శ్రీ శివ మహా పురాణము - 529 / Sri Siva Maha Purana - 529


🌹 . శ్రీ శివ మహా పురాణము - 529 / Sri Siva Maha Purana - 529 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 46

🌻. శివుడు పెళ్లికొడుకు - 2 🌻


ఆ మేన తన భాగ్యమును, పార్వతి సౌభాగ్యమును, హిమవంతుని, మరియు తన కులమును కొనియాడెను. ఆమె తాను కృతార్థురాలైనట్లు భావించి గొప్ప ఆనందమును పొందెను (12). వికసించిన ముఖము గల ఆ మేన అల్లుని ఆనందంముతో పరికిస్తూ అచట ఆయనకు నీరాజనము నిచ్చెను (13).

పార్వతి పలుకులను స్మరించుకొని విస్మయమును పొందిన మేన ఆనందముతో వికసించిన పద్మము వంటి ముఖము గలదై మనసులో ఇట్లు తలపోసెను (14). పార్వతి పూర్వము అచట నాతో చెప్పిన సౌందర్యము కంటె అధికమగు సౌందర్యము మహేశ్వరుని యందు కనబడుచున్నది (15).

ఇప్పటి మహేశ్వరుని సొగసును వర్ణించుట సంభవము కాదు. మేన ఈ తీరున విస్మయమును పొంది తన గృహమునకు వెళ్లెను (16). పార్వతి ధన్యురాలు, ధన్యురాలని స్త్రీలు కొనియాడిరి. దుర్గ, భగవతి ఈమె అని కొందరు కన్యకలు పలికిరి (17).

'ఇటువంటి వరుడు మాకెన్నడునూ కానరాలేదు. మేము ధ్యానములోనైననూ ఇట్టి వరుని చూడలేదు. పార్వతి ధన్యురాలు' అని కొందరు కన్యలు మేనాదేవితో చెప్పిరి (18). గంధర్వ శ్రేష్ఠులు గానము చేయగా, అప్సరసల గణములు నర్తించెను. శంకరుని రూపమును చూసి దేవతలందరు మిక్కిలి ఆనందించిరి (19).

వాద్యగాండ్రు వివిధ వాద్యములను వివిధ రకముల నైపుణ్యముతో మధురముగా శ్రద్ధతో మ్రోగించిరి (20). ఆనందముతో నిండిన హిమవంతుడు మరియు మేన స్త్రీలందరితో గూడి మహోత్సాహముతో ద్వారము వద్ద జరిగే ఆచారముననుష్ఠించిరి (21).

మేన పార్వతీ పరమేశ్వరుల పేర్లను అడిగి చెప్పించెను. ఆమె ఆనందముతో తన గృహమునకు వెళ్ళెను. శివుడు గణములతో దేవతలతో గూడి తనకు వినయముగా నిర్దేశింపబడిన స్థానమునకు వెళ్ళెను (22). ఇంతలో హిమవంతుని అంతః పుర పరిచారికలు కులదేవతను ఆరాధించుటకై దుర్గను తీసుకొని నగర బహిః స్థానమునకు వెళ్ళిరి (23).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 529 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 46 🌴

🌻 The arrival of the bridegroom - 2 🌻


12. She praised her good luck. She congratulated Pārvatī, the mountain and his entire family. She congratulated herself. She rejoiced again and again.

13. Gazing at her son-in-law joyously with beaming face, the chaste lady performed the Nīrājana rite.

14. Remembering what Pārvatī had told her, Menā was agreeably surprised and with a beaming lotus-like face full of delight she muttered to herself.

15. “I see the beauty of the great lord far in excess of what Pārvatī had told me before.

16. Śiva’s loveliness cannot be expressed adequately now.” In the same state of pleasant surprise she went in.

17. The young ladies proclaimed that the daughter of the mountain was fortunate. Some girls said that she had become a goddess.

18. Some said—“Such a bridegroom has never been seen, not to our knowledge.” Some girls said to Menā—“Pārvatī is really blessed.”

19. The chief of Gandharvas sang songs. The celestial damsels danced. On seeing Śiva’s lovely form, the gods were delighted.

20. The instrument players played on musical instruments in sweet tones showing their diverse skill.

21. The delighted Himācala too carried out the customary rites of reception at the entrance. Menā also jubilantly took part in the same along with all the womenfolk.

22. She made formal inquiries about the health of the bridegroom and gladly went into the house. Śiva went to the apartments assigned to Him along with the Gaṇas and the gods.

23. In the meantime the servant-maids in the harem of the mountain took Pārvatī out in order to worship the tutelar family deity.


Continues....

🌹🌹🌹🌹🌹


05 Mar 2022

No comments:

Post a Comment