కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 10

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 10 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. జ్ఞానాన్ని సాధించాలి అంటే రెండే మార్గాలు. యోగము, ఇంద్రియ జయము. 🌻

ఈ రెండింటి ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి “నాన్యః బంధాయ విద్యతే వాసుదేవాయ ధీమహి”. అటువంటి వాసుదేవుణ్ణి ఆశ్రయించాలి అంటే అన్యమైనటువంటి మార్గం లేదు.

 ఏమిటీ? ఒకటి ఇంద్రియజయము. రెండు భక్తి. ఈ రెండింటి ద్వారా జ్ఞానసిద్ధికి అధికారిత్వాన్ని పొందాలి. “భోగములను అనుభవించి తృప్తిని పొందినవారు లేరు” అని కూడా నిర్ణయంగా చెప్తున్నాడు. 

అంటే అర్ధ ఏమిటటా? “కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే? వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే?” అనేటటువంటి పద్యాన్ని గనుక, మనం భాగవత పద్యాన్ని గనుక గుర్తిస్తే - “కారే రాజులు? రాజ్యముల్ గలుగవే?” - ఎంతోమంది రాజులు ఈ భూమిని పరిపాలించారు. ఎంతోమంది చక్రవర్తులు పరిపాలించారు. ఎంతోమంది మహనీయులైనటువంటి వాళ్ళు, ఎంతోమంది చరిత్ర కలిగినటువంటి వాళ్ళు, 

యశఃకాములైనటువంటి వాళ్ళు ఎంతోమంది పృధ్విలో వచ్చారూ, పోయారు. కానీ వారేమైనా సిరి మూటకట్టుకుపోయారా? వారేమైనా తృప్తిని పొందారా? అంటే వారెటువంటి నిత్యతృప్తిని పొందలేదు. ఒక్క జ్ఞానం వల్ల మాత్రమే, అది కూడా ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే నిత్య సంతృప్తతని పొందగలుగుతాడు మానవుడు.

         అటువంటి ఆత్మజ్ఞాన సముపార్జనకై జీవితంలో సమయాన్ని, శ్రమని, శ్రద్ధని, ఆసక్తిని, తహని, నిశ్చయాన్ని, లక్ష్యాన్ని మనం సాధించాలి. 

అలాంటి మార్గంలో మనం ప్రయాణం చేయాలి అంటే తప్పక భోగమార్గమై వున్నటువంటి జగత్ వ్యాపార విషయములందు అనురక్తి కలిగి వుండరాదు. విరక్తి వుండటం అవసరం కాని అనురక్తి లేకుండా చూసుకోవడం ముఖ్య అవసరం. ఈ రెండింటి మధ్య బేధాన్ని కొద్దిగా మనం గుర్తించాలనమాట. 

మానవుడు ప్రతిరోజూ తన శరీర అవసర నిమిత్తమై భోజనం చెయ్యాలా? వద్దా? చెయ్యాలి. అనురక్తి లేక చెయ్యాలి. వైరాగ్య భావంతో చెయ్యాలి. ఈశ్వర ప్రసాద భావంతో చెయ్యాలి. అట్లాంటప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అలా గనుక ఆచరించకపోయినట్లయితే అది సాధ్యపడదు. 

ఇట్లా గమనించుకోవాలన్నమాట. ప్రతిదీ ఈశ్వర ప్రసాదంగా చూసేటటువంటి ఉత్తమ లక్షణాన్ని మానవులందరు కూడానూ చక్కగా సంపాదించాలి. అలా సంపాదించకపోయినట్లయితే నువ్వు ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా అది అసాధ్యం. 

అందుకని అనురక్తి దేంట్లో వుంది, ప్రియాప్రియాలు దేంట్లో వున్నాయి అనేటటువంటి జాబితా సాధకులందరూ తప్పక తయారు చేసుకోవాలి. తయారు చేసుకుని వాటియందున్నటువంటి అనురక్తిని పోగొట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 4 / Sri Gajanan Maharaj Life History - 4 🌹


*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 4 / Sri Gajanan Maharaj Life History - 4 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

1. అధ్యాయము 
*🌻. పరిచయం - 3 🌻*

అతని ఆ విశాలమయిన వక్షస్థలం, కండలు తిరిగిన భుజాలు, నాసికాగ్రంపై కేంద్రీకృతమయిన కళ్ళు మరియు తేజోమయమయిన ముఖము వీరిరువురికి పరమ ఆనందం కలిగించాయి. అతి వినయంతో వీరు అతనికి నమస్కరించి, ఒక విస్తరలో భోజనం వెంటనే తేవలసిందిగా దేవీదాసు పంతను కోరారు. శ్రీదేవీదాసు తెచ్చి శ్రీమహారాజ్ ముందుఉంచాడు. 

అతను ఏవిధమయిన ఇష్టాఇష్టాలు లేక అన్నం, మిఠాయిలు కలిపివేసి తన ఆకలి తీర్చుకున్నాడు. ఒక మహారాజుకు చిన్న గ్రామం బహుమతిగా ఇచ్చినట్టుగానే ఈ భోజనంకూడా శ్రీమహారాజ్ కు అనిపిస్తుంది. 

బ్రహ్మరసంతో ఇంతకుముందే సంతృప్తి చెందిన శ్రీగజానన్ కు ఈ భోజనం ఒక మహారాజు కు చిన్న గ్రామం కానుకగా ఇచ్చినట్టు అనిపించింది. అతను పిచ్చివాడేమో అని పిలిచినందుకు బనకటలాల్ బాధపడ్డాడు. 

ఆ సమయంలో పక్షులు కూడా తమస్థావరాలను వదిలి బయటకు రావటానికి సాహసించలేని తీవ్రమయిన మధ్యాహ్నము. అటువంటి తీవ్రమయిన ఎండలో స్వయంగా బ్రహ్మవలే ఏవిధమయిన భయం లేకుండా పరమానందంగా శ్రీగజానన్ కుర్చున్నారు.

శ్రీమహారాజు భోజనం అయితేచేసారు కాని అతని కమండలంలో నీరు లేని విషయం దామోదర్పంత్ గమనించాడు. మహారాజ్ మీరు ఒప్పుకుంటే నేను మంచినీళ్ళు తీసుకువస్తాను అని బనకటలాల్ అన్నాడు. 

నీకు తేవాలని ఉంటే వెళ్ళి తీసుకురా అని మహారాజు నవ్వి అన్నారు. బ్రహ్మ ప్రతిచోటా ఉన్నాడు మరియు బ్రహ్మ నీకు నాకు మధ్య ఏవిధమయిన బేధభావం చూపడు. కాని మనం ఈప్రాపంచిక పద్ధతులు అనుసరించాలి. అందుకే భోజనం అయినతరువాత నీళ్ళు కూడా శరీరానికి అవసరం. 

ఈ విధమయిన సమాధానానికి బనకటలాల్ సంతోషించి శ్రీమహారాజు కొరకు త్రాగేనీరు తెచ్చేందుకు వెల్లాడు. ఇంతలో రోడ్డుప్రక్కన పశువుల కొరకు నింపిఉంచిన నీళ్ళకుండి దగ్గరకు శ్రీమహారాజు వెళ్ళి ఆ నీళ్ళతో దాహం తీర్చుకున్నారు.

 బనకటలాల్ చల్లటి నీళ్ళు ఉన్న కుండతో తిరిగివచ్చి శ్రీమహారాజును ఆ కుండినుండి మురికినీళ్ళు త్రాగవద్దని వేడుకున్నాడు. శుభ్రం-అశుభ్రం, మంచి-చెడు అనే బేధ భావం లేకుండా ప్రపంచంలోని ప్రతివస్తువులోనూ బ్రహ్మ వ్యాపించి ఉన్నాడు అని శ్రీమహారాజు అన్నారు. 

బ్రహ్మ మంచినీళ్ళలోనూ మురికినీళ్ళలోనూ మరియు వాటిని త్రాగే ప్రాణిలో కూడా బ్రహ్మ వ్యాపించిం ఉన్నాడు. ఈ విధమయిన విశ్వవ్యాపి అయిన భగవంతుని ప్రకృతిని, మరియు ఈప్రపంచం ఎలా ఉద్భవించింది అనే విషయం ప్రయత్నించి మీరు అర్ధంచేసుకోవాలి. దానికి బదులు మీరు ప్రాపంచిక అనుబంధాలలో నిమగ్నమవుతున్నారు. 

శ్రీమహారాజు నుండి ఈవిధంగావిన్న బనకటలాల్ మరియు దామోదరపంత్ ఇద్దరు కుడా వంగి శ్రీమహారాజుకు నమస్కరిద్దామనుకుంటే, వారి ఈ కోరిక తెలుసుకున్న శ్రీమహారాజు గాలివేగంతో పారిపోయారు. ఈగజానన్ విజయ గ్రంధం అందరికీ సంతోషాన్ని తెచ్చుగాక !
 
 శుభం భవతు
 1. అధ్యాయము సంపూర్ణము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 4 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj 

Chapter 1 
*🌻. Introduction - 3 🌻*

They were delighted to see His broad chest, muscular shoulders, eyes concentrated at the tip of nose, and a joyful face. They respectfully bowed to Him and asked Devidaspant to immediately bring a dishful of food. 

Shri Devidas brought the food and put it before Shri Gajanan Maharaj . He having no likes and dislikes, mixed all the food and sweets together and satisfied His hunger. It was like an emperor being presented with a small village. 

So was this food presented to Shri Gajanan who had already satisfied Himself by consuming Brahma Rasa. Bankatlal regretted having called Him a mad man. It was a very hot noontime and even the birds did not dare come out of their nests. 

Under such unfavourable conditions, Shri Gajanan was sitting fearlessly and was full of joy as if He was Brahma Himself. So Shri Gajanan Maharaj had taken food but then Damodarpant observed that there was no water in His Tumba. 

Bankatlal said, Maharaj, if You permit me, I will go and bring water for You. Shri Gajanan Maharaj smiled and said, If you wish, go and bring water. Brahma is everywhere and he won't differentiate between you and me, but we have to follow the worldly traditions. 

So when food is taken the body needs water too. Bankatlal felt happy over this reply and rushed to bring the water for Shri Gajanan Maharaj . 

In the meantime, Shri Gajanan Maharaj went to the roadside tank where water was stored for the cattle and satisfied His thirst with that water. 

Bankatlal returned with a jar of cold water and requested Shri Gajanan Maharaj not to drink the dirty water from that tank. 

Shri Gajanan said, Everything in the universe is pervaded by Brahma without any differentiation of clean or dirty, good or bad. 

Brahma is in clean water as well as in dirty water and the one who drinks it is also occupied by Brahma Himself. 

You should try to understand the omnipotent nature of God and also to know the origin of this world. Instead of this, you are involving yourself in wordly attachments.” 

Hearing so from Shri Gajanan Maharaj , both Bankatlal and Damodarpant bent down to prostrate before Shri Gajanan Maharaj ; knowing their intentions, Shri Gajanan Maharaj ran away with the speed of wind. May this Gajanan Vijay Granth bring happiness to all. ||

SHUBHAM BHAVATU||

 Here ends Chapter One.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 3 / Sri Gajanan Maharaj Life History - 3🌹


*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 3 / Sri Gajanan Maharaj Life History - 3 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

1. అధ్యాయము 
*🌻. పరిచయం - 2 🌻*

పండరపూర్ లో రామచంద్రపాటిల్ నన్ను కలసి, శ్రీగజానన్ మహారాజ్ జీవితచరిత్ర వ్రాయమని కోరినరోజు కార్తీక ఏకాదశి. చాలారోజులుగా నాకు శ్రీగజానన్ స్తుతి చెయ్యాలని కోరిక ఉన్నప్పటికీ అవకాశం దొరకలేదు. 

నాకోరిక శ్రీమహారాజ్ కు అర్ధం అయింది అందువల్ల శ్రీరామచంద్రపాటిల్ ను నాకోరిక పూర్తి అయ్యేందుకు కారణభూతుడ్ని చేసారు. యోగులలో మాణిక్యంలాంటి శ్రీగజానన్ మహారాజ్ వంటి యొగుల కదలికలు ఎవరు తెలుసుకోలేరు.

 బ్రహ్మ ఎట్లా ఉద్భవించింది ఎలా అయితే ఎవరికి తెలియదో, అదేవిధంగా చారిత్రకంగా ఈయన జాతి పుట్టుపూర్వోత్తరాలు తెలియవు. ఏఘనినుండి వచ్చింది అని ఆలోచించకుండా వజ్రాన్ని మెచ్చుకుంటామో, అదేవధంగా ఈయన తేజస్సును స్థుతించాలి. 

18వ శతాబ్దంలో మాఘ బహుళ సప్తమి రోజున శ్రీగజానన్ మహారాజ్ షేగాం లో ప్రకటించారు.

 శ్రీరామదాసస్వామి స్థలమయిన సజ్జన్ఘడ్ నుండి వచ్చారని కొందరు అంటారు. ఈ విషయం నమ్మడానికి సరిఅయిన దాఖలా లేకపోయినా కొంతవరకు అర్ధంఉంది. భ్రష్టాచారం, దరిద్రం బాగా వ్యాపించి ఉండడంవల్ల శ్రీరామదాస్ స్వామి, శ్రీగజానన్ మహారాజ్ రూపంలో పునర్జన్మ తీసుకుని ఉండవచ్చు. 

యోగులు ఎవరి లోనయినా ప్రవేశించగలరు. ఇంతకు ముందుకూడా అనేకమంది యోగులు ఈవిధంగా చేస్తారు. సాధారణ మనుష్య జన్మలా కాకుండా, గోరఖ్ చెత్తకుండీనుండి, కనీఫా ఏనుగు చెవినుండి మరియు చాంగ్డియొ నారాయణదోహ నుండి ఉద్భవించారు. 

యోగులలో రాజయిన శ్రీగజానన్ మహారాజ్ విషయంకూడా అలానే అయి ఉండవచ్చు. ఇకముందు ఈయన చేష్టలనుబట్టి శ్రీమహారాజుకు యోగ గూర్చిన క్షుణ్ణ అవగాహన ఉన్నట్టు తెలుస్తుంది. యోగకు మరి దేనితోను పోల్చలేని అనూహ్యమయిన ప్రత్యేకత ఉంది.

 పాపులను ఉద్ధరించడానికి శ్రీగజానన్ మాఘ బహుళ సప్తమినాడు ప్రగటించారు. షేగాంలో దేవీదాస్ పాటుర్కర్ అనే బ్రాహ్మణుడు తన కుమారుని ఋతుశాంతి విధి కారణంగా తన స్నేహితులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసాడు. ఎంగిలిఅకులు మిగిలి పోయిన తినుబండారాలతో సహాఇంటి బయట పారవేసారు. ఆచోట శ్రీగజానన్ మహారాజ్ కూర్చుని ఉండగా చూడడం తటస్థించింది. అతని శరీరంపై జీర్నావస్థలో ఉన్నచొక్కా, 

నీరు త్రాగడానికి ఒక కమండలం మరియు పొగత్రాగడానికి ఒక మట్టితో తయారుచేసిన గొట్టం తప్ప మరిఇంక ఏమీలేవు. ఉదయించే సూర్యుని తేజస్సు కల శరీరం, నాశికాగ్రంపై కేంద్రీకృతమయిన కళ్ళు అతని యోగికశక్తిని తెలియ పరుస్తున్నాయి. ఆవిధంగా పారవేసిన ఎంగిలి ఆకులనుండి మిగిలిన మెతుకులను రోడ్డు ప్రక్కన కూర్చుని అతను తీసుకుంటున్నాడు. సాధారణమానవునికి, ఈఅన్నమే బ్రహ్మ అని సూచించటమే అతని ఈచర్యకి కారణం. సూక్తులు, ఉపనిషత్తులు కూడా ఈవిషయమే చెపుతాయి.

 బనకటలాల్ అగర్ వాల్ మరియు దామోదర్ పంత్ అతని ఈవిధమయిన ప్రవర్తనకి ఆశ్చర్యపోతారు. 

నిజంగా ఆకలి వేసిఉంటే ఇతను పాటుర్కర్ లాంటిమంచి బ్రాహ్మణున్ని అర్జించి ఉంటే వెంటనే భోజనం పెట్టి ఉండేవాడుకదా అని వీరిద్దరు అనుకున్నారు. బనకట్ తన స్నేహితునితో అతని ఇకముందు కదలికలు చూద్దాము అని అన్నాడు. 

నిజమయిన యోగులు ఒక్కోసారి పిచ్చివారిగా ప్రవర్తిస్తారని వ్యాసుడు భాగవతంలో అన్నాడు. ఇతని విషయం కుడా అలాంటిదే కావచ్చు. అనేకమంది ఆదారినుండి వెళ్ళారు కానీ వీరద్దరే ఈవ్యక్తిని పరిశీలించేందుకు ఆకర్షితులయ్యారు. 

తెలివయిన మరియు ప్రజ్ఞావంతులు మాత్రమే గుళకరాళ్ళలోని వజ్రాన్ని వెతకగలరు. ఆ రోడ్డు మీద పడిన అన్నం ఎందుకు తింటున్నావు అని అడుగుతూ నేను మంచి భోజనం పెడతాను అని అతనితో బనకటలాల్ అంటాడు. దానికి సమాధానంగా శ్రీగజానన్ కేవలం వారివైపుచూస్తాడు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 3 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj 

Chapter 1 
*🌻. Introduction - 2 🌻*

It was Kartik Ekadashi day when Ramchandra Patil met me at Pandharpur and requested me to write the biography of Shri Gajanan Maharaj. It was in fact my long cherished desire to sing in praise of Shri Gajanan, but was not getting the opportunity. 

Shri Gajanan Maharaj seemed to have understood my wish and so made Ramchandra Patil a tool for the fulfilment of that desire. Nobody can know the designs of great saints like Shri Gajanan Maharaj who was a gem amongst the saints. 

Historically, nothing is known about His caste, creed or place of origin, like Brahma whose origin nobody knows. Like a brilliant diamond we should only appreciate its brilliance and not bother about the mine of its origin. 

Shri Gajanan Maharaj appeared at Shegaon on 7th Vadya Magh of 1800 Saka. Some say that he came from Sajjangad the place of Shri Ramdas Swami. Though there is no sufficient proof to accept this fact, it may have some sense in it. 

There was wide spread corruption and misery and it is possible that Shri Ramdas Swami, for the good of the people, took rebirth as Gajanan Maharaj. 

Yogis can enter anybody and many saints have done so in the past. Gorakh was born in dustbin, Kanifa in the ear of elephant and Changdeo in the Narayan Doha: all unlike the traditional human birth. 

Same may be the case of Shri Gajanan Maharaj - the king of Yogis. It will be seen from His actions that Shri Gajanan Maharaj had detailed knowledge of all yogic feats. Yoga has got a unique importance incomparable with anything else. 

Shri Gajanan appeared in Shegaon on 7th Vadya Magh for the spiritual liberation of the sinners. It so happened that there was one pious Brahmin named Devidas Paturkar at Shegaon and, to celebrate the puberty function of his son, he had arranged a lunch for his friends. 

The leftover food from the plates was thrown outside the house and Shri Gajanan Maharaj was seen sitting near that food. He had a worn out old shirt on His body, a dry gourd for drinking water, a pipe of clay for smoking and nothing else. 

His body was lustrous like the rising sun and eyes with concentrated at the tip of nose indicative of His yogic strength. Sitting by the roadside He was picking up particles of food thrown there. 

His action of picking up the food particles from the leaf plates lying on road was to convey to the common man that food is Brahma. Shruti and Upanishad say the same thing. 

Bankatlal Agrawal and Damodar Pant, who were passing by, were surprised to see His behaviour. They thought that had this man been really hungry, He would have begged for food and Shri Paturkar, being a pious man, would have given the food to Him.

Thinking thus, Bankatlal said to his friend, Let us watch His actions. Vyas has said in Bhagawat that real saints, many a times, behave like mad men, and this can be a case like that.” 

Thousands of people must have passed that way but only these two persons were attracted to observe Maharaj. Only wise men and experts can detect a diamond lying in the heap of pebbles. 

Bankatlal asked Him as to why He was eating the food lying on the road and volunteered to serve good food. In reply Shri Gajanan simply looked at them.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 2 / Sri Gajanan Maharaj Life History - 2 🌹


*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 2 / Sri Gajanan Maharaj Life History - 2 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

1. అధ్యాయము 
*🌻. పరిచయం - 1 🌻*

శ్రోతలారా మీమంచి కోసమే ఈమహాయోగియొక్క జీవతచరిత్ర చిత్తశుద్ధితో వినేందుకు తయారుకమ్ము. ఈ భూప్రపంచంమీద ఇటువంటి యోగులే భగవత్ స్వరూపులు, కరుణాసముద్రులు, మోక్షంఇవ్వగలిగేవారు. ఈ యోగులు మంచి, పవిత్రత నిజాయితీ నిండి ఉన్నవారు. 

వీరు అత్యంత వివేకవంతులు, మనల్ని నిజాయితి అనేబాట మీదకు నడిపిస్తారు. ఇటువంటి యోగులకు పాదాక్రాంతులయినవారికి భగవంతుడు కుడా ఋణపడి ఉంటాడు. ఇక చిత్తశుద్ధితో శ్రీగజనన్ మహారాజ్ జీవితచరిత్ర వనండి..

అనేక యోగులకు జన్మస్థలము అయ్యే అదృష్టం భారతదేశానికే దక్కింది తప్ప మరి ఏ ఇతర దేశాలకి దొరకలేదు. అందువలనే ఇంతవరకు సుఖసంతోషాలకి కొరవలేదు. యుగయుగాలనుండి ఈ భారతావనికి వరసగా ఈయోగీశ్వరుల పాదస్పర్శ లభ్యం అవతూ ఉంది. శ్రీనారద, ధృవ, కాయద్ కుమార్, ఉర్దావ, సుధామ, శుభద్రావర్, అంజనీకుమార్, ధర్మరాజ్, జగత్ గురు శంకరాచార్యులు వీరందరూ కాడా ఈ భారతావనిలో జన్మించారు. మనసంస్కృతిని కాపాడిన మాధవ, వల్లభ, రామానుజులు కూడా ఇక్కడే పుట్టారు. నరశింహ మెహతా, తులసీదాసు, కబీర్, కమల్, శూరదాస్ మరియు గోరంగ ప్రభుల ప్రతిభ వర్ణింప నావల్ల కానిది. 

మీరాభాయి యొక్క ప్రగాఢభక్తి వల్ల అమెకోసం మహావిష్ణువు విషం మింగాడు. నవనాధ్ అనే పవిత్రగ్రంధంలో శ్రీగోరఖనాధ్, మశ్చీంద్ర మరియు జలంధర్ అనే మహాయోగుల గురించి వివరించబడింది.శ్రీనామదేవ్, నరహరి, జనాభాయీ నవ్, సకుభాయి, చోఖా, సవత, కుమార్దాస్ మరయు దామాజి పంత్ లు భక్తితోనే మహావిష్ణువును పోందారు. దామాజి పంత్ కొరకు భగవంతుడు మహర్ అయ్యాడు. ముకుందరజ్, జనార్ధన్, భోధాల, నిషత్ మరియు నిరంజన్ ల జీవితచరిత్రలు మహిపతి ఇంతకు ముందుగానే వివరించారు కనుక ఇక్కడ నేను తిరిగి ప్రస్థావంచటంలేదు. 

భక్తివిజయ మరియు భక్తిమాల అనే పవిత్ర గ్రంధాలు చదవమని మాత్రమే దాసగణు మీకు సలహా ఇస్తున్నాడు. మరో ముగ్గురు యోగుల గూర్చి, నేను ఆతరువాత వివరంగా పాటలు వ్రాసాను, ప్రజలను బాగా ప్రభావితం చేసిన శ్రీగజానన్ మహారజ్ కూడా వారికి సమానమయినవారే. ఈ మహాయోగి జీవితచరిత్ర వ్రాయడానికి అవకాసం నాకు పుణ్యంకొద్ది లభించింది. మొదటిసారి అసలు ఈయనను అకోట్లో చూసింది నేనే కాని ఇంతకు ముందు వివరించిన కారణాలవల్ల చివరిగా ఈయన జీవితచరిత్ర నాచేత వ్రాయబడింది.

ముందు హారం తయారుచేసి చిట్టచివర మేరుమణి (గుఛ్ఛం) మధ్యలో కడతాం అదేవిధంగా మహారజ్ జీవితచరిత్ర మధ్యలో గుచ్ఛంలాంటిది. గొప్పవ్యాపారకేంద్రం అయిన ఈ షేగాం బేరర్ లో ఖాంగాం తాలూకాలో ఒక చిన్న గ్రామం. చిన్న గ్రామం అయినప్పటికి ఈ మహాయోగి కారణంగా ఖ్యాతిపొంది ప్రపంచప్రఖ్యాత స్థానం అయింది. ఈ షేగాం అనే సరస్సులో శ్రీగజానన్ మహారాజ్ పద్మం రూపంలో ఉద్భవించి తన సుగంధాన్ని పూరిబ్రహ్మాండానికి వ్యాపింప చేసారు. షేగాం అనే ఘనిలో శ్రీగజానన్ మహారాజ్ ఒక వజ్రం. 

నా మితమయిన తెలివితో ఈయన అద్భుతాలను వర్నించాలని కోరుకుంటున్నాను. దయచేసి వినండి మరియు ఈయనకు పూర్తిగా ప్రాదాక్రాంతులయిన వారు మోక్షం పొందుతారనే విషయం మరువకండి. 

శ్రీగజానన్ చరిత్ర మేఘాలయితే మీరు నెమళ్ళు. వాన రూపంలో ఉండే శ్రీగజానన్ కధలు మిమ్మల్ని పరవశంతో నాట్యం చేయిస్తాయి. గజానన్ మహారాజ్ను పొందడం షేగాం ప్రజల అదృష్టం. భగవంతుని కంటే ఎక్కువఅయిన ఈ యోగుల ఆశీర్వచనాలు మంచిపనులు చెయ్యబట్టి ప్రాప్తిస్థాయి. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 2 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj 

Chapter 1 
*🌻. Introduction - 1 🌻*

Now listeners, get ready and listen single-mindedly to the biography of a saint for your own good.  

On this earth, saints are Gods, ocean of renunciation, and giver of Moksha. Saints are the embodiment of all that is good and sacred and are full on sanctity. Now calmly listen to the life story of such a Saint. 

Saints never deceive anybody. They are full of wisdom that guides us on to the path leading to the ultimate truth. God Himself is indebted to those who surrender themselves at the feet of the saints. 

Now with an open mind, listen to the biography of Shri Gajanan Maharaj. No other country is as fortunate as Bharat in being a birthplace of so many saints and therefore it has never fallen short of any happiness so far. It is so because, since time immemorial, our land continuously has had the touch of sacred feet of saints. 

Shri Narad, Dhruva, Kayadhukumar, Uddhava, Sudama, Subhadravar, Anjanikumar, Dharma Raja, Jagatguru Shankaracharya were all born in this country. Madhawa, Vallabha and Ramanuja, the able defenders of our religion, too were born here. 

The greatness of Narsi Mehta, Tulsidas, Kabir, Kamal, Surdas and Gourang Prabhu is quite beyond my power to describe. Intense devotion of Princess Mirabai made lord Vishnu swallow poison for her. 

The great deeds performed by the supreme yogis like Shri Goraknath, Macchindra and Jalander are described in great detail in the sacred book Navanath. 

Shri Namdeo, Narahari, Janabai, Kanho, Sakhubai, Chokha, Savata, Kurmadas and Damajipanth won over Shri Hari by Bhakti only. God became Mahar for Damajipant. Since Mahipati has already written the biographies of Mukundraj, Janardan, Bodhala, Nipat and Niranjan, I do not repeat them here. I only suggest that you read the sacred books Bhakti Vijay and Bhaktimala. 

After that I have composed songs in the praise of three saints and equal to them is Shri Gajanan Maharaj who greatly influenced the public. With my good fortune, I am now getting an opportunity to write this detailed biography of this great saint. 

In fact, He was first seen by me at Akot, but His biography is being written by me last for the following reasons: When we prepare a plain garland, the middle gem (Merumani) in it is attached at last; so the story of Shri Gajanan Maharaj is like that Merumani. 

Shegaon, a small village in Khamgaon Taluka of Berar is a great market center. Though a small village, it gained importance due to Shri Gajanan Maharaj and became a world famous place. 

In this Shegaon Lake, a lotus in the form of Shri Gajanan Maharaj sprung up and its fragrance spread all over the universe. Shri Gajanan Maharaj is a diamond of Shegaon mine and I, with my limited intelligence, wish to narrate His glory. Please listen to it and do not forget that you can attain Moksha by complete surrender at His feet.

Shri Gajanan Maharaj’s biography is like a cloud and you the peacocks. The rain in the form of Shri Gajanan Maharaj’s stories will make you dance in happiness. People of Shegaon are really fortunate to get Shri Gajanan Maharaj. 

Good deeds only can invoke the blessings of Saints who are superior even to the Gods. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 1 / Sri Gajanan Maharaj Life History - 1 🌹


*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 1 / Sri Gajanan Maharaj Life History - 1 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

1. అధ్యాయము 
*🌻. ప్రార్ధన - 1 🌻*

శ్రీగణేశాయనమః ! 

శ్రీగణేశా, నీవు కరుణకు, వీరత్వానికి ప్రసిద్దుడివి. ఓ గౌరీపుత్రా మహామేధావులు, ప్రసిద్ధులు అందరూ కూడా ప్రతి పని ప్రారంభించేముందు నిన్ను స్మరిస్తారు. అన్ని విఘ్నాలు కూడా, నీ బలీయమైన ఆశీశులతో అగ్ని ముందు దూదిలా దూరమయి పోతాయి.

 అటువంటి ఆశీశ్శులే నాకు ఇచ్చి నేను అతి కమనీయమైన, శ్రేష్ఠమయిన కవితను చెప్ప గలిగేట్టు చెయ్యమని మీ పాదాలకు విమ్రతతో మొక్కుతున్నాను. ఏవిధమయిన కవిత్వం చెప్పేగుణాలు లేని, తెలివిలేని, బుద్ధి హీనుడను, అయినా మీఆశీర్వాదాలు ఉంటే కవిత రాసేపని తప్పక అవుతుంది. 

బ్రహ్మ నుండి ఉద్భవించిన మరియు కవులకు ప్రేరణ కలిగించే ఆదిమాయా సరస్వతి శారద కు ఇప్పుడు నానమస్సులు. నా ఆత్మగౌరవాన్ని నిలబెట్టమని ఇప్పుడు జగదంబకు నానమస్సులు. ఈమె ఆశీర్వచనాలు ఎంత గొప్పవంటే వాటితో ఒక అవిటివాడుకూడా మేరుపర్వతం ఎక్కగలుగుతాడు మరియు ఒక అల్పబుద్ధివాడు కూడా మంచివక్త అవుతాడు. 

ఆ నమ్మకంతోనే ఈ శ్రీగజానన్ గ్రంధ వ్రాయడంలో దాసగణుకు సహకరించమని ప్రార్ధిస్తున్నాను. పండరిపురం పురాణపురుషుడయిన పాండురంగను తన కరుణావీక్షణాలు నాయందు ఉంచమని వేడుకుంటున్నాను.

ప్రతి చిన్నబిందువు నుండి బ్రహ్మాండం వరకు ప్రతి దానిలో నిండిఉంటూ, ఈ విశ్వానికి నీవే ఆధారం. ప్రతి వస్తువు నీవల్లే ఉద్భవిస్తుంది, వాటి కదలికలు నీవే నిర్దేశిస్తావు. 

ఈప్రపంచము నీవే, ఇందులోని జీవ,నిర్జీవులు నీవే, తుది శక్తివీనీవే. సగుణ, నిర్గుణ, నాతండ్రి మరియు తల్లి నీవే. ఓ పురుషోత్తమా నీవెంత గొప్పవాడిఓ వర్నించడానికి నేను చాలాసూక్ష్మజీవిని. శ్రీరాముని ఆశీర్వాదాలతో కోతుల బలం పెరిగింది. గోకులం గొల్లపిల్లల విషయంలో అదేజరిగింది. 

మీ సహాయం పొందడానికి ధనం అవసరంలేదు, కానీ పూర్తిగా మీకే అర్పితమయిపోవాలి, అని ఋషులు కూడా చెప్పారు. నేను ఈకారణం వల్లనే మీద్వారం ముందుకు వచ్చాను. నన్ను నిరాశ పరచవద్దు అని ప్రార్ధిస్తున్నాను. ఓ పండరిపురి పాండురంగా మీరు నాలో పీఠం వేసుకొని ఈప్రఖ్యాత యోగి జీవితచరిత్ర వ్రాసేందుకు నాకు సహకరించండి. 

ఓభవానీవరా, నీలకంఠా, గంగాధరా, ఓంకారరూపా, త్రయంబకేశ్వరా నన్ను ఆశీర్వదించు. స్పర్శవేదమణి ఇనుముని బంగారంగా మారుస్తుంది, అదేవిధంగా నీకృప స్పర్శవేదమణ లాంటిది నేను ఇనుముని. దయతో సహకరించి నన్ను నిరాశపరచకు. నీకు అసంభవమయినది ఏదిలేదు, అందుకే ఇప్పుడు ఇంక ప్రతీది నీచేతులో ఉంది. దయచేసి త్వరగా వచ్చి మీఈసంతానం చేత ఈపుస్తకాన్ని రూపు దిద్దేందుకు సహకరించండి.
అన్ని శుభంగాజరిగేటట్టు ఆశీర్వదించమని కొల్హాపూర్లో ఉండే మా కులదేవతను వేడుకుంటూ ప్రార్ధిస్తున్నాను. 

తుల్జాపూర్ వాసి అయిన ఓ దుర్గామాతా, భవానీ మీ ఆశీర్వచనాలు నాశిరస్సుపై ఉంచమని వేడుకుంటున్నాను. శ్రీగజానన్ గొప్పతనాన్ని వర్ణించి పాడేందుకు స్ఫూర్తి కలిగించమని శ్రీదత్తాత్రేయుడుని వేడుకుంటూ మొక్కుకుంటున్నాను.

 మునీశ్వరులయిన శ్రీశాండిల్య, శ్రీవశిష్ఠ, శ్రీగౌతమ, శ్రీపరాసర మరియు
శ్రీశంకరాచార్యులకు నా వందనములు. నాచెయ్యి పట్టుకుని, నాచే ఈగ్రంధం పూర్తిచేయించవలసిందిగా అందరు మునులను, ఋషులను ప్రార్ధిస్తున్నాను. 

ఈజీవన వాహినిలో శ్రీగహిని, శ్రీనివృత్తి, శ్రీధ్యాణేశ్వర్, శ్రీతుకారాం ఓడ లాంటివారు వీరికి నా నమస్కారములు. ఓ షిరిడి సాయిబాబా మరియు వామనశా శ్రీ (దాసగణు కి గురువు) కరుణించి నన్ను పిరికి తనంనుండి ముక్తున్ని చెయ్యండి. 

మీ అందరి కృపాదృష్టివలనే నేను ఈగ్రంధం పూర్తిచేయగలను. కావున నన్ను కరుణించండి. పిల్లమీద ఉన్న ఏవిధమయిన సహజ ప్రేమవల్ల తల్లి మాట్లాడడం నేర్పిస్తుందో అదేవిధమయిన సంబంధం మీది నాది. 

కలం అక్షరాలు వ్రాస్తుంది, కాని అది కలం గొప్పతనంకాదు, వ్రాసేందుకు కలం ఓక ఉపకరణం మాత్రమే. అదేవిధంగా దాసగణు ఒక కలం, మునులందరినీ ఈకలం చేపట్టి ఈజీవతచరిత్రను అతిశ్రవణానంద కరంగా వ్రాయించమని ప్రార్ధిస్తునన్నాను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 1 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj 

Chapter 1 
*🌻. Prayer - 1 🌻*

 Shri Ganeshayanmah! 

Shri Ganesha, You are famous for your generosity and valour. O Gouriputra, all intellectuals and saints first remember you before starting any work. 

With your powerful Blessings all obstructions are just like cotton before fire. So I solemnly bow at your feet and invoke your blessings to bring out the best and the sweetest poetic recitation of my narration. 

I am ignorant, dull and have no qualities of a poet. But if you bless me, my work will be done. Now I give my obeisance to Adi Maya Saraswati-Sharada, who is born of Brahma and who is a great inspiration to the poets. 

Next I pay my obeisance to Jagadamba, to whom I pray for upholding my self-respect. Her blessings are so great that with her Ashis even a lame can climb a mountain and a dumb become a good orator. 

In keeping with that reputation kindly help Dasganu to write this book of Shri Gajanan. Now I beseech the Puran Purush Panduranga of Pandharpur to have an obliging glance at me.

You are the sole supporter of this universe and occupy every animate and inanimate object in it. You are the creator of everything, omnipotent and command all the actions in the universe. You are this world, the life in this world and also the ultimate power. 

You are Saguna, Nirguna, my father and also my mother. O Purushottama! You are so great that I am too small to comprehend You. Shri Rama blessed the monkeys who thereafter gained enormous strength. 

Same thing happened with the cowherd boys of Gokula. Saints have said that money is not required to receive Your favour, but a complete surrender at Your feet earns us Your support. That is why I have come to Your door. Please do not disappoint me. O Panduranga of Pandharpur, kindly help me write this great saint's biography, by residing in me. 

O Bhavanivara, Nilkantha, Gangadhara, Onkarrupa, Trimbakeshwara bless me. Paras changes iron into gold. Now Your favour is Paras and I am iron. Kindly help and do not disappoint me. Nothing is impossible for You since every thing is in Your hands. Kindly come quickly and help this child of Yours compose this book. Now I pay my obeisance to my family Deity who resides at Kolhapur. I beseech Her to bless me with everything auspicious. 

O Durgamata Bhavani of Tuljapur, I invoke Your blessings by having your hand on my head. Then I pay my obeisance to Lord Dattatraya and request Him for inspiration to sing in praise of Gajanan. Now I bow to the Saints of Saints Shri Shandilya, Shri Vashishta, Shri Goutam, Shri Parashar and Shri Shankaracharya the sun in the sky of wisdom. My obeisance to all the saints and sages who should, by holding my hand, get this writing done. 

Shri Gahani, Nivrutti, Shri Dyaneshwar, Shri Tukaram and Ramdas are dependable ships in the ocean of life. I bow to them. O Saibaba of Shirdi and Waman Shastri (Shri Dasganu's Guru) kindly free me of all fears. 

By the kind grace of You all only, I shall be able to write this book. So be kind to me. Only the real affection can teach a child to speak; and I share a relationship with you like that of a child with the mother. Pen writes letters, but receives no credit for writing them. 

A pen is only a means for writing; Dasganu is a pen and I beseech all the saints to hold it to write and make this biography melodious.

Continues.. 
🌹 🌹 🌹 🌹 🌹

26-July-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 439 / Bhagavad-Gita - 439🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 227 / Sripada Srivallabha Charithamrutham - 227 🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 107🌹 
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 130🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 43 / Sri Lalita Sahasranamavali - Meaning - 43 🌹
6) 🌹 VEDA UPANISHAD SUKTHAM - 70🌹
7) 🌹. నారద భక్తి సూత్రాలు - 46 🌹 
8) 🌹 Guru Geeta - Datta Vaakya - 14 🌹
9) 🌹. శివగీత - 12 / The Shiva-Gita - 12🌹 
10) 🌹. సౌందర్య లహరి - 54 / Soundarya Lahari - 54🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 353 / Bhagavad-Gita - 353 🌹

12) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 180🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 56 🌹
14) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 52 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 67 🌹
16) 🌹 Seeds Of Consciousness - 131 🌹
17) 🌹. మనోశక్తి - Mind Power - 70 🌹
18)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 16 🌹 
19) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 10🌹
20) 🌹 సర్వ వేదాంత శిరో భూషణము - 1 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 439 / Bhagavad-Gita - 439 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 49 🌴*

49. మా తే వ్యథా మా చ విమూఢభావో
దృష్ట్వా రూపం ఘోరమీదృఙ్మమేదమ్ |
వ్యపేతభీ: ప్రీతమనా: పునస్త్వం
తదేవ మే రూపమిదం ప్రపశ్య ||

🌷. తాత్పర్యం : 
నా ఈ ఘోరరూపమును చూచి నీవు కలతనొందినవాడవు, భ్రాంతుడవు అయితివి. అదియంతయు నిపుడు అంతరించును గాక, ఓ భక్తుడా! అన్ని కలతల నుండియు విముక్తుడవై నీవు కోరిన రూపమును ప్రశాంతమనస్సుతో ఇప్పుడు గాంచుము.

🌷. భాష్యము : 
పూజనీయ పితామహుడైన భీష్ముని మరియు గురువైన ద్రోణుని వధించుటపట్ల అర్జునుడు ఆది యందు వ్యథ నొందెను. కాని పితామహుని వధించుట యందు అట్టి వెరుగు అవసరము లేదని శ్రీకృష్ణుడు అతనికి ఉపదేశించెను. 

ధృతరాష్ట్రతనయులు ద్రౌపదని కౌరవసభలో వివస్త్రను చేయ యత్నించినపుడు ఆ భీష్మ, ద్రోణులు మౌనము వహించిరి. ధర్మనిర్వహణలో అట్టి నిర్లక్ష్యకారణముగా వారు వాధార్హులు. వారు అధర్మయుత కర్మ వలన వారు ఇదివరకే సంహరింపబడిరని తెలియజేయుటకే అర్జునునకు శ్రీకృష్ణుడు విశ్వరూపమును చూపెను.

 సాధారణముగా భక్తులు శాంతులును మరియు అట్టి ఘోరకార్యములను నొనరింపలేనివారును అయియుందురు కావున అర్జునునకు విశ్వరూపము చూపబడినది.

 విశ్వరూపప్రదర్శన ప్రయోజనము సిద్ధించియున్నందున అర్జునుడు చతుర్భుజ రూపమును గాంచగోరగా, శ్రీకృష్ణుడు దానిని అర్జునునకు చూపెను. ప్రేమభావముల పరస్పర వినిమయమునకు అవకాశమొసగనందున భగవానుని విశ్వరూపము నెడ భక్తుడు ఎక్కువగా ఆసక్తిని కలిగియుండడు. 

అతడు కేవలము దేవదేవునికి భక్తిపూర్వక నమస్సులు అర్పించవలెను గాని లేదా ద్విభుజ కృష్ణరూపమును గాంచవలెను గాని కోరును. తద్ద్వారా అతడు ఆ దేవదేవునితో ప్రేమయుక్తసేవలో భావవినిమయము కావింపగలడు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 439 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 49 🌴*

49. mā te vyathā mā ca vimūḍha-bhāvo
dṛṣṭvā rūpaṁ ghoram īdṛṅ mamedam
vyapeta-bhīḥ prīta-manāḥ punas tvaṁ
tad eva me rūpam idaṁ prapaśya

🌷 Translation : 
You have been perturbed and bewildered by seeing this horrible feature of Mine. Now let it be finished. My devotee, be free again from all disturbances. With a peaceful mind you can now see the form you desire.

🌹 Purport :
In the beginning of Bhagavad-gītā Arjuna was worried about killing Bhīṣma and Droṇa, his worshipful grandfather and master. 

But Kṛṣṇa said that he need not be afraid of killing his grandfather. When the sons of Dhṛtarāṣṭra tried to disrobe Draupadī in the assembly of the Kurus, Bhīṣma and Droṇa were silent, and for such negligence of duty they should be killed. 

Kṛṣṇa showed His universal form to Arjuna just to show him that these people were already killed for their unlawful action. That scene was shown to Arjuna because devotees are always peaceful and they cannot perform such horrible actions. 

The purpose of the revelation of the universal form was shown; now Arjuna wanted to see the four-armed form, and Kṛṣṇa showed him. 

A devotee is not much interested in the universal form, for it does not enable one to reciprocate loving feelings. 

Either a devotee wants to offer his respectful worshipful feelings, or he wants to see the two-handed Kṛṣṇa form so that he can reciprocate in loving service with the Supreme Personality of Godhead.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 227 / Sripada Srivallabha Charithamrutham - 227 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 43
*🌻. జగన్మాత వివిధ రూపాలు - శ్రీపాదుల తత్త్వం 🌻*

ఆ నాడు రాత్రి తమ ఆరాధన, పూజాదికాలు ముగించుకొని భాస్కరపండితులు శ్రీపాదుల తత్త్వం గురించి వర్ణించ సాగారు, "పరమాత్ముడు (పిపీలికాది బ్రహ్మ పర్యంతం) చీమనుండి మొదలు బ్రహ్మ వరకు అన్ని జీవరాసులలో ఉంటారు. 

అయితే శ్రీపాదులు మాత్రం తాము పిపీలికం గాను, బ్రహ్మగాను ఉన్నానని అంటారు. అంటే ప్రతి జీవరాశి చైతన్యంతో తాదాత్మ్య స్థితిలో, సృష్టిలో సృష్టి రూపంతో ఉన్నానని వారి భావం. 

వారు మహాసరస్వతి, మహాలక్ష్మి మొదలైన రూపాలు నేనే అనడంలోని అంతరార్థం కూడా ఇదే, వారు ఆయా చైతన్యాలలో విలీనమై ఉంటారన్నమాట. అలా ఉన్నప్పటికి ఏ స్థితిలోనూ ఏ జీవికి వారి స్పర్శ అనుభవం కాదు. 

ఇది ఈ అవతార విశిష్టత. అనఘాలక్ష్మీ సమేత అనఘుడు వారి అర్థనారీశ్వర రూపం, అయితే శ్రీపాదులు ఈ అవతరణలో యతీశ్వరునిగా ఉన్నారు. 

సగుణ, సాకార అవతారాలు ఎత్తినపుడు వాటికి సంబంధిం చిన మర్యాదలను విధిగా పాటించాలి. ఇది ధర్మ సూక్ష్మం. కాగా ఈ అవతారంలో తల్లి, తండ్రి కూడా వారే కాబట్టి భక్తునికి అనుగ్రహం త్వరగాను, విశేషంగాను లభిస్తుంది. వారు జప తపాలు చేయ నక్కర లేదు. 

అయినా ధ్యానం, జపం, తపస్సు చేసి ఆ ఫలితాన్ని సృష్టికి ధారాదత్తం చేస్తారు. తమ తపఃఫలంతో భక్తులను కర్మబంధ విముక్తు లను చేస్తారు. 

సశేషం...
🌹🌹🌹🌹🌹

*🌹 Sripada Srivallabha Charithamrutham - 227 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 24.
*🌻 Explanation of Ardhanareeswara Tatwam - 1 🌻*

I asked Sri Dharma Gupta whether there was any inner meaning related to the different types of ornaments and weapons of Siva.  

Sri Dharma Gupta said, ‘Sir! Shankar Bhatt! Ganapathi had ‘paasam’ (rope) and ‘ankusam’ (spear) as the chief weapons. Similarly Vishnu’s main weapon is ‘Sudharshan Chakram’. Siva has the ‘Trishul’ as the main weapon.  

Trishul has three sharp spikes at the end. They will be in the form of ‘agni’ flames. Those three will unite at the base and the stem of Trishul will be a single hand.  

Those three spikes indicate three qualities, Satva, Rajas and Tamo gunas. The combined form is really beyond these three qualities. There is another meaning. The breath flows through the nerves ‘Ida and Pingala’ and reaches the place between the two eye brows.  

The center, where the three nerves Ida, Pingala and Sushumna reach is called ‘Triveni’ sangamam. This is the center of Brahma Jnana. This is the inner meaning of Trishul.  

 There is the ornament ‘Nagaabharanam’. While kundalini power raises up, one gets the eight ‘siddhis’. Sri Shankar Bhagawan is called ‘Nagaabharanudu’ to indicate the kundalini which is in the shape of a serpent. Siva is also called Eswar.  

All those maha siddhis are dangerous like the serpents. Siva keeps them under His control and uses them for the welfare of worlds. So He has got the name Eswar. Damarukam is seen tied to Siva’s Trishul. The sky has the quality of sound.  

The vibrations of sound will be travelling in the ‘aakaasa’ (sky). When we do japa of a mantra or hear a mantra, the vibrations emanate and make a sound like that of ‘damarukam’ in our ears. Yogi gets ‘ananda’ by doing mantra ‘puraccharana’. With that ananda, he dances.  

To indicate this, Siva’s Trishul has the damarukam. The ‘aajna chakra’ present between the eye brows is the centre for ‘jnana’. For a jnani, to get ‘ateendriya Shakti’ (power to perceive things which cannot be perceived by sensory organs), his ajna chakram should bloom.  

With this ‘chakra’ only, a yogi can see the past, present and future. This is Parameswara’s third eye. When this jnana netram (eye of jnana) blooms, one will get the power to burn Manmadaa i.e. the ‘kaama’ (lust). 

Burial ground (smashanam) is said to be the living place of Siva. After ‘yogagni’ burns all desires, yogi will get the experience of the state of ‘Nirvana’ which gives bliss.  

The state of jnana is compared to the colour ‘white’. That is vibhudhi. After thoughts and desires perish, a man gets pure jnana. With that, he gets bliss.  

The purification of jnana will take place in four planes, i.e. adhi bhouthika, adhi daivika, adhyatmika and manasika. To indicate this, Siva devotees wear four vibhudhi lines.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 107 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. కృతజ్ఞతయే మోక్షమార్గము 🌻*

నిద్రించుచున్నవాడు తనకు తానుండడు. మేల్కొని చూచువానికి మాత్రముండును.  

అట్లే జీవరాశులు , బ్రహ్మయు సృష్టికి ముందు తమకు తాముండరు. నారాయణునకుందురు. వారు మేల్కాంచుటయే సృష్టి. వెంటనే తమ అస్తిత్వమును, పరిసరములను , అటుపైన నారాయణుని గుర్తింతురు.  

ఇట్టి స్ఫురణ కలిగించిన దేవుని యందు కృతజ్ఞుడు కాని సజ్జనుడుండడు. కృతజ్ఞత తెలుపుట యనగా అతని యునికి యందు యేమరుపాటు చెందకుండుటయే.  

ఈ కృతజ్ఞతయే మోక్షమార్గము.

 భగవంతుని కరుణతో నిండారిన కటాక్షములచే లభించిన జ్ఞానదీపము వలన సమస్త దోషములనబడు చీకటులును తొలగుచున్నవి. దాని వలన నిరంతరమును వానిని స్మరించు భావము నిలచియుండును. దానితో ఎల్లప్పుడును యదార్థస్థితి దర్శనమగును.
....... ✍🏼 *మాస్టర్ ఇ.కె.* 🌻
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 129 🌹*
*🌴 The Crises - 3 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

*🌻 Crises for Awakening 🌻*

Even with great souls crises are something normal. Arjuna could receive the wisdom when he was in a great crisis on the battlefield. Maria Magdalena went through a deep crisis when she was about to be stoned. 

At this point there was but Jesus who protected her, and she very clearly realised who really loved her. Thus she found in the Master the only source and got initiated. 

Helena Blavatsky experienced strong opposition and her life was often threatened; nevertheless, she worked like a lion. Master EK experienced betrayal, ingratitude and criticism. 

In his time of preparation he went through a severe crisis because of the epileptic disease of his son; it lead him to homoeopathy with which he treated his son successfully, and then he used it for the rest of his life to heal countless people. In the lives of initiates we see how through the times of crises they awoke to spirit.

The Master not only brings us crises but also helps us to solve them. But sometimes in the times of crisis the outer Master disappears and stands at a distance to watch how we perform in the crisis. 

Thus, he withdraws the outer support so that the inner support mechanism is initiated by sheer necessity. Only if we find the Teacher within can we get through every crisis. 

If we face the crisis keeping firmly aligned to the divine the crisis dissolves and a gift of God appears for further progress on the path.

🌻 🌻 🌻 🌻 🌻 🌻 
Sources: Master K.P. Kumar: Uranus. The Alchemist of the Age / The Teachings of Sanat Kumara / notes from seminars. 

Continues
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 43 / Sri Lalita Sahasranamavali - Meaning - 43 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 79

356. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా - 
ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపములనెడి అగ్నిచేత తపింప చేయబడిన వారలకు మిక్కిలి సంతోషమును కలుగజేయునట్టి వెన్నెల వంటిది.

357. తరుణీ - 
ఎప్పుడు తరుణ వయస్సు, అనగా ఒకేరీతి యౌవనము గలది.

358. తాపసారాధ్యా - 
తపస్సు చేయువారిచే ఆరాధింపబడునది.

359. తనుమధ్యా - 
కృశించిన అనగా సన్నని కటి ప్రదేశము అనగా నడుము గలది.

360. తమో పహా - చీకటిని లేదా అజ్ఞానమును పోగొట్టునది.

🌻. శ్లోకం 80

361. చితిః - 
కూర్పు, జ్ఞానబిందు సమీకరణ.

362. తత్పదలక్ష్యార్థా - 
తత్ పదముచే నిర్దేశింపబడు లక్ష్యము యొక్క ప్రయోజనముగా నున్నది.

363. చిదేకరసరూపిణీ - జ్ఞానచైతన్యమే ఒకే ఒక రసముగా లేదా సర్వసారముగా స్వరూపముగా గలది.

364. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః - 
తనకు సంబంధించిన ఆనందముతో లేశమాత్రమైన బ్రహ్మానందము, ప్రజాపతి ఆనందము - మొదలైన ఆనందముల సమూహము గలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 43 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 43 🌻*

356 ) Sadachara pravarthika -   
She who makes things happen through good conduct

357 ) Thapatryagni santhaptha  samahladahna chandrika -  
 She who is like the pleasure giving moon to those who suffer from the three types of pain

358 ) Tharuni -   
She who is ever young

359 ) Thapasa aradhya -  
 She who is being worshipped by sages

360 ) Thanu Madhya -   
She who has a narrow middle (hip)

361 ) Thamopaha -   
She who destroys darkness

362 ) Chithi -   
She who is personification of wisdom

363 ) Thatpada lakshyartha -   
She who is the indicative meaning of the word “thath” which is the first word of vedic saying “that thou art”

364 ) Chidekara swaroopini -   
She who is wisdom through out

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 46 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 27

🌻 27. ఈశ్వర రస్యాప్యభిమాన ద్వేషిత్వాత్‌ దైన్య ప్రియత్వాత్‌ - 3 🌻

అహంకారాదులను వదిలించుకోవడానికి పాతంజలి యోగ పద్ధతులలో అష్టాంగ యోగమని ఒక ఉపాయమున్నది. 

అవి యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అని ఎనిమిది అంగాలు. మొదటి ఐదు విషయాసక్తిని నిగ్రహించడానికి, చివరి మూడు భగవంతునికి దగ్గరవడానికిని పనికి వస్తాయి.

1. యమం : యమమనగా ఈ కనిపించే ప్రపంచాన్ని ఈశ్వరమయంగా చూస్తూ అన్ని వస్తువులు ఆయనవేననే భావం కలిగి ఉండి తనది అంటూ దేనిమీద హక్కు లేకుండడం, అవసరమైన వాటిని భగవంతునివిగా భావించి ఇవన్నీ ఆయనవే అని, ఆయనకు నివేదించి తిరిగి భక్తుడి అవసరానికి ప్రసాదించమని ఆయనను వేడుకొనడం చేయాలి. నైవేద్యం, ప్రసాదం అనే వాటి అర్థం అదే. అంతేగాని మన వస్తువులు భగవంతుని కివ్వడమనే భావన సరికాదు.

            ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్‌
            తేన త్యక్త్యేన భుంజీథా, మాగృథః కస్యస్విద్ధనమ్‌ ||

            దీని అర్థం అంతా ఈశ్వరమయమని భావిస్తూ మనకు అవసరమైన వాటిని, ఆయనను అర్థించి అనుభవించు అని.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya 14 🌹*
✍️ Sri GS Swami ji 
📚. Prasad Bharadwaj

*🌻 Guru should not be ignored under any circumstance. He should never be treated or spoken of lightly. 🌻*
 
We were discussing the story of Indra. In that story, we learned that Indra was living very happily and comfortably in his kingdom. His mind then turned towards sensual pleasures. 

What happens to people when they become wealthy? They lose all their wealth in gambling, in consuming liquor, in various vices and evil habits. 

Similarly, one day Indra in heaven was absorbed in witnessing the dance and relishing the pleasures given by the Apsaras, the celestial maidens. 

At that time, while Indra was intoxicated with arrogance and immersed in the enjoyment of pleasures, his Guru Brihaspati came there. 

Devendra ignored his presence. There is no greater misdeed than ignoring the arrival and presence of one’s Guru. 

Observing this, Brihaspati left in fury. No one knew where he went. It was impossible to trace his whereabouts even through deep contemplation. 

Indra got very angry at Brihaspati that he arrived at an inopportune time without any advance intimation, and also that he left so unceremoniously. ‘When I was immersed in my pleasures, he came in. 

Even after seeing me, he left without accosting or greeting me. Is this the proper behavior for a guru and a respectable individual?” Indra was seething with displeasure at the behavior of Brihaspati. 

Indra regarded him only as a minister and a priest. He forgot to acknowledge that Brihaspati was his Guru. Brihaspati was giving him guidance and advice as a minister. 

Hence, Indra treated him only as a consultant, an astrologer, and as a fixer of schedules of important events, and as a casual counselor. 

He never treated him as Guru should be treated. In truth, one who has been accepted as one’s Guru should not be used for such petty services. 

It is not fair. It is not proper to treat him like an ordinary consultant. Guru is extremely special and exalted. 

There are many qualified professionals who can set dates for marriages and house warming ceremonies. It is wrong to ask Guru for approval of such dates. 

Guru is extremely powerful and competent in releasing one from bondage. 

He brings about a transformation in an individual. Indra forgot that Brihaspati was his Guru. Because of this misdemeanor committed by him, Indra lost all his acquired merit. 

There is no need to elaborate on this. All the accumulated merit and good fortune gets melted away the moment one rejects Guru. 

It goes without saying that Guru should not be ignored under any circumstance. He should never be treated or spoken of lightly. It must never be said complainingly, “My Guru predicted something, but it turned out differently.” 

Your line of thinking should be, “What if he had said something different, how much worse it would have been for me.” 

Guru’s statements should be analyzed from different angles with the conviction, “It is for my benefit that he spoke such words. 

My Guru, who knows all past and future lifetimes of all individuals, knows what is best for each one at any given time.” Even Indra, who was so knowledgeable, suffered the fate of losing all his glory because he treated his Guru with disrespect. 

Continues.. 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 12 / The Siva-Gita - 12 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ద్వితీయాధ్యాయము
*🌻. వైరాగ్య యోగము - 3 🌻*

ఆత్మా యదే కలస్తేషు - పరి పూర్ణ స్సనాతనః,
కాకాన్తా తత్ర కః కాన్త - స్సర్వ ఏవ సహోదరా 18

నిర్మితాయాం గృహావల్యం - తద వచ్చిన్న తాం గతమ్,
నభస్త స్యాం తు దగ్దాయాం - న కాంచి తక్షతి మృచ్చతి 19

తద్వ దాత్మా పి దేహేషు - పరి పూర్ణ స్సనాతనః,
హన్య మానే షు తేశ్వేవ - స్వయం నైవ హి హన్యతే 20

పంచ భూతాత్మ కంబైన శరీరములం దంతటను పరమ శివుడు
 ( ఆత్మ రూపమున ) వ్యాపించి యున్నాడు. గృహ నిర్మాణ
 సమయమున వాటిని విడిచి యాకాశ ముండదు, కాని అవి దహింప బడు నప్పుడే విధముగా నాకాశము
 దహింప బడదో అట్లే దేహము లందుండెడు ఆత్మ నశింపదు.
దేహములు నశించును.

హన్తా చే న్మన్యతే హస్తుం - హతశ్చే న్మన్యతే హతమ్ ?
తావు భౌన విజానీతో - నాయం హన్తి హన్యతే. 21

అస్మాన్న్రు పాతి దుఃఖేన - కిం ఖేద స్యాస్తి కారణమ్,
స్వస్వరూపం విదిత్వేదం - దుఃఖం త్యక్త్యా సుఖీభవ 22

ప్రపంచము నందు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కొట్టినచో వాడిని కొట్టి వాడని కాని అట్లు కొట్టబడిన వ్యక్తి దెబ్బల కోర్చిన వ్యక్తిని కాని, ఇట్లు కొట్టిన వాడు కొట్టబడిన వాడు ఈ యుభయులలో నే ఒక్కరు కర్తలు గారు. 

 కావున ఓ రామా! ఇందులకై శోకింప బని లేదు. నీ యాత్మ స్వరూపమును గనుకొని దుఃఖమును మాని నిత్య సుఖివి గమ్ము.


*🌹 The Siva-Gita - 12 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 02 : 
*🌻 Vairagya Yoga - 3 🌻*

18. 19. 20. In all the bodies which are formed of Pancha Bhoota (Five elements), Lord is present (as soul). When a house is built, sky remains attached to it. 

However when a house is burnt, it gets reduced to ashes but it doesn't burn the sky at all. Similarly, soul which resides inside the body doesn't perish while bodies perish.

21. 22. In this world, when one man beats another, one is seen as the punisher and another as the victim. But neither of them is the actual doer. Therefore, 

O Rama! it's worthless to doubt this fact. Realize your true self, and be in everlasting bliss by leaving this sorrow.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. VEDA UPANISHAD SUKTHAM - 69 🌹*
*🌻 1. Annapurna Upanishad - 30 🌻*
--- From Atharva Veda
✍️ Dr. A. G. Krishna Warrier
📚. Prasad Bharadwaj

V-101. Let him give up his body either in a holy spot or in the hut of an eater of dog's flesh: Once knowledge is won, one becomes Jnanin (a knower) of Brahman, free from all latent impressions of Karma. 

V-102. The cause of bondage is mental construction; give that up. Liberation comes through the absence of mental construction; practice it intelligently. 

V-103. In the context of objects, sense-organs and their contact by wary, perpetually and steadily avoiding states of mental construction. 

V-104. Do not succumb to objects; neither identify (yourself) with the sense-organs. Having renounced all constructions, identify with what remains. V-105. If anything pleases you, then in a state of bondage are you in empirical life; if nothing pleases you, then (indeed) are you liberated here. 

V-106. In the multitude of objects, moving and stationery, extending from grass, etc.; up to the living bodies, let there be nothing that gives you pleasure. 

V-107. In the absence of the I-sense and its negation, at once existent and non-existent, what remains unattached, self-same, superlatively pure, and steadfast is said to be the Fourth. 

V-108. That superlatively pure sameness, the quiescent status of liberation-in-life, the state of the spectator is, in-empirical usage, called the fourth state. 

V-109. This is neither wakefulness nor dream, for there is no room for mental constructions. Neither is this the state of deep sleep; for no inertness is involved in this. 

V-110. This world as it is, is dissolved, and then it is the Fourth State for those who are tranquillised and rightly awakened; for the un-awakened it stands changeless (as it is in its plurality).

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 4 / Sri Gajanan Maharaj Life History - 4 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

1. అధ్యాయము 
*🌻. పరిచయం - 3 🌻*

అతని ఆ విశాలమయిన వక్షస్థలం, కండలు తిరిగిన భుజాలు, నాసికాగ్రంపై కేంద్రీకృతమయిన కళ్ళు మరియు తేజోమయమయిన ముఖము వీరిరువురికి పరమ ఆనందం కలిగించాయి. అతి వినయంతో వీరు అతనికి నమస్కరించి, ఒక విస్తరలో భోజనం వెంటనే తేవలసిందిగా దేవీదాసు పంతను కోరారు. శ్రీదేవీదాసు తెచ్చి శ్రీమహారాజ్ ముందుఉంచాడు. 

అతను ఏవిధమయిన ఇష్టాఇష్టాలు లేక అన్నం, మిఠాయిలు కలిపివేసి తన ఆకలి తీర్చుకున్నాడు. ఒక మహారాజుకు చిన్న గ్రామం బహుమతిగా ఇచ్చినట్టుగానే ఈ భోజనంకూడా శ్రీమహారాజ్ కు అనిపిస్తుంది. 

బ్రహ్మరసంతో ఇంతకుముందే సంతృప్తి చెందిన శ్రీగజానన్ కు ఈ భోజనం ఒక మహారాజు కు చిన్న గ్రామం కానుకగా ఇచ్చినట్టు అనిపించింది. అతను పిచ్చివాడేమో అని పిలిచినందుకు బనకటలాల్ బాధపడ్డాడు. 

ఆ సమయంలో పక్షులు కూడా తమస్థావరాలను వదిలి బయటకు రావటానికి సాహసించలేని తీవ్రమయిన మధ్యాహ్నము. అటువంటి తీవ్రమయిన ఎండలో స్వయంగా బ్రహ్మవలే ఏవిధమయిన భయం లేకుండా పరమానందంగా శ్రీగజానన్ కుర్చున్నారు.

శ్రీమహారాజు భోజనం అయితేచేసారు కాని అతని కమండలంలో నీరు లేని విషయం దామోదర్పంత్ గమనించాడు. మహారాజ్ మీరు ఒప్పుకుంటే నేను మంచినీళ్ళు తీసుకువస్తాను అని బనకటలాల్ అన్నాడు. 

నీకు తేవాలని ఉంటే వెళ్ళి తీసుకురా అని మహారాజు నవ్వి అన్నారు. బ్రహ్మ ప్రతిచోటా ఉన్నాడు మరియు బ్రహ్మ నీకు నాకు మధ్య ఏవిధమయిన బేధభావం చూపడు. కాని మనం ఈప్రాపంచిక పద్ధతులు అనుసరించాలి. అందుకే భోజనం అయినతరువాత నీళ్ళు కూడా శరీరానికి అవసరం. 

ఈ విధమయిన సమాధానానికి బనకటలాల్ సంతోషించి శ్రీమహారాజు కొరకు త్రాగేనీరు తెచ్చేందుకు వెల్లాడు. ఇంతలో రోడ్డుప్రక్కన పశువుల కొరకు నింపిఉంచిన నీళ్ళకుండి దగ్గరకు శ్రీమహారాజు వెళ్ళి ఆ నీళ్ళతో దాహం తీర్చుకున్నారు.

 బనకటలాల్ చల్లటి నీళ్ళు ఉన్న కుండతో తిరిగివచ్చి శ్రీమహారాజును ఆ కుండినుండి మురికినీళ్ళు త్రాగవద్దని వేడుకున్నాడు. శుభ్రం-అశుభ్రం, మంచి-చెడు అనే బేధ భావం లేకుండా ప్రపంచంలోని ప్రతివస్తువులోనూ బ్రహ్మ వ్యాపించి ఉన్నాడు అని శ్రీమహారాజు అన్నారు. 

బ్రహ్మ మంచినీళ్ళలోనూ మురికినీళ్ళలోనూ మరియు వాటిని త్రాగే ప్రాణిలో కూడా బ్రహ్మ వ్యాపించిం ఉన్నాడు. ఈ విధమయిన విశ్వవ్యాపి అయిన భగవంతుని ప్రకృతిని, మరియు ఈప్రపంచం ఎలా ఉద్భవించింది అనే విషయం ప్రయత్నించి మీరు అర్ధంచేసుకోవాలి. దానికి బదులు మీరు ప్రాపంచిక అనుబంధాలలో నిమగ్నమవుతున్నారు. 

శ్రీమహారాజు నుండి ఈవిధంగావిన్న బనకటలాల్ మరియు దామోదరపంత్ ఇద్దరు కుడా వంగి శ్రీమహారాజుకు నమస్కరిద్దామనుకుంటే, వారి ఈ కోరిక తెలుసుకున్న శ్రీమహారాజు గాలివేగంతో పారిపోయారు. ఈగజానన్ విజయ గ్రంధం అందరికీ సంతోషాన్ని తెచ్చుగాక !
 
 శుభం భవతు
 1. అధ్యాయము సంపూర్ణము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 4 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj 

Chapter 1 
*🌻. Introduction - 3 🌻*

They were delighted to see His broad chest, muscular shoulders, eyes concentrated at the tip of nose, and a joyful face. They respectfully bowed to Him and asked Devidaspant to immediately bring a dishful of food. 

Shri Devidas brought the food and put it before Shri Gajanan Maharaj . He having no likes and dislikes, mixed all the food and sweets together and satisfied His hunger. It was like an emperor being presented with a small village. 

So was this food presented to Shri Gajanan who had already satisfied Himself by consuming Brahma Rasa. Bankatlal regretted having called Him a mad man. It was a very hot noontime and even the birds did not dare come out of their nests. 

Under such unfavourable conditions, Shri Gajanan was sitting fearlessly and was full of joy as if He was Brahma Himself. So Shri Gajanan Maharaj had taken food but then Damodarpant observed that there was no water in His Tumba. 

Bankatlal said, Maharaj, if You permit me, I will go and bring water for You. Shri Gajanan Maharaj smiled and said, If you wish, go and bring water. Brahma is everywhere and he won't differentiate between you and me, but we have to follow the worldly traditions. 

So when food is taken the body needs water too. Bankatlal felt happy over this reply and rushed to bring the water for Shri Gajanan Maharaj . 

In the meantime, Shri Gajanan Maharaj went to the roadside tank where water was stored for the cattle and satisfied His thirst with that water. 

Bankatlal returned with a jar of cold water and requested Shri Gajanan Maharaj not to drink the dirty water from that tank. 

Shri Gajanan said, Everything in the universe is pervaded by Brahma without any differentiation of clean or dirty, good or bad. 

Brahma is in clean water as well as in dirty water and the one who drinks it is also occupied by Brahma Himself. 

You should try to understand the omnipotent nature of God and also to know the origin of this world. Instead of this, you are involving yourself in wordly attachments.” 

Hearing so from Shri Gajanan Maharaj , both Bankatlal and Damodarpant bent down to prostrate before Shri Gajanan Maharaj ; knowing their intentions, Shri Gajanan Maharaj ran away with the speed of wind. May this Gajanan Vijay Granth bring happiness to all. ||

SHUBHAM BHAVATU||

 Here ends Chapter One.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 54 / Soundarya Lahari - 54 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

54 వ శ్లోకము

*🌴. పాప క్షయము, కన్ను, కిడ్నీ సమస్యల నివారణ, విజ్ఞాన వృద్ధి 🌴*

శ్లో: 54. పవిత్రీ కర్తుంనః పశుపతి పరాధీన హృదయే దయా మిత్రైర్నేత్రె రరుణధవళ శ్యామరుచిభిఃl 
నదః శోణోగంగా తపన తనయేతి ధ్రువమముం త్రయాణాం తీర్థానా ముపనయసి సంభేదమనఘంll 
 
🌻. తాత్పర్యం : 
అమ్మా ! అజ్ఞానులయిన ప్రాణులను కాపాడు పరమ శివుని యందు మనస్సు కల ఓ పార్వతీ దేవీ ! మమ్ములను పునీతులుగా చేయుటకు కరుణా రసములును ఎరుపు నలుపు తెలుపు అను వర్ణములు కలిగిన శోణ భద్ర, తెల్లని గంగానది,నల్లని యమునా నది అను మూడు నదులను తెచ్చుచున్నావు. ఇది నిజము. కదా ! 
  
🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, బెల్లంతో చేసిన పాయసం నివేదించినచో పాపముల క్షయము, కన్ను, కిడ్నీ సమస్యల నివారణ, విజ్ఞాన వృద్ధి జరుగును అని చెప్పబడింది.

*🌹 SOUNDARYA LAHARI - 54 🌹*
📚. Prasad Bharadwaj 

SLOKA - 54 🌹

*🌴 Destruction of all sins, Curing of Eye, kidney Diseases and scientific knowledge 🌴*

54. Pavithrikarthum nah pasupathi-paradheena-hridhaye Daya-mithrair nethrair aruna-dhavala-syama ruchibhih; Nadah sono ganga tapana-tanay'eti dhruvamamum Trayanam tirthanam upanayasi sambhedam anagham. 
 
🌻 Translation : 
She who has a heart owned by pasupathi, your eyes which are the companions of mercy, coloured red, white and black, resemble the holy rivers, sonabhadra, which is red, ganga which is white, yamuna, the daughter of sun, which is black, and is the confluence of these holy rivers, which remove all sins of the world.

We are certain and sure, that you made this meet and join, to make us, who see you, as holy.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) : 
If one chants this verse 1000 times a day for 45 days, offering milk payasam as prasadam, rids of worst sins, all problems relating to eyes, kidney are cured with ease and gain of scientific knowledge.

🌻 BENEFICIAL RESULTS: 
Cures venereal and kidney diseases, gives scientific knowledge. 
 
🌻 Literal results: 
Relieves people of guilt, cleanses and rids of worst sins, elevation and purification.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 353 / Bhagavad-Gita - 353 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 34 🌴

34. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమష్కురు |
మామేవైష్యసి యుక్వైవమాత్మానం మత్పరాయణ: ||

🌷. తాత్పర్యం :
నీ మనస్సు సదా నా చింతన యందే నిమగ్నము చేయుము. నా భక్తుడవగుము. నాకు నమస్కారము, నన్ను అర్చింపుము. ఈ విధముగా నా యందు సంపూర్ణమగ్నుడవై నీవు నన్ను తప్పక చేరగలవు.

🌷. భాష్యము : 
కృష్ణభక్తిరసభావన మొక్కటే కలుషితమైన భౌతికప్రపంచ బంధముల నుండి ముక్తిని పొందుటకు ఏకైక మార్గమని ఈ శ్లోకమునందు స్పష్టముగా తెలుపబడినది. భక్తియుతసేవను శ్రీకృష్ణభగవానునికే అర్పించవలెనని స్పష్టముగా ఇచ్చట తెలుపబడిన విషయమునకు అప్రమాణికులైన గీతావ్యాఖ్యాతలు కొన్నిమార్లు అర్థమును చెరచుదురు. దురదృష్టవశాత్తు వారు సాధ్యము కానటువంటి విషయముపైకి పాఠకుని మనస్సును మళ్ళింతురు. పరతత్త్వమేగాని సామాన్యుడు కానటువంటి శ్రీకృష్ణుని మరియు అతని మనస్సుకు భేదము లేదని అట్టి వారు తెలియజాలరు. శ్రీకృష్ణుడు, అతని దేహము, అతని మనస్సు అన్నియును ఏకమే. పరిపూర్ణమే. ఈ విషయమునే “దేహదేహివిభేదో(యం నేశ్వరే విద్యతే క్వచిత్” యని చైతన్యచరితామృతము (ఆదిలీల పంచమాధ్యాయము 41-48) యొక్క అనుభాష్యమునందు శ్రీభక్తిసిద్ధాంతసరస్వతీ గోస్వాములవారు కుర్మపురాణము నందు తెలుపబడినదానిని ఉదహరించియుండిరి. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని యందు భేదభావమనునదియే లేదు. అతడు మరియు అతని శరీరము అభేదములు. కాని కృష్ణసంభందవిజ్ఞానము లేని కారణముగా అట్టి వ్యాఖ్యాతలు కృష్ణుని దేవదేవత్వమును మరుగుపరచి ఆ భగవానుడు అతని దేహము లేదా మనస్సు కన్నను అన్యుడని వక్రముగా వ్యాఖ్యానింతురు. ఇది వాస్తవమునకు కృష్ణసంబంధవిజ్ఞాన రాహిత్యమేయైనను అట్టివారు సామాన్యులను మోసపుచ్చి లాభమును గడించుచుందురు.

శ్రీకృష్ణుని ధ్యానించు దానవులు సైతము కొందరు కలరు. కాని వారు ఆ భగవానుని అసూయతో ధ్యానించుచుందురు. అట్టివారికి ఉదాహరణము శ్రీకృష్ణుని మేనమామయైన కంసుడు. శ్రీకృష్ణుని అతడు సదా తన శత్రువుగా తలచుచుండెను. కృష్ణుడు వచ్చి ఎన్నడు తనను సంహరించునో యని అతడు సదా భీతితో ఉండెడివాడు. వాస్తవమునకు అట్టి చింతనము ఏమాత్రము సహాయభూతము కాదు. శ్రీకృష్ణుని ప్రతియొక్కరు భక్తిభావముతోనే చింతించవలెను. అదియే నిజమైన భక్తి. దాని కొరకై ప్రతియొక్కరు కృష్ణసంబంధ విజ్ఞానమును నిరంతరము అభ్యసించవలెను. కాని అననుకూలమైన అభ్యాసము ఎట్టిది? ప్రామాణికుడైన గురువు నుండి గ్రహించునదే అట్టి అనుకూల అభ్యాసము కాగలదు. శ్రీకృష్ణుడు పూర్ణపురుషోత్తముడైన దేవదేవుడు. ఇదివరకే పలుమార్లు వివరించినట్లు అతని దేహము భౌతికమైనదే కాక సచ్చిదానందమయమైనట్టిది. ఈ విధమైన కృష్ణపరచర్చ మనుజుడు భక్తుడగుటకు తోడ్పడగలదు. అప్రమాణికుల వలన శ్రీకృష్ణుని అన్యవిధముగా అవగాహన చేసికొనుట నిరుపయోగము కాగలదు.

కనుక ప్రతియొక్కరు శ్రీకృష్ణుడే పరమపురుషుడనెడి పూర్ణవిశ్వాసముతో మనస్సును ఆ భగవానుని నిత్యమును మరియు ఆద్యమును అయిన రూపమునందే లగ్నముచేసి అతని భక్తియుతసేవలో నిమగ్నులు కావలెను. శ్రీకృష్ణభగవానునికి భారతదేశమునందు అనేకవేల మందిరములు కలవు. వాని యందు ఆ భగవానుని భక్తియుతసేవ నిరంతరము ఒనరించబడుచుండును. అటువంటి భక్తియుతసేవ యందు మనుజుడు కృష్ణునకు వందనముల నర్పించవలెను. శిరము వంచి తన మనోవాక్కాయ కర్మలనన్నింటిణి భక్తి యందే నియుక్తము కావింపవలెను. తద్ద్వారా అతడు కృష్ణభావన యందే అనన్యముగా నిమగ్నుడు కాగలడు. అట్టి స్థితి అతడు కృష్ణలోకమును చేరుటకు తోడ్పడగలదు. కనుక ప్రతియొక్కరు కపటులు, అప్రమాణికులైన వ్యాఖ్యాతలచే సరియైన మార్గము నుండి వైదొలగక, శ్రీకృష్ణుని గూర్చిన శ్రవణ,కీర్తనములతో ఆరంభమగు నవవిధపూర్ణ భక్తియోగవిధానమున నియుక్తులు కావలెను. అట్టి శుద్ధభక్తియే మానవసమాజమునకు అత్యున్నత వరప్రసాదమై యున్నది.

శ్రీమద్భాగవతము యందలి “పరమగుహ్యజ్ఞానము” అను నవమాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 353 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 34 🌴

34. man-manā bhava mad-bhakto
mad-yājī māṁ namaskuru
mām evaiṣyasi yuktvaivam
ātmānaṁ mat-parāyaṇaḥ

🌷 Translation : 
Engage your mind always in thinking of Me, become My devotee, offer obeisances to Me and worship Me. Being completely absorbed in Me, surely you will come to Me.

🌹 Purport :
 In this verse it is clearly indicated that Kṛṣṇa consciousness is the only means of being delivered from the clutches of this contaminated material world. Sometimes unscrupulous commentators distort the meaning of what is clearly stated here: that all devotional service should be offered to the Supreme Personality of Godhead, Kṛṣṇa. 

Unfortunately, unscrupulous commentators divert the mind of the reader to that which is not at all feasible. Such commentators do not know that there is no difference between Kṛṣṇa’s mind and Kṛṣṇa. 

Kṛṣṇa is not an ordinary human being; He is Absolute Truth. His body, His mind and He Himself are one and absolute. It is stated in the Kūrma Purāṇa, as it is quoted by Bhaktisiddhānta Sarasvatī Gosvāmī in his Anubhāṣya comments on Caitanya-caritāmṛta (Fifth Chapter, Ādi-līlā, verses 41–48), deha-dehi-vibhedo ’yaṁ neśvare vidyate kvacit. This means that there is no difference in Kṛṣṇa, the Supreme Lord, between Himself and His body. 

But because the commentators do not know this science of Kṛṣṇa, they hide Kṛṣṇa and divide His personality from His mind or from His body. Although this is sheer ignorance of the science of Kṛṣṇa, some men make profit out of misleading people.

There are some who are demonic; they also think of Kṛṣṇa, but enviously, just like King Kaṁsa, Kṛṣṇa’s uncle. He was also thinking of Kṛṣṇa always, but he thought of Kṛṣṇa as his enemy. 

He was always in anxiety, wondering when Kṛṣṇa would come to kill him. That kind of thinking will not help us. One should be thinking of Kṛṣṇa in devotional love. That is bhakti. One should cultivate the knowledge of Kṛṣṇa continuously. What is that favorable cultivation? It is to learn from a bona fide teacher. 

Kṛṣṇa is the Supreme Personality of Godhead, and we have several times explained that His body is not material, but is eternal, blissful knowledge. This kind of talk about Kṛṣṇa will help one become a devotee. Understanding Kṛṣṇa otherwise, from the wrong source, will prove fruitless.

Thus end the Bhaktivedanta Purports to the Ninth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of the Most Confidential Knowledge.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 180 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴* 
40. అధ్యాయము - 15

*🌻. రుద్రావతార ఆవిర్భావము - 3 🌻*

విష్ణు రువాచ |

వరం బ్రూహి ప్రసన్నోsస్మి నాదేయో విద్యతే తవ | బ్రహ్మన్‌ శంభుప్రసాదేన సర్వం దాతుం సమర్థకః || 26

విష్ణువు ఇట్లు పలికెను -

ఓ బ్రహ్మా! వరమును కోరము. నేను నీపై ప్రసన్నుడనైతిని. నేను నీకీయజాలని వరము లేదు. శంభుని అనుగ్రహముచే నేను సర్వమును ఈయగల సమర్థుడను (26).

బ్రహ్మోవాచ |

యుక్తమేతన్మహాభాగ దత్తోsహం శంభునా చ తే | తదుక్తం యాచతే మేsద్య దేహి విష్ణో నమోsస్తుతే || 27

విరాడ్రూపమిదం హ్యండం చతుర్వింశతి సంజ్ఞకమ్‌ | న చైతన్యం భవత్యాదౌ జడీభూతం ప్రదృశ్యతే || 28

ప్రాదుర్భూతో భవానద్య శివానుగ్రహతో హరే | ప్రాప్తం శంకర సంభూత్యా హ్యండం చైతన్య మావహ || 29

ఇత్యుక్తే చ మహావిష్ణుశ్శంభోరాజ్ఞాపరాయణః | అనంతరూపమాస్థాయ ప్రవివేశ తదండకమ్‌ || 30

బ్రహ్మ ఇట్లు పలికెను -

మహాత్మా! నీవు చక్కగా పలికితివి. శంభుడు నన్ను నీకు అప్పిగించినాడు. హే విష్ణో! నేను కోరిన దానిని నాకు ఇమ్ము. నీకు నమస్కారమగు గాక! (27). 

ఇరువది నాల్గు తత్త్వములు కలిగిన విరాడ్రూపమగు ఈ అండము జడాత్మకముగా నున్నది. దీనియందు చైతన్యము కానరాకున్నది (28). 

హే విష్ణో! నీవీనాడు శివుని అనుగ్రహము వలన ప్రత్యక్షమైతివి. శంకరుని అనుగ్రహముచే లభించిన ఈ అండమును చైతన్యముతో నింపుము (29). 

బ్రహ్మ ఇట్లు పలుకగా, శంభుని ఆజ్ఞను శ్రద్ధతో పాలించే మహా విష్ణువు అనంత రూపముతో ఆ అండమును ప్రవేశించెను (30).

సహస్ర శీర్షా పురుషస్సహస్రాక్షస్సహస్రపాత్‌ | స భూమిం సర్వతో వృత్వా తదండం వ్యాప్త వానితి || 31

ప్రవిష్టే విష్ణునా తస్మిన్నండే సమ్యక్‌ స్తుతేన మే | సచేతన మభూదండం చతుర్వింశతి సంజ్ఞకమ్‌ || 32

పాతాలాది సమారభ్య సప్తలోకాధిపస్స్వయమ్‌ | రాజతే స్మ హరిస్తత్ర వైరాజః పురుషః ప్రభుః || 33

కైలాసనగరం రమ్యం సర్వోపరి విరాజితమ్‌ | నివాసార్థం నిజసై#్యవ పంచవక్త్రశ్చకార హ || 34

ఆయన అనంత శిరస్సులు, అనంత నేత్రములు, అనంత పాదములు గల విరాట్పురుషుడై, భూమినంతయూ వ్యాపించి, ఆ అండమును వ్యాపించినాడు (31). 

నేను చక్కగా ఆయనను ప్రార్ధించితిని. ఆయన నా ప్రార్థనను మన్నించి అండమునందు ప్రవేశించగనే, ఇరువది నాల్గు తత్త్వముల ఆ అండము చేతన సహితమాయెను (32). 

విరాట్పురుషుడు, జగత్ర్పభువునగు విష్ణువు పాతాలముతో మొదలిడి ఏడు లోకములకు ప్రభువై బ్రహ్మాండములో స్వయముగా ప్రకాశించుచున్నాడు (33). 

ఈ ఏడు లోకములపైన సుందరమగు కైలాసనగరమును అయిదు మోముల దైవము తన నివాసము కొరకు నిర్మించెను (34).

బ్రహ్మాండస్య తథా నాశే వైకుంఠస్య చ తస్య చ | కదాచిదేవ దేవర్షే నాశో నాస్తి తయోరిహ || 35

సత్యం పదముపాశ్రిత్య స్థితోsహం మునిసత్తమ | సృష్టికామోsభవం తాత మహాదేవాజ్ఞయా హ్యహమ్‌ || 36

సిసృక్షోరథ మే ప్రాదురభవత్పాప సర్గకః | అవిద్యా పంచకస్తాత బుద్ధి పూర్వస్తమోపమః || 37

తతోsప్రసన్న చిత్తోsహమసృజం స్థావరాభిధమ్‌ | ముఖ్య సర్గం చ నిస్సంగమధ్యాయం శంభుశాసనాత్‌ || 38

ఓ దేవర్షీ! బ్రహ్మాండము నశించిననూ, వైకుంఠకైలాసములకేనాడూ నాశము లేదు (35). 

ఓ మహర్షీ! నేను సత్యలోకమునాశ్రయించి ఉన్నాను. వత్సా! నేను మహాదేవుని యాజ్ఞచే సృష్టిని చేయతలపెట్టితిని (36). 

సృష్టిని చేయసంకల్పించి, నేను ముందుగా తమోగుణప్రధానము, పంచ అవిద్యలతో కూడినది యగు పాపసర్గమును చేసితిని (37).

 అపుడు నేను మనస్సులో దుఃఖించి వృక్షలతాదిరూపమగు ముఖ్య సర్గమును సృష్టించితిని. అపుడు శివుడు యాజ్ఞచే నేను మరల సృష్టిని గూర్చి ధ్యానము చేసితిని (38).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 56 🌹*
Chapter 15
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 THE REAL, FORMLESS, IMPERSONAL GOD - 1 🌻*

God is always present in his real impersonal form, but it is impossible for people with gross consciousness to imagine this real form of God. 

The real, impersonal, infinite and indivisible form of God is utterly beyond imagination.

 Imagination always creates forms, and the consciousness of individual limited imagination always feels convinced of the existence of anyone or anything so long as it has a form. 

So, God who is without form and body, has to take form and a human body, age after age, in order to convince humanity in illusion that God is infinite and without form or body.

God took human form in the body of Meher Baba in this age, and since God takes form to awaken humanity in illusion to the infinite, impersonal and formless God, Meher Baba's physical body has a tremendous impact on the imagination of humanity. 

This is why people experience his physical presence more intensely now than when he was in. the body. People experience his presence through visions, dreams, films, photographs, paintings and stories from his life. 

Through the medium of the Avatar's physical body, the impersonal, formless God has revealed himself. Because of Meher Baba's work, the imagination feels the impact of his presence, even though the Avatar is no longer in physical form. 

The imagination of humanity sees the form of God through the Avatar's body, and his formless, real presence is felt through the force of love in the heart. 

The result of this experience is to turn human consciousness toward the real, impersonal and formless God, who Meher Baba really is.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 52 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 24
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. కుండ నిర్మాణాగ్ని కార్యవిధి - 3 🌻*

గర్భాధానాదికర్మాణి యావదంశవ్యవస్థయా. 30

నామాన్తం ప్రతబన్ధాన్తం సమావర్తావసానకమ్‌ | అధికారావసానం వా కుర్యాదఙ్గావసానతః 31

గర్భాధానాది కర్మలను ఆ యా అంశములను వ్యవస్థ చక్కగా పాటించుచు, అంగముల ననుసరించి, నామాంతముగా గాని, సమావర్తాంతము గాని, అధికారాంతము గాని చేయవలెను.

ప్రణవేనోపచారం తు కుర్యాత్సర్వత్ర సాధకః | అజ్గైర్హోమస్తు కర్త వ్యో యథావిత్తానుసారతః 32

సాధకుడు అన్నింటను ఓంకారముతో ఉపచారము చేయవలెను. ధనలోభము చేయకుండగా అంగహోమములు చేయవలెను.

గర్భాదానం తు ప్రథమం తతః పుంసవనం స్మృతమ్‌ | సీమన్తోన్నయనం జాతకర్మ నామాన్న ప్రాశనమ్‌. 33

చూడాకృతిం వ్రతబంధం వేదవ్రతాన్యశేషతః | సమావర్తనం పత్న్యా చ యోగశ్చాథాధికారకః 34

గర్భాధానము, పుంసవనము, సీమన్తోన్నయనము, జాతకర్మ నామకరణము, అన్నప్రాశనము, చౌలము, వ్రత బంధము (ఉపనయనము), సమస్త మైన వేదవ్రతాలు (నాలుగు), స్నాతకము, వివాహము, ఆధికారము అను సంస్కారములను వరుసగా చేయవలెను.

హృదాదిక్రమతో ధ్యాత్వా ఏకైకం కర్మ పూజ్య చ | అష్టావష్టౌతు జుహుయాత్ప్రతికర్మాహుతీః పునః 35

ప్రతికర్మయందును హృదయాదిక్రమముచే ధ్యానించి, ఒక్కొక్క కర్మను పూజించి, మరల ఎనిమిదేసి ఆహుతులను హోమము చేయవలెను.

పూర్ణాహుతిం తతో దద్యాత్‌ స్రుచా మూలేన సాధకః | వౌషడన్తేన మున్త్రేణ ప్లుతం సుస్వరముచ్చరన్‌. 36

సాధకుడు వౌషట్‌ చివర గల మంత్రమును చక్కగా ప్లుతస్వరముతో ఉచ్చరించుచు స్రుక్కు మొదటి భాగముతో పూర్ణాహుతి ఇవ్వవలెను.

విష్ణోర్వహ్నింతు సంస్కృత్య అర్పయేద్వైష్టం చరుమ్‌ |
ఆరాధ్య స్థణ్డిలే విష్ణు మన్త్రాన్‌ సంస్కృత్య సంశ్రయేత్‌. 37

విష్ణవునకై వహ్నిని సంస్కరించి వైష్ణవమైన చరువును అర్పించవలెను. స్థండిలముమీద విష్ణువును పూజించి, మంత్రములను స్మరించుచు ఆశ్రయించవలెను.

ఆసనాదిక్రమేణౖవ సాఙ్గావరణముత్తమమ్‌ | గన్ధపుషై#్పః సమభ్యర్చ్య ధ్యాత్వా దేవం సురోత్తమమ్‌. 38

ఆదాయేధ్మ మతాఘారావాజ్యావగ్నీశసంస్థితౌ | వాయవ్యనైరృతాశాదిప్రవృత్తౌ తు యథాక్రమమ్‌. 39

ఆజ్యభాగౌ తతో హుత్వా చక్షుషీ ధక్షిణోత్తరే | మధ్యేథ జుహుయా త్సర్వమన్త్రైరర్చాక్రమేణ తు. 40

ఉత్తమమైన సాంగావరణమును ఆసనాదిక్రమముచే గంధి పుష్పములతో పూజించి, దేవతాశ్రేష్ఠుడైన ఆ విష్ణువును ధ్యానించి, సమిధను ఉంచి, పిమ్మట ఆగ్నేయ ఈశాన్య దిక్కలందు ఆజ్యాఘారములను, వాయవ్య నైరృతదిక్కలంధు ఆజ్యభాగములను క్రమానుసారముగా సమర్పించి, పిమ్మట దక్షిణోత్తర చక్షుర్హోములు చేసి, పిమ్మట అర్చా క్రమానుసారముగా మధ్యయందు, సర్వమంత్రముల తోడను, హోమము చేయవలెను.

ఆజ్యేన తర్పయేన్మూర్తిం దశాం శేనాఙ్గహోమకమ్‌ |
శతం సహస్రం వాజ్యాద్యైః సమిద్భిర్వా తిలైః సహ. 41

ఆజ్యముచేత మూర్తినితృప్తిపరచవలెను. వదన అంశము అంగహోమము చేయవలెను. ఆజ్యము మొదలైనవాటితో లేదా తిలలతో గూడిన సమిధలతో మూరు లేదా వేయి హోమములు చేయవలెను.

సమాప్యార్చాం తు హోమాన్తాం శుచీన్‌ శిష్యానుషోషితాన్‌ |
ఆహుయాగ్రే నివేశ్యాథ హ్యస్త్రేణ ప్రోక్షయే శూత్పన్‌. 42

హోమము అంతమునందు గల పూజను సమాప్తి చేసి ఉపవాస మున్న పవిత్రులైన శిష్యలను పిలచి, తన ఎందుట ఉంచుకొని, ఆ పశువులను అస్త్రమంత్రముచే ప్రోక్షించవలెను.

శిష్యానాత్మని సంయోజ్య విద్యాకర్మనిబన్ధనైః | లిఙ్గానువృత్తం చైతన్యం సహ లిఙ్గేన పాలితమ్‌. 43

ధ్యానమార్గేణ సమ్ప్రోక్ష్య వాయుబీజేన శోషయేత్‌ | తతో దహనభీజేన సృష్టిం బ్రహ్మణ్డసంజ్ఞికామ్‌. 44

నిర్దగ్ధాం సకలాం ధ్యాయేద్భస్మకూటనిభస్థితామ్‌ | ప్లావయేద్వారిణా భస్మ సంసారం వార్మయం స్మరేత్‌ . 45

శిష్యులను విద్యాకర్మనిబంధనములచే తనలో కలుపుకొని, లింగ శరీరమును అనుసరించి ఉన్నదియు, లింగ శరీరముతో కూడా పాలింపబడినదియు అగు చైతన్యమును ధ్యానమార్గమున సంప్రోక్షించి, వాయుబీజములచే శుష్కింపచేయవలెను. 

పిమ్మట బ్రహ్మాండ మను పేరు గల ఈ సృష్టి యంతయు అగ్నిబీజముచే కాల్చివేయబడి భస్మరాశి వలె ఉన్నట్లుగా ధ్యానము చేయవలెను. 

ఆ భస్మము నీటితో ముంచెత్తవెలను. ప్రపంచ మంతయు జలమయముగా ఉన్నట్లు స్మరించవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 67 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భృగువు మహర్షి - ఖ్యాతి - 3 🌻*
15. మనస్సు క్రమ క్రమంగా ఏయే స్థానాలను పొందుతుందో చెప్పాడు. మనస్సు మొట్టమొదట విషయంలోకి ప్రవేశిస్తుంది. 

16. తరువాత ఇంద్రియాన్ని చూస్తుంది. తరువాత అంతరాత్మ ద్వారా ప్రదర్శనకూడా చేస్తుంది. అటువంటి శక్తి మనసుకు ఉంది. మనోబుద్ధి చిత్తములు అనేక స్థాయిలలో ఉంటాయని దాని అర్థం.
చాతుర్వర్ణాశ్రమాలను గురించి చాలా చెప్పాడు: 

17. “సత్యమే తపస్సు యొక్క స్థానము. అంటే తపస్సుయొక్క ధ్యేయం సత్యం. తపస్సు సత్యమందు నిత్యము పరినిష్ఠమై ఉండాలి. దేనినిగురించి తపస్సుచేస్తున్నావు అంటే, ‘సత్యాన్ని గురించి చెస్తున్నాను. సత్యమే నా ధ్యేయము’ అని చెప్పాలి. 

18. సత్యాన్ని గురించి చేసిన ధ్యానం తపస్సే అవుతుంది. అది సత్పదార్థధ్యేయమైనదే. తపస్సుయొక్క చిట్టచివరి దశ సత్యం. అనగా తపస్సు సత్యాన్వేషణము అని తేలుతుంది దీన్నిబట్టి. 

19. సత్యమే బ్రహ్మము. అదే సృజనాత్మక శక్తి. ధర్మాధర్మములు, జ్ఞానాజ్ఞానములు, స్వర్గనరకములు, సుఖదుఃఖములు అవన్నీఖూడా వ్యావహారిక శబ్దములు మాత్రమే”

20. ఒకడికి ఉన్న జ్ఞానము అసత్యజ్ఞానమే కాని సత్యజ్ఞానము కాదు.  

ఇందులో గురుబోధ ఏమిటంటే, “నీ అనుభవం నీదే! నీ అనుభవం ఇంకొకరికి సత్యం కానవసరం లేదు. అసత్యాన్ని సత్యమని భావనచేసేవాడికి సత్యమనేది వేరే ఇంకొకటుందనే భావన వాగ్రూపంలో సాధ్యం కాదు” అని.

 21. సదసద్వివేకసంపత్తి లాంటివన్నీకూడా సాపేక్షంగా చెప్పే విషయాలు. 

సత్యపదార్ధము ఒకటుందని, అసత్పదార్ధము మరొకటి ఉందని – ఈ రెండూ ఉన్నాయని చెప్పటం జరుగుతుందిగాని, అసలు రెండూ ఉన్నాయనడం సబబుకాదు. తాను ఉండటమే మనుష్యుడికి సత్యము. 

22. తనవరకు ప్రపంచమే సత్యం. ప్రపంచం ఎంతకాలం సత్యమవుతుందో, అంతకాలం యథార్థమైన పరమసత్యం అనేది అతడికి లేదు. అది అతడికి లేనేలేదు. అతడికి ఇది ఒకటే ఉంది. 

23. ప్రతీ జీవుడికి అనుక్షణమూకూడా ఈ రెండూ అనుభవంలో ఉండవు. పరమాత్మ దర్శనం కానప్పుడు అసత్పదార్థమే అతడియందు ఎల్లప్పుడూ ఉంటుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 131 🌹*
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

*🌻 "I AM" IS THE LAST OUTPOST OF ILLUSION..GET RID OF IT... 🌻*

I want to take you to that ‘I am’ concept which is the last outpost of illusion and get rid of it. Understand the quality of these concepts.

There are various types of charity, but the greatest charity is the renunciation of the knowledge ‘I am’. 

When you give that up you escape birth and death. Waking state represents activity; deep sleep represents peace, quiet. 

When these two are present it means ‘I am’ is there, but you the Absolute are neither the waking state, deep sleep nor the ‘I amness’.

What else is there except the touch of ‘I am’? Why do you worry about discovering Maya and Brahma and all that? 

Understand what
this principle ‘I am’ is and you are finished. That ‘I am’ is in
bondage because of concepts
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మనోశక్తి - Mind Power - 70 🌹*
 *Know Your Infinite Mind*
*🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴*
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. Q 62:-- ఇతర జీవజాతుల నుండి మనిషి నేర్చుకోవాల్సిన విషయాలు. - జీవజాతులు vs జనాభా నియంత్రణ - 2 🌻*

6) జంతుజాతి వాటికి జబ్బు వస్తే వాటి దేహాలను ఎలా రిలాక్స్ చేసుకుంటాయో, ఔషధ మొక్కల్ని గుర్తించి ఎలా అనారోగ్యాన్ని నయం చేసుకుంటాయి చూసి మనమూ నేర్చుకోవాలి.

జంతువుల భౌతిక విన్యాసాల్ని గమనించాలి. సాలె పురుగు సృజనాత్మకంగా తన గూడును నిర్మించుకోవడం, పాము దేహాకృతిని అందంగా సృష్టించుకోవడం పక్షులు వేళా మైళ్ళు ప్రయాణించి ఆహారాన్ని అన్వేషించడం అంతర్ ప్రపంచం నుండి అవి నేర్చుకున్నాను. వీటన్నింటికి అంతర్ ప్రపంచాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు.

7) అంతర్ ప్రయాణం చేసి అంతర్ ప్రపంచం నుండి క్రొత్త క్రొత్త విషయాలు రాబట్టి వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చేసివుంటే ఎన్నో వేల రెట్లు అభివృద్ధి చెందివుండేది. ఆత్మ దేహం మరియు చైతన్య పరిణామాన్ని అధ్యయనం చేసి, పరిశోధన చేసి చికిత్స చేసేవాడే నిజమైన వైద్యుడు.

8) dolphin అనే సముద్ర జాతి మానవుని లాగే కుటుంబవ్యవస్థ ను కలిగి ఉంది.వాటి పరివర్తన, భావోద్వేగాలు వినయ విధేతలు సామాజిక సాహచర్యం మానవ జాతితో పోలి ఉంటాయి. dolphins ఇతర సముద్రజాతికి ఎంత సహాయ పడతాయంటే మానవజాతి సిగ్గుపడేంతగా.

కొన్ని నాగారికతల్లో సముద్రజాతి మానవజాతిని dominate చేసింది.
ప్రత్యామ్నాయ లోకాలలో సముద్రజాతి మానవజాతి పైన ఆధిపత్యం వహిస్తుంది.

9) మొదట ఏకకణ జీవులుగా, రాళ్లు, రప్పలు, కీటకాలు, వృక్షాలు, జంతువులు, ఖనిజ లవణాలుగా పరిణామం చెందుతూ మానవ దేహాన్ని తీసుకోవడం జరిగింది. 

మానవ దేహంలో కూడా ఎన్నో అనుభవాలు పొంది, ఎన్నో జన్మలు తీసుకుని అనగా కొన్ని జన్మలు అంగవైకల్యం తో కొన్ని జన్మలు సంతోషంగా ఇలా ఆత్మ అనుభవాలు పొందడం కోసం జన్మ తీసుకుంటుంది. మనకు అంగవైకల్యంతో ఉన్న జన్మ బాధాకరంగా అనిపిస్తుంది. 

మన analytical మైండ్ ఏర్పరుచుకున్న భావన మాత్రమే బాధపడటం అంటే. ఆత్మకు ఇలాంటి జన్మ ఒక adventure. అంగవైకల్యం కర్మకాదు, ఆత్మ పొందాలనుకున్న అనుభవం. 

ఆత్మ తల్లిదండ్రులును, ఏ దేశంలో పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఏ భౌతిక పరిస్థితుల మధ్య పుట్టాలో నిర్ణయించుకుని జన్మ తీసుకోవడం జరుగుతుంది.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 16 🌹*
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. అచ్చమ్మకు చెప్పిన జ్యోతిష్యం - 4 🌻*

దుర్మార్గులే రాజులుగా మారతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకరమైన కష్టాలు అనుభవించి హీనంగా మరణిస్తారు.

లోకమంతా అవినీతిమయంగా ఉంది. నేరగాళ్ళు, మోసగాళ్ళు ప్రజా పాలకులుగా మారుతున్నారు. మనదేశంలోనే కాదు, అభివృద్ధి చెందిన దేశాలతో సహా ప్రజలను పాలించేవారు అవినీతిపరులు, దుర్మార్గులు ఉండటం చూస్తూనే ఉన్నాం.

ధనవంతులు మాత్రమే పాలకులుగా మారుతున్నారు. వారికి ధన సంపాదనే ధ్యేయం. ఈ ప్రయత్నంలో సామాన్య ప్రజల కష్టాల గురించి ఎవరికీ పట్టడం లేదు. ఒక పేదవాడు నేతగా మారటం దుస్సాధ్యంగా మారింది.

మత కలహాలు పెరిగి ఒకర్నొకరు చంపుకుంటారు…

దేశ విభజన సమయంలో కూడా హిందువులు, ముస్లింలు ఒకర్నొకరు చంపుకున్నారు. ఇటీవల కూడా గుజరాత్ లో నరమేధం జరిగింది. ఇక్కడ ముందుగా ముస్లింలు మత కల్లోలాలను ప్రారంభించారు. వారు రైల్లో ప్రయాణిస్తున్న కొందరు హిందువులను సజీవదహనం చేయడంతో, హిందువులు ముస్లింలను వందల సంఖ్యలో హతమార్చారు. ఇలాంటి విషాదకర సంఘటనలు పెచ్చుమీరుతున్నాయి. క్రమంగా అన్ని మతాల్లోనూ ఉన్మాదుల సంఖ్య పెరిగిపోతోంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 10 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. జ్ఞానాన్ని సాధించాలి అంటే రెండే మార్గాలు. యోగము, ఇంద్రియ జయము. 🌻*

ఈ రెండింటి ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి “నాన్యః బంధాయ విద్యతే వాసుదేవాయ ధీమహి”. అటువంటి వాసుదేవుణ్ణి ఆశ్రయించాలి అంటే అన్యమైనటువంటి మార్గం లేదు.

 ఏమిటీ? ఒకటి ఇంద్రియజయము. రెండు భక్తి. ఈ రెండింటి ద్వారా జ్ఞానసిద్ధికి అధికారిత్వాన్ని పొందాలి. “భోగములను అనుభవించి తృప్తిని పొందినవారు లేరు” అని కూడా నిర్ణయంగా చెప్తున్నాడు. 

అంటే అర్ధ ఏమిటటా? “కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే? వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే?” అనేటటువంటి పద్యాన్ని గనుక, మనం భాగవత పద్యాన్ని గనుక గుర్తిస్తే - “కారే రాజులు? రాజ్యముల్ గలుగవే?” - ఎంతోమంది రాజులు ఈ భూమిని పరిపాలించారు. ఎంతోమంది చక్రవర్తులు పరిపాలించారు. ఎంతోమంది మహనీయులైనటువంటి వాళ్ళు, ఎంతోమంది చరిత్ర కలిగినటువంటి వాళ్ళు, 

యశఃకాములైనటువంటి వాళ్ళు ఎంతోమంది పృధ్విలో వచ్చారూ, పోయారు. కానీ వారేమైనా సిరి మూటకట్టుకుపోయారా? వారేమైనా తృప్తిని పొందారా? అంటే వారెటువంటి నిత్యతృప్తిని పొందలేదు. ఒక్క జ్ఞానం వల్ల మాత్రమే, అది కూడా ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే నిత్య సంతృప్తతని పొందగలుగుతాడు మానవుడు.

         అటువంటి ఆత్మజ్ఞాన సముపార్జనకై జీవితంలో సమయాన్ని, శ్రమని, శ్రద్ధని, ఆసక్తిని, తహని, నిశ్చయాన్ని, లక్ష్యాన్ని మనం సాధించాలి. 

అలాంటి మార్గంలో మనం ప్రయాణం చేయాలి అంటే తప్పక భోగమార్గమై వున్నటువంటి జగత్ వ్యాపార విషయములందు అనురక్తి కలిగి వుండరాదు. విరక్తి వుండటం అవసరం కాని అనురక్తి లేకుండా చూసుకోవడం ముఖ్య అవసరం. ఈ రెండింటి మధ్య బేధాన్ని కొద్దిగా మనం గుర్తించాలనమాట. 

మానవుడు ప్రతిరోజూ తన శరీర అవసర నిమిత్తమై భోజనం చెయ్యాలా? వద్దా? చెయ్యాలి. అనురక్తి లేక చెయ్యాలి. వైరాగ్య భావంతో చెయ్యాలి. ఈశ్వర ప్రసాద భావంతో చెయ్యాలి. అట్లాంటప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అలా గనుక ఆచరించకపోయినట్లయితే అది సాధ్యపడదు. 

ఇట్లా గమనించుకోవాలన్నమాట. ప్రతిదీ ఈశ్వర ప్రసాదంగా చూసేటటువంటి ఉత్తమ లక్షణాన్ని మానవులందరు కూడానూ చక్కగా సంపాదించాలి. అలా సంపాదించకపోయినట్లయితే నువ్వు ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా అది అసాధ్యం. 

అందుకని అనురక్తి దేంట్లో వుంది, ప్రియాప్రియాలు దేంట్లో వున్నాయి అనేటటువంటి జాబితా సాధకులందరూ తప్పక తయారు చేసుకోవాలి. తయారు చేసుకుని వాటియందున్నటువంటి అనురక్తిని పోగొట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹 సర్వ వేదాంత శిరో భూషణము - 1 🌹
(శూన్యం - సర్వం, సర్వం - శూన్యం)
✍️ సద్గురు విజ్ఞాన్ స్వరూప్
సేకరణ 📚. ప్రసాద్ భరద్వాజ

 ప్రారంభము 

🍃గురుస్తుతి🍃
 
కం ||  
జనులార జనన మరణము | లను దొలగన్‌ | ద్రోయజాలు లక్షణయుతమై | వినువారికి | 
కనువారికి | తన లావెరిగించు దీని | తప్పాక వింటె | అప్పుడె వార | లెప్పుడూ గంటే - కనుకా వినబుద్ధైతె | 
వినుడీ చదివెద మీకె కనుగొన మనసైతె కనుడీ | పుస్తకమంత | తప్పాక వింటె | అప్పుడె వారలెప్పుడూ గంటే | 
 
       ఓ జనులారా! ‘జనులారా’ - అని ఎందుకు సంబోంధించారు అంటే, జ అంటే పుట్టేవాళ్ళు, న అంటే నశించే వాళ్ళు కనుక జనాలు అంటే చావు పుట్టుకలు ఉన్నవాళ్ళు అని అర్థము. వారికే చావు పుట్టుకలు లేని బోధ కావాలి. 
 
లక్షణయుతులై : లక్షణయుతులు అంటే, అజ్ఞానము విడిచి, ‘అహం బ్రహ్మాస్మి’ జ్ఞానము పొంది, ఈ అహంబ్రహ్మాస్మి అనేది తిరిగి వచ్చే మోక్షమా? తిరిగిరాని మోక్షమా? అనేటటువంటి పద్ధతిలో బోధ కోసం వినాలి. 
 
       ‘అహంబ్రహ్మాస్మి’ జ్ఞానంలో యావత్‌ సృష్టికి బాధ్యత వహించేటటువంటి ఘోర సంసారముంది. అక్కడ బాధపడలేక తగినటువంటి అశరీర గురువులను, దేశికేంద్రులైనటువంటి గురువులను ఆశ్రయించి, బ్రహ్మజ్ఞానం నుండి కూడా విడుదల చేయమని, ఎవరైతే కోరుతారో, వాడు లక్షణయుతుడు. 
 
       అద్వైత జ్ఞానము కలగాలంటే సాధన చతుష్టయ సంపత్తి ఎలా ఉండాలో, అది ఉన్న వాళ్ళకే నాలుగు మహావాక్యాలు చెప్పి, ‘తత్త్వమసి’ వాక్యంతో అద్వైత జ్ఞానాన్ని సిద్ధింపచేస్తారు కదా సద్గురువులు! కానీ అది తిరిగి వచ్చే మోక్షమా? తిరిగిరాని మోక్షమా? అనేది తెలియాలి. 
 
       ఏ బ్రహ్మ సంకల్పంతో ఈ సృష్టి వచ్చిందో, అటువంటి బ్రహ్మజ్ఞానంలో తిరిగి సృష్టి వచ్చేటటువంటి ప్రమాదంలేని పద్ధతిలో ఒక బోధ కావల్సి ఉంటుంది. దీనినే ‘పరిపూర్ణ బోధ’ అంటారు. కనుక ఈ పరిపూర్ణబోధకు అధికారి ఎవరూ అంటే, ‘అహం బ్రహ్మస్మి’ అనుభవంతో జీవన్ముక్తుడు అయినవాడు. వాళ్ళని ఇక్కడ లక్షణయుతులు అంటున్నారు. ఈ ప్రబోధ తప్పక విని కనియెదరో అన్నప్పుడు ‘ప్రబోధ’ అంటే ఏమిటి? 
 
        ‘బోధ’ అంటేనేమో ఒకరు చెప్పేవారు, ఒకరు వినేవారు, అంతవరకే! ‘బోధ’ అనగా శ్రవణము చేయుటకు వీలైనది. ‘ప్రబోధ’ అంటే గురువు తన సత్తాతో చెప్పేది, తన స్వానుభవంతో చెప్పేది. శిష్యుడు తను శ్రవణం చేస్తున్నప్పుడే హృదయంలోకి అనుభవముగా స్వీకరించబడేది. గురువు తన సత్తాతో సూచనవాక్యంగా చెప్పేటటువంటిది, శిష్యుడు వినినంతనే గురువు శిష్యుడిలోకి వ్యాపించడం ద్వారా ఆ గురువు యొక్క అనుభవం ఏదో, అదే శిష్యుడి అనుభవంగా మారేటట్లుగా గురువు బోధించే దానిని ‘ప్రబోధ’ అంటారు. అటువంటి ‘ప్రబోధ’ తప్పక ఎవరైతే వింటారో, ఇక్కడ శ్రద్ధతో అని అనడంలేదు. ‘శ్రద్ధ’ అంటే సాధన అవుతుంది. ఇంతకంటే మించినది లేదని, ఏమరుపాటు లేకుండా జాగ్రత్తగా వింటారో, మళ్ళీ ధ్యాన పూర్వకముగా విననవసరం లేదు. ఇంగిత జ్ఞానంతో సంశయ నివారణకోసము విన్నట్లుగా వింటే చాలు. మనన, నిది ధ్యాస పూర్వకముగా కాదు. ఇది మననము, నిది ధ్యాస చేసేది కాదు. అది ఎరుకను విడిపించేటటువంటి అచల బోధ. ‘లక్షణయుతమైన’ - అన్నప్పుడు, అక్కడ మాటలు చెప్తున్నాము. ఇది ‘సర్వ వేదాంత శిరోభూషణము’ కనుక, మొదట సాధన చతుష్టయ సంపత్తితో మొదలు పెట్టి, శరీరత్రయ విలక్షణము, పంచకోశ లక్షణ వ్యతిరిక్తము అయినటువంటి ఆత్మ, అవస్థాత్రయ సాక్షి అయినటువంటి ఆత్మకి, ఆత్మానాత్మ వివేకాన్ని ఇచ్చి, నాలుగు మహావాక్యాలు చెప్పినప్పుడు, శ్రవణ మనన నిది ధ్యాసలు తప్పవు, అవి ఉంటాయి. 
🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹