శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 315 / Sri Lalitha Chaitanya Vijnanam - 315


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 315 / Sri Lalitha Chaitanya Vijnanam - 315🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀

🌻 315. 'రతిరూపా' - 🌻


ఈశ్వర రతి వలన ఇనుమడించిన అందమైన రూపము కలది శ్రీమాత అని అర్ధము. రతిప్రియత్వ మామె లక్షణము, సతతము కామేశ్వరుని యందే యుండునది శ్రీమాత. అవ్యక్తమున తత్త్వమై వుండుట వ్యక్తమున కలసియుండుట అగుట చేత ప్రధానమగు రతి లక్షణము ఆమెదే. విడివడుట యుండదు. రతీదేవి ఆమె అంశయే. అవ్యక్తము నందు ఆమె, ఆయన అను స్థితులు లేవు. ఆ యందు వున్న తత్త్వమును ఆమె అనలేము. ఆయన అని కూడ అనలేము. రెంటికిని మూలమగు తత్త్వమది. కాలము ననుసరించి ఈ తత్త్వము రెండుగ ఒకే మారు ఏర్పడును. అపుడు మూలపురుషుడు మూలప్రకృతిగ, ధన, ఋణ ప్రజ్ఞలుగ ఏర్పడును. ప్రకృతి ఎనిమిది ఆవరణలు ఏర్పరచు కొనినపుడు కూడ అందు అంతర్హితమై పురుషుడుండును. కనుక శాశ్వతముగ ప్రకృతి పురుషులు కలిసే యున్నవిగాని విడివడుట ఎన్నడూ జరుగదు.

వ్యక్తమై అష్ట ప్రకృతులుగ మూలప్రకృతి తొమ్మిది ఆవరణములుగ వ్యాపించునపుడు అందు అంతర్యామియై పురుష తత్వము వుండుచు నుండును. ఆమె యేర్పరచిన ప్రకృతి స్థితుల లోనికి అతడు ప్రవేశించుట వలననే అతనిని పురుషుడనిరి. పురము లన్నియూ ఆకారములే. అందు వసించువాడు పురుషుడు. ఆకారము లేక పురుషుని దర్శించుట దుర్లభము. పురుషుడు లేక ఆకార మేర్పడుట దుస్సాధ్యము. అతడు 'అ'కారము. ఆమె “ఈ'కారము. సృష్టి అంతయూ ఈ రెండు అక్షరముల రసాయనమే. ఆమె యందు ఆయనను దర్శించుట పూర్ణదర్శనము. ఆయన యందు ఆమెను దర్శించుట కూడ పూర్ణ దర్శనమే. విడదీయరాని రెంటిని విడదీసి చూచుటకు చేయు ప్రయత్న మంతయూ వికారమే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 315 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya
Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻

🌻 315. Ratirūpā रतिरूपा (315) 🌻


She is in the form of Rati, the wife of love god Manmatha, who is also known as Kāma (lust). In the earlier two nāma-s, the bīja īm‌ originated and delivered as a bīja in this nāma. Rati and her spouse Kāma or Manmatha are known for their lecherousness. The kāmakalā is full of auspiciousness and subtly indicates the creation. The bīja īṁ formed in the previous nāma transforms into kāmakalā in this nāma. īṁ becomes īm‌. Kāmakalā is discussed in detail in nāma 322 kāmakalā rūpā.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


28 Oct 2021

No comments:

Post a Comment