✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. గురువు - చైతన్య స్వరూపము - 1 🌻
గురుశబ్దము మహత్తరమైన అర్థముతో కూడుకొన్నది. లౌకికమైన శాస్ర్ర-విజ్ఞాన- ప్రాపంచిక విషయాలను బోధించేవారూ గురువులుగా లోకంలో చెలామణి అవుతున్నారు.
ఈ చదువు 'కొను' వారు, అమ్మేవారు నేడు వ్యాపారసరళిలోనే ఉంటున్నారు. అందుచేతనే గురుశిష్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి.
భగవద్విషయమైన 'ఎరుక' కలిగించేదే విద్య. విషయపరిజ్ఞాన మాత్రమైన దానిని విద్యగా ప్రాచీనులు పరిగణించేవారు కాదు. అందుచేతనే 'గురు' శబ్దము సనాతన ధర్మవివేచనలో విశిష్టార్థంలో పరిగణింపబడుట. గురు శబ్దానికి చీకటిని (అజ్ఞానాన్ని) పోగొట్టువాడని అర్థము.
అట్లే శాసింపబడువాడు శిష్యుడు. గురువుల యందు ఏవేని అప్రియమైన విషయాలు గమనిస్తే వాటిని గుప్తంగా ఉంచేవాడే ఛాత్రుడు.
'గురుదేవోభవ' అనే ఆర్యోక్తి ఒకటున్నది. కబీరును ఎవరో ఒకమారు అడిగారట! 'దైవమూ గురువు ఒకేసారి దర్శనమిస్తే ఎవరికి ముందు చేతులెత్తి నమస్కరిస్తావు' అని వెంటనే క్ఞణం ఆలస్యం చేయకుండా గురువుకే ముందు నమస్కరిస్తానని చెప్పినాడట. గురువు స్థానము అంతటిది. సాక్షాత్తు పరబ్రహ్మమే గురువు.
గురువుని గురించి శ్రీ అరవిందయోగి అభిబాషిస్తూ 'గురువును సాధారణముగా సాక్షాదీశ్వరావిర్భావముగా లేక ఈశ్వర ప్రతినిధిగా భావించెదరు.
వారు తమ ఉపదేశముల వలన, అంతకంటే ఎక్కువగా తమ ప్రభావాదర్శముల వలన మాత్రమే గాక, స్వానుభవమును ఇతరులకు సంక్రమింప చేయునట్టి ఒక శక్తి మూలముననూ సాయపడుతుంటారు.' అన్నారు.
🌹 🌹 🌹 🌹 🌹
12 May 2021
No comments:
Post a Comment