మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 159


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 159 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సంస్కృతి-సమానత - 1 🌻


సమానత అంటే అన్ని జాతులందు, అన్ని సంస్కృతులందు గల ఏకత్వాన్ని దర్శించి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే పనిని త్రికరణ శుద్ధిగా చేయడమేగాని మన సంస్కృతిని, సంస్కారాన్ని వదులుకొనడం కాదు. మన దేశము, మన సంస్కృతి యొక్క విశిష్టతను గుర్తించడం, మెచ్చుకొనడం సమానతకు భంగకరం (anti-secular) అని భావించడం హాస్యాస్పదం.

అనాది కాలం నుండి ఇతర ఖండాలలో మన భారతీయ సంస్కృతికి ఎంతో పేరు, ప్రతిష్ఠలున్నాయి. ఈనాటికి ఎందరో పాశ్చాత్య ఖండవాసులు భారతదేశం రావడం, ఇక్కడి సనాతన ధర్మాన్ని అధ్యయనం చేసి ఆచరిచడం అదృష్టంగా భావిస్తారు. నేడు ప్రపంచ దేశాల మానవులను పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం ఈ పుణ్యభూమి యందే దొరుకుతుందనేది నిస్సందేహము. అయితే మనదేశం ప్రస్తుతం అనేక సమస్యలలో కూరుకుని ఉన్నది కదా అని సందేహం రావొచ్చు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి.

....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


05 Mar 2022

No comments:

Post a Comment