శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 353-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 353-2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 353-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 353-2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।
సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀
🌻 353-2. ''భక్తిమత్కల్పలతికా'🌻
భక్తి యందు క్రమము, అక్రమము అను రెండు విధానము లున్నవి. క్రమము లేని ఆరాధన పూర్ణభక్తి కాజాలదు. మంత్రహీనత, క్రియాహీనత, భక్తిహీనతలతో ఆరాధించు భక్తులు కోకొల్లలు. వీరు అసంపూర్ణముగనే జీవించు చుందురు. ఇట్టి వారికి శ్రీమాతయే సంకల్ప రూపమున క్రమమును నేర్పును. క్రమమును నేర్చిన భక్తులు క్రమముగ పూర్ణు లగుదురు. భగవద్గీత యందు కూడ ఈ విషయమే తెలుపబడినది.
శాస్త్రము విధించిన విధానము ననుసరించి పూజించు వారికి సాన్నిధ్యము లభించునని, శాస్త్రము నుల్లంఘించు వారికి రజస్సు తమస్సు దోషము లంటి పూర్ణత్వము కలుగదని తెలుపబడినది. ఆరాధనకు సదాచారము, సంప్రదాయబద్ధత ప్రధానము. అవి అవసరము లేదనుట మెట్ట వేదాంతము. చిత్తశుద్ధి కలుగు వరకు విధానము ప్రధానము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 353-2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani
Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻
🌻 353-2. Bhaktimat-kalpa-latikā भक्तिमत्-कल्प-लतिका 🌻
The final liberation means no re-birth and mokṣa means after exhausting all good karma-s in the Heaven (the heaven can be explained as a place where certain souls are rested for some period of time). Other souls are reborn immediately after leaving a body. The soul reaching the Heaven, does not attain perfection to become eligible to get liberated. Such final salvation is possible only with Her grace. This is the inherent meaning of this nāma.
Kṛṣṇa says (Bhagavad Gīta XV.10) “The yogis striving for liberation see Him existing in themselves; but those who are un-purified and undisciplined are unable to perceive Him even when they struggle to do so.”
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
05 Mar 2022
ఓషో రోజువారీ ధ్యానాలు - 148. ఉన్నతమైన దాన్ని ప్రేమించండి / Osho Daily Meditations - 148. LOVE SOMETHING BIGGER
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 148 / Osho Daily Meditations - 148 🌹
📚. ప్రసాద్ భరద్వాజ్
🍀 148. ఉన్నతమైన దాన్ని ప్రేమించండి 🍀
🕉. ఉన్నతమైన దాన్ని, పెద్దదాన్ని, అందులో మిమ్మల్ని మీరు కోల్పోయే దాన్ని ప్రేమించండి. మీరు దానిని స్వాధీనం చేసుకోవచ్చు, కానీ మీరు దానిని కలిగి ఉండలేరు. 🕉
ప్రేమ గొప్ప ఇబ్బందులను సృష్టిస్తుంది మరియు గొప్ప ఆనందాన్ని కూడా సృష్టిస్తుంది. ఒకరు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే ప్రేమ మన ప్రాథమిక రసాయన శాస్త్రం. ఒక వ్యక్తి తన ప్రేమ శక్తి గురించి అప్రమత్తంగా ఉంటే, అప్పుడు ప్రతిదీ సరిగ్గా జరుగుతుంది. ఎల్లప్పుడూ మీ కంటే ఉన్నతమైన దాన్ని ప్రేమించండి మరియు మీరు ఎప్పటికీ ఇబ్బందుల్లో ఉండరు; ఎల్లప్పుడూ మీ కంటే పెద్దదాన్ని ప్రేమించండి. ప్రజలు తమ కంటే తక్కువ, తమకంటే చిన్నదాన్ని ఇష్టపడతారు.
మీరు చిన్నదానిని నియంత్రించవచ్చు, మీరు చిన్నదానిపై ఆధిపత్యం చెలాయించవచ్చు మరియు తక్కువ వారితో మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు, ఎందుకంటే ఇది మిమ్మల్ని ఉన్నతంగా కనిపించేలా చేస్తుంది-అప్పుడు అహం నెరవేరుతుంది. మరియు మీరు మీ ప్రేమ నుండి అహాన్ని సృష్టించడం ప్రారంభించిన తర్వాత, మీరు నరకానికి కట్టుబడి ఉంటారు. ఉన్నతమైనదాన్ని, పెద్దదాన్ని ప్రేమించండి, దానిలో మీరు కోల్పోతారు మరియు మీరు నియంత్రించలేరు; మీరు దాని ద్వారా మాత్రమే స్వాధీనం చేసుకోగలరు, కానీ మీరు దానిని కలిగి ఉండలేరు. అప్పుడు అహంకారము నశిస్తుంది. అహంకారం లేని ప్రేమే ప్రార్ధన..
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 148 🌹
📚. Prasad Bharadwaj
🍀 148. LOVE SOMETHING BIGGER 🍀
🕉 Love something higher, something bigger, something in which you will be lost. you can be possessed by it, but you cannot possess it. 🕉
Love can create great trouble and it can also create great joy. One has to be very, very alert, because love is our basic chemistry. If one is alert about one's love energy, then everything goes right. Always love something higher than yourself, and you will never be in trouble; always love something bigger than yourself. People tend to love something lower than themselves, something smaller than themselves.
You can control the smaller, you can dominate the smaller, and you can feel very good with the inferior, because it makes you look superior-then the ego is fulfilled. And once you start creating ego out of your love, then you are bound for hell. Love something higher, something bigger, something in which you will be lost and that you cannot control; you can only be possessed by it, but you cannot possess it. Then the ego disappears, and when love is without ego, it is prayer..
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
05 Mar 2022
మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 159
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 159 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. సంస్కృతి-సమానత - 1 🌻
సమానత అంటే అన్ని జాతులందు, అన్ని సంస్కృతులందు గల ఏకత్వాన్ని దర్శించి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే పనిని త్రికరణ శుద్ధిగా చేయడమేగాని మన సంస్కృతిని, సంస్కారాన్ని వదులుకొనడం కాదు. మన దేశము, మన సంస్కృతి యొక్క విశిష్టతను గుర్తించడం, మెచ్చుకొనడం సమానతకు భంగకరం (anti-secular) అని భావించడం హాస్యాస్పదం.
అనాది కాలం నుండి ఇతర ఖండాలలో మన భారతీయ సంస్కృతికి ఎంతో పేరు, ప్రతిష్ఠలున్నాయి. ఈనాటికి ఎందరో పాశ్చాత్య ఖండవాసులు భారతదేశం రావడం, ఇక్కడి సనాతన ధర్మాన్ని అధ్యయనం చేసి ఆచరిచడం అదృష్టంగా భావిస్తారు. నేడు ప్రపంచ దేశాల మానవులను పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం ఈ పుణ్యభూమి యందే దొరుకుతుందనేది నిస్సందేహము. అయితే మనదేశం ప్రస్తుతం అనేక సమస్యలలో కూరుకుని ఉన్నది కదా అని సందేహం రావొచ్చు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి.
....✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
05 Mar 2022
శ్రీ శివ మహా పురాణము - 529 / Sri Siva Maha Purana - 529
🌹 . శ్రీ శివ మహా పురాణము - 529 / Sri Siva Maha Purana - 529 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 46
🌻. శివుడు పెళ్లికొడుకు - 2 🌻
ఆ మేన తన భాగ్యమును, పార్వతి సౌభాగ్యమును, హిమవంతుని, మరియు తన కులమును కొనియాడెను. ఆమె తాను కృతార్థురాలైనట్లు భావించి గొప్ప ఆనందమును పొందెను (12). వికసించిన ముఖము గల ఆ మేన అల్లుని ఆనందంముతో పరికిస్తూ అచట ఆయనకు నీరాజనము నిచ్చెను (13).
పార్వతి పలుకులను స్మరించుకొని విస్మయమును పొందిన మేన ఆనందముతో వికసించిన పద్మము వంటి ముఖము గలదై మనసులో ఇట్లు తలపోసెను (14). పార్వతి పూర్వము అచట నాతో చెప్పిన సౌందర్యము కంటె అధికమగు సౌందర్యము మహేశ్వరుని యందు కనబడుచున్నది (15).
ఇప్పటి మహేశ్వరుని సొగసును వర్ణించుట సంభవము కాదు. మేన ఈ తీరున విస్మయమును పొంది తన గృహమునకు వెళ్లెను (16). పార్వతి ధన్యురాలు, ధన్యురాలని స్త్రీలు కొనియాడిరి. దుర్గ, భగవతి ఈమె అని కొందరు కన్యకలు పలికిరి (17).
'ఇటువంటి వరుడు మాకెన్నడునూ కానరాలేదు. మేము ధ్యానములోనైననూ ఇట్టి వరుని చూడలేదు. పార్వతి ధన్యురాలు' అని కొందరు కన్యలు మేనాదేవితో చెప్పిరి (18). గంధర్వ శ్రేష్ఠులు గానము చేయగా, అప్సరసల గణములు నర్తించెను. శంకరుని రూపమును చూసి దేవతలందరు మిక్కిలి ఆనందించిరి (19).
వాద్యగాండ్రు వివిధ వాద్యములను వివిధ రకముల నైపుణ్యముతో మధురముగా శ్రద్ధతో మ్రోగించిరి (20). ఆనందముతో నిండిన హిమవంతుడు మరియు మేన స్త్రీలందరితో గూడి మహోత్సాహముతో ద్వారము వద్ద జరిగే ఆచారముననుష్ఠించిరి (21).
మేన పార్వతీ పరమేశ్వరుల పేర్లను అడిగి చెప్పించెను. ఆమె ఆనందముతో తన గృహమునకు వెళ్ళెను. శివుడు గణములతో దేవతలతో గూడి తనకు వినయముగా నిర్దేశింపబడిన స్థానమునకు వెళ్ళెను (22). ఇంతలో హిమవంతుని అంతః పుర పరిచారికలు కులదేవతను ఆరాధించుటకై దుర్గను తీసుకొని నగర బహిః స్థానమునకు వెళ్ళిరి (23).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 529 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 46 🌴
🌻 The arrival of the bridegroom - 2 🌻
12. She praised her good luck. She congratulated Pārvatī, the mountain and his entire family. She congratulated herself. She rejoiced again and again.
13. Gazing at her son-in-law joyously with beaming face, the chaste lady performed the Nīrājana rite.
14. Remembering what Pārvatī had told her, Menā was agreeably surprised and with a beaming lotus-like face full of delight she muttered to herself.
15. “I see the beauty of the great lord far in excess of what Pārvatī had told me before.
16. Śiva’s loveliness cannot be expressed adequately now.” In the same state of pleasant surprise she went in.
17. The young ladies proclaimed that the daughter of the mountain was fortunate. Some girls said that she had become a goddess.
18. Some said—“Such a bridegroom has never been seen, not to our knowledge.” Some girls said to Menā—“Pārvatī is really blessed.”
19. The chief of Gandharvas sang songs. The celestial damsels danced. On seeing Śiva’s lovely form, the gods were delighted.
20. The instrument players played on musical instruments in sweet tones showing their diverse skill.
21. The delighted Himācala too carried out the customary rites of reception at the entrance. Menā also jubilantly took part in the same along with all the womenfolk.
22. She made formal inquiries about the health of the bridegroom and gladly went into the house. Śiva went to the apartments assigned to Him along with the Gaṇas and the gods.
23. In the meantime the servant-maids in the harem of the mountain took Pārvatī out in order to worship the tutelar family deity.
Continues....
🌹🌹🌹🌹🌹
05 Mar 2022
గీతోపనిషత్తు -331
🌹. గీతోపనిషత్తు -331 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 27-1 📚
🍀 27-1. ఈశ్వరార్పణము - సమస్తమును ఈశ్వరుడే నడిపించు చున్నాడు. అతడే కర్త, అతడే భోక్త కూడాను. అతని ప్రేరణ వలననే గ్రహమండలములు, సూర్య మండలములు కూడ వర్తించు చున్నవి. ఈశ్వర సంకల్పము లేనిదే చీమ కూడ కదలదు. కార్యములందు సిద్ధి, అసిద్ధి కూడ ఈశ్వరాధీనమై యున్నవి. ఇది భగవంతుని యొక్క నిర్దిష్టమగు సూచన. ఈశ్వరార్పణ బుద్ధితో జీవించమని ఈ సూచన సారాంశము. 🍀
27. యత్కరోషి యదశ్నాసి యజ్జు హోషి దదాసి యత్ |
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ ||
తాత్పర్యము : ఏ పని చేసినను, ఏమి భుజించినను, ఎట్టి హోమములు గావించినను, ఎట్టి దానము లొనర్చినను, ఎట్టి తపస్సులు చేసినను నా కర్పణము చేయుము.
వివరణము : ఇది భగవంతుని యొక్క నిర్దిష్టమగు సూచన. ఈశ్వరార్పణ బుద్ధితో జీవించమని ఈ సూచన సారాంశము. సమస్తమును ఈశ్వరుడే నడిపించు చున్నాడు. అతడే కర్త, అతడే భోక్త కూడాను. అతని ప్రేరణ వలననే గ్రహమండలములు, సూర్య మండలములు కూడ వర్తించు చున్నవి. ఈశ్వర సంకల్పము లేనిదే చీమ కూడ కదలదు. కార్యములందు సిద్ధి, అసిద్ధి కూడ ఈశ్వరాధీనమై యున్నవి. కొన్ని పనులు జరుగుచుండును. కొన్ని పనులు ఎంత ప్రయత్నించినను జరుగవు. అట్లే కొన్నిమార్లు ఫలము లభించును. కొన్నిమార్లు లభింపదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకముగ నుండును.
ఒక రోజు పూజ, ధ్యానము బాగా జరిగినదనిపించును. మరునాడట్లనిపించదు. జీవితమందలి అన్ని విషయము లందు వైవిధ్యము తారసిల్లు చుండును. ఒకనాడు ప్రేమించినవారు మరొకనాడు తటస్టులై యుండవచ్చును. పెంచిన పిల్లలే ఎదురు తిరగవచ్చును. పెంపుడు కుక్కయే కరవవచ్చును. ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎట్లు జరుగునో ఎవ్వరునూ ఊహించలేరు. ఓడలు బండ్లగుట, బండ్లు ఓడలగుట, ధనవంతుడు దరిద్రుడగుట, విద్యాహీనులు విద్యా వంతులను శాసించుట, మూర్ఖులు ప్రభువులగుట, ఆరోగ్య వంతులు అకస్మాత్తుగ తీరని అనారోగ్యమునకు గురియగుట ఇత్యాదివి జరుగుచు నుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
05 Mar 2022
05 - MARCH - 2022 శనివారం MESSAGES
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 05, శనివారం, మార్చి 2022 స్థిర వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 27-1- 331 - ఈశ్వరార్పణము 🌹
3) 🌹. శివ మహా పురాణము - 529 / Siva Maha Purana - 529 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -159🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 147 / Osho Daily Meditations - 147 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 353-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 353-2 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 05, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు. 🌻*
*🍀. శ్రీ వేంకటేశ అష్టకం-4 🍀*
7. భూతావాసో గిరివాసః శ్రీనివాసః శ్రియః పతిః |
అచ్యుతానంత గోవిందో విష్ణుర్వేంకట నాయకః
8. సర్వదేవైకశరణం సర్వదేవైక దైవతమ్ |
సమస్తదేవకవచం సర్వదేవ శిఖామణిః
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మీకు మీ జీవితంలో ఏది లభించినా దానిని జీర్ణం చేసుకోవడం నేర్చుకోండి. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: శుక్ల తదియ 20:37:39 వరకు
తదుపరి శుక్ల చవితి
నక్షత్రం: రేవతి 26:30:52 వరకు తదుపరి అశ్విని
యోగం: శుక్ల 24:34:09 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: తైతిల 08:37:02 వరకు
సూర్యోదయం: 06:31:46
సూర్యాస్తమయం: 18:23:36
చంద్రోదయం: 08:19:52
చంద్రాస్తమయం: 20:51:41
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: మీనం
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 08:06:40 - 08:54:08
రాహు కాలం: 09:29:43 - 10:58:42
గుళిక కాలం: 06:31:46 - 08:00:44
యమ గండం: 13:56:39 - 15:25:38
అభిజిత్ ముహూర్తం: 12:04 - 12:50
అమృత కాలం: -
ధాత్రి యోగం - కార్య జయం 26:30:52
వరకు తదుపరి సౌమ్య యోగం -
సర్వ సౌఖ్యం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -331 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 27-1 📚*
*🍀 27-1. ఈశ్వరార్పణము - సమస్తమును ఈశ్వరుడే నడిపించు చున్నాడు. అతడే కర్త, అతడే భోక్త కూడాను. అతని ప్రేరణ వలననే గ్రహమండలములు, సూర్య మండలములు కూడ వర్తించు చున్నవి. ఈశ్వర సంకల్పము లేనిదే చీమ కూడ కదలదు. కార్యములందు సిద్ధి, అసిద్ధి కూడ ఈశ్వరాధీనమై యున్నవి. ఇది భగవంతుని యొక్క నిర్దిష్టమగు సూచన. ఈశ్వరార్పణ బుద్ధితో జీవించమని ఈ సూచన సారాంశము. 🍀*
*27. యత్కరోషి యదశ్నాసి యజ్జు హోషి దదాసి యత్ |*
*యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ ||*
*తాత్పర్యము : ఏ పని చేసినను, ఏమి భుజించినను, ఎట్టి హోమములు గావించినను, ఎట్టి దానము లొనర్చినను, ఎట్టి తపస్సులు చేసినను నా కర్పణము చేయుము.*
*వివరణము : ఇది భగవంతుని యొక్క నిర్దిష్టమగు సూచన. ఈశ్వరార్పణ బుద్ధితో జీవించమని ఈ సూచన సారాంశము. సమస్తమును ఈశ్వరుడే నడిపించు చున్నాడు. అతడే కర్త, అతడే భోక్త కూడాను. అతని ప్రేరణ వలననే గ్రహమండలములు, సూర్య మండలములు కూడ వర్తించు చున్నవి. ఈశ్వర సంకల్పము లేనిదే చీమ కూడ కదలదు. కార్యములందు సిద్ధి, అసిద్ధి కూడ ఈశ్వరాధీనమై యున్నవి. కొన్ని పనులు జరుగుచుండును. కొన్ని పనులు ఎంత ప్రయత్నించినను జరుగవు. అట్లే కొన్నిమార్లు ఫలము లభించును. కొన్నిమార్లు లభింపదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకముగ నుండును.*
*ఒక రోజు పూజ, ధ్యానము బాగా జరిగినదనిపించును. మరునాడట్లనిపించదు. జీవితమందలి అన్ని విషయము లందు వైవిధ్యము తారసిల్లు చుండును. ఒకనాడు ప్రేమించినవారు మరొకనాడు తటస్టులై యుండవచ్చును. పెంచిన పిల్లలే ఎదురు తిరగవచ్చును. పెంపుడు కుక్కయే కరవవచ్చును. ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎట్లు జరుగునో ఎవ్వరునూ ఊహించలేరు. ఓడలు బండ్లగుట, బండ్లు ఓడలగుట, ధనవంతుడు దరిద్రుడగుట, విద్యాహీనులు విద్యా వంతులను శాసించుట, మూర్ఖులు ప్రభువులగుట, ఆరోగ్య వంతులు అకస్మాత్తుగ తీరని అనారోగ్యమునకు గురియగుట ఇత్యాదివి జరుగుచు నుండును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 529 / Sri Siva Maha Purana - 529 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 46
*🌻. శివుడు పెళ్లికొడుకు - 2 🌻*
ఆ మేన తన భాగ్యమును, పార్వతి సౌభాగ్యమును, హిమవంతుని, మరియు తన కులమును కొనియాడెను. ఆమె తాను కృతార్థురాలైనట్లు భావించి గొప్ప ఆనందమును పొందెను (12). వికసించిన ముఖము గల ఆ మేన అల్లుని ఆనందంముతో పరికిస్తూ అచట ఆయనకు నీరాజనము నిచ్చెను (13).
పార్వతి పలుకులను స్మరించుకొని విస్మయమును పొందిన మేన ఆనందముతో వికసించిన పద్మము వంటి ముఖము గలదై మనసులో ఇట్లు తలపోసెను (14). పార్వతి పూర్వము అచట నాతో చెప్పిన సౌందర్యము కంటె అధికమగు సౌందర్యము మహేశ్వరుని యందు కనబడుచున్నది (15).
ఇప్పటి మహేశ్వరుని సొగసును వర్ణించుట సంభవము కాదు. మేన ఈ తీరున విస్మయమును పొంది తన గృహమునకు వెళ్లెను (16). పార్వతి ధన్యురాలు, ధన్యురాలని స్త్రీలు కొనియాడిరి. దుర్గ, భగవతి ఈమె అని కొందరు కన్యకలు పలికిరి (17).
'ఇటువంటి వరుడు మాకెన్నడునూ కానరాలేదు. మేము ధ్యానములోనైననూ ఇట్టి వరుని చూడలేదు. పార్వతి ధన్యురాలు' అని కొందరు కన్యలు మేనాదేవితో చెప్పిరి (18). గంధర్వ శ్రేష్ఠులు గానము చేయగా, అప్సరసల గణములు నర్తించెను. శంకరుని రూపమును చూసి దేవతలందరు మిక్కిలి ఆనందించిరి (19).
వాద్యగాండ్రు వివిధ వాద్యములను వివిధ రకముల నైపుణ్యముతో మధురముగా శ్రద్ధతో మ్రోగించిరి (20). ఆనందముతో నిండిన హిమవంతుడు మరియు మేన స్త్రీలందరితో గూడి మహోత్సాహముతో ద్వారము వద్ద జరిగే ఆచారముననుష్ఠించిరి (21).
మేన పార్వతీ పరమేశ్వరుల పేర్లను అడిగి చెప్పించెను. ఆమె ఆనందముతో తన గృహమునకు వెళ్ళెను. శివుడు గణములతో దేవతలతో గూడి తనకు వినయముగా నిర్దేశింపబడిన స్థానమునకు వెళ్ళెను (22). ఇంతలో హిమవంతుని అంతః పుర పరిచారికలు కులదేవతను ఆరాధించుటకై దుర్గను తీసుకొని నగర బహిః స్థానమునకు వెళ్ళిరి (23).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 529 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 46 🌴*
*🌻 The arrival of the bridegroom - 2 🌻*
12. She praised her good luck. She congratulated Pārvatī, the mountain and his entire family. She congratulated herself. She rejoiced again and again.
13. Gazing at her son-in-law joyously with beaming face, the chaste lady performed the Nīrājana rite.
14. Remembering what Pārvatī had told her, Menā was agreeably surprised and with a beaming lotus-like face full of delight she muttered to herself.
15. “I see the beauty of the great lord far in excess of what Pārvatī had told me before.
16. Śiva’s loveliness cannot be expressed adequately now.” In the same state of pleasant surprise she went in.
17. The young ladies proclaimed that the daughter of the mountain was fortunate. Some girls said that she had become a goddess.
18. Some said—“Such a bridegroom has never been seen, not to our knowledge.” Some girls said to Menā—“Pārvatī is really blessed.”
19. The chief of Gandharvas sang songs. The celestial damsels danced. On seeing Śiva’s lovely form, the gods were delighted.
20. The instrument players played on musical instruments in sweet tones showing their diverse skill.
21. The delighted Himācala too carried out the customary rites of reception at the entrance. Menā also jubilantly took part in the same along with all the womenfolk.
22. She made formal inquiries about the health of the bridegroom and gladly went into the house. Śiva went to the apartments assigned to Him along with the Gaṇas and the gods.
23. In the meantime the servant-maids in the harem of the mountain took Pārvatī out in order to worship the tutelar family deity.
Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 159 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. సంస్కృతి-సమానత - 1 🌻*
*సమానత అంటే అన్ని జాతులందు, అన్ని సంస్కృతులందు గల ఏకత్వాన్ని దర్శించి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే పనిని త్రికరణ శుద్ధిగా చేయడమేగాని మన సంస్కృతిని, సంస్కారాన్ని వదులుకొనడం కాదు. మన దేశము, మన సంస్కృతి యొక్క విశిష్టతను గుర్తించడం, మెచ్చుకొనడం సమానతకు భంగకరం (anti-secular) అని భావించడం హాస్యాస్పదం.*
*అనాది కాలం నుండి ఇతర ఖండాలలో మన భారతీయ సంస్కృతికి ఎంతో పేరు, ప్రతిష్ఠలున్నాయి. ఈనాటికి ఎందరో పాశ్చాత్య ఖండవాసులు భారతదేశం రావడం, ఇక్కడి సనాతన ధర్మాన్ని అధ్యయనం చేసి ఆచరిచడం అదృష్టంగా భావిస్తారు. నేడు ప్రపంచ దేశాల మానవులను పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం ఈ పుణ్యభూమి యందే దొరుకుతుందనేది నిస్సందేహము. అయితే మనదేశం ప్రస్తుతం అనేక సమస్యలలో కూరుకుని ఉన్నది కదా అని సందేహం రావొచ్చు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి.*
....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 148 / Osho Daily Meditations - 148 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*
*🍀 148. ఉన్నతమైన దాన్ని ప్రేమించండి 🍀*
*🕉. ఉన్నతమైన దాన్ని, పెద్దదాన్ని, అందులో మిమ్మల్ని మీరు కోల్పోయే దాన్ని ప్రేమించండి. మీరు దానిని స్వాధీనం చేసుకోవచ్చు, కానీ మీరు దానిని కలిగి ఉండలేరు. 🕉*
*ప్రేమ గొప్ప ఇబ్బందులను సృష్టిస్తుంది మరియు గొప్ప ఆనందాన్ని కూడా సృష్టిస్తుంది. ఒకరు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే ప్రేమ మన ప్రాథమిక రసాయన శాస్త్రం. ఒక వ్యక్తి తన ప్రేమ శక్తి గురించి అప్రమత్తంగా ఉంటే, అప్పుడు ప్రతిదీ సరిగ్గా జరుగుతుంది. ఎల్లప్పుడూ మీ కంటే ఉన్నతమైన దాన్ని ప్రేమించండి మరియు మీరు ఎప్పటికీ ఇబ్బందుల్లో ఉండరు; ఎల్లప్పుడూ మీ కంటే పెద్దదాన్ని ప్రేమించండి. ప్రజలు తమ కంటే తక్కువ, తమకంటే చిన్నదాన్ని ఇష్టపడతారు.*
*మీరు చిన్నదానిని నియంత్రించవచ్చు, మీరు చిన్నదానిపై ఆధిపత్యం చెలాయించవచ్చు మరియు తక్కువ వారితో మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు, ఎందుకంటే ఇది మిమ్మల్ని ఉన్నతంగా కనిపించేలా చేస్తుంది-అప్పుడు అహం నెరవేరుతుంది. మరియు మీరు మీ ప్రేమ నుండి అహాన్ని సృష్టించడం ప్రారంభించిన తర్వాత, మీరు నరకానికి కట్టుబడి ఉంటారు. ఉన్నతమైనదాన్ని, పెద్దదాన్ని ప్రేమించండి, దానిలో మీరు కోల్పోతారు మరియు మీరు నియంత్రించలేరు; మీరు దాని ద్వారా మాత్రమే స్వాధీనం చేసుకోగలరు, కానీ మీరు దానిని కలిగి ఉండలేరు. అప్పుడు అహంకారము నశిస్తుంది. అహంకారం లేని ప్రేమే ప్రార్ధన..*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 148 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 148. LOVE SOMETHING BIGGER 🍀*
*🕉 Love something higher, something bigger, something in which you will be lost. you can be possessed by it, but you cannot possess it. 🕉*
*Love can create great trouble and it can also create great joy. One has to be very, very alert, because love is our basic chemistry. If one is alert about one's love energy, then everything goes right. Always love something higher than yourself, and you will never be in trouble; always love something bigger than yourself. People tend to love something lower than themselves, something smaller than themselves.*
*You can control the smaller, you can dominate the smaller, and you can feel very good with the inferior, because it makes you look superior-then the ego is fulfilled. And once you start creating ego out of your love, then you are bound for hell. Love something higher, something bigger, something in which you will be lost and that you cannot control; you can only be possessed by it, but you cannot possess it. Then the ego disappears, and when love is without ego, it is prayer..*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 353-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 353-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।*
*సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀*
*🌻 353-2. ''భక్తిమత్కల్పలతికా'🌻*
*భక్తి యందు క్రమము, అక్రమము అను రెండు విధానము లున్నవి. క్రమము లేని ఆరాధన పూర్ణభక్తి కాజాలదు. మంత్రహీనత, క్రియాహీనత, భక్తిహీనతలతో ఆరాధించు భక్తులు కోకొల్లలు. వీరు అసంపూర్ణముగనే జీవించు చుందురు. ఇట్టి వారికి శ్రీమాతయే సంకల్ప రూపమున క్రమమును నేర్పును. క్రమమును నేర్చిన భక్తులు క్రమముగ పూర్ణు లగుదురు. భగవద్గీత యందు కూడ ఈ విషయమే తెలుపబడినది.*
*శాస్త్రము విధించిన విధానము ననుసరించి పూజించు వారికి సాన్నిధ్యము లభించునని, శాస్త్రము నుల్లంఘించు వారికి రజస్సు తమస్సు దోషము లంటి పూర్ణత్వము కలుగదని తెలుపబడినది. ఆరాధనకు సదాచారము, సంప్రదాయబద్ధత ప్రధానము. అవి అవసరము లేదనుట మెట్ట వేదాంతము. చిత్తశుద్ధి కలుగు వరకు విధానము ప్రధానము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 353-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani*
*Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻*
*🌻 353-2. Bhaktimat-kalpa-latikā भक्तिमत्-कल्प-लतिका 🌻*
*The final liberation means no re-birth and mokṣa means after exhausting all good karma-s in the Heaven (the heaven can be explained as a place where certain souls are rested for some period of time). Other souls are reborn immediately after leaving a body. The soul reaching the Heaven, does not attain perfection to become eligible to get liberated. Such final salvation is possible only with Her grace. This is the inherent meaning of this nāma.*
*Kṛṣṇa says (Bhagavad Gīta XV.10) “The yogis striving for liberation see Him existing in themselves; but those who are un-purified and undisciplined are unable to perceive Him even when they struggle to do so.”*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)