శ్రీ లలితా సహస్ర నామములు - 74 / Sri Lalita Sahasranamavali - Meaning - 74

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 74 / Sri Lalita Sahasranamavali - Meaning - 74 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।
వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀

🍀 327. కళావతీ -
కళా స్వరూపిణీ.

🍀 328. కలాలాపా -
కళలను ఆలాపనా స్వరూపముగా కలిగినది.

🍀 329. కాంతా -
కామింపబడినటువంటిది.

🍀 330. కాదంబరీ ప్రియా -
పరవశించుటను ఇష్టపడునది.

🍀 331. వరదా -
వరములను ఇచ్చునది.

🍀 332. వామనయనా -
అందమైన నేత్రములు గలది.

🍀 333. వారుణీమదవిహ్వలా -
వరుణ సంబంధమైన పరవశత్వము చెందిన మనోలక్షణము గలది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 74 🌹

📚. Prasad Bharadwaj

🌻 74. kalāvatī kalālāpā kāntā kādambarīpriyā |
varadā vāmanayanā vāruṇī-mada-vihvalā || 74 || 🌻

🌻 327 ) Kalavathi -
She who is an artist or she who has crescents

🌻 328 ) Kalaalapa -
She whose talk is artful

🌻 329 ) Kaantha -
She who glitters

🌻 330 ) Kadambari priya -
She who likes the wine called Kadambari or She who likes long stories

🌻 331 ) Varadha -
She who gives boons

🌻 332 ) Vama nayana -
She who has beautiful eyes

🌻 333 ) Vaaruni madha vihwala -
She who gets drunk with the wine called varuni(The wine of happiness)

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

12 May 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 25

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 25 🌹

✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. గురువు - చైతన్య స్వరూపము - 1 🌻

గురుశబ్దము మహత్తరమైన అర్థముతో కూడుకొన్నది. లౌకికమైన శాస్ర్ర-విజ్ఞాన- ప్రాపంచిక విషయాలను బోధించేవారూ గురువులుగా‌ లోకంలో చెలామణి అవుతున్నారు.

ఈ చదువు 'కొను' వారు, అమ్మేవారు నేడు వ్యాపారసరళిలోనే ఉంటున్నారు. అందుచేతనే గురుశిష్య‌ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి.

భగవద్విషయమైన 'ఎరుక' కలిగించేదే విద్య. విషయపరిజ్ఞాన మాత్రమైన దానిని విద్యగా ప్రాచీనులు పరిగణించేవారు కాదు. అందుచేతనే 'గురు' శబ్దము సనాతన ధర్మవివేచనలో విశిష్టార్థంలో పరిగణింపబడుట. గురు శబ్దానికి చీకటిని (అజ్ఞానాన్ని) పోగొట్టువాడని అర్థము.

అట్లే శాసింపబడువాడు శిష్యుడు. గురువుల యందు ఏవేని అప్రియమైన విషయాలు గమనిస్తే వాటిని గుప్తంగా ఉంచేవాడే ఛాత్రుడు.

'గురుదేవోభవ' అనే ఆర్యోక్తి‌ ఒకటున్నది. కబీరు‌ను ఎవరో ఒకమారు అడిగారట! 'దైవమూ గురువు ఒకేసారి దర్శనమిస్తే ఎవరికి ముందు చేతులెత్తి నమస్కరిస్తావు' అని వెంటనే క్ఞణం ఆలస్యం చేయకుండా గురువుకే ముందు నమస్కరిస్తానని చెప్పినాడట. గురువు స్థానము అంతటిది. సాక్షాత్తు పరబ్రహ్మమే గురువు.

గురువుని గురించి శ్రీ అరవిందయోగి అభిబాషిస్తూ 'గురువును సాధారణముగా సాక్షాదీశ్వరావిర్భావముగా లేక ఈశ్వర ప్రతినిధిగా భావించెదరు.

వారు తమ ఉపదేశముల వలన, అంతకంటే ఎక్కువగా తమ ప్రభావాదర్శముల వలన మాత్రమే గాక, స్వానుభవమును ఇతరులకు సంక్రమింప చేయునట్టి ఒక శక్తి మూలముననూ సాయపడుతుంటారు.' అన్నారు.

🌹 🌹 🌹 🌹 🌹

12 May 2021

శ్రీ శివ మహా పురాణము - 397

🌹 . శ్రీ శివ మహా పురాణము - 397 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 19

🌻. కామదహనము - 2 🌻

ఇంతలో దేవతలు స్తుతించుచుండగనే మిక్కిలి క్రుద్ధుడైన శివుని మూడవ కంటి నుండి అపుడు గొప్ప అగ్ని పుట్టెను (14). లలాటమధ్యమునందున్న కంటి నుండి క్షణములో పుట్టిన ఆ అగ్ని ఎత్తైన జ్వాలలతో ప్రళయకాలాగ్నితో సమానమైన తేజస్సు గలదై మండజొచ్చెను (15). మన్మథుడు వెంటనే అంతరిక్షములోనికి ఎగిరి నేలపై బడి క్రిందనే చుట్టూ దొర్లుచుండెను (16). ఓ మహర్షీ! క్షమించుడు, క్షమించుడు అనే దేవతల వచనములు వినబడునంతలో ఆ అగ్ని మన్మథుని బూడిదగా మార్చివేసెను (17).

వీరుడగు ఆ మన్మథుడు మరణించగా దుఃఖితులైన దేవతలు 'అయ్యో! ఏమైనది?' అని ఆక్రోశించువారై ఏడ్వ జొచ్చిరి (18). అపుడు పార్వతీ దేవి యొక్క శరీరము వివర్ణమాయెను. ఆమె మనస్సు వికారమును పొందెను. అపుడామె తన సఖురాండ్రను వెంటబెట్టుకొని తన ప్రాసాదమునకు వెళ్లిపోయెను (19). అపుడచట రతీదేవి భర్త మరణించుటవలన కలిగిన దుఃఖముచే వెనువెంటనే మరణించిన దానివలె నేలపై స్పృహతప్పి పడిపోయెను (20). తెలివి రాగానే రతి మిక్కిలి దుఃఖితురాలై అనేక వచనములను బిగ్గరగా పలుకుచూ విలపించెను (21).

రతి ఇట్లు పలికెను-

నేనేమి చేయుదును? ఎక్కడకు పోదును? ఈ దేవతలీనాడు ఎట్టి పనిని చేసిరి? నా భర్తను బలాత్కారముగా తీసుకువచ్చి నాశము జేసిరి (22). హా! హా! నాథా! మన్మథా! స్వామీ! నీవు నాకు ప్రాణప్రియుడవు. సుఖమునిచ్చిన వాడవు. ఇచట ఏమైనది? అయ్యో! అయ్యో! ప్రియా! ప్రియా! అని ఆమె రోదించెను (23).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆమె ఇట్లు విలపించుచున్నదై అనేక వచనములను పలుకజొచ్చెను. మరియ అపుడామె చేతులను, కాళ్లను కొట్టుకొనుచూ జుట్టును పీకుకొనెను (24). అపుడచటి వనచరులందరు ఆమె రోదనమును విని దుఃఖితులైరి. ఓ నారదా! వృక్షములు, వనములోని మృగములు కూడ దుఃఖించినవి (25). ఇంతలో ఇంద్రుడు మొదలగు దేవతలందరు అచటకు వచ్చి మహేశ్వరుని స్మరించుచున్నవారై రతీదేవిని ఓదార్చుచూ ఇట్లు పలికిరి (26).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

12 May 2021

గీతోపనిషత్తు -197

🌹. గీతోపనిషత్తు -197 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 38

🍀 37. యోగ వికారములు - కర్తవ్య విముఖులకు యోగము లేదు. త్రికరణ శుద్ధిగ కర్తవ్యములను నిర్వహించువారికే యోగము కుదురును. జీవితమున కర్తవ్య నిర్వహణము యోగ సాధనమున భాగమే. యోగమునకు కర్మయోగ సిద్ధాంతము మొదటి మెట్టు. యజ్ఞార్థ జీవనము రెండవ మెట్టు. ద్వంద్వములను దాటుట మూడవ మెట్టు. తటస్థుడై యుండుట నాల్గవ మెట్టు. అట్టివాడు ఆత్మ సంయమమునకు కృషి చేయవచ్చును. 🍀

కచ్చిన్నో భయవిభ్రష్ట శ్చిన్నాభ్రమివ నశ్యతి |
అప్రతిష్ఠ మహాబాహో విమూఢ బ్రహ్మణః పథి || 38

అర్జునుడు తన పరిప్రశ్నము నింకను కొనసాగించెను. ఉభయభ్రష్టుడు చెదిరిన మేఘమువలె నశించిపోవును గదా?అందువలన యోగమార్గము ననుసరించు అయతి ఇహపరములను మోసము చెంది నశించును గదా? ప్రస్తుత కాలమున ప్రతివారును యోగవిద్య యందు ప్రవేశించి యోగులు కావలెనని ఆకాంక్షించు చున్నారు.

ఇట్టి ఆకాంక్షను ఆవేశ మావరించి కర్తవ్య విముఖులగు చున్నారు. కర్తవ్య విముఖులకు యోగము లేదు. కర్తవ్యము నుండి పారిపోవు వారికి యోగము కుదరదు. కర్తవ్యములను తప్పించుకు తిరుగు వారికి యోగము కుదరదు. కర్తవ్య నిర్వహణమున వక్రబుద్ధిని ప్రదర్శించు వారికి యోగము కుదరదు. త్రికరణ శుద్ధిగ కర్తవ్యము లను నిర్వహించువారికే యోగము కుదురును. జీవితమున కర్తవ్య నిర్వహణము యోగ సాధనమున భాగమే.

అందువలన ప్రపంచమును మోసగించుచు యోగము సాధించుటకు వీలుపడదు. కుటుంబ పోషణము, సంఘము నందు వృత్తి ఉద్యోగ వ్యాపార మార్గమున సహకారము, జీవుల ఎడల కారుణ్యబుద్ధి, తలిదండ్రుల ఎడల భక్తి ఇత్యాదివి లేకుండ యోగ ప్రవేశము నిష్ఫలము. కర్మ ఫలములను ఆశ్రయించుచు యోగాభ్యాసము చేయువానికి మనసు నిలుకడగ నుండదు.

మిక్కుటమగు ఇష్టాయిష్టములందు కొట్టు మిట్టాడువానికి యోగము జరుగదు. అట్టి వానికి ప్రశాంతత యుండదు. తటస్థబుద్ధి, సమబుద్ధి అనునవి మృగ్యములై, రాగ ద్వేషములతో జీవించును. సంకల్పములు పుట్టలు పుట్టలుగ వచ్చు చుండగ యోగాభ్యాసము చేసి ఉపయోగము లేదు. యోగవిద్య సత్వగుణ సంబంధితము. రజస్తమస్సుల కది అందదు. రజోగుణ ప్రేరితుడైన వాని నుండి నిత్యము సంకల్పములు కోకొల్లలుగ వచ్చుచుండును.

అవి మానవుని బాహ్య ప్రపంచములోనికి నెట్టు చుండును. ఇట్టివాడు యోగము పేరున కర్తవ్య నిర్వహణము మాని భ్రష్టుడగుట జరుగును. యోగమునకు కర్మయోగ సిద్ధాంతము మొదటి మెట్టు. యజ్ఞార్థ జీవనము రెండవ మెట్టు. ద్వంద్వములను దాటుట మూడవ మెట్టు. తటస్థుడై యుండుట నాల్గవ మెట్టు. అట్టివాడు ఆత్మ సంయమమునకు కృషి చేయవచ్చును. సోపాన క్రమమును పాటింపక అడ్డదిడ్డముగ తోచినది చేయువారు యోగ సాధకుల మని భ్రమపడుటయే గాని, యోగము సిద్ధింపనేరదు.

అక్షరములను సరిగ నేర్వక గ్రంథములను రచింతునని పూనుకున్నట్లుండును. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెనలు వేసినట్లు, యోగ సాధన పేరున రకరకములుగ వికారములు ప్రకటింపబడు చుండును. ఇవి యన్నియు నరజాతి పోకడలు. అర్జునుడు నరుడగుటచే నరుల ప్రతినిధిగ ఈ పరిప్రశ్నమును చేసెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

12 May 2021

12-MAY-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 197🌹  
2) 🌹. శివ మహా పురాణము - 397🌹 
3) 🌹 Light On The Path - 144🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -25🌹  
5) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 219🌹
6) 🌹 Osho Daily Meditations - 14🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 74 / Lalitha Sahasra Namavali - 74🌹 
8) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 74 / Sri Vishnu Sahasranama - 74🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -197 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 38

*🍀 37. యోగ వికారములు - కర్తవ్య విముఖులకు యోగము లేదు. త్రికరణ శుద్ధిగ కర్తవ్యములను నిర్వహించువారికే యోగము కుదురును. జీవితమున కర్తవ్య నిర్వహణము యోగ సాధనమున భాగమే. యోగమునకు కర్మయోగ సిద్ధాంతము మొదటి మెట్టు. యజ్ఞార్థ జీవనము రెండవ మెట్టు. ద్వంద్వములను దాటుట మూడవ మెట్టు. తటస్థుడై యుండుట నాల్గవ మెట్టు. అట్టివాడు ఆత్మ సంయమమునకు కృషి చేయవచ్చును. 🍀*

కచ్చిన్నో భయవిభ్రష్ట శ్చిన్నాభ్రమివ నశ్యతి |
అప్రతిష్ఠ మహాబాహో విమూఢ బ్రహ్మణః పథి || 38

అర్జునుడు తన పరిప్రశ్నము నింకను కొనసాగించెను. ఉభయభ్రష్టుడు చెదిరిన మేఘమువలె నశించిపోవును గదా?అందువలన యోగమార్గము ననుసరించు అయతి ఇహపరములను మోసము చెంది నశించును గదా? ప్రస్తుత కాలమున ప్రతివారును యోగవిద్య యందు ప్రవేశించి యోగులు కావలెనని ఆకాంక్షించు చున్నారు. 

ఇట్టి ఆకాంక్షను ఆవేశ మావరించి కర్తవ్య విముఖులగు చున్నారు. కర్తవ్య విముఖులకు యోగము లేదు. కర్తవ్యము నుండి పారిపోవు వారికి యోగము కుదరదు. కర్తవ్యములను తప్పించుకు తిరుగు వారికి యోగము కుదరదు. కర్తవ్య నిర్వహణమున వక్రబుద్ధిని ప్రదర్శించు వారికి యోగము కుదరదు. త్రికరణ శుద్ధిగ కర్తవ్యము లను నిర్వహించువారికే యోగము కుదురును. జీవితమున కర్తవ్య నిర్వహణము యోగ సాధనమున భాగమే. 

అందువలన ప్రపంచమును మోసగించుచు యోగము సాధించుటకు వీలుపడదు. కుటుంబ పోషణము, సంఘము నందు వృత్తి ఉద్యోగ వ్యాపార మార్గమున సహకారము, జీవుల ఎడల కారుణ్యబుద్ధి, తలిదండ్రుల ఎడల భక్తి ఇత్యాదివి లేకుండ యోగ ప్రవేశము నిష్ఫలము. కర్మ ఫలములను ఆశ్రయించుచు యోగాభ్యాసము చేయువానికి మనసు నిలుకడగ నుండదు. 

మిక్కుటమగు ఇష్టాయిష్టములందు కొట్టు మిట్టాడువానికి యోగము జరుగదు. అట్టి వానికి ప్రశాంతత యుండదు. తటస్థబుద్ధి, సమబుద్ధి అనునవి మృగ్యములై, రాగ ద్వేషములతో జీవించును. సంకల్పములు పుట్టలు పుట్టలుగ వచ్చు చుండగ యోగాభ్యాసము చేసి ఉపయోగము లేదు. యోగవిద్య సత్వగుణ సంబంధితము. రజస్తమస్సుల కది అందదు. రజోగుణ ప్రేరితుడైన వాని నుండి నిత్యము సంకల్పములు కోకొల్లలుగ వచ్చుచుండును. 

అవి మానవుని బాహ్య ప్రపంచములోనికి నెట్టు చుండును. ఇట్టివాడు యోగము పేరున కర్తవ్య నిర్వహణము మాని భ్రష్టుడగుట జరుగును. యోగమునకు కర్మయోగ సిద్ధాంతము మొదటి మెట్టు. యజ్ఞార్థ జీవనము రెండవ మెట్టు. ద్వంద్వములను దాటుట మూడవ మెట్టు. తటస్థుడై యుండుట నాల్గవ మెట్టు. అట్టివాడు ఆత్మ సంయమమునకు కృషి చేయవచ్చును. సోపాన క్రమమును పాటింపక అడ్డదిడ్డముగ తోచినది చేయువారు యోగ సాధకుల మని భ్రమపడుటయే గాని, యోగము సిద్ధింపనేరదు. 

అక్షరములను సరిగ నేర్వక గ్రంథములను రచింతునని పూనుకున్నట్లుండును. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెనలు వేసినట్లు, యోగ సాధన పేరున రకరకములుగ వికారములు ప్రకటింపబడు చుండును. ఇవి యన్నియు నరజాతి పోకడలు. అర్జునుడు నరుడగుటచే నరుల ప్రతినిధిగ ఈ పరిప్రశ్నమును చేసెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 397🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 19

*🌻. కామదహనము - 2 🌻*

ఇంతలో దేవతలు స్తుతించుచుండగనే మిక్కిలి క్రుద్ధుడైన శివుని మూడవ కంటి నుండి అపుడు గొప్ప అగ్ని పుట్టెను (14). లలాటమధ్యమునందున్న కంటి నుండి క్షణములో పుట్టిన ఆ అగ్ని ఎత్తైన జ్వాలలతో ప్రళయకాలాగ్నితో సమానమైన తేజస్సు గలదై మండజొచ్చెను (15). మన్మథుడు వెంటనే అంతరిక్షములోనికి ఎగిరి నేలపై బడి క్రిందనే చుట్టూ దొర్లుచుండెను (16). ఓ మహర్షీ! క్షమించుడు, క్షమించుడు అనే దేవతల వచనములు వినబడునంతలో ఆ అగ్ని మన్మథుని బూడిదగా మార్చివేసెను (17).

వీరుడగు ఆ మన్మథుడు మరణించగా దుఃఖితులైన దేవతలు 'అయ్యో! ఏమైనది?' అని ఆక్రోశించువారై ఏడ్వ జొచ్చిరి (18). అపుడు పార్వతీ దేవి యొక్క శరీరము వివర్ణమాయెను. ఆమె మనస్సు వికారమును పొందెను. అపుడామె తన సఖురాండ్రను వెంటబెట్టుకొని తన ప్రాసాదమునకు వెళ్లిపోయెను (19). అపుడచట రతీదేవి భర్త మరణించుటవలన కలిగిన దుఃఖముచే వెనువెంటనే మరణించిన దానివలె నేలపై స్పృహతప్పి పడిపోయెను (20). తెలివి రాగానే రతి మిక్కిలి దుఃఖితురాలై అనేక వచనములను బిగ్గరగా పలుకుచూ విలపించెను (21).

రతి ఇట్లు పలికెను-

నేనేమి చేయుదును? ఎక్కడకు పోదును? ఈ దేవతలీనాడు ఎట్టి పనిని చేసిరి? నా భర్తను బలాత్కారముగా తీసుకువచ్చి నాశము జేసిరి (22). హా! హా! నాథా! మన్మథా! స్వామీ! నీవు నాకు ప్రాణప్రియుడవు. సుఖమునిచ్చిన వాడవు. ఇచట ఏమైనది? అయ్యో! అయ్యో! ప్రియా! ప్రియా! అని ఆమె రోదించెను (23).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆమె ఇట్లు విలపించుచున్నదై అనేక వచనములను పలుకజొచ్చెను. మరియ అపుడామె చేతులను, కాళ్లను కొట్టుకొనుచూ జుట్టును పీకుకొనెను (24). అపుడచటి వనచరులందరు ఆమె రోదనమును విని దుఃఖితులైరి. ఓ నారదా! వృక్షములు, వనములోని మృగములు కూడ దుఃఖించినవి (25). ఇంతలో ఇంద్రుడు మొదలగు దేవతలందరు అచటకు వచ్చి మహేశ్వరుని స్మరించుచున్నవారై రతీదేవిని ఓదార్చుచూ ఇట్లు పలికిరి (26). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 144 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 21. Look for the flower to bloom in the silence that follows the storm: not till then - 11 🌻*

546. Both the astral impulses and the intuitions from above enter the etheric part of the physical brain from the astral plane, but the intuition would come originally either from the causal or from the buddhic body, as the case may be. Since both descend from above it is often difficult to distinguish between them. 

We shall be able to distinguish infallibly at a later stage, because then we shall have our consciousness opened above the astral level and will know certainly whether these promptings arise in the astral body or come from a higher plane. At present most people have not that advantage, and consequently they have to exercise their best judgment with such mind as they have succeeded in developing.

547. When the twenty-one rules are passed and the disciple at Initiation receives a touch of buddhic consciousness, the knowledge of unity appears to him as a great spiritual fact. After that experience there is a difference between him and the ordinary man who asks with his mind. It has often been said that unity is the characteristic of the buddhic plane. That, perhaps, requires a little more explanation. 

One may know something fairly completely in one’s causal body – know the essence of the thing, because the ego, working through the causal body, thinks abstract thoughts. He does not need to descend to examples, for his thoughts pierce through to the heart of the matter. But all that, however wonderful it is, is still done from the outside.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#LightonPath #Theosophy
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 25 🌹
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. గురువు - చైతన్య స్వరూపము - 1 🌻

గురుశబ్దము మహత్తరమైన అర్థముతో కూడుకొన్నది. లౌకికమైన శాస్ర్ర-విజ్ఞాన- ప్రాపంచిక విషయాలను బోధించేవారూ గురువులుగా‌ లోకంలో చెలామణి అవుతున్నారు. 

ఈ చదువు 'కొను' వారు, అమ్మేవారు నేడు వ్యాపారసరళిలోనే ఉంటున్నారు. అందుచేతనే గురుశిష్య‌ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. 

భగవద్విషయమైన 'ఎరుక' కలిగించేదే విద్య. విషయపరిజ్ఞాన మాత్రమైన దానిని విద్యగా ప్రాచీనులు పరిగణించేవారు కాదు. అందుచేతనే 'గురు' శబ్దము సనాతన ధర్మవివేచనలో విశిష్టార్థంలో పరిగణింపబడుట. గురు శబ్దానికి చీకటిని (అజ్ఞానాన్ని) పోగొట్టువాడని అర్థము. 

అట్లే శాసింపబడువాడు శిష్యుడు. గురువుల యందు ఏవేని అప్రియమైన విషయాలు గమనిస్తే వాటిని గుప్తంగా ఉంచేవాడే ఛాత్రుడు.

'గురుదేవోభవ' అనే ఆర్యోక్తి‌ ఒకటున్నది. కబీరు‌ను ఎవరో ఒకమారు అడిగారట! 'దైవమూ గురువు ఒకేసారి దర్శనమిస్తే ఎవరికి ముందు చేతులెత్తి నమస్కరిస్తావు' అని వెంటనే క్ఞణం ఆలస్యం చేయకుండా గురువుకే ముందు నమస్కరిస్తానని చెప్పినాడట. గురువు స్థానము అంతటిది. సాక్షాత్తు పరబ్రహ్మమే గురువు. 

గురువుని గురించి శ్రీ అరవిందయోగి అభిబాషిస్తూ 'గురువును సాధారణముగా సాక్షాదీశ్వరావిర్భావముగా లేక ఈశ్వర ప్రతినిధిగా భావించెదరు. 

వారు తమ ఉపదేశముల వలన, అంతకంటే ఎక్కువగా తమ ప్రభావాదర్శముల వలన మాత్రమే గాక, స్వానుభవమును ఇతరులకు సంక్రమింప చేయునట్టి ఒక శక్తి మూలముననూ సాయపడుతుంటారు.' అన్నారు.
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 14 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 GRACE 🍀*

*🕉 Grace brings beauty -- Grace simply means the aura that surrounds total relaxation. 🕉*

If you move spontaneously, each moment itself decides how it will be. This moment is not going to decide for the next, so you simply remain open-ended. The next moment will decide its own being; you have no plan, no pattern, no expectation.

Today is enough; don't plan for tomorrow, or even for the next moment. Today ends, and then tomorrow comes fresh and innocent, with no manipulator. It opens of its own accord, and without the past. This is grace. Watch a flower opening in the morning. Just go on watching ... this is grace. 

There is no effort at all- the flower just
moves according to nature. Or watch a cat awakening, effortlessly, with a tremendous grace surrounding it. The whole of nature is full of grace, but we have lost the capacity to be graceful because of the divisions within. 

So just move, and let the moment decide--don't try to manage it. This is what I call it let-go --and everything happens out of this. Give it a chance!

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 74 / Sri Lalita Sahasranamavali - Meaning - 74 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।*
*వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀*

🍀 327. కళావతీ - 
కళా స్వరూపిణీ.

🍀 328. కలాలాపా - 
కళలను ఆలాపనా స్వరూపముగా కలిగినది.

🍀 329. కాంతా - 
కామింపబడినటువంటిది.

🍀 330. కాదంబరీ ప్రియా - 
పరవశించుటను ఇష్టపడునది.

🍀 331. వరదా - 
వరములను ఇచ్చునది.

🍀 332. వామనయనా - 
అందమైన నేత్రములు గలది.

🍀 333. వారుణీమదవిహ్వలా - 
వరుణ సంబంధమైన పరవశత్వము చెందిన మనోలక్షణము గలది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 74 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 74. kalāvatī kalālāpā kāntā kādambarīpriyā |*
*varadā vāmanayanā vāruṇī-mada-vihvalā || 74 || 🌻*

🌻 327 ) Kalavathi -   
She who is an artist or she who has crescents

🌻 328 ) Kalaalapa -   
She whose talk is artful

🌻 329 ) Kaantha -   
She who glitters

🌻 330 ) Kadambari priya -   
She who likes the wine called Kadambari or She who likes long stories

🌻 331 ) Varadha -   
She who gives boons

🌻 332 ) Vama nayana -   
She who has beautiful eyes

🌻 333 ) Vaaruni madha vihwala -   
She who gets drunk with the wine called varuni(The wine of happiness)

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 74 / Sri Vishnu Sahasra Namavali - 74 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*మూల నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం*

*🍀 74. మనోజవ స్తీర్థకరో వసురేతా వసుప్రదః|*
*వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః|| 74 🍀*

🍀 690. మనోజవః - 
మనస్సువలే అమితవేగము కలవాడు.

🍀 691. తీర్థకరః - 
సకలవిద్యలను రచించినవాడు.

🍀 692. వసురేతాః - 
బంగారం వంటి వీర్యము గలవాడు.

🍀 693. వసుప్రదః - 
ధనమును ఇచ్చువాడు.

🍀 694. వసుప్రదః - 
మోక్షప్రదాత

🍀 695. వాసుదేవః - 
వాసుదేవునకు కుమారుడు.

🍀 696. వసుః - 
సర్వులకు శరణ్యమైనవాడు.

🍀 697. వసుమనాః - 
సర్వత్ర సమమగు మనస్సు గలవాడు.

🍀 698. హవిః - 
తానే హవిశ్వరూపుడైనవాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 74 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Moola 2nd Padam*

*🌻manōjavastīrthakarō vasuretā vasupradaḥ |*
*vasupradō vāsudevō vasurvasumanā haviḥ || 74 || 🌻*

🌻 690. Manōjavaḥ: 
One who, being all pervading, is said to be endowed with speed likes that of the mind.

🌻 691. Tīrthakaraḥ: 
Tirtha means Vidya, a particular branch of knowledge or skill.

🌻 692. Vasu-retāḥ: 
He whose Retas (Semen) is gold (Vasu).

🌻 693. Vasupradaḥ: 
One who gladly bestows wealth in abundance. He is really the master of all wealth, and others who seem to be so are in those positions only because of His grace.

🌻 694. Vasupradaḥ: 
One who bestows on devotees the highest of all wealth, namely Moksha.

🌻 695. Vāsudevaḥ: 
The son of Vasudeva.

🌻 696. Vasuḥ: 
He in whom all creation dwells.

🌻 697. Vasumanaḥ: 
One whose mind dwells equally in all things.

🌻 698. Haviḥ: 
Havis or sacrificial offerings.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹