భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 15
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 15 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 15 🌻
48. ఆత్మ,పరమాత్మలోనే ఉన్నది అనుట తొలిసత్యము. ఇంక, అసలు ఆత్మయే--పరమాత్మ అన్నది మలిసత్యము.
49. సాగరజలము నుండి ఒక బిందు లవలేశమును వెలికితీయక పూర్వము, అది సాగరములో కలిసియేయున్నది. బయటికి తీయబడినప్పుడే బిందు రూప మేర్పడుచున్నది.అనగా సాగరమే ఒక అనంతమైన నీటి బిందువు అని చెప్పవచ్చును.
50. వెలికి తీసిన బిందు లవలేశమును, అనంతసాగరముతో పోల్చినప్పుడు, బిందువునకు పరమాణు ప్రమాణముగల పరిమితి యేర్పడుచున్నది. బిందువు సాగరములో నున్నప్పుడు పరమాణు ప్రమాణమైన బిందువునకు కూడా అనంతత్వమే యేర్పడుచున్నది. కనుక
ఆత్మయే పరమాత్మ.
పరమాత్మయే ఆత్మ.
51.ఇప్పుడు మనము తనయందు స్పృహ లేని ఒక (అచేతనావస్థయందున్న) ఆత్మను గూర్చి యోచించుదుము.
52. ఆదిలో, ఆత్మకు సంస్కారములు లేవు.చైతన్యము లేదు.
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment