శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 315 / Sri Lalitha Chaitanya Vijnanam - 315


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 315 / Sri Lalitha Chaitanya Vijnanam - 315🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀

🌻 315. 'రతిరూపా' - 🌻


ఈశ్వర రతి వలన ఇనుమడించిన అందమైన రూపము కలది శ్రీమాత అని అర్ధము. రతిప్రియత్వ మామె లక్షణము, సతతము కామేశ్వరుని యందే యుండునది శ్రీమాత. అవ్యక్తమున తత్త్వమై వుండుట వ్యక్తమున కలసియుండుట అగుట చేత ప్రధానమగు రతి లక్షణము ఆమెదే. విడివడుట యుండదు. రతీదేవి ఆమె అంశయే. అవ్యక్తము నందు ఆమె, ఆయన అను స్థితులు లేవు. ఆ యందు వున్న తత్త్వమును ఆమె అనలేము. ఆయన అని కూడ అనలేము. రెంటికిని మూలమగు తత్త్వమది. కాలము ననుసరించి ఈ తత్త్వము రెండుగ ఒకే మారు ఏర్పడును. అపుడు మూలపురుషుడు మూలప్రకృతిగ, ధన, ఋణ ప్రజ్ఞలుగ ఏర్పడును. ప్రకృతి ఎనిమిది ఆవరణలు ఏర్పరచు కొనినపుడు కూడ అందు అంతర్హితమై పురుషుడుండును. కనుక శాశ్వతముగ ప్రకృతి పురుషులు కలిసే యున్నవిగాని విడివడుట ఎన్నడూ జరుగదు.

వ్యక్తమై అష్ట ప్రకృతులుగ మూలప్రకృతి తొమ్మిది ఆవరణములుగ వ్యాపించునపుడు అందు అంతర్యామియై పురుష తత్వము వుండుచు నుండును. ఆమె యేర్పరచిన ప్రకృతి స్థితుల లోనికి అతడు ప్రవేశించుట వలననే అతనిని పురుషుడనిరి. పురము లన్నియూ ఆకారములే. అందు వసించువాడు పురుషుడు. ఆకారము లేక పురుషుని దర్శించుట దుర్లభము. పురుషుడు లేక ఆకార మేర్పడుట దుస్సాధ్యము. అతడు 'అ'కారము. ఆమె “ఈ'కారము. సృష్టి అంతయూ ఈ రెండు అక్షరముల రసాయనమే. ఆమె యందు ఆయనను దర్శించుట పూర్ణదర్శనము. ఆయన యందు ఆమెను దర్శించుట కూడ పూర్ణ దర్శనమే. విడదీయరాని రెంటిని విడదీసి చూచుటకు చేయు ప్రయత్న మంతయూ వికారమే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 315 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya
Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻

🌻 315. Ratirūpā रतिरूपा (315) 🌻


She is in the form of Rati, the wife of love god Manmatha, who is also known as Kāma (lust). In the earlier two nāma-s, the bīja īm‌ originated and delivered as a bīja in this nāma. Rati and her spouse Kāma or Manmatha are known for their lecherousness. The kāmakalā is full of auspiciousness and subtly indicates the creation. The bīja īṁ formed in the previous nāma transforms into kāmakalā in this nāma. īṁ becomes īm‌. Kāmakalā is discussed in detail in nāma 322 kāmakalā rūpā.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


28 Oct 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 86


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 86 🌹

✍️. సౌభాగ్య

📚. ప్రసాద్ భరద్వాజ

🍀. లోపలి ప్రపంచమన్నది బాహ్య ప్రపంచం కన్నా గొప్పది. ధ్యానమన్నది గొప్ప అద్భుతం. సైన్సు చాలా యిచ్చింది. కానీ అవేవీ ధ్యానంతో పోల్చలేనివి. ఆత్మాశ్రయ ప్రపంచం పై ధ్యానం నీకు అధికారాన్ని యిస్తుంది. 🍀


ధ్యానమన్నది గొప్ప అద్భుతం. మేలుకొన్న వ్యక్తి మానవత్వానికి అందించిన గొప్ప బహుమానం. సైన్సు చాలా యిచ్చింది. కానీ అవేవీ ధ్యానంతో పోల్చలేనివి. సైన్సు యిచ్చిన వేటితోనూ దాన్ని పోల్చడానికి వీలు లేదు. ధ్యానమన్నది అసాధారణమయిన బహుమానంగా ఎప్పటికీ మిగిలి పోతుంది.

కారణం సైన్సు బాహ్యమయిన ప్రపంచాన్ని అధ్యయనం చేస్తూ పోతుంది. ఆత్మాశ్రయ ప్రపంచం పై ధ్యానం నీకు అధికారాన్ని యిస్తుంది. లోపలి ప్రపంచమన్నది సాటి లేనిది. లోపలి ప్రపంచమన్నది బాహ్య ప్రపంచం కన్నా గొప్పది. సైన్సు అన్నది సైంటిస్టు కన్నా గొప్పది కాదు. అట్లాగే బాహ్య ప్రపంచం గొప్పది కాదు. పరిశీలకుడి కన్నా అది గొప్పది కాదు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


28 Oct 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 19


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 19 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 11. ధర్మము - దైవము - 2 🌻


ధర్మము నాశ్రయింపక, దైవము నాశ్రయించుచు తమదైన మార్గములలో ముందుకు సాగు లౌకికులు కాలక్రమమున క్రిందుమీదు లగుదురు. దైవమునాశ్రయించి, ధర్మమును వదలుట కొమ్మను ఆశ్రయించి మొదలును నరకుట వంటిది. ధర్మము నాశ్రయించని దైవారాధనము డాంబికము మరియు మోసము. ఈ మార్గమున తమ్ముతాము మోసము చేసుకుందురే గాని దైవమును మోసగింపలేరు కదా!

దుర్వాసుని స్థితి, భక్త రామదాసు పరిస్థితి ఈ సూత్రమును ప్రస్ఫుటముగ తెలియజేయుచున్నది. దైవారాధనములు చేయువారు ధర్మమునకు బద్ధులై యుండుట ప్రాథమిక నియమము. అట్టి నియమము లేనివారు దైవారాధన యందున్నను అంతర్గత ఘర్షణలకు లోనగుదురు. పరహితము, అహింస, సత్యము, మైత్రేయ సంఘమున అంగీకరింపబడిన ధర్మ త్రిజట. మా మార్గమున నడుచువారికి ధర్మమే ప్రధానము. దైవారాధనము ధర్మమున నిలుచుటకే. ఠీవిగ ధర్మమునాశ్రయించి పయనింపుడు. పిల్లచేష్టలు వదులుడు. ఎట్టి క్లిష్ట సమస్యలకైన ధర్మమున వందలకొలది పరిష్కారములు లభింపగలవు.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


28 Oct 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 502 / Vishnu Sahasranama Contemplation - 502


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 502 / Vishnu Sahasranama Contemplation - 502🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 502. భూరిదక్షిణః, भूरिदक्षिणः, Bhūridakṣiṇaḥ 🌻


ఓం భూరిదక్షిణాయ నమః | ॐ भूरिदक्षिणाय नमः | OM Bhūridakṣiṇāya namaḥ

యజతో ధర్మమర్యాదాదర్శనాయాఽపి భూరయః ।
బహ్వ్యోఽస్య దక్షిణా యజ్ఞ ఇతీశో భూరిదక్షిణః ॥

ధర్మ మర్యాదను లోకమునకు చూపుటకై యజ్ఞమును ఆచరించు యజమానిగా ఉన్న ఈ భగవానునకు ఆ యజ్ఞమున తాను ఇచ్చు భూరిదక్షిణలు కలవు. అట్టి యజ్ఞమును ఆచరించుచుండు యజమానుడూ విష్ణుపరమాత్ముని విభూతియే!

అనగా - యజ్ఞమును చేయించిన ఋత్విజులకు యజమాని సమర్పించుకొను భూరిదక్షిణలూ విష్ణువే. కావున ఆ విష్ణుదేవుడు భూరిదక్షిణః.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 502🌹

📚. Prasad Bharadwaj

🌻 502. Bhūridakṣiṇaḥ 🌻


OM Bhūridakṣiṇāya namaḥ

यजतो धर्ममर्यादादर्शनायाऽपि भूरयः ।
बह्व्योऽस्य दक्षिणा यज्ञ इतीशो भूरिदक्षिणः ॥

Yajato dharmamaryādādarśanāyā’pi bhūrayaḥ,
Bahvyo’sya dakṣiṇā yajña itīśo bhūridakṣiṇaḥ.

Bhūri means abundant. Yajña dakṣiṇa is the compensation offered by the yajamāni or the person who performs sacrifices to the officiating priests of the sacrifice.

Abundant yajña dakṣiṇa obtain in Him who performs sacrifices to show to the world the proprieties of yajñas.

In other words, the remuneration or honorarium for services rendered by the officiating priests is also Lord Viṣṇu.


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr‌d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


28 Oct 2021

28-OCTOBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 28 గురువారం, ఆక్టోబర్ 2021 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 105 / Bhagavad-Gita - 105- 2-58🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 502 / Vishnu Sahasranama Contemplation - 502🌹
4) 🌹 DAILY WISDOM - 180🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 19🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 85🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 315 / Sri Lalitha Chaitanya Vijnanam - 315🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*27, అక్టోబర్‌ 2021*
*జగద్గురు శ్రీకృష్ణుని ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ...*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. భగవద్గీతాసారము - 20 🍀*

*భోగైశ్వర్యప్రసక్తానం తయాపహృతచేతసామ్ |*
*వ్యవసాయాత్మికా బుద్ధి: సమాధౌ న విధీయతే || 44*

*భగవంతుడు రస స్వరూపుడు. రసాస్వాదనము చేయుటకే
జీవనము. అదియే వైభవము. అట్టి వైభవమును పొందుటకు ఈ
క్రిందివారనర్హులని భగవానుడు బోధించుచున్నాడు.*
*1) కర్మఫలములం దాసక్తి గలవాడు, 2) పుణ్యము కొరకు మంచిపని చేయువాడు, 3) కోరికలతో నిండిన మనస్సు కలవాడు, 4) భోగముల యందాసక్తి కలవాడు, 5) జ్ఞాన సముపార్జన చేయనివాడు, 
6) ఐశ్వర్యములను సంపాదించుటకు ప్రయాస పడువాడు, 
7) తెలిసినదానిని ఆచరించనివాడు.*
*పైవారందరూ వారి మనస్సుచే మోసగింప బడిన వారు. వారు దైవ ధ్యానమును చేయలేరు. రసానుభూతిని పొందలేరు.*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు, అశ్వీజ మాసం
తిథి: కృష్ణ సప్తమి 12:50:02 వరకు తదుపరి కృష్ణ అష్టమి
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం: పునర్వసు 09:42:06 వరకు తదుపరి పుష్యమి
యోగం: సద్య 26:20:32 వరకు తదుపరి శుభ 
 కరణం: బవ 12:46:03 వరకు
వర్జ్యం: 18:21:00 - 20:04:48
దుర్ముహూర్తం: 10:04:07 - 10:50:21 మరియు
14:41:31 - 15:27:45
రాహు కాలం: 13:26:23 - 14:53:05
గుళిక కాలం: 09:06:19 - 10:33:01
యమ గండం: 06:12:56 - 07:39:38
అభిజిత్ ముహూర్తం: 11:36 - 12:22
అమృత కాలం: 07:02:48 - 08:48:56 మరియు
28:43:48 - 30:27:36
పండుగలు : కాలాష్టమి, Kalashtami
సూర్యోదయం: 06:12:56, సూర్యాస్తమయం: 17:46:28
వైదిక సూర్యోదయం: 06:16:35
వైదిక సూర్యాస్తమయం: 17:42:49
చంద్రోదయం: 23:48:50, చంద్రాస్తమయం: 12:29:29
సూర్య రాశి: తుల, చంద్ర రాశి: కర్కాటకం
ఆనందాదియోగం: సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి 
09:42:06 వరకు తదుపరి శుభ యోగం - కార్య జయం 
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ 
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 105 / Bhagavad-Gita - 105 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 58 🌴*

58. యదా సంహరతే చాయం 
కుర్మోజ్గ్నానీవ సర్వశ : |
ఇన్ద్రియాణిన్ద్రియార్తేభ్యస్తస్య 
ప్రజ్ఞా ప్రతిష్టితా ||

🌷. తాత్పర్యం :
*తాబేలు తన అవయములను లోనికి ముడుచుకొనెడి రీతి, ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణమునందు స్థిరముగా నున్నవాడును.*

🌷. భాష్యము :
తాను కోరిన రీతిలో తన ఇంద్రియములను నియమింపగలుగుట యోగి(భక్తుడు) లేదా ఆత్మదర్శియైనవానికి పరీక్షయై యున్నది. సాధారణముగా జనులందరును ఇంద్రియములచే దాసులై అవి చెప్పిన రీతి వర్తింతురు. యోగి ఎట్టి స్థితిలో నుండుననెడి ప్రశ్నకు ఇదియే సమాధానము. ఇంద్రియములు విషపూర్ణసర్పములతో పోల్చబడినవి. అవి సదా ఎటువంటి అడ్డు లేకుండా విచ్చలవిడిగా వర్తింపగోరు చుండును. 

కనుక యోగియైనవాడు లేదా భక్తుడు సర్పముల వంటి ఇంద్రియములను అణుచుటకు (పాములవాని వలె) పరమ శక్తిశాలియై యుండవలెను. అవి యథేచ్చగా వర్తించుటకు అతడెన్నడును అనుమతింపడు. నిషేదింపబడిన కర్మలను గూర్చియు, అమోదింపబడిన కర్మలను గూర్చియు పలువిధములైన ఉపదేశములు శాస్త్రములందు కలవు. 

ఇంద్రియభోగము నుండి దూరులై అట్టి నిషిద్దకర్మలను మరియు ఆమోదయోగ్యమైన కర్మలను అవగతము చేసికొననిదే కృష్ణభక్తిభావన యందు స్థిరత్వము పొందుట సాధ్యపడడు. ఈ విషయమున తాబేలు ఒక చక్కని ఉపమానముగా తెలుపబడినది. తాబేలు తన అవయములను ఏ క్షణమైనను ఉపసంహరించుకొని, తిరిగి ఏ సమయమందైనను ఏదేని కార్యార్థమై ప్రదర్శింపగలదు. అదేవిధముగా కృష్ణభక్తిభావనలో నున్న వ్యక్తి యొక్క ఇంద్రియములు కేవలము భగవానుని సేవ కొరకే వినియోగింపబడి అనన్యసమయములలో ఉపసంహరింప బడి యుండును. 

ఇంద్రియములను స్వీయసంతృప్తి కొరకు గాక శ్రీకృష్ణభగవానుని సేవ కొరకు వినియోగించమని ఇచ్చట అర్జునుడు ఉపదేశింప బడుచున్నాడు. ఇంద్రియములన్నింటిని శ్రీకృష్ణభగవానుని సేవ యందే నిలుపవలెననెడి విషయమిచ్చట ఇంద్రియములను సదా తన యందే నిలుపుకొని యుండు తాబేలు ఉపమానముతో పోల్చి తెలుబడినది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 105 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 2 - Sankhya Yoga - 58 🌴*

58. yadā saṁharate cāyaṁ kūrmo ’ṅgānīva sarvaśaḥ
indriyāṇ īndriyār thebhyas tasya prajñā pratiṣṭhitā

🌷Translation :
*One who is able to withdraw his senses from sense objects, as the tortoise draws its limbs within the shell, is firmly fixed in perfect consciousness.*

🌷 Purport :
The test of a yogī, devotee or self-realized soul is that he is able to control the senses according to his plan. Most people, however, are servants of the senses and are thus directed by the dictation of the senses. That is the answer to the question as to how the yogī is situated. The senses are compared to venomous serpents. They want to act very loosely and without restriction. The yogī, or the devotee, must be very strong to control the serpents – like a snake charmer. He never allows them to act independently.

There are many injunctions in the revealed scriptures; some of them are do-not’s, and some of them are do’s. Unless one is able to follow the do’s and the do-not’s, restricting oneself from sense enjoyment, it is not possible to be firmly fixed in Kṛṣṇa consciousness. The best example, set herein, is the tortoise. The tortoise can at any moment wind up its senses and exhibit them again at any time for particular purposes. Similarly, the senses of the Kṛṣṇa conscious persons are used only for some particular purpose in the service of the Lord and are withdrawn otherwise. 

Arjuna is being taught here to use his senses for the service of the Lord, instead of for his own satisfaction. Keeping the senses always in the service of the Lord is the example set by the analogy of the tortoise, who keeps the senses within.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 502 / Vishnu Sahasranama Contemplation - 502🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 502. భూరిదక్షిణః, भूरिदक्षिणः, Bhūridakṣiṇaḥ 🌻*

*ఓం భూరిదక్షిణాయ నమః | ॐ भूरिदक्षिणाय नमः | OM Bhūridakṣiṇāya namaḥ*

యజతో ధర్మమర్యాదాదర్శనాయాఽపి భూరయః ।
బహ్వ్యోఽస్య దక్షిణా యజ్ఞ ఇతీశో భూరిదక్షిణః ॥

ధర్మ మర్యాదను లోకమునకు చూపుటకై యజ్ఞమును ఆచరించు యజమానిగా ఉన్న ఈ భగవానునకు ఆ యజ్ఞమున తాను ఇచ్చు భూరిదక్షిణలు కలవు. అట్టి యజ్ఞమును ఆచరించుచుండు యజమానుడూ విష్ణుపరమాత్ముని విభూతియే!

అనగా - యజ్ఞమును చేయించిన ఋత్విజులకు యజమాని సమర్పించుకొను భూరిదక్షిణలూ విష్ణువే. కావున ఆ విష్ణుదేవుడు భూరిదక్షిణః.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 502🌹*
📚. Prasad Bharadwaj

*🌻 502. Bhūridakṣiṇaḥ 🌻*

*OM Bhūridakṣiṇāya namaḥ*

यजतो धर्ममर्यादादर्शनायाऽपि भूरयः ।
बह्व्योऽस्य दक्षिणा यज्ञ इतीशो भूरिदक्षिणः ॥

Yajato dharmamaryādādarśanāyā’pi bhūrayaḥ,
Bahvyo’sya dakṣiṇā yajña itīśo bhūridakṣiṇaḥ.

Bhūri means abundant. Yajña dakṣiṇa is the compensation offered by the yajamāni or the person who performs sacrifices to the officiating priests of the sacrifice.

Abundant yajña dakṣiṇa obtain in Him who performs sacrifices to show to the world the proprieties of yajñas.

In other words, the remuneration or honorarium for services rendered by the officiating priests is also Lord Viṣṇu.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr‌d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

 Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 180 🌹*
*🍀 📖 In the Light of Wisdom 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 28. The Many Things are Made Up Only of a Few Things 🌻*

Knowledge is bliss. The greater the knowledge, the greater also will be the happiness. If there is inadequate understanding, then there will be a dissatisfaction lurking within. “Something is not all right. I don't understand this.” This is the sorrow of the scientist and the philosopher. As knowledge advanced, it was discovered that the gravitational pull was not the full explanation. The necessity arose to find out what these bodies were made of that were attracting one another. 

What is the sun? What is the moon? What are the stars? Of what are they constituted? The actual substance of the cosmos became the subject of study. While the superficial vision sees many colours, many sounds and many things in the universe, the analytic mind of some ancient scientists discovered that the many things are made up only of a few things. The multitude in the variety of creation is explicable in terms of a few fundamental elements of which everything is made.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 19 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 11. ధర్మము - దైవము - 2 🌻*

*ధర్మము నాశ్రయింపక, దైవము నాశ్రయించుచు తమదైన మార్గములలో ముందుకు సాగు లౌకికులు కాలక్రమమున క్రిందుమీదు లగుదురు. దైవమునాశ్రయించి, ధర్మమును వదలుట కొమ్మను ఆశ్రయించి మొదలును నరకుట వంటిది. ధర్మము నాశ్రయించని దైవారాధనము డాంబికము మరియు మోసము. ఈ మార్గమున తమ్ముతాము మోసము చేసుకుందురే గాని దైవమును మోసగింపలేరు కదా!* 

*దుర్వాసుని స్థితి, భక్త రామదాసు పరిస్థితి ఈ సూత్రమును ప్రస్ఫుటముగ తెలియజేయుచున్నది. దైవారాధనములు చేయువారు ధర్మమునకు బద్ధులై యుండుట ప్రాథమిక నియమము. అట్టి నియమము లేనివారు దైవారాధన యందున్నను అంతర్గత ఘర్షణలకు లోనగుదురు. పరహితము, అహింస, సత్యము, మైత్రేయ సంఘమున అంగీకరింపబడిన ధర్మ త్రిజట. మా మార్గమున నడుచువారికి ధర్మమే ప్రధానము. దైవారాధనము ధర్మమున నిలుచుటకే. ఠీవిగ ధర్మమునాశ్రయించి పయనింపుడు. పిల్లచేష్టలు వదులుడు. ఎట్టి క్లిష్ట సమస్యలకైన ధర్మమున
వందలకొలది పరిష్కారములు లభింపగలవు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 86 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. లోపలి ప్రపంచమన్నది బాహ్య ప్రపంచం కన్నా గొప్పది. ధ్యానమన్నది గొప్ప అద్భుతం. సైన్సు చాలా యిచ్చింది. కానీ అవేవీ ధ్యానంతో పోల్చలేనివి. ఆత్మాశ్రయ ప్రపంచం పై ధ్యానం నీకు అధికారాన్ని యిస్తుంది. 🍀*

*ధ్యానమన్నది గొప్ప అద్భుతం. మేలుకొన్న వ్యక్తి మానవత్వానికి అందించిన గొప్ప బహుమానం. సైన్సు చాలా యిచ్చింది. కానీ అవేవీ ధ్యానంతో పోల్చలేనివి. సైన్సు యిచ్చిన వేటితోనూ దాన్ని పోల్చడానికి వీలు లేదు. ధ్యానమన్నది అసాధారణమయిన బహుమానంగా ఎప్పటికీ మిగిలి పోతుంది.* 

*కారణం సైన్సు బాహ్యమయిన ప్రపంచాన్ని అధ్యయనం చేస్తూ పోతుంది. ఆత్మాశ్రయ ప్రపంచం పై ధ్యానం నీకు అధికారాన్ని యిస్తుంది. లోపలి ప్రపంచమన్నది సాటి లేనిది. లోపలి ప్రపంచమన్నది బాహ్య ప్రపంచం కన్నా గొప్పది. సైన్సు అన్నది సైంటిస్టు కన్నా గొప్పది కాదు. అట్లాగే బాహ్య ప్రపంచం గొప్పది కాదు. పరిశీలకుడి కన్నా అది గొప్పది కాదు.*

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 315 / Sri Lalitha Chaitanya Vijnanam - 315🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్* 
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।*
*రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀*

*🌻 315. 'రతిరూపా' - 🌻* 

*ఈశ్వర రతి వలన ఇనుమడించిన అందమైన రూపము కలది శ్రీమాత అని అర్ధము. రతిప్రియత్వ మామె లక్షణము, సతతము కామేశ్వరుని యందే యుండునది శ్రీమాత. అవ్యక్తమున తత్త్వమై వుండుట వ్యక్తమున కలసియుండుట అగుట చేత ప్రధానమగు రతి లక్షణము ఆమెదే. విడివడుట యుండదు. రతీదేవి ఆమె అంశయే. అవ్యక్తము నందు ఆమె, ఆయన అను స్థితులు లేవు. ఆ యందు వున్న తత్త్వమును ఆమె అనలేము. ఆయన అని కూడ అనలేము. రెంటికిని మూలమగు తత్త్వమది. కాలము ననుసరించి ఈ తత్త్వము రెండుగ ఒకే మారు ఏర్పడును. అపుడు మూలపురుషుడు మూలప్రకృతిగ, ధన, ఋణ ప్రజ్ఞలుగ ఏర్పడును. ప్రకృతి ఎనిమిది ఆవరణలు ఏర్పరచు కొనినపుడు కూడ అందు అంతర్హితమై పురుషుడుండును. కనుక శాశ్వతముగ ప్రకృతి పురుషులు కలిసే యున్నవిగాని విడివడుట ఎన్నడూ జరుగదు.* 

*వ్యక్తమై అష్ట ప్రకృతులుగ మూలప్రకృతి తొమ్మిది ఆవరణములుగ వ్యాపించునపుడు అందు అంతర్యామియై పురుష తత్వము వుండుచు నుండును. ఆమె యేర్పరచిన ప్రకృతి స్థితుల లోనికి అతడు ప్రవేశించుట వలననే అతనిని పురుషుడనిరి. పురము లన్నియూ ఆకారములే. అందు వసించువాడు పురుషుడు. ఆకారము లేక పురుషుని దర్శించుట దుర్లభము. పురుషుడు లేక ఆకార మేర్పడుట దుస్సాధ్యము. అతడు 'అ'కారము. ఆమె “ఈ'కారము. సృష్టి అంతయూ ఈ రెండు అక్షరముల రసాయనమే. ఆమె యందు ఆయనను దర్శించుట పూర్ణదర్శనము. ఆయన యందు ఆమెను దర్శించుట కూడ పూర్ణ దర్శనమే. విడదీయరాని రెంటిని విడదీసి చూచుటకు చేయు ప్రయత్న మంతయూ వికారమే.* 

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 315 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya*
*Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻*

*🌻 315. Ratirūpā रतिरूपा (315) 🌻*

She is in the form of Rati, the wife of love god Manmatha, who is also known as Kāma (lust). In the earlier two nāma-s, the bīja īm‌ originated and delivered as a bīja in this nāma. Rati and her spouse Kāma or Manmatha are known for their lecherousness. The kāmakalā is full of auspiciousness and subtly indicates the creation. The bīja īṁ formed in the previous nāma transforms into kāmakalā in this nāma. īṁ becomes īm‌. Kāmakalā is discussed in detail in nāma 322 kāmakalā rūpā.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹