తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 5 - పాశురాలు 9 & 10 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 5 - Pasuras 9 & 10



https://youtu.be/gkHMozj0JrQ


🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 5 - పాశురాలు 9 & 10 Tiruppavai Pasuras Bhavartha Gita Series 5 - Pasuras 9 & 10 🌹

🍀 9వ పాశురం – స్నేహపూర్వక మేల్కొలుపు గీతం, 10వ పాశురం – యోగనిద్రపై మధుర చమత్కార గీతం. 🍀

తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 9వ పాశురం ముఖ్య ఉద్దేశం, శ్రీకృష్ణుడి సుప్రభాత సేవకు, గోపికలను, వారి తల్లిదండ్రులను మేల్కొల్పడం. ఈ పాశురంలో ఆండాళ్ భగవంతుడితో ఉన్న అనుబంధాన్ని, భక్తిని వివరిస్తుంది. 10వ పాశురంలో గోదాదేవి, కృష్ణుడిని పొందాలనే తన కోరికను, తోటి గోపికల ఆలస్యంతో విసుగు చెంది, తనను నిందించిన ఒక గోపికను మేల్కొన లేదేమని ప్రశ్నిస్తూ, చతురతతో ఉత్తేజ పరిచే ప్రయత్నంగా కొనసాగుతుంది. 🍀

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


8వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 8th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita Series



https://youtube.com/shorts/Nk1q0LPSEMU


🌹 8వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 8th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita Series 🌹

🍀 8వ పాశురం – ఉషోదయ జాగరణ గీతం 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 తిరుప్పావై ఎనిమిదవ పాశురంలో మనం అందరం కలిసి వెళ్ళడం వల్ల కృష్ణుడి అనుగ్రహం త్వరగా లభిస్తుందని, సమూహంగా వెళ్లి భగవంతుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలను, మరియు భక్తిలో ఐకమత్యం యొక్క ప్రాముఖ్యతను గోదాదేవి నొక్కి చెబుతుంది. 🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹


హనుమంతుడు సతీసమేతంగా Lord Hanuman with his consort



🌹 హనుమంతుడు సతీసమేతంగా ఉన్న ఆలయం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉందో తెలుసా? దాని స్థల పురాణం.🌹

శుభ మంగళవారం అందరికి

ప్రసాద్ భరద్వాజ




🌹 Do you know where the temple with Lord Hanuman along with his consort is located in the Telugu states? Its local legend. 🌹

Happy Tuesday to everyone

Prasad Bharadwaj




శ్రీరాముడి వీరభక్తుడు అయినా హనుమాన్ దేవాలయం ప్రతి గ్రామంలో తప్పనిసరిగా కనిపిస్తుంది. ధైర్యశాలి, దుష్టశక్తులను పారద్రోలే ఆంజనేయస్వామి అంటే చాలామందికి ఇష్టమే.

అందుకే ప్రతిరోజు ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే పనులు ప్రారంభించే వారు చాలామంది ఉన్నారు. అయితే ఏ దేవాలయంలోనైనా హనుమాన్ ఒక్కడే కనిపిస్తాడు. శివుడు, విష్ణువులు సతీసమేతంగా దర్శనం ఇవ్వగా.. హనుమాన్ మాత్రం ఒకరే దేవాలయంలో కొలువై ఉంటారు. అందుకే ఆ స్వామిని ఆజన్మ బ్రహ్మచారి అని అంటారు. అయితే హనుమాన్ బ్రహ్మచారి కాదు అని ఆ స్వామివారికి వివాహం జరిగిందని కొన్ని పురాణాల ప్రకారం తెలుస్తోంది. అంతేకాకుండా సతీ సమేతంగా హనుమాన్ ఓ ఆలయంలో కొలువై యున్నాడు.

హనుమంతుడు పక్కనే ఉంటే ధైర్యం మన చెంత ఉన్నట్లే. స్వయం శక్తితో శత్రువులను నాశనం చేసే బలశాలి అయినా ఆంజనేయ స్వామికి గురువు సూర్యుడు అన్న విషయం చాలామందికి తెలిసిందే. అయితే హనుమంతుడు ఆకాశంలో తిరుగుతూ సూర్యుడి వద్ద వేదాలన్నింటినీ నేర్చుకుంటాడు. తొమ్మిది రకాల వ్యాకరణాలను నేర్చుకోవాలన్న హనుమంతుడి కోరిక ఎనిమిది పూర్తి అయిన తర్వాత ఒక సంకటం వద్ద ఆగిపోతుంది. తొమ్మిదో వ్యాకరణం పూర్తి చేయాలంటే వివాహితుడై ఉండాలి. కానీ ఆంజనేయ స్వామి మాత్రం బ్రహ్మచారిగానే ఉండిపోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో త్రిమూర్తులు సూర్యభగవానుడికి ఒక మార్గం చెబుతారు.

త్రిమూర్తుల ఆలోచన మేరకు సూర్యుడు తన కిరణాల నుంచి సువర్చల అనే అమ్మాయిని సృష్టిస్తాడు. ఈ అమ్మాయిని హనుమంతుడు పెళ్లి చేసుకుంటాడు. వీరి వివాహం జేష్ట శుద్ధ దశమి రోజు జరిగినట్లు పరాశర సంహితలో తెలుపుతున్నాయి. అయితే ఈ అమ్మాయికి భౌతిక రూపం ఉండదు. కేవలం తేజస్సు మాత్రమే ఉంటుంది. అందుకే ఆంజనేయస్వామి ఎప్పటికీ బ్రహ్మచారిగానే ఉండిపోతాడు. సువర్చలను పెళ్లి చేసుకున్న తర్వాత హనుమంతుడు తొమ్మిదో వ్యాకరణం పూర్తిచేసి తపస్సుకు వెళ్లిపోతాడు. అయితే హనుమంతుడు సతీసమేతుడు అయినందున కొన్ని ఆలయాల్లో ఆంజనేయస్వామి కళ్యాణం జరిపిస్తారు.

హనుమంతుడు సతీసమేతంగా దర్శనం ఇచ్చే ఆలయం తెలంగాణలో ఒకటి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో శ్రీ సువర్చల సహిత అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమంతుడు సతీసమేతంగా దర్శనం ఇస్తాడు. ఈ ఆలయాన్ని 2006 సంవత్సరంలో నిర్మించారు. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల వారు మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య తగాదాలు ఎక్కువగా ఉంటే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే పరిష్కారం అవుతుందని కొందరు నమ్ముతారు.

🌹🌹🌹🌹🌹