మహార్నవమి శుభాకాంక్షలు, Happy Maharnavami


🌹. మహార్నవమి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Maharnavami to all 🌹

ప్రసాద్ భరద్వాజ


నిత్య ప్రజ్ఞా సందేశములు - 343 - 8. మన తలల పైన ఒక. . . / DAILY WISDOM - 343 - 8. There is a Mystery Hanging . . .


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 343 / DAILY WISDOM - 343 🌹

🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀

📝. ప్రసాద్ భరద్వాజ్

🌻 8. మన తలల పైన ఒక మర్మం వేలాడుతూ ఉంటుంది🌻


తత్వశాస్త్రం అనేది సంఘటనల వెనుక ఉన్న కారణాల అధ్యయనం, లేదా, ప్రభావాలకు గల కారణాల అధ్యయనం అని చెప్పవచ్చు. లేదా దాని అర్థాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లామంటే, ఇది సమస్త విషయాల యొక్క అంతిమ కారణాన్ని అధ్యయనం చేయడం అని చెప్పవచ్చు. ఇదీ తత్వశాస్త్రం అంటే. అసలు ఏదైనా ఎందుకు మనుగడలో ఉండాలి? అది ఆ విధంగా గానే ఎందుకు ప్రవర్తించాలి? విజ్ఞాన శాస్త్రానికి తత్వ శాస్త్రానికి ఉన్న తేడా ఏమిటంటే విజ్ఞాన శాస్త్రం విషయాలు ఎలా జరుగుతాయో చెప్తుంది కానీ ఎందుకు జరుగుతుందో చెప్పదు. అది విజ్ఞాన శాస్త్రం పరిధి లోకి రాదు. తాత్విక శాస్త్రం ఏదైనా విషయం యొక్క కారణాన్ని పరిశోధిస్తుంది. ఏదైనా విషయం యొక్క మూలకారణాన్ని తెలుసుకోలేకపోతే, మనిషికి సంతృప్తి ఉండదు.

మనకి ఎప్పటికీ అర్థం కాని రహస్యం ఏమిటంటే సృష్టిలో ప్రతి వస్తువు ఒక నిర్దుష్టమైన విధానంలో ప్రవర్తించడానికి గల కారణం ఏంటి? వివిధ రకాల సామాజిక తత్వాలు మానవ ప్రవర్తన యొక్క స్వభావాన్ని అధ్యయనం చేస్తాయి. సామాజిక శాస్త్రం, మళ్ళీ, మానవ ప్రవర్తన యొక్క కారణం కాకుండా ఎలా ప్రవర్తిస్తారు అనే దానికే పరిమితం అవుతుంది. 'ప్రజలు తమలో తాము ఎలా ప్రవర్తిస్తారు? వారు మానవ సమాజంలో ఎలా ప్రవర్తిస్తారు?' అని అడుగుతుంది. కానీ మనలో ఒక భిన్నమైన దృక్కోణం ఉంది. ఇది వేసే ప్రశ్న ఏమిటంటే: 'ఈ వ్యక్తులు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తారు?' అని. “ప్రజలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో నాకు తెలియదు” అని మనం తరచుగా అంటుంటాం.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 343 🌹

🍀 📖 from The Philosophy of Religion 🍀

📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj

🌻 8. There is a Mystery Hanging Above Our Heads🌻


Philosophy is a study of causes behind events, or, rather, the causes of effects, or, to push it further, it may be said to be a study of the ultimate cause of things. This is the subject of philosophy. Why should there be anything at all, and why should it behave the way it behaves? It is often said that science is distinguished from philosophy in this: that, while science can tell the ‘how' of things, it cannot explain the ‘why' of things. That is not its field. The ‘why' of anything is investigated into by the study known as philosophy. Unless the question as to the ‘why' of a thing is answered from within oneself, one cannot feel finally contented.

There is a mystery hanging above our heads, and everything seems to be a mist before us. Why should anything conduct itself or behave in the way it does? Social philosophies of different types study the nature of human behaviour. The science of sociology, again, confines itself to the ‘how' rather than the ‘why' of human behaviour. “How do people conduct themselves, and how do they behave in human society?” it asks. But we have a different faculty within us which puts the question: “Why do these people behave in this manner?” We often say, “I do not know why people are behaving in that way.”


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 626 / Sri Siva Maha Purana - 626


🌹 . శ్రీ శివ మహా పురాణము - 626 / Sri Siva Maha Purana - 626 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 10 🌴

🌻. తారకాసుర వధ - 4 🌻


ఆ యుధ్ధములో కొందరు రాక్షసులు భయముతో చేతులు జోడించిరి. వేలాది రాక్షసులు తెగిన అవయవములు గలవారై మరణించిరి(35). కొందరు రాక్షసులు అపుడు చేతులు జోడించి 'రక్షించుము, రక్షించుము' అని పలుకుచూ దిక్కుతోచక కుమారుని శరణు గోరిరి (36). కొందరు అచటనే సంహరింపబడగా, మరికొందరు పారిపోయిరి. పారిపోవు వారిని దేవతలు, గణములు తన్ని పీడించిరి (37). ఆశలు భగ్నము కాగా, దైన్యమును పొందియున్న ఆ రాక్షసులు వేలాది మంది బ్రతుకు తీపితో పారిపోయి పాతాళములో ప్రవేశించిరి (38).

ఓ మహర్షీ! ఈ విధముగా రాక్షససైన్యమంతయూ చెల్లాచెదరయ్యెను. గణములకు, దేవతకు భయపడి అపుడచట ఒక్కరైననూ నిలబడలేదు (39). ఆ దుర్మార్గుడు సంహరింపబడగానే అంతయూ నిష్కంటకమాయెను. ఇంద్రాది దేవతలందరు అపుడు సుఖించిరి(40). ఈ విదముగా కుమారుడు విజయమును పొందెను. సమస్త దేవతలు, మరియు ముల్లోకములు ఏకకాలములో మహానందమును పొందెను (41). అపుడు శివుడు కూడా కార్తికుని ఆ విజయమునెరింగి గణములతో కూడి ప్రియురాలితో సహ ఆనందముతో అచటకు వచ్చెను (42).

పార్వతి ప్రేమతో నిండిన హృదయము గలదై సూర్యునితో సమమగు తేజజస్సు గల తన పుత్రుడగు కుమారుని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని మిక్కిలి ప్రీతితో లాలించెను (43). అపుడు హిమవంతుడు తన పుత్రులతో, బంధువులతో, అనుచరులతో కూడి వచ్చి శంభుని, పార్వతిని, గుహుని స్తుతించెను (44).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 SRI SIVA MAHA PURANA - 626🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 10 🌴

🌻 Jubilation of the gods at the death of Tāraka - 4 🌻


35. Some of the Asuras who were afraid joined their palms in reverence. In the battle the limbs of many Asuras were chopped off and severed. Thousands were killed too.

36. Some of the Asuras shrieking “O save O save” with palms joined in reverence sought refuge in Kumāra.

37. Numberless Asuras were killed. Many fled. The fleeing Asuras were beaten and harassed by the gods and the Gaṇas.

38. Thousands of them fled to Pātāla for their life. Those who tried to flee were disappointed and put to distress.

39. O great sage, thus the entire army of the Asuras disappeared. None dared to remain there for fear of the gods and the Gaṇas.

40. When the wicked Asura was killed, the whole universe became freed of thorns, freed from the danger and nuisance of the Asuras. Indra and other gods became happy.

41. Thus when Kumāra came out victorious the gods were happy. The three worlds attained great pleasure.

42. On knowing about the victory of Kārttikeya, Śiva came there joyously with his beloved and the Gaṇas.

43. He took his son on his lap and fondled him with pleasure. Pārvatī in her flutter of affection took Kumāra, resplendent as the sun, on her lap and fondled him with pleasure.

44. Then Himavat came there along with his sons, kinsmen and servants. He eulogised Śiva and Guha.


Continues....

🌹🌹🌹🌹🌹

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 664 / Vishnu Sahasranama Contemplation - 664


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 664 / Vishnu Sahasranama Contemplation - 664🌹

🌻664. బ్రహ్మ, ब्रह्म, Brahma🌻

ఓం బ్రాహ్మణే నమః | ॐ ब्राह्मणे नमः | OM Brāhmaṇe namaḥ


సత్త్వాది లక్షణం బ్రహ్మ సత్యం జ్ఞానమితి శ్రుతేః ।
ప్రత్యస్తమితి భేదం యత్ సత్తా మాత్రమగోచరమ్ ॥
వచసా మాత్మ సంవేద్యం తద్‍జ్ఞానం బ్రహ్మ సంజ్ఞితం ।
ఇతి విష్ణు పురాణే శ్రీ పరాశరసమీరణాత్ ॥

'బృహి - వృద్ధౌ' అను ధాతువునుండి బృంహతి - వృద్ధినందును, చాల పెద్దదిగనుండును, బృంహయతి - వృద్ధినందిచును అను అర్థములలో 'బ్రహ్మ' అను శబ్దము నిష్పన్నమగుచున్నది.

'సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ' అను తైత్తిరీయోపనిషద్ వాక్యమునుబట్టి సత్యము, జ్ఞానము అనునవి తన రూపముగా కలదియు, అవధిరహితమును అగునది 'బ్రహ్మ'. ఈ శ్రుతి వాక్యముననుసరించి మిగుల పెద్దదియు, అనంతమయినదియు, అన్నిటిని సృజించునదియు, వర్ధిల్లజేయునదియునగు బ్రహ్మతత్త్వమే శ్రీ విష్ణువు.

:: శ్రీ విష్ణుమహాపురాణే షష్ఠాంశే సప్తమోఽధ్యాయః ::

ప్రత్యస్త్మితభేదం యత్సత్తామాత్రమగోచరమ్ ।
వచసామాత్మసంవేద్యం తజ్ఞ్జ్ఞానం బ్రహ్మసంజ్ఞితమ్ ॥ 53 ॥

విశేష రూపమున మరుగు పడిన సకల భేదములు కలిగినదియు, ఏకైకాఖండ తత్త్వమును, సత్తా అనగా ఉనికి మాత్రము తన రూపముగా కలదియు, వాక్కులకు అగోచరమును, తన అంతర్ముఖ వృత్తిగల ఆత్మతత్త్వమునకు మాత్రమే తెలియునదియు అగు ఏ జ్ఞానము కలదో అదియే బ్రహ్మము అను నామము కలది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 664🌹

🌻664. Brahma🌻

OM Brāhmaṇe namaḥ


सत्त्वादि लक्षणं ब्रह्म सत्यं ज्ञानमिति श्रुतेः ।
प्रत्यस्तमिति भेदं यत् सत्ता मात्रमगोचरम् ॥

वचसा मात्म संवेद्यं तद्‍ज्ञानं ब्रह्म संज्ञितं ।
इति विष्णु पुराणे श्री पराशरसमीरणात् ॥


Sattvādi lakṣaṇaṃ brahma satyaṃ jñānamiti śruteḥ,
Pratyastamiti bhedaṃ yat sattā mātramagocaram.
Vacasā mātma saṃvedyaṃ tadˈjñānaṃ brahma saṃjñitaṃ,
Iti viṣṇu purāṇe śrī parāśarasamīraṇāt.


From the root 'Br‌hi', Br‌ṃhati meaning the one that grows, Br‌ṃhayati - the one that causes growth, the word Brahma originates.

As explained in Taittirīya upaniṣad 'Satyaṃ Jñānamanaṃtaṃ Brahma' - Brahma is of the nature of existence, knowledge and infinitude. Being great and all-pervading, Lord Viṣṇu, hence, is Brahma.


:: श्री विष्णुमहापुराणे षष्ठांशे सप्तमोऽध्यायः ::

प्रत्यस्त्मितभेदं यत्सत्तामात्रमगोचरम् ।
वचसामात्मसंवेद्यं तज्ञ्ज्ञानं ब्रह्मसं ज्ञितम् ॥ ५३ ॥


Śrī Viṣṇu Mahā Purāṇa - Part 6, Chapter 7

Pratyastmitabhedaṃ yatsattāmātramagocaram,
Vacasāmātmasaṃvedyaṃ tajñjñānaṃ brahmasaṃ jñitam. 53.


That Knowledge which negates difference, which refers to pure existence, which is beyond the grasp of senses and realized in the Self is indicated by Brahma.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥

Brahmaṇyo brahmakr‌dbrahmā brahma brahmavivardhanaḥ,Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


శ్రీమద్భగవద్గీత - 265: 06వ అధ్., శ్లో 32 / Bhagavad-Gita - 265: Chap. 06, Ver. 32

 

🌹. శ్రీమద్భగవద్గీత - 265 / Bhagavad-Gita - 265 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 32 🌴

32. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున |
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మత: ||


🌷. తాత్పర్యం :

ఓ అర్జునా! ఎవడు తనతో పోల్చుకొని సమస్తజీవులకు వాటి సుఖదుఃఖములందు సమముగా గాంచునో అతడే ఉత్తమయోగి యనబడును.

🌷. భాష్యము :

తన స్వానుభవకారణముగా సర్వుల సుఖదుఃఖములను తెలిసియుండెడి కృష్ణభక్తిరసభావితుడు వాస్తవమునకు ఉత్తమయోగి యనబడును. భగవానునితో తనకు గల సంబధమును మరచుటయే జీవుని దుఃఖమునకు కారణమై యున్నది.

కాని శ్రీకృష్ణుడే సర్వమానవకర్మలకు దివ్యభోక్తయనియు, సమస్తజగములకు ప్రభువనియు, సర్వజీవుల ఆప్తమిత్రుడనియు ఎరుగుటయే జీవుని సుఖశాంతులకు కారణము కాగలదు.

ప్రకృతిజన్య త్రిగుణములకు లొంగి యుండెడి జీవుడు తనకు శ్రీకృష్ణునితో గల సంబంధమును మరచుట చేతనే తాపత్రయములకు లోనగునని యోగియైనవాడు ఎరిగియుండును.

కృష్ణభక్తిభావన యందు నిలుచు అట్టి యోగి సుఖియై యుండును కనుక కృష్ణసంబంధ విజ్ఞానమును సర్వులకు పంచుటకు యత్నించును.

ప్రతియొక్కరు కృష్ణభక్తిరసభావితులు కావలసిన అవశ్యకతను అతడు ప్రచారము చేయ యత్నించునందున అతడే నిజముగా జగములో ఉత్తమమైన జహితైషియు మరియు శ్రీకృష్ణునకు ప్రియతమ సేవకుడును కాగలడు. “న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమ:” ( భగవద్గీత 18.69).

అనగా భక్తుడు సదా జీవులందరి క్షేమమును గాంచుట సర్వులకు ఆప్తమిత్రుడు కాగలడు. యోగమునందు పూర్ణత్వమును స్వీయలాభాపేక్ష కొరకు గాక కేవలము ఇతరుల కొరకే ఉపయోగించు కారణమున అతడు ఉత్తమయోగియు కాగలడు.

ఇతర జీవుల యెడ అతడెన్నడును ఈర్ష్యను కలిగియుండడు. విశుద్ధభక్తునికి మరియు స్వీయోద్ధారమునకై యత్నించు సాధారణయోగికి నడుమ వ్యత్యాసము ఇచ్చటనే యున్నది.

కనుకనే చక్కగా ధ్యానము చేయుట కొరకు ఏకాంతస్థలమునకు పోవు యోగి, ప్రతియొక్కరికి తన శక్తి కొలది కృష్ణభక్తిరసభావితులుగా మార్చ యత్నము చేయు భక్తుని కన్నను పూర్ణుడు కానేరడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 265 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 32 🌴

32. ātmaupamyena sarvatra samaṁ paśyati yo ’rjuna
sukhaṁ vā yadi vā duḥkhaṁ sa yogī paramo mataḥ


🌷 Translation :

He is a perfect yogī who, by comparison to his own self, sees the true equality of all beings, in both their happiness and their distress, O Arjuna!


🌹 Purport :

One who is Kṛṣṇa conscious is a perfect yogī; he is aware of everyone’s happiness and distress by dint of his own personal experience. The cause of the distress of a living entity is forgetfulness of his relationship with God.

And the cause of happiness is knowing Kṛṣṇa to be the supreme enjoyer of all the activities of the human being, the proprietor of all lands and planets, and the sincerest friend of all living entities.

The perfect yogī knows that the living being who is conditioned by the modes of material nature is subjected to the threefold material miseries due to forgetfulness of his relationship with Kṛṣṇa. And because one in Kṛṣṇa consciousness is happy, he tries to distribute the knowledge of Kṛṣṇa everywhere.

Since the perfect yogī tries to broadcast the importance of becoming Kṛṣṇa conscious, he is the best philanthropist in the world, and he is the dearest servitor of the Lord. Na ca tasmān manuṣyeṣu kaścin me priya-kṛttamaḥ (Bg. 18.69).

In other words, a devotee of the Lord always looks to the welfare of all living entities, and in this way he is factually the friend of everyone.

He is the best yogī because he does not desire perfection in yoga for his personal benefit, but tries for others also. He does not envy his fellow living entities. Here is a contrast between a pure devotee of the Lord and a yogī interested only in his personal elevation.

The yogī who has withdrawn to a secluded place in order to meditate perfectly may not be as perfect as a devotee who is trying his best to turn every man toward Kṛṣṇa consciousness.

🌹 🌹 🌹 🌹 🌹




04 Oct 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹04, October 2022 పంచాగము - Panchagam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

🍀. మహార్నవమి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Maharnavami to all 🍀

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : మహానవమి, ఆయుధ పూజ, Maha Navami, Ayudha Puja

🍀. సంకట మోచన హనుమాన్ స్తుతి - 5 🍀


5. శ్రీలక్ష్మణం నిహతవాన్ యుధి మేఘనాదో
ద్రోణాచలం త్వముదపాటయ చౌషధార్థం.

ఆనీయ తం విహితవానసుమంతమాశు
ర్జానాతి కో న భువి సంకటమోచనం త్వాం.

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : పేదలకు తప్పక సహాయం చెయ్యి. కాని, అంతతోనే తృప్తి చెందకు. నీవు సహాయం చేసేందుకు అసలు పేదలనే వారే లేకుండ చెయ్యడమెలాగో పరిశోధించి అందు కోసం కూడా కృషి చెయ్యి. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం

తిథి: శుక్ల-నవమి 14:22:55 వరకు

తదుపరి శుక్ల-దశమి

నక్షత్రం: ఉత్తరాషాఢ 22:52:43

వరకు తదుపరి శ్రవణ

యోగం: అతిగంధ్ 11:23:12 వరకు

తదుపరి సుకర్మ

కరణం: కౌలవ 14:20:55 వరకు

వర్జ్యం: 07:54:40 - 09:24:24

మరియు 26:36:00 - 28:05:36

దుర్ముహూర్తం: 08:29:55 - 09:17:39

రాహు కాలం: 15:03:42 - 16:33:12

గుళిక కాలం: 12:04:43 - 13:34:12

యమ గండం: 09:05:43 - 10:35:13

అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:27

అమృత కాలం: 16:53:04 - 18:22:48

సూర్యోదయం: 06:06:43

సూర్యాస్తమయం: 18:02:42

చంద్రోదయం: 14:07:42

చంద్రాస్తమయం: 00:22:49

సూర్య సంచార రాశి: కన్య

చంద్ర సంచార రాశి: మకరం

మానస యోగం - కార్య లాభం 17:15:00

వరకు తదుపరి పద్మ యోగం -

ఐశ్వర్య ప్రాప్తి

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹