జగద్గురు ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర!!

🌹. జగద్గురు ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర!! 🌹

ఆదిశంకరుల వారు జన్మించిన పుణ్యదినం వైశాఖ శుద్ధ పంచమి. జగద్గురువు అనే మాటకి సంపూర్ణంగా తగినటువంటి వారు శంకర భగవత్పాదుల వారు. శంకరులను గ్రహించాలి అంటే ఒక నిర్మలమైన అంతఃకరణం ఉండాలి. వ్యాసుని అవతారం తర్వాత మళ్ళీ అంతటి అవతారం శంకరావతారమే.

ద్వాపర యుగాంతంలో రానున్న కలియుగ మానవులకి జ్ఞానం అందించాలని చెప్పి వ్యాసుడు తాపత్రయ పడి వేదములను విభజన చేసే వేదాంత శాస్త్రమైన బ్రహ్మసూత్రాలను రచించి అటు తర్వాత అష్టాదశపురాణాలు అందించి మహాభారత ఇతిహాసాన్నిచ్చి తద్వారా భగవద్గీత, సనత్ సుజాతీయం మొదలైన బ్రహ్మవిద్యా గ్రంథాలను రచించి ఒక వ్యవస్థను చేశారు వ్యాసభగవానులు. కానీ కలిప్రభావం చేత ఉన్న వైదికమతం యొక్క హృదయాన్ని అర్థంచేసుకోలేక అందులో రకరకాల చీలికలు వచ్చి వైవిధ్యాన్ని వైరుధ్యం అనుకునే పద్ధతిలోకి వెళ్ళిపోయారు. అనేక అవైదికమతాలు పుట్టుకు వచ్చి ఆస్తికత అల్లల్లాడిపోతున్న రోజులవి.

ధార్మికత దెబ్బతిన్న రోజులవి, తాత్త్వికత సన్నగిల్లుతున్న రోజులవి. సనాతనధర్మం క్షీణదశకు వచ్చిన సమయంలో అవతరించిన సాక్షాత్ శంకరులే శంకరాచార్యుల వారు.

ఏకమేవ అద్వితీయం బ్రహ్మ’ - సృష్టిలో బ్రహ్మ తప్ప అన్యమేదీ లేదనీ, ‘సర్వం ఈశావాస్యం’- సకలచరాచరసృష్టి ఒకే దివ్య చైతన్యంతో నిండి నిబిడీకృతమై ఉన్నదనీ; భారతీయ వేదాంత విజ్ఞానాన్ని దేశం నలుమూలలా ప్రచారం చేసి, బ్రహ్మ విద్యా సంప్రదాయాన్ని పునఃప్రతిష్ఠించిన వివేకరత్నం - ఆది శంకరాచార్యులు. ధర్మజిజ్ఞాసను, బ్రహ్మజిజ్ఞాసతో అనుసంధానం చేశారు. వేదప్రతిపాదిత ‘అద్వైత’తత్త్వం ప్రబోధించారు. జాతీయసమైక్యాన్ని పునరుద్ధరించి సనాతనధర్మరక్షణకోసం జగద్గురుపీఠాలను నెలకొల్పారు.

🌹 🌹 🌹 🌹 🌹

17 May 2021

శ్రీ లలితా సహస్ర నామములు - 76 / Sri Lalita Sahasranamavali - Meaning - 76

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 76 / Sri Lalita Sahasranamavali - Meaning - 76 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।
క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀

🍀 341. క్షేత్రస్వరూపా -
క్షేత్ర పదంచే సంకేతింపబడే వాటి స్వరూపంగా నుండునది.

🍀 342. క్షేత్రేశీ - క్షేత్రమునకు అధికారిణి.

🍀 343. క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ -
స్థూలభాగమైన దేహమును, సూక్ష్మభాగమైన దేహిని పాలించునది లేదా రక్షించునది.

🍀 344. క్షయవృద్ధివినిర్ముక్తా -
తరుగుదల, పెరుగుదల లేనిది.

🍀 345. క్షేత్రపాల సమర్చితా - క్షేత్రపాలకులచే చక్కగా అర్చింపబడునది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 76 🌹

📚. Prasad Bharadwaj

🌻 76. kṣetrasvarūpā kṣetreśī kṣetra-kṣetrajña-pālinī |
kṣayavṛddhi-vinirmuktā kṣetrapāla-samarcitā || 76 || 🌻

🌻 341 ) Kshetra swaroopa -
She who is personification of the Kshetra or body

🌻 342 ) Kshetresi -
She who is goddess of bodies

🌻 343 ) Kshethra kshethragna palini -
She who looks after bodies and their lord

🌻 344 ) Kshaya vridhi nirmuktha -
She who neither decreases or increases

🌻 345 ) Kshetra pala samarchitha - She who is worshipped by those who look after bodies

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

17 May 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 27

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 27 🌹

✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పరిస్థితులు - సాధన 🌻

సాధకుని‌ జీవితమున వివిధానేక పరిస్థితులు‌ తటస్థించుట తప్పనిసరి. సాధారణ మానవునికి ఎట్లో, సాధకునకు అంతియే. సాధకుడు తాను సాధారణ మానవుని కన్న విశిష్టుడనని భావించుట తప్పు.

భగవంతుని పొందవలెనని తపించి యోగసాధన చేయునట్టి చాలా మందిలో వికసించని దయ,‌ శాంతము, ఓర్పు, ధైర్యము, వినయము వంటి సద్గుణములు, పెక్కుమంది‌ మనము సాధారణ మానవులనుకొనువారిలో గమనింపదగును.

దీనికి కారణమేమి? భగవంతుని‌ గూర్చి ఉద్వేగభరితములైన తపో, పూజా, సంకీర్తన, జప, హోమాది కార్యక్రమములు సాధకుడు చేపట్టవచ్చును. కాని అతనికి తల్లిదండ్రుల యందు వినయగౌరవములు లేకపోవచ్చును.

బాధలో ఉన్న దీనుని కన్నీటిని‌ తొలగింపు దశలో అతడు తన వంతు కర్తవ్యమును నిర్ణయింపకపోవచ్చును. అతని దృష్టిలో భగవంతుని పొందుట అనగా ఒక వస్తువునో, వ్యక్తి యొక్క స్నేహమునో, అధికారమునో పొందుటవంటిది మాత్రమే.

మానవుని ప్రజ్ఞలో మూడు కక్ష్యలు గలవు. ఉద్వేగభరిత కక్ష్య ఒకటి. తార్కిక ప్రజ్ఞా కక్ష్య ఒకటి. దివ్య ప్రేమమయానుభూతి కక్ష్య ఒకటి.

తోటి వాడు రోగ‌బాధతో ఏడ్చుచుండగా, కొందరు ఉద్వేగభరితులై తామును విలపింతురు. దాని వలన ఉపయోగము లేదు.

అట్లే మరికొందరు రోగార్తునకు సేవజేసిన‌ మనకేమి లభించును అని తార్కికముగా ఆలోచింతురు మొదటి కక్ష్యలో జీవించువాడు భక్తుడుగా మనకు కనపడవచ్చును ఉదారహృదయుని వలె అనిపించవచ్చును.

రెండవ కక్ష్యలో జీవించువాడు‌ మేధావి, పండితుడు, డిగ్రీలు కలవాడు, పెద్ద వైద్యుడుగనో, ప్లీడరుగనో, అధికారిగనో ప్రసిద్ధుడై ఉండవచ్చును. కాని‌ వీరి వలన సంఘమునకు ఎట్టి‌ ప్రయోజనము లేదు. రెండవ వాని వలన కీడు కూడ వాటిల్లవచ్చును.

🌹 🌹 🌹 🌹 🌹

17 May 2021

శ్రీ శివ మహా పురాణము - 399

🌹 . శ్రీ శివ మహా పురాణము - 399🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 19

🌻. కామదహనము - 4 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

శంభుని ఈ మాటలను విని దేవతలు మససులో కొంత ఓదార్పును పొందిన వారై శివునకు చేతులు జోడించి శిరసులను వంచి నమస్కరించిన వారై ఇట్లు పలికిరి (45).

దేవతలిట్లు పలికిరి-

ఓ దేవదేవా! మహాదేవా! కరుణానిధీ! ప్రభూ! హరా! నీవు మన్ముథుని శీఘ్రముగా జీవింపజేసి రతీదేవి యొక్క ప్రాణములను కాపాడుము (46).

బ్రహ్మ ఇట్లు పలికెను-

దేవతల ఈ మాటలను విని ప్రసన్నుడైనట్టియు, కరుణాసముద్రుడు, సర్వేశ్వరుడునగు పరమేశ్వరుడు మరల ఇట్లు పలికెను (47).

శివుడిట్లు పలికెను-

ఓ దేవతలారా! మిక్కిలి ప్రసన్నుడనైతిని. కాముని ఈ లోపులోననే జీవింపజేసెదను. కాముడు నా గణమై నిత్యము విహరించగలడు (48). ఓ దేవతలారా! ఈ వృత్తాంతమునెవ్వరికీ చెప్పకుడు. మీ స్థలములకు వెళ్లుడు. దుఃఖములనన్నిటినీ నశింపజేసెదను (49).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇట్లు పలికి అపుడు రుద్రుడు దేవతలు స్తుతించుచుండగా అంతర్థానమయ్యెను. దేవతలందరు మిక్కిలి ప్రసన్నులైరి. కాలగతికి చకితులైరి (50). ఓ మహర్షీ! అపుడు వారు ఆమెను ఓదార్చి రుద్రుని వచనమును స్వీకరించి తమలో తాము రుద్రుని మాటలను చెప్పుకొనుచూ తమ తమ ధామములకు వెళ్లిరి (51). ఓ మహర్షీ! కాముని భార్య యగు రతి రుద్రుడు ఆదేశించిన నగరమునకు వెళ్లి అచట రుద్రుడు ఆదేశించిన కాలము కొరకు ఎదురు చూచుచుండెను (52).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత యందలి పార్వతీ ఖండములో కామనాశవర్ణనమనే పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది(19).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

17 May 2021

గీతోపనిషత్తు -199

🌹. గీతోపనిషత్తు -199 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 40

🍀 39. నిత్యజీవన యోగసాధన - పార్థా! యోగభ్రష్టునకు ఈ లోకము నందు గాని, పరలోకము నందు గాని పతనముండదని తెలియుము. మంచి పని చేయుటకై సంకల్పించినవాడు దుర్గతి చెందనేరడు. ఈ విషయమున నీకు సందేహము వలదు. సత్సంకల్పముతో కార్యముల నారంభించు వారు కార్యము లందు కృతకృత్యులు కాక పోయినను సంకల్పము శుభకర మగుటచే సృష్టియందు నాశనము చెందరు. యోగవిద్యకు కావలసిన ఏకైక సమర్థత మనో నియతి. శ్రద్ధ కలిగినను మనోనియతి లేనిచో యోగము సిద్ధించుట జరుగదు. దైనందిన జీవితమున కర్మజ్ఞాన సన్యాస యోగసూత్రము లను నిత్యము అనుసరించుట వలననే యతచిత్తము కలుగును. 🍀

పార్థ నై వేహ నాముత్ర వినాశ స్తస్య విద్యతే |
న హి కల్యాణకృత్కశ్చిద్దుర్గతిం తాత గచ్ఛతి || 40

పార్థా! అట్టి యోగభ్రష్టునకు ఈ లోకము నందు గాని, పరలోకము నందు గాని పతనముండదని తెలియుము. మంచి పని చేయుటకై సంకల్పించినవాడు దుర్గతి చెందనేరడు. ఈ విషయమున నీకు సందేహము వలదు. శ్రీ కృష్ణుడు ఒక విశేషమగు సృష్టి రహస్యము అర్జునునకు ఆవిష్కరించినాడు.

సత్సంకల్పముతో కార్యముల నారంభించు వారు కార్యములందు కృతకృత్యులు కాక పోయినను సంకల్పము శుభకర మగుటచే సృష్టియందు నాశనము చెందరు. అతడు కార్యము లందు నిపుణత లేక పోవుట వలన కొన్ని చిక్కు లేర్పరచు కొనినను, సంకల్పము దైవమును చేరు శుభ సంకల్పమే గనుక ఆ సంకల్ప మెరిగిన ప్రకృతి పురుషులు అతనిని ఆశీర్వదింతురే గాని, అతనిని భ్రష్టుని గావింపరు.

"కల్యాణ కృత్" అనగా కల్యాణము కలిగించు కార్యము. తనకు గాని, యితరులకు గాని చైతన్యపరమగు ఉన్నతిని గావించు కార్యము. చేయుటలో సమర్థతను బట్టి సిద్ధి యుండును. యోగవిద్యకు కావలసిన ఏకైక సమర్థత మనో నియతి. శ్రద్ధ కలిగినను మనోనియతి లేనిచో యోగము సిద్ధించుట జరుగదు.

వైఫల్యము కలిగినపుడెల్ల మరికొంత నియతిని యోగ సాధకుడు పొందుటకు యత్నించును. అట్లు యత్నింపవలెను కూడ. యత్నించుటకు కూడ వైఫల్యము లుండ వచ్చును. కాని మరల మరల యత్నించుటలో అభ్యాసవశమున యతీంద్రియుడు కాగలడు. యతచిత్తుడు కాగలడు. క్రమముగ అభ్యాసవశముననే సమబుద్ధిని పొందగలడు. శీతోష్ణములకు, సుఖదుఃఖములకు, మానావమానములకు తీవ్రమగు బాధ పొందుట క్రమముగ తగ్గును.

నిత్య జీవితమున అభ్యాసవశమున తగ్గునే కాని మరియొక మార్గము లేదు. నిత్య జీవితమున అనుభవ జ్ఞానము చేతను, అటు పైన అధ్యయన జ్ఞానము చేతను క్రమముగ కూటస్థుడగును కూటస్థుడగుట యనగ చంచలత్వము నుండి స్థిరత్వమునకు చేరినవాడు. అట్టివానికి సన్నివేశమును బట్టి వికారమగు మార్పులు కలుగవు. నిర్వికారుడు గనే యుండును.

దైనందిన జీవితమున కర్మజ్ఞాన సన్యాస యోగసూత్రము లను నిత్యము అనుసరించుట వలననే యతచిత్తము కలుగును గాని కేవలము పఠనము వలన గాని, ఉభయ సంధ్యలయందు సాధనవలన గాని పట్టు చిక్కదు. కనుకనే యోగసాధన నిత్య జీవితము నందు విలీనము కావలెను. యోగసాధన వేరుగను, నిత్యజీవితము వేరుగను నిర్వర్తించు వారికి యతచిత్తము లభించదు. యతచిత్తము లభింపనిదే యోగస్థితికి అవకాశము లేదు.

అందువలన నిత్యజీవన అభ్యాసముగ యోగము సాగ వలెను. శ్రద్ధ ఉండుటచే ఆ ప్రయత్నమున నున్నవాడు క్రమముగ వృద్ధి చెందును. నాశనము పొందడు. “కల్యాణ కృత్ కశ్చిత్ దుర్గతి గచ్ఛతి". కల్యాణమగు కర్మకు పూనుకొనువానికి దుర్గతి ఎట్లు కలుగును? కలుగుటకు వీలు లేదు. అట్టివానికి ఇహమునందు గాని, అటుపైన గాని వినాశము లేదు అని తెలియుము అనుచు కృష్ణుడు నిస్సందేహముగ తెలి పెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

17 May 2021

17-MAY-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 199🌹  
2) 🌹. శివ మహా పురాణము - 399🌹 
3) 🌹 Light On The Path - 146🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -27🌹  
5) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 221🌹
6) 🌹 Osho Daily Meditations - 16🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 76 / Lalitha Sahasra Namavali - 76🌹 
8) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 76 / Sri Vishnu Sahasranama - 76🌹 
9) 🌹. జగద్గురు ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -199 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 40

*🍀 39. నిత్యజీవన యోగసాధన - పార్థా! యోగభ్రష్టునకు ఈ లోకము నందు గాని, పరలోకము నందు గాని పతనముండదని తెలియుము. మంచి పని చేయుటకై సంకల్పించినవాడు దుర్గతి చెందనేరడు. ఈ విషయమున నీకు సందేహము వలదు. సత్సంకల్పముతో కార్యముల నారంభించు వారు కార్యము లందు కృతకృత్యులు కాక పోయినను సంకల్పము శుభకర మగుటచే సృష్టియందు నాశనము చెందరు. యోగవిద్యకు కావలసిన ఏకైక సమర్థత మనో నియతి. శ్రద్ధ కలిగినను మనోనియతి లేనిచో యోగము సిద్ధించుట జరుగదు. దైనందిన జీవితమున కర్మజ్ఞాన సన్యాస యోగసూత్రము లను నిత్యము అనుసరించుట వలననే యతచిత్తము కలుగును. 🍀*

పార్థ నై వేహ నాముత్ర వినాశ స్తస్య విద్యతే |
న హి కల్యాణకృత్కశ్చిద్దుర్గతిం తాత గచ్ఛతి || 40

పార్థా! అట్టి యోగభ్రష్టునకు ఈ లోకము నందు గాని, పరలోకము నందు గాని పతనముండదని తెలియుము. మంచి పని చేయుటకై సంకల్పించినవాడు దుర్గతి చెందనేరడు. ఈ విషయమున నీకు సందేహము వలదు. శ్రీ కృష్ణుడు ఒక విశేషమగు సృష్టి రహస్యము అర్జునునకు ఆవిష్కరించినాడు. 

సత్సంకల్పముతో కార్యముల నారంభించు వారు కార్యములందు కృతకృత్యులు కాక పోయినను సంకల్పము శుభకర మగుటచే సృష్టియందు నాశనము చెందరు. అతడు కార్యము లందు నిపుణత లేక పోవుట వలన కొన్ని చిక్కు లేర్పరచు కొనినను, సంకల్పము దైవమును చేరు శుభ సంకల్పమే గనుక ఆ సంకల్ప మెరిగిన ప్రకృతి పురుషులు అతనిని ఆశీర్వదింతురే గాని, అతనిని భ్రష్టుని గావింపరు.

"కల్యాణ కృత్" అనగా కల్యాణము కలిగించు కార్యము. తనకు గాని, యితరులకు గాని చైతన్యపరమగు ఉన్నతిని గావించు కార్యము. చేయుటలో సమర్థతను బట్టి సిద్ధి యుండును. యోగవిద్యకు కావలసిన ఏకైక సమర్థత మనో నియతి. శ్రద్ధ కలిగినను మనోనియతి లేనిచో యోగము సిద్ధించుట జరుగదు. 

వైఫల్యము కలిగినపుడెల్ల మరికొంత నియతిని యోగ సాధకుడు పొందుటకు యత్నించును. అట్లు యత్నింపవలెను కూడ. యత్నించుటకు కూడ వైఫల్యము లుండ వచ్చును. కాని మరల మరల యత్నించుటలో అభ్యాసవశమున యతీంద్రియుడు కాగలడు. యతచిత్తుడు కాగలడు. క్రమముగ అభ్యాసవశముననే సమబుద్ధిని పొందగలడు. శీతోష్ణములకు, సుఖదుఃఖములకు, మానావమానములకు తీవ్రమగు బాధ పొందుట క్రమముగ తగ్గును. 

నిత్య జీవితమున అభ్యాసవశమున తగ్గునే కాని మరియొక మార్గము లేదు. నిత్య జీవితమున అనుభవ జ్ఞానము చేతను, అటు పైన అధ్యయన జ్ఞానము చేతను క్రమముగ కూటస్థుడగును కూటస్థుడగుట యనగ చంచలత్వము నుండి స్థిరత్వమునకు చేరినవాడు. అట్టివానికి సన్నివేశమును బట్టి వికారమగు మార్పులు కలుగవు. నిర్వికారుడు గనే యుండును. 

దైనందిన జీవితమున కర్మజ్ఞాన సన్యాస యోగసూత్రము లను నిత్యము అనుసరించుట వలననే యతచిత్తము కలుగును గాని కేవలము పఠనము వలన గాని, ఉభయ సంధ్యలయందు సాధనవలన గాని పట్టు చిక్కదు. కనుకనే యోగసాధన నిత్య జీవితము నందు విలీనము కావలెను. యోగసాధన వేరుగను, నిత్యజీవితము వేరుగను నిర్వర్తించు వారికి యతచిత్తము లభించదు. యతచిత్తము లభింపనిదే యోగస్థితికి అవకాశము లేదు. 

అందువలన నిత్యజీవన అభ్యాసముగ యోగము సాగ వలెను. శ్రద్ధ ఉండుటచే ఆ ప్రయత్నమున నున్నవాడు క్రమముగ వృద్ధి చెందును. నాశనము పొందడు. “కల్యాణ కృత్ కశ్చిత్ దుర్గతి గచ్ఛతి". కల్యాణమగు కర్మకు పూనుకొనువానికి దుర్గతి ఎట్లు కలుగును? కలుగుటకు వీలు లేదు. అట్టివానికి ఇహమునందు గాని, అటుపైన గాని వినాశము లేదు అని తెలియుము అనుచు కృష్ణుడు నిస్సందేహముగ తెలి పెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 399🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 19

*🌻. కామదహనము - 4 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

శంభుని ఈ మాటలను విని దేవతలు మససులో కొంత ఓదార్పును పొందిన వారై శివునకు చేతులు జోడించి శిరసులను వంచి నమస్కరించిన వారై ఇట్లు పలికిరి (45).

దేవతలిట్లు పలికిరి-

ఓ దేవదేవా! మహాదేవా! కరుణానిధీ! ప్రభూ! హరా! నీవు మన్ముథుని శీఘ్రముగా జీవింపజేసి రతీదేవి యొక్క ప్రాణములను కాపాడుము (46).

బ్రహ్మ ఇట్లు పలికెను-

దేవతల ఈ మాటలను విని ప్రసన్నుడైనట్టియు, కరుణాసముద్రుడు, సర్వేశ్వరుడునగు పరమేశ్వరుడు మరల ఇట్లు పలికెను (47).

శివుడిట్లు పలికెను-

ఓ దేవతలారా! మిక్కిలి ప్రసన్నుడనైతిని. కాముని ఈ లోపులోననే జీవింపజేసెదను. కాముడు నా గణమై నిత్యము విహరించగలడు (48). ఓ దేవతలారా! ఈ వృత్తాంతమునెవ్వరికీ చెప్పకుడు. మీ స్థలములకు వెళ్లుడు. దుఃఖములనన్నిటినీ నశింపజేసెదను (49).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇట్లు పలికి అపుడు రుద్రుడు దేవతలు స్తుతించుచుండగా అంతర్థానమయ్యెను. దేవతలందరు మిక్కిలి ప్రసన్నులైరి. కాలగతికి చకితులైరి (50). ఓ మహర్షీ! అపుడు వారు ఆమెను ఓదార్చి రుద్రుని వచనమును స్వీకరించి తమలో తాము రుద్రుని మాటలను చెప్పుకొనుచూ తమ తమ ధామములకు వెళ్లిరి (51). ఓ మహర్షీ! కాముని భార్య యగు రతి రుద్రుడు ఆదేశించిన నగరమునకు వెళ్లి అచట రుద్రుడు ఆదేశించిన కాలము కొరకు ఎదురు చూచుచుండెను (52).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత యందలి పార్వతీ ఖండములో కామనాశవర్ణనమనే పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది(19).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 146 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 To read, in the occult sense, is to read with the eyes of the spirit. To ask is to feel the hunger within – the yearning of spiritual aspiration. - 1 🌻*

 550. To read, in the occult sense, is to read with the eyes of the spirit. To ask is to feel the hunger within – the yearning of spiritual aspiration. To be able to read means having obtained the power in a small degree of gratifying that hunger.

551. The yearning of spiritual aspiration is not the mere desire to know and understand, which we might have in connection with the causal body. It belongs rather to the higher manifestation of the buddhic level, and it is only there that it can be fully satisfied. As I have explained, what happens in the buddhic vehicle, if brought down to the personality, is reflected in the astral body. People consequently often mistake an emotional outrush which belongs to the astral plane for real spiritual aspiration.

552. Those who have studied occultism ought not to make that mistake, but beginners frequently do so. We very often see examples of that during religious revivalist meetings, when quite uneducated and undeveloped people are worked up into a high condition of ecstasy for the time by the preaching of some person who is full of strong emotion himself, and therefore is able to awaken it in his hearers. Some of the great emotional preachers of the past had that power very strongly indeed. I do not for a moment say that they did not accomplish a great deal of good; no doubt they did, but most of their work was confessedly what we should call astral – it was aimed at the feelings of the people.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#LightonPath #Theosophy
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 27 🌹
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పరిస్థితులు - సాధన 🌻

సాధకుని‌ జీవితమున వివిధానేక పరిస్థితులు‌ తటస్థించుట తప్పనిసరి. సాధారణ మానవునికి ఎట్లో, సాధకునకు అంతియే. సాధకుడు తాను సాధారణ మానవుని కన్న విశిష్టుడనని భావించుట తప్పు. 

భగవంతుని పొందవలెనని తపించి యోగసాధన చేయునట్టి చాలా మందిలో వికసించని దయ,‌ శాంతము, ఓర్పు, ధైర్యము, వినయము వంటి సద్గుణములు, పెక్కుమంది‌ మనము సాధారణ మానవులనుకొనువారిలో గమనింపదగును. 

దీనికి కారణమేమి? భగవంతుని‌ గూర్చి ఉద్వేగభరితములైన తపో, పూజా, సంకీర్తన, జప, హోమాది కార్యక్రమములు సాధకుడు చేపట్టవచ్చును. కాని అతనికి తల్లిదండ్రుల యందు వినయగౌరవములు లేకపోవచ్చును. 

బాధలో ఉన్న దీనుని కన్నీటిని‌ తొలగింపు దశలో అతడు తన వంతు కర్తవ్యమును నిర్ణయింపకపోవచ్చును. అతని దృష్టిలో భగవంతుని పొందుట అనగా ఒక వస్తువునో, వ్యక్తి యొక్క స్నేహమునో, అధికారమునో పొందుటవంటిది మాత్రమే.

మానవుని ప్రజ్ఞలో మూడు కక్ష్యలు గలవు. ఉద్వేగభరిత కక్ష్య ఒకటి. తార్కిక ప్రజ్ఞా కక్ష్య ఒకటి. దివ్య ప్రేమమయానుభూతి కక్ష్య ఒకటి. 

తోటి వాడు రోగ‌బాధతో ఏడ్చుచుండగా, కొందరు ఉద్వేగభరితులై తామును విలపింతురు. దాని వలన ఉపయోగము లేదు. 

అట్లే మరికొందరు రోగార్తునకు సేవజేసిన‌ మనకేమి లభించును అని తార్కికముగా ఆలోచింతురు మొదటి కక్ష్యలో జీవించువాడు భక్తుడుగా మనకు కనపడవచ్చును ఉదారహృదయుని వలె అనిపించవచ్చును. 

రెండవ కక్ష్యలో జీవించువాడు‌ మేధావి, పండితుడు, డిగ్రీలు కలవాడు, పెద్ద వైద్యుడుగనో, ప్లీడరుగనో, అధికారిగనో ప్రసిద్ధుడై ఉండవచ్చును. కాని‌ వీరి వలన సంఘమునకు ఎట్టి‌ ప్రయోజనము లేదు. రెండవ వాని వలన కీడు కూడ వాటిల్లవచ్చును.
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 16 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 THE DIVIDED BODY 🍀*

*🕉 In a primitive society the whole body is accepted. There is no condemnation. Nothinq is lower and nothing is higher. Everything simply is. 🕉*

In accepting the body, yoga does not go far enough. It makes you very controlled, and every sort of control is a sort of repression. So you repress and then you forget all about the repression. It moves into the stomach, and near the diaphragm all those repressed things collect. The stomach is the only space where you can go on throwing things; nowhere else is there any space. 

The day your control explodes, you will feel so free, so alive. You will feel reborn, because it will connect your divided body. The diaphragm is the place where the body is divided between the upper and lower. In all the old religious teachings, the lower is condemned and the upper is made to be something high, something superior,
something holier. It is not. 

The body is one, and this bifurcation is
dangerous; it makes you split. By and by you deny many things in life. Whatever you exclude from your life will take its revenge some day. It will come as a disease. Now some medical researchers say that cancer is nothing but too much stress inside. Cancer only exists in very repressed societies. 

The more civilized and cultured a society, the more cancer is possible. It cannot exist in a primitive society, because in a primitive society the whole body is accepted. There is no condemnation. Nothing is lower and nothing is higher. Everything simply is. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 76 / Sri Lalita Sahasranamavali - Meaning - 76 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।*
*క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀*

🍀 341. క్షేత్రస్వరూపా -
 క్షేత్ర పదంచే సంకేతింపబడే వాటి స్వరూపంగా నుండునది.

🍀 342. క్షేత్రేశీ - క్షేత్రమునకు అధికారిణి.

🍀 343. క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ - 
స్థూలభాగమైన దేహమును, సూక్ష్మభాగమైన దేహిని పాలించునది లేదా రక్షించునది.

🍀 344. క్షయవృద్ధివినిర్ముక్తా -
 తరుగుదల, పెరుగుదల లేనిది.

🍀 345. క్షేత్రపాల సమర్చితా - క్షేత్రపాలకులచే చక్కగా అర్చింపబడునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 76 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 76. kṣetrasvarūpā kṣetreśī kṣetra-kṣetrajña-pālinī |*
*kṣayavṛddhi-vinirmuktā kṣetrapāla-samarcitā || 76 || 🌻*

🌻 341 ) Kshetra swaroopa -   
She who is personification of the Kshetra or body

🌻 342 ) Kshetresi -   
She who is goddess of bodies

🌻 343 ) Kshethra kshethragna palini -   
She who looks after bodies and their lord

🌻 344 ) Kshaya vridhi nirmuktha -   
She who neither decreases or increases

🌻 345 ) Kshetra pala samarchitha - She who is worshipped by those who look after bodies

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 76 / Sri Vishnu Sahasra Namavali - 76 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*మూల నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం*

*🍀 76. భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయోనలః|*
*దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో థాపరాజితః|| 76. 🍀*

🍀 708. భూతవాసః - 
సర్వభూతములందు ఆత్మస్వరూపునిగా వశించువాడు.

🍀 709. వాసుదేవః - 
మాయాశక్తితో అంతటా నుండువాడు, వసుదేవుని కుమారుడు.

🍀 710. సర్వాసు నిలయః - 
సమస్త జీవులకు, ప్రాణులకు నిలయమైనవాడు.

🍀 711. అనలః - 
అపరిమిత శక్తి గలవాడు.

🍀 712. దర్పహా - 
దుష్టచిత్తుల గర్వమణుచువాడు.

🍀 713. దర్పదః - 
ధర్మమార్గమున చరించువారికి దర్పము నొసంగువాడు.

🍀 714. దృప్తః - 
సదా ఆత్మానందముతో నుండువాడు.

🍀 715. దుర్థరః - 
ధ్యానించుటకు, బంధించుటకు సులభసాధ్యము కానివాడు.

🍀 716. అపరాజితః - 
అపజయము పొందనివాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 76 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Moola 4th Padam*

*🌻 bhūtāvāsō vāsudevaḥ sarvāsunilayōnalaḥ |*
*darpahā darpadō dṛptō durdharōthāparājitaḥ || 76 || 🌻*

🌻 708. Bhūtāvāsaḥ: 
He in whom all the beings dwell.

🌻 709. Vāsudevaḥ: 
The Divinity who covers the whole universe by Maya.

🌻 710. Sarvāsunilayaḥ: 
He in whose form as the Jiva all the vital energy or Prana of all living beings dissolves.

🌻 711. Analaḥ: 
One whose wealth or power has no limits.

🌻 712. Darpahā: 
One who puts down the pride of persons who walk along the unrighteous path.

🌻 713. Darpadaḥ: 
One who endows those who walk the path of righteousness with a sense of self-respect regarding their way of life.

🌻 714. Dṛptaḥ: 
One who is ever satisfied by the enjoyment of His own inherent bliss.

🌻 715. Durdharaḥ: 
One who is very difficult to be borne orcontained in the heart in meditation.

🌻 716. Aparājitaḥ: 
One who is never conquered by internal enemies like attachment and by external enemies like Asuras.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. జగద్గురు ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర!! 🌹*