🌹. శివగీత - 12 / The Siva-Gita - 12 🌹


*🌹. శివగీత - 12 / The Siva-Gita - 12 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ద్వితీయాధ్యాయము
*🌻. వైరాగ్య యోగము - 3 🌻*

ఆత్మా యదే కలస్తేషు - పరి పూర్ణ స్సనాతనః,
కాకాన్తా తత్ర కః కాన్త - స్సర్వ ఏవ సహోదరా 18

నిర్మితాయాం గృహావల్యం - తద వచ్చిన్న తాం గతమ్,
నభస్త స్యాం తు దగ్దాయాం - న కాంచి తక్షతి మృచ్చతి 19

తద్వ దాత్మా పి దేహేషు - పరి పూర్ణ స్సనాతనః,
హన్య మానే షు తేశ్వేవ - స్వయం నైవ హి హన్యతే 20

పంచ భూతాత్మ కంబైన శరీరములం దంతటను పరమ శివుడు
 ( ఆత్మ రూపమున ) వ్యాపించి యున్నాడు. గృహ నిర్మాణ
 సమయమున వాటిని విడిచి యాకాశ ముండదు, కాని అవి దహింప బడు నప్పుడే విధముగా నాకాశము
 దహింప బడదో అట్లే దేహము లందుండెడు ఆత్మ నశింపదు.
దేహములు నశించును.

హన్తా చే న్మన్యతే హస్తుం - హతశ్చే న్మన్యతే హతమ్ ?
తావు భౌన విజానీతో - నాయం హన్తి హన్యతే. 21

అస్మాన్న్రు పాతి దుఃఖేన - కిం ఖేద స్యాస్తి కారణమ్,
స్వస్వరూపం విదిత్వేదం - దుఃఖం త్యక్త్యా సుఖీభవ 22

ప్రపంచము నందు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కొట్టినచో వాడిని కొట్టి వాడని కాని అట్లు కొట్టబడిన వ్యక్తి దెబ్బల కోర్చిన వ్యక్తిని కాని, ఇట్లు కొట్టిన వాడు కొట్టబడిన వాడు ఈ యుభయులలో నే ఒక్కరు కర్తలు గారు. 

 కావున ఓ రామా! ఇందులకై శోకింప బని లేదు. నీ యాత్మ స్వరూపమును గనుకొని దుఃఖమును మాని నిత్య సుఖివి గమ్ము.


*🌹 The Siva-Gita - 12 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 02 : 
*🌻 Vairagya Yoga - 3 🌻*

18. 19. 20. In all the bodies which are formed of Pancha Bhoota (Five elements), Lord is present (as soul). When a house is built, sky remains attached to it. 

However when a house is burnt, it gets reduced to ashes but it doesn't burn the sky at all. Similarly, soul which resides inside the body doesn't perish while bodies perish.

21. 22. In this world, when one man beats another, one is seen as the punisher and another as the victim. But neither of them is the actual doer. Therefore, 

O Rama! it's worthless to doubt this fact. Realize your true self, and be in everlasting bliss by leaving this sorrow.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment