Showing posts with label Kartikeya. Show all posts
Showing posts with label Kartikeya. Show all posts

మా స్వామి సుబ్రహ్మణ్య - అణువణువున మమ్ము కావగా నిలిచినావయా Swami Subrahmanya Song (YT Short)



https://youtube.com/shorts/gR7F1ExbbbY


🌹స్వామీ సుబ్రహ్మణ్య మా స్వామి సుబ్రహ్మణ్య అణువణువున మమ్ము కావగా నిలిచినావయా
Swami Subrahmanya Song 🌹


ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe And Share

🌹 🌹 🌹 🌹 🌹

వైకాశి విశాఖం – శ్రీ మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) దివ్య అవతార మహోత్సవం విశిష్టత (Vaikasi Visakham – Festival of Sri Murugan (Subrahmanya Swamy))



🌹 ⚜️ వైకాశి విశాఖం – శ్రీ మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) దివ్య అవతార మహోత్సవం విశిష్టత ⚜️🌹
✍️ ప్రసాద్ భరద్వాజ



🌹⚜️ Vaikasi Visakham – The Significance of the Divine Incarnation Festival of Sri Murugan (Subrahmanya Swamy) ⚜️🌹
✍️ Prasad Bharadwaj



శ్రీ సుబ్రహ్మణ్యుని జన్మదినం- వైకాశి విశాఖం శుభాకాంక్షలు / Greetings on Lord Murugan (Sri Subrahmanya Swamy) Birthday Vaikasi Visakam



🌹 శ్రీ సుబ్రహ్మణ్యుని జన్మదినం- వైకాశి విశాఖం శుభాకాంక్షలు అందరికి

Lord Murugan (Sri Subrahmanya Swamy) Birthday Vaikasi Visakam Greetings to All 🌹


ప్రసాద్ భరద్వాజ



జయహే జయ సుబ్రహ్మణ్య నమో భయహర వీర శరణ్య నమో శ్రీ మురుగ నమో Jayahe Jaya Subrahmanya Namo (a YT Short)


https://youtube.com/shorts/FN1d-3KLAjM

🌹 జయహే జయ సుబ్రహ్మణ్య నమో భయహర వీర శరణ్య నమో శ్రీ మురుగ నమో 
Jayahe Jaya Subrahmanya Namo 🌹

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి అభిషేకం కళ్యాణం Sri Valli Devasena Subramanya Swamy Marriage (a YT Short)


https://youtube.com/shorts/c04riymw4kg

🌹 శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి అభిషేకం కళ్యాణం
Sri Valli Devasena Subramanya Swamy Marriage 🌹


ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹


"జయహే జయ సుబ్రహ్మణ్య నమో భయ హర సుర నీల శరణ్య నమో" "Jayahe Jaya Subrahmanya Namo" (a devotional YT Short)


https://youtube.com/shorts/RE7lFg0BEOw

🌹 జయహే జయ సుబ్రహ్మణ్య నమో భయ హర సుర నీల శరణ్య నమో JAYAHE JAYA SUBRAHMANYA NAMO 🌹

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹


స్కందషష్టి శుభాకాంక్షలు Happy Skanda Sashti 2026


🌹 స్కందషష్టి శుభాకాంక్షలు అందరికి 🌹
✍️ ప్రసాద్ భరద్వాజ

🌹 Happy Skanda Sashti to everyone! 🌹
✍️ Prasad Bharadwaj


నేడు మార్చి 24, 2026, మంగళవారం. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ రోజు అత్యంత పవిత్రమైన స్కంద షష్టి. శివపార్వతుల కుమారుడు, దేవసేనాధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామికి (స్కందుడు) అంకితం చేయబడిన విశిష్టమైన రోజిది.


🌺 స్కంద షష్టి ప్రాముఖ్యత, పూజా విధానం మరియు విశేషాలు 🌺


స్కంద షష్టి: విజయానికి, సంకల్ప బలానికి నిదర్శనం

ప్రతి నెలా వచ్చే శుక్ల పక్ష షష్ఠి తిథిని 'స్కంద షష్టి'గా జరుపుకుంటారు. అయితే మార్చి నెలలో వచ్చే ఈ షష్ఠికి ఒక ప్రత్యేకత ఉంది. మంగళవారంతో కూడిన ఈ షష్ఠి రోజున కుమారస్వామిని ఆరాధించడం వల్ల జాతకంలోని కుజ దోషాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.


1. పండుగ వెనుక ఉన్న విశిష్టత

పురాణాల ప్రకారం, తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దేవతలను రక్షించడానికి కుమారస్వామి జన్మించాడు. ఆరు ముఖాలతో (షణ్ముఖుడు), అపారమైన జ్ఞానంతో, శౌర్యంతో రాక్షస సంహారం చేసిన రోజును పురస్కరించుకుని ఈ పండుగ జరుపుకుంటారు. ఇది కేవలం ఒక యుద్ధ విజయం మాత్రమే కాదు, మనలో ఉండే అహంకారం, అజ్ఞానం అనే రాక్షసులపై జ్ఞానంతో పొందే విజయానికి ప్రతీక.


2. ఈ రోజున చేయవలసిన పూజా విధానం

స్కంద షష్టి నాడు భక్తులు కఠినమైన నియమాలను పాటిస్తారు.

ఉపవాసం: ఉదయాన్నే స్నానం చేసి, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. వీలుకాని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు.

దీపారాధన: ఆరు ఒత్తులతో నెయ్యి దీపాన్ని వెలిగించడం శుభప్రదం. కుజ దోషం ఉన్నవారు ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల విశేష ఫలితం ఉంటుంది.

స్తోత్ర పఠనం: ఈ రోజున సుబ్రహ్మణ్య అష్టకం, స్కంద షష్టి కవచం పఠించడం వల్ల మానసిక ప్రశాంతత, ధైర్యం కలుగుతాయి.

అభిషేకం: వీలైతే స్వామివారికి పాలు లేదా పంచామృతాలతో అభిషేకం చేయించడం శ్రేష్ఠం.


3. స్కంద షష్టి విశేష ఫలితాలు

ఈ పర్వదినాన స్వామిని కొలవడం వల్ల కలిగే ప్రయోజనాలు

సంతాన ప్రాప్తి: సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సత్ఫలితం ఉంటుందని నమ్ముతారు.

విజయం: చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి, విజయం లభిస్తుంది.

శత్రు నివారణ: శత్రువుల నుండి రక్షణ మరియు కోర్టు వ్యవహారాల్లో సానుకూలత ఏర్పడుతుంది.

ఆరోగ్యం: చర్మ సంబంధిత వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని భక్తుల విశ్వాసం.

"ఓం శరవణ భవ" అనే మూల మంత్రాన్ని జపిస్తూ, పూర్తి భక్తితో సుబ్రహ్మణ్య స్వామిని స్మరించుకుంటే జీవితంలో ఉన్న చీకట్లు తొలగి వెలుగులు నిండుతాయి. ముఖ్యంగా నేడు మంగళవారం కావడంతో స్వామి వారిని ఆరాధించడం వల్ల రెట్టింపు ఫలితం లభిస్తుంది.



🍀 శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం (కరావలంబ స్తోత్రం) 🍀

ఈ స్తోత్రం మానసిక ప్రశాంతతకు, కష్టాల నుంచి ఉపశమనానికి దివ్యౌషధం.

​హే స్వామినాథ తవ పాదసరోజయుగ్మం

చిత్తే సదా భవతు మే విజయం ప్రయచ్ఛ |

దుఃఖాని హరతు సుబ్రహ్మణ్య సదా త్వమేవ

శ్రీ సుబ్రహ్మణ్య మమ దేహి కరావలంబమ్ ||

​భావం: ఓ స్వామినాథా! నీ పాద పద్మాలు నా హృదయంలో ఎప్పుడూ ఉండుగాక. నాకు విజయాన్ని ప్రసాదించు. నా దుఃఖాలన్నింటినీ హరించి, నాకు చేతిని ఇచ్చి ఆదుకో తండ్రీ!


🌻 శ్రీ స్కంద గాయత్రీ మంత్రం 🌻

​జ్ఞానం మరియు బుద్ధి కుశలత కోసం దీనిని పఠించండి.

​ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి |

తన్నో షణ్ముఖః ప్రచోదయాత్ ||


​ఈ రోజున పాటించవలసిన చిన్న నియమం: ​పూజ సమయంలో స్వామివారికి ఎర్రటి గన్నేరు పూలు లేదా పువ్వులతో అలంకరణ చేయడం, నివేదనగా పంచదార పొంగలి లేదా పండ్లు సమర్పించడం శుభప్రదం.

🌹 🌹 🌹 🌹 🌹

శుభ బుధవారం మిత్రులందరికీ Happy Wednesday


🌹 అయ్యప్ప స్వామి, విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి దివ్య ఆశీస్సులతో శుభ బుధవారం మిత్రులందరికీ 🌹

ప్రసాద్ భరద్వాజ




🌹 With the divine blessings of Lord Ayyappa, Lord Ganesha, and Lord Subrahmanya, a blessed Wednesday to all my friends 🌹

Prasad Bhardwaj



అంగారక సంకష్ట హర చతుర్థి శుభాకాంక్షలు / Happy Angarika Sankashti Hara Chaturthi


🌹 అంగారక సంకష్ట హర చతుర్థి శుభాకాంక్షలు అందరికి 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Happy Angarika Sankashti Chaturthi to everyone 🌹
Prasad Bharadwaj


🌹 జనవరి 6, అంగారక సంకష్ట చతుర్థి ... గణేశ - శుబ్రహమణ్య సోదరులను పూజించండి.. కష్టాలు పరార్.. సంపద పెరుగుతుంది..! 🌹

🌹 January 6th, Angaraka Sankashti Chaturthi... Worship Lord Ganesha and Lord Subrahmanya... Troubles will vanish... Wealth will increase! 🌹



సర్వ విఘ్నాలను తొలగించే వాడు వినాయకుడు. ఆయనను ఆరాధిస్తే.. విఘ్నాలన్నీ తొలగిపోయి.. మంచి జరుగుతుందని భక్తులు భావిస్తారు. సంకటహర చతుర్థి నాడు ... వినాయకుడిని పూజించడం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయి. ఈ రోజు అత్యంత అరుదైన రోజని పండితులు చెబుతున్నారు. అంతేకాక ఈ రోజు ఆశ్లేష నక్షత్రం కూడా వచ్చింది. శుబ్రమణ్యేశ్వరునికి అత్యంత ఇష్టమైన రోజు.. అలాగే ఆ రోజు ( జనవరి 6) సంకష్ట హర చతుర్ధి వచ్చింది. పురాణాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తే కష్టాలు తొలగి.. సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.

పురాణాల ప్రకారం సంకష్ట హర చతుర్థి రోజున సర్వ విఘ్నాలను తొలగించే వాడు అయిన వినాయకుడిని . ఆరాధిస్తే.. విఘ్నాలన్నీ తొలగిపోయి.. మంచి జరుగుతుందని భక్తులు భావిస్తారు. అప్పుల సమస్య, ఇంటి నిర్మాణం చేసుకోవాలని ఎన్నాళ్ల నుంచో అనుకోవడం.. కుదరక పోవడం. కుజదోషం కారణంగా.. అనేక ఇబ్బందులు కలగడం, ఎంత కష్ట పడినా ఆదాయం మాత్రం పెరగకపోవడం జరుగుతుంది. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు.. ఈ సంకటహర చతుర్థి రోజు.. వినాయకుడిని పూజించాలి. గరికను సమర్పించి.. బెల్లం నివేదించి .. ఈ రోజు ( 2026 జనవరి 6) సంకటహర గణేశ స్తోత్రం 11 సార్లు చదువుకోవాలి.

అంతేకాకుండా క్యాలండర్​ ప్రకారం జనవరి 6 వ తేది మంగళవారం.. ఆశ్లేష నక్షత్రం .. మంగళవారానికి శుబ్రమణ్యేశ్వరుడు అధిపతి.. ఆయన జన్మనక్షత్రం ఆశ్లేష .. ఆదిశేషుడు.. .. రెండు తలల నాగేంద్ర స్వామికి ఈ రోజు అభిషేకం చేస్తే కోరిన కోరికలు శీఘ్రగతిన నెరవేరుతాయని చెబుతారు.

సంకష్టహర చతుర్ధి.. మంగళవారం ఒకే రోజు వస్తే ఆ రోజుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. జీవితంలో అడ్డంకులు, ఆటంకాలు, అప్పుల బాధ ఎదురవుతుంటే.. వినాయకుడికి బెల్లం, గరిక, కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించి సంకటహర గణేశ స్తోత్రం చదవడం, గణేశ పంచరత్నం చదవడం వంటివి చేయడం ద్వారా అన్నీ రకాల అడ్డంకులు తొలగిపోతాయట. ఆర్థిక కష్టాలు, అప్పుల బాధ, అడ్డంకులు తొలగిపోతాయట. ఉన్నత స్థితికి వెళుతారట.

🌻 సంకట హర చతుర్థి సమయం ఎప్పుడు..? 🌻

జనవరి 6వ తేదీ పగలు తదియ తిథి ఉదయం 11.36 గంటల వరకు ఉంటుంది. అనంతరం చవితి తిథి ప్రారంభమవుతుంది. అంటే మంగళవారం ఉదయం 11.37 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 10.46 గంటల వరకు ఈ చవితి తిథి ఉంటుంది. చవితి తిథి.. చంద్రోదయం సమయం ఏరోజు ఉంటుందో ఆ రోజే సంకట హరచతుర్థి జరుపుకుంటారు. జనవరి 6వ తేదీ సంకట హరచతుర్థి వస్తుంది. మంగళవారం ఆశ్లేష నక్షత్రం కూడి వచ్చిన ఈ రోజును అంగారక సంకష్ట హర చతుర్థిగా పేర్కొంటారు. ఇక చంద్రోదయ సమయం వచ్చి.. మంగళవారం రోజు రాత్రి 9.50 నిమిషాలకు ఉంటుంది.

🌀 ఆలయంలో ప్రదక్షిణలు.. 🌀

ఈ సంకట హర చతుర్థి రోజు.. గణపతి ఆలయంలో 3, 11, 21 ప్రదక్షిణలు చేయాలి. గణపతికి గరిక సమర్పించాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించాలి. అది కూడా ఆవు నెయ్యితో.. ఉదయం నుంచి ఉపవాసం ఉండాలి. పాలు, పళ్లు తీసుకోవచ్చు. చంద్రోదయం తర్వాత చంద్రుడు లేదా నక్షత్ర దర్శనం చేసుకోవాలి. అనంతరం దూప దీప నైవేద్యాలను సమర్పించి.. సాత్విక ఆహారం తీసుకోవాలి.

🌏 కేతు గ్రహ ప్రభావం.. 🌏

జ్యోతిష్యం ప్రకారం.. కేతు గ్రహ ప్రభావం బలంగా ఉన్నప్పుడు. తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వారు.. ఈ సంకట హర చతుర్థి వేళ.. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచిగా స్నానమాచరించాలి. గణపతి దేవుని పటం ముందు స్వామి వారికి నమస్కరించి.. దీపారాధన చేసి.. స్వామి వారికి పాయసం సమయర్పించాలి. ఇక జనవరి 6 వతేది మంగళవారం .. ఆశ్లేష నక్షత్రం కావడంతో శుబ్రమణ్యేశ్వరునికి పాలు నైవేద్యంగా సమర్పించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి.. సాయంత్రం గణపతిని .. శుబ్రమణ్యేశ్వరుడిని పూజించి భోజనం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

🌹🌹🌹🌹🌹

శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్టి శుభాకాంక్షలు Greetings on Sri Subrahmanya Shashti Skanda Shashti



🍀 శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్టి శుభాకాంక్షలు అందరికి 🍀
ప్రసాద్ భరద్వాజ


🍀 Happy Sri Subrahmanya Shashti Skanda Shashti to everyone 🍀
Prasad Bharadwaja


శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అభిషేకం హారతి Subrahmanya Abhishek Harathi (a YT Short)



https://youtube.com/shorts/wGEidjz0drY


🌹 సుబ్రహ్మణ్య షష్టి నాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అభిషేకం హారతి దివ్య దర్శనం Subrahmanya Abhishek Harathi 🌹

తప్పక వీక్షించండి



ప్రసాద్ భరద్వాజ



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹




స్కందోత్పత్తి కధ – కుమారసంభవం గాధ SKANDOTHPATHI – story of Kumarasambhavam - Story of Creation


https://youtu.be/GnssM2GwmZA


🌹 స్కందోత్పత్తి కధ – కుమారసంభవం గాధ SKANDOTHPATHI – story of Kumarasambhavam - Story of Creation 🌹

🍀 శ్రీ సుబ్రహ్మణ్య స్కంద షష్టి శుభాకాంక్షలు అందరికి 🍀
ప్రసాద్‌ భరధ్వాజ

🐍 మార్గశిర మాసంలో శుక్ల పక్ష షష్టి రోజు.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినం సుబ్రహ్మణ్య షష్ఠిని భక్తులు జరుపుకుంటారు. సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతమే సృష్టి రహాస్యం. ఈ రోజున భక్తి శ్రద్ధలతో శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించిన సమస్త కోరికలు నెరవేరతాయని అంటారు. పిల్లలు కావాలనే వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. ఈ రోజున ఎవరైతే శ్రీ సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం అయిన స్కందోత్పత్తి చదువుతారో లేదా వింటారో వారికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విశేష అనుగ్రహం కలుగుతుంది. మోక్ష మార్గం విశదం అవుతుంది. వారి పిల్లలు ఆపదల నుంచి రక్షింపబడతారు. నాగదోషాలు తొలగి పోతాయిని పండితులు చెబుతారు. 🐍

ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam



🌹🌹🌹🌹🌹

ఉమామహేశ్వర కుమారగురవే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాధా Subrahmanyam Shanmukha Nadha (a devotional YouTube Short)



https://youtube.com/shorts/miybwBY40V4


🌹 ఉమామహేశ్వర కుమారగురవే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాధా Subrahmanyam Shanmukha Nadha 🌹

🍀 శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్టి శుభాకాంక్షలు అందరికి 🍀
ప్రసాద్ భరద్వాజ



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


సుబ్రహ్మణ్య స్కంధ షష్ఠి విశిష్టత - Significance of Subramanya Shashti



https://youtu.be/B6liu2jsJDw


🌹 సుబ్రహ్మణ్య స్కంధ షష్ఠి విశిష్టత - పూజా విధానం - స్కంధ పుష్కరిణి - స్కందోత్పత్తి - ఆరు మహిమాన్వితమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు Subrahmanya Shashti Significance 🌹

🍀 శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్టి శుభాకాంక్షలు అందరికి 🍀
ప్రసాద్‌ భరధ్వాజ


🐍 మార్గశిర మాసంలో శుక్ల పక్ష షష్టి రోజు.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినం సుబ్రహ్మణ్య షష్ఠిని భక్తులు జరుపుకుంటారు. ఈ సుబ్రహ్మణ్య షష్టిని స్కంద షష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతమే షష్టి రహాస్యం. ఈ రోజున భక్తి శ్రద్ధలతో శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించి స్కందోత్పత్తి కధను విన్నా చదివినా సమస్త కోరికలు నెరవేరతాయని అంటారు. ముఖ్యంగా పిల్లలు కావాలనే వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. ఈ ఏడాది నవంబర్ 26వ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది. ఈ రోజున ఎవరైతే శ్రీ సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం అయిన స్కందోత్పత్తి చదువుతారో లేదా వింటారో వారికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విశేష అనుగ్రహం కలుగుతుంది. పంచమి రోజు.. ఉపవాసం ఉండి షష్ఠి నాడు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే నాగదోషాలు తొలగి పోతాయిని పండితులు చెబుతారు. 🐍

ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్టి శుభాకాంక్షలు Greetings on Sri Subrahmanya Shashti Skanda Shashti

🌹శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్టి శుభాకాంక్షలు అందరికి 🌹
ప్రసాద్‌ భరధ్వాజ

🌹Shri Subrahmanya Shashti Skanda Shashti greetings to everyone 🌹
Prasad Bharadhwaja


కార్తికేయాయ విద్మహే సుబ్రహ్మణ్యాయ ధీమహి తన్నః స్కందః ప్రచోదయాత్

ఓం సౌమ్ శరవణభవాయ నమః

నమస్తే నమస్తే మహాశక్తి పాణే |
నమస్తే నమస్తే లసద్వజ్రపాణే ||

నమస్తే నమస్తే కటిన్యస్త పాణే |
నమస్తే నమస్తే సదాభీష్ట పాణే ||


మార్గశిర శుద్ధ షష్టి నాడు ఈ స్తోత్రంతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని శరణు వేడినవారికి శక్తియుక్తుల్ని, ఐశ్వర్య ఆరోగ్యాలను, సర్పదోషాలు తొలగి సత్సంతానమును ఆ స్వామి ప్రసాదిస్తాడు.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినం సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జరుపుకుంటారు. సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతమే షష్టి రహాస్యం. సుబ్రహ్మణ్యుడిని శివపార్వతుల కుమారుడిగా భావిస్తారు. ఈ పండుగ హిందూ సంప్రదాయంలో ముఖ్యమైనది మరియు యుద్ధం, జ్ఞానం, విజయం యొక్క దేవుడిగా భావించే మురుగన్ (సుబ్రహ్మణ్యుడు) ఆరాధనకు అంకితం చేయబడింది. 26 నవంబర్ బుధవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి, ఆ రోజున ఎవరైతే శ్రీ సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం అయిన స్కందోత్పత్తి చదువుతారో లేదా వింటారో వారికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విశేష అనుగ్రహం కలుగుతుంది, దయచేసి సద్వినియోగం చేసుకోమని మనవి.

దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజును కూడా "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు.

ఈ స్వామి ఆరాధన వల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని, పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు, వెండి, పూలు పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.

ఇటువంటి పుణ్యప్రదమైన "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి" నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము. వీలున్న వారందరూ తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించండి. పెళ్ళి కాని వారికి , సంతానం లేని వారికి ఇది అమృతతుల్యమైన అవకాశం. సుబ్రహ్మణ్యుని అనుగ్రహముతో వివాహ ప్రాప్తి, సత్సంతానం, వంశాభివృద్ధి , జ్ఞానము, తేజస్సు, పాప కర్మల నుండి విముక్తి కలుగుతుంది. కుండలినీ శక్తిని జాగృతం చేసి జీవితాశయం పొందడానికి కూడా సుబ్రహ్మణ్యుని అనుగ్రహము అతి ముఖ్యము.


🐍. కాలసర్పదోషం ఉన్నవారికి సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం 🐍

జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు,కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వవిధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్పమంత్రాలు చదువుతూ, పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజల వల్ల రాహుగ్రహం అనుగ్రహమూ కలుగుతుంది, అలాగే సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం స్కందుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని స్త్రీలు పూజల చేయడం మనం చూస్తూ వుంటాం. సంతానప్రాప్తిని కోరే స్రీలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టు 21 లేదా 108 మార్లు మండలం పాటు (40రోజులు) ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరం చేసి, సర్వశక్తుల్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం.

🌹 🌹 🌹 🌹 🌹

Happy Skanda Shashti! స్కంద షష్టి శుభాకాంక్షలు!


🌹 సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో, స్కందుడి కరుణతో మీ జీవితం సౌభాగ్యం, సంతోషం, శ్రేయస్సుతో తులతూగాలని కోరుకుంటూ స్కందషష్టి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹




🌹 With the blessings of Lord Subrahmanya Swamy and the mercy of Skanda, may your life be filled with happiness, joy, and prosperity. Happy Skanda Shashti to everyone 🌹

Prasad Bharadwaja

🌹 🌹 🌹 🌹 🌹 🌹