🍀🌹 27, AUGUST 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹🍀1) 🌹 ఆత్మ-సాక్షాత్కార యాత్రకు విశ్వాసం, సాధన, మరియు అంతర్యామి కాంతి యొక్క మార్గదర్శకత్వం అవసరం. 🌹
2) 🌹 Self-Realization Journey requires Faith, Practice, and the Guidance of the Inner light. 🌹
3) 🌹 आत्म-साक्षात्कार की यात्रा के लिए विश्वास, अभ्यास, और अंतःप्रकाश के मार्गदर्शन की आवश्यकता होती है। 🌹
4) 🌹. శ్రీమద్భగవద్గీత - 571 / Bhagavad-Gita - 571 🌹
🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 20 / Chapter 15 - Purushothama Yoga - 20 🌴
5) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 968 / Vishnu Sahasranama Contemplation - 968 🌹
🌻 968. తారః, तारः, Tāraḥ 🌻
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 556 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 556 - 2 🌹
🌻 556. ‘కాత్యాయనీ’ - 2 / 556. 'Katyayani' - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 ఆత్మ-సాక్షాత్కార యాత్రకు విశ్వాసం, సాధన, మరియు అంతర్యామి కాంతి యొక్క మార్గదర్శకత్వం అవసరం. 🌹*
*✍️ ప్రసాద్ భరద్వాజ*
*ఆత్మ సాక్షాత్కార యాత్రను విశ్వాసం, సాధన, మరియు అంతర్యామి కాంతి యొక్క మార్గదర్శకత్వంతో ప్రారంభించండి. బ్రహ్మానంద యొక్క ప్రకాశవంతమైన కాంతి దేవుని సన్నిధిని మన లోపల ఎలా వెలుగులోకి తెస్తుంది మరియు శాశ్వత ఆనందానికి దారి తీస్తుందో తెలుసుకోండి. ఆత్మజ్ఞానం అజ్ఞానాన్ని ఎలా నశింప జేస్తుందో, ఆత్మను విముక్తి చేస్తుందో మరియు మన దివ్య స్వరూపంతో మనల్ని ఎలా కలుపుతుందో గ్రహించండి. ఈ సత్యాన్ని స్వీకరించి, సమస్త బ్రహ్మాండంతో ఐక్యతను, అపరిమిత శాంతిని, ఆనందాన్ని అనుభవించండి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Self-Realization Journey requires Faith, Practice, and the Guidance of the Inner light. 🌹*
*✍️ Prasad Bharadwaj*
*Embark on the journey of self-realization through faith, practice, and the inner light's guidance. Discover how the radiant light of Brahmaananda reveals God's presence within and leads to everlasting joy. Understand how self-knowledge dispels ignorance, liberates the soul, and connects us with our divine nature. Embrace this truth to experience infinite peace, bliss, and oneness with the universe.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 आत्म-साक्षात्कार की यात्रा के लिए विश्वास, अभ्यास, और अंतःप्रकाश के मार्गदर्शन की आवश्यकता होती है। 🌹*
*✍️ प्रसाद भारद्वाज*
*विश्वास, अभ्यास और अंतःप्रकाश के मार्गदर्शन से आत्म-साक्षात्कार की यात्रा शुरू करें। जानें कि ब्रह्मानंद की प्रकाशमय ज्योति कैसे हमारे भीतर परमात्मा की उपस्थिति को प्रकट करती है और अनंत आनंद की ओर ले जाती है। समझें कि आत्म-ज्ञान अज्ञानता को कैसे नष्ट करता है, आत्मा को मुक्त करता है और हमें हमारे दिव्य स्वरूप से कैसे जोड़ता है। इस सत्य को अपनाएं और ब्रह्मांड के साथ एकता, अनंत शांति, और आनंद का अनुभव करें।*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 571 / Bhagavad-Gita - 571 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 20 🌴*
*20. ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయానఘ |*
*ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్క్రుత కృత్యశ్చ భారత ||*
*🌷. తాత్పర్యం : ఓ పాపరహితుడా! వేదములందలి అత్యంత రహస్యమైన ఈ భాగమును నీకిప్పుడు నేను వెల్లడించితిని. దీనిని అవగాహన చేసికొనినవాడు బుద్ధిమంతుడు కాగలడు. అతని ప్రయత్నములు పూర్ణవిజయమును బడయగలవు.*
*🌷. భాష్యము : సమస్త శాస్త్రముల సారాంశమిదియేనని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట స్పష్టముగా వివరించుచున్నాడు. అతడు తెలిపిన ఈ విషయములను ప్రతియెక్కరు యథాతథముగా స్వీకరింప వలసి యున్నది. ఆ విధముగా మనుజుడు బుద్ధిమంతుడును, ఆధ్యాత్మికజ్ఞానము నందు పూర్ణుడును కాగలడు. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని ఈ తత్త్వమును అవగాహనము చేసికొని, అతని భక్తియోగమున నిలుచుట ద్వారా ప్రతియొక్కరు త్రిగుణకల్మషము నుండి బయటపడగలరు. వాస్తవమునకు భక్తియోగమనునది ఆధ్యాత్మికావగాహన విధానము. భక్తియుక్తసేవ యున్న చోట భౌతికల్మషము నిలువలేదు. ఆధ్యాత్మికత్వమును కూడియుండుట వలన భక్తియుక్తసేవ మరియు భగవానుడు అనెడి అంశముల నడుమ భేదముండదు.*
*వాస్తవమునకు శుద్ధభక్తి శ్రీకృష్ణభగవానుని అంతరంగశక్తి యొక్క ఆధ్వర్యముననే జరుగును. భగవానుడు సూర్యుడైనచో అజ్ఞానము అంధకారము వంటిది. సూర్యుడున్నచోట అంధకారమనెడి ప్రశ్నయే ఉదయించనట్లు, ప్రామాణికుడగు ఆధ్యాత్మికగురువు నేతృత్వమున ఒనరింపబడు భక్తియుతసేవ యున్నచోట అజ్ఞానమనెడి ప్రశ్నయే కలుగదు. శ్రీమద్భగవద్గీత యందలి “పురుషోత్తమ యోగము” అను పంచదశాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 571 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 15 - Purushothama Yoga - 20 🌴*
*20. iti guhya-tamaṁ śāstram idam uktaṁ mayānagha*
*etad buddhvā buddhimān syāt kṛta-kṛtyaś ca bhārata*
*🌷 Translation : This is the most confidential part of the Vedic scriptures, O sinless one, and it is disclosed now by Me. Whoever understands this will become wise, and his endeavors will know perfection.*
*🌹 Purport : The Lord clearly explains here that this is the substance of all revealed scriptures. And one should understand this as it is given by the Supreme Personality of Godhead. Thus one will become intelligent and perfect in transcendental knowledge. In other words, by understanding this philosophy of the Supreme Personality of Godhead and engaging in His transcendental service, everyone can become freed from all contaminations of the modes of material nature. Devotional service is a process of spiritual understanding.*
*Wherever devotional service exists, the material contamination cannot coexist. Devotional service to the Lord and the Lord Himself are one and the same because they are spiritual; devotional service takes place within the internal energy of the Supreme Lord. The Lord is said to be the sun, and ignorance is called darkness. Where the sun is present, there is no question of darkness. Therefore, whenever devotional service is present under the proper guidance of a bona fide spiritual master, there is no question of ignorance. Thus end the Bhaktivedanta Purports to the Fifteenth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Puruṣottama-yoga, the Yoga of the Supreme Person.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 968 / Vishnu Sahasranama Contemplation - 968 🌹*
*🌻 968. తారః, तारः, Tāraḥ 🌻*
*ఓం తారాయ నమః | ॐ ताराय नमः | OM Tārāya namaḥ*
*సంసారసాగరం విష్ణుస్తారయన్ తార ఉచ్యతే ।*
*ప్రణవప్రతిపాద్యత్వాద్ వా తార ఇతి కీర్త్యతే ॥*
*తన అనుగ్రహముతో జీవులను సంసార సాగరమునుండి దాటించును. లేదా తారః అనునది ప్రణవమునకు మరియొకపేరు. పరమాత్మ ప్రణవ రూపుడును, ప్రణవముచే చెప్పబడువాడును కనుక తారః అని చెప్పబడును.*
338. తారః, तारः, Tāraḥ
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 968🌹*
*🌻 968. Tāraḥ 🌻*
*OM Tārāya namaḥ*
संसारसागरं विष्णुस्तारयन् तार उच्यते ।
प्रणवप्रतिपाद्यत्वाद् वा तार इति कीर्त्यते ॥
*Saṃsārasāgaraṃ viṣṇustārayan tāra ucyate,*
*Praṇavapratipādyatvād vā tāra iti kīrtyate.*
*By His grace He helps devotees cross the ocean of worldly existence. Or Tāraḥ also means Praṇava i.e., Oṃkāra. Since the Lord is Praṇava Himself and is also indicated by it, Tāraḥ is an apt name.*
338. తారః, तारः, Tāraḥ
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥
భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥
Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 556 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 556 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।*
*కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀*
*🌻 556. ‘కాత్యాయనీ’ - 2 🌻*
*శ్రీమాత చైతన్యమే సృష్టికి మూలము. సర్వము నందలి కదలిక, వెలుగు. ఆమెయే అనేకానేక రూపములు ధరించి అనేకానేక శక్తులుగ వ్యాపించును. సృష్టి అంతయూ ఆమె చైతన్యజాలమే. శక్తి జాలమే. కటి ప్రదేశమున అత్యంత కోమలముగ, సున్నితముగ వుండు టకు ఇచ్చగించునది శ్రీమాత. కటి ప్రదేశమున ఓడ్యాణ పీఠమందు కాత్యాయనిగా శ్రీమాత ప్రసిద్ధి చెందినది. కటి ప్రదేశమును సున్నితముగ నుంచుకొనుట యోగమునందు ప్రధానముగ తెలుపబడినది. దేహబంధము నుండి కాత్యాయనీ దేవి విమోచనము కలిగించగల శక్తి స్వరూపిణి.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 556 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 113. Agraganya chintyarupa kalikalmasha nashini*
*katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻*
*🌻 556. 'Katyayani' - 2 🌻*
*Sri Mata's consciousness is the source of all creation, the movement and light within everything. She manifests in countless forms and spreads through various powers. The entire creation is her web of consciousness, her web of energy. Sri Mata is known for her gentleness and delicacy, especially in the waist area, where she is revered as Katyayani at the place of Odyana or bejeweled belt. In yoga, maintaining delicacy in this area is considered important. Katyayani Devi is the embodiment of the energy that can liberate one from the bondage of the body.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj