నారద భక్తి సూత్రాలు - 67

🌹. నారద భక్తి సూత్రాలు - 67 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము - సూత్రము - 38

🌻 38. ముఖ్య తస్తు మహత్కృపయైవ భగవత్కృపా లేశాత్‌ వా ॥ - 2 🌻

మహాత్ములు, లేక గురువులు, లేక భాగవతోత్తముల లక్షణాన్ని ఇలా తెలియచేస్తున్నారు.

సిద్ధం సత్సంప్రదాయె స్థిర ధియ మనఘం

శోత్రియం బ్రహ్మనిష్టం ! సత్వస్థం

సత్యవాచం సమయ నియతాయ
సాధువృత్యా సమేతమ్‌ ।
దంభాసూయాది ముక్తం జిత విషయగణం దిర్ణబంధుం దయాళుం న్థాలిత్య శాసితారం
స్వపరహిత పరం దేశికం భూష్టు రీప్పేత్‌ |
అజ్ఞాన ధ్వాంతరోదాదఘ పరిహరణా దాత్మ సామ్యవహత్వాత్‌ ।
జన్మ ప్రధ్వంసి జన్మ ప్రదగిరి మతయా దివ్య దృష్టి ప్రభావాత్‌ |
నిష్ప్రత్యూహా నృశంస్యా దనియతర సతయా నిత్య శేషిత్వ

యోగాదాచార్యః  సద్భిర ప్రత్యుపకరణ

ధియా దేవవత్‌ న్వాదువాస్యః

-వేదాంత దేశికులు

తా : (1) ఎవరు సకల భూతాలను ఆత్మ సమంగా చూస్తారో
(2) ఆ భూతాల వలన తమకు బాధ వాటిల్లినా ద్వేషింపక వాటి పట్ల మైత్రినే నెరపుతారో
(3) ఎవరు సకల భూతాలకు అభయ ప్రదానం ఇసారో
(4) ఎవరికి దెహాభిమానం సైతం జనించదో
(5) ఎవరు తమకు ఇంత (దివ్య) ప్రభావం ఉందని అహంకరించరో
(6) ఎవరు సుఖ దుఃఖాలను సమంగా భావిసారో
(7) తిట్టనా కొట్టినా ఎవరు వికారం చెందరో
(8) ఎవరు తమ శరిర పోషణార్ధమై ఆహారాదులు లఖంచినప్పుడు ఎలాగో లభించనప్పుడు కూడా అలాగే సంతుష్టులై ఉంటారో
(9) ఎవరు సమాహిత చిత్తులై శరిరెంద్రియాలను తమ వశంలో ఉంచుకుంటారో
(10) ఎవరు కర్తృ భోక్త్షృ భావాలకు దూరమై తాము సత్‌చిదానంద అద్వితీయ బ్రహ్మమనే దృఢాభివప్రాయం కలిగి, కుతర్కాలకు, వితండ వాదనలకు చలించరో
(11) ఎవరు తమ అంతఃకరణాన్ని శుద్ధ నిర్దుణ బ్రహ్మానికి సమర్చించినట్టి జీవనం కలిగి ఇచ్చా నిర్ణయాలు లేక ఉంటారో
(12) ఎవరు శుద్ధ అక్షర బ్రహ్మావెత్తలవుతారో
(13) ఎవరి వలన లోకానికి కించిత్తు భయం కలుగదో
(14) ఎవరు అద్వైత ధర్ములై పరమ కారుణ్యమూర్తులై, క్షమాశీలురై ఉండటంచేత లోకులు కల్పించే బాధలకు చలించరో
(15) ఎవరికి క్రియా లాభాలకు ఉప్పొంగడం, పరోత్కర్షకు ఓర్వలేకుండటం, క్రూర జంతువుల జూచి భయపడటం ఉండదో సర్వ పరిగ్రహ శూన్యంగా, ఎకాకిగా విజన ప్రదేశంలో ఉండుటకు ఎవరు వ్యాకులపడరో, ఎవరు భోగాలను ఆకాంక్షించరో, ఒక వేళ భోగాలు యాదృచ్చికంగా కలిగినా అపేక్షించరో
(16) బాహ్వాభ్యంతర శౌచవంతులై కర్తవ్యాలను ఎరిగి నిర్వహించే సామర్థ్యం కలిగి పక్షవాత బుద్ధి లేకుండా ఎంత వ్యధనైనా ఎవరు ఓర్చుకుంటారో
(17) ఐహిక ఆముష్మిక ఫలకాంక్ష లేక, శుభాశుభాల రెంటిని పరిత్యజించి సర్వద్వంద్వ సహిష్షువులై మౌనవ్రతం పాటించి నియతి, నివాసం లేక పరమాత్మకు భక్తులై ఉంటారో వారు మహాత్ములనబడతారు.

= భగవద్గీత, భాగవతం, వివేక చూడామణి

ఇట్టి వారిని ఆశ్రయించి భగవత్కపను పొందాలి. ఒక్కరా, పలువురా అనె సందేహం అవసరం లెదు.

పై గుణాలను మాత్రం ఎవరివద్ద ఉంటే వారినుండి గ్రహించి పరిపూర్ణతను పొందడం ప్రధానం. ఏక గురుత్వమున్నను, ఇతరుల వద్దనుండి జ్ఞాన సముపార్జనను నిరాకరించడం మూర్ఖత్వమే అవుతుంది. గురుజన నిరాదరణ భగవన్నిరాదరణే అవుతుంది.

నైకస్మాత్‌ గురోర్‌ జ్ఞానం సుస్థిరం న్యాత్‌ పుష్క్మలమ్‌ ॥

-భాగవతం, ఏకాదశ స్కంధం

బోధను వినగానే అనుష్టించరాదు. శాస్త్ర సమ్మతమైనదో, కాదో తెలుసుకోవాలి. ఆచార్య సంప్రదాయమో, కాదో విచారించాలి అని యోగ కుండల్యుపనిషత్‌ తెలియచేస్తున్నది.

కుల, గోత్ర, జాతి, లింగ, వయో భేదాలను పాటించక బ్రహ్మనిష్టను, పరమాత్నానుభూతిని పరిగణించి ఆశ్రయించి సద్గతి పొందాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment