భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 182


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 182 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. విశ్వామిత్రమహర్షి - 2 🌻


06. మనందరికీ విశ్వామిత్రమహర్షి ప్రసాదమే ‘గాయత్రీ మంత్రం’. ‘విశ్వామిత్ర ఋషిః గాయత్రీ ఛందః ‘ అని మనం నిత్యమూ అంటూంటాము. ప్రతీసంధ్యావందనంలో మూడు మాట్లు మనం అనుకునేది ఈ ఋషిస్మరణ.

07. ‘త్రిపదా షట్‌కుక్షిః’ అని అనేక విషయములలో ఉన్నది ఆ గయత్రీ మహామంత్రం. అది సంపూర్ణమయినది. గాయత్రి యొక్క మగత్తు ఎంతటిదంటే మూడు వేదములూ క్షుణ్ణంగా పారాయణ చేసి, వాటిని ముఖస్థం చేసుకుంటే వచ్చే పుణ్యమేదో గాయత్రి స్మరణ చేస్తే వస్తుందని, దానికి తుల్యమైన మంత్రమే లేదని పెద్దల బోధ.

08. త్రిమూర్తులు అందులో ఉన్నారు; త్రిమూర్తుల శక్తులు అందులో ఉన్నాయి. సమస్త ప్రకృతీ అందులో ఉంది. పరబ్రహ్మ వస్తువది. అందులో ఆద్యంతములు ఉన్నాయి. అదే మనకు రక్ష. దాని ఉపదేశమే మనిషికి ద్విజత్వాన్ని, పశువుకు విప్రత్వాన్ని ఇస్తుంది. పశువుకు విప్రత్వం ఇవ్వగల్గినటువంటి ఉత్కృష్టమయిన మంత్రంగా గాయత్రీమంత్రం జగత్పూజ్యమయింది. దానికి ఋషి విశ్వామిత్రుడు.

09. దేవతలయినా భూమి మీద పుట్టిన తరువాత సంసారంలో ప్రవేశించకపోవటం కష్టం. ప్రవేశించాక కామక్రోధాదులకు లోను కాకుండా ఉండటం మరీ కష్టం.

రామలక్ష్మణులు ఆయనను, “ఇంత అస్త్రబలసంపన్నులే మీరు! మీరే తృటిలో ఈ రాక్షసులును చంపగలరుకదా! మమ్మల్ని ఎందుకు పిలిపించారు?” అని అడిగారు.

10. అప్పుడు విశ్వామిత్రుడు, “నేన్ను బ్రహ్మర్షిని అయిన తరువాత నా కర్తవ్యం ఏమీ లేదు నాయనా! క్షత్రియులచేత చేయించవలసిన పనే ఉంది. నేను తలపెట్టిన యాగం లోకక్షేమం కోసమే!” అన్నాడు.

11. ఆ వంకతో రాముడి సన్నిధిలో యాగంచేద్దామని ఆయన ఉద్దేశ్యం. సాక్షాత్ విష్ణుస్వరూపుడైన రాముడే ప్రత్యక్షంగా ఎదురుగా ఉండగా, ఇక విష్ణువును ప్రత్యేకంగా యజ్ఞంలో ఆవాహనచేసి, రెండక్షతలు వేసి విగ్రహం పెట్టటమెందుకు? ‘విష్ణుమావాహయామి స్థాపయామి’ అనట్మెందుకు విష్ణువు ఎదురుగా ఉండగా? కాబట్టి మంత్రంమీద ఆధారపడక, విష్ణువు మీదనే ఆధారపడ్డాడు విశ్వామిత్రుడు.

12. ఏ విష్ణువు యొక్క అనుగ్రహంతో లోకంలో రాక్షస సంహారం చేయదలచుకున్నాడో, ఆయననే తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


14 Dec 2020

No comments:

Post a Comment