నిర్మల ధ్యానాలు - ఓషో - 256


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 256 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నువ్వు శాశ్వతత్వంలో భాగం. వ్యక్తి దీన్ని అనుభవానికి తెచ్చుకుంటే జీవితం ఆనందంతో నిండుతుంది. అస్తిత్వం నిన్ను ఆశీర్వదించినట్లు తెలుస్తుంది. అప్పుడు సహజంగా, తక్షణ స్పందనతో కృతజ్ఞత మొదలవుతుంది. ఆ కృతజ్ఞతయే అసలైన ప్రార్ధన. 🍀

మన జీవితం జీవితమని చెప్పడానికి అర్హత లేనిది నువ్వు మరణాన్ని దాటి ప్రయాణించినపుడే జీవితం మొదలవుతుంది. ధ్యానమంటే అదే. ద్యానందానికి వుపయోగపడే వుపకరణం, వ్యూహం, నిచ్చెన, మరణాన్ని దాటిన ఒక మెరుపు చాలు. అప్పుడు నువ్వు ఈ శరీరమొకటే మరణిస్తుందని నువ్వు కాదని తెలుసుకుంటావు. శరీరమే పుడుతుందని, నువ్వు కాదని గ్రహిస్తావు. నువ్వు పుట్టుకకు ముందు యిక్కడున్నావు. మరణానంతరం యిక్కడుంటావు. నువ్వు శాశ్వతత్వంలో భాగం. వ్యక్తి దీన్ని అనుభవానికి తెచ్చుకుంటే జీవితం ఆనందంతో నిండుతుంది.

అస్తిత్వం నిన్ను ఆశీర్వదించినట్లు తెలుస్తుంది. అప్పుడు సహజంగా, తక్షణ స్పందనతో కృతజ్ఞత మొదలవుతుంది. ఆ కృతజ్ఞతని నేను ప్రార్ధన అంటాను. తక్కిన అన్ని ప్రార్ధనలూ మోసపూరితాలే. నిజమైన ప్రార్థన నువ్వు ఆనందాన్ని అనుభవానికి తెచ్చుకోవడం నించీ ఆరంభమవుతుంది. అప్పుడు నీలో కృతజ్ఞత మొదలవుతుంది. నువ్వు అస్తిత్వానికి తలవంచాలి. నువ్వు పొందిన వరాన్ని నువ్వు ఆశించలేదు. అడగలేదు. నిజానికి నీకా అర్హత కూడా లేదు. ఎవరికీ అర్హత లేదు. కానీ అస్తిత్వం వాటన్నిటీ అనురాగంతో యిస్తుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment