1) 🌹 28, SEPTEMBER 2023 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 434 / Bhagavad-Gita - 434 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 20 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 20 🌴
3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 795 / Sri Siva Maha Purana - 795 🌹
🌻. గణాధ్యక్షుల యుద్ధము - 6 / Description of the Special War - 6 🌻
4) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 47 / Osho Daily Meditations - 47 🌹
🍀 48. మీ తల్లిదండ్రులను క్షమించడం / 48. FORGIVING YOUR PARENTS 🍀
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 491 - 494 / Sri Lalitha Chaitanya Vijnanam - 491 - 494 🌹
🌻 491 to 494 నామములు / 491 to 494 Names 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 28, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : అనంత చతుర్థి, గణేశ విసర్జనం, Anant Chaturdasi , Ganesh Visarjan 🌺*
*🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 23 🍀*
*45. జటీ కృష్ణాజినపదో వ్యాఘ్రచర్మధరో వశీ |*
*జితేంద్రియశ్చీరవాసీ శుక్లవస్త్రాంబరో హరిః*
*46. చంద్రానుజశ్చంద్రముఖః శుకయోగీ వరప్రదః |*
*దివ్యయోగీ పంచతపో మాసర్తువత్సరాననః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : గురువు : గురుభక్తి విశిష్టత - గురువు తన వ్యక్తి విశేష, అనుభవ సంపత్తి ప్రమాణము ననుసరించి, ఈశ్వర ప్రతినిధిగా, ఈశ్వరశక్తి ప్రసారోపకరణంగా విలసిల్లుతూ వుంటాడు. కానీ, ఆయన ఎట్టివాడైనా, ఆయనలోని ఈశ్వరతత్వాభి ముఖంగా శిష్యుని హృత్పద్మం విచ్చుకొనేటప్పుడు, ఉపకరణపు శక్తి వలన కొంత జరిగేది జరిగినా, ఎక్కువ సత్ఫలితం ఆత్మార్పణ రూపమైన శిష్యుని భక్తి ప్రపత్తిని బట్టియే నిర్ణీతమవుతూ ఉంటుంది. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: శుక్ల చతుర్దశి 18:50:55 వరకు
తదుపరి పూర్ణిమ
నక్షత్రం: పూర్వాభద్రపద 25:49:08
వరకు తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: దండ 23:54:20 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: గార 08:34:29 వరకు
వర్జ్యం: 10:11:04 - 11:36:20
దుర్ముహూర్తం: 10:06:23 - 10:54:31
మరియు 14:55:11 - 15:43:19
రాహు కాలం: 13:36:58 - 15:07:13
గుళిక కాలం: 09:06:14 - 10:36:29
యమ గండం: 06:05:43 - 07:35:58
అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:30
అమృత కాలం: 18:42:40 - 20:07:56
సూర్యోదయం: 06:05:43
సూర్యాస్తమయం: 18:07:43
చంద్రోదయం: 17:32:11
చంద్రాస్తమయం: 04:45:21
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: ముద్గర యోగం - కలహం
25:49:08 వరకు తదుపరి ఛత్ర
యోగం - స్త్రీ లాభం
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 434 / Bhagavad-Gita - 434 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 20 🌴*
*20. ద్యావాపృథివ్యోరిదమన్తరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వా: |*
*దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదమ్ లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ ||*
*🌷. తాత్పర్యం : నీవు ఒక్కడవేయైనను సమస్త ఆకాశమును, స్వర్గలోకములను మరియు వాని నడుమగల ప్రదేశము నంతటిని వ్యాపించియున్నావు. ఓ మహానుభావా! అద్భుతమును, భయంకరమును అగు ఈ రూపమును గాంచి లోకములన్నియును కలత నొందుచున్నది.*
*🌷. భాష్యము : “ద్యావాపృథివ్యో” (స్వర్గమునకు, భూమికి నడుమగల ప్రదేశము) మరియు “లోకత్రయం” (ముల్లోకములు) అను పదములు ఈ శ్లోకమున ప్రాముఖ్యమును కలిగియున్నవి. అర్జునుడే గాక ఇతర లోకములందలి వారు కూడా శ్రీకృష్ణభగవానుని ఈ విశ్వరూపమును గాంచినట్లు గోచరించుటయే అందులకు కారణము. అర్జునుని విశ్వరూపదర్శనము స్వప్నము కాదు. దివ్యదృష్టి ఒసగబడిన వారందరును రణరంగమున విశ్వరూపమును గాంచగలిగినారు.*
🌹 🌹 🌹 🌹 🌹
🌹*🌹 Bhagavad-Gita as It is - 434 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 20 🌴*
*20. dyāv ā-pṛthivyor idam antaraṁ hi vyāptaṁ tvayaikena diśaś ca sarvāḥ*
*dṛṣṭvādbhutaṁ rūpam ugraṁ tavedaṁ loka-trayaṁ pravyathitaṁ mahātman*
*🌷 Translation : Although You are one, You spread throughout the sky and the planets and all space between. O great one, seeing this wondrous and terrible form, all the planetary systems are perturbed.*
*🌹 Purport : Dyāv ā-pṛthivyoḥ (“the space between heaven and earth”) and loka-trayam (“the three worlds”) are significant words in this verse because it appears that not only did Arjuna see this universal form of the Lord, but others in other planetary systems saw it also. Arjuna’s seeing of the universal form was not a dream. All whom the Lord endowed with divine vision saw that universal form on the battlefield.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 795 / Sri Siva Maha Purana - 795 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 21 🌴*
*🌻. గణాధ్యక్షుల యుద్ధము - 6 🌻*
*అపుడు విఘ్నేశ్వరుడు మిక్కిలి కోపించి శివుని పాదపద్మములను స్మరించి అచటకు వచ్చి మహాబలశాలియై పరశువుతో రాక్షసుని గదను విరుగగొట్టెను (40). వీరభద్రుడు ఆ రాక్షసుని వక్షస్థ్సలముపై మూడు బాణములతో కొట్టి ఏడు బాణములతో గుర్రములను సంహరించి జెండాను, ధనస్సును మరియు గొడుగును ఛేదించెను (41). అపుడ ఆ రాక్షసరాజు మిక్కిలి కోపించి భయంకరమగు శక్తని ప్తెకి ఎత్తి విఘ్నేశ్వరుని నేలప్తె బడవేసి తాను మరియొక రథము నధిష్ఠించెన (42).*
*అపుడు మహాబలశాలియగు ఆ రాక్షసరాజు మనస్సులో ఆ వీరభద్రుని ఏమియూ లెక్కచేయక కోపముతో నిండినవాడై వేగముగా ఆతని ప్తెకి దండెత్తెను (43). మహవీరుడు, రాక్షసరాజు అగు జలంధరుడు ఆ వీరభద్రుని ఒక వాడి బాణముతో వేగముగా కొట్టి సింహనాదమును చేసెను (44). వీరభద్రుడు కోపించి పదున్తెన బాణముతో ఆ బాణమును ఛేదించి ఒక గొప్ప బాణముతో ఆతనిని కొట్టెను (45). ఆ తరువాత మహావీరులలో అగ్రగణ్యులు, సూర్యునితో సమమగు తేజస్సు గలవారు అగు వారిద్దరు అనేక శస్త్రాస్త్రములతో చిరకాలము ద్వంద్వయుద్దమును చేసిరి (46). అపుడు వీరభద్రుడు రథియగు ఆ జలంధరుని గుర్రములను బాణములతో నేలగూల్చి, ధనస్సును ఛేదించి, వేగముగా జెండాను కూడా పడగొట్టెను (47).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 795 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 21 🌴*
*🌻 Description of the Special War - 6 🌻*
40. Then the infuriated hero Gaṇeśa came there after remembering the lotus like feet of Śiva and split the mace of the Daitya with his axe.
41. Vīrabhadra then hit the Dānava in his chest with three arrows. He cut off the banner, umbrella, bow and the horses of the Daitya with seven arrows.
42. Then the infuriated leader of the Daityas lifted up his terrible Śakti and felled Gaṇeśa. He mounted another chariot then.
43. The powerful leader of the Daityas did not mind Vīrabhadra at all. Angrily he rushed at him.
44. Jalandhara, the heroic king of Daityas, hit Vīrabhadra with a fierce arrow and roared.
45. The infuriated Vīrabhadra split that arrow with a sharp-edged arrow. With another great arrow he hit him too.
46. Then both of them, the most excellent of heroes refulgent like the sun, fought each other with different kinds of weapons and missiles.
47. Vīrabhadra then felled his horses with his arrows. He forcefully cut off him bow and flags too.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 48 / Osho Daily Meditations - 48 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 48. మీ తల్లిదండ్రులను క్షమించడం 🍀*
*🕉. ఒకరు తమ తల్లిదండ్రులను క్షమించడం చాలా కష్టమైన విషయాలలో ఒకటి, ఎందుకంటే వారు మీకు జన్మనిచ్చారు - మీరు వారిని ఎలా క్షమించగలరు? 🕉*
*నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలుపెడితే తప్ప, నీ ఉనికిని చూసి పారవశ్యం చెందే స్థితికి వస్తే తప్ప, నీ తల్లిదండ్రులకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలవు? అది అసాధ్యం. మీరు కోపంగా ఉంటారు - వారు మీకు జన్మనిచ్చారు మరియు వారు మిమ్మల్ని మొదట అడగలేదు. వారు ఈ భయంకరమైన వ్యక్తిని సృష్టించారు. వారు బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకున్నందుకు మీరు ఎందుకు బాధపడాలి? మీరు అందులో భాగస్వాములు కాదు. మీరు ప్రపంచంలోకి ఎందుకు లాగబడ్డారు? అందుకే ఆవేశం.*
*మిమ్మల్ని మీరు ప్రేమించుకునే స్థితికి వచ్చినట్లయితే, మీరు నిజంగా ఆనందాన్ని అనుభవిస్తే, మీ కృతజ్ఞతకు పరిమితి లేని చోట, అకస్మాత్తుగా మీరు మీ తల్లిదండ్రుల పట్ల గొప్ప ప్రేమను అనుభవిస్తారు. మీరు ఉనికిలోకి ప్రవేశించడానికి వారు తలుపులుగా ఉన్నారు. వారు లేకుండా ఈ పారవశ్యం సాధ్యం కాదు - వారు దానిని సాధ్యం చేసారు. మీరు మీ ఉనికిని పండుగగా జరుపుకోగలిగితే-అదే నా పని యొక్క మొత్తం ఉద్దేశ్యం, మీ ఉనికిని పండుగగా జరుపుకోవడంలో మీకు సహాయం చేయడం-అప్పుడు మీరు మీ తల్లిదండ్రుల పట్ల, వారి కరుణ, వారి ప్రేమ పట్ల అకస్మాత్తుగా కృతజ్ఞత అనుభూతి చెందుతారు. మీరు కృతజ్ఞతతో ఉండటమే కాదు, వారిని క్షమించగలరు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 48 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 48. FORGIVING YOUR PARENTS 🍀*
*🕉. To forgive one's parents is one of the most difficult things, because they have given birth to you - how can you forgive them? 🕉*
*Unless you start loving yourself, unless you come to a state in which you are thrilled by your being-how can you thank your parents? It is impossible. You will be angry-they have given birth to you, and they didn't even ask you first. They have created this horrible person. Why should you suffer because they decided to give birth to a child? You were not a party to it. Why have you been dragged into the world? Hence the rage.*
*If you come to a point where you can love yourself, where you feel really ecstatic that you are, where your gratefulness knows no limitation, then suddenly you, feel great love arising for your parents. They have been the doors for you to enter into existence. Without them this ecstasy would not have been possible-they have made it possible. If you can celebrate your being-and that is the whole purpose of my work, to help you to celebrate your being-then suddenly you can feel gratitude for your parents, for their compassion, their love. You can not only feel grateful, you also forgive them.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 491 - 494 / Sri Lalitha Chaitanya Vijnanam - 491 - 494 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।
మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀*
*🌻 491 to 494 నామములు 🌻*
*491. 'కాళారాత్ర్యాది శక్త్యేఘవృతా' - కాళరాత్రి అను శక్తి ఆదిగా గల పండ్రెండు శక్తులతో నుండునది శ్రీమాత అని అర్ధము.
492. 'స్నిగ్దాదన ప్రియా' - నేతి అన్నము ప్రియముగా గలది శ్రీమాత అని అర్థము.
493. 'మహా వీరేంద్ర వరదా' - మహావీరులగు పరమ భక్తులను అనుగ్రహించునది శ్రీమాత అని అర్థము.
494. 'రాకిణ్యంబా స్వరూపిణి' - 'రాకిణి' అను పేరుగల అంబాస్వరూపిణి శ్రీమాత అని అర్థము.
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 491 to 494 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻101. Kalaratryadishaktyao-ghavruta snigdhao-dana priya
mahavirendra varada rakinyanba svarupini ॥ 101 ॥ 🌻*
*🌻 491 to 494 Names. 🌻*
491. 'Kaalaratryadi Shaktyeghavrita'
Sri Ma contains the twelve powers starting with the power of Kalaratri.
492. 'Snigdadana Priya' - Sri Mata Loves Ghee Rice.
493. 'Maha Virendra Varada' - Sri Mata blesses the great devotees that are brave.
494. 'Rakinyamba Swarupini' - SriMata is Ambaswarupini named 'Rakini'.
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj