శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 146, 147 / Sri Lalitha Chaitanya Vijnanam - 146, 147

🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 78 / Sri Lalitha Sahasra Nama Stotram - 78 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹




🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 146, 147 / Sri Lalitha Chaitanya Vijnanam - 146, 147 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |
నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ‖ 45 ‖



🌻146. 'నిష్క్రపంచా'🌻

ప్రపంచము లేనిది శ్రీమాత అని అర్థము.

శ్రీమాత నుండి పుట్టినది ప్రపంచము. ప్రపంచ మనగా పంచభూతములతో విస్తారముగ నేర్పడినది. పంచభూతములామెపై ప్రభావము చూపలేవు. ప్రపంచ మనగా మొత్తము సృష్టి యను భావన కూడ వున్నది. అట్టి సృష్టికి కూడా ఆమె అతీతము. సృష్టిగాని, సృష్టి యందలి ఏ శక్తిగాని ఆమెపై ప్రభావము చూపలేవు. దైవమునకు, జీవులకు గల ప్రధానమగు వ్యత్యాసములలో ఇది ఒకటి. జీవులపై గుణములు, పంచభూతములు, ప్రభావము చూపుచునే యుండును. జీవులు కూడా ఒకరిపై నొకరు ప్రభావము చూపుచు నుందురు.

ఈ విధముగ జీవుడు అనేకానేక ప్రభావములకు లోనగుచుండును. ఒకపూట యున్నట్లు మనస్సు మరి యొకపూట యుండదు. కారణము జీవులు, సృష్టి వారిపై చూపు నిరంతర ప్రభావమే. కేవలము నిద్రయందు మాత్రమే యెట్టి ప్రభావము సోకక యుండుట వలన జీవులకు విశ్రాంతి దొరకు చున్నది. ఇతర సమయములలో ఏదియో యొక విషయము వారి మనస్సులపై ప్రభావము చూపుచు నడిపించుచు నుండును.

దైవ భక్తులు తమ నిరంతర, నిశ్చల ఆరాధన ద్వారమున ఈ ప్రభావమునుండి బయల్పడుటకు ప్రయత్నింతురు. దైవముతో ప్రజ్ఞ ముడిపడి యున్నప్పుడు ఇతర ప్రభావము లేమియు తమపై నుండవు. ముడివిడినపుడు ఏదియో యొక భావన ద్వారమున సృష్టి, జీవులు, జీవులపై ప్రభావము చూపుచు నుందురు. అనన్య చింతనులు సృష్టి యందు ప్రపంచ ప్రభావము లేక వర్తించుచుందురు.

వారే సద్గురువులు, మార్గదర్శకులు. వారు శ్రీమాతకు ప్రియమగు భక్తులు. పై కారణముగ 'నిష్క్రపంచ' యగు శ్రీమాత అనుగ్రహము పొందుటకు ప్రపంచమున మునిగిన జీవులు శ్రీమాతను ఆరాధించుట మార్గము. సద్గురు ముఖద్వారమున ఆరాధించుట సౌలభ్యము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 146 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Niṣprapañcā निष्प्रपञ्चा (146) 🌻

Prapañca means expansion, development or manifestation. She is without such attributes. Since the Brahman is ādhi (the first) and anādhi (without parentage) it does not have any control and does not require any modifications or changes.

This is because the Brahman is complete or full which is called pūrṇam. Māṇḍūkya Upaniṣad (verse 7) says ‘total cessation of the world as such, the embodiment of peace (here word śāntam is used. Refer nāma 141 ‘śāntā’), the total of all that is good (word ‘śivam’ is used here), one without a second (this is because of ādhi and anādhi), the fourth state (turya state, the other three being, sleep, dream and deep sleep stages which are called jākrat, svapna, suṣupti).

Think this turya as the Self and this is to be realized’. The Brahman is beyond the three stages and can be realized only in the turya or the fourth state. This state is the embodiment of peace and all that is good. These stages are discussed in detail from nāma 257.

All these interpretations go to indicate the nirguṇa Brahman. This nāma means that She is without any expansion as the Brahman will never undergo changes or modifications.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 147 / Sri Lalitha Chaitanya Vijnanam - 147 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |
నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ‖ 45 ‖


🌻147. 'నిరాశ్రయా'🌻

ఏ ఆశ్రయము లేనిది శ్రీమాత అని అర్థము.

సృష్టిలోని ప్రతి జీవునికిని శరీరమే ప్రధానమగు ఆశ్రయమై యున్నది. అల్పులకు ఆస్తిపాస్తులు, కుటుంబము, బంధుమిత్రులు ఆశ్రయమై యుండును. సంఘమున కీర్తి, ప్రతిష్ఠలు, పదవులు, యిత్యాదిని ఆశ్రయించి జీవించువారు ఇంకనూ పతనము చెందిన వారే. కీర్తి, ప్రతిష్ఠ, పదవి, బంధుమిత్రులు, శరీరము కూడ తనపై ఆధారపడి యున్నవి కాని వాటిపై తాను ఆధారపడి లేడు.

ప్రధానముగ ప్రతి ఒక్కడును జీవుడు. జీవుడుగ జ్యోతి స్వరూపుడు. నత్త నుండి రసము స్రవించి నత్తగుల్ల ఏర్పడినట్లు తననుండియే తన శరీరము, శరీర సంబంధముగ కుటుంబము, ఆస్తిపాస్తులు, బంధుమిత్రులు, పదవులు, కీర్తిప్రతిష్ఠలు, ఏర్పడుచున్నవి.

వాటన్నింటికిని తానాశ్రయము. తన నాశ్రయించిన వానిపై ఆధారపడువాడు అల్పబుద్ధియే కదా! చక్రవర్తి సైనికునిపై ఆధారపడినట్లు, రాజు బంటుపై ఆధారపడినట్లు హీనముగ జీవించుట, తనను తానాశ్రయింపక యితరముల నాశ్రయించిన వారికి తప్పదు.

శ్రీమాత నుండి కోటానుకోట్ల జీవులు, లోకములు యేర్పడినను వాటన్నింటికిని తానాశ్రయమై నిలచినదే కాని తాను దేనినీ ఆశ్రయించదు. ఆమె శరీరమును కూడ ఆశ్రయించి యుండదు.

అందులకే ఆమె నిరాకార అని చెప్పబడినది. దేవతలు, ఋషులు, యోగులు కారణ శరీరమునుగాని, సూక్ష్మ శరీరమునుగాని, ఆశ్రయించి యుందురు. మానవులు భౌతిక శరీరము నాశ్రయించి యుందురు. కాని మానవులయందు, యోగుల యందు, ఋషుల యందు శ్రీమాత నాశ్రయించినవారు ఆమె వలననే నిరాశ్రయ స్థితి పొందుదురు. వారి నిరాశ్రయత కన్న మించినది శ్రీమాత 'నిరాశ్రయ'

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 147 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Nirāśrayā निराश्रया (147) 🌻

Āśraya means dependence (that to which anything is annexed or with which anything is closely connected or on which anything depends or rests). Taittirīya Upaniṣad (II.7) uses the word ‘anilayane’ meaning not resting on anything and free from modifications.

She does not depend on anything. She being the Brahman does not depend upon anything and on the contrary, everything depends upon Her. This nāma more or less conveys the same meaning conveyed in nāma 132.

Possibly, āśraya in this context could mean the gross body that supports the soul. Since She is beyond soul (Brahman and soul are different. Soul is called jīva), there is no question of Her gross body. Since She is devoid of gross body, it connotes that She is the Brahman.

Chāndogya Upaniṣad (VIII.i.5) says, “The body may decay due to old age, but the space within (the Brahman) never decays. Nor does it perish with the death of the body. This is the real abode of the Brahman. All our desires are concentrated in it. It is the Self – free from all sins as well as from old age, death, bereavement, hunger and thirst. It is the cause of love of Truth and the cause of dedication to Truth.”

This nāma says that She is not dependent on anybody.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


14 Dec 2020



No comments:

Post a Comment