🌹 మెహర్ బాబా జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 Happy Meher Baba Jayanti to all 🌹
Prasad Bharadwaj
🍀 మెహెర్ బాబా జీవిత చరిత్ర - ప్రముఖ బోధనలు 🍀
🍀 Meher Baba Biography - Famous Teachings 🍀
మెహెర్ బాబా (1894 ఫిబ్రవరి 25 - 1969 జనవరి 31) భారతదేశానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు. ఆయన జన్మనామం మెర్వన్ షెరియార్ ఇరానీ. ఆయన తాను ఒక భగవంతుని అవతారంగా ప్రకటించుకున్నాడు. మెర్వన్ షెరియార్ ఇరానీ 1894లో మహారాష్ట్రలోని పూనాలో పుట్టాడు. ఆయన తల్లిదండ్రులు జొరాష్ట్రియన్ మతానికి చెందిన వాళ్ళు. 19 సంవత్సరాల వయసులో ఆయన ఆధ్యాత్మిక అన్వేషణ ప్రారంభమైంది. అందులో భాగంగా ఐదుగురు ఆధ్యాత్మిక గురువులని కలిశాడు. తరువాత 1922 లో ఆయనే ఒక సంప్రదాయాన్ని ప్రారంభించి 27 ఏళ్ళు వచ్చేసరికి శిష్యులను సంపాదించుకున్నాడు.
జులై 10 1925 నుంచి తనువు చాలించేంత వరకు మౌనదీక్షలో ఉన్నాడు. కేవలం చేతి సైగలతో, అక్షరాల పలకతోనే సంభాషించేవాడు. ఆయన తన భక్తబృందంతో జనబాహుళ్యానికి దూరంగా దీర్ఘకాలం గడిపేవాడు. అందులో చాలాసార్లు ఉపవాసం చేసేవాడు. విస్తృతంగా పర్యటించాడు. ప్రజలతో బహిరంగ సమావేశాలు నిర్వహించి కుష్టువ్యాధిగ్రస్తులకు, పేదవాళ్ళకు, మానసిక వ్యాధులతో బాధ పడుతున్నవారికి సేవలు చేసేవాడు.
1931లో మొదటిసారి విదేశాల్లో పర్యటించి అనేకులను అనుచరులుగా చేసుకున్నాడు. 1940వ దశకమంతా బాబా సూఫీలో భాగమైన మాస్ట్స్ అనే ప్రత్యేక వర్గానికి చెందిన ఆధ్యాత్మిక సాధకులతో కలిసి పనిచేశాడు. వీరందరూ ఆయన్ను చూడగానే తమ ఆధ్యాత్మిక చేతనత్వాన్ని కనుగొన్నారని మెహెర్ బాబా పేర్కొన్నాడు. 1949 మొదలుకొని ఎంపిక చేసిన బృందంతోనే భారతదేశమంతా అనామకుడిలా పర్యటించాడు. ఈ సమయమంతా తన జీవితంలో నూతన నిగూఢ అధ్యాయంగా పేర్కొన్నాడు. మెహెర్ బాబా తన జీవితంలో రెండు సార్లు తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. ఒకటి 1952లో అమెరికాలో జరగ్గా మరొకటి 1956లో భారతదేశంలో జరిగింది. దానితో ఆయన సరిగ్గా నడవలేక పోయాడు. 1962లో, ఆయన తన పాశ్చాత్య శిష్యులనంతా భారతదేశానికి వచ్చి మూకుమ్మడిగా దర్శనం చేసుకోమన్నాడు. దీన్ని ది ఈస్ట్-వెస్ట్ గ్యాదరింగ్ అన్నాడు. విచ్చలవిడిగా మందుల వాడకం వలన పెద్దగా ఉపయోగం ఉండదని 1966లో పేర్కొన్నాడు. ఆరోగ్యం సహకరించకున్నా, ఉపవాసం, ఏకాంతం లాంటి సార్వత్రిక కార్యక్రమాలను 1969, జనవరి 31న ఆయన మరణించే వరకూ కొనసాగిస్తూనే వచ్చాడు. మెహరాబాద్‌లోని ఆయన సమాధిని విదేశాలకు చెందిన భక్తులు కూడా సందర్శిస్తున్నారు. మెహెర్ బాబా జీవిత పరమార్థం గురించి, పునర్జన్మ గురించి, భ్రమతో కూడిన లోకం తీరు గురించి అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు. ఈ ప్రపంచం మిథ్య అనీ భగవంతుడొక్కడే సత్యమనీ, ప్రతి ఒక్కరు తమలోని పరమాత్మను తెలుసుకోవాలని బోధించాడు. అంతేకాకుండా చావు పుట్టుకల వలయం నుంచి బయటపడటానికి అవసరమైన ఆత్మజ్ఞానం గురించి ఆధ్యాత్మిక సాధకులకు అనేక సలహాలిచ్చాడు. కచ్చితమైన గురువు ఎలా ఉంటాడో చెప్పాడు. ఆయన బోధనలు డిస్కోర్సెస్ మరియు గాడ్ స్పీక్స్ అనే పుస్తకాలలో పొందుపరచబడ్డాయి. అవతార్ మెహెర్ బాబా ట్రస్ట్, పాప్-కల్చర్ కళాకారులపై ఆయన చూపిన ప్రభావం, డోంట్ వర్రీ బీ హ్యాపీ లాంటి చిన్న చిన్న చమక్కులు ఆయన వదిలి వెళ్ళిన వారసత్వ సంపద. మెహెర్ బాబా మౌనం ఆయన అనుచరుల్లోనే గాక బయటి ప్రపంచానికి కూడా ఒక రహస్యంగా మిగిలిపోయింది.
🌻 మెహర్ బాబా బోధనలు 🌻
మెహెర్ బాబా మనిషి లోని స్వార్థభూతాన్ని తరిమికొట్టేందుకు ఎంతగానో ప్రయత్నించారు. అందులో భాగంగానే అన్ని బంధాలకూ, పతనానికి హేతువైన నేనూ, నాథనే స్వార్థాన్ని వీడండి.
నిన్ను నేవు ప్రేమింటుకున్నట్టే తోటి మనిషినీ ప్రేమించమని, అప్పుడే పరమాత్మకు మనం చేరువవు తామని చాటిచెప్పాడు. ఆధ్యాత్మికత మనిషిని పరమోన్నతమైన మార్గానికి తీసుకువెళ్ళే ఆలంబన కావాలని దిశానిర్దేశనం చేశాడు. పరవారి లోపాలను ఎత్తి చూపడం కన్నా మనని మనం సంస్కరించుకోవడంలోనే గొప్పతనముందన్నాడు. ఇతరులకు చెడు చెయ్యకపోవడమే మనం చేయగలిగే మంచి అన్నాడు.
భౌతిక సుఖాలకోసమెంత తపించిపోతామో అంతకు రెట్టింపు తపన పరమాత్మవైపు పడగలిగితే తప్పకుండా భగవంతుని దర్శనం లభిస్తుందని ప్రకటించాడు మెహెర్ బాబా. విశ్వాసం, విధేయత, ఫలాపేక్ష లేకపోవడం, నిస్వార్థంగా తనకు తాను సమర్పణం చేసుకోగలిగే నిజాయతీ గుణాలున్న వారంటేనే దైవం మెచ్చు కుంటాడన్నారు.
మనమేదైతే పూర్తిగా విశ్వసిస్తామో దాన్నే ఆచరించాలని, పరులమెప్పు పొందాలనో, తన గొప్పతనం ఇతరులు గుర్తించాలనో ఆర్భాటాలకూ, అట్టహాసాలు ప్రదర్శించేవారికి పరమాత్మ ఎప్పుడూ దూరంగానే ఉంటాడని చెప్పారు బాబా.
మెహెర్ బాబా 1969 జనవరిలో పరమపదించాడు. ఆయన భౌతికసమాధి మహారాష్ట్రలోని అహమ్మద్‌నగర్ దగ్గర మెహరాబాద్‌లో ఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
Showing posts with label Avatar Meher. Show all posts
Showing posts with label Avatar Meher. Show all posts
Good Wishes on Avatar Meher Baba Birthday to All
⭐️🙏Jai Meher Baba
❤️ "Things that are Real are given and received in Silence... When from the depths of his heart man desires something more lasting than wealth, something more real than material power, the wave of destruction will recede.
Thence peace will come, joy will come, light will come."
Meher Baba ❤️
Prasad
25 Feb 2022
ఆంతరిక ప్రయాణం - ఎవరు తన లోపలికి తాను ప్రయాణము చేస్తారో అదే నిజమైన ప్రయాణం (Inner journey - The real journey is who travels inside himself)
🌹. ఆంతరిక ప్రయాణం - ఎవరు తన లోపలికి తాను ప్రయాణము చేస్తారో అదే నిజమైన ప్రయాణం. 🌹
✍️. అవతార్ మెహర్ బాబా
📚. ప్రసాద్ భరద్వాజ
మానవులు ప్రపంచంలో ఎంత దూరం అయినా, ఖండాలు అయినా, గ్రహాంతర యానం అయినా చెయ్యవచ్చు, కాని తన లోపలికి తాను ప్రయాణించడం వీలుపడదు :
సూక్ష్మ లోకము, మానసిక లోకములు ఆకాశములో లేవు. అది ఒక అంతరిక ప్రయాణము. అందుచేత మనము ఆకాశములో చేసే, కనుగొనే వాటికి ఏమీ ప్రాధాన్యత లేదు. విశిష్టత లేదు. ఆకాశం వట్టి శూన్యం. అనంతమైన ఈ బ్రహ్మాండమే ఒక మాయ. ఎవరు తన లోపలికి తాను ప్రయాణము చేస్తారో అదే నిజమైన ప్రయాణం. చైతన్యం పరిపక్వత చెందటం.
సూక్ష్మ లోకమును అధిగమించి మానసిక లోకములోనికి అనగా తనలోనికి మరింత లోతుకి ప్రయాణిస్తే, ఒక లోయకు ఎదురుగా నిలబడి ఉంటాడు. రెండు శిఖరముల మధ్య ఒక అగాధము దర్శిస్తాడు. భగవంతుని చూస్తాడు, కాని భగవంతునితో ఒక్కటి కాలేడు. అనంతమైన ఆకాంక్ష, ఎడబాటు ఉంటాయి. అది సత్యమునకు, మాయకు మధ్య ఉన్న అగాధము. ఇంకా తన లోనికి లోతుగా వెళ్ళాలి అని నిక్షయించుకుంటే భగవంతుడై పోతాడు. మాయ అదృశ్యం అవుతుంది. అప్పుడు ఇక విశ్వం లేదు, ప్రపంచములు లేవు, శరీరము లేదు, ఆకాశం లేదు అని తెలుసుకొంటాడు.
భగవంతుని శక్తి, జ్ఞాన, ఆనందములు అనుభవిస్తాడు. అదే కృష్ణ చైతన్య స్థితి. అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం అనుభవిస్తూ, ఈ మాయా జగత్తులో జీవించే ప్రతీ జీవి కోసము ఆ సచ్చిదానంద స్థితిని ఉపయోగిస్తాడు. మానవులకు భగవంతుని ప్రేమించడం చేతకాదని తెలిసి ఉన్నందున శ్రీకృష్ణుడు - నన్ను శరణు వేడండి, యోగిగా మారండి అన్నాడు. మెహెర్ బాబాగా వచ్చిన నేను నాకు విధేయులై, నా కొంగు మీరు గట్టిగా పట్టుకొని ఉండి, నన్ను ప్రేమిస్తూ ఉంటే, మీరు ఉన్నచోటనే ఉండి, మిమ్మల్ని మీ లోపలికి ప్రయాణింపజేసి మీ గమ్యస్థానం జేరుస్తాను అని వాగ్ధానం చేస్తున్నాను.
🌹 🌹 🌹 🌹 🌹
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అవతారమెహర్ #భక్తిసందేశాలు
24 Sep 2020
✍️. అవతార్ మెహర్ బాబా
📚. ప్రసాద్ భరద్వాజ
మానవులు ప్రపంచంలో ఎంత దూరం అయినా, ఖండాలు అయినా, గ్రహాంతర యానం అయినా చెయ్యవచ్చు, కాని తన లోపలికి తాను ప్రయాణించడం వీలుపడదు :
సూక్ష్మ లోకము, మానసిక లోకములు ఆకాశములో లేవు. అది ఒక అంతరిక ప్రయాణము. అందుచేత మనము ఆకాశములో చేసే, కనుగొనే వాటికి ఏమీ ప్రాధాన్యత లేదు. విశిష్టత లేదు. ఆకాశం వట్టి శూన్యం. అనంతమైన ఈ బ్రహ్మాండమే ఒక మాయ. ఎవరు తన లోపలికి తాను ప్రయాణము చేస్తారో అదే నిజమైన ప్రయాణం. చైతన్యం పరిపక్వత చెందటం.
సూక్ష్మ లోకమును అధిగమించి మానసిక లోకములోనికి అనగా తనలోనికి మరింత లోతుకి ప్రయాణిస్తే, ఒక లోయకు ఎదురుగా నిలబడి ఉంటాడు. రెండు శిఖరముల మధ్య ఒక అగాధము దర్శిస్తాడు. భగవంతుని చూస్తాడు, కాని భగవంతునితో ఒక్కటి కాలేడు. అనంతమైన ఆకాంక్ష, ఎడబాటు ఉంటాయి. అది సత్యమునకు, మాయకు మధ్య ఉన్న అగాధము. ఇంకా తన లోనికి లోతుగా వెళ్ళాలి అని నిక్షయించుకుంటే భగవంతుడై పోతాడు. మాయ అదృశ్యం అవుతుంది. అప్పుడు ఇక విశ్వం లేదు, ప్రపంచములు లేవు, శరీరము లేదు, ఆకాశం లేదు అని తెలుసుకొంటాడు.
భగవంతుని శక్తి, జ్ఞాన, ఆనందములు అనుభవిస్తాడు. అదే కృష్ణ చైతన్య స్థితి. అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం అనుభవిస్తూ, ఈ మాయా జగత్తులో జీవించే ప్రతీ జీవి కోసము ఆ సచ్చిదానంద స్థితిని ఉపయోగిస్తాడు. మానవులకు భగవంతుని ప్రేమించడం చేతకాదని తెలిసి ఉన్నందున శ్రీకృష్ణుడు - నన్ను శరణు వేడండి, యోగిగా మారండి అన్నాడు. మెహెర్ బాబాగా వచ్చిన నేను నాకు విధేయులై, నా కొంగు మీరు గట్టిగా పట్టుకొని ఉండి, నన్ను ప్రేమిస్తూ ఉంటే, మీరు ఉన్నచోటనే ఉండి, మిమ్మల్ని మీ లోపలికి ప్రయాణింపజేసి మీ గమ్యస్థానం జేరుస్తాను అని వాగ్ధానం చేస్తున్నాను.
🌹 🌹 🌹 🌹 🌹
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అవతారమెహర్ #భక్తిసందేశాలు
24 Sep 2020
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 28

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 28 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని మూడవ పాత్ర : సృష్టికర్త (త్రిమూర్తిత్వము) - 6 🌻
104. బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులు ప్రధాన దేవదూతలు.వీరు పరిమిత జీవితమును హెచ్చు ప్రమాణములో సృష్టించుట యందును, దానిని పోషించుటయందును, పోషించిన దానిని లయమొనర్చుటయందును గల భగవంతుని ప్రధాన దివ్య ధర్మములను వ్యక్తపరచుటలో ఈ ప్రధాన దేవదూతలు మధ్యవర్తులుగా నుందురు.
105. భగవంతుని అపరిమిత జ్ఞానమును పరిమిత ప్రమాణములో నివేదించుటలో కూడా మధ్యవర్తులుగానుందురు.
106.ప్రధాన దేవదూతలు సత్వములు. వారెల్లప్పుడు భోగములనుభవింతురే కాని బాధలను పొందరు.
107. అనంతమైన భగవల్లీల 'కారణము'గా దివ్య సుషుప్తి యైన మూల స్థితికి భంగము కలిగి, దాని ఫలితముగా సృష్టి కార్యరూపం దాల్చినది. ఇవియే కార్యకారణ ధర్మములు.
108. భగవంతునికి సృష్టి-స్థితి-లయము అనెడు ప్రధాన ధర్మములను ప్రసాదించుటలో భగవంతుని ఆది విలాసమే బాధ్యత కలదై యున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
29 Aug 2020
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 27

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 27 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని మూడవ పాత్ర :
సృష్టికర్త (త్రిమూర్తిత్వము) - 5 🌻
100.భగవంతుడు సృష్టికర్తగా అభావమునుండి ఆవిర్భవించిన సృష్టిని భగవత్సర్వముగా మిధ్యానుభూతి నొందుచున్నాడు.
101.పరాత్పరస్థితి యందున్న భగవంతుడు తనయొక్క,తనస్వీయ సత్యముయొక్క,అనంత సచ్చిదానంద స్థితియొక్క పూర్ణచైతన్యమును పొందుటకుగాను యీ మిధ్యానుభూతిలో చిక్కుకొనుట అవసరము.
102.సంస్కారముల ద్వారా సృష్టి చైతన్యము సేకరించబడినది.
103.సృష్టి -- స్థితి -- లయములు నిరంతరముగా ఏకరూపతగా జరుగుచునే యుండును.
ఉదాహరణము :--
మానవ శరీరమును భగవంతునిగా పోల్చుకొందము.
(a) కండ్లు మూసికొని నిద్రించుచున్న మానవుడు :-- పరమాత్మలో A స్థితి యనుకొనుడు
(b) కండ్లు తెరవగానే, ------- సృష్టి యనుకొనుడు.
(c) తెరిచినకండ్లతో అట్లే చూచుచుండుట --- స్థితి యనుకొనుడు.
(d) మరల కండ్లు మూసుకొనినచో--- లయము అనుకొనుడు.
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని మూడవ పాత్ర :
సృష్టికర్త (త్రిమూర్తిత్వము) - 5 🌻
100.భగవంతుడు సృష్టికర్తగా అభావమునుండి ఆవిర్భవించిన సృష్టిని భగవత్సర్వముగా మిధ్యానుభూతి నొందుచున్నాడు.
101.పరాత్పరస్థితి యందున్న భగవంతుడు తనయొక్క,తనస్వీయ సత్యముయొక్క,అనంత సచ్చిదానంద స్థితియొక్క పూర్ణచైతన్యమును పొందుటకుగాను యీ మిధ్యానుభూతిలో చిక్కుకొనుట అవసరము.
102.సంస్కారముల ద్వారా సృష్టి చైతన్యము సేకరించబడినది.
103.సృష్టి -- స్థితి -- లయములు నిరంతరముగా ఏకరూపతగా జరుగుచునే యుండును.
ఉదాహరణము :--
మానవ శరీరమును భగవంతునిగా పోల్చుకొందము.
(a) కండ్లు మూసికొని నిద్రించుచున్న మానవుడు :-- పరమాత్మలో A స్థితి యనుకొనుడు
(b) కండ్లు తెరవగానే, ------- సృష్టి యనుకొనుడు.
(c) తెరిచినకండ్లతో అట్లే చూచుచుండుట --- స్థితి యనుకొనుడు.
(d) మరల కండ్లు మూసుకొనినచో--- లయము అనుకొనుడు.
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 25

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 25 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని మూడవ పాత్ర :
సృష్టికర్త (త్రిమూర్తిత్వము) - 3 🌻
94. (a) కాబట్టి, తొలిసారిగా భగవంతుని అనంత చైతన్యరాహిత్య స్థితి (A). జీవితమును సృజించుటలో సృష్టికర్త ధర్మమును పొందెను.
(సృష్టించుతాయను భగవదంశయే బ్రహ్మ)
(b) సృష్టికర్త ధర్మమును చేపట్టగనే, ఆ సృష్టించిన జీవితమును పోషించుటలో (పరిరక్షించుటలో) స్థితికారుని
ధర్మమును పొందెను.
(పోషించుట యను భగవదంశయే విష్ణువు)
(c) సృష్టించిన జీవితమును పోషించుటలోనే తప్పనిసరిగా లయమును కూడా స్థాపించుచున్నాడు.
(నశింపచేయుటయను భగవదంశయే మహేశ్వరుడు).
95.భగవంతుని అనంత స్వభావత్రయమైన--అనంతశక్తి--ఙ్ఞాన -- ఆనందములచే, పరిమితమైయున్న అభావము వ్యక్తమైనప్పుడు సృష్టిరూపమున వ్యాపించెను.
ప్రశ్న --సృష్టి యేల నిజముకాదు?
96. ఆభావము నుండి పుట్టిన ఈ అనంతసృష్టి, భగవంతుని ప్రతి బింబము, భగవంతుడు అనంతుడు గనుక అతని ప్రతి బింబము సృష్టి కూడా అనంతమే, ఐనను ప్రతి బింబము నిజము కాదు. కాబట్టి సృష్టి కూడా నిజము కాదు. వట్టి భ్రమ.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
26.Aug.2020
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 24

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 24 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని మూడవ పాత్ర :
సృష్టికర్త (త్రిమూర్తిత్వము) - 2 🌻
90. సృష్టియొక్క పరిమిత సంస్కార అనుభవమే, భగవంతుని దివ్యస్వప్నముగా ఆరంభమాయెను.
91.ఆదిమూలమైన అనంతలీల "కారణము"గా, భగవంతునిలో పరమాణు ప్రమాణమైన చైతన్యము వ్యక్తమైనది. ఆ చైతన్యము, సృష్టి రూపమున అభివ్యక్తమైన అంతర్నిహిత అభావముయొక్క పరిమిత సంస్కారమును, అంతశ్చైతన్యము ద్వారా సగమెరుకలో భగవంతునిచే అనుభవింపచేసినది.
92.అభావము యొక్క ఆవిష్కారమే ఆభాసయైన సృష్టి.
93.పరమాత్మస్థితిలో అభావమై యున్నవన్నియు,అనంత ఆదిప్రేరణముచే ముందుకు సత్వరపరచగా (త్రోయగా) అవి, పరమాత్ముని(A) స్థితిలో నుండి సృష్టిరూపమున ఆవిష్కారమొందెను.
Notes :
అభాసము = లేక, ఉన్నట్లు కనిపించునది
(Nothingness or False everything)
అభావము = వుంది, లేనట్లు కనుపించునది (NOTHING)
సృష్టి = కల్పనా ; కల్పించినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
25.Aug.2020
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 23

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 23 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని మూడవ పాత్ర :
సృష్టికర్త (త్రిమూర్తిత్వము) - 1 🌻
87. భగవంతుని మూడవ స్థితిలో, భగవంతుడు సృష్టి - స్థితి - లయము, అనెడు ప్రధాన ధర్మములను నిర్వహించు త్రిమూర్తుల పాత్రలను వహించెను. అవి :
సృష్టికర్త : బ్రహ్మ, ఆఫిరీద్గార్, స్థితికి : విష్ణువు, పరవదిగార్, లయకారకుడు : శివుడు, ఫనాకార్.
88. భగవంతుని మూడవస్థితిలోనున్న ప్రధాన ధర్మములైన సృష్టి - స్థితి - లయములు భగవంతుని మొదటి స్థితియైన పరాత్పర స్థితిలో అంతర్నిహితములై యుండెను.
89. అభావము ముందుగా సృష్టి రూపములో అభివ్యక్తమైనప్పుడు, అభావముయొక్క ప్రథమస్వరూపము భగవంతునిలో చైతన్యపు తొలిజాడను కనుగొన్నది.
అటుపైని సృష్టియొక్క ప్రథమ సంస్కారము వ్యక్తమైనది. ఈ ప్రథమ సంస్కారమే చైతన్య పరిణామముతో పాటు సంస్కారములను ఉత్పత్తి చేసినది .
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
24.Aug.2020
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 22

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని రెండవ పాత్ర. - పరమాత్ముడు - 13 🌻
83. సర్వమ్(భగవంతుడు వున్నాడు అనుస్థితి)లో అంతర్నిహితమై యున్న ఆభావమునుండి, దివ్య అంతశ్చైతన్యము మాత్రమే ఓం బిందువు ద్వారా తప్పనిసరిగా బహిర్గతమైనది.
84. భగవంతుని దివ్యసుషుప్తినుండి భగవంతుని అంతఃచైతన్యము, సృష్టిబిందువు (ఓం) ద్వారా పైకిలేచునప్పుడు దివ్య సుషుప్తికి భంగము వాటిల్లు భగవంతుని మూలనాదమైన (బ్రహ్మనాదం) ఓంకార ధ్వనితోపాటు - దేశము (ప్రదేశము) కాలము, భౌతికవిశ్వము దానికి, సంబంధించిన వస్తుజాలము ( పరిమిత అహం, మనస్సు, ప్రాణము) వివిధములైన వ్యష్టి రూపములు బహిర్గతమగునట్లు చేసినది.
85. భగవంతుడు తన దివ్య సుషుప్తినుండి (పరాత్పర స్థితి) దివ్యజాగృతికి (అహం బ్రహ్మాస్మి స్థితి) మేల్కొనవలెనన్నచో తన దివ్యస్వప్నస్థితియైన మాయాసృష్టిని దాటి రావలయును.
86 . అభావముగా అంతర్నిహితమైయున్న సృష్టి, పరమాణు ప్రమాణమైన బిందువు ద్వారా, అభివ్యక్తమైనది. ఈ బిందువునే "ఓమ్" బిందువనియు, సృష్టి బిందువనియు అందురు. ఈ బిందువు కూడా పరాత్పరస్థితిలో అంతర్నిహితమై యున్నది
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
23.Aug.2020
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 21

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 21 🌻
77. పరమాత్ముడే అనంత సర్వం.
78. అనంత సర్వమ్, అనంత అపార సాగరము వంటిది, అయినప్పుడు... సాగరమందలి ప్రతి బిందువు అత్యంత పరిమిత సర్వమ్ అగుచున్నది.
79. సర్వమ్ అయిన భగవంతునిలో, ఈ భగవల్లీల చలించిన తక్షణమే 'ఓం'కార బిందువు అత్యంత, పరిమిత సర్వమ్ గా వ్యక్తమయ్యెను.
80. అనంత సర్వమ్ లో, అనంత ఆభావము అంతర్నిహితమయున్నది. అనంత అభావములో భగవల్లీల చలించగా ఓం కార బిందువు ద్వారా, ఆభావము సృష్టిరూపములో ఆవిర్భవించెను.
"ఓమ్"
(లేక)
సృష్టిబిందువు.
81. అనంత పరమాత్మలో, పరమాణు ప్రమాణంలో అంతర్నిహితమైయున్న ఆదిప్రేరణము యొక్క పరమాణు ప్రమాణమైన ఆవిష్కారబిందువే 'ఓం' బిందువు.
82. ఓం బిందువు ద్వారా అభివ్యక్తమైన పరమాత్మ యొక్క ప్రతిబింబము (సృష్టి) క్రమక్రమముగా కన్పించి, వ్యాపించుచు పెరిగిపోయెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
【 భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 20 】

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 20 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 20 🌻
73. పరాత్పర స్థితియొక్క అనంతత్వము, భగవంతుని పూర్తిగా సర్వస్వతంత్రుని చేసినది. అందుచేత సర్వస్వతంత్రుడైయున్న భగవంతుడు తన అనంత (లీల) విలాసమును సాధన పూర్వకముగా అనుభవించి ఆనందించుట సహజమే.
74. లీలను సాధన చేయుటయే స్వతంత్ర స్వభావమునకు చిహ్నము. ఎందుచేతననగా ఈ విలాసమే స్వతంత్ర స్వభావమునకు రంగును (సంస్కారమును) పూసినది.
75. సర్వమ్‌లో, అభావముగా అంతర్నిహితమైయున్నదంతయు,ఆవిర్భవించుటకుగల కారణమునకు ఆనంతమైన ఆదివిలాసమునదే బాధ్యత.
76. విలాసము అనగా విలాసమే గనుక, యీ భగవద్విలాసము యొక్క స్వభావమును బట్టి, అది ఎందుకు వచ్చినది ? ఎక్కడ వచ్చినది ? ఎప్పుడు వచ్చినది ? అని అనుకొనుటకు ఎక్కడను ఆస్కారము లేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 19

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 19 🌹
✍️. శ్రీ బాలగోపాల్
. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 19 🌻
69. ఈ ప్రతికూల అనుభవము, ఆనంతాత్మయొక్క శాశ్వత, అఖండ నిశ్చల ప్రశాంతతలో మార్పును కలిగించినది.
అప్పుడే ఆనంతాత్మయొక్క అఖండ నిశ్చలత్వములో ఒక పరమాద్భుతమైన వ్యాఘాతము(ఆదురు) సంభవించినది, ఆ తాకిడి ఎరుకలేకున్న పరమాత్మయొక్క చైతన్యరాహిత్య (A) స్థితిలో తొలి చైతన్యమును పుట్టించినవాడు.
70. చైతన్యము లేని ఆత్మకు ప్రథమ ప్రేరణయొక్క ప్రథమ సంస్కారమే ప్రథమ చైతన్యమును కలుగజేసినది.
71. అత్యంత పరిమితమైన ఆది విలాసము, భగవంతునిలో చలించి, చైతన్యమందు ఎరుకలేని భగవంతునికి పరమాణు ప్రమాణమైన తొలి ఎరుక ను కలుగజేసినది.
72. చైతన్యము, మానవునిచే సంస్కారములను అనుభవింప జేయును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
★彡 భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 18 彡★
🌹. ★彡 భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 18 彡★ 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 18 🌻
65. ఆదిప్రేరణముయొక్క ప్రతిధ్వనిఘోషలచే అప్పటికప్పుడు వైవిధ్యమనెడి బీజము నాటబడి అగోచర స్థితిలో అంకురించి ద్వైత రూపములో తొలిసారిగా వ్యక్తమయ్యెను
66. ఆదిప్రేరణలయొక్క ప్రతిధ్వని ఘోషలతోపాటు, పరమాణు ప్రమాణమైన స్థూలసంస్కారము ఆవిర్భవించి ఆత్మను, పరమాత్మను భిన్నమైన దానిగను ప్రత్యేకమైనదానిగను, పరమాణు ప్రమాణములో స్థూలమైనదిగను, అత్యంత పరిమితమైనదిగను చేసినది.
67. ఆది ప్రేరణముయొక్క, మిక్కిలి స్థూలమైన తొలి సంస్కారము కారణముననే,అనంత పరమాత్మ తొలిసారిగా అనుభవమును పొందెను.
68. ఆనంతాత్మయొక్క యీ తొలి అనుభవము, సంస్కారములు లేనట్టి, ఎరుకలేనట్టి అనంత పరమాత్మతోగల తాదాత్మ్యతలను ప్రతికూలముగా అనుభవమును పొందెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 17

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 17 🌻
59. "నేను ఎవడను?" అని భగవంతుడు పలికిని మూలశబ్దమునే సర్వకారణత్వము అందురు.
నేను ఎవడను? - కారణం
సృష్టి - కార్యము.
60.భగవంతుని ఆది విలాసమే ఆతని తొలిపలుకు.
61. "నేనేవడను ?" అన్నదే భగవంతుని తొలిపలుకు.
62. ఆది విలాసము అభావమును సృష్టించెను.
63. "నేను ఎవడను ?" అన్నదే - భగవంతుని ఆదిమూలమైన అంతర్నిహిత ప్రథమ సంస్కారము
64. ఆదిమూలమైన ప్రథమసంస్కారమే అంతర్నిహితమైయున్న ఈ మిథ్యాజగత్తును సృష్టించినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 1̼6̼

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 1̼6̼ 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 16 🌻
53.సంస్కారములు, చైతన్యములేని ఆత్మయొక్క అనంతమైన నిశ్చల ప్రశాంత స్థితిలో, తానెవరో తెలిసికొనవలె ననెడి ఆదిప్రేరణమ ప్రతిధ్వనించునట్లు ఘోషించెను.
54.ఈ ఆదిప్రేరణము పరమాత్మలోనే అంతర్నిహితమైయుండెను.
55.అనంతసాగరుడైన పరమాత్ముడు ప్రథమ ప్రేరణమును పొందెను.
56. ఈ ప్రథమ ప్రేరణము, అనంతము యొక్క ప్రేరణయే ఇది ప్రారంభములో పరమాణు ప్రమాణములో ఉండెను.
57. అనంతములో --- శాంతము, అనంతము రెండునూ ఇమిడియె ఉన్నవి.
భగవల్లీల (లేక) భగవద్విలాసము.
58. సర్వం(పరాత్పరస్థితి) లో అంతర్నిహితమైయున్న పరిమిత అభావము అనంతమైన సృష్టిగా అభివ్యక్తమగుటకు మూలకారణము 'సర్వకారణమత్వమే'
🌹 🌹 🌹 🌹 🌹
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 15

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 15 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 15 🌻
48. ఆత్మ,పరమాత్మలోనే ఉన్నది అనుట తొలిసత్యము. ఇంక, అసలు ఆత్మయే--పరమాత్మ అన్నది మలిసత్యము.
49. సాగరజలము నుండి ఒక బిందు లవలేశమును వెలికితీయక పూర్వము, అది సాగరములో కలిసియేయున్నది. బయటికి తీయబడినప్పుడే బిందు రూప మేర్పడుచున్నది.అనగా సాగరమే ఒక అనంతమైన నీటి బిందువు అని చెప్పవచ్చును.
50. వెలికి తీసిన బిందు లవలేశమును, అనంతసాగరముతో పోల్చినప్పుడు, బిందువునకు పరమాణు ప్రమాణముగల పరిమితి యేర్పడుచున్నది. బిందువు సాగరములో నున్నప్పుడు పరమాణు ప్రమాణమైన బిందువునకు కూడా అనంతత్వమే యేర్పడుచున్నది. కనుక
ఆత్మయే పరమాత్మ.
పరమాత్మయే ఆత్మ.
51.ఇప్పుడు మనము తనయందు స్పృహ లేని ఒక (అచేతనావస్థయందున్న) ఆత్మను గూర్చి యోచించుదుము.
52. ఆదిలో, ఆత్మకు సంస్కారములు లేవు.చైతన్యము లేదు.
🌹 🌹 🌹 🌹 🌹
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 14

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 14 🌻
44. ఆత్మలన్నియు ఒకటే.అన్ని ఆత్మలు ఒకటే.
45. ఆత్మలన్నియు అనంతమైనవి, శాశ్వతమైనవి, అవికారమైనవి.
46. పరమాత్మను హద్దులే లేనట్టి ఒక అనంతమైన మహా సాగరముతో పోల్చుకొనినచో, ఆత్మను ఒక బిందు లవలేశముతో పోల్చవచ్చును.
47. హద్దులు లేని అనంత పరమాత్మ అనెడు మహాసాగరము నుండి, బిందు ప్రమాణమైన ఆత్మ; సరిహద్దులే లేని పరమాత్మ సాగరమునుండి ఎట్లు బయట పడగలదు? ఎట్లు వేరు కాగలదు? బయట పడలేదు. వేరు కాలేదు కనుక.
🌹 🌹 🌹 🌹 🌹
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 13

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 13 🌻
39. పరమాత్మ యొక్క (B) స్థితిలో అనంత చైతన్యము, పరాత్పర స్థితిలోను పరమాత్మ స్థితిలోనుకూడా అనంతముగా ఎఱుకతో శాశ్వతముగా నిలిచియున్నది.
40. A = భగవంతుడు తన స్వీయ అనంత స్వభావత్రయమైన అనంత జ్ఞాన-శక్తి-ఆనందములను ఎరుకతో అనుభవించుటయు లేదు, పరులకై వినియోగించుటయు లేదు.
41. A == భగవంతునికి అనంతముగా ఎరుకలేని స్థితి.ఇది నిర్గుణ నిరాకారమును కాదు,సగుణ సాకారమును కాదు.ఇందు సృష్టియు, చైతన్యమును అంతర్నిహితములై యున్నవి.
42. ఆత్మ స్వీయ చైతన్యమును సంపాదించుటకు గాను,
1.పరిణామ క్రమము
2. పునరావృత్తి క్రమము
3. ఆధ్యాత్మిక మార్గము
అనునవి ఆవశ్యకమై యున్నవి.
43.ఆత్మలన్నియు ఆ పరమాత్మలో ఉండెను,
ఆత్మలన్నియు ఆ పరమాత్మలో ఉన్నవి,
ఆత్మలన్నియు ఆ పరమాత్మలో ఉండును.
🌹 🌹 🌹 🌹 🌹
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 12

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 12 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 12 🌻
36.భగవంతుడు తన స్వీయ అనంతచైతన్య రాహిత్య స్థితియును, అనంతచైతన్యస్థితియును; తన రెండవ స్థితి ద్వారా మొదటి స్థితి లో యాదృచ్ఛికముగా పొందెను.
ఉపమానము :---
ఒక స్త్రీ తనకు గర్భధారణమైనదని భావించినప్పటినుండియు, తల్లి గర్భములో శిశువు పెరుగనారంభించును.
కాలక్రమములో శిశువుయొక్క అవయవములన్నియు పెరుగుచుండును. అన్నింటితోపాటు 'నేత్రములు' కూడా పూర్తిగా తయారై వాటికి చూచెడి శక్యత ఏర్పడును.
శిశువు ఉదయించిన తరువాత కండ్లు తెరచినచో చూడగల్గును. కండ్లు మూసినచో చూడలేక పోవును.
అట్లే, ఏకకాలమందే అనంత చైతన్యమందు ఎఱుక లేనిస్థితి, ఎఱుకయున్న స్థితి ఒకేసారి యాదృచ్ఛికముగా పరమాత్మస్థితి లో వ్యక్తమయ్యెను.
37. భగవంతుని రెండవ స్థితియైన పరమాత్మలో ABC అను మూడు అంతర స్థితులున్నవి.
38. పరమాత్మ యొక్క (A) స్థితిలో అనంత చైతన్య రాహిత్య స్థితి, పరాత్పరస్థితిలోను పరమాత్మస్థితిలోనూ కూడా ఆనందంగా ఎరుక లేకనే శాశ్వతంగా నిలిచియున్నది.
భగవంతుడు = అనంత అస్థిత్వము + అనంత జ్ఞానము+అనంత ఆనందము౼అనంత చైతన్యము
= సత్ + చిత్ + ఆనంద (మైనస్) ఆజ్ఞాత చైతన్యము.
= సచ్చిదానందము (మైనస్) అజ్ఞాత చైతన్యము.
🌹 🌹 🌹 🌹 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 12 🌻
36.భగవంతుడు తన స్వీయ అనంతచైతన్య రాహిత్య స్థితియును, అనంతచైతన్యస్థితియును; తన రెండవ స్థితి ద్వారా మొదటి స్థితి లో యాదృచ్ఛికముగా పొందెను.
ఉపమానము :---
ఒక స్త్రీ తనకు గర్భధారణమైనదని భావించినప్పటినుండియు, తల్లి గర్భములో శిశువు పెరుగనారంభించును.
కాలక్రమములో శిశువుయొక్క అవయవములన్నియు పెరుగుచుండును. అన్నింటితోపాటు 'నేత్రములు' కూడా పూర్తిగా తయారై వాటికి చూచెడి శక్యత ఏర్పడును.
శిశువు ఉదయించిన తరువాత కండ్లు తెరచినచో చూడగల్గును. కండ్లు మూసినచో చూడలేక పోవును.
అట్లే, ఏకకాలమందే అనంత చైతన్యమందు ఎఱుక లేనిస్థితి, ఎఱుకయున్న స్థితి ఒకేసారి యాదృచ్ఛికముగా పరమాత్మస్థితి లో వ్యక్తమయ్యెను.
37. భగవంతుని రెండవ స్థితియైన పరమాత్మలో ABC అను మూడు అంతర స్థితులున్నవి.
38. పరమాత్మ యొక్క (A) స్థితిలో అనంత చైతన్య రాహిత్య స్థితి, పరాత్పరస్థితిలోను పరమాత్మస్థితిలోనూ కూడా ఆనందంగా ఎరుక లేకనే శాశ్వతంగా నిలిచియున్నది.
భగవంతుడు = అనంత అస్థిత్వము + అనంత జ్ఞానము+అనంత ఆనందము౼అనంత చైతన్యము
= సత్ + చిత్ + ఆనంద (మైనస్) ఆజ్ఞాత చైతన్యము.
= సచ్చిదానందము (మైనస్) అజ్ఞాత చైతన్యము.
🌹 🌹 🌹 🌹 🌹
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 11

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 11 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 11 🌻
31.పరాత్పరునియొక్క అనంతవ్యక్తస్థితియే పరమాత్మ స్థితి.
32.భగవంతుని మొదటి స్థితియైన పరాత్పరస్థితి లో అంతర్నిహితమైయున్న అనంత 'ఆదిప్రేరణము'తనను తాను తెలిసికొనుటకు"నేను ఎవడును?"అని పరమాత్మ స్థితి లో తరంగములవలె చెల్లించెను.
33.పరాత్పరస్థితిలో అంతర్నిహితమై యున్నదంతయు పరమాత్మ స్థితిలోనే వ్యక్తమగుటకు ఆస్కారము కలిగినది.
34."నేను ఎవడను?"అను ఆదిప్రేరణము పరాత్పరస్థితిలో ఎన్నడు అనుభవము కాలేదు. పరమాత్మస్థితిలోనే "నేను భగవంతుడను"అని అనుభవమును పొందెను.
35. "నేను ఎవడను " అనెడి ఆదిప్రేరణము తరంగచలితమైన తక్షణమే, ఓకేసారి అంతర్నిహితమైయున్న అనంత చైతన్య స్థితియు, అనంత చైతన్య రాహిత్య స్థితియు, పరమాత్మా స్థితిలో అభివ్యక్తమయ్యెను.
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Posts (Atom)
