🍀 13 - SEPTEMBER - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀

🌹🍀 13 - SEPTEMBER - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 13, సెప్టెంబర్ 2022 మంగళవారం, భౌమ వాసరే TUESDAY 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 262 / Bhagavad-Gita -262 - 6-29 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 661 / Vishnu Sahasranama Contemplation - 661 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 623 / Sri Siva Maha Purana - 623 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 340 / DAILY WISDOM - 340 🌹   
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 240 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹13, September 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్టి చతుర్థి, చతుర్థి శ్రద్ధ, Chaturthi Shraddha, Sankashti Chaturthi🌻*

*🍀. సంకట మోచన హనుమాన్ స్తుతి - 4 🍀*

*4. శోకాన్వితాం జనకజాం కృతవానశోకాం*
*ముద్రాం సమర్ప్య రఘునందన- నామయుక్తాం.*
*హత్వా రిపూనరిపురం హుతవాన్ కృశానౌ*
*ర్జానాతి కో న భువి సంకటమోచనం త్వాం.*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మనం అజ్ఞాన బంధంలో తగుల్కొని వున్నప్పుడు కూడా మనలోని భగవంతుడు మనకు అండగా వుండి నడిపిస్తూనే వున్నాడు. అయితే, గమ్యస్థానం చేరుకోడం నిశ్చయమే అయినా. అది చుట్టుత్రోవలు. ప్రక్కత్రోవలు, పట్టిన అనంతరం చేరుకోడ మవుతుంది. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,
వర్ష ఋతువు, భాద్రపద మాసం
తిథి: కృష్ణ తదియ 10:39:36 వరకు
తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: రేవతి 06:36:23 వరకు
తదుపరి అశ్విని
యోగం: వృధ్ధి 07:35:52 వరకు
తదుపరి ధృవ
కరణం: విష్టి 10:41:36 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 08:31:01 - 09:20:07
రాహు కాలం: 15:16:00 - 16:48:03
గుళిక కాలం: 12:11:55 - 13:43:58
యమ గండం: 09:07:50 - 10:39:53
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:35
అమృత కాలం: -
సూర్యోదయం: 06:03:46
సూర్యాస్తమయం: 18:20:05
చంద్రోదయం: 20:32:31
చంద్రాస్తమయం: 08:33:38
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మీనం
శుభ యోగం - కార్య జయం 06:36:23
వరకు తదుపరి అమృత యోగం
 - కార్య సిధ్ది 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 262 / Bhagavad-Gita - 262 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 29 🌴*

*29. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని |*
*ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన: ||*

🌷. తాత్పర్యం :
*నిజమైన యోగి నన్ను సర్వజీవుల యందును మరియు సర్వజీవులను నా యందును గాంచును. ఆత్మదర్శియైన అట్టివాడు దేవదేవుడైన నన్నే నిక్కముగా సర్వత్రా గాంచును.*

🌷. భాష్యము :
సర్వుల హృదయములలో పరమాత్మ రూపున స్థితుడై యున్న శ్రీకృష్ణభగవానుని గాంచగలిగినందున కృష్ణభక్తిరసభావితుడైన యోగి నిజమైన ద్రష్ట యనబడును. “ఈశ్వర: సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి”. శ్రీకృష్ణభగవానుడు పరమాత్మ రూపములో శునక హృదయము నందును మరియు బ్రహ్మణుని హృదయమునందును నిలిచి యుండును. ఆ భగవానుడు నిత్యముగా భౌతికముగా ప్రభావితుడు కాడనియు పూర్ణయోగి ఎరిగి యుండును. ఆ విధముగా భౌతికత్వముచే ప్రభావితము కాకుండుటయే భగవానుని దివ్యమైన తటస్థ స్వభావమై యున్నది. పరమాత్మతో పాటు జీవాత్మయు హృదయమందు నిలిచియున్న పరమాత్మ వలె అది ఎల్లరి హృదయములలో నిలిచియుండలేదు. 

ఇదియే జీవాత్మ మరియు పరమాటం నడుమ గల భేదము. నిజమైన యోగాభ్యాసము నందు నియుక్తుడు కానివాడు ఈ విషయమున స్పష్టముగా గాంచలేదు. బాహ్యమునను జీవులు సదా భగవానుని శక్తి యందే నిలిచి యుందురు. సప్తమాధ్యాయమున వివరింపబడినట్లు ఆధ్యాత్మికశక్తి (ఉత్తమము), భౌతికశక్తి (అల్పము) యను రెండు శక్తులను శ్రీకృష్ణభగవానుడు ప్రధానముగా కలిగియుండును. జీవుడు ఉత్తమశక్తి అంశయైన అల్పమైన భౌతికశక్తిచే బద్ధుడై యుండును. ఈ విధముగా అతడు సర్వదా భగవానుని శక్తి యందున్నట్టివాడే. అనగా జీవుడు భగవానుని యందే ఏదో ఒక విధముగా స్థితిని కలిగియున్నట్టివాడే యగుచున్నాడు.

జీవులు తమ కర్మఫలముల ననుసరించి వివిధస్థితుల యందున్నప్పటికిని ఆన్ని పరిస్థితుల యందును వారు శ్రీకృష్ణభగవానుని దాసులే యని గాంచగలిగినందున యోగి సమదర్శియై యుండును. భౌతికశక్తి యందు నిలిచినపుడు జీవుడు ఇంద్రియములను సేవించును. కాని అదే జీవుడు ఆధ్యాత్మికశక్తి యందు నిలిచినప్పుడు మాత్రము ప్రత్యక్షముగా భగవానుని సేవించును. ఈ విధముగా రెండు పరిస్థితుల యందును అతడు భగవానుని దాసుడే. ఇట్టి సమత్వ వీక్షణము కృష్ణభక్తిభావనాపూర్ణుడైన వ్యక్తి యందు పూర్ణముగా నుండును.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 262 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 6 - Dhyana Yoga - 29 🌴*

*29. sarva-bhūta-stham ātmānaṁ sarva-bhūtāni cātmani*
*īkṣate yoga-yuktātmā sarvatra sama-darśanaḥ*

🌷 Translation : 
*A true yogī observes Me in all beings and also sees every being in Me. Indeed, the self-realized person sees Me, the same Supreme Lord, everywhere.*

🌹 Purport :
A Kṛṣṇa conscious yogī is the perfect seer because he sees Kṛṣṇa, the Supreme, situated in everyone’s heart as Supersoul (Paramātmā). Īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe ’rjuna tiṣṭhati. The Lord in His Paramātmā feature is situated within both the heart of the dog and that of a brāhmaṇa. The perfect yogī knows that the Lord is eternally transcendental and is not materially affected by His presence in either a dog or a brāhmaṇa. That is the supreme neutrality of the Lord. The individual soul is also situated in the individual heart, but he is not present in all hearts. 

That is the distinction between the individual soul and the Supersoul. Outwardly, also, every living being is situated in the energy of the Lord. As will be explained in the Seventh Chapter, the Lord has, primarily, two energies – the spiritual (or superior) and the material (or inferior). The living entity, although part of the superior energy, is conditioned by the inferior energy; the living entity is always in the Lord’s energy. Every living entity is situated in Him in one way or another.

The yogī sees equally because he sees that all living entities, although in different situations according to the results of fruitive work, in all circumstances remain the servants of God. While in the material energy, the living entity serves the material senses; and while in the spiritual energy, he serves the Supreme Lord directly. In either case the living entity is the servant of God. This vision of equality is perfect in a person in Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 661 / Vishnu Sahasranama Contemplation - 661🌹*

*🌻661. బ్రహ్మణ్యః, ब्रह्मण्यः, Brahmaṇyaḥ 🌻*

*ఓం బ్రహ్మణ్యాయ నమః | ॐ ब्रह्मण्याय नमः | OM Brahmaṇyāya namaḥ*

*తపో వేదాశ్చ విప్రాశ్చ జ్ఞానం చ బ్రహ్మ సంజ్ఞితమ్।*
*తేభ్యో హితత్వాద్బ్రహ్మణ్య ఇతి విష్ణుః సమీర్యతే ॥*

*తపస్సు, వేదములు, విప్రులు, జ్ఞానము - ఇవి బ్రహ్మ అను సంజ్ఞ కలవి. వీనికి హితము కలిగించువాడుగనుక విష్ణువు బ్రహ్మణ్యః అని చెప్పబడును.*

:: ఋగ్వేదాన్తర్గత ఆత్మ బోధోపనిషత ::
...బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూధనః ।
బ్రహ్మణ్యః పుణ్డరీకాక్షో బ్రహ్మణ్యో విష్ణురచ్యుతః... ॥ 2 ॥

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 661🌹*

*🌻661. Brahmaṇyaḥ 🌻*

*OM Brahmaṇyāya namaḥ*

तपो वेदाश्च विप्राश्च ज्ञानं च ब्रह्म संज्ञितम् ।
तेभ्यो हितत्वाद्ब्रह्मण्य इति विष्णुः समीर्यते ॥

*Tapo vedāśca viprāśca jñānaṃ ca brahma saṃjñitam,*
*Tebhyo hitatvādbrahmaṇya iti viṣṇuḥ samīryate.*

*Austerity, the Vedas, sages and wisdom are indicated by the word Brahma. As Lord Viṣṇu is beneficial to them, He is called Brahmaṇyaḥ.*

:: ऋग्वेदान्तर्गत आत्म बोधोपनिषत ::
...ब्रह्मण्यो देवकीपुत्रो ब्रह्मण्यो मधुसूधनः ।
ब्रह्मण्यः पुण्डरीकाक्षो ब्रह्मण्यो विष्णुरच्युतः... ॥ २ ॥

Ātmabodhopaniṣat
...Brahmaṇyo devakīputro brahmaṇyo madhusūdhanaḥ,
Brahmaṇyaḥ puṇḍarīkākṣo brahmaṇyo viṣṇuracyutaḥ.... 2.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।
ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥
బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।
బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥
Brahmaṇyo brahmakr‌dbrahmā brahma brahmavivardhanaḥ,
Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 623 / Sri Siva Maha Purana - 623 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 10 🌴*
*🌻. తారకాసుర వధ - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

శత్రు సంహారకుడగు కుమారస్వామి ఆ వీరభద్రుని ఆపి, శివుని పాదపద్మములను తారకుని వధించుటకు సంకల్పించెను (1). అపుడు మహాతేజస్వి, మహాబలశాలి యగు కార్తికేయుడు గర్జించి, పెద్ద సైన్యముతో కూడిన వాడై కోపముతో యుద్దమునకు సన్నధ్ధుడాయెను (2). 

అపుడు దేవతలు, గణములు జయజయ ధ్వానములను చేసిరి. దేవర్షులు తమకు సమ్మతమైన వాక్కులతో అదే సమయములో స్తోత్రమును పలికిరి (3). అపుడు తారక కుమారులకు మిక్కిలి సహింప శక్యము కానిది, సర్వప్రాణులకు పెద్ద భయమును కలిగించునది అగు మహాయుద్ధము జరిగెను (4).

ఓ మునీ! అందరు మహాశ్చర్యముతో చూచుచుండగా ఆ ఇద్దరు వీరులు శక్తులను చేతబట్టి ఒకరితో నొకరు యుధ్ధమును చేసిరి (5). వారిద్దరి దేహములకు శక్తి ప్రహారములచే గాయములయ్యెను. మహాబలురగు వారు గొప్ప సాధనములు గలవారై ఒకరిపై నొకరు సింహములవలె లంఘించిరి (6). వైతాలిక, ఖేచర, పాపంత ఇత్యాది యుద్ధగతులను చేపట్టి శక్తితో శక్తిని కొట్టుచూ వారు యుద్ధమును చేసిరి (7). మహాబలపరా క్రమవంతులు, మహావీరులనగు వారిద్దరు ఈ యుక్తులతో పరస్పరము కొట్టుకొనుచూ అద్భుతమగు యుద్ధమును చేసిరి (8).

యుధ్ధపండితులగు వారిద్దరు ఒకరినొకరు వధించగోరి మహాబలమును ప్రదర్శిస్తూ యుద్ధములో శక్తిధారలతో కొట్టుకొనిరి (9). ఒకరినొకరు శిరస్సుపై, కంఠమునందు, తొడలయందు, మోకాళ్లపై, నడుముపై, వక్షస్థ్సలముపై, వెనుక భాగమునందు ఛేదించుకొనిరి(10). అనేకరకముల యుద్ధములలో దక్షులగు వారిద్దరు మహాబలము గలవారై ఒకరొనొకరు సింహరించగోరి యుద్ధము చేయుచూ బిగ్గరగా సంహనాదములను చేసిరి (11). దేవతలు, గంధర్వులు, కిన్నరులు అందరు ప్రేక్షకులైరి. ఈ యుద్ధములో విజేతలెవరు? అని వారిలో వారు చర్చించు కొనిరి (12).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 623🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 10 🌴*

*🌻 Jubilation of the gods at the death of Tāraka - 1 🌻*

Brahmā said:—

1. After preventing Vīrabhadra, Kumāra, the slayer of enemies, desired the destruction of Tāraka after remembering the lotuslike feet of Śiva.

2. Then the powerful Kārttikeya of great splendour roared. Angrily he got ready for the fight. He was surrounded by a vast army.

3. Shouts of victory were raised by the gods and the Gaṇas. He was eulogised by the celestial sages with pleasing words.

4. The fight between Tāraka and Kumāra was terrific and unbearable. All the living beings were afraid.

5. O sage, even as all the persons stood gazing wonderingly, both of them fought each other with spears in their hands.

6. Each was wounded in the heart by the other with the spear. Each tried to escape from the other’s. thrust. Both were equally strong like two lions. Both were fully equipped for the fight.

7. They fought and hit each other’s spear taking recourse to the mantras Vaitālika, Khecaraka, Prāptika etc.[1]

8. With these mantras they were possessed of magical properties. They wonderfully fought each other using their full strength and exploits.

9. They were equally good adepts in fighting. Each wanted to kill the other. They utilised all their power. With the edges of spears they hit each other.

10. They hit or cut each other’s head, neck, thighs, knees, hips, heart, chest and the back.

11. They continued the fight swaggering and vaunting with heroic words. They were experts in different tactics of warfare. They were equally strong. They desired to kill each other.

12. All the gods Gandharvas and Kinnaras stood as mere onlookers. “Who will win this battle?” they asked each other.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 340 / DAILY WISDOM - 340 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*

*🌻 5. మతపర చైతన్యంలోకి ప్రవేశించడం🌻*

*ఎవరైనా ఏ స్థాయిలో అయినా మత పరమైన చైతన్యంలోకి ప్రవేశించి నప్పుడు పూర్తిగా వేరే స్థాయికి తీసుకు వెళ్ళబడతారు. ఆత్మ ఒక అమితానంద స్థితిలో ఉంటుంది. అప్పుడు వారు ఒక ఆనంద సముద్రంలో తేలుతూ ఉంటారు. ఎందుకంటే నిమ్న జగత్తులలో బంధింప బడిన దానిని పూర్ణత్వం ఉన్నతత్వం వైపు లాగుతుంది. తన కవచాల నుంచి వ్యక్తిత్వం వేరు చేయబడుతుంది.*

*ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదుగుతున్న ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడంలో మనం ఎన్ని చిత్రాలు లేదా వర్ణనలను ఉపయోగించినప్పటికీ, ఆ పదాలతో ఆత్మను అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా తప్ప మతం యొక్క సార్వత్రిక కోణాన్ని ఆవిష్కరించడానికి ఏ ప్రవక్త ప్రయత్నించలేదు. విశ్వ వ్యాపకమైన దాన్ని గ్రహించడం కేవలం విశ్వ వ్యాప్తమైన దాని ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 340 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*

*🌻 5. Entering Religious Consciousness🌻*

*When one enters the religious consciousness, in any degree whatever, one gets transported totally. The soul is in a state of rapture. One is then in a large sea of delight because the whole that is above is trying to pull one out from the lower levels in which one is encased. It is as if the pith of one's individuality is being drawn out of its shell.*

*Whatever image or description we can employ in understanding this process of the rise of one's being into the levels of religion, we will find that words cannot touch the spirit. No prophet has endeavoured to describe the universal dimension of religion in its essentiality, except in terms of the requirements of a particular time historically, or of a place geographically. The universal can be comprehended only by itself.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 239 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. దేవుడు ఒక వ్యక్తి, అన్న భావాన్ని వదిలిపెట్టు. ఎక్కడో పై లోకంలో వున్నాడన్న భావాన్ని వదిలిపెట్టు. దేవుడంటే సమస్తమైన అస్తిత్వం. అది జీవితానికి మరో పేరు. జీవితాన్ని వీలయినంత సంపూర్ణంగా జీవించు. 🍀*

*నీ మతం భయం నించి బయట పడింది కాదు. ప్రేమ నించి బయటపడింది, వేరయింది. నరకానికి భయపడకు. నరకమన్నది లేదు. ఎప్పుడూ లేదు. మానవజాతిని మభ్యపెట్టడానికి పన్నిన వల అది. అది శతాబ్దాలుగా జరుగుతోంది. అట్లాగే స్వర్గమన్నది కూడా లేదు. స్వర్గ నరకాలు ఒక రకమైనవి వున్నాయి. అవి మానసికమయినవి. అవి నీలో వున్నాయి. ఎక్కడో లేవు. పాతాళంలో, ఆకాశంలో లేవు. వాటికి ఎట్లాంటి భౌగోళిక ఆవరణం లేదు.*

*స్వర్గనరకాల ఆలోచనల్ని వదిలిపెట్టు. అదంతా చెత్తా చెదారం. దేవుడు ఒక వ్యక్తి, అన్న భావాన్ని వదిలిపెట్టు. ఎక్కడో పై లోకంలో వున్నాడన్న భావాన్ని వదిలిపెట్టు. దేవుడంటే సమస్తమైన అస్తిత్వం. అది జీవితానికి మరో పేరు. జీవితాన్ని ప్రేమించు. జీవితాన్ని ఆరాధించు. జీవితాన్ని వీలయినంత సంపూర్ణంగా జీవించు. జీవితానికి నిన్ను నువ్వు సమర్పించుకో. అప్పుడు గొప్ప ఆనందం మొదలవుతుంది. దానికి ఆరంభముంటుంది కానీ అంతముండదు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Something is missing


🌹Something is missing 🌹

Prasad Bharadwaj


Unless a tree blossoms, it knows no blissfulness. It goes on feeling something is missing.

You may have all the pleasures and comforts and luxuries of the world, but unless you know yourself, unless your inner lotus opens, you will go on missing something. You may not be certain what you are missing but a feeling... that something is being missed, that ”I am not complete,” that ”I am not whole,” that ”I am not what existence wanted me to be."

This ”missing” feeling goes on nagging everybody. Only the expansion of your consciousness will help you to get rid of this feeling, of this nagging, of this anguish, this angst.

🌹🌹🌹🌹🌹

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 6


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 6🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।
మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀

🌻 403. 'మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ' - 6 🌻


'కుముద' అను పదమునకు కూడ మరియొక అర్థ మున్నది. 'ముద' అనగా మోదము. కుముద అనగా హరింపబడిన మోదము. దుఃఖము కారణముగ మోదము హరింపబడును. దుఃఖితులైన భక్తులు కుముదములవంటి వారు. వారికి ఆహ్లాదము కలిగించి మహా కామేశుని వద్దకు దివ్యకాంతుల మార్గమున శ్రీమాత గొనిపోవునని ఈ నామార్ధము.

సంసారబద్ధులైన భక్తులకు ఈ అర్థము సమంజసమై యున్నది. భక్తుల దుఃఖములను పోగొట్టి ఆహ్లాదమును కూర్చి దివ్య మార్గమున గొనిపోయి పరమశివుని చెంతకు చేర్చు శ్రీమాతను ఎంత శ్లాఘించిననూ అల్పమే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 6 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini
Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻


🌻 403. 'Mahakamesha Nayana Kumudahlada Kaumudi' - 6 🌻

The word 'Kumuda' also has another meaning. 'Muda' means bliss. Kumuda means drained bliss, meaning sorrow. Sadness is the cause of sorrow. Sorrowful devotees have their bliss drained from them. Srimata, by reinvigorating bliss in them, shall take those devotees on the path of light to the Lord Shiva.

This meaning seems reasonable for the uncelibate devotees. It is not enough to praise Sri Mata who removes the sorrows of the devotees and gathers happiness and leads them on the divine path and brings them to the side of Lord Shiva.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

ఓషో రోజువారీ ధ్యానాలు - 243. కాంతి / Osho Daily Meditations - 243. LIGHT


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 243 / Osho Daily Meditations - 243 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 243. కాంతి 🍀

🕉. మరింత ఎక్కువ కాంతితో నిండిన అనుభూతిని పొందండి. అసలు మూలానికి దగ్గరగా రావడానికి ఇది మార్గం. 🕉

మరింత ఎక్కువ కాంతితో నిండిన అనుభూతిని పొందండి. మీరు కళ్ళు మూసుకున్నప్పుడల్లా, మీ జీవి అంతటా ప్రసరించే కాంతిని చూడండి. ప్రారంభంలో ఇది కల్పనగా ఉంటుంది, కానీ ఊహ చాలా సృజనాత్మకంగా ఉంటుంది. కాబట్టి కేవలం గుండె దగ్గర ఒక మంటను ఊహించుకోండి మరియు మీరు కాంతితో నిండి ఉన్నారని ఊహించుకోండి. ఆ కాంతిని పెంచుతూ ఉండండి. ఇది దాదాపు అబ్బుర పరుస్తుంది! మరియు మీరు అనుభూతి చెందడం మాత్రమే కాదు; ఇతరులు కూడా అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. మీరు వారికి దగ్గరగా ఉన్నప్పుడు, వారు దానిని అనుభవించడం ప్రారంభిస్తారు, ఎందుకంటే అది కంపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరి జన్మహక్కు, కానీ దానిని సాధించుకోవాలి. ఇది హక్కు కోసం దావా చేయని నిధి. మీరు దానిపై అధికారం పొందక పోతే, అది చనిపోయి, భూమి కింద ఖననం చేయబడి ఉంటుంది.

మీరు దానిని సాధించినట్లయితే, మీరు మీ స్వంత అంతరంగాన్ని సొంతం చేసుకున్నారు. కాబట్టి మీరు ఎక్కడ వెలుతురును చూసినా, లోతైన గౌరవాన్ని అనుభవించండి. సాధారణమైనది - ఒక దీపం మండుతోంది, మరియు మీరు లోతైన భక్తిని, ఒక నిర్దిష్ట విస్మయాన్ని అనుభవిస్తారు. రాత్రిపూట నక్షత్రాలు ఉన్నాయి - వాటిని చూసి, వాటితో అనుసంధానం అయిన అనుభూతిని పొందండి. ఉదయం, సూర్యుడు ఉదయిస్తాడు. దాన్ని చూడండి మరియు దానితో మీ లోపలి సూర్యుడు ఉదయించనివ్వండి. మీరు వెలుతురును చూసినప్పుడల్లా, వెంటనే దానితో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి - ఇలా చేస్తూ వుంటే త్వరలో మీరు చేయగలరు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 243 🌹

📚. Prasad Bharadwaj

🍀 243. LIGHT 🍀

🕉. Feel more and more full of light. That's the way to come closer to the original source. 🕉


Feel more and more full of light. Whenever you close your eyes, just see light streaming all over your being. In the beginning it will be imagination, but imagination is very creative. So just imagine a flame near the heart and imagine that you are full of light. Keep increasing that light. It becomes almost dazzling! And not only you will start feeling it; others will start feeling it too. Whenever you are close to them, they will start feeling it, because it vibrates. It is everybody's birthright, but one has to claim it. It is an unclaimed treasure. If you don't claim it, it remains dead, buried under the ground.

Once you claim it, you have claimed your own inner being. So wherever you see light, feel deep reverence. Just something ordinary--a lamp is burning, and you feel a deep reverence, a certain awe. In the night there are stars-just watch them and feel connected to them. In the morning, the sun rises. Watch it and let the inner sun rise with it. Whenever you see light, immediately try to make contact with it--and soon you will be able to.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మదగ్ని మహాపురాణము - 108 / Agni Maha Purana - 108


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 108 / Agni Maha Purana - 108 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 34

🌻. హోమ విధి - అగ్ని కార్య కథనము - 2🌻


'ఫట్‌' అను అస్త్రమంత్రమును ఉచ్చరించుచు (పుష్పములు చల్లి విఘ్నములను తొలగించిన పిదప మండలములోనికి ప్రవేశించవలెను. భూతశుద్ధి, న్యాసము, ముద్రలు చేసి, శిఖకు ('వషట్‌'కు) చివర 'ఫట్‌' చేర్చి జపించుచు నాలుగు దిక్కులందును ఆవాలు చల్లవలెను. పిమ్మట వాసుదేవ మంత్రముతో గోమూత్రమును, సంకర్షణమంత్రముతో గోమయమును, ప్రద్యుమ్నమంత్రముతో గోదుగ్ధమును, అని రుద్ధమంత్రముతో పెరుగును, నారాయణమంత్రముతో ఘృతమును గ్రహించి, వాటి నన్నింటిని ఘృతపాత్రమునందు కలపవలెను. ఇతరవస్తువుల భాగములు నేతికంటె ఎక్కువ ఉండవలెను.

వీటి నన్నింటిని కలుపగా పంచగవ్య మేర్పడును, పంచగవ్యమును ఒక పర్యాయము, రెండు పర్యాయములు, లేదా మూడు పర్యాయములు వేరు వేరుగ చేయవలెను. వీటిలో ఒకటి మండపప్రోక్షణమున కుపయోగింపవలెను. రెండవది తినుటకును, మూడవది స్నానమునందును ఉయోగింపవలెను. పది కలశలును స్థాపించి వాటిపై ఇంద్రాదిలోకపాలులను పూజింపవలెను. పూజ చేసి వారికి శ్రీహరి అజ్ఞను వినిపింపవలెను. ''ఓ లోకపాలులారా! శ్రీహరి అజ్ఞ ప్రకారము మీరు ఈ యజ్ఞమును రక్షించుటకై ఎల్లపుడును ఇచట నుండవలెను. ''

యాగద్రవ్యాదులను సంరక్షించుకొని వికిరద్రవ్యములను (విఘ్ననివారణముకొరకై నాలుగు వైపులను చల్లు ఆవాలు మొదలుగువాటికి విరము లనిపేరు) చల్లవలెను. అస్త్రమూలమంత్రమును (అస్త్రాయ ఫట్‌ ) ఏడు సార్లు జపించుచు ఈ వికిరములను చల్లవలెను. మరల అదే విధముగ అస్త్రమంత్రమును జపించుచు కుశనిర్మితకూర్పమును తీసికొనవలెను.

వాటిని ఊశానకోణము నందుంచి వాటి పైన కలశములను వర్ధనిని ఉంచవెను. కలశముపై సాంగముగ శ్రీహరి పూజ చేసి, వర్ధనిలో అస్త్రపూజ చేయవలెను. అచ్ఛిన్నమగు వర్ధనీధారచే యాగమండపములను ప్రదక్షిణక్రమమున తడుపుచు కలశమును దానికి ఉపయుక్త మగు స్థానమున చేర్చి, ఆసనముపై ఉంచి, దాని పూజ చేయవలెను.

కలశలో పంచరత్నము లుంచవలెను, దానిపై వస్త్రము చుట్టవలెను. దానిపై గంధాద్యుపచారమలతో శ్రీహరిని పూజింపవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana - 108 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 34

🌻 Mode of performing oblation - 2 🌻


9-10. Having recited the mystic syllable ending with phaṭ. one should scatter mustard seeds in different directions. (One should sanctify) the cow’s urine with Vāsudeva, cow’s dung with Saṅkarṣaṇa, the milk with Pradyumna and the curd. got from it with Nārāyaṇa. The ghee should be one part and the others respectively one part more.

11. When these are mixed in a vessel of ghee it is known as the pañcagavya[6] (the five products got from a cow). A part of it is for the sprinkling of the temple building and the other for eating.

12. One should worship Indra and other guardian deities of the world in ten pitchers which have been brought. Having worshipped them one has to make them hear command. They must be installed by the command of Hari.

13. Having kept the articles of sacrifice well-protected, one must scatter those which must be scattered. Having recited. the basic mystic syllable eight hundred times one should take kuśa grass.

14. Then one should place there a pitcher and (the vessel) vardhanī at the north-east. Having worshipped Hari along with the attendant gods in the pitcher one should worship weapons in the (vessel) vardhanī.

15. (Having made) a circumambulation of the sacrificial place, water is sprinkled in broken streams by the vardhanī. Then the pitcher should be taken and worshipped at a fixed place.

16. Hari should be worshipped with perfumes etc. in the pitcher adorned with five gems and cloth and the weapons (should be worshipped) at the left in the Vardhanī in which gold has been placed.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

కపిల గీత - 69 / Kapila Gita - 69


🌹. కపిల గీత - 69 / Kapila Gita - 69🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 25 🌴

25. సహస్ర శిరసం సాక్షాద్యమనన్తం ప్రచక్షతే
సఙ్కర్షణాఖ్యం పురుషం భూతేన్ద్రియమనోమయమ్


మహత్ తత్వమునకు వాసుదేవుడు అధిష్టాత అయినట్లు, అహంకారానికి అధిష్టాత సంకర్షణుడు (ఈయననే అనంతుడనీ, ఆది శేషుడనీ, సహస్ర పడగలు కలవాడు). సంకర్షణుడే భూత (పంచ భూతాలు), ఇంద్రియ (పది ఇంద్రియాలు), మనో మయుడు. అహంకారం వలననే మనసూ, ఇంద్రియాలు, పంచభూతములూ పుట్టాయి.

ఈ అహంకారము దేవతా రూపమున కర్తృత్వము,ఇంద్రియ రూపమున కరణత్వము, పంచ మహాభూతముల రూపముస కార్యత్వము అను లక్షణములను కలిగి యుండును.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Kapila Gita - 69 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 25 🌴


25. sahasra-śirasaṁ sākṣād yam anantaṁ pracakṣate
saṅkarṣaṇākhyaṁ puruṣaṁ bhūtendriya-manomayam

The threefold ahaṅkāra, the source of the gross elements, the senses and the mind, is identical with them because it is their cause. It is known by the name of Saṅkarṣaṇa, who is directly Lord Ananta with a thousand heads.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

12 Sep 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹12, September 2022 పంచాగము - Panchagam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : తృతీయ శ్రద్ధ Tritiya Shraddha 🌻

🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం 🍀


శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం
శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహన్తం |
నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం చాంకుశం వామభాగే
నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : జ్ఞాన అనుష్ఠానం - నీవు తెలుసుకొన్న దానిని ఆచరణలో పెట్టి, అదే నీవై పోవడం నేర్చుకో. అప్పుడు, ఆ జ్ఞానమే నీ లోపల ప్రత్యక్ష దైవంగా నీకు భాసిస్తుంది.🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, వర్ష ఋతువు,

దక్షిణాయణం, భాద్రపద మాసం

తిథి: కృష్ణ విదియ 11:37:06

వరకు తదుపరి కృష్ణ తదియ

నక్షత్రం: ఉత్తరాభద్రపద 07:00:53

వరకు తదుపరి రేవతి

యోగం: దండ 09:31:25 వరకు

తదుపరి వృధ్ధి

కరణం: గార 11:40:05 వరకు

వర్జ్యం: -

దుర్ముహూర్తం: 12:36:51 - 13:26:00

మరియు 15:04:19 - 15:53:28

రాహు కాలం: 07:35:47 - 09:07:57

గుళిక కాలం: 13:44:26 - 15:16:36

యమ గండం: 10:40:07 - 12:12:16

అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:36

అమృత కాలం: 02:24:24 - 03:56:16

సూర్యోదయం: 06:03:37

సూర్యాస్తమయం: 18:20:55

చంద్రోదయం: 19:54:32

చంద్రాస్తమయం: 07:39:12

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: మీనం

గద యోగం - కార్య హాని , చెడు

07:00:53 వరకు తదుపరి మతంగ

యోగం - అశ్వ లాభం

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹