శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 353-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 353-2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 353-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 353-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।
సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀

🌻 353-2. ''భక్తిమత్కల్పలతికా'🌻

భక్తి యందు క్రమము, అక్రమము అను రెండు విధానము లున్నవి. క్రమము లేని ఆరాధన పూర్ణభక్తి కాజాలదు. మంత్రహీనత, క్రియాహీనత, భక్తిహీనతలతో ఆరాధించు భక్తులు కోకొల్లలు. వీరు అసంపూర్ణముగనే జీవించు చుందురు. ఇట్టి వారికి శ్రీమాతయే సంకల్ప రూపమున క్రమమును నేర్పును. క్రమమును నేర్చిన భక్తులు క్రమముగ పూర్ణు లగుదురు. భగవద్గీత యందు కూడ ఈ విషయమే తెలుపబడినది.

శాస్త్రము విధించిన విధానము ననుసరించి పూజించు వారికి సాన్నిధ్యము లభించునని, శాస్త్రము నుల్లంఘించు వారికి రజస్సు తమస్సు దోషము లంటి పూర్ణత్వము కలుగదని తెలుపబడినది. ఆరాధనకు సదాచారము, సంప్రదాయబద్ధత ప్రధానము. అవి అవసరము లేదనుట మెట్ట వేదాంతము. చిత్తశుద్ధి కలుగు వరకు విధానము ప్రధానము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 353-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani
Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻


🌻 353-2. Bhaktimat-kalpa-latikā भक्तिमत्-कल्प-लतिका 🌻

The final liberation means no re-birth and mokṣa means after exhausting all good karma-s in the Heaven (the heaven can be explained as a place where certain souls are rested for some period of time). Other souls are reborn immediately after leaving a body. The soul reaching the Heaven, does not attain perfection to become eligible to get liberated. Such final salvation is possible only with Her grace. This is the inherent meaning of this nāma.

Kṛṣṇa says (Bhagavad Gīta XV.10) “The yogis striving for liberation see Him existing in themselves; but those who are un-purified and undisciplined are unable to perceive Him even when they struggle to do so.”


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


05 Mar 2022

No comments:

Post a Comment