🍀 10 - NOVEMBER - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🍀

🌹🍀 10 - NOVEMBER - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 10 - NOVEMBER - 2022 THURSDAY, గురువారం, బృహస్పతి వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 87 / Kapila Gita - 87 🌹 సృష్టి తత్వము - 43
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 126 / Agni Maha Purana - 126 🌹 🌻. విష్ణ్వాది దేవతా ప్రతిష్ఠకై భూపరిగ్రహము - 3🌻
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 261 / Osho Daily Meditations - 261 🌹 పరుగు - RUNNING
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 411 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 411 - 3 🌹 'శిష్టేష్టా’- 3 'Sishteshta'- 3

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹10, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : రోహిణి వ్రతం, Rohini Vrat 🌻*

*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 16 🍀*

*15. అపి క్షణార్ధం కలయంతి యే త్వాం ఆప్లావయంతం విశదైర్మయూఖైః*
*వాచాం ప్రవాహైరనివారితైస్తే మందాకినీం మందయితుం క్షమంతే ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : భూతకాలపు మూసలను అవసరమైతే విచ్ఛిన్నం చెయ్యి. కాని, దాని మూలతత్త్వాన్నీ, ఆత్మనూ మాత్రం భద్రపరుచు, లేని యెడల, నీకు భవిష్య త్తే ఉండదు. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,
దక్షిణాయణం, కార్తీక మాసం
తిథి: కృష్ణ విదియ 18:34:31 వరకు
తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: రోహిణి 29:08:24 వరకు
తదుపరి మృగశిర
యోగం: పరిఘ 21:12:30 వరకు
తదుపరి శివ
కరణం: గార 18:36:31 వరకు
వర్జ్యం: 20:28:20 - 22:12:16
దుర్ముహూర్తం: 10:05:58 - 10:51:31
మరియు 14:39:13 - 15:24:46
రాహు కాలం: 13:25:13 - 14:50:37
గుళిక కాలం: 09:09:02 - 10:34:26
యమ గండం: 06:18:15 - 07:43:39
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21
అమృత కాలం: 25:40:08 - 27:24:04
సూర్యోదయం: 06:18:15
సూర్యాస్తమయం: 17:41:24
చంద్రోదయం: 19:06:36
చంద్రాస్తమయం: 07:47:15
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు : ఉత్పాద యోగం - కష్టములు,
ద్రవ్య నాశనం 29:08:24 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 87 / Kapila Gita - 87🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 43 🌴*

*43. క్లేదనం పిండనం తృప్తిః ప్రాణనాప్యాయనోందనమ్|*
*తాపాపనోదో భూయస్త్వమంభసో వృత్తయస్త్విమాః॥*

*తడుపుట, మట్టి మొదలగువాటికి ముద్ద ఆకృతిని కలిగించుట, తృప్తిని కలిగించుట, జీవలక్షణమును నిలుపుట, దాహమును నివారించుట, పదార్థములకు మెత్తదనమును కలిగించుట, తాపమును నివారించుట, కూపాదుల నుండి ఎంతగా తోడినను మరల మరల ఊరుచుండుట అనునవి జలము యొక్క వృత్తులు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 87 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 43 🌴*

*43. kledanaṁ piṇḍanaṁ tṛptiḥ prāṇanāpyāyanondanam*
*tāpāpanodo bhūyastvam ambhaso vṛttayas tv imāḥ*

*The characteristics of water are exhibited by its moistening other substances, coagulating various mixtures, causing satisfaction, maintaining life, softening things, driving away heat, incessantly supplying itself to reservoirs of water, and refreshing by slaking thirst.*

*Starvation can be mitigated by drinking water. It is sometimes found that if a person who has taken a vow to fast takes a little water at intervals, the exhaustion of fasting is at once mitigated. In the Vedas it is also stated, āpomayaḥ prāṇaḥ: "Life depends on water." With water, anything can be moistened or dampened. Flour dough can be prepared with a mixture of water. Mud is made by mixing earth with water.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 126 / Agni Maha Purana - 126 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 39*

*🌻. విష్ణ్వాది దేవతా ప్రతిష్ఠకై భూపరిగ్రహము - 3🌻*

భూమిశోధనానంతరము భూపరిగ్రహము చేయవలెను. పిమ్మట ప్రాకారము సరిహద్దువరకు మినుములు, పసుపు, పేలాలు, పెరుగు, సక్తువులు-వీటితో భూతబలి ఇవ్వవలెను. అష్టాక్షరమంత్రము చదువుచు, ''ఈ ప్రదేశమునందు నివసించు రాక్షసపిశాచాదులు ఇచటినుండి తొలగిపోవుగాక. నే నిచట మహావిష్ణ్వాలయమును నిర్మింపనున్నాను'' అని చెప్పుచు, ఎనిమిది దిక్కులందును సక్తువులు చల్లవలెను. 

భూమిని నాగలిచే దున్నించి ఆవులను దానిపై నడిపింపవలెను. ఎనిమిది పరమాణువులు ఒక రథరేణువు. ఎనిమిది రథరేణువులు ఒక త్రసరేణువు. ఎనిమిది త్రసరేణువులు ఒక వాలాగ్రము. ఎనిమిది వాలాగ్రముటు ఒక లిక్ష. ఎనిమిది లిక్షలు ఒక మూర. ఎనిమిది మూరలు ఒక యవమధ్యము, ఎనిమిది యవలు ఒక అంగుళము. ఇరువదినాలుగు అంగుళములు ఒక కరము. ఇరువది యెనిమిది అంగుళములు ఒక పద్మహస్తము.

శ్రీ అగ్నిమహాపురాణమునందు విష్ణ్వాదిదేవతాప్రతిష్ఠకై భూపరిగ్రహము అను ముప్పదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 126 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 39*
*🌻 Preparations of ground for constructing temples - 3 🌻*

16. The offerings to the (presiding) goblins should be offered upto the outer enclosing wall (with a mixture of) black gram, turmeric powder, fried grains, curd and flour.

17-18. Having dropped the flour in all directions along with (the recitation of) eight syllables: (one has to say), “The demons and goblins who remain on this ground may go away. I am making a place for Hari.” Having cleaved the earth with the plough one should cleave it with oxen.

19. Eight Paramāṇus make one rathāṇu. Eight rathāṇus are said to make one trasareṇu. Eight times that (makes) one bālāgra and eight times that is known as likhyā. Eight times that is known as yūka. Eight times that is a yavamadhyama. Eight times yava (makes) one aṅgula. Twenty-four aṅgulas (make) one kara. Four aṅgulas make one padmahastaka.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 261 / Osho Daily Meditations - 261 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 261. పరుగు 🍀*

*🕉. మీరు సుదూర దూరం పరుగు పెట్టగలిగితే, అది పరిపూర్ణ ధ్యానం. వేగంగా నడవడం, పరుగు, ఈత కొట్టడం - ఏదైనా మీరు పూర్తిగా పాల్గొనవచ్చు. చాలా మంచిది. 🕉*

*మీరు కాదు, కార్యాచరణ మాత్రమే మిగిలి ఉండాలి. ఎందుకంటే అప్పుడు అహం పని చేయదు. మీరు నడుస్తున్నప్పుడు నిజంగా పరుగు మాత్రమే ఉంటుంది, పరుగు పెట్టేవాడు లేడు. ధ్యానం అంటే అదే.*

*నాట్యం మాత్రమే ఉండి, నర్తకి లేకపోతే అది ధ్యానం. మీరు పెయింటింగ్ చేస్తుంటే, పెయింటింగ్ మాత్రమే ఉంది మరియు చిత్రకారుడు లేకపోతే, అది ధ్యానం. సంపూర్ణంగా మరియు చేసే వారికి మరియు చేసిన వారికి మధ్య విభజన లేని కార్యాచరణ ఏదైనా ధ్యానం అవుతుంది.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 261 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 261. RUNNING 🍀*

*🕉. If you can do long-distance running, it is a perfect meditation. Jogging, running, swimming-anything in which you can get totally involved--is very good. 🕉*

*Only the activity remains, you are not, because the ego cannot function. When you are running there is really only running, there is no runner. And that's what meditation is.*

*If there is only dance and no dancer, that's meditation. If you are painting and there is only painting and no painter, then it is meditation. Any activity that is total and in which there is no division between the doer and the done becomes meditation.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 411 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 411 - 3🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।*
*అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀*

*🌻 411. 'శిష్టేష్టా’- 3 🌻* 

*"ఆచారమున ధర్మము లేనప్పుడు ఆరాధన లెన్ని చేసిననూ దైవమునకు ప్రియులు కాలేరు.” 'శిష్టు' అనగా ధర్మాచార పరాయణులు. వీరికి చపలత్వముండదు. చపలత్వము కలవారు ముందుగ ఆచారమును సరిచేసు కొనవలెను. అందులకు ప్రార్థనలు చేయవచ్చును. కేవలము ప్రార్థనలే చేయుచు ఆచారమున మెరుగునకై ప్రయత్నింపనివారు కేవలము డంబాచారులై యుందురు. డంబాచారము అనాచారము కన్న హీనము. సదాచారులను రక్షించుట శ్రీమాత పని. వారామెకు ప్రియులు. వారి పూజలను ఆమె స్వీకరించును. వారికి శ్రియములే కాక ప్రియములు కూడ కలిగించును. అనగా మిక్కుటమగు వైభవమును కలిగించును. శివుని సాన్నిధ్యమును కూడ కల్పించును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 411 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*

*🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita*
*Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻*

*🌻 411. 'Sishteshta'- 3 🌻*

*'When there is no dharma in practice, even if you do worship, you will not be loved by God.' 'Sishtu' means the practitioners of dharma. They have no fickle mindeness. Those who are fickle should correct their dharmic practices. Prayer helps for that. Those who only pray and do not try to improve their practices are just hypocrites. Hypocrisy is worse than ignorance. Srimata's job is to protect the righteous. They are Her loved ones. She accepts their worship. It not only makes them prosper but also makes them happy. That is, She grants more glory in their life. She also brings them closer to Lord Shiva.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

నిర్మల ధ్యానాలు - ఓషో - 256


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 256 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నువ్వు శాశ్వతత్వంలో భాగం. వ్యక్తి దీన్ని అనుభవానికి తెచ్చుకుంటే జీవితం ఆనందంతో నిండుతుంది. అస్తిత్వం నిన్ను ఆశీర్వదించినట్లు తెలుస్తుంది. అప్పుడు సహజంగా, తక్షణ స్పందనతో కృతజ్ఞత మొదలవుతుంది. ఆ కృతజ్ఞతయే అసలైన ప్రార్ధన. 🍀

మన జీవితం జీవితమని చెప్పడానికి అర్హత లేనిది నువ్వు మరణాన్ని దాటి ప్రయాణించినపుడే జీవితం మొదలవుతుంది. ధ్యానమంటే అదే. ద్యానందానికి వుపయోగపడే వుపకరణం, వ్యూహం, నిచ్చెన, మరణాన్ని దాటిన ఒక మెరుపు చాలు. అప్పుడు నువ్వు ఈ శరీరమొకటే మరణిస్తుందని నువ్వు కాదని తెలుసుకుంటావు. శరీరమే పుడుతుందని, నువ్వు కాదని గ్రహిస్తావు. నువ్వు పుట్టుకకు ముందు యిక్కడున్నావు. మరణానంతరం యిక్కడుంటావు. నువ్వు శాశ్వతత్వంలో భాగం. వ్యక్తి దీన్ని అనుభవానికి తెచ్చుకుంటే జీవితం ఆనందంతో నిండుతుంది.

అస్తిత్వం నిన్ను ఆశీర్వదించినట్లు తెలుస్తుంది. అప్పుడు సహజంగా, తక్షణ స్పందనతో కృతజ్ఞత మొదలవుతుంది. ఆ కృతజ్ఞతని నేను ప్రార్ధన అంటాను. తక్కిన అన్ని ప్రార్ధనలూ మోసపూరితాలే. నిజమైన ప్రార్థన నువ్వు ఆనందాన్ని అనుభవానికి తెచ్చుకోవడం నించీ ఆరంభమవుతుంది. అప్పుడు నీలో కృతజ్ఞత మొదలవుతుంది. నువ్వు అస్తిత్వానికి తలవంచాలి. నువ్వు పొందిన వరాన్ని నువ్వు ఆశించలేదు. అడగలేదు. నిజానికి నీకా అర్హత కూడా లేదు. ఎవరికీ అర్హత లేదు. కానీ అస్తిత్వం వాటన్నిటీ అనురాగంతో యిస్తుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

నిత్య ప్రజ్ఞా సందేశములు - 357 - 22. మనిషి . . . / DAILY WISDOM - 357 - 22. Man Cannot . . .


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 357 / DAILY WISDOM - 357 🌹

🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀

📝. ప్రసాద్ భరద్వాజ్

🌻22. మనిషి బ్రహ్మను ధ్యానించలేడు 🌻


బ్రహ్మం సంపూర్ణమైనది. బ్రహ్మాన్ని ఎవరూ ధ్యానించలేరు, ఎందుకంటే అది ధ్యానం చేసేవారిని కూడా కలిగి ఉంటుంది. దేవుడు మానవులను తనలో కలిగి ఉన్నందున మనిషి భగవంతుడిని విడిగా ధ్యానించలేడు. అంటే, భగవంతుడిని ధ్యానించడమంటే తన స్వంత ఉనికిని కోల్పోవడమే. దేవుడు ఉన్నప్పుడు, మనిషి ఉండడు. ఇది ఒక సూక్ష్మమైన ఫలితం, ఇది సర్వవ్యాపి అయిన భగవంతునిపై ధ్యానం చేసే ప్రయత్నంలో ఉత్పన్నమయ్యే ఒక స్థితి.

దేవుడు, ఆ విధంగా, మనిషి ఆలోచించే ఒక వస్తువుగా కాక, సర్వావ్యాపిగా తనను తాను ధ్యానిస్తాడు. సాధారణంగా ధ్యానం చేసేటప్పుడు ధ్యాని వేరు, ధ్యానించబడే వస్తువు వేరు. కానీ, భగవంతుని ధ్యానించేటపుడు ఆ ధ్యాని భగవంతునితో ఎంత మమేకం చెందుతాడంటే ధ్యాని తాను ధ్యానించే భగవంతుడే అయిపోతాడు. అంటే, భగవంతుడే తనను తాను ధ్యానిస్తాడు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 357 🌹

🍀 📖 from The Philosophy of Religion 🍀

📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj

🌻22. Man Cannot Meditate on Brahman🌻


Brahman is the Absolute, and one cannot meditate on Brahman, because it is inclusive of even the meditator himself. Man cannot meditate on God because God includes the human location. Thus, to endeavour to meditate on the omnipresence of God would be a simultaneous attempt to abolish one's own individual existence. When God is, man ceases to be. This is a subtle result that would insinuate itself into the effort at meditation on the supremacy of All-Being.

God, thus, ceases to be an object of individual contemplation. God is the Supreme Subject which contemplates Itself as the All. One, generally, regards oneself as the subject, and what is contemplated upon as the object. But in the case of God, conceived in the true sense of the term, the meditating consciousness affiliates itself with the object in such an intimate manner that in this inward association of the meditator with the object of meditation it would appear that the object itself is in a state of meditation.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 640 / Sri Siva Maha Purana - 640


🌹 . శ్రీ శివ మహా పురాణము - 640 / Sri Siva Maha Purana - 640 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 14 🌴

🌻. గణ వివాదము - 1 🌻



బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ గణములు కోపముతో నిండిన వారై శివుని ఆజ్ఞానుసారముగ అచటకు వెళ్లి, ద్వారపాలకుడై యున్న ఆ పార్వతీ తనయుని ఇట్లు ప్రశ్నించిరి (1).


శివగణములు ఇట్లు పలికిరి -

నీవెవరివి? ఎచటనుండి వచ్చితివి? నీవేమి చేయ గోరుచున్నావు? నీవు బ్రతుక దలచినతో ఇపుడు ఇచటి నుండి దూరముగా పొమ్ము (2).


బ్రహ్మ ఇట్లు పలికెను -

వారి ఆ మాటను విని పార్వతీపుత్రుడు భయము లేనివాడై చేత కర్ర బట్టుకొని ద్వారపాలకులతో నిట్లు పలికెను (3).


గణేశుడిట్లు పలికెను -

మీరెవరు? ఎచటనుండు వచ్చిరి? మీరు సుందరముగా నున్నారు. దూరముగా పొండు. ఇచట మీరు విరోధమును గోరి నిలబడి యుండుటకు కారణమేమి? (4).


బ్రహ్మ ఇట్లు పలికెను-

మహావీరులు, తొలగిన గర్వము గలవారు అగు శివగణములందరు వాని ఈ మాటలను విని ఒకరిలో నొకరు నవ్వుకొని ఇట్లు పిలికిరి (5). శివగణములందరు ఒకరితో నొకరు సంప్రదించుకొని క్రోధముతో నిండిన మనస్సు గలవారై ద్వారపాలుడగు ఆ గణేశునితో నిట్లనిరి (16).


శివగణములు ఇట్లు పలికిరి -

వినుము. మేము శ్రేష్ఠులగు శివగణములము. ద్వారపాలకులము. శంకరప్రభుని ఆజ్ఞచే నిన్ను తప్పించుటకు వచ్చినాము (7). నీవు కూడా ఇచటి గణమని తలంచి నిన్ను సంహరించలేదు. లేనిచో నీవీ పాటికి సంహరింపబడి యుండెడి వాడవు. నీ అంతట నీవే దూరముగా పొమ్ము. మృత్యువును ఏల గోరు చున్నావు? (8)


బ్రహ్మ ఇట్లు పలికెను -

వారిట్లు పలికిననూ పార్వతీ తనయుడగు గణశుడు భయము లేనివాడై ఆ శివగణములను భయవెట్టినాడే గాని, ద్వారమును వీడలేదు (90. అచట నున్న ఆ శివగణములందరు ఆ మాటను విని శివుని వద్దకు వెళ్లి ఆ వృత్తాంతమును చెప్పిరి (10). ఓ మహర్షీ! లోకాచారముననుసరించి అద్బుతమగు లీలలను ప్రదర్శించే మహేశ్వరుడు వారి మాటలను విని ఆ తన గణములపై కోపించి గద్దించి వారితో నిట్లనెను (11).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 640🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 14 🌴

🌻 The Gaṇas argue and wrangle - 1 🌻



Brahmā said:—

1. The infuriated Gaṇas of Śiva at his bidding went there and questioned the son of Pārvatī who stood at the gate.


Śiva’s Gaṇas said:—

2. “Who are you? Whence do you come? What do you propose to do? If you have a desire to remain alive go away from here.”


Brahmā said:—

3. On hearing their words, the son of Pārvatī who was armed with the staff spoke to the Gaṇas as follows:—


Gaṇeśa said:—

4. O “handsome fellows, who are you? Whence have you come? Go away. Why have you come here and why do you stand in opposition to me?”


Brahmā said:—

5. On hearing his words, Śiva’s Gaṇas of great heroism and arrogance laughingly spoke to one another.

6. After conferring with one another, the infuriated Pārṣadas of Śiva replied to Gaṇeśa, the doorkeeper.


Śiva’s Gaṇas said:—

7. “Listen. We are the excellent Gaṇas of Śiva. We are his doorkeepers. We have come here to throw you out at the bidding of lord Śiva.

8. Considering you too, as one of the Gaṇas, we are not going to kill you. Otherwise you would have been killed. Better stay away yourself. Why do you court death?”


Brahmā said:—

9. Though warned thus, Gaṇeśa, the son of Pārvatī, stood fearless. He did not leave his post at the door. He rebuked Śiva’s Gaṇas.

10. After hearing his words, the Gaṇas of Śiva went back and informed Śiva about his stand.

11. O sage, on hearing their words, lord Śiva of wonderful divine sports, following the worldly conventions rebuked his Gaṇas.


Continues....

🌹🌹🌹🌹🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 678/ Vishnu Sahasranama Contemplation - 678


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 678/ Vishnu Sahasranama Contemplation - 678🌹

🌻678. మహాహవిః, महाहविः, Mahāhaviḥ🌻

ఓం మహాహవిషే నమః | ॐ महाहविषे नमः | OM Mahāhaviṣe namaḥ

మహచ్చ తద్ధవిశ్చేతి బ్రహ్మాత్మన్యఖిలం జగత్ ।
తదాత్మతయా హూయత ఇతి విష్ణుర్మహాహవిః ॥


మహత్ అనగా పరమాత్ముని ఉద్దేశించి వేల్చబడునదియగునట్టి పవిత్ర హవిస్సు; అది కూడ విష్ణుని విభూతియే. జగత్తు సైతము వాస్తవమున తదాత్మకము, బ్రహ్మరూపము కావున అది బ్రహ్మతత్త్వమేయగు ప్రత్యగాత్మ తత్త్వమున వేల్చబడును. కావున అట్టి మహా పరిమాణముగల హవిస్సు మహా హవిస్సే కదా! బహువ్రీహి సమాసముగానైతె గొప్పదియగు జగద్రూప హవిస్సు ఎవని విషయమున ఎవనియందు వేల్చబడునో ఆతండు మహాహవిః.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 678🌹

🌻678. Mahāhaviḥ🌻

OM Mahāhaviṣe namaḥ


महच्च तद्धविश्चेति ब्रह्मात्मन्यखिलं जगत् ।
तदात्मतया हूयत इति विष्णुर्महाहविः ॥

Mahacca taddhaviśceti brahmātmanyakhilaṃ jagat,
Tadātmatayā hūyata iti viṣṇurmahāhaviḥ.


Mahat meaning the sacred oblation that is offered as an oblation to the great Lord. Such an oblation is also a form of Lord Viṣṇu Himself. Since the entire world is itself a manifestation of the Supreme Soul, during annihilation phase, such an oblation of great value and magnitude gets offered onto that very all devouring Supreme Entity. Hence the world itself is the great oblation offered to the Lord.

In another form of interpretation, He in whose regard great oblations are offered - is Mahāhaviḥ.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

महाक्रमो महाकर्मा महातेजा महोरगः ।महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः ॥ ७२ ॥

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥

Mahākramo mahākarmā mahātejā mahoragaḥ,Mahākraturmahāyajvā mahāyajño mahāhaviḥ ॥ 72 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


శ్రీమద్భగవద్గీత - 279: 06వ అధ్., శ్లో 46 / Bhagavad-Gita - 279: Chap. 06, Ver. 46

 

🌹. శ్రీమద్భగవద్గీత - 279 / Bhagavad-Gita - 279 🌹

✍️. శ్రీ ప్రభుపాద 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 46 🌴

46. తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోధిక: |
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ||


🌷. తాత్పర్యం :

యోగియైన వాడు తపస్వి కన్నను, జ్ఞాని కన్నను, కామ్యకర్మరతుని కన్నను అధికుడైనట్టివాడు. కనుక ఓ అర్జునా! అన్ని పరిస్థితుల యందును నీవు యోగివి కమ్ము.

🌷. భాష్యము :

యోగమును గూర్చి చర్చించినపుడు దానిని స్వీయచైతన్యమును పరతత్వముతో సంధించు విధానముగా మనము అన్వయింతుము. అట్టి విధానము మనుజులు తామనుసరించు ప్రత్యేక పద్ధతిని బట్టి వివిధనామములతో పిలుతురు. కామ్యకర్మలు అధికముగా నున్నచో అట్టి అనుసంధాన పద్ధతి కర్మయోగామనియు, జ్ఞానముతో అధికముగా ముడివడి యున్నచో జ్ఞానయోగామనియు, శ్రీకృష్ణభగవానుని భక్తియుక్తకార్యములతో నిండియున్నచో భక్తియోగమును పిలువబడును. తదుపరి శ్లోకములలో వివరింపబడినట్లు భక్తియోగమే(కృష్ణభక్తిరసభావనము) సర్వయోగములకు చరమ పూర్ణత్వమై యున్నది. భగవానుడు ఇచ్చట యోగము యొక్క అధిపత్యమును ధ్రువీకరుంచుచున్నను, దానిని భక్తియోగము కన్నను ఉత్తమమని మాత్రము పలికియుండలేదు.

వాస్తవమునకు భక్తియోగము సంపూర్ణ ఆధ్యాత్మికజ్ఞానమైనందున దానిని ఏ యోగము సైతము అతిశయింపలేదు. ఆత్మజ్ఞానములేని తపస్సు అసంపూర్ణమైనది. అలాగుననే భగవానుని శరణాగతి లేని జ్ఞానము సైతము అసంపూర్ణమై యున్నది. ఇక కృష్ణభక్తిభావన లేనటువంటి కామ్యకర్మ వృథాకాలవ్యయమే అయియున్నది. కనుకనే ఇచ్చట ఘనముగా కీర్తించబడిన యోగపద్ధతి వాస్తవమునకు భక్తియోగమే. ఈ విషయము రాబోవు శ్లోకములలో మరింత విపులముగా వివరింపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 279 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 46 🌴

46. tapasvibhyo ’dhiko yogī jñānibhyo ’pi mato ’dhikaḥ
karmibhyaś cādhiko yogī tasmād yogī bhavārjuna


🌷 Translation :

A yogī is greater than the ascetic, greater than the empiricist and greater than the fruitive worker. Therefore, O Arjuna, in all circumstances, be a yogī.

🌹 Purport :

When we speak of yoga we refer to linking our consciousness with the Supreme Absolute Truth. Such a process is named differently by various practitioners in terms of the particular method adopted. When the linking process is predominantly in fruitive activities it is called karma-yoga, when it is predominantly empirical it is called jñāna-yoga, and when it is predominantly in a devotional relationship with the Supreme Lord it is called bhakti-yoga. Bhakti-yoga, or Kṛṣṇa consciousness, is the ultimate perfection of all yogas, as will be explained in the next verse.

The Lord has confirmed herein the superiority of yoga, but He has not mentioned that it is better than bhakti-yoga. Bhakti-yoga is full spiritual knowledge, and therefore nothing can excel it. Asceticism without self-knowledge is imperfect. Empiric knowledge without surrender to the Supreme Lord is also imperfect. And fruitive work without Kṛṣṇa consciousness is a waste of time. Therefore, the most highly praised form of yoga performance mentioned here is bhakti-yoga, and this is still more clearly explained in the next verse.

🌹 🌹 🌹 🌹 🌹
 

09 Nov 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹09, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹

శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺

🍀. శ్రీ నారాయణ కవచం - 21 🍀


31. యథా హి భగవానేవ వస్తుతః సదసచ్చ యత్ |
సత్యేనానేన నః సర్వే యాంతు నాశముపద్రవాః

32. యథైకాత్మ్యానుభావానాం వికల్పరహితః స్వయమ్ |
భూషణాయుధలింగాఖ్యా ధత్తే శక్తీః స్వమాయయా

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : పరోపకారబుద్ధి, కర్తవ్య పరాయణత, కుటుంబాభిమానము, దేశభక్తి, మానవ జాతీయత - ఇవి ఆత్మకు సాధనములుగా వినియోగ పడనప్పుడు సంకెళ్ళుగా తయారై ఆత్మను బంధిస్తాయి.🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, కార్తీక మాసం

తిథి: కృష్ణ పాడ్యమి 17:18:01 వరకు

తదుపరి కృష్ణ విదియ

నక్షత్రం: కృత్తిక 27:10:23 వరకు

తదుపరి రోహిణి

యోగం: వరియాన 21:17:43 వరకు

తదుపరి పరిఘ

కరణం: కౌలవ 17:21:01 వరకు

వర్జ్యం: 14:24:00 - 16:06:00

దుర్ముహూర్తం: 11:36:56 - 12:22:32

రాహు కాలం: 11:59:44 - 13:25:13

గుళిక కాలం: 10:34:15 - 11:59:44

యమ గండం: 07:43:17 - 09:08:46

అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21

అమృత కాలం: 24:36:00 - 26:18:00

మరియు 25:40:08 - 27:24:04

సూర్యోదయం: 06:17:48

సూర్యాస్తమయం: 17:41:40

చంద్రోదయం: 18:21:43

చంద్రాస్తమయం: 06:52:11

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: మేషం

యోగాలు : సిద్ది యోగం - కార్య సిధ్ధి ,

ధన ప్రాప్తి 27:10:23 వరకు తదుపరి

శుభ యోగం - కార్య జయం

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹