🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 5 🍀
యోగ యాగ విధీ యేణే నవే సిద్ధీ!
వాయాచి ఉపాదీ దంటే ధర్మ్!!
భావే వీణ దేవ నకళె నిస్సందేహ్!
గురు విణ్ అనుభవ కైసా కళే?!!
తపే విణ్ దైవత్ ది ధల్యా వీణ్ ప్రాప్తి!
గుజే వీణ్ హిత్ కోణ్ సాంగే!!
జ్ఞానదేవ సాంగే దృష్టాంతాచీ మాత్!
సాధూచె సంగతీ తరణోపాయ్!!
భావము:
యోగము, యాగము విధి విధానాలతో పరమార్థము సిద్ధించదు. ఇవి నశించే ఉపాదులు మరియు డంభధర్మము కలిగించును. భావన లేకపోతే నిస్సందేహముగ దేవుడు తెలియడు. గురువు లేకుండానే అనుభవము ఎలా రాగలదు.
తపము చేయక పోతే దైవత్వము రాదు, దానము చేయకుండానే పుణ్యము రాదు. మరి! అడగక ముందే హిత వచనము ఎవ్వరు చెప్పగలరు! సాధు సాంగత్యమే తరుణోపాయమని శాస్త్రాదులలో అనేక దృష్టాంతములు కలవని జ్ఞానదేవులు చెప్పుచున్నారు.
🌻. నామ సుధ -5 🌻
యోగ యాగము విధి యుక్తము
సిద్ధించదు వీటితో పరమార్థము
నశించే ఉపాధులే ప్రాప్తము
ఢంభధర్మము, అభిమానము
భావన లేనిదే దైవము
తెలియజాలదు నిస్సందేహము
గురువు లేనిదే ఆ అనుభవము
కలుగుట నీకు ఎలా సాధ్యము?
తపము చేయకనే దైవ కటాక్షము
దానము చేయకనే పుణ్య ఫలితము
అడుగక ముందే హిత వాక్యము
చెప్పేది ఎవ్వరు ఉపదేశము
జ్ఞాన దేవులు చెప్పిన వచనము
దృష్టాంతములున్నవి అనేకము
సాధువుతో చేయుము సాంగత్యము
వారి బోధలే తరుణోపాయము
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
14 Dec 2020
No comments:
Post a Comment