మైత్రేయ మహర్షి బోధనలు - 19
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 19 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 11. ధర్మము - దైవము - 2 🌻
ధర్మము నాశ్రయింపక, దైవము నాశ్రయించుచు తమదైన మార్గములలో ముందుకు సాగు లౌకికులు కాలక్రమమున క్రిందుమీదు లగుదురు. దైవమునాశ్రయించి, ధర్మమును వదలుట కొమ్మను ఆశ్రయించి మొదలును నరకుట వంటిది. ధర్మము నాశ్రయించని దైవారాధనము డాంబికము మరియు మోసము. ఈ మార్గమున తమ్ముతాము మోసము చేసుకుందురే గాని దైవమును మోసగింపలేరు కదా!
దుర్వాసుని స్థితి, భక్త రామదాసు పరిస్థితి ఈ సూత్రమును ప్రస్ఫుటముగ తెలియజేయుచున్నది. దైవారాధనములు చేయువారు ధర్మమునకు బద్ధులై యుండుట ప్రాథమిక నియమము. అట్టి నియమము లేనివారు దైవారాధన యందున్నను అంతర్గత ఘర్షణలకు లోనగుదురు. పరహితము, అహింస, సత్యము, మైత్రేయ సంఘమున అంగీకరింపబడిన ధర్మ త్రిజట. మా మార్గమున నడుచువారికి ధర్మమే ప్రధానము. దైవారాధనము ధర్మమున నిలుచుటకే. ఠీవిగ ధర్మమునాశ్రయించి పయనింపుడు. పిల్లచేష్టలు వదులుడు. ఎట్టి క్లిష్ట సమస్యలకైన ధర్మమున వందలకొలది పరిష్కారములు లభింపగలవు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
28 Oct 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment