గీతోపనిషత్తు - 97

🌹. గీతోపనిషత్తు - 97 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 26 - 10 . ప్రాణాయామ యజ్ఞము - ఉదాన వాయువు కంఠ భాగమునుండి భూమధ్యము వరకు వ్యాపించి యుండి జీవుని హృదయము నుండి ఊర్ధ్య గతిని కలిగించి, ప్రత్యాహారస్థితి యందు నిలుపును. అపుడు జీవుడు తననొక స్పందనాత్మక చైతన్యముగ కంఠమునందు, నోటియందు, క్రింది తాలువుయందు, పై తాలువు యందు, నాసిక యందు స్పందన ప్రక్రియగ అనుభూతి చెందుచునుండును. అప్పుడు ఉచ్ఛ్వాస, నిశ్వాస, హృదయమునందు స్పందన యుండవు. ప్రాణస్పందనము, ప్రజ్ఞ ముఖమున యుండును. 🍀

📚. 4. జ్ఞానయోగము - 29, 30 📚

Part 10

పంచప్రాణములు దేహమున ఈ క్రింది భాగములలో పనిచేయుచున్నవి.

🌷 4. ఉదాన వాయువు - 2 🌷

ఉదాన వాయువు కంఠ భాగమునుండి భూమధ్యము వరకు వ్యాపించి యుండి జీవుని హృదయము నుండి ఊర్ధ్య గతిని కలిగించి, ప్రత్యాహారస్థితి యందు నిలుపును. అపుడు జీవుడు తననొక స్పందనాత్మక చైతన్యముగ కంఠమునందు, నోటియందు, క్రింది తాలువుయందు, పై తాలువు యందు, నాసిక యందు స్పందన ప్రక్రియగ అనుభూతి చెందుచునుండును. అప్పుడు ఉచ్ఛ్వాస, నిశ్వాస, హృదయమునందు స్పందన యుండవు. ప్రాణస్పందనము, ప్రజ్ఞ ముఖమున యుండును.

ప్రజ్ఞ ప్రశాంతముగ నుండును. భ్రూమధ్యమున క్రమముగ చేరును. ఈ స్థితిలో సాధకునకు ఆహార విషయమున, ఉచ్చారణ విషయమున విశిష్టమగు నిష్ఠయుండును. పవిత్రమగు ఆహారమును మాత్రమే స్వీకరింపగలడు. పవిత్రమగు భాషణమును మాత్రమే చేయగలడు. అతడిపుడు చేరునది ఆకాశతత్వముగ గనుక, ఆకాశమువలె నిర్మలమగు విషయములందు మాత్రమే ఆసక్తి కలిగి యుండును.

ప్రాపంచిక ప్రవృత్తులు, దేహప్రవృత్తులు యాంత్రికముగ సాగుచుండును. వానిని విసర్జించ నవసరము లేదు. ఉదాసీనతతో నిర్వర్తించుట యుండును. ఉదాన శబ్దమున 'ఉత్' అను శబ్దముండును. అనగ ప్రాణమాధారముగ జీవు డూర్ధ్వముఖము చెందుటకు దేహమున ఏర్పడిన సౌకర్యమని తెలియవలెను.

ఆకాశమును చేరినది జీవ ప్రజ్ఞ యగుటచే అది అనంతము, అపరిమితము, సర్వవ్యాపకము అగు తత్త్వమునకు చేరువగుచుండును. భ్రూమధ్యము వరకు చేరి, అనంతత్వములోనికి వంతెన నేర్పరచుకొను ప్రయత్నమున నుండును.

హృదయమునుండి భ్రూమధ్యమునకు చేరు మార్గమున సాధకునికి అనేకానేక దివ్యానుభూతులు కలుగుచునుండును. అనేకములగు దివ్యరూపములు దర్శనమగు చుండును. అనేకములగు దివ్య విషయములు వినపడుచుండును. రకరకముల కాంతి దర్శనము లగుచుండును.

అట్లే వివిధములగు వాయిద్యములు వినబడుచు నుండును. ఈ సమస్త దర్శనమును నాదబిందు కళాత్మకముగ పెద్దలు వివరించుచు నుందురు. వీని కాకర్షింప బడక ఊర్ధ్వమునకు సాగుట ఉత్తమమని పెద్దలు తెలిపిరి.

భ్రూమధ్యమున చేరిన త్రిగుణాత్మక జీవప్రజ్ఞ, త్రిగుణముల కావలనున్న త్రిగుణాతీతమగు తత్వముతో అనుసంధానము చెందుటయే ప్రధానము కాగ, ఉదాన వాయువు వ్యానవాయువుతో అనుసంధానము చెందుట ప్రారంభమగును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

14 Dec 2020

శ్రీ శివ మహా పురాణము - 295

🌹 .  శ్రీ శివ మహా పురాణము - 295 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

71. అధ్యాయము - 26

🌻. దక్షుని విరోధము - 3 🌻

దక్షుడిట్లు పనికెను-

మీ రుద్రగణముల వారందరు వేద బాహ్యులు, వేదమార్గమును వీడినవారు, మరియు మహర్షులచే త్యజించబడినవారు అగుదురు గాక! (26) మీరు నాస్తిక సిద్ధాంతమునందు శ్రద్ధగలవారు, శిష్టుల ఆచారమునుండి బహిష్కరింపబడినవారు, మద్యపానమునందు అభిరుచిగలవారు, జటలను, భస్మను, ఎముకలను ధరించువారు అగుదురు గాక! (27).

బ్రహ్మ ఇట్లు పలికెను -

దక్షుడీ విధముగా శివకింకరులను శపించగా, ఆ మాటలను విని శివునకు ఇష్టుడగు నంది మిక్కిలి కోపావిష్టుడాయెను (28). శిలాదుని కుమారుడు, తేజశ్శాలి, శివునకు ప్రియుడు అగు నంది మహాబలుడు, గర్విష్ఠి అగు ఆ దక్షునితో వెంటనే ఇట్లనెను (29).

నందీశ్వరుడిట్లు పలికెను -

ఓ దక్షా! మోసగాడా! దుర్బుద్ధీ! శివతత్త్వము నెరుంగని నీవు బ్రాహ్మణ చాపల్యముచే శివగణములను వృథాగా శపించితివి (30). బ్రాహ్మణాహంకారము గల వారు, దుష్ట బుద్ధులు, మరియు మూర్ఖులునగు భృగ్వాది ఋషులు కూడా మహాప్రభువగు మహేశ్వరుని ఉపహాసము చేసిరి (31).

ఇచట నున్న బ్రాహ్మణులలో ఎవరైతే రుద్రుని యందు నీవు వలెనే విముఖత గల దుష్టులో, వారిని రుద్రుని తేజస్సు యొక్క మహిమను గలవాడనగు నేను శపించుచున్నాను (32). మీరు వేదములయందలి అర్థవాదముల యందు మాత్రమే శ్రద్ధగలవారై, వేద తత్త్వము నెరుంగజాలని బహిర్ముఖులై, నిత్యము ఇతరము మరి ఏదీ లేదని పలికే విప్రులు అగుదురు గాక! (33).

ఓ విప్రులారా! మీరు కామనలతో నిండిన మనస్సు కలవారై, స్వర్గమే సర్వస్వమనే ధారణ గలవారై, క్రోధ లోభ గర్వములతో కూడియున్నవారై, సిగ్గును వీడిన నిత్య యాచకులై అగుదురు గాక! (34) ఓ బ్రాహ్మణులారా! మీరు వేదమార్గమును వీడి శూద్రులచే యాగములను చేయించి, ధనమును సంపాదించుటయే ధ్యేయముగా గల దరిద్రులు అగుదురు గాక! (35)

ఓ దక్షా! దుష్టులనుండి దానములను స్వీకరించు వీరందరు నరకమును పొందగలరు. మరికొందరు బ్రహ్మ రాక్షసులగుదురు (36). ఎవడైతే శివుని దేవతలలో ఒకనిగా భావించి, ఆ పరమేశ్వరుని విషయములో ద్రోహబుద్ధిని కలిగియుండునో, అట్టి దుష్టబుద్ధియగు దక్షుడు తత్త్వము నుండి విముఖుడగును (37).

దక్షుడు గృహస్థుడై కుట్రలే ధర్మముగా గలవాడై, నిత్యము తుచ్ఛ సుఖములను కోరి కర్మ తంత్రమును విస్తరించువాడై, ఇదియే శాశ్వత వేద ధర్మమని భ్రమించి (38), ముఖములో ఆనందము లేనివాడై, ఆత్మ జ్ఞానమును విస్మరించి, పశువువలె అజ్ఞానియై, కర్మ భ్రష్టుడై, నిత్యము నీతి మాలిన వాడై అగును. ఈ దక్షుడు తొందరలో మేక ముఖము కలవాడగును (39).

దక్షుడు ఈశ్వరుని శపించగా, కోపించిన నంది అచటి బ్రాహ్మణులను శపించగా, అచట పెద్ద హాహాకారము బయలుదేరెను (40). నేనా మాటలను విని ఆ దక్షుని, భృగ్వాది బ్రాహ్మణులను కూడ అనేక పర్యాయములు నిందించితిని. వేద ప్రవర్తకుడనగు నేను శివతత్త్వము నెరుంగుదును గదా! (41) సదాశివుడు నంది యొక్క వచనములను విని చిరునవ్వును అల్పముగా ప్రకటించి, ఆతనికి బోధించగోరి ఈ మధుర వాక్యములను పలికెను (42).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

14 Dec 2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 182

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 182 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. విశ్వామిత్రమహర్షి - 2 🌻

06. మనందరికీ విశ్వామిత్రమహర్షి ప్రసాదమే ‘గాయత్రీ మంత్రం’. ‘విశ్వామిత్ర ఋషిః గాయత్రీ ఛందః ‘ అని మనం నిత్యమూ అంటూంటాము. ప్రతీసంధ్యావందనంలో మూడు మాట్లు మనం అనుకునేది ఈ ఋషిస్మరణ.

07. ‘త్రిపదా షట్‌కుక్షిః’ అని అనేక విషయములలో ఉన్నది ఆ గయత్రీ మహామంత్రం. అది సంపూర్ణమయినది. గాయత్రి యొక్క మగత్తు ఎంతటిదంటే మూడు వేదములూ క్షుణ్ణంగా పారాయణ చేసి, వాటిని ముఖస్థం చేసుకుంటే వచ్చే పుణ్యమేదో గాయత్రి స్మరణ చేస్తే వస్తుందని, దానికి తుల్యమైన మంత్రమే లేదని పెద్దల బోధ.

08. త్రిమూర్తులు అందులో ఉన్నారు; త్రిమూర్తుల శక్తులు అందులో ఉన్నాయి. సమస్త ప్రకృతీ అందులో ఉంది. పరబ్రహ్మ వస్తువది. అందులో ఆద్యంతములు ఉన్నాయి. అదే మనకు రక్ష. దాని ఉపదేశమే మనిషికి ద్విజత్వాన్ని, పశువుకు విప్రత్వాన్ని ఇస్తుంది. పశువుకు విప్రత్వం ఇవ్వగల్గినటువంటి ఉత్కృష్టమయిన మంత్రంగా గాయత్రీమంత్రం జగత్పూజ్యమయింది. దానికి ఋషి విశ్వామిత్రుడు.

09. దేవతలయినా భూమి మీద పుట్టిన తరువాత సంసారంలో ప్రవేశించకపోవటం కష్టం. ప్రవేశించాక కామక్రోధాదులకు లోను కాకుండా ఉండటం మరీ కష్టం.

రామలక్ష్మణులు ఆయనను, “ఇంత అస్త్రబలసంపన్నులే మీరు! మీరే తృటిలో ఈ రాక్షసులును చంపగలరుకదా! మమ్మల్ని ఎందుకు పిలిపించారు?” అని అడిగారు.

10. అప్పుడు విశ్వామిత్రుడు, “నేన్ను బ్రహ్మర్షిని అయిన తరువాత నా కర్తవ్యం ఏమీ లేదు నాయనా! క్షత్రియులచేత చేయించవలసిన పనే ఉంది. నేను తలపెట్టిన యాగం లోకక్షేమం కోసమే!” అన్నాడు.

11. ఆ వంకతో రాముడి సన్నిధిలో యాగంచేద్దామని ఆయన ఉద్దేశ్యం. సాక్షాత్ విష్ణుస్వరూపుడైన రాముడే ప్రత్యక్షంగా ఎదురుగా ఉండగా, ఇక విష్ణువును ప్రత్యేకంగా యజ్ఞంలో ఆవాహనచేసి, రెండక్షతలు వేసి విగ్రహం పెట్టటమెందుకు? ‘విష్ణుమావాహయామి స్థాపయామి’ అనట్మెందుకు విష్ణువు ఎదురుగా ఉండగా? కాబట్టి మంత్రంమీద ఆధారపడక, విష్ణువు మీదనే ఆధారపడ్డాడు విశ్వామిత్రుడు.

12. ఏ విష్ణువు యొక్క అనుగ్రహంతో లోకంలో రాక్షస సంహారం చేయదలచుకున్నాడో, ఆయననే తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

14 Dec 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 121

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 121 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

504. ఈ మానసిక గోళములో, మనోభువనము - ఆరవ భూమిక నుండి ప్రధాన దేవదూతలు భగవంతుని చూడలేరు. కాని ఆరవ భూమికలో నున్న మానవుడు భగవంతుని ముఖాముఖీ సర్వత్రా సమస్తమందు చూడగలడు, చూచుచున్నాడు.

🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 1 🌻

శాశ్వత అనంత సత్యస్థితి - అహం బ్రహ్మాస్మి - నేను భగవంతుడను, విజ్ఞాన భూమిక.

505. తన దృష్టిని క్రమముగా క్రిందికిదించి, తన పైననే దృష్టిని మరల్చుట సప్తమ భూమికను చేరుటవంటిది.

506. నిర్వాణస్థితి దాటిన తక్షణమే "అహం బ్రహ్మాస్మి" స్థితి ఎఱుకతో అనుభవనీయమగును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

14 Dec 2020

శ్రీ విష్ణు సహస్ర నామములు - 85 / Sri Vishnu Sahasra Namavali - 85

🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 85 / Sri Vishnu Sahasra Namavali - 85 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

శ్రవణం నక్షత్ర ప్రధమ పాద శ్లోకం

🍀 85. ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః !
ఆర్కో వాజనసః శృంగీ జయంతః సర్వ విజ్జయీ !! 85 !! 🍀

🍀 790. ఉద్భవః -
ఉత్క్రష్టమైన జన్మగలవాడు.

🍀 791. సుందరః -
మిక్కిలి సౌందర్యవంతుడు.

🍀 792. సుందః -
కరుణాస్వరూపుడు.

🍀 793. రత్నగర్భః -
రత్నమువలె సుందరమైన నాభి గలవాడు.

🍀 794. సులోచనః -
అందమైన నేత్రములు కలవాడు.

🍀 795. అర్కః -
శ్బ్రహ్మాదుల చేత అర్చింపబడువాడు.

🍀 796. వాజసనః -
అర్థించువారలకు అన్నపానాదులు నొసంగువాడు.

🍀 797. శృంగీ -
శృంగము గలవాడు.

🍀 798. జయంతః -
సమస్త విజయములకు ఆధారభూతుడు.

🍀 799. సర్వవిజ్జయీ -
సర్వము తెలిసినవాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Vishnu Sahasra Namavali - 85 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷

Sloka for Sravana 1st Padam

🌻 85. udbhavaḥ sundaraḥ sundō ratnanābhaḥ sulōcanaḥ |
arkō vājasanaḥ śṛṅgī jayantaḥ sarvavijjayī || 85 || 🌻

🌻 790. Udbhavaḥ:
One who assumes great and noble embodiments out of His own will.

🌻 791. Sundaraḥ:
One who has a graceful attractiveness that surprises everyone.

🌻 792. Sundaḥ:
One who is noted for extreme tenderness (Undanam).

🌻 793. Ratna-nābhaḥ:
Ratna indicates beauty; so one whose navel is very beautiful.

🌻 794. Sulōcanaḥ:
One who has brilliant eyes, that is, knowledge of everything.

🌻 795. Arkaḥ:
One who is being worshipped even by beings like Brahma who are themselves objects of worship.

🌻 796. Vājasanaḥ:
One who gives Vajam (food) to those who entreat Him.

🌻 797. Śṛṅgī:
One who at the time of Pralaya (cosmic dissolution) assumed the form of a fish having prominent antenna.

🌻 798. Jayantaḥ:
One who conquers enemies easily.

🌻 799. Sarvavijjayī:
The Lord is 'Sarvavit' as He has knowledge of everything. He is 'Jayi' because He is the conqueror of all the inner forces like attachment, anger etc., as also of external foes like Hiranyaksha.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

14 Dec 2020

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 166, 167 / Vishnu Sahasranama Contemplation - 166, 167

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 166, 167 / Vishnu Sahasranama Contemplation - 166, 167 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻166. వీరహా, वीरहा, Vīrahā🌻

ఓం వీరఘ్నే నమః | ॐ वीरघ्ने नमः | OM Vīraghne namaḥ

వీరహా, वीरहा, Vīrahā

ధర్మత్రాణాయ వీరాంస్తాన్ దైత్యాన్ హంతీతి వీరహా ధర్మ రక్షణ కొఱకు అధర్ములైన దైత్యాది వీరులను సంహరించు విష్ణువు వీరహా అనబడును.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, శ్రీకృష్ణావతార ఘట్టము ::

సీ. గుణము వికారంబుఁ గోరికయును లేని నీవలన జగంబు నెఱి జనించుఁ,

బ్రబ్బు, లేదగు; నంచుఁ బలుకుట దప్పుగా దీశుండవై బ్రహ్మ మీవ యైన

నినుఁ గొల్చు గుణములు నీ యానతులు సేయ, భటులు శౌర్యంబులు పతికి వచ్చు

పగిది నీ గుణముల బాగులు నీ వని తోఁచును నీమాయతోడఁ గూడి

ఆ. నీవు రక్త ధవళ నీల వర్ణంబుల, జగము సేయఁ గావ సమయఁ జూడఁ

దనరు, దట్లు నేఁడు దైత్యుల దండింపఁ, బృథివిఁ గావ నవతరించి తీశ!

నీ వలన జగత్తు అంతా జన్మిస్తుంది. అయితే ఆ జగత్తుకి అవసరమైన త్రిగుణాలు గాని, వాని మార్పులు గాని నీకు లేవు. సృష్టి చేయాలనే కోరికకూడా నీకు లేదు. నీ వల్లనే పుట్టిన జగత్తు నీవలననే వృద్ధిపొంది నీయందే లయమవుతుంది అనడం పొరబాటు కాదు. సర్వాతీతుడవై బ్రహ్మము అయిన నీవు తమ ప్రభువు వని త్రిగుణాలు నీ ఆజ్ఞను పరిపాలిస్తాయి. లోకంలో భటుల శౌర్యం ప్రభువు శౌర్యంగా ప్రసిద్ధి కెక్కుతుంది. అలాగే నీ మాయతో కూడి గుణాలూ, వాటి గొప్పతనమూ నీవిగా కన్పిస్తుంటాయి. నీవు ఎర్రని రంగుతోకూడి ఉన్నప్పుడు రజోగుణ రూపుడవై సృష్టి చేస్తావు. తెల్లని రంగుతోకూడి ఉన్నపుడు సత్త్వగుణ రూపుడవై సృష్టిని రక్షిస్తావు. నల్లని రంగుతోకూడి ఉన్నపుడు తమోగుణ రూపుడవై, సృష్టినంతటినీ లయం చేస్తావు. ఇవన్నీ నీవు ధరించే పాత్రలు. అలాగే నేడుకూడా దైత్యులను దండించడానికి భూమిపై మానవుడుగా అవతరించావు. అయినా నీవు మాకు ప్రభుడవే!

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 166🌹

📚 Prasad Bharadwaj

🌻166. Vīrahā🌻

OM Vīraghne namaḥ

Dharmatrāṇāya vīrāṃstān daityān haṃtīti vīrahā / धर्मत्राणाय वीरांस्तान् दैत्यान् हंतीति वीरहा One who destroys heroic Daityās for the protection of Dharma or righteousness.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 3

Sa tvaṃ trilokasthitaye svamāyayā bibharṣi śuklaṃ khalu varṇamātmanaḥ,

Sargāya raktaṃ rajasopabr̥ṃhitaṃ kr̥ṣṇaṃ ca varṇaṃ tamasā janātyaye. (20)

Tvamasya lokasya vibho rirakṣiṣurgr̥he’vatīrṇo’si mamākhileśvara,

Rājanyasaṃjñāsurakoṭiyūthapairnirvyūhyamānā nihaniṣyase camuḥ. (21)

:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे कृष्णजन्मनि तृतीयोऽध्यायः ::

स त्वं त्रिलोकस्थितये स्वमायया बिभर्षि शुक्लं खलु वर्णमात्मनः ।

सर्गाय रक्तं रजसोपबृंहितं कृष्णं च वर्णं तमसा जनात्यये ॥ २० ॥

त्वमस्य लोकस्य विभो रिरक्षिषुर्गृहेऽवतीर्णोऽसि ममाखिलेश्वर ।

राजन्यसंज्ञासुरकोटियूथपैर्निर्व्यूह्यमाना निहनिष्यसे चमुः ॥ २१ ॥

My Lord, Your form is transcendental to the three material modes, yet for the maintenance of the three worlds, You assume the white color of Viṣṇu in goodness. For creation, which is surrounded by the quality of passion, You appear reddish. And at the end, when there is a need for annihilation, which is surrounded by ignorance, You appear blackish. O my Lord, proprietor of all creation, You have now appeared in my house, desiring to protect this world. I am sure that You will kill all the armies that are moving all over the world under the leadership of politicians who are dressed as Kṣatriya rulers but who are factually demons. They must be killed by You for the protection of the innocent public.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

वेद्यो वैध्यस्सदा योगी वीरहा माधवो मधुः ।
अतीन्द्रियो महामायो महोत्साहोमहाबलः ॥ १८ ॥

వేద్యో వైధ్యస్సదా యోగీ వీరహా మాధవో మధుః ।
అతీన్ద్రియో మహామాయో మహోత్సాహోమహాబలః ॥ ౧౮ ॥

Vedyo vaidhyassadā yogī vīrahā mādhavo madhuḥ ।
Atīndriyo mahāmāyo mahotsāhomahābalaḥ ॥ 18 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 167 / Vishnu Sahasranama Contemplation - 167 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻167. మాధవః, माधवः, Mādhavaḥ🌻

ఓం మాధవాయ నమః | ॐ माधवाय नमः | OM Mādhavāya namaḥ

విద్యాపతిత్వాచ్ఛ్రీ విష్ణుః స్స మాధవ ఇతీర్యతే మా అనగా విద్య; ధవః అనగా స్వామి. బ్రహ్మజ్ఞానము, బ్రహ్మ విద్య మా అనబడును. సర్వ విద్యలును మా అను శబ్దమున చెప్పబడును. బ్రహ్మ విద్యకు ఇతర విద్యలకు అన్నింటికీ విష్ణువు స్వామి కావున మాధవుడనబడునని వ్యాసుడే హరివంశమున స్పష్టపరచెను.

:: హరివంశము - తృతీయ స్కంధము, అష్టాశితోఽధ్యాయః ::

మా విద్యా చ హరేః ప్రోక్తా తస్యా ఈశోయతో భవాన్ ।

తస్మా న్మాధవనామాఽసి ధవః స్వామీతి శబ్దితః ॥ 49 ॥

హరికి సంబంధించు విద్య (పరమాత్మ తత్త్వ జ్ఞానము) 'మా' అని చెప్పబడును. నీవు దానికి ఈశుడవుకావున ధవః అనగా స్వామి అని అర్థము. కావున నీవు 'మాధవః' అను నామము కలవాడవగుచున్నావు.

72. మాధవః, माधवः, Mādhavaḥ

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 167🌹

📚 Prasad Bharadwaj

🌻167. Mādhavaḥ🌻

OM Mādhavāya namaḥ

:: हरिवंश - तृतीय स्कंधे अष्टाशितोऽध्यायः ::

मा विद्या च हरेः प्रोक्ता तस्या ईशोयतो भवान् ।

तस्मा न्माधवनामाऽसि धवः स्वामीति शब्दितः ॥ ४९ ॥

The Vidyā or knowledge of Hari is denoted by 'Mā'. You are the master of that Vidyā. So you have got the name 'Mādhava' for the suffix 'dhava' means master.

72. మాధవః, माधवः, Mādhavaḥ

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

वेद्यो वैध्यस्सदा योगी वीरहा माधवो मधुः ।
अतीन्द्रियो महामायो महोत्साहोमहाबलः ॥ १८ ॥

వేద్యో వైధ్యస్సదా యోగీ వీరహా మాధవో మధుః ।
అతీన్ద్రియో మహామాయో మహోత్సాహోమహాబలః ॥ ౧౮ ॥

Vedyo vaidhyassadā yogī vīrahā mādhavo madhuḥ ।
Atīndriyo mahāmāyo mahotsāhomahābalaḥ ॥ 18 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

14 Dec 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 131

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 131 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము - 61 🌻

అవస్థాత్రయాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. మానవులందరూ, జీవులందరూ సృష్టి అంతా కూడా జాగ్రత్‌ స్వప్న సుషుప్తులకు లోనౌతుంది. సర్వేంద్రియ వ్యవహారం పరిణామ శీలమై, ప్రతిభావంతముగా వ్యవహరిస్తున్నటువంటి కాలం ఏదైతే ఉందో దానిని జాగ్రదావస్థయని, అవే ఇంద్రియములు వెనుకకు మరలి, తమకు ఆధారంగా ఉన్నటువంటి, మనస్సు అనేటటువంటి ఏక ఇంద్రియమునందు అంశీభూతములై, నిక్షిప్తమై, అర్థజాగృతి సగము మెలకువ, సగము నిద్రా స్థితిలో సర్వేంద్రియానుభూతులన్ని ఇంద్రియముల సహాయము లేకనే అనుభవించేటటువంటి స్వప్నావస్థలోనూ,

ఆ మనస్సు కూడా అచేతనమై, సుప్త చేతనమై సుషుప్త్యావస్థలో కదలక పడియుండేటటువంటి ఇంద్రియముగా, పనిముట్టుగా మనస్సు, బుద్ధి కూడా మారి, ప్రజ్ఞా స్థితిలో నిలకడ చెంది, కానీ అట్టి ఎఱుకలేక తానైనటువంటి స్థితిని తెలుసుకోలేక తనను తాను మరిచిపోయి, శరీర భ్రాంతి యందే నిమగ్నమై ఉన్నటువంటి జీవుడు, జాగ్రత్‌ స్వప్న సుషుప్తి అవస్థలను నిరంతరాయముగా అనుభవిస్తూ, వాటియందే పరిణమిస్తూ, ఆ పరిణామమే సత్యమనుకొనుచూ, ఆ ద్వంద్వానుభూతులే సత్యమనుకొనుచూ,

అట్టి ద్వంద్వానుభూతులయందు సరియైనటువంటి వ్యవహారము లేకున్నచో తనకే ఏదో అయిపోవుచున్నదనే భ్రాంతిని పొందుచూ ఇవాళ నిద్ర సరిగ్గా పట్టలేదండీ, ఇవాళ కలలు విపరీతంగా వచ్చినాయండి. ఇవాళ నిద్రమధ్యలో లేచి కూర్చున్నానండి. ఇవాళ జాగ్రదావస్థ సరిగ్గా లేదండి. ఇవాళ మెలకువలో అంతా భావములు అన్నీ కూడాను మనః సంయమనం లేకపోవడం చేత, అరిషడ్వర్గాల చేత, కామక్రోథలోభమోహ మద మాత్సర్యముల చేత భావించబడుతూ, బాధించబడుతూ ప్రభావితం అవుతూ ఆ ఇంద్రియ సంగత్వాన్ని,

సుఖ దుఃఖ సంగత్వాన్ని, వ్యవహార సంగత్వాన్ని, ప్రతిబింబ సంగత్వాన్ని పొంది, స్వప్నావస్థలోకూడా సరియైనటువంటి స్థితి లేక అనేక రకములైనటువంటి ఇబ్బందులను అనుభవిస్తున్నట్లుగా ఇబ్బందులను అధిగమిస్తున్నట్లుగా బాధచెంది సరైన నిద్రావస్థలేక, సరియైన స్వప్నావస్థ లేక, సరియైన జాగ్రదావస్థ లేక ఈ మూడూ కూడా శరీరమే అనుభవిస్తున్నది కానీ నేను అనుభవించడం లేదనేటటువంటి జ్ఞానము లేకపోవడం చేత,

తురీయావస్థలో ప్రవేశం లేకపోవడం చేత, స్వాత్మసాక్షాత్కర జ్ఞానంలో అనుభవజ్ఞానం లేకపోవడం చేత, ప్రతి నిత్యమూ ఈ మూడు అత్యవసరమై ఉన్నదని తోచుట చేత, ఈ మూడింటి యందే నిమగ్నమగుచు, వీటినే నిత్యజీవితముగా భావించుచు, వీటి యందున్న వ్యవహారమునందు కలుగుచున్న సుఖదుఃఖములే సత్యమని భ్రమసి, వాటి యందు సాంగత్య దోషమును పొంది, వాటి సంగత్వము చేత ప్రభావితము అవుతూ, వాటినే నిరంతరాయముగా కోరుచూ, ఏ ఆత్మకైతే ఇట్టి మూడు అవస్థలు లేవో, ఏ ఆత్మ యొక్క ఉనికి చేతనే ఈ మూడు అవస్థలు ఏర్పడుచున్నవో, అట్టి స్వస్వరూప జ్ఞానాన్ని మానవుడు ఆశ్రయించడం లేదు.

అందువల్లనే జరానమరణ రూప సంసార చక్రమునందు, కర్మ చక్రమునందు ఇమిడిపోయి, బాధించబడి, ప్రభావితమై మరల మరల పరిణామ శీలమై పునరావృత్తిని పొందుచున్నాడు. కానీ పునరావృత్తి రహితమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, మోక్షదాయకమైనటువంటిది, ముక్తిదాయకమైనటువంటిది అయినటువంటి స్వాత్మనిష్ఠను, కాలత్రయాన్ని, శరీర త్రయాన్ని, దేహత్రయాన్ని దాటి అవస్థాత్రయ సాక్షిత్వాన్ని ప్రతిపాదిస్తున్నారు.

ఇప్పటి వరకూ కాలత్రయాన్ని, శరీర త్రయాన్ని, దేహత్రయాన్ని, ఈషణ త్రయాన్ని ఇలా మూడు మూడుగా ఉన్నటువంటి త్రిపుటులనన్నింటిని వివరిస్తూ ఇప్పుడు అవస్థాత్రయాన్ని.... అవస్థ అంటేనే అర్థం ఏమిటంటే, అస్థః అంటే ఉండుట. అవ - అంటే ఉన్నస్థితి నుంచి క్రిందకి దిగి వచ్చుట. అవస్థ - కాబట్టి తను ఆత్మస్వరూపుడై ఉన్నప్పటికి, జాగ్రదావస్థలో, మెలకువలో ఇంద్రియములతో వ్యవహరించుచూ, ఆ ఇంద్రియ వ్యవహారమే తానని భ్రమసి, ఆ భ్రమచేత భ్రాంతి చెంది,

మాయా మోహితుడై, అట్టి మాయా మోహమును మరింతగా అనుభవించాలనేటటుంవంటి కాంక్ష చేత, ప్రియాప్రియముల చేత లాగబడి, గుణత్రయముల చేత ప్రభావితమై మనోఫలకములో, మనోబుద్ధులచేత స్వప్నావస్థ యందుకూడా అదే ఇంద్రియానుభవములను మరల మరలా అనుభవించుచూ సంతృప్తి లేక, అసంతృప్తులను చెందుచూ, ఇంకనూ బలమైనటువంటి సుఖమును పొందాలనే బలీయమైన కాంక్ష చేత, లేని సుఖమును పొందాలనే ప్రయత్నము చేత, వస్తుగత నిశ్చయజ్ఞానము లేక,

ఆ వస్తువులు సుఖం ఇస్తున్నాయనే భ్రాంతి చేత, ఆ ఇంద్రియములే సుఖస్థానములని భ్రమసి, భ్రాంతి చెందటం చేత, భ్రమాజన్యజ్ఞానము అభ్యాసము చేత, భ్రమాజన్య జ్ఞానమును ఆశ్రయించడం చేత, ప్రతిబింబ జ్ఞానమునే సత్యమని భావించుట చేత, ఆ రకమైనటువంటి జాగ్రత్‌ స్వప్న సుషుప్తులను శరీరమే అనుభవించు చున్నప్పటికి, తాను అనుభవించుచున్నాడని తనకు ఆపాదించుకొనుచున్నాడు. ఇదీ అజ్ఞానమంటే.

నేను ఇవాళ సరిగ్గా నిద్రపోలేదండి! - విద్యా సాగర్ గారు

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

14 Dec 2020

సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 5

🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 5 🌹

🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻

తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అభంగ్ - 5 🍀

యోగ యాగ విధీ యేణే నవే సిద్ధీ!
వాయాచి ఉపాదీ దంటే ధర్మ్!!

భావే వీణ దేవ నకళె నిస్సందేహ్!
గురు విణ్ అనుభవ కైసా కళే?!!

తపే విణ్ దైవత్ ది ధల్యా వీణ్ ప్రాప్తి!
గుజే వీణ్ హిత్ కోణ్ సాంగే!!

జ్ఞానదేవ సాంగే దృష్టాంతాచీ మాత్!
సాధూచె సంగతీ తరణోపాయ్!!

భావము:

యోగము, యాగము విధి విధానాలతో పరమార్థము సిద్ధించదు. ఇవి నశించే ఉపాదులు మరియు డంభధర్మము కలిగించును. భావన లేకపోతే నిస్సందేహముగ దేవుడు తెలియడు. గురువు లేకుండానే అనుభవము ఎలా రాగలదు.

తపము చేయక పోతే దైవత్వము రాదు, దానము చేయకుండానే పుణ్యము రాదు. మరి! అడగక ముందే హిత వచనము ఎవ్వరు చెప్పగలరు! సాధు సాంగత్యమే తరుణోపాయమని శాస్త్రాదులలో అనేక దృష్టాంతములు కలవని జ్ఞానదేవులు చెప్పుచున్నారు.

🌻. నామ సుధ -5 🌻

యోగ యాగము విధి యుక్తము

సిద్ధించదు వీటితో పరమార్థము

నశించే ఉపాధులే ప్రాప్తము

ఢంభధర్మము, అభిమానము

భావన లేనిదే దైవము

తెలియజాలదు నిస్సందేహము

గురువు లేనిదే ఆ అనుభవము

కలుగుట నీకు ఎలా సాధ్యము?

తపము చేయకనే దైవ కటాక్షము

దానము చేయకనే పుణ్య ఫలితము

అడుగక ముందే హిత వాక్యము

చెప్పేది ఎవ్వరు ఉపదేశము

జ్ఞాన దేవులు చెప్పిన వచనము

దృష్టాంతములున్నవి అనేకము

సాధువుతో చేయుము సాంగత్యము

వారి బోధలే తరుణోపాయము

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

14 Dec 2020

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 146, 147 / Sri Lalitha Chaitanya Vijnanam - 146, 147

🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 78 / Sri Lalitha Sahasra Nama Stotram - 78 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 146, 147 / Sri Lalitha Chaitanya Vijnanam - 146, 147 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |
నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ‖ 45 ‖

🌻146. 'నిష్క్రపంచా'🌻

ప్రపంచము లేనిది శ్రీమాత అని అర్థము.

శ్రీమాత నుండి పుట్టినది ప్రపంచము. ప్రపంచ మనగా పంచభూతములతో విస్తారముగ నేర్పడినది. పంచభూతములామెపై ప్రభావము చూపలేవు. ప్రపంచ మనగా మొత్తము సృష్టి యను భావన కూడ వున్నది. అట్టి సృష్టికి కూడా ఆమె అతీతము. సృష్టిగాని, సృష్టి యందలి ఏ శక్తిగాని ఆమెపై ప్రభావము చూపలేవు. దైవమునకు, జీవులకు గల ప్రధానమగు వ్యత్యాసములలో ఇది ఒకటి. జీవులపై గుణములు, పంచభూతములు, ప్రభావము చూపుచునే యుండును. జీవులు కూడా ఒకరిపై నొకరు ప్రభావము చూపుచు నుందురు.

ఈ విధముగ జీవుడు అనేకానేక ప్రభావములకు లోనగుచుండును. ఒకపూట యున్నట్లు మనస్సు మరి యొకపూట యుండదు. కారణము జీవులు, సృష్టి వారిపై చూపు నిరంతర ప్రభావమే. కేవలము నిద్రయందు మాత్రమే యెట్టి ప్రభావము సోకక యుండుట వలన జీవులకు విశ్రాంతి దొరకు చున్నది. ఇతర సమయములలో ఏదియో యొక విషయము వారి మనస్సులపై ప్రభావము చూపుచు నడిపించుచు నుండును.

దైవ భక్తులు తమ నిరంతర, నిశ్చల ఆరాధన ద్వారమున ఈ ప్రభావమునుండి బయల్పడుటకు ప్రయత్నింతురు. దైవముతో ప్రజ్ఞ ముడిపడి యున్నప్పుడు ఇతర ప్రభావము లేమియు తమపై నుండవు. ముడివిడినపుడు ఏదియో యొక భావన ద్వారమున సృష్టి, జీవులు, జీవులపై ప్రభావము చూపుచు నుందురు. అనన్య చింతనులు సృష్టి యందు ప్రపంచ ప్రభావము లేక వర్తించుచుందురు.

వారే సద్గురువులు, మార్గదర్శకులు. వారు శ్రీమాతకు ప్రియమగు భక్తులు. పై కారణముగ 'నిష్క్రపంచ' యగు శ్రీమాత అనుగ్రహము పొందుటకు ప్రపంచమున మునిగిన జీవులు శ్రీమాతను ఆరాధించుట మార్గము. సద్గురు ముఖద్వారమున ఆరాధించుట సౌలభ్యము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 146 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Niṣprapañcā निष्प्रपञ्चा (146) 🌻

Prapañca means expansion, development or manifestation. She is without such attributes. Since the Brahman is ādhi (the first) and anādhi (without parentage) it does not have any control and does not require any modifications or changes.

This is because the Brahman is complete or full which is called pūrṇam. Māṇḍūkya Upaniṣad (verse 7) says ‘total cessation of the world as such, the embodiment of peace (here word śāntam is used. Refer nāma 141 ‘śāntā’), the total of all that is good (word ‘śivam’ is used here), one without a second (this is because of ādhi and anādhi), the fourth state (turya state, the other three being, sleep, dream and deep sleep stages which are called jākrat, svapna, suṣupti).

Think this turya as the Self and this is to be realized’. The Brahman is beyond the three stages and can be realized only in the turya or the fourth state. This state is the embodiment of peace and all that is good. These stages are discussed in detail from nāma 257.

All these interpretations go to indicate the nirguṇa Brahman. This nāma means that She is without any expansion as the Brahman will never undergo changes or modifications.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 147 / Sri Lalitha Chaitanya Vijnanam - 147 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |
నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ‖ 45 ‖

🌻147. 'నిరాశ్రయా'🌻

ఏ ఆశ్రయము లేనిది శ్రీమాత అని అర్థము.

సృష్టిలోని ప్రతి జీవునికిని శరీరమే ప్రధానమగు ఆశ్రయమై యున్నది. అల్పులకు ఆస్తిపాస్తులు, కుటుంబము, బంధుమిత్రులు ఆశ్రయమై యుండును. సంఘమున కీర్తి, ప్రతిష్ఠలు, పదవులు, యిత్యాదిని ఆశ్రయించి జీవించువారు ఇంకనూ పతనము చెందిన వారే. కీర్తి, ప్రతిష్ఠ, పదవి, బంధుమిత్రులు, శరీరము కూడ తనపై ఆధారపడి యున్నవి కాని వాటిపై తాను ఆధారపడి లేడు.

ప్రధానముగ ప్రతి ఒక్కడును జీవుడు. జీవుడుగ జ్యోతి స్వరూపుడు. నత్త నుండి రసము స్రవించి నత్తగుల్ల ఏర్పడినట్లు తననుండియే తన శరీరము, శరీర సంబంధముగ కుటుంబము, ఆస్తిపాస్తులు, బంధుమిత్రులు, పదవులు, కీర్తిప్రతిష్ఠలు, ఏర్పడుచున్నవి.

వాటన్నింటికిని తానాశ్రయము. తన నాశ్రయించిన వానిపై ఆధారపడువాడు అల్పబుద్ధియే కదా! చక్రవర్తి సైనికునిపై ఆధారపడినట్లు, రాజు బంటుపై ఆధారపడినట్లు హీనముగ జీవించుట, తనను తానాశ్రయింపక యితరముల నాశ్రయించిన వారికి తప్పదు.

శ్రీమాత నుండి కోటానుకోట్ల జీవులు, లోకములు యేర్పడినను వాటన్నింటికిని తానాశ్రయమై నిలచినదే కాని తాను దేనినీ ఆశ్రయించదు. ఆమె శరీరమును కూడ ఆశ్రయించి యుండదు.

అందులకే ఆమె నిరాకార అని చెప్పబడినది. దేవతలు, ఋషులు, యోగులు కారణ శరీరమునుగాని, సూక్ష్మ శరీరమునుగాని, ఆశ్రయించి యుందురు. మానవులు భౌతిక శరీరము నాశ్రయించి యుందురు. కాని మానవులయందు, యోగుల యందు, ఋషుల యందు శ్రీమాత నాశ్రయించినవారు ఆమె వలననే నిరాశ్రయ స్థితి పొందుదురు. వారి నిరాశ్రయత కన్న మించినది శ్రీమాత 'నిరాశ్రయ'

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 147 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Nirāśrayā निराश्रया (147) 🌻

Āśraya means dependence (that to which anything is annexed or with which anything is closely connected or on which anything depends or rests). Taittirīya Upaniṣad (II.7) uses the word ‘anilayane’ meaning not resting on anything and free from modifications.

She does not depend on anything. She being the Brahman does not depend upon anything and on the contrary, everything depends upon Her. This nāma more or less conveys the same meaning conveyed in nāma 132.

Possibly, āśraya in this context could mean the gross body that supports the soul. Since She is beyond soul (Brahman and soul are different. Soul is called jīva), there is no question of Her gross body. Since She is devoid of gross body, it connotes that She is the Brahman.

Chāndogya Upaniṣad (VIII.i.5) says, “The body may decay due to old age, but the space within (the Brahman) never decays. Nor does it perish with the death of the body. This is the real abode of the Brahman. All our desires are concentrated in it. It is the Self – free from all sins as well as from old age, death, bereavement, hunger and thirst. It is the cause of love of Truth and the cause of dedication to Truth.”

This nāma says that She is not dependent on anybody.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

14 Dec 2020

14DECEMBER-2020 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 578 / Bhagavad-Gita - 578 🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 166, 167 / Vishnu Sahasranama Contemplation - 166, 167🌹
3) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 131🌹
4) 🌹 సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 5 🌹
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 152 🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 78 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 146, 147 / Sri Lalita Chaitanya Vijnanam - 146, 147 🌹
8) 🌹. శ్రీమద్భగవద్గీత - 489 / Bhagavad-Gita - 489 🌹

09) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 98 📚
10) 🌹. శివ మహా పురాణము - 295 🌹 
11) 🌹 Light On The Path - 51🌹
12) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 183🌹 
13) 🌹 Seeds Of Consciousness - 247 🌹   
14) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 123 🌹
15) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 86 / Sri Vishnu Sahasranama - 86🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 578 / Bhagavad-Gita - 578 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 22 🌴*

22. ఆదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే |
అసత్ర్కుతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్ ||

🌷. తాత్పర్యం : 
అపవిత్రత ప్రదేశమునందు తగని సమయమున అపాత్రులకు ఒసగబడునటువంటిది లేదా తగిన శ్రద్ధ మరియు గౌరవము లేకుండా ఒసగబడునటువంటిదైన దానము తమోగుణప్రధానమైనదని చెప్పబడును.

🌷. భాష్యము :
మత్తుపదార్థములను స్వీకరించు నిమిత్తముగాని, జూదము నిమిత్తముగాని చేయబడు దానములు ఇచ్చట ప్రోత్సాహింపబడుటలేదు. 

అటువంటి దానము తమోగుణ ప్రధానమై లాభదాయకము కాకుండును. పైగా అటువంటి దానము చేయుటవలన పాపులను ప్రోత్సాహించినట్లే యగును. 

అదే విధముగా పాత్రుడైనవానికి శ్రద్ధ మరియు గౌరవము లేకుండా దానమొసగుటయు తమోగుణమును కూడినట్టి దానముగా భావింపబడును
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 578 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 17 - The Divisions of Faith - 22 🌴*

22. adeśa-kāle yad dānam
apātrebhyaś ca dīyate
asat-kṛtam avajñātaṁ
tat tāmasam udāhṛtam

🌷 Translation : 
And charity performed at an impure place, at an improper time, to unworthy persons, or without proper attention and respect is said to be in the mode of ignorance.

🌹 Purport :
Contributions for indulgence in intoxication and gambling are not encouraged here. 

That sort of contribution is in the mode of ignorance. Such charity is not beneficial; rather, sinful persons are encouraged. 

Similarly, if a person gives charity to a suitable person but without respect and without attention, that sort of charity is also said to be in the mode of darkness.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 166, 167 / Vishnu Sahasranama Contemplation - 166, 167 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻166. వీరహా, वीरहा, Vīrahā🌻*

*ఓం వీరఘ్నే నమః | ॐ वीरघ्ने नमः | OM Vīraghne namaḥ*

వీరహా, वीरहा, Vīrahā
ధర్మత్రాణాయ వీరాంస్తాన్ దైత్యాన్ హంతీతి వీరహా ధర్మ రక్షణ కొఱకు అధర్ములైన దైత్యాది వీరులను సంహరించు విష్ణువు వీరహా అనబడును.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, శ్రీకృష్ణావతార ఘట్టము ::
సీ. గుణము వికారంబుఁ గోరికయును లేని నీవలన జగంబు నెఱి జనించుఁ,
బ్రబ్బు, లేదగు; నంచుఁ బలుకుట దప్పుగా దీశుండవై బ్రహ్మ మీవ యైన
నినుఁ గొల్చు గుణములు నీ యానతులు సేయ, భటులు శౌర్యంబులు పతికి వచ్చు
పగిది నీ గుణముల బాగులు నీ వని తోఁచును నీమాయతోడఁ గూడి
ఆ. నీవు రక్త ధవళ నీల వర్ణంబుల, జగము సేయఁ గావ సమయఁ జూడఁ
దనరు, దట్లు నేఁడు దైత్యుల దండింపఁ, బృథివిఁ గావ నవతరించి తీశ!

నీ వలన జగత్తు అంతా జన్మిస్తుంది. అయితే ఆ జగత్తుకి అవసరమైన త్రిగుణాలు గాని, వాని మార్పులు గాని నీకు లేవు. సృష్టి చేయాలనే కోరికకూడా నీకు లేదు. నీ వల్లనే పుట్టిన జగత్తు నీవలననే వృద్ధిపొంది నీయందే లయమవుతుంది అనడం పొరబాటు కాదు. సర్వాతీతుడవై బ్రహ్మము అయిన నీవు తమ ప్రభువు వని త్రిగుణాలు నీ ఆజ్ఞను పరిపాలిస్తాయి. లోకంలో భటుల శౌర్యం ప్రభువు శౌర్యంగా ప్రసిద్ధి కెక్కుతుంది. అలాగే నీ మాయతో కూడి గుణాలూ, వాటి గొప్పతనమూ నీవిగా కన్పిస్తుంటాయి. నీవు ఎర్రని రంగుతోకూడి ఉన్నప్పుడు రజోగుణ రూపుడవై సృష్టి చేస్తావు. తెల్లని రంగుతోకూడి ఉన్నపుడు సత్త్వగుణ రూపుడవై సృష్టిని రక్షిస్తావు. నల్లని రంగుతోకూడి ఉన్నపుడు తమోగుణ రూపుడవై, సృష్టినంతటినీ లయం చేస్తావు. ఇవన్నీ నీవు ధరించే పాత్రలు. అలాగే నేడుకూడా దైత్యులను దండించడానికి భూమిపై మానవుడుగా అవతరించావు. అయినా నీవు మాకు ప్రభుడవే!

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 166🌹*
📚 Prasad Bharadwaj 

*🌻166. Vīrahā🌻*

*OM Vīraghne namaḥ*

Dharmatrāṇāya vīrāṃstān daityān haṃtīti vīrahā / धर्मत्राणाय वीरांस्तान् दैत्यान् हंतीति वीरहा One who destroys heroic Daityās for the protection of Dharma or righteousness.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 3
Sa tvaṃ trilokasthitaye svamāyayā bibharṣi śuklaṃ khalu varṇamātmanaḥ,
Sargāya raktaṃ rajasopabr̥ṃhitaṃ kr̥ṣṇaṃ ca varṇaṃ tamasā janātyaye. (20)
Tvamasya lokasya vibho rirakṣiṣurgr̥he’vatīrṇo’si mamākhileśvara,
Rājanyasaṃjñāsurakoṭiyūthapairnirvyūhyamānā nihaniṣyase camuḥ. (21)

:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे कृष्णजन्मनि तृतीयोऽध्यायः ::
स त्वं त्रिलोकस्थितये स्वमायया बिभर्षि शुक्लं खलु वर्णमात्मनः ।
सर्गाय रक्तं रजसोपबृंहितं कृष्णं च वर्णं तमसा जनात्यये ॥ २० ॥
त्वमस्य लोकस्य विभो रिरक्षिषुर्गृहेऽवतीर्णोऽसि ममाखिलेश्वर ।
राजन्यसंज्ञासुरकोटियूथपैर्निर्व्यूह्यमाना निहनिष्यसे चमुः ॥ २१ ॥

My Lord, Your form is transcendental to the three material modes, yet for the maintenance of the three worlds, You assume the white color of Viṣṇu in goodness. For creation, which is surrounded by the quality of passion, You appear reddish. And at the end, when there is a need for annihilation, which is surrounded by ignorance, You appear blackish. O my Lord, proprietor of all creation, You have now appeared in my house, desiring to protect this world. I am sure that You will kill all the armies that are moving all over the world under the leadership of politicians who are dressed as Kṣatriya rulers but who are factually demons. They must be killed by You for the protection of the innocent public.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
वेद्यो वैध्यस्सदा योगी वीरहा माधवो मधुः ।अतीन्द्रियो महामायो महोत्साहोमहाबलः ॥ १८ ॥

వేద్యో వైధ్యస్సదా యోగీ వీరహా మాధవో మధుః ।అతీన్ద్రియో మహామాయో మహోత్సాహోమహాబలః ॥ ౧౮ ॥

Vedyo vaidhyassadā yogī vīrahā mādhavo madhuḥ ।Atīndriyo mahāmāyo mahotsāhomahābalaḥ ॥ 18 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 167 / Vishnu Sahasranama Contemplation - 167🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻167. మాధవః, माधवः, Mādhavaḥ🌻*

*ఓం మాధవాయ నమః | ॐ माधवाय नमः | OM Mādhavāya namaḥ*

విద్యాపతిత్వాచ్ఛ్రీ విష్ణుః స్స మాధవ ఇతీర్యతే మా అనగా విద్య; ధవః అనగా స్వామి. బ్రహ్మజ్ఞానము, బ్రహ్మ విద్య మా అనబడును. సర్వ విద్యలును మా అను శబ్దమున చెప్పబడును. బ్రహ్మ విద్యకు ఇతర విద్యలకు అన్నింటికీ విష్ణువు స్వామి కావున మాధవుడనబడునని వ్యాసుడే హరివంశమున స్పష్టపరచెను.

:: హరివంశము - తృతీయ స్కంధము, అష్టాశితోఽధ్యాయః ::
మా విద్యా చ హరేః ప్రోక్తా తస్యా ఈశోయతో భవాన్ ।
తస్మా న్మాధవనామాఽసి ధవః స్వామీతి శబ్దితః ॥ 49 ॥

హరికి సంబంధించు విద్య (పరమాత్మ తత్త్వ జ్ఞానము) 'మా' అని చెప్పబడును. నీవు దానికి ఈశుడవుకావున ధవః అనగా స్వామి అని అర్థము. కావున నీవు 'మాధవః' అను నామము కలవాడవగుచున్నావు.

72. మాధవః, माधवः, Mādhavaḥ

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 167🌹*
📚 Prasad Bharadwaj 

*🌻167. Mādhavaḥ🌻*

*OM Mādhavāya namaḥ*

:: हरिवंश - तृतीय स्कंधे अष्टाशितोऽध्यायः ::
मा विद्या च हरेः प्रोक्ता तस्या ईशोयतो भवान् ।
तस्मा न्माधवनामाऽसि धवः स्वामीति शब्दितः ॥ ४९ ॥

The Vidyā or knowledge of Hari is denoted by 'Mā'. You are the master of that Vidyā. So you have got the name 'Mādhava' for the suffix 'dhava' means master.

72. మాధవః, माधवः, Mādhavaḥ

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
वेद्यो वैध्यस्सदा योगी वीरहा माधवो मधुः ।अतीन्द्रियो महामायो महोत्साहोमहाबलः ॥ १८ ॥

వేద్యో వైధ్యస్సదా యోగీ వీరహా మాధవో మధుః ।అతీన్ద్రియో మహామాయో మహోత్సాహోమహాబలః ॥ ౧౮ ॥

Vedyo vaidhyassadā yogī vīrahā mādhavo madhuḥ ।Atīndriyo mahāmāyo mahotsāhomahābalaḥ ॥ 18 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 131 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 61 🌻*

అవస్థాత్రయాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. మానవులందరూ, జీవులందరూ సృష్టి అంతా కూడా జాగ్రత్‌ స్వప్న సుషుప్తులకు లోనౌతుంది. సర్వేంద్రియ వ్యవహారం పరిణామ శీలమై, ప్రతిభావంతముగా వ్యవహరిస్తున్నటువంటి కాలం ఏదైతే ఉందో దానిని జాగ్రదావస్థయని, అవే ఇంద్రియములు వెనుకకు మరలి, తమకు ఆధారంగా ఉన్నటువంటి, మనస్సు అనేటటువంటి ఏక ఇంద్రియమునందు అంశీభూతములై, నిక్షిప్తమై, అర్థజాగృతి సగము మెలకువ, సగము నిద్రా స్థితిలో సర్వేంద్రియానుభూతులన్ని ఇంద్రియముల సహాయము లేకనే అనుభవించేటటువంటి స్వప్నావస్థలోనూ, 

ఆ మనస్సు కూడా అచేతనమై, సుప్త చేతనమై సుషుప్త్యావస్థలో కదలక పడియుండేటటువంటి ఇంద్రియముగా, పనిముట్టుగా మనస్సు, బుద్ధి కూడా మారి, ప్రజ్ఞా స్థితిలో నిలకడ చెంది, కానీ అట్టి ఎఱుకలేక తానైనటువంటి స్థితిని తెలుసుకోలేక తనను తాను మరిచిపోయి, శరీర భ్రాంతి యందే నిమగ్నమై ఉన్నటువంటి జీవుడు, జాగ్రత్‌ స్వప్న సుషుప్తి అవస్థలను నిరంతరాయముగా అనుభవిస్తూ, వాటియందే పరిణమిస్తూ, ఆ పరిణామమే సత్యమనుకొనుచూ, ఆ ద్వంద్వానుభూతులే సత్యమనుకొనుచూ, 

అట్టి ద్వంద్వానుభూతులయందు సరియైనటువంటి వ్యవహారము లేకున్నచో తనకే ఏదో అయిపోవుచున్నదనే భ్రాంతిని పొందుచూ ఇవాళ నిద్ర సరిగ్గా పట్టలేదండీ, ఇవాళ కలలు విపరీతంగా వచ్చినాయండి. ఇవాళ నిద్రమధ్యలో లేచి కూర్చున్నానండి. ఇవాళ జాగ్రదావస్థ సరిగ్గా లేదండి. ఇవాళ మెలకువలో అంతా భావములు అన్నీ కూడాను మనః సంయమనం లేకపోవడం చేత, అరిషడ్వర్గాల చేత, కామక్రోథలోభమోహ మద మాత్సర్యముల చేత భావించబడుతూ, బాధించబడుతూ ప్రభావితం అవుతూ ఆ ఇంద్రియ సంగత్వాన్ని, 

సుఖ దుఃఖ సంగత్వాన్ని, వ్యవహార సంగత్వాన్ని, ప్రతిబింబ సంగత్వాన్ని పొంది, స్వప్నావస్థలోకూడా సరియైనటువంటి స్థితి లేక అనేక రకములైనటువంటి ఇబ్బందులను అనుభవిస్తున్నట్లుగా ఇబ్బందులను అధిగమిస్తున్నట్లుగా బాధచెంది సరైన నిద్రావస్థలేక, సరియైన స్వప్నావస్థ లేక, సరియైన జాగ్రదావస్థ లేక ఈ మూడూ కూడా శరీరమే అనుభవిస్తున్నది కానీ నేను అనుభవించడం లేదనేటటువంటి జ్ఞానము లేకపోవడం చేత, 

తురీయావస్థలో ప్రవేశం లేకపోవడం చేత, స్వాత్మసాక్షాత్కర జ్ఞానంలో అనుభవజ్ఞానం లేకపోవడం చేత, ప్రతి నిత్యమూ ఈ మూడు అత్యవసరమై ఉన్నదని తోచుట చేత, ఈ మూడింటి యందే నిమగ్నమగుచు, వీటినే నిత్యజీవితముగా భావించుచు, వీటి యందున్న వ్యవహారమునందు కలుగుచున్న సుఖదుఃఖములే సత్యమని భ్రమసి, వాటి యందు సాంగత్య దోషమును పొంది, వాటి సంగత్వము చేత ప్రభావితము అవుతూ, వాటినే నిరంతరాయముగా కోరుచూ, ఏ ఆత్మకైతే ఇట్టి మూడు అవస్థలు లేవో, ఏ ఆత్మ యొక్క ఉనికి చేతనే ఈ మూడు అవస్థలు ఏర్పడుచున్నవో, అట్టి స్వస్వరూప జ్ఞానాన్ని మానవుడు ఆశ్రయించడం లేదు. 

అందువల్లనే జరానమరణ రూప సంసార చక్రమునందు, కర్మ చక్రమునందు ఇమిడిపోయి, బాధించబడి, ప్రభావితమై మరల మరల పరిణామ శీలమై పునరావృత్తిని పొందుచున్నాడు. కానీ పునరావృత్తి రహితమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, మోక్షదాయకమైనటువంటిది, ముక్తిదాయకమైనటువంటిది అయినటువంటి స్వాత్మనిష్ఠను, కాలత్రయాన్ని, శరీర త్రయాన్ని, దేహత్రయాన్ని దాటి అవస్థాత్రయ సాక్షిత్వాన్ని ప్రతిపాదిస్తున్నారు.

        ఇప్పటి వరకూ కాలత్రయాన్ని, శరీర త్రయాన్ని, దేహత్రయాన్ని, ఈషణ త్రయాన్ని ఇలా మూడు మూడుగా ఉన్నటువంటి త్రిపుటులనన్నింటిని వివరిస్తూ ఇప్పుడు అవస్థాత్రయాన్ని.... అవస్థ అంటేనే అర్థం ఏమిటంటే, అస్థః అంటే ఉండుట. అవ - అంటే ఉన్నస్థితి నుంచి క్రిందకి దిగి వచ్చుట. అవస్థ - కాబట్టి తను ఆత్మస్వరూపుడై ఉన్నప్పటికి, జాగ్రదావస్థలో, మెలకువలో ఇంద్రియములతో వ్యవహరించుచూ, ఆ ఇంద్రియ వ్యవహారమే తానని భ్రమసి, ఆ భ్రమచేత భ్రాంతి చెంది, 

మాయా మోహితుడై, అట్టి మాయా మోహమును మరింతగా అనుభవించాలనేటటుంవంటి కాంక్ష చేత, ప్రియాప్రియముల చేత లాగబడి, గుణత్రయముల చేత ప్రభావితమై మనోఫలకములో, మనోబుద్ధులచేత స్వప్నావస్థ యందుకూడా అదే ఇంద్రియానుభవములను మరల మరలా అనుభవించుచూ సంతృప్తి లేక, అసంతృప్తులను చెందుచూ, ఇంకనూ బలమైనటువంటి సుఖమును పొందాలనే బలీయమైన కాంక్ష చేత, లేని సుఖమును పొందాలనే ప్రయత్నము చేత, వస్తుగత నిశ్చయజ్ఞానము లేక, 

ఆ వస్తువులు సుఖం ఇస్తున్నాయనే భ్రాంతి చేత, ఆ ఇంద్రియములే సుఖస్థానములని భ్రమసి, భ్రాంతి చెందటం చేత, భ్రమాజన్యజ్ఞానము అభ్యాసము చేత, భ్రమాజన్య జ్ఞానమును ఆశ్రయించడం చేత, ప్రతిబింబ జ్ఞానమునే సత్యమని భావించుట చేత, ఆ రకమైనటువంటి జాగ్రత్‌ స్వప్న సుషుప్తులను శరీరమే అనుభవించు చున్నప్పటికి, తాను అనుభవించుచున్నాడని తనకు ఆపాదించుకొనుచున్నాడు. ఇదీ అజ్ఞానమంటే.
నేను ఇవాళ సరిగ్గా నిద్రపోలేదండి! - విద్యా సాగర్ గారు 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 5 🌹*
*🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻*
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. అభంగ్ - 5 🍀*

యోగ యాగ విధీ యేణే నవే సిద్ధీ!
వాయాచి ఉపాదీ దంటే ధర్మ్!!
భావే వీణ దేవ నకళె నిస్సందేహ్!
గురు విణ్ అనుభవ కైసా కళే?!! 

తపే విణ్ దైవత్ ది ధల్యా వీణ్ ప్రాప్తి!
గుజే వీణ్ హిత్ కోణ్ సాంగే!!
జ్ఞానదేవ సాంగే దృష్టాంతాచీ మాత్!
సాధూచె సంగతీ తరణోపాయ్!!

భావము:
యోగము, యాగము విధి విధానాలతో పరమార్థము సిద్ధించదు. ఇవి నశించే ఉపాదులు మరియు డంభధర్మము కలిగించును. భావన లేకపోతే నిస్సందేహముగ దేవుడు తెలియడు. గురువు లేకుండానే అనుభవము ఎలా రాగలదు. 

తపము చేయక పోతే దైవత్వము రాదు, దానము చేయకుండానే పుణ్యము రాదు. మరి! అడగక ముందే హిత వచనము ఎవ్వరు చెప్పగలరు! సాధు సాంగత్యమే తరుణోపాయమని శాస్త్రాదులలో అనేక దృష్టాంతములు కలవని జ్ఞానదేవులు చెప్పుచున్నారు. 

*🌻. నామ సుధ -5 🌻*

యోగ యాగము విధి యుక్తము
సిద్ధించదు వీటితో పరమార్థము
నశించే ఉపాధులే ప్రాప్తము
ఢంభధర్మము, అభిమానము

భావన లేనిదే దైవము
తెలియజాలదు నిస్సందేహము
గురువు లేనిదే ఆ అనుభవము
కలుగుట నీకు ఎలా సాధ్యము?

తపము చేయకనే దైవ కటాక్షము
దానము చేయకనే పుణ్య ఫలితము
అడుగక ముందే హిత వాక్యము
చెప్పేది ఎవ్వరు ఉపదేశము

జ్ఞాన దేవులు చెప్పిన వచనము
దృష్టాంతములున్నవి అనేకము
సాధువుతో చేయుము సాంగత్యము
వారి బోధలే తరుణోపాయము

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 152 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
144

Sloka: 
Muktasya laksanam devi tavagre kathitam maya | Gurubhaktisthata dhyanam sakalam tava kirtitam ||

Siva says to Parvati that he has described to her everything about the quality of the liberated, about devotion towards the Guru, about meditation upon the Guru and such allied topics.

Siva says to his consort, “Devi, I described to you in detail how one should meditate on the Guru and how one should be devoted to the Guru. I described in such great detail that there is perhaps nothing else left to say about devotion towards the Guru, about meditation on the Guru and about worship of the Guru.

But, there is always more to say and there are many more topics to talk about. It is not really possible to say that there is nothing else left. But, in the meanwhile, the initiation into the quality of the Guru I’ve given you is the most wonderful”. When an initiation is given, the greatness and benefits of such initiation should be explained clearly. That is when the recipient will remember well, the initiation received. That is why, they are singing the greatness of Guru Gita in the upcoming slokas.

Sloka:
 Guru gitatiguhyeyam mayasti kathita subha | Srigurum cinmayam dhyayan yamaham kalaye sada ||

Siva says to Parvati that he has told her the most secret Guru Gita, which he himself recites meditating upon the blissful Guru.

The Supreme Guru, Lord Shiva is always meditating. Siva says to Parvati, “I’ve now given you that most secret Guru Gita that I always meditate on.”

A Guru’s age doesn’t determine his stature. One who is a realized soul, who understands the longings of the disciple and lovingly fulfills them, is a Guru even if he is young in age. The divine mutual love that binds such Gurus and disciples is extremely sacred. A scripture that extolls the greatness of such a Guru is truly venerated. Only a scripture that sings the praises of the Sadguru is venerated. A scripture that doesn’t contain praises of the Sadguru or worship of the Sadugur is not worthy of being called a scripture.

Sloka: 
Guru gitamimam devi suddhatattvam mayoditam | Gurum mam dhyayati premna hrdi nityam vibhavaya ||

Siva says to Parvati that she should meditate upon him with devotion, treating him as Guru and constantly visualizing the Guru Gita and the Principle of Truth he revealed. One should think only of that Principle of Truth and nothing else.
This Supreme Truth is explained in this Guru Gita. Siva gave this initiation of the Guru Gita, which contains the Principle of Truth, to Parvati Devi. Further, this scripture is called Guru Gita giving it the sound of a feminine name. That tells us that this scripture is a manifestation of the Divine Mother.

 The word Guru Gita immediately implies the form of Mother Goddess. There is also a tradition of studying in-depth, the Guru Gita during Navaratri. During Navaratri, some people undertake deep study of Sundarakanda on the concluding day, some study Ramayana, some people study the even more secret Bhagavata which contains the same supreme truth that is in the Divine Mother’s Guru Gita.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 78 / Sri Lalitha Sahasra Nama Stotram - 78 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 146, 147 / Sri Lalitha Chaitanya Vijnanam - 146, 147 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |*
*నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ‖ 45 ‖*

*🌻146. 'నిష్క్రపంచా'🌻*

ప్రపంచము లేనిది శ్రీమాత అని అర్థము.

శ్రీమాత నుండి పుట్టినది ప్రపంచము. ప్రపంచ మనగా పంచభూతములతో విస్తారముగ నేర్పడినది. పంచభూతములామెపై ప్రభావము చూపలేవు. ప్రపంచ మనగా మొత్తము సృష్టి యను భావన కూడ వున్నది. అట్టి సృష్టికి కూడా ఆమె అతీతము. సృష్టిగాని, సృష్టి యందలి ఏ శక్తిగాని ఆమెపై ప్రభావము చూపలేవు. దైవమునకు, జీవులకు గల ప్రధానమగు వ్యత్యాసములలో ఇది ఒకటి. జీవులపై గుణములు, పంచభూతములు, ప్రభావము చూపుచునే యుండును. జీవులు కూడా ఒకరిపై నొకరు ప్రభావము చూపుచు నుందురు. 

ఈ విధముగ జీవుడు అనేకానేక ప్రభావములకు లోనగుచుండును. ఒకపూట యున్నట్లు మనస్సు మరి యొకపూట యుండదు. కారణము జీవులు, సృష్టి వారిపై చూపు నిరంతర ప్రభావమే. కేవలము నిద్రయందు మాత్రమే యెట్టి ప్రభావము సోకక యుండుట వలన జీవులకు విశ్రాంతి దొరకు చున్నది. ఇతర సమయములలో ఏదియో యొక విషయము వారి మనస్సులపై ప్రభావము చూపుచు నడిపించుచు నుండును.

దైవ భక్తులు తమ నిరంతర, నిశ్చల ఆరాధన ద్వారమున ఈ ప్రభావమునుండి బయల్పడుటకు ప్రయత్నింతురు. దైవముతో ప్రజ్ఞ ముడిపడి యున్నప్పుడు ఇతర ప్రభావము లేమియు తమపై నుండవు. ముడివిడినపుడు ఏదియో యొక భావన ద్వారమున సృష్టి, జీవులు, జీవులపై ప్రభావము చూపుచు నుందురు. అనన్య చింతనులు సృష్టి యందు ప్రపంచ ప్రభావము లేక వర్తించుచుందురు. 

వారే సద్గురువులు, మార్గదర్శకులు. వారు శ్రీమాతకు ప్రియమగు భక్తులు. పై కారణముగ 'నిష్క్రపంచ' యగు శ్రీమాత అనుగ్రహము పొందుటకు ప్రపంచమున మునిగిన జీవులు శ్రీమాతను ఆరాధించుట మార్గము. సద్గురు ముఖద్వారమున ఆరాధించుట సౌలభ్యము. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 146 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Niṣprapañcā निष्प्रपञ्चा (146) 🌻*

Prapañca means expansion, development or manifestation. She is without such attributes. Since the Brahman is ādhi (the first) and anādhi (without parentage) it does not have any control and does not require any modifications or changes.  

This is because the Brahman is complete or full which is called pūrṇam. Māṇḍūkya Upaniṣad (verse 7) says ‘total cessation of the world as such, the embodiment of peace (here word śāntam is used. Refer nāma 141 ‘śāntā’), the total of all that is good (word ‘śivam’ is used here), one without a second (this is because of ādhi and anādhi), the fourth state (turya state, the other three being, sleep, dream and deep sleep stages which are called jākrat, svapna, suṣupti).  

Think this turya as the Self and this is to be realized’. The Brahman is beyond the three stages and can be realized only in the turya or the fourth state. This state is the embodiment of peace and all that is good. These stages are discussed in detail from nāma 257.

All these interpretations go to indicate the nirguṇa Brahman. This nāma means that She is without any expansion as the Brahman will never undergo changes or modifications.  

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 147 / Sri Lalitha Chaitanya Vijnanam - 147 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |*
*నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ‖ 45 ‖*

*🌻147. 'నిరాశ్రయా'🌻*

ఏ ఆశ్రయము లేనిది శ్రీమాత అని అర్థము.

సృష్టిలోని ప్రతి జీవునికిని శరీరమే ప్రధానమగు ఆశ్రయమై యున్నది. అల్పులకు ఆస్తిపాస్తులు, కుటుంబము, బంధుమిత్రులు ఆశ్రయమై యుండును. సంఘమున కీర్తి, ప్రతిష్ఠలు, పదవులు, యిత్యాదిని ఆశ్రయించి జీవించువారు ఇంకనూ పతనము చెందిన వారే. కీర్తి, ప్రతిష్ఠ, పదవి, బంధుమిత్రులు, శరీరము కూడ తనపై ఆధారపడి యున్నవి కాని వాటిపై తాను ఆధారపడి లేడు.

 ప్రధానముగ ప్రతి ఒక్కడును జీవుడు. జీవుడుగ జ్యోతి స్వరూపుడు. నత్త నుండి రసము స్రవించి నత్తగుల్ల ఏర్పడినట్లు తననుండియే తన శరీరము, శరీర సంబంధముగ కుటుంబము, ఆస్తిపాస్తులు, బంధుమిత్రులు, పదవులు, కీర్తిప్రతిష్ఠలు, ఏర్పడుచున్నవి.

వాటన్నింటికిని తానాశ్రయము. తన నాశ్రయించిన వానిపై ఆధారపడువాడు అల్పబుద్ధియే కదా! చక్రవర్తి సైనికునిపై ఆధారపడినట్లు, రాజు బంటుపై ఆధారపడినట్లు హీనముగ జీవించుట, తనను తానాశ్రయింపక యితరముల నాశ్రయించిన వారికి తప్పదు. 

శ్రీమాత నుండి కోటానుకోట్ల జీవులు, లోకములు యేర్పడినను వాటన్నింటికిని తానాశ్రయమై నిలచినదే కాని తాను దేనినీ ఆశ్రయించదు. ఆమె శరీరమును కూడ ఆశ్రయించి యుండదు. 

అందులకే ఆమె నిరాకార అని చెప్పబడినది. దేవతలు, ఋషులు, యోగులు కారణ శరీరమునుగాని, సూక్ష్మ శరీరమునుగాని, ఆశ్రయించి యుందురు. మానవులు భౌతిక శరీరము నాశ్రయించి యుందురు. కాని మానవులయందు, యోగుల యందు, ఋషుల యందు శ్రీమాత నాశ్రయించినవారు ఆమె వలననే నిరాశ్రయ స్థితి పొందుదురు. వారి నిరాశ్రయత కన్న మించినది శ్రీమాత 'నిరాశ్రయ' 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 147 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Nirāśrayā निराश्रया (147) 🌻*

Āśraya means dependence (that to which anything is annexed or with which anything is closely connected or on which anything depends or rests). Taittirīya Upaniṣad (II.7) uses the word ‘anilayane’ meaning not resting on anything and free from modifications.  

She does not depend on anything. She being the Brahman does not depend upon anything and on the contrary, everything depends upon Her. This nāma more or less conveys the same meaning conveyed in nāma 132.  

Possibly, āśraya in this context could mean the gross body that supports the soul. Since She is beyond soul (Brahman and soul are different. Soul is called jīva), there is no question of Her gross body. Since She is devoid of gross body, it connotes that She is the Brahman.

Chāndogya Upaniṣad (VIII.i.5) says, “The body may decay due to old age, but the space within (the Brahman) never decays. Nor does it perish with the death of the body. This is the real abode of the Brahman. All our desires are concentrated in it. It is the Self – free from all sins as well as from old age, death, bereavement, hunger and thirst. It is the cause of love of Truth and the cause of dedication to Truth.”

This nāma says that She is not dependent on anybody. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 489 / Bhagavad-Gita - 489 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 34 🌴*

34. యథా ప్రకాశయత్యేక: కృత్స్నం లోకమిమం రవి: |
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ||

🌷. తాత్పర్యం : 
ఓ భరతవంశీయుడా! ఒక్కడేయైన సూర్యుడు లోకమునంతటిని ప్రకాశింపజేయునట్లు, దేహంనందలి ఆత్మ సమస్తదేహమును చైతన్యముతో ప్రకాశింపజేయును.

🌷. భాష్యము :
చైతన్యము సంబంధించిన సిద్ధాంతములు పెక్కు గలవు. అట్టి చైతన్యమునకు భగవద్గీత యందు ఇచ్చట సూర్యుడు మరియు సూర్యకాంతి యొక్క ఉపమానమొసగబడినది. 

సూర్యుడు ఒక్కచోటనే నిలిచియుండి సమస్త విశ్వమును ప్రకాశింప జేయునట్లు, దేహమునందలి హృదయములో నిలిచియున్నట్టి అణుఆత్మ చైతన్యముచే దేహమునంతటిని ప్రకాశింపజేయుచున్నది. 

కనుక సూర్యకాంతి లేదా వెలుగు సూర్యుని ఉనికిని నిదర్శమైనట్లే, దేహమునందలి చైతన్యము దేహమునందలి ఆత్మ యొక్క ఉనికికి నిదర్శమైయున్నది. ఆత్మ దేహమునందున్నంత కాలము చైతన్యము సైతము వెడలిపోవును. 

అనగా ఆత్మలేని దేహము చైతన్యరహితమగును. తెలివిగల ఎవ్వరికైనను ఇది సులభగ్రాహ్యము. కనుకనే చైతన్యమనునది భౌతికపదార్థ సమ్మేళనముచే ఏర్పడినది కాదని, ఆది ఆత్మ యొక్క లక్షణమని తెలియబడుచున్నది. 

జీవుని ఈ చైతన్యము భగవానుని దివ్యచైతన్యముతో గుణరీతిగనే సమనముగాని దివ్యమైనది కాదు. ఏలయన జీవుని చైతన్యము ఒక దేహమునకే పరిమితమై యుండు అన్యదేహములను గూర్చి తెలియకుండును. 

కాని సర్వదేహములలో ఆత్మకు స్నేహితునిగా వర్తించుచు నిలిచియుండెడి పరమాత్ముడు మాత్రము సకల దేహముల నెరిగియుండును. ఇదియే దివ్యచైతన్యము మరియు వ్యక్తిగత చైతన్యము నడుమ గల భేదము.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 489 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 34 🌴*

34. yathā prakāśayaty ekaḥ
kṛtsnaṁ lokam imaṁ raviḥ
kṣetraṁ kṣetrī tathā kṛtsnaṁ
prakāśayati bhārata

🌷 Translation : 
O son of Bharata, as the sun alone illuminates all this universe, so does the living entity, one within the body, illuminate the entire body by consciousness.

🌹 Purport :
There are various theories regarding consciousness. Here in Bhagavad-gītā the example of the sun and the sunshine is given. As the sun is situated in one place but is illuminating the whole universe, so a small particle of spirit soul, although situated in the heart of this body, is illuminating the whole body by consciousness. 

Thus consciousness is the proof of the presence of the soul, as sunshine or light is the proof of the presence of the sun. When the soul is present in the body, there is consciousness all over the body, and as soon as the soul has passed from the body there is no more consciousness. 

This can be easily understood by any intelligent man. Therefore consciousness is not a product of the combinations of matter. It is the symptom of the living entity. 

The consciousness of the living entity, although qualitatively one with the supreme consciousness, is not supreme, because the consciousness of one particular body does not share that of another body. 

But the Supersoul, which is situated in all bodies as the friend of the individual soul, is conscious of all bodies. That is the difference between supreme consciousness and individual consciousness.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు - 97 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🍀 26 - 10 . ప్రాణాయామ యజ్ఞము - ఉదాన వాయువు కంఠ భాగమునుండి భూమధ్యము వరకు వ్యాపించి యుండి జీవుని హృదయము నుండి ఊర్ధ్య గతిని కలిగించి, ప్రత్యాహారస్థితి యందు నిలుపును. అపుడు జీవుడు తననొక స్పందనాత్మక చైతన్యముగ కంఠమునందు, నోటియందు, క్రింది తాలువుయందు, పై తాలువు యందు, నాసిక యందు స్పందన ప్రక్రియగ అనుభూతి చెందుచునుండును. అప్పుడు ఉచ్ఛ్వాస, నిశ్వాస, హృదయమునందు స్పందన యుండవు. ప్రాణస్పందనము, ప్రజ్ఞ ముఖమున యుండును. 🍀*

*📚. 4. జ్ఞానయోగము - 29, 30 📚*
Part 10

పంచప్రాణములు దేహమున ఈ క్రింది భాగములలో పనిచేయుచున్నవి. 

*🌷 4. ఉదాన వాయువు - 2 🌷* 

ఉదాన వాయువు కంఠ భాగమునుండి భూమధ్యము వరకు వ్యాపించి యుండి జీవుని హృదయము నుండి ఊర్ధ్య గతిని కలిగించి, ప్రత్యాహారస్థితి యందు నిలుపును. అపుడు జీవుడు తననొక స్పందనాత్మక చైతన్యముగ కంఠమునందు, నోటియందు, క్రింది తాలువుయందు, పై తాలువు యందు, నాసిక యందు స్పందన ప్రక్రియగ అనుభూతి చెందుచునుండును. అప్పుడు ఉచ్ఛ్వాస, నిశ్వాస, హృదయమునందు స్పందన యుండవు. ప్రాణస్పందనము, ప్రజ్ఞ ముఖమున యుండును.

ప్రజ్ఞ ప్రశాంతముగ నుండును. భ్రూమధ్యమున క్రమముగ చేరును. ఈ స్థితిలో సాధకునకు ఆహార విషయమున, ఉచ్చారణ విషయమున విశిష్టమగు నిష్ఠయుండును. పవిత్రమగు ఆహారమును మాత్రమే స్వీకరింపగలడు. పవిత్రమగు భాషణమును మాత్రమే చేయగలడు. అతడిపుడు చేరునది ఆకాశతత్వముగ గనుక, ఆకాశమువలె నిర్మలమగు విషయములందు మాత్రమే ఆసక్తి కలిగి యుండును. 

ప్రాపంచిక ప్రవృత్తులు, దేహప్రవృత్తులు యాంత్రికముగ సాగుచుండును. వానిని విసర్జించ నవసరము లేదు. ఉదాసీనతతో నిర్వర్తించుట యుండును. ఉదాన శబ్దమున 'ఉత్' అను శబ్దముండును. అనగ ప్రాణమాధారముగ జీవు డూర్ధ్వముఖము చెందుటకు దేహమున ఏర్పడిన సౌకర్యమని తెలియవలెను. 

ఆకాశమును చేరినది జీవ ప్రజ్ఞ యగుటచే అది అనంతము, అపరిమితము, సర్వవ్యాపకము అగు తత్త్వమునకు చేరువగుచుండును. భ్రూమధ్యము వరకు చేరి, అనంతత్వములోనికి వంతెన నేర్పరచుకొను ప్రయత్నమున నుండును.

హృదయమునుండి భ్రూమధ్యమునకు చేరు మార్గమున సాధకునికి అనేకానేక దివ్యానుభూతులు కలుగుచునుండును. అనేకములగు దివ్యరూపములు దర్శనమగు చుండును. అనేకములగు దివ్య విషయములు వినపడుచుండును. రకరకముల కాంతి దర్శనము లగుచుండును. 

అట్లే వివిధములగు వాయిద్యములు వినబడుచు నుండును. ఈ సమస్త దర్శనమును నాదబిందు కళాత్మకముగ పెద్దలు వివరించుచు నుందురు. వీని కాకర్షింప బడక ఊర్ధ్వమునకు సాగుట ఉత్తమమని పెద్దలు తెలిపిరి. 

భ్రూమధ్యమున చేరిన త్రిగుణాత్మక జీవప్రజ్ఞ, త్రిగుణముల కావలనున్న త్రిగుణాతీతమగు తత్వముతో అనుసంధానము చెందుటయే ప్రధానము కాగ, ఉదాన వాయువు వ్యానవాయువుతో అనుసంధానము చెందుట ప్రారంభమగును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 295🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
71. అధ్యాయము - 26

*🌻. దక్షుని విరోధము - 3 🌻*

దక్షుడిట్లు పనికెను-

మీ రుద్రగణముల వారందరు వేద బాహ్యులు, వేదమార్గమును వీడినవారు, మరియు మహర్షులచే త్యజించబడినవారు అగుదురు గాక! (26) మీరు నాస్తిక సిద్ధాంతమునందు శ్రద్ధగలవారు, శిష్టుల ఆచారమునుండి బహిష్కరింపబడినవారు, మద్యపానమునందు అభిరుచిగలవారు, జటలను, భస్మను, ఎముకలను ధరించువారు అగుదురు గాక! (27).

బ్రహ్మ ఇట్లు పలికెను -

దక్షుడీ విధముగా శివకింకరులను శపించగా, ఆ మాటలను విని శివునకు ఇష్టుడగు నంది మిక్కిలి కోపావిష్టుడాయెను (28). శిలాదుని కుమారుడు, తేజశ్శాలి, శివునకు ప్రియుడు అగు నంది మహాబలుడు, గర్విష్ఠి అగు ఆ దక్షునితో వెంటనే ఇట్లనెను (29).

నందీశ్వరుడిట్లు పలికెను -

ఓ దక్షా! మోసగాడా! దుర్బుద్ధీ! శివతత్త్వము నెరుంగని నీవు బ్రాహ్మణ చాపల్యముచే శివగణములను వృథాగా శపించితివి (30). బ్రాహ్మణాహంకారము గల వారు, దుష్ట బుద్ధులు, మరియు మూర్ఖులునగు భృగ్వాది ఋషులు కూడా మహాప్రభువగు మహేశ్వరుని ఉపహాసము చేసిరి (31). 

ఇచట నున్న బ్రాహ్మణులలో ఎవరైతే రుద్రుని యందు నీవు వలెనే విముఖత గల దుష్టులో, వారిని రుద్రుని తేజస్సు యొక్క మహిమను గలవాడనగు నేను శపించుచున్నాను (32). మీరు వేదములయందలి అర్థవాదముల యందు మాత్రమే శ్రద్ధగలవారై, వేద తత్త్వము నెరుంగజాలని బహిర్ముఖులై, నిత్యము ఇతరము మరి ఏదీ లేదని పలికే విప్రులు అగుదురు గాక! (33).

ఓ విప్రులారా! మీరు కామనలతో నిండిన మనస్సు కలవారై, స్వర్గమే సర్వస్వమనే ధారణ గలవారై, క్రోధ లోభ గర్వములతో కూడియున్నవారై, సిగ్గును వీడిన నిత్య యాచకులై అగుదురు గాక! (34) ఓ బ్రాహ్మణులారా! మీరు వేదమార్గమును వీడి శూద్రులచే యాగములను చేయించి, ధనమును సంపాదించుటయే ధ్యేయముగా గల దరిద్రులు అగుదురు గాక! (35) 

ఓ దక్షా! దుష్టులనుండి దానములను స్వీకరించు వీరందరు నరకమును పొందగలరు. మరికొందరు బ్రహ్మ రాక్షసులగుదురు (36). ఎవడైతే శివుని దేవతలలో ఒకనిగా భావించి, ఆ పరమేశ్వరుని విషయములో ద్రోహబుద్ధిని కలిగియుండునో, అట్టి దుష్టబుద్ధియగు దక్షుడు తత్త్వము నుండి విముఖుడగును (37).

దక్షుడు గృహస్థుడై కుట్రలే ధర్మముగా గలవాడై, నిత్యము తుచ్ఛ సుఖములను కోరి కర్మ తంత్రమును విస్తరించువాడై, ఇదియే శాశ్వత వేద ధర్మమని భ్రమించి (38), ముఖములో ఆనందము లేనివాడై, ఆత్మ జ్ఞానమును విస్మరించి, పశువువలె అజ్ఞానియై, కర్మ భ్రష్టుడై, నిత్యము నీతి మాలిన వాడై అగును. ఈ దక్షుడు తొందరలో మేక ముఖము కలవాడగును (39). 

దక్షుడు ఈశ్వరుని శపించగా, కోపించిన నంది అచటి బ్రాహ్మణులను శపించగా, అచట పెద్ద హాహాకారము బయలుదేరెను (40). నేనా మాటలను విని ఆ దక్షుని, భృగ్వాది బ్రాహ్మణులను కూడ అనేక పర్యాయములు నిందించితిని. వేద ప్రవర్తకుడనగు నేను శివతత్త్వము నెరుంగుదును గదా! (41) సదాశివుడు నంది యొక్క వచనములను విని చిరునవ్వును అల్పముగా ప్రకటించి, ఆతనికి బోధించగోరి ఈ మధుర వాక్యములను పలికెను (42).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 50 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 4 - THE 3rd RULE
*🌻 Kill out desire of comfort. - Be happy as those are who live for happiness. - 7 🌻*

220. One may say that it is very difficult to do that, if other people are aggressive or insulting. But is it not obvious that the effect produced by the insulting and aggressive attitude depends upon the way in which it is met? If we allow ourselves to be affected by it, a great deal of disturbance is set up. 

We on our side show something of the same nature, and to the onlooker it would seem that some of that aggression is justified. But if we are perfectly calm, the man who abuses us puts himself in the wrong, and the outsider can see that we are not in the wrong. 

Of course, we should not remain calm in order to appear in the right, but we should adopt a philosophical attitude, because we do not feel these attempts to attack us or to interfere with us; and thus we can be happy.

221. That seems a sort of negative happiness, to avoid pain or suffering. We can do a great deal more than that; we who are trying to live according to the precepts of occultism – students of the inner life – must be doing something of the world’s work. 

Assuredly no one can see the Plan of the Logos, and the work that is to be done to carry out that Plan, without trying to do as much as he can for it, and the fact that he is engaged in that work keeps a man busy and happy. 

We should have no time for depression, no time to worry about all these outer things. If we are all the time busily engaged in pouring out’ good thought, in sending strong wishes, strong currents of goodwill to all around us, we are fully occupied, and are happy in the work itself.

222. It is sad to see the way in which people all about us are constantly talking about doing things “to pass the time”. 

They do this or that for the sake of having something to do. It is both ludicrous and pitiable, because the world is full of opportunities to do good and noble deeds, and these people are not even looking for the opportunities. 

They are just trying somehow or other to amuse themselves, that they may get through the time – a most extraordinary attitude to take.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 182 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. విశ్వామిత్రమహర్షి - 2 🌻*

06. మనందరికీ విశ్వామిత్రమహర్షి ప్రసాదమే ‘గాయత్రీ మంత్రం’. ‘విశ్వామిత్ర ఋషిః గాయత్రీ ఛందః ‘ అని మనం నిత్యమూ అంటూంటాము. ప్రతీసంధ్యావందనంలో మూడు మాట్లు మనం అనుకునేది ఈ ఋషిస్మరణ. 

07. ‘త్రిపదా షట్‌కుక్షిః’ అని అనేక విషయములలో ఉన్నది ఆ గయత్రీ మహామంత్రం. అది సంపూర్ణమయినది. గాయత్రి యొక్క మగత్తు ఎంతటిదంటే మూడు వేదములూ క్షుణ్ణంగా పారాయణ చేసి, వాటిని ముఖస్థం చేసుకుంటే వచ్చే పుణ్యమేదో గాయత్రి స్మరణ చేస్తే వస్తుందని, దానికి తుల్యమైన మంత్రమే లేదని పెద్దల బోధ. 

08. త్రిమూర్తులు అందులో ఉన్నారు; త్రిమూర్తుల శక్తులు అందులో ఉన్నాయి. సమస్త ప్రకృతీ అందులో ఉంది. పరబ్రహ్మ వస్తువది. అందులో ఆద్యంతములు ఉన్నాయి. అదే మనకు రక్ష. దాని ఉపదేశమే మనిషికి ద్విజత్వాన్ని, పశువుకు విప్రత్వాన్ని ఇస్తుంది. పశువుకు విప్రత్వం ఇవ్వగల్గినటువంటి ఉత్కృష్టమయిన మంత్రంగా గాయత్రీమంత్రం జగత్పూజ్యమయింది. దానికి ఋషి విశ్వామిత్రుడు.

09. దేవతలయినా భూమి మీద పుట్టిన తరువాత సంసారంలో ప్రవేశించకపోవటం కష్టం. ప్రవేశించాక కామక్రోధాదులకు లోను కాకుండా ఉండటం మరీ కష్టం.
రామలక్ష్మణులు ఆయనను, “ఇంత అస్త్రబలసంపన్నులే మీరు! మీరే తృటిలో ఈ రాక్షసులును చంపగలరుకదా! మమ్మల్ని ఎందుకు పిలిపించారు?” అని అడిగారు. 

10. అప్పుడు విశ్వామిత్రుడు, “నేన్ను బ్రహ్మర్షిని అయిన తరువాత నా కర్తవ్యం ఏమీ లేదు నాయనా! క్షత్రియులచేత చేయించవలసిన పనే ఉంది. నేను తలపెట్టిన యాగం లోకక్షేమం కోసమే!” అన్నాడు. 

11. ఆ వంకతో రాముడి సన్నిధిలో యాగంచేద్దామని ఆయన ఉద్దేశ్యం. సాక్షాత్ విష్ణుస్వరూపుడైన రాముడే ప్రత్యక్షంగా ఎదురుగా ఉండగా, ఇక విష్ణువును ప్రత్యేకంగా యజ్ఞంలో ఆవాహనచేసి, రెండక్షతలు వేసి విగ్రహం పెట్టటమెందుకు? ‘విష్ణుమావాహయామి స్థాపయామి’ అనట్మెందుకు విష్ణువు ఎదురుగా ఉండగా? కాబట్టి మంత్రంమీద ఆధారపడక, విష్ణువు మీదనే ఆధారపడ్డాడు విశ్వామిత్రుడు. 

12. ఏ విష్ణువు యొక్క అనుగ్రహంతో లోకంలో రాక్షస సంహారం చేయదలచుకున్నాడో, ఆయననే తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 246 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 95. When you say 'I was not prior to conception' you actually mean not like the present 'I am', but the one that discerns the absence of the present 'I am' was there. 🌻*

Again, when you ponder on the question 'What was I prior to conception?', you at once realize that 'you were not there'. 

What you mean is you were not there as you presently are - that is you had no shape or form or name. 

There is 'someone' who sees the absence of the present 'I am' and that 'someone' has always been there and will continue to be there, as that 'someone' is indestructible: it is the Absolute.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 121 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

504. ఈ మానసిక గోళములో, మనోభువనము - ఆరవ భూమిక నుండి ప్రధాన దేవదూతలు భగవంతుని చూడలేరు. కాని ఆరవ భూమికలో నున్న మానవుడు భగవంతుని ముఖాముఖీ సర్వత్రా సమస్తమందు చూడగలడు, చూచుచున్నాడు.

*🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 1 🌻*

శాశ్వత అనంత సత్యస్థితి - అహం బ్రహ్మాస్మి - నేను భగవంతుడను, విజ్ఞాన భూమిక.

505. తన దృష్టిని క్రమముగా క్రిందికిదించి, తన పైననే దృష్టిని మరల్చుట సప్తమ భూమికను చేరుటవంటిది.

506. నిర్వాణస్థితి దాటిన తక్షణమే "అహం బ్రహ్మాస్మి" స్థితి ఎఱుకతో అనుభవనీయమగును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 85 / Sri Vishnu Sahasra Namavali - 85 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*శ్రవణం నక్షత్ర ప్రధమ పాద శ్లోకం*

*🍀 85. ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః !*
*ఆర్కో వాజనసః శృంగీ జయంతః సర్వ విజ్జయీ !! 85 !! 🍀*

🍀 790. ఉద్భవః - 
ఉత్క్రష్టమైన జన్మగలవాడు.

🍀 791. సుందరః - 
మిక్కిలి సౌందర్యవంతుడు.

🍀 792. సుందః - 
కరుణాస్వరూపుడు.

🍀 793. రత్నగర్భః - 
రత్నమువలె సుందరమైన నాభి గలవాడు.

🍀 794. సులోచనః - 
అందమైన నేత్రములు కలవాడు.

🍀 795. అర్కః - 
శ్బ్రహ్మాదుల చేత అర్చింపబడువాడు.

🍀 796. వాజసనః - 
అర్థించువారలకు అన్నపానాదులు నొసంగువాడు.

🍀 797. శృంగీ - 
శృంగము గలవాడు.

🍀 798. జయంతః - 
సమస్త విజయములకు ఆధారభూతుడు.

🍀 799. సర్వవిజ్జయీ - 
సర్వము తెలిసినవాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 85 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Sravana 1st Padam*

*🌻 85. udbhavaḥ sundaraḥ sundō ratnanābhaḥ sulōcanaḥ |*
*arkō vājasanaḥ śṛṅgī jayantaḥ sarvavijjayī || 85 || 🌻*