🌹 26, JANUARY 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 26, JANUARY 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 26, JANUARY 2023 FRIDAY శుక్రవారం, భృగు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 492 / Bhagavad-Gita - 492 🌹
🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -23 / Chapter 12 - Devotional Service - 23 🌴
🌹. శ్రీ శివ మహా పురాణము - 847 / Sri Siva Maha Purana - 847 🌹
🌻.బ్రహ్మవిష్ణువులకు శివుని ఉపదేశము - 2 / Śiva’s advice to Viṣṇu and Brahmā - 2 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 105 / Osho Daily Meditations  - 105 🌹
🍀 105. ప్రపంచాన్ని మార్చడం / 105. CHANGING THE WORLD 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 524 - 528 - 8 / Sri Lalitha Chaitanya Vijnanam - 524 - 528 - 8 🌹 
🌻 521 to 528 నామ వివరణము - 8 / 521 to 528 Names Explanation - 8 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 26, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*🍀 భారత గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికి, Bharat Republic Day Greetings to All. 🍀*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : భారత గణతంత్ర దినోత్సవం, Bharat Republic Day 🌻*
 
*🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 45 🍀*

*46. సపర్యా గుణినీ భిన్నా నిర్గుణా ఖండితాశుభా ।*
*స్వామినీ వేదినీ శక్యా శాంబరీ చక్రధారిణీ ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : యోగదర్శన వైవిధ్యం : వివిధ యోగదర్శన విశేషముల మధ్య కచ్చితమైన అనురూపతను సర్వత్రా నిరూపించడానికీ వలను పడదు. ఏలనంటే ఒక విషయాన్ని భిన్న దృక్పథాల నుండి చూచి, భిన్న రీతులుగా అనుభవాన్ని వ్యక్తీకరించడం వాటి యందు జరుగుతుంది. దేని నిర్మాణ ప్రణాళిక దానిదే. దేని సాంకేతిక విధానములు దానివే. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
హేమంత ఋతువు, ఉత్తరాయణం,
పౌష్య మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 25:21:45
వరకు తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: పుష్యమి 10:29:28
వరకు తదుపరి ఆశ్లేష
యోగం: ప్రీతి 07:41:02 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: బాలవ 12:20:56 వరకు
వర్జ్యం: 24:38:36 - 26:24:48
దుర్ముహూర్తం: 09:04:54 - 09:50:08
మరియు 12:51:06 - 13:36:21
రాహు కాలం: 11:03:39 - 12:28:29
గుళిక కాలం: 08:14:00 - 09:38:50
యమ గండం: 15:18:08 - 16:42:58
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:50
అమృత కాలం: 03:29:48 - 05:14:36
సూర్యోదయం: 06:49:10
సూర్యాస్తమయం: 18:07:47
చంద్రోదయం: 18:43:34
చంద్రాస్తమయం: 07:18:02
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,
ద్రవ్య నాశనం 10:29:28 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹🍀 భారత గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికి, Bharat Republic Day Greetings to All. 🍀🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🇮🇳. రిపబ్లిక్ డే.. జనవరి 26నే ఎందుకు? భారత చరిత్రలో ఆ రోజుకు ఎందుకంతటి విశిష్టత? 🇮🇳*

*దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది.. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది... కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని భావిస్తారు. ఇందులో కాస్త నిజం లేకపోలేదు. అయితే దీని వెనుక బలమైన కారణం ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు వేచి ఉన్నారు.*

*లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల స్వాతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అప్పటి దాకా కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు, సంపూర్ణ అధికారం భ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి, దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా ఫర్వాలేదనుకునేలా ఉన్న రాజకీయ నేతల వైఖరిని జలియన్‌వాలాబాగ్ ఉదంతం ఒక్కసారిగా కళ్లు తెరిపించింది.*

*నాడు సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. ఆ రోజునే స్వాతంత్ర దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ప్రజలకు పిలుపు ఇచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన 1949లో పూర్తయినా.. మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి దానిని అమల్లోకి తెచ్చారు.*

*జనవరి 26, 1950 నుంచి బ్రిటీష్ కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం -1935 రద్దయ్యింది.. భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశ రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో రూపొందించారు. అనేక సవరణల అనంతరం, 1949 నవంబర్‌ 26న దీనిని రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది.*

*భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ, అందులోని అనేక అంశాలను ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. బ్రిటీష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తరువాత భారత పౌరులందరిని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర్య పోరాట ఆశయాలను నెరవేర్చడానికి, రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది జనవరి 26, 1950 నుంచి అమలులోకి వచ్చింది. ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికతత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది.*

*ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం వేళ గణతంత్ర పరేడ్‌కు పోటీగా అదేరోజున సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారీఎత్తున రైతుల పరేడ్‌ నిర్వహించడం గమనార్హం. ప్రజలు పోరాడి సాధించిన ఈ గణతంత్రంలో రైతులు, కార్మికులు లేకుంటే కండపుష్టి వచ్చేది కాదని, ఆ రోజు స్వాతంత్య్రం తెచ్చిందీ రైతులే.. ఈ 74 ఏళ్ల స్వతంత్ర భారతం యొక్క మనుగడను కాపాడుతున్నదీ రైతులే అని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. ఇలా 26 జనవరి నాడు, స్వతంత్ర దేశంగా పురుడు పోసుకుని ప్రపంచ దేశాల కూటమిలో సంపూర్ణ స్వతంత్ర దేశంగా భారత్ చేరింది.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 492 / Bhagavad-Gita - 492 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 03 🌴*

*03. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత |*
*క్షేత్రక్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ ||*

*🌷. తాత్పర్యం : ఓ భరత వంశీయుడా ! సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడనని నీవు తెలిసికొనుము. దేహమును మరియు దాని నెరిగిన క్షేత్రజ్ఞుని అవగాహన చేసికొనుటయే జ్ఞానమని నా అభిప్రాయము.*

*🌷. భాష్యము : దేహము మరియు దేహము నెరిగినవాని గూర్చియు, ఆత్మ మరియు పరమాత్ముని గూర్చియు చర్చించునపుడు భగవానుడు, జీవుడు, భౌతికపదార్థమనెడి మూడు అంశములు మనకు గోచరించును. ప్రతి కర్మక్షేత్రమునందును (ప్రతిదేహమునందును) జీవాత్మ, పరమాత్మలను రెండు ఆత్మలు గలవు. అట్టి పరమాత్మ రూపము తన ప్రధాన విస్తృతాంశమైనందున శ్రీకృష్ణభగవానుడు “నేను కూడా క్షేత్రజ్ఞుడను. కాని దేహము నందలి వ్యక్తిగత క్షేత్రజ్ఞుడను కాను. పరమజ్ఞాతయైన నేను పరమాత్మరూపమున ప్రతిదేహము నందును వసించియున్నాను” అని పలికెను. భగవద్గీత దృష్ట్యాఈ కర్మక్షేత్రమును మరియు కర్మక్షేత్రము నెరిగినవానిని గూర్చిన విషయమును సూక్ష్మముగా అధ్యయనము చేయువాడు సంపూర్ణజ్ఞానమును పొందగలడు.*

*“ప్రతిదేహమునందును నేను కూడా క్షేత్రజ్ఞుడనై యుందును” అని శ్రీకృష్ణభగవానుడు పలికియున్నాడు. అనగా జీవుడు తన దేహమును గూర్చి మాత్రమే ఎరిగియుండును. ఇతర దేహముల జ్ఞానమతనికి ఉండదు. కాని సర్వదేహముల యందు పరమాత్మ రూపమున వసించు శ్రీకృష్ణభగవానుడు మాత్రము సర్వదేహములను గూర్చిన సమస్త విషయములను మరియు వివిధ జీవజాతుల వివిధ దేహములను సంపూర్ణముగా ఎరిగియుండును.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 492 🌹
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 03 🌴*

*03. kṣetra-jñaṁ cāpi māṁ viddhi sarva-kṣetreṣu bhārata*
*kṣetra-kṣetrajñayor jñānaṁ yat taj jñānaṁ mataṁ mama*

*🌷 Translation : O scion of Bharata, you should understand that I am also the knower in all bodies, and to understand this body and its knower is called knowledge. That is My opinion.*

*🌹 Purport : While discussing the subject of the body and the knower of the body, the soul and the Supersoul, we shall find three different topics of study: the Lord, the living entity, and matter. In every field of activities, in every body, there are two souls: the individual soul and the Supersoul. Because the Supersoul is the plenary expansion of the Supreme Personality of Godhead, Kṛṣṇa, Kṛṣṇa says, “I am also the knower, but I am not the individual knower of the body. I am the superknower. I am present in every body as the Paramātmā, or Supersoul.”*

*One who studies the subject matter of the field of activity and the knower of the field very minutely, in terms of this Bhagavad-gītā, can attain to knowledge. The Lord says, “I am the knower of the field of activities in every individual body.” The individual may be the knower of his own body, but he is not in knowledge of other bodies. The Supreme Personality of Godhead, who is present as the Supersoul in all bodies, knows everything about all bodies. He knows all the different bodies of all the various species of life.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 847 / Sri Siva Maha Purana - 847 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 31 🌴*

*🌻.బ్రహ్మవిష్ణువులకు శివుని ఉపదేశము - 2 🌻*

*వారు సిగ్గుతో కలవరపడిన మనస్సు గలవారై నా ఎదుట దైన్యముతో వృత్తాంతమునంతనూ చెప్పి 'రక్షింపుము, రక్షింపుము' అని పలికిరి (9). అపుడు భవుడనగు నేను సంతసిల్లి వారితో నిట్లంటిని ; ఓ కృష్ణా! మీరందరు నా ఆజ్ఞచే భయమును విడనాడుడు (10). నేను సర్వదా ప్రేమతో మిమ్ములను రక్షించెదను. మీకు మంచి మంగళము కలుగ గలదు. ఇది అంతయూ నా ఇచ్ఛచేతనే జరిగినది. సందేహము లేదు (11). నీవు రాధతో మరియు నీ అనుచరునితో గూడి నీ స్థానమునకు వెళ్లుము. ఈతడు భారతదేశములో దానవుడై జన్మించును గాక! దీనిలో సంశయము లేదు (12).*

*నేను సమయము వచ్చినపుడు మిమ్ములనిద్దరినీ శాపమునుండి ఉద్ధరించెదను. నా ఈ మాటను రాధాకృష్ణులిద్దరు శిరసా వహించిరి (13). బుద్ధిమంతుడగు శ్రీకృష్ణుడు చాల సంతసించి తన స్థానమునకు వెళ్లెను. వారిద్దరు భయపడుతూ నా ఆరాధనయందు నిష్ఠ గలవారై అచటనే మకాము చేసిరి (14). సర్వము నా ఆధీనములో నున్నదనియు, తమకు స్వాతంత్ర్యము లేదనియు వారు గుర్తించిరి. ఆ సుదాముడు రాధయొక్క శాపముచే దానవవీరుడై జన్మించెను (15). ధర్మవివేకము గల ఆ దానవుడు శంఖచూడుడను పేర ప్రసిద్ధిని గాంచి దేవతలకు ద్రోహమును తలపెట్టినాడు. ఆ దుష్టుడు దేవగణములనన్నింటినీ సర్వదా బలాత్కారముగా కష్టములకు గురిచేయుచున్నాడు (16). నా మాయచే మిక్కిలి మోహితుడై యున్న ఆ శంఖచూడునకు దుష్టులగు మంత్రులు తోడగుచున్నారు. మీరు వెనువెంటనే భయమును విడనాడుడు. నేను రక్షకుడను ఉన్నాను గదా! (17)*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 847 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 31 🌴*

*🌻 Śiva’s advice to Viṣṇu and Brahmā - 2 🌻*

9. Overwhelmed by shame they told me all the details. Dejected, they lamented before me saying the words “Save us, O save us.”

10. Then I, becoming delighted, told them these words, Kṛṣṇa, you forget your fear at my behest.

11. I am the protector, always infused with love. Good will befall you. All this has happened at my will. There is no doubt in it.

12. Go to your abode along with Rādhā and your comrade. He will become a Dānava here in Bhārata, certainly.

13-14. At the proper time I shall redeem you from the curse”. What I told thus Śrīkṛṣṇa and Rādhā accepted readily. Śrīkṛṣṇa the intelligent rejoiced and returned to his abode. There they engaged themselves in propitiating me and bidding their time.

15. Realising that everything is subject to my control and his will is not independent, Sudāmā became the lord of Dānavas as a result of the curse of Rādhā.

16. The virtuous demon Śaṅkhacūḍa distresses and harasses the gods always with his might. He is evil-minded to this extent.

17. He has been deluded by my deception and hence he seeks the help of evil ministers. But myself being the chastiser of the wicked you can get rid of his fear quickly”.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 105 / Osho Daily Meditations  - 105 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 105. ప్రపంచాన్ని మార్చడం 🍀*

*🕉 మీరు మీ ప్రపంచం, కాబట్టి మీరు మీ వైఖరిని మార్చుకున్నప్పుడు మీరు ఉన్న ప్రపంచాన్నే మార్చుకుంటారు. మనం ప్రపంచాన్ని మార్చలేము - రాజకీయ నాయకులు యుగయుగాలుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు మరియు వారు పూర్తిగా విఫలమయ్యారు. 🕉*

*ప్రపంచాన్ని మార్చడానికి ఏకైక మార్గం మీ దృష్టిని మార్చడం, మరియు అకస్మాత్తుగా మీరు వేరే ప్రపంచంలో జీవిస్తారు. మనం ఒకే ప్రపంచంలో జీవించడం లేదు మరియు మనమందరం సమకాలీనులం కాదు. ఒకరు గతంలో జీవిస్తూ ఉండవచ్చు--అతను మీ సమకాలీనుడు ఎలా అవుతాడు? అతను మీ పక్కన కూర్చుని గతం గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు; అప్పుడు అతను మీ సమకాలీనుడు కాదు. ఒకరు భవిష్యత్తులో ఉండవచ్చు, ఇంకా లేని దానిలో ఇప్పటికే ఉండవచ్చు. అతను మీ సమకాలీనుడు ఎలా అవుతాడు? ప్రస్తుతంలో నివసిస్తున్న ఇద్దరు వ్యక్తులు మాత్రమే సమకాలీనులు, కానీ ఇప్పుడు వారు లేరు-ఎందుకంటే మీరు మీ గతం మరియు మీ భవిష్యత్తు. వర్తమానం నీది కాదు, నీతో సంబంధం లేదు.*

*ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా ఇక్కడ మరియు ఇప్పుడు ఉన్నప్పుడు, వారు కాదు ఉన్నది, దేవుడు. మనం భగవంతునిలో జీవించినప్పుడు మాత్రమే మనం అదే ప్రపంచంలో జీవిస్తాము. మీరు మరొక వ్యక్తితో సంవత్సరాలు జీవించవచ్చు మరియు మీరు మీ ప్రపంచంలో జీవిస్తారు ఆమె తన ప్రపంచంలో నివసిస్తుంది - అందుకే రెండు ప్రపంచాల నిరంతర ఘర్షణ. క్రమంగా, ఈ తాకిడిని ఎలా నివారించాలో ఒకరు నేర్చుకుంటారు. దానినే మనం కలిసి జీవించడం అని పిలుస్తాము: ఘర్షణను నివారించడానికి ప్రయత్నించడం, ఘర్షణకు రాకుండా ప్రయత్నించడం. కుటుంబం, సమాజం, మానవత్వం... అన్నీ వట్టిదే అంటున్నాం! మీరిద్దరూ దేవునిలో జీవిస్తే తప్ప మీరు నిజంగా ఒక పురుషునితో లేదా స్త్రీతో ఉండలేరు. వేరే ప్రేమ లేదు, ఇతర కుటుంబం లేదు మరియు ఇతర సమాజం లేదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 105 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 105. CHANGING THE WORLD 🍀*

*🕉 You are your world, so when you change your attitude you change the very world in which you exist. We cannot change the world — that’s what politicians have been trying to do down through the ages, and they have utterly failed. 🕉*

*The only way to change the world is to change your vision, and suddenly you will live in a different world. We don't live in the same world, and we are not all contemporaries. Somebody may be living in the past--how can he be your contemporary? He may be sitting by your side and thinking of the past; then he is not your contemporary. Somebody may be in the future, already in that which is not yet. How can he be your contemporary? Only two people who live in the now are contemporaries, but in the now they are no more-because you are your past and your future. The present is not of you, it has nothing to do with you.*

*When two people are absolutely in the here and now, they are not-then God is. We live in the same world only when we live in God. You may live with another person for years, and you live in your world and she lives in hers--hence the continuous clash of two worlds colliding. By and by, one learns how to avoid this collision. That's what we call living together: trying to avoid the collision, trying not to come to a clash. That's what we call family, society, humanity ... all bogus! You cannot really be with a man or a woman unless you both live in God. There is no other love, no other family, and no other society.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 521 - 528 - 8 / Sri Lalitha Chaitanya Vijnanam  - 521 - 528 - 8 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥ 
*108. మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా ।*
*హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ ॥ 108 ॥ 🍀*

*🌻 521 to 528 నామ వివరణము - 8 🌻*

*శ్రీమాత ఆరాధకులు అనుగ్రహము పొందుటకు, పసుపుతో కూడిన అన్నమును ఈమెకు నైవేద్య మొసగి తాము భుజింతురు. శ్రీమాతకు పసుపు అన్నము అనినచో యిష్టము. ఆమె హరిద్రాన్నైకరసికా'. వారమున కొకమారైననూ పసుపు అన్నము భుజించుట వలన శరీరమందలి రుగ్మతలు నశించునని ఆయుర్వేదము తెలుపుచున్నది. ఈ ఆజ్ఞా పద్మమందలి శ్రీమాతను 'హం' అను శబ్దముతో ఆరాధించుట సంప్రదాయము. 'హం' అనునది మూల ప్రకృతికి సంబంధించిన శబ్దముగను, 'సం' అను శబ్దము మూల పురుషునికి సంబంధించిన శబ్దముగను ఋషులు గుర్తించి కీర్తించిరి.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 521 - 528 - 8 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 aagynachakrabja nilaya shuklavarna shadanana ॥ 107 ॥*
*108. Majasansdha hansavati mukhyashakti samanvita*
*haridranai karasika hakinirupa dharini  ॥ 108 ॥ 🌻*

*🌻 521 to 528 Names Explanation - 8 🌻*

*Devotees of Sri Mata offer her turmeric rice and eat it to get her grace. Srimata likes yellow rice. She is Haridrannaikarasika'. Ayurveda says that by eating yellow rice atleast once a week, body diseases will be destroyed. It is a tradition to worship this Srimata at Agnya chakra with the sound of 'Hum'. The sages recognized and glorified that 'Ham' as the root of nature and 'Sam' as the root of Purusha.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3

Siva Sutras - 205 : 3-25. Sivatulyo jayate - 3 / శివ సూత్రములు - 205 : 3-25. శివతుల్యో జాయతే - 3


🌹. శివ సూత్రములు - 205 / Siva Sutras - 205 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

3వ భాగం - ఆణవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 3-25. శివతుల్యో జాయతే - 3 🌻

🌴. ప్రకాశించే చైతన్యం యొక్క ఏకీకృత స్థితిలో, యోగి శివుని వలె స్వచ్ఛంగా మరియు ప్రకాశవంతంగా ఉంటాడు. 🌴


ఆత్మను తెలుసుకున్న తర్వాత కూడా, యోగి తన కర్మ ఖాతా కారణంగా తన శరీరాన్ని కలిగి ఉంటాడు. పూర్ణ విముక్తి కోసం, ఒకరి కర్మ ఖాతా సున్నాగా మారాలి. దేవుడు ఎల్లప్పుడూ 'కర్మ చట్టం' ఆధారంగా పనిచేస్తాడు. అతను ఎప్పుడూ తన స్వంత చట్టాలను అతిక్రమించడు. భగవంతుని స్పృహలో ఉండి క్రియలు చేయడం నేర్చుకుంటే, అతని కర్మ ఖాతాలోకి తదుపరి కర్మలు చేరవు. అందువల్ల, యోగి తన కర్మ ఖాతా చురుకుగా ఉన్నంత వరకు తన భౌతిక ఉనికిని కొనసాగించాలి. ఇది తదుపరి సూత్రాలలో మరింత వివరించ బడింది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 205 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 3 - āṇavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 3-25. Śivatulyo jāyate - 3 🌻

🌴. In the unified state of illuminated consciousness, the yogi becomes pure and resplendent just as Shiva 🌴


Even after realising the Self, the yogi continues to possess his body on account of his karmic account. For emancipation, balance in one’s karmic account should become zero. God always acts on the basis of “Law of Karma”. He never transgresses His own laws. If one learns to perform actions remaining in the state of God consciousness, further karmas do not accrue to his karmic account. Therefore, the yogi has to continue with his physical existence as long as his karmic account is active. This is further explained in subsequent aphorisms.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


DAILY WISDOM - 202 : 20. The World is the Face of God / నిత్య ప్రజ్ఞా సందేశములు - 202 : 20. ప్రపంచం భగవంతుని ముఖం




🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 202 / DAILY WISDOM - 202 🌹

🍀 📖 మహాభారతం మరియు భగవద్గీత యొక్క ఆధ్యాత్మిక అంశాలు 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 20. ప్రపంచం భగవంతుని ముఖం 🌻


రామాయణంలో, తులసీదాస్ రాముడు, సీత మరియు లక్ష్మణుడు నడుస్తూ, మధ్యలో సీతతో అందంగా వర్ణించాడు. బ్రహ్మ మరియు జీవుల మధ్య సీత మాయగా ఉందని చెబుతూ చిత్రాన్ని ఇచ్చాడు. అలాగే, భగవంతుని పట్ల మన ఉత్సాహభరితమైన ఆకాంక్షలో మనం తెలివితక్కువగా ఉంటూ మన ముందే ఉన్న ప్రపంచాన్ని విస్మరించే అవకాశం ఉంది. ప్రపంచం భగవంతుని ముఖం; అది భగవంతుని చేతుల వేళ్లు కదులుతున్నాయి, మరియు ప్రపంచం యొక్క స్వరూపం అని పిలవబడేది సంపూర్ణమైన వాస్తవికతలో పాతుకుపోయింది.

ఈ ఆసక్తికరమైన విశ్లేషణ యొక్క చాలా దురదృష్టకర పరిణామాలు ఉన్నాయి, అంటే, మనం కూడా ఈ ప్రదర్శనలో భాగమే; మరియు మనలో ఉన్న వాస్తవికత యొక్క అసమంజసమైన స్థితిని ధరించడం, మనం కనిపించే విధంగా చూసేటప్పుడు, మనం ఉన్న రాజ్యంలో పనిచేసే చట్టాన్ని విస్మరించడం. స్వరూపం, అన్నింటికంటే, వాస్తవికత యొక్క స్వరూపం-ఇది ఏమీ లేని స్వరూపం కాదు. అది ఏమీ కానట్లయితే, రూపమే ఉండదు. స్వరూపం వాస్తవంగా ఉన్నందున, ఇది వాస్తవికత యొక్క భావాన్ని తీసుకుంటుంది. పాము తాడులో ఉంది, అవును, కానీ తాడు లేదు అని మనం తెలుసుకోవాలి. తాడు కనిపించే తీరు తప్పుగా భావించినప్పటికీ, తాడు ఉన్న విషయాన్ని విస్మరించలేము-అదే పాము కనిపించడానికి కారణం.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 202 🌹

🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 20. The World is the Face of God 🌻


In the Ramayana, Tulsidas gives a beautiful description of Rama, Sita and Lakshmana walking, with Sita in the middle, and gives the image by saying that Sita was there as maya between brahma and jiva. Likewise, there is this world before us, which we are likely to unintelligently ignore in our enthusiastic aspiration for God. The world is the face of God; it is the fingers of the hands of God Himself moving, and the so-called appearance of the world is rooted in the reality of the Absolute.

There is a very unfortunate aftermath of this interesting analysis, namely, we ourselves are a part of this appearance; and to put on the unwarranted status of the reality in ourselves, while we are looked at as appearance, would be to disregard the law that operates in the realm in which we are placed. Appearance is, after all, an appearance of reality—it is not an appearance of nothing. If it had been nothing, the appearance itself would not be there. Inasmuch as the appearance is of reality, it borrows the sense of reality. The snake is in the rope, yes, but we must know that the rope is not absent. Though the way in which the rope is seen may be an erroneous perception, the fact of the rope being there cannot be ignored—that is the reason why the snake is seen at all.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 891 / Vishnu Sahasranama Contemplation - 891


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 891 / Vishnu Sahasranama Contemplation - 891🌹

🌻 891. అగ్రజః, अग्रजः, Agrajaḥ 🌻

ఓం అగ్రజాయ నమః | ॐ अग्रजाय नमः | OM Agrajāya namaḥ


అగ్రే జాయత ఇతి అగ్రజః, హిరణ్యగర్భః - హిరణ్యగర్భః సమవర్తతాగ్రే' ఇత్యాది శ్రుతేః

అందరి కంటెను ముందటి కాలము నందు జనించిన వాడు; హిరణ్యగర్భుడు.

'హిరణ్యగర్భః సమవర్తతాఽగ్రే' (ఋ. సం. 10.121.1) - 'మొదట హిరణ్యగర్భుడు ఉండెను' అను శ్రుతి ఈ విషయమున ప్రమాణము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 891🌹

🌻891. Agrajaḥ🌻

OM Agrajāya namaḥ


अग्रे जायत इति अग्रजः, हिरण्यगर्भः - हिरण्यगर्भः समवर्तताग्रे इत्यादि श्रुतेः

Agre jāyata iti agrajaḥ, hiraṇyagarbhaḥ Hiraṇyagarbhaḥ samavartatāgre ityādi śruteḥ

Born first i.e., Hiraṇyagarbhaḥ vide the śruti 'हिरण्यगर्भः समवर्तताऽग्रे' / 'Hiraṇyagarbhaḥ samavartatā’gre' (R‌. Saṃ. 10.121.1) - Hiraṇyagarbha appeared first.

🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka

अनन्तो हुतभुग् भोक्ता सुखदो नैकजोऽग्रजः ।
अनिर्विण्णस्सदामर्षी लोकाधिष्ठानमद्भुतः ॥ ९५ ॥

అనన్తో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।
అనిర్విణ్ణస్సదామర్షీ లోకాధిష్ఠానమద్భుతః ॥ 95 ॥

Ananto hutabhug bhoktā sukhado naikajo’grajaḥ,
Anirviṇṇassadāmarṣī lokādhiṣṭhānamadbhutaḥ ॥ 95 ॥




Continues....

🌹 🌹 🌹 🌹🌹




కపిల గీత - 299 / Kapila Gita - 299


🌹. కపిల గీత - 299 / Kapila Gita - 299 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 7. మానవజన్మను పొందే జీవుని గతిని వర్ణించుట - 30 🌴

30. భూతైః పంచభిరారబ్ధే దేహే దేహ్యబుధోఽసకృత్|
అహం మమేత్యసద్గ్రాహః కరోతి కుమతిర్మతిమ్॥


తాత్పర్యము : అజ్ఞాని ఐన ఆ జీవుడు పంచ భూతాత్మకమైన ఈ దేహము నందలి మిథ్యాభిమాన కారణముగా తనలో నిరంతరము అహంకార, మమకారములను పెంచుకొనును.

వ్యాఖ్య : అజ్ఞానం యొక్క విస్తరణ ఈ పద్యంలో వివరించబడింది. పంచభూతాలతో నిర్మితమై ఉన్న తన భౌతిక దేహాన్ని నేనుగా గుర్తించడం మొదటి అజ్ఞానం, రెండవది దేహసంబంధం వల్ల ఏదైనా దానిని తనదిగా అంగీకరించడం. ఈ విధంగా, అజ్ఞానం విస్తరిస్తుంది. జీవుడు శాశ్వతమైనది, కానీ అతను అశాశ్వతమైన విషయాలను అంగీకరించడం వల్ల, తన ఆసక్తిని తప్పుగా గుర్తించడం వల్ల, అతను అజ్ఞానంలోకి నెట్టబడ్డాడు మరియు అందువల్ల అతను భౌతిక బాధలకు గురవుతాడు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 299 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 7. Lord Kapila's Instructions on the Movements of the Living Entities - 30 🌴


30. bhūtaiḥ pañcabhir ārabdhe dehe dehy abudho 'sakṛt
ahaṁ mamety asad-grāhaḥ karoti kumatir matim

MEANING : By such ignorance the living entity accepts the material body, which is made of five elements, as himself. With this misunderstanding, he accepts nonpermanent things as his own and increases his ignorance in the darkest region.

PURPORT : The expansion of ignorance is explained in this verse. The first ignorance is to identify one's material body, which is made of five elements, as the self, and the second is to accept something as one's own due to a bodily connection. In this way, ignorance expands. The living entity is eternal, but because of his accepting nonpermanent things, misidentifying his interest, he is put into ignorance, and therefore he suffers material pangs.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


25 Jan 2024 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 25, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹

శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : పుష్య పౌర్ణమి, శాకంబరి పౌర్ణమి, పూర్ణిమ ఉపవాసం, Paushya Purnima, Shakambhari Purnima, Purnima Upavas, 🌻

🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 71 🍀

72. సనకః శుకయోగీ చ నందీ షణ్ముఖరాగకః |
గణేశో విఘ్నరాజశ్చ చంద్రాభో విజయో జయః

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : విజ్ఞానమయ చేతన సృష్టిలక్షణం : విభాగకల్పన మొనర్చే అధిమనస్సు ద్వారమున గాక దానికి పైన ఉండే అతీత మనస్సు (దీనినే మహస్సు, విజ్ఞానమయ చేతనగా కూడా పిలువవచ్చు) నుండి సరాసరిగా సృష్టి జరిగివుంటే, ఇప్పుడు మనం చూచే అజ్ఞానమయ ప్రపంచావిర్భావం అసంభవం. ఆది నుండి దివ్యతేజోమయ ప్రపంచావిర్భావమే అట్టి సందర్భంలో జరిగి వుండేది. 🍀

🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

హేమంత ఋతువు, ఉత్తరాయణం,

పుష్య మాసము

తిథి: పూర్ణిమ 23:25:05

వరకు తదుపరి కృష్ణ పాడ్యమి

నక్షత్రం: పునర్వసు 08:17:01

వరకు తదుపరి పుష్యమి

యోగం: వషకుంభ 07:32:07

వరకు తదుపరి ప్రీతి

కరణం: విష్టి 10:35:40 వరకు

వర్జ్యం: 17:01:00 - 18:45:48

దుర్ముహూర్తం: 10:35:15 - 11:20:27

మరియు 15:06:26 - 15:51:38

రాహు కాలం: 13:53:00 - 15:17:44

గుళిక కాలం: 09:38:46 - 11:03:30

యమ గండం: 06:49:16 - 08:14:01

అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:50

అమృత కాలం: 05:42:00 - 07:25:20

మరియు 27:29:48 - 29:14:36

సూర్యోదయం: 06:49:16

సూర్యాస్తమయం: 18:07:13

చంద్రోదయం: 17:50:09

చంద్రాస్తమయం: 06:33:45

సూర్య సంచార రాశి: మకరం

చంద్ర సంచార రాశి: కర్కాటకం

యోగాలు: సిద్ది యోగం - కార్య సిధ్ధి,

ధన ప్రాప్తి 08:17:01 వరకు తదుపరి

శుభ యోగం - కార్య జయం

దిశ శూల: దక్షిణం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹