాత్పరునిలోనున్న భగవంతుని పంచ ఆవిష్కరణలములు. ఒక సద్గురువు లేక అవతార పురుషునియొక్క సార్వభౌమిక మనసుయొక్క సహాయము లేనిదే వీటి మర్మమెవరికిని తెలియదు.

130. భగవంతుడు తన శాశ్వత అనంత ఆస్తితత్వమందు ఎఱుక కలవాడగుటకే, తానెవరో తనకు తెలియని (A) స్థితిలోనున్న భగవంతునిలో అనంతలీల చలించిన ఫలితమే, యాదృచ్ఛికమైన పరిణామము సంభవించినది.

131. పరమాత్మయొక్క ఎఱుకలేని (A) స్థితినుండి పొందిన చైతన్యము, పరమాత్మలో నైక్యమై, ఆ నైక్యము ద్వారా సత్యానుభవమును, పొందుటకు మారుగా, ద్వైతము ద్వారా స్థూల రూపములతో సహకరించి అసంఖ్యా క సంస్కారములను అనుభవించుచూ పరిణామము చెందుచున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

04.Sep.2020

------------------------------------ x ------------------------------------




🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 35  🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 2 🌻

132. ఇప్పుడు సచేతన స్థితియందున్న ఆత్మ ఏ రూపము సహచరించి ఏరూపము ద్వారా సంస్కారాను భవం పొందుచున్నది.

133. సప్త ప్రధాన శ్రేణుల యొక్క అసంఖ్యాకమైన జాతి రూపాలను వినియోగించుకొని, విభిన్నమైన అసంఖ్యాక సంస్కారములను అసంఖ్యాక యుగము అనంతరము సామాన్యులు ఊహించలేని దుర్గాహ్యమగు 'గ్యాస్'వంటి వాయు రూపముల అనంతరము, శిల రూపముతో సహచరించి,ఆ శిలారూపముతో తాదాత్మ్యత చెందినది. మన వీలు కొఱకై, సృష్టి శిలా రూపములతో ప్రారంభమైనదని చెప్పుకొనవచ్చు.

134. భగవంతుడు దేహధారిగా, సృష్టియందు 'సచేతనడగుటకును', సృష్టిని- 'తెలిసికొనుటకును' ప్రారంభించును.

135. ఆత్మ, తన యొక్క చైతన్యముతో సంస్కారములను వాటికి తగిన రూపము ద్వారా తత్సంబంధ లోకములలో అనుభవమును పొందుచుండును.

136. పరమాణు ప్రమాణమైన ఈ ఎఱుకయు ఈ తెలిసికొనుటయు, ఆత్మబిందువు మొట్టమొదటి రూపము నుండి వియోగమొందుటకు కారణమగు హెచ్చు సంస్కారములను సృష్టించుచున్నవి.

137. ఆత్మ కొంతకాలమునకు ఒక నిర్దిష్టమైన అనుభవమును పొందిన తరువాత,ఆ రూపమును విడిచిపెట్టుచున్నది.

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

05.Sep.2020

------------------------------------ x ------------------------------------





🌹.  భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 36  🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 3 🌻

138. పరిణామ క్రమములో,ఆత్మ,రూపమును విడిచి పెట్టినప్పటికీ పరిణామ చైతన్యముచే సేకరించబడిన సంస్కారములు మాత్రము అదృశ్యమగుట లేదు.

139. రూపముల పరిణామము అనుభవమును పొందుటకు సహాయపడును.

140. చైతన్యము అంతకంతకు హెచ్చుస్థితిలో పరిణామమొందుచుండగా, ఆత్మ, సంస్కారములను అనుభవించుచు వాటిని రద్దుపరచుటకు సాధనములైన పరిమిత స్థూలరూపములనుండి ఎఱుకతో దూరమగుచున్నది.

కానీ,తాను స్వయముగా ఎఱుకతోగాని ఎఱుక లేకగాని పరిమిత సూక్ష్మ మానసిక దేహములనుండి వియోగమొందుట లేదు.

141. ఆత్మకు స్థూల రూపము పోయినప్పటికీ, ఆత్మ యొక్క చైతన్యము, పోయిన రూపముయొక్క సంస్కార అవశేషములను నిల్పియుంచును. ఇప్పుడు రూపము లేని ఆత్మ, గతరూపము యొక్క సంస్కారములందే ఎఱుక కల్గియున్నది. ఆ ఎఱుక ఉండుటచేత ఆ సంస్కారములను మరియొక నూతనరూపము ద్వారా అనుభవమును పొందుచుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

06.Sep.2020

------------------------------------ x ------------------------------------



🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 37  🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 4 🌻

142 . ఆత్మకు తాదాప్యము నొందుటకు రూపము కావలెను. అంతవరకు ఆత్మ యొక్క చైతన్యము, సంస్కారములయందే కేంద్రీకృతమై యుండును.

ఇప్పుడు ఆత్మ కొంతకాలముపాటు రూపం లేకుండి, తనకు రూపం లేనట్టుకూడా అనుభవమును పొందుచున్నది.

143. ఆత్మయొక్క చైతన్యము, రూపములో సహచరించి యున్నప్పుడు (తాను అనంతము, శాశ్వతము, నిరాకరము అయివుండి, పరమాత్మతో శాశ్వతంగా యున్నాననెడి సత్యమును పూర్తిగా మరచిపోయి) ఎఱుకతో ఆ రూపముతోగల తాదాత్మ్యతను పోషించుచూ నిజముగా ఆ రూపముతానేనని కనుగొనును.

144. రూపము పోయిన తరువాత, పోయిన రూపము యొక్క అవశేషములైన సంస్కారములు, తరువాతవచ్చు రూపముతో రద్దగు చుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

07.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹.  భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 38  🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 5 🌻

145. గత రూపముయొక్క అవశేషములైన సంస్కార ములననుసరించియే, వాటికి తగిన, తరువాత రూపము తయారు అగుచుండును.

146. ఆత్మ యొక్క చైతన్యము అసంఖ్యాక రూపముల ద్వారా అసంఖ్యాక సంస్కారము అనుభవమును పొందుచుండును.

147. ఈ సంస్కారముల గొలుసు ఒక జాతి యొక్క రూపము తరువాత మరియొక జాతి రూపముగా అనుభవమును పొందుచూ, బాహ్యముగా అంతు లేనట్లుగా కనబడును.

148. గతరూపము యొక్క అవశేషములైన సంస్కారము ల వలననే, ప్రస్తుత రూపము తయారగును.ఈ ప్రస్తుత రూపము ద్వారా గతరూపము యొక్క సంస్కారములు ఖర్చు ఆగుచుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

08.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹.  భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 39  🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 6 🌻

149. భగవంతుడు తన దివ్య స్వప్నములో సృష్టి యొక్క వస్తుజాలములో సహచరించుచు వాటితో తాదాత్మ్యత చెందుట ద్వారా, దివ్య స్వప్నములో చిక్కుకొనెను.

150. పరిణామములో ఆత్మ, ఎఱుకతో పరిమిత స్థూలరూపముతోడను,అత్యంత పరిమితములైన సూక్ష్మ -కారణ దేహములతో ఎఱుక లేకను తాదాత్మ్యత చెందుచున్నది.

151. ఆత్మయొక్క పరిణామ చైతన్యము, పరిణామరూపములతో తాదాత్మ్యము చెందుచుండగా, ఇంకనూ యింకనూ సంస్కారములను సంపాదించుచున్నది. .

152. ఆత్మ, సంస్కారములను ఖర్చుజేయుటకై వాటిని బహిర్గత పరచుటకు తగిన అవకాశమును చూచుకొని, భూమిపై ఆ సంస్కారముల అనుభవమును పొందుచున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

09.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹.  భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 40  🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
 

🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 7 🌻

153. స్థూల సంస్కారములు ప్రుగుతతో చైతన్యము కూడా పరిణామమొందెను. స్థూలరూపముల పరిణామము గమనవేగమును పొందెను.

154. భగవంతుడు తనను తాను తెలిసికొనవలెననెడి ఆదిప్రేరణ ఫలితముగా, చైతన్య పరిణామము, స్థూలరూపమూల పరిణామము, భౌతిక ప్రపంచనుభవమూల పరిణామము సంభవించెను. 

155. అఖిలభౌతిక సృష్టి యొక్క పరిణామ ప్రగతి ననుసరించి ఇతర లోకములతోపాటు భూమి కూడా పరిణామమొందుచు వచ్చినది.

156.భౌతిక గోళము అసంఖ్యాక ప్రపంచములు, సూర్యులు, చంద్రులు, నక్షత్రములు ఇంతెందుకు చాలా మోటైన జడపదార్థమునుండి బహు సున్నితమైన భౌతికపదార్థము వరకు, వీటన్నింటితో కూడియున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

10.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 41   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 8 🌻

157. ఆత్మ యొక్క చైతన్యము, స్వయముగా పూర్ణముగా పరిణామము చెందగలందులకుగాను వేరే మార్గము లేక ఈ సంస్కారముల సుడిగుండములో చిక్కుకుపోయినది.ఎంతవరకు?

ఆత్మ, తాను, అనంతమనియు, శాశ్వతమనియు, పరమాత్మలో శాశ్వతముగా ఉన్నననియు అనుభూతినొంది, తన అనంత జ్ఞాన-శక్తి-ఆనందములను అనుభవించునంతవరకు. 

158.పరిణామములో, ఆత్మలు తక్కువ రూపములను విడిచిపెట్టుచు, హెచ్చు రూపములతో చేరుచున్నవి.

159. చైతన్య పరిణామము, రూప పరిణామమునకు సంబంధించినదేగాని ఆత్మలకు కాదు. 

160. పరిణామమొందుచున్న చైతన్యము, స్థూలరూపము చైతన్యమేగాని, సూక్ష్మ-మానసిక దేహము చైతన్యము మాత్రము కాదు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

11.Sep.2020

------------------------------------ x ------------------------------------





🌹.  భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 42  🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 9 🌻

161. పరిణామ ప్రక్రియలో, చైతన్యము పరిణామమొందుటతో

రూపములు

లోకములు

సంస్కారములు

పరిణామమొందుచున్నవి. 

162. నిద్రించిన మానవుడు (A), తన నేత్రమును మెల్లమెల్లగా తెరచుటవంటిది పరిణామక్రమము. 

163.ఆత్మ యొక్క చైతన్యము సంపూర్ణముగా పరిణామమొందిన తరువాత తోలిమానవ రూపముతో సంయోగమందగనే, దాని పరిణామము పరిసమాప్తి చెందినది. 

164.ఆత్మ యొక్క చైతన్యము సంపూర్ణముగా పరిణామమొందిన తరువాత మానవ రూపముతో తాదాత్మ్యత చెందుట ప్రారంభించును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹 

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

12.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹.  భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 43  🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 10 🌻

165. పరిణామములో ఆత్మ యొక్క చైతన్యము ఒక స్థూల రూపము ద్వారా కొన్ని యుగముల పాటు భౌతిక ప్రపంచానుభావమును పొంది,యుగములనంతరము ఆ రూపమును విడచిపెట్టి, ఇంకను హెచ్చు చైతన్యమును, హెచ్చు అనుభవమును సంపదించుటకై తాను విడిచిపెట్టిన రూపము కంటె మరియొక హెచ్చు రూపమును తీసుకొనుచున్నది.

ఇట్లు:
శిల నుండి లోహమునకు
లోహము నుండి వృక్షసంతతి కి
వృక్షముల నుండి క్రిమి,కీటకాదులకు
క్రిమి కీటకముల నుండి మత్స్యములకు
మత్స్యముల నుండి పక్షులకు
పక్షుల నుండి జంతువులకు
జంతువుల నుండి మానవుల వరకు
రూపములను తీసికొన్నది. మానవ రూపముతో పరిణామము ఆగిపోయినది. 

166.అభావము యొక్క అత్యంత పరిమితమైన 'తొలిసంస్కారము' కారణముగా -

అనంతుడు,
సంస్కారములు లేనివాడు,
నిరాకారుడు,
శాశ్వతుడు
అయిన పరమాత్ముడు - తనను
పరిమితుడననియు,
అణుమాత్రుడననియు,
ప్రాణిననియు,
జడముననియు
అనుభూతినొందుచున్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

13 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 44   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 11 🌻

167.పరిణామమొందిన చైతన్యము, సృష్టియొక్క అనుభవమును సంపాదించునప్పుడు-

ఆభాసము, నశ్వరము అయిన సృష్టిని యదార్థమైనదిగను, అనంతమైనదిగను, అనుభవము పొందుచున్నది.

168.దీనికి కారణము? ............ సంస్కారములే.

సమస్త అనుభవములకును సంస్కారములే కారణము.

169. రూప పరిణామము, చైతన్య పరిణామమనెడి విశ్వ కర్మాగారములో తయారగు వస్తువులు.

170.చైతన్యము మానవరూపమందే అనంతము కాగల్గును. 

171. మానవ రూపము, రూప పరిణామము యొక్క అంతిమదశ.

172. ఆత్మ అనంతమైనది గాబట్టి ఆత్మయొక్క చైతన్యము కూడా అనంతమగును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

14 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 45   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 12 🌻

173. ఒక్క మానవ రూపమందే చరముగా ప్రత్యగాత్మ తన మూల తత్వమైన పరమాత్మస్థితిని అనుభూతి నొందగలదు.

174. భగవంతుడు తన దివ్య చైతన్యములో స్వయముగా సృష్టియందలి వస్తుజాలముతో తాదాత్మ్యత చెందుచున్నప్పుడు," నేను ఎవడను?" అన్నట్టి తొలిపలుకునకు బాహ్యమునకు నిజముగను, వాస్తవములో మిధ్య యైన యీ ఈ దిగువ సమాధానములు వచ్చెను.

నేను శిలను
నేను లోహమును
నేను వృక్షమును
నేను క్రిమిని, కీటకమును
నేను మత్స్యమును
నేను పక్షిని
నేను జంతువును
నేను పురుషుడను (లేక )స్త్రీని

175. భగవంతుడు తన దివ్యస్వప్నములో స్వయముగా మానవ రూపముతో తాదాత్మ్యత- చెందినప్పుడు అతని అతడింక అర్థస్పృహలో నుండక, పూర్ణచైతన్యము కలవాడయ్యెను.

Notes___ప్రత్యగాత్మ (ప్రత్యక్+ఆత్మ) పరమాత్మ నుండి వేరుపడిన ఆత్మ (Drop Soul).

176. మానవుని పూర్ణచైతన్యం యావత్తు దివ్యస్వప్న మును చెడగొట్టి మానవునికి తాను భగవంతుడుననెడి నిజమైన మెలకువ ఇచ్చుటకు కారణమైనది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

15 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹.    భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 46   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 13 🌻

ఆత్మ, ఒకసారి చైతన్యమును పొందిన తరువాత, ఆచైతన్యము అంత కంతకు వికాసమొందునేకాని, తరిగిపోదు.


178. మానవరూపము:

యుగయుగాంతరము, చైతన్యపరిణామముతో పాటు పరిణామమొందిన,
పూర్ణరూపము
అత్యుత్తమరూపము
విశిష్టరూపము
దివ్యరూపము
ఈ మానవరూపమే, ఈ మానవరూములోనే చైతన్యము పుష్కలముగా, పూర్ణముగా, అభివృద్ధి చెందినది.

ఇప్పుడు ఆత్మ,యీ పూర్ణరూపమును ఉపయోగించుకొని,యీ రూపము ద్వారా సంస్కారములను రద్దు పరచు కొనెను.


179. మానవుడు }

లేక .}

జీవాత్మ. }=శరీరము+ప్రాణము+మనసు+

లేక } చైతన్యము+ఆత్మ.

ఇన్సాన్. }



సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

16 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 47   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 



🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 14 🌻


180. నిస్పష్టముగా చెప్పవలెనన్నచో, అసలు ఉన్నది ఒక్కటే రూపము అదియే మానవ రూపము. మానవ రూపము, పూర్వము దాటి వచ్చిన దశలన్నింటిలో అంతర్నిహితమై యున్నది. రూపములుగా కానిపించు తక్కిన రూపములన్ని మానవరూపముయొక్క పరిణామ దశలు.


181. ఆత్మకు మానవరూపము లేకుండా, సూక్ష్మ -కారణ దేహముల చైతన్యముగాని,ఆత్మచైతన్యము గాని పొందుట దుర్లభము.


182. పరమాత్మానుభూతిని పొందుటకు కాంక్షించుచున్న ఆత్మ , మానవరూపము ధరించి పూర్ణ చైతన్యమును సంపాదించి నప్పటికీ , పరమాత్మానుభవమును పొందలేకపోయినది _ ఎందుచేత ?

ఆ - పూర్ణ చైతన్యము స్థూల సంస్కారములలో కేంద్రీకరించి యున్నంతకాలము స్థూల రూపముతోనే ఎఱుక కలిగియుండును కనుక విధిగా భౌతికలోకాను భవము పొందితీరవలసినదే .


183. తెలిసిన స్థితిలో ( జాగృతి లో ) మనస్సే _మానవుడు .

దేహమే _మానవుడు .

తెలియని స్థితి లో ( సుషుప్తి లో ) మనస్సుకు దేహమునకు

ఆవలి నున్న ఆత్మ యే మానవుడు .


🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్


17 Sep 2020
 
------------------------------------ x ------------------------------------


🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 48   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
 

🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 15 🌻

184. చైతన్యపరిణామములో సంస్కారములే, భగవంతునికి మానవ స్థితి యొక్క అనుభవమును కలుగజేసినవి.

185. చైతన్య పరిణామముతోపాటు, పరిణామమొందిన సంస్కారములను, ప్రధమ సంస్కారమే పుట్టంచినది.

186. అభావము యొక్క సంస్కారముల ద్వారా మానవునిలో చైతన్యము సంపూర్ణముగా పరిణామమొందినది.

187. భగవంతుడు పరిణామములో పొందిన పూర్ణచైతన్యము సంస్కార భూయిష్ఠమైనది.

188. మానవరూపములో స్థూలదేహముతోపాటు సూక్ష్మ కారణ దేహములు పూర్తిగా అభివృద్ధిని కలిగియున్నప్పటికీ, అభివృద్ధిచెందిన చైతన్యము భౌతికచైతన్యము.

189. మానవుని పరిమిత లక్షణములు.

పరిమిత మనస్సు:---వాంఛలు, తలంపులు

పరిమిత ప్రాణము:---వేగము, శక్తి

పరిమిత దేహము:---సుఖములు, కష్టములు.


సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

18 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 49  🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 16 🌻

190. మానవుని చైతన్యము, అభావముయొక్క సంస్కారములతో చాల సన్నిహితముగా లంకెపడియుండి, ఈ అయధార్ధమైన అభావమును సర్వమును, సత్యముగను ఎరుకతో అనుభవింపచేయుచున్నది.

191. చైతన్యములేకున్న (A భగవంతుడు, సృష్టిపరిణామము పొడవును, క్రమక్రమముగా హెచ్చు చైతన్యమును పొందుచు చివరకు మానవరూపములో పూర్ణచైతన్యము కలవాడై, ఆ మానవ రూపముతో తాదాత్మ్యత చెందుతున్నాడు.

192. మానవునిలో ప్రాణమయ, మనోమయకోశములు పుష్కలముగా పెరిగినప్పటికీ, భూతలముమీద, అవి మానవస్థితిలో పరోక్షముగను, ఎఱుకలేకను నిర్విరామముగా, నిరంతరాయముగా నియమబద్ధముగా ఉపయోగింప బడుచున్నవి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

------------------------------------ x ------------------------------------


🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 50   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 



🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 17 🌻


193. సంస్కారములలో చిక్కువడిన చైతన్యమే జీవాత్మ. 


194. మానవుడు భగవత్స్వరూపుడు

శీర్షాగ్రము :- విజ్ఞాన (7 వ) భూమిక

మహోన్నత ఆధ్యాత్మిక

అవస్థానము (లేక)

బ్రహ్మపీఠము.

ఫాలము :- దివ్యత్వ ప్రవేశము (6 వ) భూమిక

భ్రూమధ్యము :- అంతరనేత్రము

త్రినేత్రము - 5 వ భూమిక

నేత్రములు :- 4 వ భూమిక

ముక్కు : - 3, 2 భూమికలు

చెవులు :- 1 వ భూమిక

నోరు :- ప్రవేశద్వారము


195. మానవరూపములో ఆత్మయొక్క చైతన్యము సమగ్రము సంపూర్ణము అయినది.చైతన్య పరిణామములో మానవ రూపము అత్యుత్తమ రూపము, దివ్య రూపము యుగయుగములకు తయారైన పరిపూర్ణ రూపము.


196. స్ధూల చైతన్య పరిణామము మానవ రూపమును పొందుటతోడనే సమాప్తమైనది.


197. భగవంతుడు మానవ స్ధితిలో, పూర్తి ఎరుకను కలిగి యున్నప్పటికి, తాను పరాత్పరుడననెడి అనుభవమును పొందక, మానవ స్థితిలో నున్న ఒక మానవుడననియు, అనంతుడను కాదనియు, లపరిమితుడనియు అనుభూతి నొందుచున్నాడు.


సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


20 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹.  భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 51  🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 1 🌻

198. మానవుడు తన సంస్కార భారమును, వాటికి భిన్నమైన సంస్కారముల ద్వారా తగ్గించుకొనుటకు శ్రమ పడును. ఈ శ్రమయే పునర్జన్మ క్రమము.

199. మానవ రూపము వరకు ప్రోగుపడిన సంస్కారములు పునరావృత్తి క్రమమందును, ఆధ్యాత్మిక అనుభూతి క్రమమందును భిన్న సంస్కారములచే రద్దగును.

200. సంస్కారములు రద్దగుటకే,పునర్జన్మ క్రమము ఆధ్యాత్మిక మార్గము (అంతర్ముఖ క్రమము) ఒకదాని వెంబడి మరి యొకటిగా, అనుసరించబడుచున్నవి. 

201. తొలి మానవరూపము ద్వారా, జంతుశ్రేణి చివరి జంతువు యొక్క సంస్కారములన్నిటిని ఖర్చుపెట్టిన తరువాత, ఆత్మ యొక్క చైతన్యము తొలి మానవ రూపమును విడిచిపెట్టుట సహజము.

202. చైతన్యము తొలిమానవ రూపము నుండి వియోగం మొందినప్పటికీ, తెలియకనే సాహచర్యమును పొందుచూ సూక్ష్మ- కారణ దేహముల నుండి ఎన్నడూ వియోగమొందుట లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

21 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹.  భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 52  🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 2 🌻

203. సూక్ష్మ-కారణదేహములు‌,విడువబడిన గత భౌతకరూప యొక్క సంస్కారములను నిలిపియుంచినవి.

204. పూర్వజన్మ సంస్కారములను అనుభవించుటకే‌‌, ఆత్మ మరియొక రూపముతో సహచరించున్నది.

205. పూర్వజన్మ సంస్కారములు సంపుటయే ప్రస్తుత జన్మకు రూపమిచ్చును. 

ఏల పునర్జన్మము కావలసి వచ్చినది?

206. తొలి మానవ రూపము యొక్క, మానవ రూపమును పూర్వమందున్న పరిణామ రూపముల యొక్క సంస్కారములను అనుభవించుటకే, ఆత్మ, మానవ రూపములో మరల మరల పునర్జన్మములను పొందవలసి వచ్చినది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

22 Sep 2020

------------------------------------ x ------------------------------------

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 53 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 3 🌻

207. ఆత్మ మానవరూపములో ఒకసారి పునర్జన్మమును పొందుటకు ప్రారంభించిన తరువాత, 84 లక్షల మానవ రూపమున ద్వారా పోవలసి వచ్చెను.

208. స్థూలసంస్కారము లున్నంతకాలము ఆత్మకు, సూక్ష్మ-కారణ దేహముల యొక్క చైతన్య ముండదు.

209. ఆత్మ,పూర్ణ చైతన్యమును కలిగియున్నప్పటికీ, స్థూలసంస్కారములున్నంతకాలము అసంఖ్యాక మానవ రూపములను ధరించును.

210. ఆత్మ , భౌతిక సంస్కారములను కలిగియుండి ,

వాటి కను గుణ్యమైన స్థూల శరీర చైతన్యమునే కలిగియుండి , భౌతిక ప్రపంచాను భవమును పొందుచుండును .

భౌతికలోకానుభవము :______

వినుట ,
ఆఘ్రాణించుట ,
చూచుట ,
తినుట
నిద్రపోవుట
మల , మూత్రములు విసర్జించుట .

211. సంస్కారములు ___దేహములకు ఉనికిపట్టు
దేహములు _____లోకములకు ఉనికిపట్టు 

212. చైతన్యము అసంఖ్యాక మానవరూపముల ద్వారా అనుభవములను సంపాదించుటవలన , సంస్కారముల బిగువు సడలి , పలుచనగుటకు ప్రారంభించును .

ప్ర || మానవజన్మనుండి క్రింది జన్మలకు దిగజారుట సంభవమా ?

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

Whatsapp Group 
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin

Telegram Group 
https://t.me/ChaitanyaVijnanam


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

23 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 54   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 4 🌻

213. సంభవము కాదు , ఎందుచేతనగా , చైతన్యము మానవరూపము చేరుసరికి పూర్ణమైనది . ఒకసారి పూర్ణ చైతన్యము లభించి మానవరూపము తో తాదాత్మ్యతను చెందిన తరువాత , అది ఎన్నటికిని తరిగిపోదు .

214. ఆత్మ స్థూల రూపమును ఎఱుకతో విడిచినప్పటికీ , సూక్ష్మ - కారణ దేహములను ఎఱుకతో గాని ,ఎఱుక లేక గాని విడుచుట లేదు .

215. ఆత్మ , తొలిమానవ రూపమునుండి వియోగ మొంది నప్పటికి , తన సూక్ష్మ - కారణ దేహములనుండి మాత్రము వియోగ మొందుట లేదు .

216. స్థూల దేహ చైతన్యముకల మానవునకు , అతని సూక్ష్మ -కారణ దేహములు పరోక్షముగను ,అతనికి తెలియకుండగను ఉపయోగపడుచున్నవి .

217. స్థూల దేహ చైతన్యముగల మానవునకు , సూక్ష్మ _ కారణ దేహములందు ఎఱుక లేకున్నను , అతని ప్రాణము ( Energy ) వివిధ భౌతిక లక్షణములుగల అణుశక్తి గను , అతని మనస్సు -వాంఛలు , భావోద్వేగములు , తలంపులు అనెడి లక్షణములుగను ఉపయోగపడుచున్నవి .

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

24 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 55   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 5 🌻

218. ప్రాణశక్తి యొక్క భౌతిక లక్షణములు :

వాంఛలు, మానసికోద్వేగములు, తలంపులు .

219. మనస్సు యొక్క ప్రబల లక్షణము :____వాంఛలు .

220. భౌతికమరణాంతరము ,సూక్ష్మ -కారణ దేహములను చేరియున్న చైతన్యము అనుభవించు తీవ్రాతి తీవ్రమైన అనుభవములే స్వర్గనరకములు అనెడి మానసికస్థితులు గాని , అవి లోకములు కావు .

221. మరణించిన మానవులు సజ్జనులు గాని లేక దుర్జనులు గాని , స్వర్గ -నరకము లనెడి స్థితిలో పునర్జన్మము పొందువరకును వేచియుందురు .

222. స్వర్గ - నరకము లనెడి మానసికస్థితు లనుభవించునది ఆత్మ యొక్క చైతన్యమేగాని , ఆత్మకాదు .

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

WhatsApp, Telegram, Facebook:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అవతారమెహర్

25 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 56   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 6 🌻

223. సంస్కారముల అనుభవమును పొందుచున్నది కూడా ఆత్మయొక్క చైతన్యమేగాని , ఆత్మకాదు .

224. సూక్ష్మ శరీర చైతన్యముగల మానవునకు , సూక్ష్మ శరీరము ప్రత్యక్షముగను ,ఎఱుకతోడ పనిచేయుచున్నప్పటికీ , అతని మనశ్శరీరములు పరోక్షముగను ఎఱుక లేకను ఉపయోగపడుచున్నవి .

225. మానసిక శరీర చైతన్యము కలవానికి ,అతని స్థూల- సూక్ష్మ దేహములు పరోక్షముగను ఎఱుక లేకను ఉపయోగపడుచున్నవి . ఆత్మ యొక్క ఎఱుక దేహముల వినియోగము .

227. జననము :

ఆత్మ , స్థూలరూపముల ద్వారా , భౌతిక ప్రపంచాను భవమును పొందుచున్నప్పుడు , అసంఖ్యాక రూపములతో సహచరించుచుండును . దీనినే జననము అందురు . 

228. ఆత్మ , స్థూలరూపముల ద్వారా , భౌతిక ప్రపంచాను భవమును పొందుచున్నప్పుడు , అసంఖ్యాక రూపముల నుండి వియోగమందు చుండును . దీనినే మరణము అందురు .

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

26 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 57   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 7 🌻

229. సాధారణముగా మరణము సమీపించు ఘడియలందు సూక్ష్మ శరీరమును , జీవశ క్తియు స్థూలదేహమునుండి పూర్తిగా వేరగును .కాని స్థూలదేహముతో గల సంబంధమును మనస్సు , మరణానంతరము 5 రోజుల వరకు కాపాడును .మరియొకప్పుడు 5 రోజుల తరువాత 7 రోజుల వరకు యీ సంబంధమును కాపాడును .

230. ఆత్మ , భౌతికలోకానుభవమును పొందుచున్నప్పుడు , జనన - మరణములు ;కష్ట - సుఖములు ; పుణ్య పాపములు , మొదలైన ద్వంద్వానుభవములు అన్నింటిని , ఈ స్థూల రూపమే పొందుచున్నది .

231. ఆత్మకు స్థూలరూపము నీడవంటిది .

232. ఆత్మ పొందుచున్న అనుభవములన్నియు , తనకు నీడ యైన స్థూలరూపానుభవములేకాని , ఆత్మకు ఎట్టి అనుభవము లేదు .

233. సంస్కారముల కారణముననే , ఆత్మ , శరీరములే తాననెడి అనుభవమును పొందుచున్నది .ఈ అజ్ఞానమునకు కారణము ,సమస్త అనుభవములకు కారణము ---ఈ సంస్కారములే .

234. రూపము లేని ఆత్మ , జనన_మరణములు లేని ఆత్మ ; అనంతమైన ఆత్మ ; శాశ్వతమైన ఆత్మ ; కష్ట -సుఖములు సుఖ _ దు:ఖములు మొదలగు ద్వంద్వములకు అతీతమైన ఆత్మ తనకు _ రూపమున్నదనియు , జనన_మరణములు పొందుచుంటిననియు , పరిమితిగల దాననియు, అనిత్యమైన దాననియు , కష్ట సుఖములు పుణ్య పాపములు _పొందుచుంటిననియు అనుభవుమును పొందుటకు సంస్కారములే కారణము .

ఈ అజ్ఞానమునకు కూడా సంస్కారములే కారణము . ఈ ద్వంద్వ అనుభవము లన్నియు స్థూల రూపమే పొందుచున్నది .

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


27 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 58   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 8 🌻

235. పరమాత్మకు భౌతిక ప్రపంచము నీడవంటిది . కాబట్టి లోకానుభవము లన్నియు ,అయదార్ధమైనవి .

236. పూర్వజన్మ సంస్కారముల వలననే ప్రస్తుత జన్మ తయారగును . ఈ ప్రస్తుత రూపము ద్వారా పూర్వ జన్మ సంస్కారములు అనుభవింపబడి ఖర్చు అగుచుండును .

237. ఆత్మ యొక్క చైతన్యము సంస్కారములలో కేంద్రీకరించి యున్నంతకాలము , ఆ సంస్కారానుభవమును పొందవలసినదే .

238. పునర్జన్మ ప్రక్రియలో, పూర్ణ చైతన్యముగల మానవాత్మ విధిగా అసంఖ్యాకమైన వివిధములైన ద్వంద్వ సంస్కారములు అనుభవమును సంపాదించ వలెను కనుక యీ మానవాత్మ, అసంఖ్యాకమైన సార్లు స్త్రీగను పురుషునిగాను, వేర్వేరు కులములలో, వేర్వేరు జాతులలో, వేర్వేరు తెగలలో , వేర్వేరు రంగులలో, వేర్వేరు ప్రదేశములలో, 

ఒకప్పుడు ధనికుడగను, మరియొకప్పుడు దరిద్రునిగను, ఒకప్పుడు ఆరోగ్యవంతునిగాను, మరియొకప్పుడు అనారోగ్యవంతునిగాను, ఒకప్పుడు సుందరుడుగను, మరియొకప్పుడు కురూపిగను , ఒకప్పుడు పొడగరిగను

మరియొకప్పుడు పొట్టిగాను , 

ఇట్లు అసంఖ్యాక సంస్కారములను అనుభవించుచు వ్యతిరేక సంస్కారములను సృష్టించుకొనుచు ఏకకాల మందే వాటిని రద్దుగావించు చుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

28 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 59   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 9 🌻

🍀. సంస్కారములు ప్రభావము : 🍀

239. కర్మలవలన సంస్కారము లుదయించి మనసుపై ముద్రింప బడుచున్నవి.సంస్కారములే కర్మలను చేయించును ఇట్లు సంస్కారములపై కర్మలు, కర్మలపై సంస్కారములు పరస్పరము ఆధారపడియున్నవి.

సి ని మా :____

240 . కర్మలు ........జాగ్రదవస్థలో

దైనందిన వ్యావహారిక జీవితము

సంస్కారములు ......ఫొటోలు

మనస్సు ......ఫిలిం

చైతన్యము .....వెలుగు ఫోకస్

సూక్ష్మ శరీరము ......ప్రొజెక్టరు

కర్మలు .....తెర పై ప్రదర్శనము .

241. ఎందుచేతననగా ..... సంస్కారములు కర్మలచే రద్దుగుచున్నవి . సంస్కారములు కర్మలు చేయించుచున్నవి .

242. సంస్కారములు పూర్తిగా రద్దు అగువరకు , అవి మానవ జీవితములో ప్రధాన పాత్ర వహించుచున్నవి .

243. మానవుని మనస్సు పై సంస్కారములు నిల్చియుండి ,మానవ చైతన్యమును ముద్ర వేసినంత కాలము , మానవుని ప్రాణశ క్తి చే పుట్టించబడి పనిచేయబడుచున్న యీ సంస్కారములు అతని మనస్సు పై నిరంతరాయముగా ముద్రింపబడుచూ , అతని అర్ధ జాగృతిలో నిల్వ చేయబడు చుండును .

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group


29 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹.    భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 60   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 10 🌻

244. కొన్ని సంస్కారములు, మానవుని అర్థజాగృతిలో గంటల తరబడి, లేక రోజుల తరబడి లేక , ఏండ్ల తరబడి ఒక్కొక్కప్పుడు జీవిత పర్యంతము - నిద్రాణమై మిగిలి యుండును.

కాని వాటిలో హెచ్చు సంస్కారములు అనుక్షణము అంతశ్చైతన్యము ద్వారా మానవుని జీవితములో, స్వస్నానస్థలో ఆ స్పృహతోడను జాగ్రదవస్థలో పూర్తి స్పృహతోడను పొటమరింపబడుచూ యుండును.

పూర్తి మరపు. - మానవుని సుషుప్తి , సంస్కారములు నిద్రాణమై యున్నవి. చైతన్యము లేదు.

స్వప్నావస్థ - సగమెరుక. - పూర్తిగా సూక్ష్మము గాని పూర్తిగా స్థూలము గాని, కానట్టి రూపములు.

జాగ్రదవస్థ - స్థూల రూపములు - పూర్ణ, చైతన్యము - పూర్తి స్పృహ.

245. స్థూల -సూక్ష్మ - కరణదేహములు మానవ చైతన్యము పై తమ 'పట్టు' ను వదలుటకు పూర్వము , వాని దైనందిన జీవితములో ప్రతిదినము , 'నిద్రించుట', 'మేల్కొనుట' అనెడి ఒక ప్రబల అనుభవమున్నది .

ఈ మూలానుభవము వాని నిత్య జీవితములో మూడు ప్రధాన స్థితులను కలుగజేయుచున్నది .

I సుషుప్తి అవస్థ : మానవునిలోనున్న ఆత్మయందు స్పృహ లేకుండుట .

II స్వప్నావస్థ : సామెఱుక (లేక )అర్థ స్పృహ కలిగియుండుట .

III జాగ్రదవస్థ : పూర్తిగా మెల్కొని యుండుట. మానవుని లో మానవునిగా పూర్ణ చైతన్యము .

246. సూక్షేంద్రియముల ద్వారా పొందిన భౌతిక విషయానుభవములే స్వప్నములు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


30 Sep 2020

------------------------------------ x ------------------------------------






🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 61   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 11 🌻

247. సంస్కారములు మానవుని

సుషు ప్తి అవస్థ లో .... పూర్తిగా నిద్రాణ

మై నిలిచియుండును .

స్వప్నావస్థలో ....అంతశ్చైతన్యము ద్వారా పైకి లేచినప్పుడు ప్రారంభ దిశలలో సూక్ష్మ రూపములుగా వ్యక్తమగును .

జాగ్రదవస్థ లో .... సుస్పష్టముగా స్థూలరూపములుగా అనుభవమునకు వచ్చును .

248. సృష్టి అంతయు భగవంతుని స్వప్నము .

249. భగవంతునిలో "నేను ఎవడను ? " అనెడి స్వీయమైన అనంతలీల చలించిన తక్షణమే , యీ సృష్టి లో జరుగుచున్నట్లు ,జరిగినట్లు ,జరుగునట్లు కనిపించునదంతయు , అతడు కలగనెను .

నిజమునకు ఏమియు జరుగలేదు .

🌻. స్వప్నములు - జీవిత అనుబంధ సంబంధములు . 🌻 

250. పైకిలేచిన మానవుని నిద్రాణ సంస్కారములచే నటించబడుచున్న 'నాటకమే ' కల.

251. సామాన్య మానవుడు స్వప్నములలో , తన సూక్ష్మ శరీరము (ప్రాణము) ను సూక్ష్మచైతన్యముతో పాక్షికముగా వినియోగ పడునట్లు చేయును . అదైనను _ భౌతిక పధార్థములు భౌతిక అనుభవము సందర్భములో మాత్రమే .

252. మానవుడు మేల్కొనినప్పుడు , పైకి లేచిన అభావము యొక్క సంస్కారములు సృష్టి ( ఆభాసము) యొక్క అదే కల ను, ఇంకను తీవ్రముగను నిజముగను , వ్యక్తపరచును.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


01 Oct 2020

------------------------------------ x ------------------------------------



🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 62   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 12 🌻

253. మానవుని అర్థస్పృహ ద్వారా యీ సంస్కారములు పైకి లేచినప్పుడు కలలో అస్పష్టమైన సూక్ష్మరూపములుగా వస్తువులను ప్రాణులను సృష్టించు చున్నవి .

సినీఫిల్ము ...మనస్సు 

ఫొటోలు ... నిద్రాణసంస్కారములు

తెర పై ప్రదర్శనము "కల" అనెడి డ్రామా .

254. మానవుడు స్వప్నావస్థలో , స్వప్ననాటకములో తగుల్కొని తాను ఆ నాటకకర్తగను , కథానాయకునిగను

పాత్రలు ధరించుటయే గాక తన స్వప్ననాటకములో సూక్ష్మాతి సూక్షరూపములుగానున్న వస్తువులతోను ప్రాణులతోను సన్నిహితముగా హత్తుకొని వుంటున్నాడు .

ఈ సూక్ష్మరూపముల సృష్టి కేవలము మానవుని పూర్వ, ప్రస్తుత జన్మల యొక్క స్వీయ సంస్కారముల వ్యక్తీకరణ ఫలితమే.

255. స్వప్నావస్థలో తాను చూచిన రూపములను, కలిసికొన్న రూపములను మెలుకువ వచ్చిన తరువాత స్మృతికి తెచ్చుకొన్నప్పుడు, అవి, ప్రస్తుత జీవితములో తాను ఏ రోజు కారోజు స్థూలరూపములలో నున్న వస్తువులను ప్రాణులను మానవులను ఎఱుకతో కలిసికొన్న సమావేశములను గుర్తుకు తెచ్చుచున్నవి. 

అంతియే కాక, వెంటనే వచ్చు జన్మములోగాని, లేక, కొంతకాలము గడచిన తరువాత వచ్చు జీవితము యొక్క సంబంధ _అనుబంధములను కూడా స్థాపించు చుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


02 Oct 2020

------------------------------------ x ------------------------------------


🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 63   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 13 🌻

256. భవిష్యత్సంబంధములు: 

కొంతకాలము గడచిన తరువాత, తన జీవితములో యిదివరకెన్నడు చూచియుండనివారిని చూచును; కలిసికొని యుండనివారిని కలిసికొనును. వీరెవరో తనకు తెలియదు కాని తాను పూర్వమొకప్పుడు స్వప్నములో చూచిన ఆవస్తువులే యివి, ఆ ప్రాణులే యివి, ఆవ్యక్తులే వీరు.

257. మానవుడు ముందు ముందు (భావిలో) కలిసికొన వలసిన వ్యక్తులను కూడా ముందుగానే (పూర్వమే) స్వప్నావస్థలో కలిసికొనును.

258. స్వప్ననాటకము, గతజన్మయొక్కయు, ప్రస్తుత జన్మయొక్కయు దైనందిన జీవిత సంస్కారముల ఫలితమైనప్పుడు, స్వప్ననాటకములో భవిష్యత్సంబంధమైన రూపములకు, సంఘటనలకు మానవుడు ముందుగనే సాక్షీ భూతుడగుట ఎట్లు సాధ్యము?

259. జాగ్రదవస్థలో _ తాను సరిగా అన్వేషించినవి, సన్నిహితముగా కలిసికొన్నవి (వస్తువులు, మానవులు) స్మృతికి వచ్చినపుడు, అవి, గతములో కొన్నిరోజులక్రితమో, కొన్ని నెలల క్రితమో లేక, కొన్నిసంవత్సరములకు పూర్వమో తన స్వప్నగత దృశ్యములేనని గుర్తుకు తెచ్చుకొని, గతమునకు సాక్షీ భూతుడగుచున్నాడు.

260. గతమే వర్తమానముగా ప్రతిబింబిచుచున్నది. ఇట్లు మానవుడు స్వప్న నాటకములో చిక్కుకుపోయి, తన గతమును వర్తమానముగా పరీక్షించుచు గతములోనే లీనమౌచున్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


03 Oct 2020

------------------------------------ x ------------------------------------


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 64 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
 

🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 14 🌻

261. మానవుడు తన భావి జీవితంలో గాని, యీ జన్మలో భవిష్యత్తులో గాని తాను కలిసికొనబోవు-వస్తువులను,మానవులను స్వప్నములో చూచుచున్నాడు; కలిసికొనుచున్నాడు ప్రస్తుతం జీవితంలో జాగ్రదావస్థలో, ఆ స్వప్నగత రూపములే తిరిగి స్థూలరూపములుగా కన్పించినపుడు నిజముగా తాను గత స్వప్న దృశ్యములకు సాక్షి భూతుడగుచున్నాడు.

262. మానవుడు తనలో నిద్రాణమైయున్న స్వీయ సంస్కారములచే యేర్పడిన స్వప్నసృష్టిని, వర్తమాన జాగ్రత్ జీవితములో పోషించిన వాడౌచున్నాడు.

ఇట్లు స్వప్న నాటక సృష్టికి,కర్తయై ఆ స్వప్నగత దృశ్యములను జాగ్రదవస్థలో వర్తమానముగా పోషించుచు భర్తయౌచున్నాడు.

గతమునకు వర్తమానము భవిష్యత్తు గనుక ఏకకాలమందే భవిష్యత్తును కూడా స్థాపించిన వాడౌచున్నాడు.

263. వర్తమానములోనే-- భూత, భవిష్యత్తులు రెండును ఇమిడియే యున్నవి. మనము వర్తమానములో జీవించి యున్నాము. గనుక ప్రస్తుతములో మనకు గతము లేదు. భవిష్యత్తు లేదు. ప్రస్తుతము మనము జీవించియున్న వర్తమానము రేపటికి, గతముగ లయమగు చున్నది. ఇట్లు మానవుడు లయకారుడగుచున్నాడు.

264. మనకు వర్తమానమే యున్నది. నిన్న లేదు. రేపు లేదు. నేటి వర్తమానము గతమునకు భవిష్యత్తు . గతమునకు భవిష్యత్తు అయిన వర్తమానమే , భవిష్యత్తుకు గతము అగుచున్నది అనగా_ నేటి వర్తమానము కూడా. 

____

Notes : లయము =నాళనము

కర్త = జగత్కర (Creator ) = ఈశ్వరుడు

ఈశ్వరుడు = మాయాళబలిత బ్రహ్మము .


రేపటికి యుండదు , లయమై పోవుచున్నది . అనగా __ గతము , భవిష్యత్తుకూడా నశించి పోవుచున్నవి .వర్తమానమే నిల్చియున్నది .


సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


04 Oct 2020

------------------------------------ x ------------------------------------




🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 65   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 15 🌻

265. In the Eternity of Existence there is No Time.There is No past and No future.

అనంతమనే ఉనికిలో కాలమనేది అసలు లేదు. భూతకాలము కానీ భవిష్యత్తు కాలమనేది కానీ లేదు.

266. శాశ్వత ఆస్తిత్వములో కాలములేదు, అచట భూత భవిష్యత్తులు లేవు. 

నిన్నలేదు-మనము వర్తనములో ఉన్నాము - రేపు లేదు.

267. నిత్య వర్తమానము

268. ఈ విధముగా మానవునిలో నిద్రాణమైయున్న సంస్కారాముల వ్యక్తీకరణ ఫలితంగా సృష్టి-స్థితి-లయములు, భూత-భవిష్యత్ వర్తమానములు, జీవిత అనుబంధ సంబంధములు ఏర్పడుచున్నవి.

269. భగవంతుడు మానవ రూపములో(మానవునిగా) సృష్టి-స్థితి-లయ కారుడైన జగత్కర్త పాత్రధారి యౌచున్నాడు.

270. శాశ్వత అస్తిత్వములో కాలములేదు.భూతభవిష్యద్వర్తమానములు లేవు.. నిత్యవర్తమానమే ఉన్నది. శాశ్వతత్వములో ఎన్నడును ఏమియు జరుగలేదు. ఎన్నడును ఏమియు జరుగబోదు. నిత్యవర్తమాన మందే అంతయు జరుగుచుండును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


05 Oct 2020

------------------------------------ x ------------------------------------


🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 66   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 16 🌻

271. బాహ్యమును సృష్టిలో ఏదైనను జరిగినట్లు, జరుగుచున్నట్లు జరగబోవునట్లు కనిపించినచో, అదియంతయు, భగవంతుడు"నేను ఎవరిని?" అన్నట్టి తన స్వీయమైన అనంత భగవద్విలాసము తరంగ చలితమైన క్షణికములో భగవంతుడు కనిన దివ్యస్వప్నము తప్ప మరేమియు కాదు.

272. భగవంతుడు, తన దివ్యమూలమైన అనంత దివ్యస్వప్నంలో శాశ్వతముగా ఏక కాలమందే సృష్టి--స్థితి--లయకారుల పాత్రలను నిర్వహించుకున్నారు.

273. భగవంతుడు మానవ స్థితిలో మానవునిగా, మానవునిలో నిద్రాణమైయున్న సంస్కారములు ద్వారా తన స్వీయ సృష్టికి, తానుకర్తయైన బ్రహ్మగను, 

బయటికి చిమ్మిన సంస్కారముల ద్వారా మానవుని దైనందిన జీవితంలో, తన స్వీయ సృష్టిని పోషించుటలో స్థితికారుడైన విష్ణువుగను, 

వ్యతిరేక సంస్కారముల ద్వారా పోషించుచున్న స్వీయ సృష్టిని నాశనమొనర్చుటలో లయకారుడైన మహేశ్వరునిగను-- ఇట్లు సృష్టి- స్థితి-లయకారుడైన జగత్కర్త (ఈశ్వరుడు)గా,తన విజయమును ధృవపరచు చున్నాడు.

274. (1) నిద్రాణ సంస్కారముల-- ద్వారా-- సృష్టిని,

(2) జాగృతిలో నిత్యజీవితము-- ద్వారా--స్థితిని

(3) సుషుప్తి లో వ్యతిరేక సంస్కారముల -- ద్వారా -- లయమును అనుభవించుట ద్వారా జగత్కర్తయౌచున్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


06 Oct 2020

------------------------------------ x ------------------------------------




🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 67   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 17 🌻

275. భగవంతుడు మానవుని స్థితిలో నిత్యము సంస్కారములద్వారా సృష్టి--స్థితి--లయములైన ప్రధాన ధర్మములను నిరూపించు చున్నాడు.ఇది,జగత్కర్త పాత్రను నిర్వహించుచున్న భగవంతుని స్థితి.

276. భగవంతుని యొక్క దివ్య సుషుప్తిలో నిద్రాణమైన సంస్కారముల ద్వారా సచరాచర సమన్వితంబైన మాయ సృష్టింపబడి , భగవంతుని దివ్యస్వప్నమైన వర్తమానములో పోషింపబడి ,దివ్యజాగృతియైన భవిష్యత్తులో నాశనమగుచున్నది .

అనగా మానవ రూపములోనున్న భగవంతుడు ,దివ్యత్వసిద్ధిని బడయుటతో మాయా సృష్టి నాశనమగుచున్నది .

277. సృష్టిలో :_ స్థితి _లయములు

స్థితిలో :_ సృష్టి _లయములు

లయములో :_ సృష్టి _స్థితులు

పరస్పరాశ్రితములై యున్నవి .

278. మానవుడు స్వప్నావస్థ యందున్నప్పుడు , భూత_ వర్తమాన _భవిష్యద్రూపములతో కలియుచున్నాడు . అతడు సమావేశములను సృష్టించుట ,వాటిని పోషించుట , వాటిని నాశనము చేయుట అనెడు పాత్రలను సృజించుచున్నాడు .ఇవ్విధముగా మానవుడు ఎల్లప్పుడు వీటన్నింటికి , స్వప్నమునకు భవిష్యత్తు అయిన వర్తమానముతో సాక్షీ భూతుడైయున్నాడు .

279. ఈపె ( ఈ పై ) ఆధారములనుబట్టి ,స్వప్నములోగాని మెలకువలోగాని , సృష్టింపబడినవి , పోషింపబడినవి వర్తమానములో అడుగడుగునకు తప్పనిసరిగా నాశనము కావలసిన భవిష్యత్తు పొంచియే యున్నది .

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


07 Oct 2020

------------------------------------ x ------------------------------------


🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 68   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 



🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 18 🌻


280. ఏ వస్తువునకైనా ఆది ఎప్పుడున్నదో, దాని అంత్యము కూడా తప్పనిసరిగా అప్పుడే ఉన్నది.

1) స్వప్నము - > జాగృతి -> సుషుప్తి

2) భూతము -> వర్తమానము. -> భవిష్యత్

3) సృషి. --> స్థితి. - - > లయము 

Notes: ఆద్యంతములు రెండును ఒకే మాదిరిగా, ఒకే ప్రమాణములో ఒకే రీతిగా నుండును. సూర్యోదయ, సూర్యాస్తమయములు కూడా ఒకే మాదిరిగా, ఒకే ప్రమాణములో జరుగుచుండును.


281) మానవుడు బాల్యములో

a) నడక నేర్వక ముందు ప్రాకును.

(b) తప్పటడుగులతో నడక నేర్చును.

(c) దంతములు, పల్లు లేవు.

(d) అమాయకపు స్థితి

(e) తినుబండారములకై మారాము చేయును.

(f) సంసారమనగానేమో ఎరుగడు.

(g) బట్ట కట్టడు, దిగంబరి.

వృధాప్యములో

a) నడవ లేక దేకును.

b) చేతికర్ర ఊతగాగొని, నడచును.

c) దంతములు, పళ్లు ఊడి పోయినవి.

d) చాంచల్య స్థితి.

e) జిహ్వ చాపల్యముచే రుచులను కోరును.

f) సంసారమందు తాపత్రయము లేదు.

g) అవసాన స్థితిలో, దహనసమయ మందు గాని, ఖనన సమయమందు

గాని, వస్త్రమును తీసి వైతురు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 
https://t.me/ChaitanyaVijnanam

🌻 🌻 🌻 🌻 🌻 


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్



Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


08 Oct 2020

------------------------------------ x ------------------------------------


🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 69   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 19 🌻

282. సృష్టి _అనుటతోడనే , అందు స్థితి _లయములు రెండును సిద్ధముగ నున్నవి . కనుక _ భగవంతుడు మాయను సృష్టించుటతో , అప్పుడే అందులో సృష్టి యొక్క స్థితి _లయములు ఇమిడి యున్నవి . 

కనుక సృష్టింపబడినది పోషింపబడవలెను . 

పోషింపబడినది నాశనము కావలెను .


283. ప్రపంచము ఒక మిథ్య. ప్రపంచ వ్యవహారములు ఆ మిథ్యలో మరి యొక మిథ్య.

అనగా

మిథ్యయైన సృష్టి భగవంతుని దివ్య స్వప్నము •

భగవంతుడు మానవుని స్థితిలో, మానవ జీవితమును, దివ్య స్వప్నములో మరియొక స్వప్నముగా, స్వప్న జీవితమును అనుభవించుచున్నాడు.

కలలో కలలో కల. 

భగవంతుని దివ్యస్వప్నము ఒక కల. 

అందులో మానవుని పగటి జీవితము మరి యొక కల. 

నిద్రావస్థలో ఇంకొక కల.


284. భగవంతుడు మానవుని స్థితిలో , సుషుప్తి యందునప్పుడు తన దివ్య సుషుప్తి యొక్క అనాది మూల స్థితిని ఉద్ఘాటించుచున్నాడు .

285. సుషుప్తిలో అదృశ్యమైయున్న పూర్ణ చైతన్యమును, అసంఖ్యాక సంస్కారములును జాగ్రదవస్థలో పైకి లేచి , పరమాణు ప్రమాణమై అభావ ఆవిష్కారమైన సృష్టిని , అనంతముగను , వాస్తవముగను అనుభవించు చుండును .


సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


09 Oct 2020

------------------------------------ x ------------------------------------



🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 70   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 



🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 20 🌻


286. సుషుప్తిలో పూర్ణ చైతన్యమును , సంస్కారములును అదృశ్యము లగుచున్నవి .

287. పునర్జన్మ ప్రక్రియ యందును , ఆధ్యాత్మిక మార్గమందును సంస్కారములు పూర్తిగా రద్దు అగువరకు , చైతన్యము సంస్కారములు కూడా సుషుప్తినుండి _ జాగృతికి ఉదయించుచు , జాగృతి నుండి _సుషుప్తిలో అదృశ్యమగు చుండును .వ్యతిరేక సంస్కారముల ద్వారా సంస్కారములు పూర్తిగా రద్దగుచుండును .

288. మానవుని సుషుప్తిలో మిధ్యాహం యొక్క చైతన్యము లేదు .కాని అహం మాత్రమున్నది .

289. మానవుడు సుషుప్తి అవస్థనుండి , జాగ్రదవస్థకు వచ్చుటకు తప్పనిసరిగా మధ్యనున్న స్వప్నస్థితిని దాటి రావలయును .

290. మానవుని సుషుప్తియు ,భగవంతుని దివ్య సుషుప్తియు ఒక్కటే .


సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్ 


10 Oct 2020

------------------------------------ x ------------------------------------


🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 71   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 21 🌻

291. భగవంతుడు శాశ్వతముగా , పరాత్పర స్థితిలో దివ్య సుషుప్తి యందే ఉన్నాడు .కాని మానవస్థితిలోనున్న భగవంతుడువై కల్పికముగా ఒకసారి సుషుప్తిని ,మరొకసారి జాగృతిని అనుభవించుచున్నాడు .

292. గాఢనిద్రలో మానవుని దేశ _కాలములు నాశనమైనట్లుగా నున్నవి .అనగా , తాత్కాలికముగా నాశనమైనవి .

293. గాఢనిద్రలో దేశ_కాలములు నాశనమైనప్పుడు , అతడు మేల్కొనగానే మరల పగలు , విశ్వమును అతనికి ఎట్లు వచ్చుచున్నవి ?

🌻. సృష్టి -స్థితి- లయములు .🌻 

294. పరిణామక్రమములో ప్రోగుపడి, గాఢనిద్రలో నిద్రాణమైయున్న మానవుని స్వీయ సంస్కారములు ,చైతన్యము అతనికి ప్రతి దినము జాగ్రదవస్థలో ఉదయమును ,విశ్వమును సృజించుచున్నవి .

295. జాగ్రదవస్థలో మానవుని నిత్యజీవిత స్వీయ సంస్కార ములచే ఉదయ , విశ్వములు పోషింపబడుచున్నవి .

296. జాగ్రదవస్థయందున్న సంస్కారములు ,నిద్రావస్థలో

నున్న అనుభవ సంస్కారములచే పగలు , విశ్వములు నాశనమౌచున్నవి .

297. భగవంతుడు ,

(1) మానవుని నిద్రాణసంస్కారముల ద్వారా తన స్వీయ సృష్టికి .........కర్తననియు

(పెరుగుట) విశ్రాంతి గొనుట , ముడుచుకొనుట (సంకోచించుట) మొదలగు సంకోచ , వికాసముల ద్వారా జరుగుచున్న సమయమందే - 

శిశువు జన్మించుచున్నది - సృష్టి 

శిశువు పోషింపబడుచున్నది - స్థితి

చివరకు గుండె , చరముగా సంకోచించుట ద్వారా , విశ్రాంతి రూపములో దేహము విడువబడు చున్నది (మరణము ) - లయము .

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 
https://www.facebook.com/groups/465726374213849/


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్


11 Oct 2020


------------------------------------ x ------------------------------------



🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 72   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 



🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 22 🌻

🌻. వ్యతిరేక సంస్కారముల ఆవశ్యకత : 🌻

301.సంస్కారములు రద్దగుటకు , భిన్న అనుభవములు తప్పక అవసరము . ఎందుచేతననగా , భిన్న అనుభవములు మాత్రమే చిక్కగానున్న సంస్కారములను సమూలముగా పెకలించగలవు .

302. జాగ్రదవస్థలో , మానవుడు బాహ్యకార్య కలాప నిమగ్నుడై యుండుట వంటిది పునర్జన్మ ప్రక్రియ .

303. సంస్కారముల వలననే ,సృష్టిలోనిద్రావసయు , జాగ్రదవస్థయు , పగటి దైనందినజీవితమును స్థాపింపబడుచున్నవి .

304. సృష్టిలోనున్న మిథ్యా జీవితము , సాధారణ సుషుప్తి తోడను , సాధారణ జాగృతితోడను ఏర్పడియున్నది .

305. సృష్టిలో ఒక ప్రాణిపొందు సుషుప్తికిని ,మానవుని సుషుప్తికిని భేదమున్నది . అట్లే సామాన్యుని సుషుప్తి కిని ఆధ్యాత్మిక మార్గములో నున్న వాని సుషుప్తికిని అట్లే భేదమున్నది .

306. ప్రపంచములోనున్న ప్రత్యగాత్మలు భౌతిక గోళము యొక్క సరిహద్దుల లోపలనే యున్నవి ..

307. అన్ని భౌతిక సూర్యులు , అన్ని చంద్రులు , అన్ని ప్రపంచములు , రోదసి (అంతరిక్షము ) అంతయు కలిసి భౌతిక గోళము .

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 
https://t.me/ChaitanyaVijnanam

------------------------------------ x ------------------------------------





🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 73 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 



🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 23 🌻


308. ఎంత గొప్ప దార్శనికుడైనను , ఎంత గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్త అయినను వీరిద్దరు భౌతిక గోళము లోపలనే యున్నారు .


309. బహు సున్నిత పథార్ధములైన ఈథర్ , అణువు , కంపనము ,వెలుతురు ,రోదసి ఇవియన్నియు , సున్నిత ద్రవ్యము లైనప్పటికీ , అవి భౌతిక పదార్థములే .


310. పంచ గోళములు (త్రిభువనములు) -

(1) భౌతిక గోళము

(9) సూక్మ గోళము

(3) మానసిక గోళము

(1) సంయు క గోళము

(5) సత్యగోళము

అన్నమయ భువనము -

పరస్పర సంబంధ గోళములు


311. భౌతికగోళం యొక్క ఉనికి సూక్ష్మ గోళముపై ఆధారపడియున్నును అనేక తరహాలలో సూక్ష్మ గోళము నకు భిన్నమైనది.

312.భౌతికగోళము సూక్ష్మగోళముయొక్క ఫలితమైనప్పటికీ, సూక్ష్మగోళముపూర్తిగా స్వతంత్రమై నది ఇది సూక్ష్మగోళం పై ఆధారపడియున్నది.

313. భౌతికగోళము అసంఖ్యాకప్రపంచములు, సూర్యులు, చంద్రులు, నక్షత్రములు యింతెందుకు చాలమోటైన జడపదార్ధమునుండి బహుసున్నితమైన భౌతిక పదార్థము వరకు, వీటన్నిటితో కూడియున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 
https://www.facebook.com/groups/465726374213849/

------------------------------------ x ------------------------------------


------------------------------------ x ------------------------------------







No comments:

Post a Comment