2) 🌹 Sripada Srivallabha Charithamrutham - 248 🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 128🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 150 🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 64 / Sri Lalita Sahasranamavali - Meaning - 64 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 67 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 36🌹
8) 🌹. శివగీత - 33 / The Shiva-Gita - 33🌹
9) 🌹. సౌందర్య లహరి - 75 / Soundarya Lahari - 75 🌹
10) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 15 🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 374 / Bhagavad-Gita - 374🌹
12) 🌹. శివ మహా పురాణము - 199🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 75 🌹
14) 🌹.శ్రీ మదగ్ని మహాపురాణము - 70 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 86 🌹
16) 🌹 Twelve Stanzas From The Book Of Dzyan - 17 🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 35🌹
18) 🌹. అద్భుత సృష్టి - 7 🌹
19) 🌹 Seeds Of Consciousness - 151🌹
20) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 29🌹
21) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 6 📚
22)
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 460 / Bhagavad-Gita - 460 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -18, 19 🌴*
18. సమ: శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయో: |
శీతోష్ణసుఖదు:ఖేషు సమ: సఙ్గవివర్జిత: ||
19. తుల్యనిన్దాస్తుతిర్మౌనీ సన్తుష్టో యేన కేనచిత్ |
అనికేత: స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నర: ||
🌷. తాత్పర్యం :
శత్రుమిత్రుల యెడ సమభావము కలిగినవాడును, మానావమానములందు, శీతోష్ణములందు, సుఖదుఃఖములందు, నిందాస్తుతులందు సమబుద్ధి కలిగినవాడును, అసత్సంగము నుండి సదా విడివడియుండువాడును, సదా మౌనియైనవాడును, దేనిచేతనైనను సంతుష్టి నొందెడివాడును, నివాసమేదైనను లెక్క చేయనివాడును, జ్ఞానమునందు స్థితుడైనవాడును, నా భక్తియుతసేవ యందు నియుక్తుడైనట్టివాడును అగు మనుజుడు నాకు అత్యంత ప్రియుడు.
🌷. భాష్యము :
భక్తుడు సమస్త దుష్టసంగము నుండి సదా దూరుడై యుండును. ఒకప్పుడు పొగడుట, మరియొకప్పుడు నిందించుట యనునది మానవసంఘపు నైజము. కాని భక్తుడు అట్టి కృత్రిమములైన మానావమానములకు, సుఖదుఃఖములకు సదా అతీతుడై యుండును. అతడు గొప్ప సహనవంతుడై యుండును.
“హరావభక్తస్య కుతో మహద్గుణ: - అనగా భక్తుడు కానివానికి శుభలక్షణములుండజాలవు.” కనుక భక్తునిగా గుర్తింపబడగోరువాడు శుభలక్షణములను వృద్ధిపరచుకొనవలెను. కాని వాస్తవమునకు ఈ గుణములను పొందుటకు భక్తుడు బాహ్యముగా యత్నింపనవసరము లేదు.
కృష్ణభక్తిభావన యందు మరియు భక్తియుతసేవ యందు నిమగ్నత ఆ గుణములను వృద్ధిచేసికొనుటకు అప్రయత్నముగా అతనికి సహాయభూతమగును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 460 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 12 - Devotional Service - 18, 19 🌴*
18. samaḥ śatrau ca mitre ca
tathā mānāpamānayoḥ
śītoṣṇa-sukha-duḥkheṣu
samaḥ saṅga-vivarjitaḥ
19. tulya-nindā-stutir maunī
santuṣṭo yena kenacit
aniketaḥ sthira-matir
bhaktimān me priyo naraḥ
🌷 Translation :
One who is equal to friends and enemies, who is equipoised in honor and dishonor, heat and cold, happiness and distress, fame and infamy, who is always free from contaminating association, always silent and satisfied with anything, who doesn’t care for any residence, who is fixed in knowledge and who is engaged in devotional service – such a person is very dear to Me.
🌹 Purport :
A devotee is always free from all bad association. Sometimes one is praised and sometimes one is defamed; that is the nature of human society.
But a devotee is always transcendental to artificial fame and infamy, distress or happiness. He is very patient. He does not speak of anything but the topics about Kṛṣṇa; therefore he is called silent.
Silent does not mean that one should not speak; silent means that one should not speak nonsense. One should speak only of essentials, and the most essential speech for the devotee is to speak for the sake of the Supreme Lord.
A devotee is happy in all conditions; sometimes he may get very palatable foodstuffs, sometimes not, but he is satisfied. Nor does he care for any residential facility.
He may sometimes live underneath a tree, and he may sometimes live in a very palatial building; he is attracted to neither. He is called fixed because he is fixed in his determination and knowledge.
We may find some repetition in the descriptions of the qualifications of a devotee, but this is just to emphasize the fact that a devotee must acquire all these qualifications. Without good qualifications, one cannot be a pure devotee.
Harāv abhaktasya kuto mahad-guṇāḥ: one who is not a devotee has no good qualification. One who wants to be recognized as a devotee should develop the good qualifications.
Of course he does not extraneously endeavor to acquire these qualifications, but engagement in Kṛṣṇa consciousness and devotional service automatically helps him develop them.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Sripada Srivallabha Charithamrutham - 248 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
Chapter 28
*🌻 Sripada Himself is Sri Venkateswara - 3 🌻*
But in Kali Yugam, a Gandharva who got an ‘amsa’ from Ravana asked for ‘Vasavee’. You know that it was Vishnu Vardhana Maharaj.
You also know that Vasavee entered Agni with 102 couples belonging to 102 gothras. Sri Bhaskaracharya raised ‘Goura balikas’ (girls) and ‘Balanagaras’. Sri Vasavee Kanyaka is also a ‘Goura balalika’. It is wise to treat Nagareswara as Bala nagara and perform the marriage.
Even then, there is a hitch. You have to solve it. After hearing your opinions, we will decide about the engagement. Sri Nagareswar has no father or mother or gothram. He is a Swayambhu (self manifested).
But our ‘Kanyaka’ wants Him as husband by mind, word and action. Sri Nagareswar also is eager to marry our Kanyaka. While performing ‘Kanya dana’, we should thoroughly think about the bridegroom’s caste and gothram, and other important things.
According to our tradition, Menarikam (marrying cousin) is in order. I will abide by your decision. Everyone was stunned hearing the words of Srinivasa, who was the ‘pivot’ of this world drama.
Goura balika should be given to Balanagara only in marriage. They wondered whether they should give her to Shankar Bhagawan, having no caste and gothram, or not? Kanyaka also wants to marry Sri Nagareswar.
They thought that they should ask for the help of the most learned Sri Ganapathy to get over this difficult situation. They understood that Ganapathi Deva’s blessings and grace were important for any thing to be done. When they prayed, Ganapathi Deva manifested.
Everybody prostrated to Him. Ganapathi said ‘Srinivasa! This Vasavee is My mother Parvathi Devi only. So, there is nothing wrong in giving Her to Nagareswar in marriage.’
Then Srinivasa said, “My Dear! Ganesha! You are a boy. You can understand dharma and subtle dharma clearly.
You are ‘Ganaadhyaksha’. You are the supreme among the three crore Gods, and you are the head of ‘pravrithi’ and ‘nivrithi’ ganas.
So, without your order, no marriage is treated as accepted by dharma. At the time of marriage of Parvathi, you were not born. In that case ‘Parvathi kalyanam also was not accepted by dharma.”
The vysya elders were stunned. Leave alone ‘Vasavee kalyanam’, now Srinivas prabhu says Parvathi kalyanam also was not acceptable. They could not say anything.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 128 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : పద్మావతి దేవి
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. ధ్యానము - విశిష్టత 🌻*
భాగవత మార్గమందలి సాధకులు సృష్టియందు నారాయణుని చరణకమలముల జాడలు గమనించుచు ధ్యానింతురు. ఇచట ధ్యానమప్రయత్నము.
ఇతర సాధన మార్గములలో కన్నులు మూసికొని , ముక్కులు మూసికొని హృదయ పద్మమున నున్న పరబ్రహ్మమును ధ్యానించుట యుండును.
దానివలన నిష్ఠ కుదిరినపుడు కొన్ని క్షణములాత్మానందము వేయి మెఱపులు మెఱసినట్లు తళుక్కుమనును. అది ఎంత గొప్పదైనను ఇంద్రియ సుఖాదుల వలె క్షణికము.
అట్లు గాక సృష్టిని నారాయణుని అడుగుజాడలుగ స్మరించువారికి అదే పరబ్రహ్మము కనుమూసినను, కనుతెరచినను తానే అయి నిత్యముగ భాసించును.
"అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః", అని వేదమంత్రములు భాగవత మార్గమును గూర్చి అభయముద్ర పట్టియున్నవి.
ఇట్లు ఇంద్రియములను , మనస్సును సొంతముగా దమించుకొని హృదయమున పరబ్రహ్మము దుకాణము పెట్టుకొనువారి మార్గము కన్న అట్లు సాధన చేయునట్టి తన్నే అంతర్యామికి సమర్పణ చేసి శరణాగతి చెందు మార్గము శాశ్వతానందమిచ్చును.
✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 The Masters of Wisdom - The Journey Inside - 148 🌹*
*🌴 The Wisdom of Waiting - 1 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj
*🌻 Patience - 1 🌻*
All spiritual exercises appear at first to be very simple and little once you have started with them. But if we try to adapt ourselves to them and to carry them out, gradually more and more is given. There will never be an end.
The program will keep on increasing until our personality forgets that there is an increasing program and the personality is finally transformed. This gradual transformation into the light needs very much time and patience.
Everything we pick up as an exercise we should do slowly and step-by-step, we should work with it continuously and steadily. There is no hast on the path, enlightenment does not happen within the next 5 minutes.
Progress seems to happen at a snail’s pace. Those who are a bit ahead of others have to serve those who are behind them and who proceed very slowly.
It is just like with the journey of the turtle and the rabbit: The rabbit is very fast and learns to be slower for the benefit of the turtle.
The slow turtle is made to walk a bit faster. The Plan includes all, and it intends to lift up the whole of humanity.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 64 / Sri Lalita Sahasranamavali - Meaning - 64 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. శ్లోకం 121
601. దరాందోళితదీర్ఘాక్షీ -
కొంచెముగా చలించు ఆకర్ణాంత విశాలమైన కన్నులు గలది.
602. దరహాసోజ్జ్వలన్ముఖీ -
మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది.
603. గురుమూర్తిః -
గురువు యొక్క రూపముగా నున్నది.
604. గుణనిధిః -
గుణములకు గని వంటిది.
605. గోమాతా -
గోవులకు తల్లి వంటిది.
606. గుహజన్మభూః -
కుమారస్వామి పుట్టుటకు తల్లి అయినది.
శ్లోకం 122
607. దేవేశీ -
దేవతలకు పాలకురాలు.
608. దండనీతిస్థా -
దండనీతి శాస్త్రము లోని విషయములుగా ఉండునది.
609. దహరాకాశరూపిణి -
హృదయములో ఉండు చోటు రూపముగ ఉండునది.
610. ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి మండల పూజితా -
పాడ్యమి నుండి ముఖ్యమైన పౌర్ణమి వరకు ఉండు తిథివర్గముచే పూజింపబడునది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 64 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 Sahasra Namavali - 64 🌻*
601 ) Dharandholitha deergakshi -
She who has long eyes which have slight movement
602 ) Dharahasojwalanmukhi -
She who has face that glitters with her smile
603 ) Guru moorthi -
She who is the teacher
604 ) Guna nidhi -
She who is the treasure house of good qualities
605 ) Gomatha -
She who is the mother cow
606 ) Guhajanma bhoo -
She who is the birth place of Lord Subrahmanya
607 ) Deveshi -
She who is the goddess of Gods
608 ) Dhanda neethistha -
She who judges and punishes
609 ) Dhaharakasa roopini -
She who is of the form of wide sky
610 ) Prathi panmukhya rakantha thidhi mandala poojitha -
She who is being worshipped on all the fifteen days from full moon to new moon
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నారద భక్తి సూత్రాలు - 67 🌹*
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ
తృతీయాధ్యాయము - సూత్రము - 38
*🌻 38. ముఖ్య తస్తు మహత్కృపయైవ భగవత్కృపా లేశాత్ వా ॥ - 2 🌻*
మహాత్ములు, లేక గురువులు, లేక భాగవతోత్తముల లక్షణాన్ని ఇలా తెలియచేస్తున్నారు.
సిద్ధం సత్సంప్రదాయె స్థిర ధియ మనఘం
శోత్రియం బ్రహ్మనిష్టం ! సత్వస్థం
సత్యవాచం సమయ నియతాయ
సాధువృత్యా సమేతమ్ । దంభాసూయాది ముక్తం
జిత విషయగణం దిర్ణబంధుం దయాళుం న్థాలిత్య శాసితారం
స్వపరహిత పరం దేశికం భూష్టు రీప్పేత్ |
అజ్ఞాన ధ్వాంతరోదాదఘ పరిహరణా
దాత్మ సామ్యవహత్వాత్ । జన్మ ప్రధ్వంసి
జన్మ ప్రదగిరి మతయా దివ్య దృష్టి
ప్రభావాత్ | నిష్ప్రత్యూహా నృశంస్యా
దనియతర సతయా నిత్య శేషిత్వ
యోగాదాచార్యః సద్భిర ప్రత్యుపకరణ
ధియా దేవవత్ న్వాదువాస్యః
-వేదాంత దేశికులు
తా : (1) ఎవరు సకల భూతాలను ఆత్మ సమంగా చూస్తారో
(2) ఆ భూతాల వలన తమకు బాధ వాటిల్లినా ద్వేషింపక వాటి పట్ల మైత్రినే నెరపుతారో
(3) ఎవరు సకల భూతాలకు అభయ ప్రదానం ఇసారో
(4) ఎవరికి దెహాభిమానం సైతం జనించదో
(5) ఎవరు తమకు ఇంత (దివ్య) ప్రభావం ఉందని అహంకరించరో
(6) ఎవరు సుఖ దుఃఖాలను సమంగా భావిసారో
(7) తిట్టనా కొట్టినా ఎవరు వికారం చెందరో
(8) ఎవరు తమ శరిర పోషణార్ధమై ఆహారాదులు లఖంచినప్పుడు ఎలాగో లభించనప్పుడు కూడా అలాగే సంతుష్టులై ఉంటారో
(9) ఎవరు సమాహిత చిత్తులై శరిరెంద్రియాలను తమ వశంలో ఉంచుకుంటారో
(10) ఎవరు కర్తృ భోక్త్షృ భావాలకు దూరమై తాము సత్‌చిదానంద అద్వితీయ బ్రహ్మమనే దృఢాభివప్రాయం కలిగి, కుతర్కాలకు, వితండ వాదనలకు చలించరో
(11) ఎవరు తమ అంతఃకరణాన్ని శుద్ధ నిర్దుణ బ్రహ్మానికి సమర్చించినట్టి జీవనం కలిగి ఇచ్చా నిర్ణయాలు లేక ఉంటారో
(12) ఎవరు శుద్ధ అక్షర బ్రహ్మావెత్తలవుతారో
(13) ఎవరి వలన లోకానికి కించిత్తు భయం కలుగదో
(14) ఎవరు అద్వైత ధర్ములై పరమ కారుణ్యమూర్తులై, క్షమాశీలురై ఉండటంచేత లోకులు కల్పించే బాధలకు చలించరో
(15) ఎవరికి క్రియా లాభాలకు ఉప్పొంగడం, పరోత్కర్షకు ఓర్వలేకుండటం, క్రూర జంతువుల జూచి భయపడటం ఉండదో సర్వ పరిగ్రహ శూన్యంగా, ఎకాకిగా విజన ప్రదేశంలో ఉండుటకు ఎవరు వ్యాకులపడరో, ఎవరు భోగాలను ఆకాంక్షించరో, ఒక వేళ భోగాలు యాదృచ్చికంగా కలిగినా అపేక్షించరో
(16) బాహ్వాభ్యంతర శౌచవంతులై కర్తవ్యాలను ఎరిగి నిర్వహించే సామర్థ్యం కలిగి పక్షవాత బుద్ధి లేకుండా ఎంత వ్యధనైనా ఎవరు ఓర్చుకుంటారో
(17) ఐహిక ఆముష్మిక ఫలకాంక్ష లేక, శుభాశుభాల రెంటిని పరిత్యజించి సర్వద్వంద్వ సహిష్షువులై మౌనవ్రతం పాటించి నియతి, నివాసం లేక పరమాత్మకు భక్తులై ఉంటారో వారు మహాత్ములనబడతారు.
= భగవద్గీత, భాగవతం, వివేక చూడామణి
ఇట్టి వారిని ఆశ్రయించి భగవత్కపను పొందాలి. ఒక్కరా, పలువురా అనె సందేహం అవసరం లెదు.
పై గుణాలను మాత్రం ఎవరివద్ద ఉంటే వారినుండి గ్రహించి పరిపూర్ణతను పొందడం ప్రధానం. ఏక గురుత్వమున్నను, ఇతరుల వద్దనుండి జ్ఞాన సముపార్జనను నిరాకరించడం మూర్ఖత్వమే అవుతుంది. గురుజన
నిరాదరణ భగవన్నిరాదరణే అవుతుంది.
నైకస్మాత్ గురోర్ జ్ఞానం సుస్థిరం న్యాత్ పుష్క్మలమ్ ॥
-భాగవతం, ఏకాదశ స్కంధం
బోధను వినగానే అనుష్టించరాదు. శాస్త్ర సమ్మతమైనదో, కాదో తెలుసుకోవాలి. ఆచార్య సంప్రదాయమో, కాదో విచారించాలి అని యోగ కుండల్యుపనిషత్
తెలియచేస్తున్నది.
కుల, గోత్ర, జాతి, లింగ, వయో భేదాలను పాటించక బ్రహ్మనిష్టను, పరమాత్నానుభూతిని పరిగణించి ఆశ్రయించి సద్గతి పొందాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 36 🌹*
✍️ Sri GS Swami ji Datta Vaakya
📚. Prasad Bharadwaj
*🌻 Visualisation of Guru swaroopa remove all obstacles and hurdles of life. 🌻*
Verse: Apadamauliparyantam …
Beginning with the feet all the way up to the head, the form of Guru should be visualized. By doing so, all obstacles and hurdles in the path will be removed, and de sires will be fulfilled. Your glance must first fall on Guru’s feet.
Guru’s first glance must fall on the disciple’s head. Spiritual knowledge will first be transmitted into the head. The reason for offering obeisance by bowing down the head is that.
It is not necessary to remain with a lowered head. Once Guru’s glance falls on the head, it is sufficient.
Step by step, the glance of the disciple should rise from the feet, to the stomach, chest, hands, neck, and head, taking in every detail, of his footwear, clothing, garlands, and ornaments worn.
After this visualization, after seeing the feet first, the head should be raised to look at Guru’s face. This is the proper procedure for contemplation. Hereafter follow this gradual sequence of careful observation. Learn this method.
Every time you see Swamiji, his footwear must be noticed. Each type of footwear carries a unique significance. Suddenly he will appear wearing some different type of footwear. It is not because he is afraid of thorns pricking his feet.
There is a special reason for his selection of wooden padukas, rubber slippers, or even going barefoot. On one occasion he wears red clothes, and on another occasion he wears ritual clothing meant for performing austerities.
One day he just wraps himself i n a lightweight towel and has only a Tshirt on. One day he wraps a saree and is decked in all types of ornaments and decorations.
All these must be carefully observed. For the mind to get a firm impression of his form, it is asked that Guru should be medi tated upon with all such various minute details.
What type of footwear is worn conveys a particular message and hence, this detail must be noticed.
What he will wear on which day of the week, or for which specific occasion is unpredictable. By each of thes e symbols he wears, it is as if he is conveying to us an unmistakable command.
Which deity he has invoked into himself on a certain day and which deity on that day is permeating the earth with a special influence, is indicated by what Guru wears.
It also shows what exact benefit he is intending for us by wearing certain special outfits.
To know what mantra he is chanting continuously, it is important for us to contemplate upon his form very carefully with clear scrutiny. His selection of clothes, footwear, and ornaments is never random.
They are not things that he has grabbed in a hurry and has put on himself. Sometimes, when a pair of sandals is offered to him, he rejects it and requests for a different pair.
He says, I will not wear this. I will wear that. It has a special meaning. Some people visualize Guru by starting from the head and step by step going down towards the feet. This is very special.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివగీత - 33 / The Siva-Gita - 33 🌹*
*🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ
పంచామాధ్యాయము
*🌻. రాముని యస్త్ర ప్రాప్తి - 3 🌻*
అన్య దైత త్ప్రయుక్తం చే -జ్జగత్సం క్షయ కృద్భ వేత్,
అధా హూయ సుర శ్రేష్టా - న్లోక పాలా న్మహేశ్వరః 17
ఉవాచ పరమప్రీతః - స్వం స్వ మస్త్రం ప్రయచ్చత,
రాఘవో యంచ తైరస్త్రై: -రావణం నిహ నిష్యతి .18
తస్మై దేవై రవ ధ్యస్త్వ - మితి దత్తో వరో మయా,
తస్మా ద్వానర తామేత్య - భవంతో యుద్ద దుర్మదా: 19
తదుపరి దేవతలను, దిక్పాలురును రప్పించి మిగుల యానందము తోడ ఓయీ ! దేవతలారా ! మీమీ యాయుధంభులను ఒసగుడు.
శ్రీరాముడా యా అస్త్రముల శక్తి చేత రావణాసురుని వధించును, ఎ కారణము చేతనైతే దేవతల చేత వధింప బడని వరము నొసగితివో నా కారణము వలన మీరంద రిప్పుడు వన చరులై పరాక్రమించి ఈ శ్రీరామునికి చేయూత నివ్వండి. పిదప స్వస్తులు కాగలరు అని శివుడు యాజ్ఞాపించెను.
సాహాయ్య మస్య కర్వన్తు- తేన సుస్థా భవిష్యద,
తదాజ్ఞాం శిరసా గృహ్య - సురాః ప్రాం జలయ స్తదా. 20
ప్రణమ్య చరణౌ శంభో - స్స్వం స్వమస్త్రం దదుర్మదా,
నారాయాణాస్త్ర దైత్యారి - రైంద్ర మస్త్రం పురందరః 21
బ్రహ్మాపి బ్రహ్మ దండాస్త్ర - మాగ్నేయాస్త్రం ధనంజయః,
యామ్యం యమోపి మొహాస్త్రం - రక్షో రాజస్త ధాదదౌ .22
వరుణో వారుణం ప్రాదా - ద్వయ వ్యాస్త్రం ప్రభంజనః,
కౌబేరం చ కుబేరోపి - రౌద్ర మీశా న ఏవచ 23
సౌర మస్త్రం దదౌ సూర - స్సౌమ్యం సోమశ్చ పావకమ్,
విశ్వదేవా దదు స్తస్మై - వసనో వాసవాభిధమ్ 24
ఆ పరమ శివుని యాజ్నాను దల దాల్చి కరములు జోడించి
దేవతలు తమ తమ ఆయుధముల ప్రసాదించిరి. వానిలో గోవిందుడు నారాయణాస్త్రమును, దేవేంద్రుడు ఆగ్నేయాస్త్రమును, యమ ధర్మరాజు యామ్యాస్త్రమును, నైఋతి మోహాస్త్రమును, వరుణుడు వారుణాస్త్రమును, వాయువు వాయువ్యాస్త్రమును, కుబేరుడు కౌబేరాస్త్రమును, శివుడు రౌద్రాస్త్రమును, సూర్యుడు సౌరాస్త్రమును, విశ్వదేవులు పావకాస్త్రమును, వసువులు వాసవాస్త్రమును ఇచ్చిరి.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 The Siva-Gita - 33 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 05 :
*🌻 Ramaya Varapradanam - 3 🌻
After that Lord Shiva drawing the attention of all Gods and Dikpalakas and addressing them said: O Gods!
Give your respective personal weapons to Rama. He would use them to slay Ravana. For whatever
reason I had given the boon to Ravana of being undefeatable by the Gods, for the same reason I had
asked you all to take birth from your portions as forest dwelling vanaras (monkey men).
You all [who already exist as Vanaras on earth] should help Rama in his mission and later you [your portions] can come back to the respective abodes. Following the orders of the supreme Lord Shiva, with joined hands all deities donated their personal weapons to Rama.
Lord Hari gifted his Narayanaastra, Devendra gave his Indrastra, Brahma gave his Brahmastra, Agni gave his Agneyastra, Yama gave his Yaamyastra, Nairuti gave his Mohastra, Varuna gave his Varunastra, vayu donated his Vayavyastra, Kubera gifted his Kouberastra, Rudra donated his Raudrastra, Surya donated his Sourastra, Chandra gave his Soumyastra, Viswedevas donated Pavakastra, and Vasus gave their Vaasavastra.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 25 / Sri Gajanan Maharaj Life History - 25 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. 6వ అధ్యాయము - 1 🌻*
శ్రీగణేశాయనమః ! ఓ అత్యంత శుభప్రదమయినవాడా, మీఆశీర్వచనాలు అన్ని అశుభాలను దూరం చేస్తాయని యోగుల అనుభవం. అదే నమ్ముకుని, ఓభగవంతుడా నేను చాలా ఆశతో మీద్వారం దగ్గరకు వచ్చాను. నన్ను ఒకవేళ నిరాశ పరిస్తే అదిమీకూ, యోగులకు కూడా అవమానకరం కనుక మాధవా మీయెక్క ఈ అమాయక పిల్లవాడి మీద కోపగించక గౌరవాన్ని కాపాడండి. పిల్లల అవకతవక పనులు వారి తల్లికి చెడ్డపేరు తెస్తాయి అనేది, కృపయా గుర్తు ఉంచుకోండి.
ఒకసారి బనకటలాల్ తన పొలంలో జొన్నపొత్తులు తినడానికి శ్రీమహారాజును తీసుకు వెళతాడు. ఈజొన్న పొత్తుల విందుకు ఇతరులు అనేకమంది కూడా అక్కడికి చేరారు. వారికి కూర్చునేందుకు ఒక నుయ్యిదగ్గర ఏర్పాటు చెయ్యబడింది.
ఆ నూతిలో కావలసినన్ని నీళ్ళు ఉన్నాయి. జొన్నపొత్తులు కాల్చడానికి 8/10 చోట్ల మంట పెట్టారు. దానివల్ల చాలా పొగ ఆకాశంలోకి లేచింది. ఈపొగవల్ల ఒక చింతచెట్టుకు ఉన్న పెద్ద తేనెపట్టు నుండి ఈగలు అక్కడ మనుషుల మీదికి వచ్చాయి. జొన్నపొత్తులు వదలి వారు పరిగెత్తడం మొదలు పెట్టారు. కొంతమంది అయితే తలకు కంబళ్ళు కప్పుకుని మరీపరిగెత్తారు.
ఈప్రపంచంలో మనప్రాణంకంటే విలువయినది ఏదీలేదు. ఈ ప్రజల విషయంకూడా అంతే. ఈ గందరగోళంలో శ్రీగజానన్ మహారాజు మాత్రం కలవర పడకుండా కూర్చుని ఉండి ఆతేనెటీగల గూర్చి ఆలోచిస్తున్నారు. ఈ తేనెటీగలూనేనే, ఈ తేనెపట్టూనేనే. జొన్నపొత్తులు తినడానికి వచ్చింది నేనే మరియు జొన్నపొత్తునుకూడా నేనే అని ఆయన అనుకుంటున్నారు.
తన్మయత్వంలో ఆయన అలాఅనుకుంటూ ఉండగా అనేక మయిన తేనెటీగలు ఆయన శరీరం మీద వాలి, ఒక ఈగల కంబళి పరిచినట్టుగా అగుపించింది. ఈగలు ఆయనను కుట్టి వాటిసూదివంటి ముళ్ళను ఆయన శరీరంలోకి గుచ్చుతున్నాయి. కానీ శ్రీమహారాజు దానిని ఏమీ లక్ష్య పెట్టలేదు.
ఈప్రకరణ కొంతసేపు నడిచి నిస్సహాయులయిన భక్తులను కృంగదీసింది. శ్రీమహారాజును పొలానికి తీసుకు వచ్చినందుకు బనకటరాల్ చాలా దుఖించి, శ్రీగజానన్ కు ఈ తేనెటీగలకాట్లకు నేనే కారణం అని అనుకున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Gajanan Maharaj Life History - 25 🌹*
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
*🌻 Chapter 6 - part 1 🌻*
Shri Ganeshaya namah! O most auspicious One! It is the experience of saints that Your Blessings drive away everything that is inauspicious. Believing it, O God, I have come to Your door with great hopes. If You disappoint me, it will mean disrepute to You and the saints as well.
So, Madhava, uphold my prestige and never be angry with this innocent child of Yours. Please remember that any shortcoming of a child brings blame to the mother.
One time Bankatlal took Shri Gajanan Maharaj to his farm to eat maize corns. Many other people had gathered there for this party of corn and the seating arrangement was made near a well.
The well had ample water and there were many tamarind trees around.
Fire was lit at 8 to 10 places to fry the corn and a lot of smoke was rising up in the sky. There was a big honeycomb on the tamarind tree and. due to the smoke, the bees rushed out to attack the people seated below the tree.
Leaving the corn the people started to flee the place. Some of them covered their heads with blankets.
In this world nothing is more precious than one’s own life. So was the case with these people. In all this havoc, Shri Gajanan Maharaj sat undisturbed and thought about the honeybees.
He thought to Himself, “I am the bees, I am honeycomb. The one who has come to eat corn is I, and the corn is also me.” While he was blissfully thinking this, innumerable bees landed on his body giving him an appearance of wearing a blanket of bees.
The insects were biting and piercing their needle like thorns in His body, but Shri Gajanan Maharaj did not bother about it. This went on for some time making the helpless devotees miserable.
Bankatlal felt very sorry for having brought Shri Gajanan Maharaj to the farm and felt that he himself was responsible for the bites inflicted by the bees on Shri Gajanan.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 15 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 15 🌻*
48. ఆత్మ,పరమాత్మలోనే ఉన్నది అనుట తొలిసత్యము. ఇంక, అసలు ఆత్మయే--పరమాత్మ అన్నది మలిసత్యము.
49. సాగరజలము నుండి ఒక బిందు లవలేశమును వెలికితీయక పూర్వము, అది సాగరములో కలిసియేయున్నది. బయటికి తీయబడినప్పుడే బిందు రూప మేర్పడుచున్నది.అనగా సాగరమే ఒక అనంతమైన నీటి బిందువు అని చెప్పవచ్చును.
50. వెలికి తీసిన బిందు లవలేశమును, అనంతసాగరముతో పోల్చినప్పుడు, బిందువునకు పరమాణు ప్రమాణముగల పరిమితి యేర్పడుచున్నది. బిందువు సాగరములో నున్నప్పుడు పరమాణు ప్రమాణమైన బిందువునకు కూడా అనంతత్వమే యేర్పడుచున్నది. కనుక
ఆత్మయే పరమాత్మ.
పరమాత్మయే ఆత్మ.
51.ఇప్పుడు మనము తనయందు స్పృహ లేని ఒక (అచేతనావస్థయందున్న) ఆత్మను గూర్చి యోచించుదుము.
52. ఆదిలో, ఆత్మకు సంస్కారములు లేవు.చైతన్యము లేదు.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. సౌందర్య లహరి - 75 / Soundarya Lahari - 75 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
75 వ శ్లోకము
*🌴. అశుధారగా కవిత్వం చెప్పుటకు 🌴*
శ్లో: 75. తవస్తన్యం మన్యే ధరణిధరకన్యే హృదయతః పయఃపారావారః* *పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడశిశురాస్వాద్య త్వ య త్కవీనాం ఫ్రౌఢానా మజని కమనీయః కవయితాll
🌻. తాత్పర్యం :
అమ్మా! పర్వత నందినీ నీ చనుబాలను హృదయమునుండి ప్రవహించుచున్న వాజ్మయముతో నిండిన పాలసముద్రము వలె నేను తలచు చున్నాను. ఎందువలన అనగా వాత్సల్యముతో నీవు ఇచ్చిన స్తన్యము త్రాగి ఈ ద్రవిడ బాలుడు ( శ్రీ శంకర భగవత్పాదులు) కవులలో మనోహరుడు అయిన కవి కాజాలడు. కదా !
🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 12000 సార్లు ప్రతి రోజు 3 రోజులు జపం చేస్తూ, తేనె, పండ్లు, పొంగలి నివేదించినచో అశుధారగా కవిత్వం చెప్పడం వచ్చును అని చెప్పబడింది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹Soundarya Lahari - 75 🌹*
📚. Prasad Bharadwaj
SLOKA - 75
*🌴 Capacity to Write Poems 🌴*
75. Twa stanyam manye dharanidhara kanye hridhayatha Paya paraabhaara parivahathi saaraswathamiva Dhayavathya dhattham dravida sisu raaswadhya thava yat Kaveenam proudana majani kamaniya kavayitha
🌻 Translation :
Oh daughter of the king of mountains, I feel in my mind,That the milk that flows from your breast,Is really the goddess of learning, Sarswathi, In the form of a tidal wave of nectar. For, milk given by you, who is full of mercy, Made the child of Dravida, The king among those great poets,Whose works stole one's mind
Child of Dravida refers to The Tamil poet Tirugnana Sambandar who preceded Sankara
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 12000 times a day for 3 days, offering honey, pongal and fruits as prasadam, one is said to attain the power to concentrate in their work and turn as a scholar.
🌻 BENEFICIAL RESULTS:
Good memory and attention, fame and gift of poetry.
🌻 Literal Results:
Beneficial for composers,poets and for creative work. Great fame and recognition.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 374 / Bhagavad-Gita - 374 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 23 🌴
23. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్ |
వసూనాం పావకశ్చాస్మి మేరు: శిఖరిణామహమ్ ||
🌷. తాత్పర్యం :
నేను రుద్రులలో శివుడను, యక్ష, రాక్షసులలో కుబేరుడను, వసువులలో అగ్నిని, పర్వతములలో మేరువును అయి యున్నాను.
🌷. భాష్యము :
రుద్రులు పదునొకండుగురు కలరు. వారిలో శివుడు (శంకరుడు) ముఖ్యమైనవాడు. అతడు ఈ విశ్వమునందు భగవానుని తమోగుణావతారము. యక్ష, రాక్షసుల నాయకుడైన కుబేరుడు దేవతల కోశాధిపతి. అతడు దేవదేవుని ప్రతినిధి. సమృద్ధియైన ప్రకృతి సపదలకు మేరుపర్వతము మిక్కిలి ప్రసిద్ధము
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 374 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 10 - Vibhuti Yoga - 23 🌴
23. rudrāṇāṁ śaṅkaraś cāsmi
vitteśo yakṣa-rakṣasām
vasūnāṁ pāvakaś cāsmi
meruḥ śikhariṇām aham
🌷 Translation :
Of all the Rudras I am Lord Śiva, of the Yakṣas and Rākṣasas I am the Lord of wealth [Kuvera], of the Vasus I am fire [Agni], and of mountains I am Meru.
🌹 Purport
There are eleven Rudras, of whom Śaṅkara, Lord Śiva, is predominant. He is the incarnation of the Supreme Lord in charge of the mode of ignorance in the universe. The leader of the Yakṣas and Rākṣasas is Kuvera, the master treasurer of the demigods, and he is a representation of the Supreme Lord. Meru is a mountain famed for its rich natural resources.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment