నిత్య ప్రజ్ఞా సందేశములు - 343 - 8. మన తలల పైన ఒక. . . / DAILY WISDOM - 343 - 8. There is a Mystery Hanging . . .


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 343 / DAILY WISDOM - 343 🌹

🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀

📝. ప్రసాద్ భరద్వాజ్

🌻 8. మన తలల పైన ఒక మర్మం వేలాడుతూ ఉంటుంది🌻


తత్వశాస్త్రం అనేది సంఘటనల వెనుక ఉన్న కారణాల అధ్యయనం, లేదా, ప్రభావాలకు గల కారణాల అధ్యయనం అని చెప్పవచ్చు. లేదా దాని అర్థాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లామంటే, ఇది సమస్త విషయాల యొక్క అంతిమ కారణాన్ని అధ్యయనం చేయడం అని చెప్పవచ్చు. ఇదీ తత్వశాస్త్రం అంటే. అసలు ఏదైనా ఎందుకు మనుగడలో ఉండాలి? అది ఆ విధంగా గానే ఎందుకు ప్రవర్తించాలి? విజ్ఞాన శాస్త్రానికి తత్వ శాస్త్రానికి ఉన్న తేడా ఏమిటంటే విజ్ఞాన శాస్త్రం విషయాలు ఎలా జరుగుతాయో చెప్తుంది కానీ ఎందుకు జరుగుతుందో చెప్పదు. అది విజ్ఞాన శాస్త్రం పరిధి లోకి రాదు. తాత్విక శాస్త్రం ఏదైనా విషయం యొక్క కారణాన్ని పరిశోధిస్తుంది. ఏదైనా విషయం యొక్క మూలకారణాన్ని తెలుసుకోలేకపోతే, మనిషికి సంతృప్తి ఉండదు.

మనకి ఎప్పటికీ అర్థం కాని రహస్యం ఏమిటంటే సృష్టిలో ప్రతి వస్తువు ఒక నిర్దుష్టమైన విధానంలో ప్రవర్తించడానికి గల కారణం ఏంటి? వివిధ రకాల సామాజిక తత్వాలు మానవ ప్రవర్తన యొక్క స్వభావాన్ని అధ్యయనం చేస్తాయి. సామాజిక శాస్త్రం, మళ్ళీ, మానవ ప్రవర్తన యొక్క కారణం కాకుండా ఎలా ప్రవర్తిస్తారు అనే దానికే పరిమితం అవుతుంది. 'ప్రజలు తమలో తాము ఎలా ప్రవర్తిస్తారు? వారు మానవ సమాజంలో ఎలా ప్రవర్తిస్తారు?' అని అడుగుతుంది. కానీ మనలో ఒక భిన్నమైన దృక్కోణం ఉంది. ఇది వేసే ప్రశ్న ఏమిటంటే: 'ఈ వ్యక్తులు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తారు?' అని. “ప్రజలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో నాకు తెలియదు” అని మనం తరచుగా అంటుంటాం.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 343 🌹

🍀 📖 from The Philosophy of Religion 🍀

📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj

🌻 8. There is a Mystery Hanging Above Our Heads🌻


Philosophy is a study of causes behind events, or, rather, the causes of effects, or, to push it further, it may be said to be a study of the ultimate cause of things. This is the subject of philosophy. Why should there be anything at all, and why should it behave the way it behaves? It is often said that science is distinguished from philosophy in this: that, while science can tell the ‘how' of things, it cannot explain the ‘why' of things. That is not its field. The ‘why' of anything is investigated into by the study known as philosophy. Unless the question as to the ‘why' of a thing is answered from within oneself, one cannot feel finally contented.

There is a mystery hanging above our heads, and everything seems to be a mist before us. Why should anything conduct itself or behave in the way it does? Social philosophies of different types study the nature of human behaviour. The science of sociology, again, confines itself to the ‘how' rather than the ‘why' of human behaviour. “How do people conduct themselves, and how do they behave in human society?” it asks. But we have a different faculty within us which puts the question: “Why do these people behave in this manner?” We often say, “I do not know why people are behaving in that way.”


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment