DAILY WISDOM - 146 : 25. It is Really the Vedanta Applied to All Aspects of Life / నిత్య ప్రజ్ఞా సందేశములు - 146 : 25. ఇది నిజంగా జీవితంలోని అన్ని కోణాలకు వర్తించే వేదాంతం



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 146 / DAILY WISDOM - 146 🌹

🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 25. ఇది నిజంగా జీవితంలోని అన్ని కోణాలకు వర్తించే వేదాంతం 🌻

స్వామి శివానంద యొక్క తత్వశాస్త్రం ఎంపిక చేసిన కొద్దిమంది మాత్రమే నడపగలిగే రహస్య మార్గం కాదు. ఇది సత్యాన్ని చేరుకోవడానికి ఉన్న అన్ని మార్గాల యొక్క సమాహారం. ఒకరి జీవితాన్ని అత్యున్నతంగా జీవించడానికి జీవితంలోని అన్ని అంశాలకు వర్తించే వేదాంత జ్ఞానం. ఇది పరిపూర్ణ జీవితానికి ఉన్న ఒక వ్యవస్థ. జ్ఞానం మరియు స్వేచ్ఛ పొందడానికి ఉన్న మార్గం. ఇది విరామ సమయాల్లో మేధోపరమైన ఆహ్లాదానికి కేటాయించిన ఊహాజనిత వ్యవస్థ కాదు, అయితే ఇది మనిషి ఉన్నతమైన అవగాహన పొందడానికి, అంతర్జ్యోతి వెలిగించడానికి దోహదపడే నిగూఢమైన జ్ఞానం.

వేదాంతం జీవితం ఎంత సులభమైనదొ అంత సులభమైనది; జీవితం ఎంత సంక్లిష్టమైనదొ అంత సంక్లిష్టమైనది! ప్రపంచంలోని ప్రతి పౌరుడు ఈ తత్వశాస్త్రాన్ని అభ్యసించవచ్చు. కానీ బోధించే గురువుకు ఈ తత్వ శాస్త్రం పట్ల పూర్తి అవగాహన, అలాగే ప్రతి ఒక్కరి జీవితం లోని అన్ని పార్స్వాల్లో ఈ తత్వాన్ని ఎలా అన్వయించాలో తెలిపే జ్ఞానం ఉండాలి. అజ్ఞానం మరియు తప్పుడు అవగాహన వలన కొంతమంది వ్యక్తులు ఆత్మ లేదా బ్రహ్మం యొక్క తత్వం మరణం తర్వాత జీవితానికి సంబంధించిన మరోప్రపంచపు సిద్ధాంతమని భావించేలా చేస్తుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 146 🌹

🍀 📖 The Philosophy of Life 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 25. It is Really the Vedanta Applied to All Aspects of Life 🌻


The philosophy of Swami Sivananda is not any secret way capable of being trodden only by a select few. It is an all-inclusive method which comprises all existent means of communion with Reality. It is really the Vedanta applied to all aspects of life in order to live one’s life at its highest and best. It is the system of the perfect life, the rule of wisdom and the law of liberty. It is not a speculative system reserved for intellectual pleasantry during leisure hours, but is the food of the higher understanding and the light of the innermost Self of man.

The Vedanta is as simple as life is; and also it is as complex as life is! Every citizen of the world can be taught this philosophy, provided the teacher knows well what it truly means and how it can be applied in practice to the different stages of life and to different individuals. It is ignorance and wrong understanding that make certain people think that the philosophy of the Atman or Brahman is an otherworldly theory concerning only a life which follows death.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment